breaking news
janardhan rao
-
నకిలీ మద్యం దందాలో సంచలన నిజాలు
సాక్షి, అమరావతి: టీడీపీ నేతల ఆధ్వర్యంలో నడిచిన నకిలీ మద్యం దందాలో సంచలన నిజాలు వెలుగు చూశాయి. ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ డెన్ నుంచి రాష్ట్రం మొత్తం సరఫరా అయ్యింది నకిలీ మద్యమేనని తేలింది. సేకరించిన గుంటూరు ప్రయోగశాలకు పంపగా.. ఫలితాలను చూసి ఎక్సైజ్ అధికారులే కంగుతిన్నట్లు తెలుస్తోంది.మొత్తం 45 శాంపిల్స్‌ను పంపగా.. అన్నీ నకిలీ మద్యమేనని తేలింది. నీళ్లు, స్పిరిట్, రంగు, రుచి రసాయనాలతో కల్తీ మద్యం తయారు చేసినట్లు నిర్ధారణ అయ్యింది. నాణ్యతా ప్రమాణాలు లేకుండా తయారైన ఈ లిక్కర్‌ను రాష్ట్రవ్యాప్తంగా బార్లు, వైన్స్, బెల్ట్ షాపులకు సరఫరా చేశారనే షాకింగ్ విషయం వెలుగు చూసింది. అలాగే నిందితుల కస్టడీ రిపోర్టులోనూ కీలక వివరాలు వెలుగు చూశాయి. ప్రభుత్వ అనుమతి ఉందంటూ టీడీపీ నేతలు దగ్గరుండి మరీ నకిలీ మద్యం తయారు చేసినట్లు వెల్లడైంది. గవర్నమెంట్ పర్మిషన్ ఉందని కూలీలకు నమ్మబలికి.. ఈ దందాను యధేచ్చగా నడిపించినట్లు తెలుస్తోంది. -
అది నకిలీ మద్యమే!
సాక్షి ప్రతినిధి, విజయవాడ : నకిలీ మద్యం తయారీ రాకెట్ కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దనరావు నిర్వహిస్తున్న డంప్ వద్ద స్వాధీనం చేసుకున్నది ముమ్మూటికీ నకిలీ మద్యమేనని స్పష్టమైంది. నీళ్లు, స్పిరిట్, రంగు, రుచి రసాయనాలతో ఈ నకిలీ మద్యం తయారైందని వెల్లడైంది. ఈ మేరకు గుంటూరులోని ప్రాంతీయ ప్రయోగశాల నిర్ధారించిందని విశ్వసనీయంగా తెలిసింది. ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా హానికర రసాయనాలతో నకిలీ మద్యం తయారు చేశారని నివేదిక స్పష్టం చేసినట్లు సమాచారం. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీ గోదాము నుంచి స్వాధీనం చేసుకున్న మద్యం సరుకు నమూనాలను ఎక్సైజ్ అధికారులు గుంటూరులోని ప్రాంతీయ ప్రయోగశాలకు పంపారు. నకిలీ మద్యం తయారీకి ఉపయోగించిన ముడి సరుకు, రసాయనాలు, స్పిరిట్‌తో పాటు తయారైన మద్యంను అధికారులు సీజ్ చేసి, ఈ మొత్తం సరుకుకు సంబంధించి 45 నమూనాలను ల్యాబ్‌కు పంపినట్లు తెలిసింది.ఈ నమూనాలను పరీక్షించిన అనంతరం అదంతా నకిలీ మద్యమేనని తేల్చినట్లు సమాచారం. ఈ మేరకు నివేదిక ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులకు ఇప్పటికే చేరింది. ఈ నివేదికలో పేర్కొన అంశాల తీవ్రతను తగ్గించేందుకు ప్రభుత్వ పెద్దలు, అధికారులతో కలిసి మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. అండర్ ప్రూఫ్, ఓవర్ ప్రూఫ్‌లో భారీ వ్యత్యాసం ఉన్నట్లు తేలినప్పటికీ.. అదేమంత ప్రమాదకరం కాదని ప్రచారం చేయాలని ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు అందినట్లు తెలిసింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఎల్లో మీడియా ఆ ప్రచారాన్ని భుజానికెత్తుకుంది. కొంచెం నాణ్యత లేని మద్యమట!నకిలీ మద్యం పలు వైన్ షాపులతోపాటు, బెల్ట్ షాపులకు సరఫరా కావడం, కొన్ని బార్లలో కూడా విక్రయించారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మద్యం ప్రియులు బెంబేలెత్తిపోతున్నారు. ఏడాదిన్నరగా ఈ నకిలీ మద్యం తయారు చేస్తున్నామని నిందితులు చెప్పడంతో ఇన్నాళ్లూ తాము ఎలాంటి మద్యం తాగామనే ఆందోళన మొదలైంది. ఇది తప్పకుండా తమ అరోగ్యాలపై ప్రభావం చూపుతుందని అందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దాని తీవ్రతను తగ్గించి చూపేందుకు నానా తంటాలు పడుతోంది. ఇది నకిలీ మద్యం కాదని, కొంచెం నాణ్యత లేని మద్యం మాత్రమే అని చెప్పుకొస్తోంది. దీని వల్ల ప్రమాదం ఏమిలేదని చెప్పేందుకు ఆపసోపాలు పడుతోంది. అయితే నిబంధనల ప్రకారం ఉండాల్సిన నాణ్యత ప్రమాణాలు లేకుండా, కెమిస్ట్‌ల పర్యవేక్షణ లేకుండా తయారు చేసిన సరుకు వాడితే ప్రమాదం లేకుండా ఎలా ఉంటుందని వైద్య రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. మందులో స్ట్రెంత్ లేకుండా నీళ్లు కలిపి.. అధిక ధరలకు అమ్మటం ప్రజలను మోసం చేయటం కాదా.. అని పలువురు మద్యం ప్రియులు నిలదీస్తున్నారు. ఒక సరుకు పేరు చెప్పి, ఇంకొక సరుకు అమ్మితే అది నేరం కాకుండా పోతోందా.. అని పలువురు ప్రశ్నిస్తున్నారు. నకిలీ మద్యం తయారు చేయటం అనేదే నేరం అనే విషయాన్ని పక్కన పెట్టి, అది అంత ప్రమాదకరం కాదని ప్రచారం చేయాలని చెప్పడంపై ఎక్సైజ్ శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఉత్పన్నం కాలేదని వాపోతున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటంమద్యంలో యూపీ (అండర్ ప్రూఫ్) 25గా ఉండాలి. ఓపీ (ఓవర్ ఫ్రూఫ్) 75గా ఉండాలి. అయితే ఇబ్రహీంపట్నంలో సీజ్ చేసిన మద్యంలో యూపీ సగానికి సగం ఎక్కువగా ఉందని, ఓపీ ఉండాల్సిన దానికంటే బాగా తక్కువగా ఉందని ల్యాబ్ రిపోర్టు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి చూస్తుంటే రంగు నీళ్లలో స్పిరిట్ కలిపి నకిలీ మద్యం తయారు చేశారని తెలుస్తోంది. ప్రభుత్వ అనుమతి పొందిన డిస్టిలరీల్లో నిబంధనల మేరకు మద్యం తయారైన తర్వాత ఆ నమూనాలను ఎక్సైజ్ శాఖ ప్రయోగశాలకు పంపి, ఓకే చేసిన తర్వాతే సీసాల్లో నింపుతారు. అయితే ఇటీవల పట్టుబడిన మద్యం.. నాణ్యత, గాఢత ప్రమాణాలు పాటించకుండా తయారైనట్లు స్పష్టం అవుతోంది. ప్రభుత్వ పెద్దల భరోసాతో నిర్దేశించిన ప్రమాణాలు ఏమాత్రం పాటించకుండా నకిలీ మద్యం తయారు చేసి వైన్ షాపులకు, బెల్ట్ షాపులకు సరఫరా చేయడం ద్వారా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడారు. -
TDP నేత జనార్ధన్ కు చెందిన వైన్ షాపులో తనిఖీలు
-
