
సాక్షి, విజయవాడ: చంద్రబాబుకు కోర్టులంటే లెక్కలేదని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. కోర్టు ఆర్డర్స్‌ను కూడా జైలు అధికారులు పట్టించుకోరా? అంటూ ప్రశ్నించారు. 1989 నుండి రాజకీయాల్లో ఉన్నానని.. ఇంత దారుణమైన ఘటన ఇప్పటివరకు చూడలేదన్నారు.
‘‘రిటైర్డ్ అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలకు నిన్న(శనివారం) సాయంత్రం బెయిల్ వచ్చింది. వారిని నిన్ననే విడుదల చేయాలి. ఇవాళ(ఆదివారం) ఉదయం 6.30 గంటలకు విడుదల చేస్తామని చెప్పారు. జైలర్ మచిలీపట్నం నుంచి బస్‌లో బయల్దేరి దిగకుండా ఉండాలని చంద్రబాబు, లోకేష్ చెప్పారు. జైలు నుంచి బయటకి రాకుండా లంచ్ మోషన్ వేయాలని ఆలస్యం చేశారు’’ అంటూ అంబటి దుయ్యబట్టారు
‘‘వంశీ కేసులో కూడా బెయిల్ వచ్చినా పట్టించుకోలేదు. లిక్కర్ కేసు ఛార్జ్‌షీట్ అంతా తప్పుల తడక. చంద్రబాబు చెప్పినట్టు సిట్ అధికారులు నడుస్తున్నారు. లేని స్కామ్‌ను సృష్టించి వైఎస్సార్‌సీపీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు కక్ష సాధింపు ధోరణిని ప్రజలు గమనిస్తున్నారు’’ అని అంబటి పేర్కొన్నారు.