కల్తీ మద్యం కేసులో కీలక పరిణామాలు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: నకిలీ మద్యం కేసులో తాజాగా కీలక పరిణామాలు చోటు చేసుసుకున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు, టీడీపీ నేత జనార్ధన్‌రావుకి చెందిన వైన్ షాపుల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో.. ఓ వైన్ షాపును సీజ్ చేశారు. అదే సమయంలో వైఎస్సార్సీపీపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను కొనసాగిస్తోంది.ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శ్రీనివాస వైన్స్.. పూర్ణచంద్రరావు అనే వ్యక్తి పేరు మీద ఉంది. ఈ వైన్స్‌కు నకిలీ మద్యాన్ని జనార్దన్‌రావే సరఫరా చేశారు. ఈ వ్యవహారాన్ని జనార్దన్ పిన్ని కొడుకు కల్యాణ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వచ్చాడు. అలా వచ్చిన సొమ్ముతోనే గొల్లపూడిలో విలువైన భూములను కొనుగోలు చేసినట్లు ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. ఈ కేసులో కల్యాణ్ కూడా అరెస్ట్ అయ్యారు. కక్ష సాధింపులో భాగంగా..మరో వైపు నకిలీ మద్యం కేసుకు సంబంధించిన ప్రశ్నలు గుప్పిస్తున్న, సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్న వైఎస్సార్సీపీ నేతలను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసింది. మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలోని నేతల ఇళ్లపై పోలీసులు ఈ తెల్లవారుజామున దాడులు చేశారు. ఇందులో మేడపాటి నాగిరెడ్డితో పాటు బీసీ సెల్ అధ్యక్షుడు కుంచం జయరాజు కూడా ఉన్నారు. వాళ్ల సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నట్లు సమాచారం. అయితే.. మంత్రి లోకేష్,మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెట్టారని, టీడీపీ నేతలు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్‌లో ఫిర్యాదు చేశారని, అందుకే విచారణ జరుపుతున్నామని పోలీసులు అంటున్నారు.ఇదీ చదవండి: అమౌంట్ తగ్గితే వసంత బావ ఊరుకోడు! -
ఎమౌంట్ తగ్గితే ఎమ్మెల్యే బావ ఊరుకోడు
సాక్షి నెట్వర్క్: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఏఎన్నార్ బార్లో ఈ నెల 6న పట్టుబడిన నకిలీ మద్యం తయారీ రాకెట్ వ్యవహారంలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. టీడీపీ పెద్దలు వెనుక ఉండి.. అద్దేపల్లి జనార్దనరావును ముందు పెట్టి ఈ స్కామ్ నడిపారని ఆధారాలు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ బావమరిది పోసాని కోటేశ్వరరావుకు, అద్దేపల్లి జనార్దనరావుకు మధ్య ఫోన్లో జరిగిన వాట్సాప్ చాటింగ్ ఆధారాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఇందులో జనార్దనరావు ‘సార్.. ఈ వీక్ ఎమౌంట్ పంపించాను’ అని టెక్ట్స్ చేయగా.. ‘రూ.18 లక్షలకు గాను రూ.15 లక్షలే పంపించావు’ అని కోటేశ్వరరావు రిప్లై ఇచ్చారు. ‘వచ్చి కలుస్తాను’ అని జనార్దన్ చెప్పగా.. ‘కలవడం కాదు.. బావ ఊరుకోడు.. రిమైనింగ్ అమౌంట్ పంపించు. నెక్ట్స్ వీక్ ఇలా చేయకు’ అని కోటేశ్వరరావు చాట్æ చేసిన వాట్సాప్ మెసేజ్ కలకలం సృష్టిస్తోంది. అద్దేపల్లి జనార్దన్‌రావు ఆధ్వర్యంలో నకిలీ మద్యం ప్లాంట్లను కూటమి నాయకులే పెట్టించారనేందుకు ఇదో ఉదాహరణ అని ఎక్సైజ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. బాగోతం మొత్తం బట్టబయలు కావడంతో విదేశాల్లో ఉన్న జనార్దన్‌రావును హుటాహుటిన రప్పించి రిమాండ్‌కు పంపడం.. ఆయన ద్వారా వీడియో రిలీజ్ చేయించడం.. ఈ స్కామ్‌ను వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ పైకి నెట్టాలని చూడటం తెలిసిందే. అటు అన్నమయ్య జిల్లా ములకలచెరువులో, ఇటు ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం ప్లాంట్ వ్యవహారం దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ వ్యవహారంలో టీడీపీ పూర్తిగా ఇరుకున పడిపోవడంతో ‘ముఖ్య’ నేత పలు విధాలా డైవర్షన్ రాజకీయం చేస్తున్నా ఫలితం ఇవ్వడం లేదు. నకిలీ మద్యం వ్యవహారం పూర్తిగా అధికార టీడీపీ నేతలే చేస్తున్నారని అన్ని ఆధారాలూ ప్రజల్లోకి వెళ్లడంతో ‘ముఖ్య’ నేత అంతర్మథనంలో పడ్డారు. దీన్నుంచి బయట పడేందుకే ‘సిట్’ను ఏర్పాటు చేసి, తాత్కాలికంగా ఈ విషయం మరుగున పడేయాలని యత్నిస్తున్నారు. కొనసాగుతున్న దర్యాప్తు ఎనీ్టఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఏఎన్నార్ బార్లో ఈ నెల 6న పట్టుబడిన నకిలీ మద్యం తయారీ రాకెట్లో ఎక్సైజ్ శాఖ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఈ కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దనరావు ఇంట్లో మంగళవారం రాత్రి 8 గంటల నుంచి బుధవారం తెల్లవారుజామున 2 గంటల వరకు సోదాలు జరిగాయి. నిరంతర పర్యవేక్షణ కోసం అధికారులు జనార్దనరావు ఇంటికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. స్థానిక ఫెర్రీ రోడ్డులో కూడా కెమెరాలు బిగించారు. వాటిని కమాండ్ కంట్రోల్ రూమ్‌తో అనుసంధానం చేశారు. మరో వైపు ఏఎన్నార్ బార్ సమీపంలో పట్టుబడిన నకిలీ మద్యం డంప్‌కు అనుకుని ఉన్న స్వర్ణ సినీ కాంప్లెక్స్‌లోని సీసీ టీవీ పుటేజీని ఎక్సైజ్ శాఖ ఎన్పోర్స్మెంట్ సీఐ వర్మ పరిశీలించారు. -
ఫేక్ గాళ్ల కుట్రలు.. లై డిటెక్టర్ టెస్టుకి రెడీ: జోగి రమేష్
సాక్షి, తాడేపల్లి: నకిలీ మద్యం కేసు ప్రధాన నిందితుడు జనార్దన్‌రావుతో తనకు సంబంధాలు ఉన్నట్లు నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ సీఎం చంద్రబాబు నాయుడికి సవాల్ విసిరారు. ఈ విషయంలో చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన విషయం తనకు లేదని.. అయితే తీవ్ర ఆరోపణల నేపథ్యంలో లై డిటెక్టర్ పరీక్షలకు కూడా తాను సిద్ధమని అన్నారాయన. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. నారావారి సారాను చంద్రబాబు ఏరులై పారిస్తున్నారు. టీడీపీ నేతలు నకిలీ మద్యాన్ని కుటీర పరిశ్రమల్లా నడిపిస్తున్నారు. టీడీపీ నేత జనార్దన్‌రావుతో నేను ఎలాంటి చాటింగ్ చేయలేదు. అది నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా తాను సిద్ధమని జోగి రమేష్ అన్నారు. తిరుమల వెంకన్న, బెజవాడ దుర్గమ్మ మీద కూడా ప్రమాణం చేస్తా. చంద్రబాబు ఇంట్లో కూడా ప్రమాణానికి నేను సిద్ధం. చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులతో ప్రమాణం చేయడానికి వస్తారా?. అవసరమైతే సత్య శోధన పరీక్ష(లై డిటెక్టర్)కు నేను సిద్ధం. నా సవాల్‌ను చంద్రబాబు స్వీకరిస్తారా? అని జోగి రమేష్ నిలదీశారు.నా ఫోన్ ఇస్తా చంద్రబాబు, లోకేష్ చెక్ చేస్కోండి. ఓ గౌడ కులస్థుడి మీద దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. నీది ఓ బతుకేనా చంద్రబాబు?నా పేరు రిమాండ్ రిపోర్టులో ఉందా?.. ఫేక్ గాళ్లు కుట్రలు చేస్తున్నారు అంటూ మండిపడ్డారాయన.ఇదీ చదవండి: బాబు డైరెక్షన్.. జనార్దన్ యాక్షన్! -
బెడిసికొట్టిన ప్లాన్.. అడ్డంగా దొరికిన తర్వాత రూట్ మార్చిన టీడీపీ పెద్దలు
-
ఈ ప్రశ్నలకు జవాబేది?
సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా కలకలం రేపిన నకిలీ మద్యం రాకెట్ వెనుక ప్రభుత్వ పెద్దలు ఉన్నారనే విషయం బట్టబయలు కావడంతో ఈ కేసు దర్యాప్తును పక్కదారి పట్టించే యత్నాలు ముమ్మరమయ్యాయి. ప్రభుత్వ పెద్దలు, పోలీసులు.. ఇద్దరూ కలిసిపోయి సాగిస్తున్న నాటకాలు, కుతంత్రాలే అసలు కుట్రను బట్టబయలు చేస్తున్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి అందరి చూపులు.. అన్ని వేళ్లూ టీడీపీ వైపే చూపుతున్న నేపథ్యంలో పలు కీలక ప్రశ్నలకు సమాధానం కరువైంది. నకిలీ మద్యం మాఫియాపై ప్రభుత్వంగానీ, పోలీసులుగానీ సూటిగా సమాధానం చెప్పే ధైర్యం చేయలేకపోతున్నారు. ఈ కేసు దర్యాప్తులో ప్రధానంగా కింది ప్రశ్నలకు పోలీసులు, ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ⇒ ఏ1 జనార్దన్‌రావును అరెస్టు చేసి విచారించిన తరువాతే న్యాయ స్థానంలో హాజరు పరిచారు. పోలీసులు తమ విచారణలో వెల్లడైన విషయాలతో రిమాండ్ నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు. ఆ రిమాండ్ నివేదికలో ఎక్కడా వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ పేరును ప్రస్తావించనే లేదు. జనార్దన్‌రావుకు న్యాయస్థానం రిమాండ్ విధించడంతో నెల్లూరు జైలుకు తరలించారు. మరి 24 గంటల తరువాత జోగి రమేష్ పేరు చెబుతూ జనార్దన్‌రావు వీడియో బయటకు రావడం వెనుక దాగిన గుట్టు ఏమిటి? నిజంగా జోగి రమేష్ పేరును ఆయన చెప్పి ఉంటే ఆ విషయాన్ని న్యాయ స్థానానికి సమర్పించిన రిమాండ్ నివేదికలోనే వెల్లడించే వారు కదా! మరి ఆ వీడియో కుట్ర వెనుక ఉన్న ప్రభుత్వ పెద్దలు ఎవరు? ⇒ ప్రభుత్వ ఆదేశాలతోనే ఎక్సైజ్ అధికారులు ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం గోడౌన్లో సోదాలు చేసి జప్తు చేశారని సీఎం చంద్రబాబు చెప్పారు. తమ ప్రభుత్వమే చేయించిందని ఆయన గొప్పగా చెప్పుకున్నారు. కానీ జనార్దన్‌రావుతో చెప్పించిన వీడియోలో అందుకు పూర్తి విరుద్ధంగా ఎందుకు ఉంది? టీడీపీ కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలనే జోగి రమేష్ ఆదేశాలతో నకిలీ మద్యాన్ని తెప్పించి.. అనంతరం ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇచ్చి దాడులు చేయించారని జనార్దన్‌రావుతో ఎందుకు చెప్పించారు? నకిలీ మద్యం దందాలో టీడీపీ పెద్దల పాత్రను కప్పిపుచ్చేందుకే ఈ కట్టు కథలతో అడ్డంగా దొరికారన్నది నిజం కాదా? ⇒ విదేశాలకు వెళ్లిపోతే తనకు రూ.3 కోట్లు ఇస్తామని వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ ఆఫర్ ఇచ్చారంటూ ఏ1 జనార్దన్‌రావుతో ప్రభుత్వ పెద్దలు వీడియో ద్వారా చెప్పించారు. మరి అంతలోనే ఆయన ఎందుకు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు? తన తమ్ముడిని పట్టించుకోవడం లేదని మరో కట్టు కథ ఎందుకు చెబుతున్నారు? అంటే జోగి రమేష్ రూ.3 కోట్లు ఇస్తానన్నట్లు వీడియోలో ఆయన చెప్పింది పూర్తిగా అవాస్తవమే కదా.. ఈ లెక్కన ప్రభుత్వ పెద్దల పన్నాగంలో భాగంగానే ఆయన రాష్ట్రానికి వచ్చి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నది వాస్తవం కాదా? ⇒ ములకలచెరువు నకిలీ మద్యం కేసులో అరెస్టు చేసిన వారిని 24 గంటల్లోనే పోలీసులు కస్టడీలో విచారించేందుకు న్యాయస్థానాన్ని అనుమతి కోరారు. మరి ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో ఏ1 నిందితుడు జనార్దన్‌రావును కస్టడీలోకి తీసుకుని విచారించాలని పోలీసులు ఎందుకు భావించడం లేదు? ⇒ ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో ఏ1గా ఉన్న జనార్దన్‌రావును విదేశాల నుంచి రాష్ట్రానికి రప్పించిన ప్రభుత్వ పెద్దలు.. ములకలచెరువు నకిలీ మద్యం కేసులో పాత్రధారిగా ఉన్న టీడీపీ నేత జయచంద్రారెడ్డిని ఎందుకు రాష్ట్రానికి రప్పించడం లేదు? లుక్ అవుట్ నోటీసు జారీలో తాత్సారం ఎందుకు? ఆయన అరెస్టుకు ఎందుకు యత్నించడం లేదు? ⇒ అన్నమయ్య జిల్లా ములకలచెరువు నకిలీ మద్యం యూనిట్ నుంచి నకిలీ మద్యాన్ని పాల వ్యానుల ద్వారా సరఫరా చేసినట్టు వెల్లడైంది. ఆ వ్యానులు టీడీపీ నేతలవే. ఎనీ్టఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, అనకాపల్లి జిల్లా రాంబిల్లి, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుంచి కూడా వివిధ ప్రాంతాలకు ప్రత్యేక వాహనాల్లో నకిలీ మద్యాన్ని సరఫరా చేశారు. ఆ వాహనాలు ఎవరివి అన్నది పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదు? వాటిని జప్తు చేయకుండా పోలీసులను అడ్డుకుంటున్న పెద్దలు ఎవరు? ⇒ నకిలీ మద్యం దందా బయటపడిన తరువాత కూడా రాష్ట్రంలో దాదాపు 75 వేల బెల్టు దుకాణాలపై ఎక్సైజ్ అధికారులు ఎందుకు దాడులు చేయడం లేదు? బెల్ట్ దుకాణాల్లో విక్రయిస్తున్న మద్యాన్ని ఎందుకు జప్తు చేయడం లేదు? దాన్ని పరీక్షల కోసం ల్యాబ్‌లకు ఎందుకు పంపడం లేదు? ⇒ రాష్ట్రంలో అసలు నకిలీ మద్యమే లేదని.. మద్యం దుకాణాల్లో నకిలీ సరుకు అమ్మడమే లేదని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. మరి అంతలోనే ఎందుకు ‘ఏపీ ఎక్సైజ్ యాప్’ను ప్రవేశ పెట్టారు? నకిలీ మద్యాన్ని గుర్తించేందుకు ఆ యాప్‌పై అవగాహన కల్పించాలని ఎందుకు చెబుతున్నారు? అంటే టీడీపీ సిండికేట్ మద్యం దుకాణాల్లో నకిలీ మద్యం విక్రయిస్తున్నారని అధికారికంగా అంగీకరించినట్లే కదా? ⇒ టీడీపీ నేతల కుటుంబాలకు చెందిన డిస్టిలరీలు, టీడీపీ సిండికేట్ నిర్వహిస్తున్న మద్యం దుకాణాలు, బార్లలో ఎందుకు తనిఖీలు చేయడం లేదు? అంటే నకిలీ మద్యం కేసు దర్యాప్తును పక్కదారి పట్టించి ప్రభుత్వ పెద్దలు తప్పించుకోవాలని యతి్నస్తున్నట్లు కాదా? ⇒ నకిలీ మద్యం దందాతో ప్రభుత్వ పెద్దలకు సంబంధం లేకపోతే డైవర్షన్ డ్రామాలు ఎందుకు? ఏ1 జనార్దనరావుతో గుర్తు తెలియని ప్రదేశంలో ఓ వీడియో షూట్ చేయించడం ఎందుకు? కోర్టుకు సమర్పించిన రిమాండ్ నివేదికలో ఆ వీడియో గురించి ఎందుకు ప్రస్తావించ లేదు? ఆ వీడియో డ్రామా బెడిసి కొట్టగానే.. వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి నివాసంలో సిట్ సోదాలతో హడావుడి ఎందుకు? ఇవన్నీ ఈ కేసు దర్యాప్తు నుంచి ప్రజల దృష్టి మళ్లించే ఎత్తుగడలు కావా? -
టీడీపీ జనార్దన్ రావు వీడియోపై కేతిరెడ్డి సంచలన నిజాలు..
-
అయినా ఎల్లో మీడియాకి వీడియో ఎలా వచ్చిందంటే వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
ఈ ప్రశ్నలకు బదులేదీ.?
సాక్షి, అమరావతి: నకిలీ మద్యం మాఫియా కేసును టీడీపీ కూటమి ప్రభుత్వం పక్కదారి పట్టించే కుతంత్రాలకు పదును పెడుతోందన్నది పక్కాగా స్పష్టమవుతోంది. ఈ కేసులో ఏ1గా ఉన్న జనార్దన్‌రావు మాట్లాడిన వీడియో మీడియాకు విడుదల కావడం ఆ విషయాన్ని స్పష్టం చేసింది. అంతే కాదు.. పెద్దల పాత్ర, దర్యాప్తు పేరిట పోలీసుల అక్రమాలను బయటపెట్టింది. జనార్దన్‌రావు టీడీపీ నేతలకే అత్యంత సన్నిహితుడని మరోసారి తేటతెల్లమైంది. తాజా పరిణామాలను విశ్లేషిస్తూ రాజకీయ పరిశీలకులు ప్రభుత్వానికి సంధిస్తున్న ప్రశ్నలు ఇవీ...1 జనార్దన్‌రావు చంద్రబాబుకు అంతటి సన్నిహితుడే కదా...! 2024 ఎన్నికల్లో తంబళ్లపల్లె టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జయచంద్రారెడ్డికి చంద్రబాబు టికెట్ ఇచ్చినప్పుడు జనార్ధన్‌రావు అక్కడే ఉన్నారు. బీఫాం ఇచ్చేటప్పుడు అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులే ఉంటారు. మరి జనార్ధన్‌రావు ఆ సమయంలో చంద్రబాబు, జయచంద్రారెడ్డిలతో ఉండటం దేనికి సంకేతం? అంటే ఆయన చంద్రబాబు, జయచంద్రారెడ్డిలకే సన్నిహితుడనే కదా. మరి ఆయన వైఎస్సార్సీపీ నేత జోగి రమేశ్‌కు సన్నిహితుడు అన్న ప్రభుత్వ వాదన పూర్తిగా కట్టు కథే కదా!2 నకిలీ మద్యం కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న జనార్ధన్‌రావు ఓ కార్పొరేట్ పారిశ్రామికవేత్త తరహాలో దర్జాగా గన్నవరం విమానాశ్రయంలో దిగారు. ఆయన ధీమా వెనుక దన్ను ఎవరు? కేసు నుంచి బయటపడేస్తామని ముఖ్యనేత హామీ ఇచ్చిన ధీమాతోనే కదా ఆయన అంత దర్జాగా వచ్చారు?3 నకిలీ మద్యం కేసులో ఏ1గా ఉన్నప్పటికీ విదేశాల్లో ఉన్న జనార్ధన్‌రావు హడావుడిగా ఎందుకు ఆంధ్ర ప్రదేశ్ చేరుకున్నారు? వెంటనే వచ్చి తాము చెప్పినట్టుగా కట్టు కథలు వల్లె వేయాలన్న ముఖ్యనేత ఆదేశంతోనే ఆయన వచ్చారన్నది సుస్పష్టం. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న జోగి రమేశ్‌కు ఆయన నిజంగానే సన్నిహితుడే అయితే ఇంత హడావుడిగా విదేశాల నుంచి వచ్చే ధైర్యం చేయలేరు కదా? అంటే జనార్ధన్‌రావు వీడియో ద్వారా చెప్పిందంతా ప్రభుత్వ పెద్దలు అల్లిన కట్టు కథ అన్నది స్పష్టమవుతోంది.4 జనార్దన్ రావు తన మొబైల్ ఫోన్‌ను విదేశాల్లో వదిలి రావడం ఏమిటి..? అలా చెప్పమని ఆయన్ను ఆదేశించింది ఎవరు.? ఆ ఫోన్ గుట్టు విప్పితే బయటపడే ప్రభుత్వ పెద్దల జాతకాలు ఏమిటి..? ఇవీ కదా ఈ కేసులో కీలక ప్రశ్నలు. వాటిని కప్పిపుచ్చేందుకే ప్రభుత్వ పెద్దల ఆదేశంతో ఆయన ఫోన్ వదిలి వచ్చారన్నది తేటతెల్లమవుతోంది కదా.5 ములకల చెరువు నకిలీ మద్యం మాఫియాలో కీలక పాత్రధారిగా ఉన్న టీడీపీ నేత జయచంద్రారెడ్డిని విదేశాల నుంచి రప్పించేందుకు పోలీసులు ఎందుకు ప్రయత్నించడం లేదు? ఆయనపై ఎందుకు ఇంకా లుక్ అవుట్ నోటీసు జారీ చేయలేదు? ఆయన రాష్ట్రానికి వస్తే తమ దందా బయటపడుతుందని ప్రభుత్వ పెద్దలు భయపడుతున్నారా? కేసు దర్యాప్తు పూర్తిగా పక్కదారి పట్టించేంతవరకు విదేశాల నుంచి రావద్దని ఆయన్ను ఆదేశించిన ముఖ్యనేత ఎవరు?6 నకిలీ మద్యం బయటపడగానే ముఖ్యమంత్రి చంద్రబాబు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. అసలు ఆ నకిలీ అన్నది ఒక ప్రాంతానికే పరిమితం అన్నట్టు నమ్మించేందుకు యత్నించారు. మరి ఇప్పుడు ఎందుకు రాష్ట్రవ్యాప్తంగా మద్యం నాణ్యత తనిఖీకి ప్రత్యేక యాప్ ప్రవేశపెట్టారు? అంటే నకిలీ మద్యం దందా రాష్ట్రం అంతటా విస్తరించిందని ఒప్పుకున్నట్టే కదా...?7 మొదట పోలీసులు, తరువాత జైలు అధికారుల అదుపులో ఉన్న జనార్ధన్‌రావు అసలు ఎల్లో మీడియాతో ఎప్పుడు మాట్లాడారు? ఆయన మాట్లాడిన వీడియో అసలు ఎక్కడ షూట్ చేశారు? ఎవరు షూట్ చేశారు? పక్కనుంచి ఆయనకు డైలాగులు ఎవరు అందించారు? ఆ వీడియోను మీడియాకు ఎవరు విడుదల చేశారు? అంటే.. ఈ కేసులో వాస్తవాలను కప్పిపుచ్చుతూ కొత్త కట్టుకథ వినిపించేందుకే ఆ వీడియో విడుదల చేశారన్నది స్పష్టమవుతోంది కదా. పోలీసుల అదుపులో, జైలు అధికారుల రిమాండ్‌లో ఉన్న వ్యక్తి వీడియో లీకు కావడానికి బాధ్యత ఎవరిది?8 జనార్ధన్‌రావు మాట్లాడిన వీడియో సోమవారం విడుదల కాగా.. అందులోని విషయాలపై ముందుగానే అంటే ఆదివారమే ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనప్రాయంగా వివరాలు ఎలా వెల్లడించారు? అంటే ఆ వీడియో విడుదల కానుందని...అందులో ఏం మాట్లాడారన్న సమాచారం ఒక రోజు ముందుగానే ఆయనకు తెలుసా? వైఎస్సార్సీపీ నేతలకు ప్రమేయం ఉందని చంద్రబాబు ఆదివారం చెప్పిన విషయాలే... సోమవారం విడుదల అయిన జనార్దన్ రావు వీడియోలోనూ ఉండటం వెనుక లోగుట్టు ఏమిటి? -
ముఖ్యనేత డైరెక్షన్... జనార్దన్ యాక్షన్!
సాక్షి, అమరావతి: భారీ దోపిడీయే లక్ష్యంగా నకిలీ మద్యం మాఫియాతో బరితెగించి అడ్డంగా దొరికిన ముఖ్యనేత సరికొత్త కుట్రకు తెరతీశారు. ఇప్పటికే భేతాళ కథలతో, అక్రమ కేసులతో విరుచుకుపడుతున్న ఆయన ఈ కుతంత్రాన్ని పతాకస్థాయికి చేర్చి పొలిటికల్ సోషియో ఫాంటసీ కథతో కనికట్టు చేసే ఎత్తుగడ వేశారు. ఐదేళ్లలో రూ.45 వేల కోట్ల మద్యం దోపిడీ కుట్రలో పాత్రధారి జనార్దన్‌రావుతో డైవర్షన్ కుట్రకు ముఖ్యనేత పక్కా స్క్రిప్టుతో రంగంలోకి దిగారు. ఈ కుట్ర సినిమా షూటింగ్ కోసం పోలీసులే ఆర్ట్ డైరెక్షన్ బాధ్యత భుజానికెత్తుకుని గుర్తు తెలియని ప్రదేశంలో సెట్ రెడీ చేశారు. ముఖ్యనేత స్టార్ట్ కెమెరా అనగానే.. జనార్దన్‌రావు చిలుక పలుకుల్లా డైలాగులు చెప్పేశారు! ఆయన దారి తప్పకుండా పక్కనుంచి పోలీసులు ప్రాంప్టింగ్ అందిస్తూ డైలాగులు గుర్తు చేశారు. నకిలీ మద్యంపై ప్రజలను తప్పుదారి పట్టించేలా వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ చుట్టూ కట్టుకథ అల్లారు. ముఖ్యనేత అనుకున్నట్లుగా కుట్రకథ చిత్రీకరణ పూర్తి కాగానే ప్యాకప్ చెప్పారు. ఆదివారం తన నివాసంలో ఈ కుట్ర కథ గురించి మీడియాకు లీకులు ఇచ్చి టీజర్ విడుదల చేసిన ముఖ్యనేత.. సినిమా విడుదలకు సోమవారం ముహూర్తం పెట్టారు. టీడీపీ వీరవిధేయులతో సిట్ ఏర్పాటు చేసిన వెంటనే తమ పొలిటికల్ సోషియో ఫాంటసీ సినిమా రిలీజ్‌కు పచ్చ జెండా ఊపారు. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, డైరెక్షన్.. అంతా ముఖ్యనేత కేంద్రంగా సాగిన ఆ తెర వెనుక కుట్ర ఇలా ఉంది.. ఆధారాలతో అడ్డంగా దొరికిన టీడీపీ మాఫియా.. దిక్కుతోచని స్థితిలో ముఖ్యనేత టీడీపీ కూటమి ప్రభుత్వం పక్కా పన్నాగంతో రాష్ట్రంలో వ్యవస్థీకృతం చేసిన నకిలీ మద్యం మాఫియా బాగోతం ఆధారాలతో సహా బట్టబయలైంది. ఐదేళ్లలో రూ.45 వేల కోట్ల దోపిడీ కుతంత్రం పూర్తి ఆధారాలతో బయటపడటంతో మాఫియా సూత్రధారిగా ఉన్న ముఖ్యనేత బెంబేలెత్తారు. ఎందుకంటే.. ఈ దందాలో బయటపడిన పాత్రధారులు అందరూ ముఖ్యనేతకు అత్యంత సన్నిహితులే. 2024 ఎన్నికల ముందు చంద్రబాబు స్వయంగా టీడీపీ బీఫాం ఇచ్చి మరీ తంబళ్లపల్లె నియోజకవర్గ పార్టీ అభ్యర్థిగా నిలిపిన జయచంద్రారెడ్డి ఈ మాఫియాలో కీలక పాత్రధారి అన్నది నిగ్గు తేలింది. అన్నమయ్య జిల్లా ములకలచెరువులో టీడీపీ ఏర్పాటు చేసిన నకిలీ మద్యం తయారీ ప్లాంటు జంట హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న టీడీపీ నేత సురేంద్ర నాయుడుకు 2014లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండగా క్షమాభిక్ష ప్రసాదించిన విషయం వెలుగు చూసింది. ఆయన ద్వారానే జయచంద్రారెడ్డికి టీడీపీ టికెట్ లభించిందన్నది బయటపడింది. ఇక ఈ కేసులో ఏ1గా ఉన్న ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన అద్దేపల్లి జనార్ధన్‌రావు ఈ మాఫియాలో క్రియాశీల పాత్రధారి. జయచంద్రారెడ్డి టీడీపీలో చేరినప్పుడు, పార్టీ బీఫాం ఇచ్చినప్పుడు ఆయన కూడా అక్కడే ఉన్నారు. బీఫాం స్వీకరించేటప్పుడు సాధారణంగా అత్యంత సన్నిహిత కుటుంబ సభ్యులు మాత్రమే ఉంటారు. జయచంద్రారెడ్డికి టీడీపీ బీఫాం ఇస్తున్నప్పుడు జనార్దన్‌రావు పక్కనే ఉండటం వారి అనుబంధాన్ని బలపరుస్తోంది. నకిలీ మద్యం మాఫియాలో ప్రధాన పాత్రధారులైన జయచంద్రారెడ్డి, సురేంద్ర నాయుడు, జనార్దన్‌రావు టీడీపీ అధిష్టానానికి అత్యంత సన్నిహితులన్నది ఫొటో, వీడియో ఆధారాలతో సహా బహిర్గతమైంది. అన్నమయ్య జిల్లా ములకలచెరువులో పది రోజుల క్రితం బయటపడిన నకిలీ మద్యం మాఫియా వేళ్లు రాష్ట్రం అంతటా విస్తరించాయి. టీడీపీ సీనియర్ నేతలు ప్రాంతాలవారీగా నకిలీ మద్యం పంపిణీ బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు. ఈ బాగోతం అంతా ఫొటో, వీడియో ఆధారాలతోసహా బయటపడింది. టీడీపీ మద్యం సిండికేట్ ద్వారానే నకిలీ సరుకును మద్యం దుకాణాలు, పర్మిట్ రూమ్‌లు, బెల్ట్ దుకాణాలు, బార్లలో విక్రయిస్తున్నారన్న వాస్తవం వెల్లడి కావడంతో దేశవ్యాప్తంగా కలకలం రేగుతోంది. పచ్చముఠాల దందా, టీడీపీ పెద్దల నిర్వాకాలపై ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత పెల్లుబుకుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ధర్నాలు, ఆందోళనలతో రాష్ట్రం దద్దరిల్లుతోంది. దాంతో నకిలీ మద్యం మాఫియా సూత్రధారి, అంతిమ లబి్ధదారుగా ఉన్న ముఖ్యనేత బెంబేలెత్తారు. తమ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో ఆయన దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. దాంతో ఆగమేఘాలపై ఈ వ్యవహారాన్ని దారి మళ్లించాలని ఎత్తుగడ వేశారు. ఈ క్రమంలో తనకు అలవాటైన రీతిలో డైవర్షన్ కుట్రకు తెరతీశారు. సీబీఐ అంటే గుబులు... అందుకే ‘పచ్చ’ సిట్‌తో పన్నాగం! గతంలో నమోదు చేసిన అక్రమ మద్యం కేసులోగానీ... ప్రస్తుతం నకిలీ మద్యం కేసులో గానీ సీబీఐ దర్యాప్తు అంటేనే ముఖ్యనేత బెంబేలెత్తుతున్నారు. అందుకే టీడీపీ వీర విధేయ ఐపీఎస్ అధికారులతో కూడిన సిట్‌తో రాజకీయ వేధింపులకు పాల్పడడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై అక్రమ కేసులో సిట్ ద్వారానే వేధింపులకు పాల్పడుతున్న విషయం విదితమే. ఆ కేసును సీబీఐకి అప్పగించాలన్న వైఎస్సార్సీపీ డిమాండ్‌ను ఉద్దేశపూర్వకంగానే పట్టించుకోవడం లేదు. అయితే అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో సిట్ కుట్రలు వరుసగా బెడిసికొడుతున్నాయి. వైఎస్సార్సీపీ నేతలు, అప్పటి అధికారులకు వ్యతిరేకంగా సిట్ నమోదు చేసిన అభియోగాలు న్యాయస్థానాల్లో ఒక్కొక్కటిగా వీగిపోతున్నాయి. అదే సమయంలో అసలు మద్యం మాఫియాను నిర్వహిస్తోంది టీడీపీ పెద్దలేనన్న విభ్రాంతికర వాస్తవం వెలుగులోకి వచ్చింది. 2014–19లో టీడీపీ హయాంలో సిండికేట్ ద్వారా రూ.25 వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారు. ఆ అవినీతిని గతంలోనే సీఐడీ ఆధారాలతో సహా నిగ్గు తేల్చింది. ఈసారి టీడీపీ కూటమి ప్రభుత్వం ఏకంగా నకిలీ మద్యం దందాకు బరితెగించినట్లు ఆధారాలతోసహా వెల్లడైంది. భారీగా పట్టుబడిన నకిలీ మద్యం బాటిళ్లు అన్నమయ్య జిల్లా ములకలచెరువులో బయటపడిన కల్తీ మద్యం మాఫియా రాష్ట్రం అంతటా విస్తరించినట్లు నిగ్గు తేలింది. ఆ మాఫియా సూత్రధారి ముఖ్యనేత కాగా... పాత్రధారులు టీడీపీ నేతలు జయచంద్రారెడ్డి, సురేంద్రనాయుడు, అద్దేపల్లి జనార్దన్‌రావు... పంపిణీదారులు టీడీపీ సీనియర్ నేతలన్నది బట్టబయలైంది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని వైఎస్సార్సీపీతోపాటు ప్రజలూ డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్‌ను కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం తోసిపుచ్చడం గమనార్హం. తమకు అలవాటైన రీతిలో టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో మరో సిట్‌ను నియమించింది. తద్వారా నకిలీ మద్యం దందా సూత్రధారులు, పాత్రధారులైన టీడీపీ నేతలను ఈ కేసు నుంచి తప్పించే ఎత్తుగడ వేసింది. వైఎస్సార్సీపీ నేతలను అక్రమంగా ఈ కేసులో ఇరికించే కుట్రకు తెరతీసింది. అందులో భాగంగానే సిట్‌ను నియమిస్తూ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు విడుదల అయిన కాసేపటికే... ముఖ్యనేత డైరెక్షన్లో ఏ1 జనార్దన్ మాట్లాడిన వీడియోను ఎల్లో మీడి యా ద్వారా విడుదల చేయించారు. అది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం మీడియా సమావేశంలో చూచాయగా వెల్లడించిన విషయాలనే జనార్దన్ వీడియోలో వల్లె వేయడం గమనార్హం. మొదట పోలీసుల అదుపులో.. ఇప్పుడు జైల్లో .. అసలు జనార్దన్ మీడియాతో ఎలా మాట్లాడారు? ఎల్లో మీడియా ద్వారా విడుదలైన ఏ1 జనార్దన్‌రావు వీడియో ముఖ్యనేత కుతంత్రాన్ని బట్టబయలు చేసింది. ఆయన ప్రభుత్వానికి అధికారిక అతిథి అన్నది కూడా స్పష్టమైంది. కేసు దర్యాప్తును పక్కదారి పట్టించకుంటే నకిలీ మద్యం మాఫియా వెనుక ఉన్న టీడీపీ పెద్దల పేర్లను బయటపెడతానని జనార్దన్‌రావు బెదిరించినట్లు చర్చ జరుగుతోంది. దాంతో కేసును పక్కదారి పట్టిస్తామని ముఖ్యనేత డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో విదేశాల్లో ఉన్న జనార్దన్‌రావు ఓ సెలబ్రిటీ తరహాలో దర్జాగా గన్నవరం విమానాశ్రయంలో దిగారు. వెంటనే ఆయన్ను అరెస్టు చేసినట్టు ప్రకటించిన పోలీసులు ప్రభుత్వ అతిథిగా రాచమర్యాదలు చేశారు. ఇక తాజా వీడియో ఆయన ముఖ్యనేత కుట్రలో పాత్రధారేనని స్పష్టం చేసింది. అసలు జనార్ధన్‌రావు ఎల్లో మీడియాకు ఎలా ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వగలిగారన్నదే అంతు చిక్కని ప్రశ్న. ఎందుకంటే.. జనార్దన్‌రావును పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఆ రోజు గుర్తు తెలియని ప్రదేశంలో విచారించి శనివారం న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయస్థానం రిమాండ్ విధించంతో నెల్లూరు సబ్ జైలుకు తరలించారు. అంటే శుక్రవారం నుంచే ఆయన పోలీసులు, అనంతరం జైలు అధికారుల అదుపులో ఉన్నారు. ఆయన మాట్లాడిన వీడియోను ఎల్లో మీడియా సోమవారం విడుదల చేసింది. మరి ఆయన ఎల్లో మీడియాతో ఎప్పుడు మాట్లాడినట్లు...? పోలీసులు, జైలు అధికారుల అదుపులో ఉన్న వ్యక్తి నిబంధనల ప్రకారం మీడియాతో మాట్లాడకూడదు. అయినా సరే జనార్ధన్‌రావు ఎల్లో మీడియాతో మాట్లాడారంటే.. అది ప్రభుత్వ పెద్దల కుట్రలో భాగమేనన్నది సుస్పష్టం. పచ్చ పలుకులే పలికిన చిలుక... జనార్దన్‌రావు ఇక ఆ వీడియోను నిశితంగా పరిశీలిస్తే అసలు కుట్ర మరింత స్పష్టంగా వెల్లడవుతోంది. పక్కన పోలీసులు, టీడీపీ నేతలు పక్కనుంచి చెబుతున్న విషయాలనే జనార్ధన్ రావు వల్లె వేస్తున్నట్లు స్పష్టంగా వినిపిస్తోంది. తమ కుట్రకు అనుకూలంగా అవాస్తవాలను ఆయనతో చెప్పించారన్నది వెల్లడవుతోంది. ఫాంటసీ కథకు క్లాప్ కొట్టిన ముఖ్యనేత.. ఏ1 జనార్దన్రావుతోనే కట్టుకథల వీడియోసోషియో ఫాంటసీ సినిమాలు, యూట్యూబ్ వీడియోలను తలదన్నే రీతిలో ముఖ్యనేత కట్టుకథలతో కుతంత్రానికి తెర తీశారు. పిల్లలను ఊహా ప్రపంచంలో విహరింపచేసి మైమరపింపచేసే జానపద కథల మాదిరిగా పొలిటికల్ ఫాంటసీ కథకు క్లాప్ కొట్టారు. కల్తీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు (ఏ1) అద్దేపల్లి జనార్ధన్‌రావు ప్రధాన పాత్రధారిగా ఫాంటసీ కథలను వినిపించారు. ముఖ్యనేత స్క్రిప్టును ఆయనతో చెప్పించారు. ఆ ఫాంటసీ వీడియో షూటింగ్ బాధ్యతను ఎల్లో మీడియాకు అప్పగించారు. జనార్దన్‌రావుతో చెప్పించిన కట్టుకథ ముఖ్యనేత కుట్రకు పరాకాష్టగా నిలుస్తోంది. ఎంతగా అంటే.. ఈ కల్తీ మద్యం కేసులో ప్రధాన పాత్రధారిగా ఉన్న టీడీపీ నేత జయచంద్రారెడ్డి పాత్రేమీ లేదన్నట్లుగా చిత్రీకరించారు. ఇక మరో పాత్రధారి సురేంద్రనాయుడు ఊసే లేదు. నకిలీ మద్యం పంపిణీ బాధ్యతలు నిర్వహిస్తున్న టీడీపీ సీనియర్ నేతల ప్రస్తావనే లేకుండా జాగ్రత్తపడ్డారు. నకిలీ మద్యం కేసును 360 డిగ్రీల కోణంలో అడ్డంగా దారి మళ్లిస్తూ... వైఎస్సార్సీపీ నేత జోగి రమేశ్ పేరును జనార్దన్‌రావు నోటితో చెప్పించడం ముఖ్యనేత భేతాళ కుట్రలకు పరాకాష్ట. జోగి రమేశ్ చెబితేనే తాను నకిలీ మద్యం రాకెట్ నిర్వహించానని జనార్ధన్‌రావు నమ్మబలకడం టీడీపీ మార్కు బరితెగింపు దు్రష్పచారమే. గత ప్రభుత్వ హయాంలోనే తాను కల్తీ మద్యం రాకెట్ నిర్వహించానని... టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే నిలిపివేశానని... మళ్లీ కొన్ని నెలల క్రితం జోగి రమేశ్ చెబితేనే నకిలీ మద్యం దందా మొదలు పెట్టానంటూ ఊసరవెల్లి కూడా సిగ్గుపడే స్థాయిలో నిస్సిగ్గుగా అబద్ధాలు వల్లించారు. ములకలచెరువులో నిందితులను పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులుజనార్దన్రావు వీడియో కుట్రపూరితం.. ఎందుకంటే..?⇒ నిందితులు ఎవరైనా పోలీసుల విచారణలో చేతులు కట్టుకుని నిలబడి వినయంగా మాట్లాడతారు. ఎల్లో మీడియా విడుదల చేసిన వీడియోలో జనార్దన్‌రావు ఓ కురీ్చలో తాపీగా కూర్చుని మాట్లాడటం గమనార్హం. ⇒ ఇక ఈ వ్యవహారంలో కుట్ర కోణం ఉంది కదా.. అది చెప్పాలంటూ పక్క నుంచి ఎవరో ప్రోత్సహిస్తుండగా జనార్దన్‌రావు ఆ స్క్రిప్ట్ వల్లె వేశారు. తన పాత్ర, ప్రమేయం ఏదీ లేదని.. జోగి రమేష్ ఆధ్వర్యంలోనే అంతా చేశానంటూ చెప్పుకొచ్చారు. అంటే జోగి రమేష్ పేరు చెప్పాలన్న పోలీసుల ఆదేశాలనే జనార్దనరావు పాటించారన్నది స్పష్టమైంది. ⇒ గతంలో తాను కల్తీ మద్యం వ్యాపారం చేశానని జనార్దన్‌రావు చెప్పగానే... గతంలో అంటే ఎప్పుడు? అంటూ పక్కనే ఉన్న ఓ పోలీసు అధికారి ఉద్దేశపూర్వకంగా ప్రశ్నించారు. దాంతో గత ప్రభుత్వ హయాంలో అని ఆయన చెప్పారు. అంటే గత ప్రభుత్వం హయాంలో నకిలీ మద్యం వ్యాపారం చేసినట్టుగా జనార్దనరావుతో బలవంతంగా చెప్పించారన్నది తేటతెల్లమవుతోంది. ⇒ అంతటితో ఈ కుట్రలు ఆగలేదు. టీడీపీ ప్రభుత్వంపై బురదజల్లేందుకే నకిలీ మద్యం వ్యాపారం మళ్లీ చేయాలని ఈ ఏడాది ఏప్రిల్‌లో జోగి రమేష్ చెప్పారని జనార్దన్‌రావుతో పలికించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెడ్డపేరు తేవాలనే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దీన్ని నిర్వహించాలంటూ తనకు నిర్దేశించారన్నారు. జోగి రమేషే తనను ఆఫ్రికా పంపించారని.. నిధులు సమకూర్చారని.. పోలీసులే జనార్దన్‌రావుతో దగ్గరుండి మరీ చెప్పించినట్లు ఆ వీడియో స్పష్టం చేస్తోంది. అంటే ఎంత పక్కాగా జనార్దన్‌రావుతో అవాస్తవాలను చెప్పించారన్నది వెల్లడవుతోంది. -
బాబు ఫేక్ లిక్కర్ 2.0.. ప్రజల కిడ్నీలతో నయా దందా
-
ఎల్లో ముఠా స్కేచ్ .. A1 జనార్దన్ రావు ఫోన్ మిస్
-
తవ్వేకొద్ది బయటపడుతోన్న టీడీపీ నేతల నకిలీ లిక్కర్ బాగోతం..A1 జనార్ధన్‌రావు రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు..
-
జనార్ధన్ ను 10 గంటలపాటు విచారించిన ఎక్సైజ్ అధికారులు
-
Fake Liquor Case: పోలీసుల అదుపులో A1 జనార్దన్ రావు.. భయం గుప్పిట్లో కరకట్ట పెద్దలు
-
కల్తీ లిక్కర్ కేసులో A1 జనార్దన్ రావుకు ప్రశ్నల వర్షం
-
Fake Liquor Case: నువ్వు వెళ్లి లొంగిపో.. నేను చూసుకుంటా..!
-
నకిలీ మద్యం కేసులో కదులుతున్న డొంక
సాక్షి, విజయవాడ: నకిలీ మద్యం కేసు(AP Fake Liquor Case) దర్యాప్తు లోతుల్లోకి వెళ్లే కొద్దీ షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. మంగళగిరి ఎక్సైజ్ కార్యాలయంలో ప్రధాన నిందితుడు జనార్దన్ రావును అధికాలు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో.. టీడీపీ నేతల డొంక కదులుతున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అన్నమయ్య జిల్లా ములకలచెరువు నకిలీ మద్యం తయారీ కేసులో ఏ-1 నిందితుడు అద్దెపల్లి జనార్దనరావును అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నాటకీయ పరిణామాల నడుమ.. శుక్రవారం గన్నవరం విమానాశ్రయంలో ఎన్టీఆర్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ టాస్క్‌ఫోర్స్ (ఈస్టీఎఫ్) సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అయితే.. విచారణలో జనార్దన్‌రావు ఇప్పటిదాకా కీలక వివరాలనుఏ వెల్లడించినట్లు తెలుస్తోంది. మొలకల చెరువు, ఇబ్రహీంపట్నం, భవాని పురం, పరవాడ, తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం డెన్లు ఉన్నట్లు జనార్దన్ చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్రంలో పలు చోట్ల విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఏలూరు, రాజమండ్రి, విజయవాడతో పాటు విశాఖలో పాత నేరస్తుడు వెంకట్‌కు చెందిన స్థావరంలోనూ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో.. శ్రీకాకుళంలోని సారవకోట మండలంలో, ఇంకోవైపు అనకాపల్లి పాయకరావుపేట హైవేలోని పలు ట్రేడర్స్‌లోనూ తనిఖీలు జరుగుతుండడం కలకలం రేపుతోంది. ఈ సోదాలతో నకిలీ మద్యం మాఫియా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిందనేది స్పష్టమవుతోంది.జనార్ధన్ రావు నోరు విప్పితే టీడీపీ నేతల పేర్లు బయటకు వస్తాయి. ఈ క్రమంలో నకిలీ మద్యం తయారీ ప్రధాన సూత్రదారులలో మొదలైన భయం మొదలైంది. జనార్ధన్ రావు నీ ఏ కోర్టులో హాజరుపరుస్తారో అని ఆరా తీస్తున్నట్లు సమాచారం. మొత్తానికి నకిలీ మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని కూటమి ప్రభుత్వం ప్రమాదంలో పడేయగా.. ఈ కేసు నుంచి ఎలాగైనా బయటపడాలని టీడీపీ బడా నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. నకిలీ మద్యం సొమ్ముతో..నకిలీ మద్యం అమ్మకాలలో వచ్చిన డబ్బులతో నిందితులు భూములు కొనుగోలు చేసినట్లు తేలింది. ఈ కేసులో A12 నిందితుడైన కళ్యాణ్.. జనార్దన్ రావు పిన్ని కొడుకు. ఈ మధ్యకాలంలో కళ్యాణ్ గొల్లపూడిలో రూ.3 కోట్ల విలువైన ల్యాండ్‌ను కొనుగోలు చేశాడు. అది నకిలీ మద్యం సొమ్మేనని పోలీసులు నిర్ధారించుకున్నారు. అంతేకాదు.. ఇబ్రహీంపట్నం డెన్‌లో తనిఖీల సమయంలో కళ్యాణ్ సుమారు 60 కేసుల నకిలీ మద్యాన్ని బాత్రూంలో పారబోసినట్టు గుర్తించారు. జనార్ధన్ రావు పూర్తిగా నోరు విప్పితే మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. స్కెచ్ ఎలా ఉందంటే..కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత నకిలీ మద్యం తయారీకి టీడీపీ నేతలు స్కెచ్ వేసినట్లు స్పష్టమవుతోంది. వాళ్లలో కొందరు కొందరు అధికార బలంతో గుట్టు చప్పుడు కాకుండా నకిలీ మద్యం తయారీ యూనిట్లు మొదలు పెట్టారు. ఈ క్రమంలో.. ములుకల చెరువు, ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం డెన్లను జనార్దన్ రావు(TDP Janardhan Rao) నేతృత్వంలో ఏర్పాటు చేసినట్లు తేలింది. బెల్ట్ షాపులుతో మొదలు పెట్టి.. వైన్స్, బార్ల షాపులలో నకిలీ మద్యం అమ్మకాలు జరిగినట్టు ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. అదే సమయంలో.. మరో టీడీపీ నేత జయ చంద్రారెడ్డికి జనార్ధన్ రావుకి మద్య ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించినట్లు సమాచారం. రాష్ట్రంలో దొరికిన ప్రతి నకిలీ మద్యం డెన్ మూలాలు జనార్ధన్ రావు వైపు చూపిస్తున్నట్టు గుర్తించిన ఎక్సైజ్ అధికారులు.. ఆయన్ని సుదీర్ఘంగా ప్రశ్నించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: నకిలీ మద్యంపై కదం తొక్కిన మహిళలు -
లిక్కర్ కేసులో A1 జనార్దన్ రావు అరెస్ట్
-
పక్కావ్యూహం ప్రకారమే..!
రాష్ట్రంలో నకిలీ మద్యం దందా తీగ లాగుతుంటే ఉండవల్లి కరకట్ట బంగ్లాలో డొంక కదులుతోంది. నకిలీ మద్యం వ్యవస్థీకృత దోపిడీకి కర్త, కర్మ, క్రియ ముఖ్య నేతేనని నిగ్గు తేలుతోంది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో తంబళ్లపల్లె టీడీపీ టికెట్ జయచంద్రారెడ్డికి ఇవ్వడం దగ్గర మొదలైన ఈ వ్యవహారం... అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ మద్యం దుకాణాల రద్దు... బెల్టుషాపులకు పచ్చ జెండా... పర్మిట్ రూమ్‌లకు గేట్లెత్తి వ్యవస్థను నియంత్రణలోకి తెచ్చుకుని... నకిలీ మద్యం తయారీ ప్లాంట్లు నెలకొల్పి షాప్‌లకు సరఫరా చేయడం వరకు అంతా పక్కా వ్యూహంతో సాగిందని స్పష్టమవుతోంది.నాణ్యమైన మద్యం అందిస్తామని ఎన్నికలకు ముందు టీడీపీ కూటమి ఇచ్చిన హామీ వెనుక విస్తుపోయే ‘ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం డీల్’ వంటి భారీ కుట్ర ఉందని క్రమంగా అర్థమవుతోంది. మందుబాబుల బలహీనతను ఆసరాగా చేసుకుని కల్తీ మద్యం నిషా ఎక్కించి రూ.వేల కోట్లు కొల్లగొట్టే కుంభకోణం వెలుగుచూస్తోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన ప్రభుత్వ మద్యం దుకాణాల విధానాన్ని తొలగించి టీడీపీ సిండికేట్ ఆధ్వర్యంలో ప్రైవేటు మద్యం దుకాణాల నిర్వహణ వెనుక పన్నాగం ఉందని తేటతెల్లమవుతోంది. సాక్షి, అమరావతి : టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలు సాగిస్తున్న నకిలీ మద్యం దందాకు నిరుటి ఎన్నికలకు ముందే కుట్ర పన్నారు. అధికారంలోకి రాగానే దోపిడీ విధానాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. తనకు టికెట్ ఇస్తే ‘‘ఆఫ్రికా మోడల్’’ నకిలీ సరుకు దందాను ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టి ముఖ్యనేత దోపిడీకి సహకరిస్తానని జయచంద్రారెడ్డి ఎన్నికలకు ముందే ఆఫర్ ఇచ్చారు. పెదబాబు, చినబాబు వెంటనే ఈ డీల్‌కు పచ్చజెండా ఊపారు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యేలు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, శంకర్యాదవ్లను సైతం పక్కనపెట్టారు. ఖర్చంతా తానే భరిస్తానని శంకర్‌యాదవ్ చెప్పినా టీడీపీ అధినాయకత్వం వినిపించుకోలేదు. ఆయనకు టికెటివ్వాలని కార్యకర్తలు కరకట్ట నివాసం వద్ద ధర్నాలు చేసినా ఒప్పుకోలేదు. క్యాడర్ వ్యతిరేకించినా జయచంద్రారెడ్డికే తంబళ్లపల్లె టికెట్ ఇచ్చారు. దీనివెనుక ఉద్దేశం... ‘‘ఒక సీటు పోయినా ఫర్వాలేదు. ఒకవేళ అధికారంలోకి వస్తే ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం దందాతో భారీ దోపిడీకి పాత్రధారిగా జయచంద్రారెడ్డి ఉంటారు’’ అనే ఆలోచనేనని స్పష్టమవుతోంది. ఇక తాజాగా పెద్ద ఎత్తున బయటపడిన నకిలీ మద్యం ఉదంతంలో జయచంద్రారెడ్డి పాత్ర ఉందని స్పష్టమైనా.. ఆయనను తూతూమంత్రంగా టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు. ఇంతవరకు అరెస్టు చేయలేదు. దీన్నిబట్టే నకిలీ మద్యం దందాలో ప్రభుత్వ పెద్దల ప్రమేయం స్థాయిలో ఉందే నిర్ధారణ అవుతోంది. అంతా గుప్పిట పట్టి.. భారీ స్కెచ్.. నాణ్యమైన మద్యం ఎంత అమ్మినా.. ఆ డబ్బు రాష్ట్ర ఖజానాకే పోతుంది. మన జేబులు నిండేదెలా? అని ముఖ్య నేత భావించారు. అందుకే నకిలీ మద్యాన్నే అధికారికంగా విక్రయించే కుట్రకు కూటమి ప్రభుత్వం రాగానే తెరతీశారు. మద్యం వినియోగం తగ్గించేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టి, పారదర్శకంగా అమలు చేసిన ప్రభుత్వ మద్యం దుకాణాల వ్యవస్థను తొలగించారు. వాటి స్థానంలో టీడీపీ సిండికేట్ ద్వారా 3,736 ప్రైవేటు దుకాణాలను ఏర్పాటు చేయించారు. అనుబంధంగా మరో 3,736 పర్మిట్ రూమ్‌లకు అనుమతిచ్చారు. టీడీపీ సిండికేట్ అనధికారికంగా ఏకంగా 75 వేల బెల్ట్ దుకాణాలను తెరిచింది. తాజాగా 540 బార్లనూ (త్వరలో మరో 300 కూడా) ఈ సిండికేట్‌కే కట్టబెట్టింది. మరోవైపు రాష్ట్రంలోని 20 మద్యం డిస్టిలరీలు దశాబ్దాలుగా టీడీపీ సీనియర్ నేతల కుటుంబాల ఆ«దీనంలోనే ఉన్నాయి. వాటిలో 14 డిస్టిలరీలకు గతంలో చంద్రబాబు ప్రభుత్వమే అనుమతులిచ్చింది. మిగిలిన ఆరింటికి అంతకుముందున్న ప్రభుత్వాలు అనుమతిచ్చాయి. 20 డిస్టిలరీలనూ ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ ద్వారా మద్యం కొనుగోళ్ల కోసం ఎంప్యానెల్ చేసింది టీడీపీ ప్రభుత్వమే. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొత్తగా ఒక్క డిస్టిలరీకి అనుమతివ్వలేదు. ఈ విధంగా తయారీ నుంచి విక్రయాల వరకు నెట్వర్క్ అంతటినీ ముఖ్యనేత టీడీపీ మద్యం మాఫియా గుప్పిట్లో పెట్టారు. పచ్చ సీసాలో నకిలీ మద్యం కూటమి అధికారంలోకి రాగానే అత్యంత ప్రాధాన్యతతో కొత్త మద్యం విధానం ఎందుకు అమలు చేశారో లోగుట్టు బయటపడుతోంది. మొత్తం మద్యం నెట్వర్క్ తమ చేతుల్లోకి రావడంతో ముఖ్య నేత రెండో దశ కుట్రను అమలు చేశారు. జయచంద్రారెడ్డితో చినబాబు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం దందాకు తెరతీశారు. మొత్తం నకిలీ ముఠాకు తనకు అత్యంత సన్నిహితుడైన అన్నమయ్య జిల్లాకు చెందిన ప్రభుత్వ కీలక నేతను చినబాబు సమన్వయకర్తగా పెట్టారు. రాష్ట్రంలో ప్రాంతాలవారీగా టీడీపీ నేతలకు నకిలీ మద్యం పంపిణీ బాధ్యతలు కట్టబెట్టారు. నర్నీపటా్ననికి చెందిన సీనియర్ నేత కుటుంబానికి ఉత్తరాంధ్ర, ఏలూరు జిల్లాకు చెందిన వివాదాస్పద ప్రజాప్రతినిధికి ఉమ్మడి ఉభయ గోదావరి, బాపట్ల జిల్లాకు చెందిన ప్రభుత్వ కీలక నేతకు ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య జిల్లాలోని ప్రభుత్వ కీలక నేతకు రాయలసీమలో నకిలీ మద్యం దందా బాధ్యతలు అప్పగించారు. ఆ వెంటనే ఆఫ్రికా దేశాల్లో నకిలీ మద్యం తయారుచేసే విధానాన్ని ప్రవేశపెడుతూ రాష్ట్రవ్యాప్తంగా యూనిట్లను నెలకొల్పారు. కుటీర, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ)ల రీతిలో జిల్లాలు, మండల స్థాయిలో నకిలీ మద్యం తయారీ యూనిట్లు ఏర్పాటు చేయడం గమనార్హం. టీడీపీ నేతలు జయచంద్రారెడ్డి, అద్దేపల్లి జనార్దన్‌రావు, కట్టా సురేంద్రనాయుడు ఒడిశా, బిహార్ తదితర రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకొచ్చి నకిలీ మద్యం తయారీలో శిక్షణ ఇప్పించారు. ముఖ్య నేత సన్నిహితులైన టీడీపీ సీనియర్ నేతల కుటుంబాలకు చెందిన డిస్టిలరీల ద్వారా అక్రమంగా ‘ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ (వాడుక భాషలో స్పిరిట్ అంటారు)ను కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ నుంచి భారీగా కొని ఆ యూనిట్లకు తరలించారు. రాష్ట్రమంతా ముఖ్యనేత ప్రవేశపెట్టిన నకిలీ బ్రాండ్లు కేరళ మాల్ట్, బెంగళూరు బ్రాందీ, ఓల్డ్ అడ్మిరల్... ఇవీ ప్రస్తుతం రాష్ట్రంలో జోరుగా అమ్మకాలు సాగుతున్న మద్యం బ్రాండ్లు. ఎప్పుడూ వినని ఈ బ్రాండ్లు ఎక్కడివి అనే కదా మీ అనుమానం...? ఇవి ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో ప్రవేశపెట్టిన ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం బ్రాండ్లు. వారి మాస్టర్ ప్లాన్‌లో భాగంగా జయచంద్రారెడ్డి, అద్దేపల్లి జనార్దన్‌రావు, సురేంద్రనాయుడు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి చేస్తున్న నకిలీ బ్రాండ్లే. అనకాపల్లి జిల్లా రాంబిల్లి, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, అన్నమయ్య జిల్లా ములకలచెరువు, ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం... ఇలా తనిఖీలు చేసిన ప్రతిచోటా పట్టుబడినది టీడీపీ సిండికేట్ ప్లాంట్లలో తయారవుతున్న నకిలీ మద్యమే. గుట్టలుగుట్టలుగా నిల్వ చేసిన నకిలీ మద్యం బ్రాండ్ల సరుకు దొరకడం అధికారులనే విస్మయపరుస్తోంది. దీన్నిబట్టే ఎంత పక్కాగా, యథేచ్ఛగా ముఖ్య నేత ఆఫ్రికా మోడల్ నకిలీ దందాను నడిపిస్తున్నారో స్పష్టమవుతోంది. మోగుతున్న మరణమృదంగం... టీడీపీ కూటమి ప్రభుత్వం... బ్రాండెడ్ ముసుగులో విచ్చలబిడిగా విక్రయిస్తున్న నకిలీ మద్యం రాష్ట్రంలో మరణ మృదంగం మోగిస్తోంది. 60 నుంచి 75 శాతం వరకు ఆల్కహాల్ ఉండే నకిలీ మద్యం తాగడంతో గుండె, ఊపిరితిత్తులు, ఉదరం, మూత్ర పిండాలు వేగంగా దెబ్బతింటున్నాయి. నాడీ వ్యవస్థపై దుష్ప్రభావంతో చిత్తచాంచల్యం ఆవహిస్తోంది. ఆరోగ్యంగా ఉన్నవారు వేగంగా తీవ్ర అనారోగ్యానికి గురై కొద్ది రోజుల్లోనే మృత్యువాత పడుతున్నారు. అంతుబట్టని మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇటీవల ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, ఏలూరు జిల్లాల్లో వరుస హఠాన్మరణాలకు నకిలీ మద్యమే కారణమని ప్రాథమికంగా గుర్తించారు. దాంతో ఎక్సైజ్ శాఖ అధికారుల్లో ఆందోళన మొదలైంది. పరిస్థితి ఇలానే కొనసాగితే తమ మెడకు చుట్టుకుటుందని భావించారు. భవిష్యత్‌లో ఇబ్బంది రాకుండా ఎక్సై్సజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో తనిఖీలు, దాడులు చేసింది. ఏదో కిందిస్థాయి ముఠా దొరికితే కేసులు నమోదు చేసి ట్రాక్ రికార్డు కాపాడుకోవాలనుకుంది. కానీ, వారు ఊహించని రీతిలో నకిలీ మద్యం వెనుక ఉన్న వ్యవస్థీకృత మాఫియా బండారం బయటపడింది. ఈ మాఫియా డాన్ ముఖ్యనేతేనని తేలడంతో ఎక్సైజ్ శాఖ అధికారులకు నోట మాట రాలేదు. ప్రభుత్వ ముఖ్య నేత ఆదేశంతో నకిలీ మద్యం మాఫియా తీవ్రతను కప్పిపుచ్చేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. అయితే, నకిలీ మద్యం దారుణాలు రాష్ట్రవ్యాప్తంగా కనిపిస్తుండటంతో సర్వత్రా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. తొలి ఏడాది రూ.5,280 కోట్ల దోపిడీ రాష్ట్రంలో అమ్ముడవుతున్న మద్యంలో మూడో వంతు నకిలీ అని ఎక్సైజ్ శాఖ వర్గాలు అంచనా వేయడం గమనార్హం. ఈ లెక్కన టీడీపీ కూటమి ప్రభుత్వంలో తొలి ఏడాది రూ.5,280 కోట్ల నకిలీ మద్యం అమ్మకాలు సాగాయి. మొత్తం మద్యం అమ్మకాల్లో నకిలీ మద్యం వాటాను 50 శాతం దాటించాలన్నది టీడీపీ సిండికేట్ లక్ష్యం. అంటే, రానున్న నాలుగేళ్లలో ఏడాదికి రూ.10 వేల కోట్లు చొప్పున రూ.40 వేల కోట్లు కొల్లగొట్టడానికి పన్నాగం పన్నింది. ఇందులో నకిలీ మద్యం దందాకు మూల విరాట్ అయిన ముఖ్యనేత కరకట్ట బంగ్లాకు 30 శాతం వాటాగా లెక్కతేల్చారు. మొత్తంమీద రూ.15 వేల కోట్లు కరకట్ట బంగ్లాకు కమీషన్‌గా చేరనుంది. ప్రాంతాలవారీగా పర్యవేక్షిస్తున్న టీడీపీ సీనియర్ నేతలకు 50 శాతం, మద్యం దుకాణాలు, బార్లు నిర్వహిస్తున్న టీడీపీ సిండికేట్‌కు 20 శాతం వాటా. ఇంత భారీ దోపిడీ కాబట్టే పెదబాబు, చినబాబు ఈ దందాను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అప్పట్లో దుష్ప్రచారం ... రాద్ధాంతం... ఇప్పుడు అంతటా మౌనం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాణ్యమైన మద్యాన్ని ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా విక్రయిస్తేనే టీడీపీ కూటమి, ఎల్లో మీడియా రాద్ధాంతం చేసింది. చంద్రబాబు, లోకేశ్, పవన్‌కళ్యాణ్, అయ్యన్నపాత్రుడు, రఘురామకృష్ణరాజు తదితరులు దుష్ప్రచారమే పనిగా పెట్టుకున్నారు. మద్యం నాణ్యమైనది కాదని చెన్నైకు చెందిన ఓ ప్రైవేట్ ల్యాబ్ నివేదిక ఇచ్చిందని రఘురామ తప్పుదోవ పట్టించేందుకు యత్నించారు. అసలు తాము అటువంటి నివేదిక ఇవ్వలేదని ఆ ల్యాబ్ ప్రకటించంతో వారి కుట్ర బెడిసికొట్టింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలో విక్రయిస్తున్న మద్యం నాణ్యమైనదేనని ప్రకటించింది. అప్పట్లో రాద్ధాంతం చేసిన చంద్రబాబు, ఆయన గ్యాంగ్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా నకిలీ మద్యం యూనిట్లు క్రమంగా బయటపడుతున్నా కిమ్మనడం లేదు. కఠిన చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్రంలో మద్యం దుకాణాలు, బార్లలో విక్రయిస్తున్న మద్యం నాణ్యతను ర్యాండమ్‌గా పరీక్షించాలని కూడా భావించడం లేదు. ఇదంతా చూస్తుంటే నకిలీ మద్యం మాఫియాకు ప్రభుత్వ పెద్దల దన్ను ఉందన్నదే స్పష్టమవుతోంది. స్పిరిట్ .. మనుషులకు ప్రాణాంతకం!వాస్తవానికి ఈ స్పిరిట్‌లో 100 శాతం ఆల్కహాల్ ఉంటుంది. ఇది మనుషులకు అత్యంత ప్రమాదకరం. పరిశ్రమలు తమ ఉత్పత్తుల (ఆహార సంబంధిత కాదు) తయారీకి ఈ స్పిరిట్‌ను ఉత్ప్రేరకంగా ఉపయోగిస్తాయి. ఇక బ్రాండెడ్ మద్యం కంపెనీల పరిశ్రమల్లో ఉండే అధునాతన, భారీ యంత్ర పరికరాలతో స్పిరిట్‌ను బాగా పలుచన (డైల్యూట్) చేసి ఆల్కహాల్‌ను 42 శాతానికి తగ్గిస్తాయి. తర్వాతే మద్యం తయారీకి ముడి సరుకుగా ఉపయోగిస్తారు. ఎందకంటే ఆల్కహాల్ 42 శాతం కంటే ఎక్కువ ఉండడం ఆరోగ్యానికి తీవ్ర హానికరం. కాగా, ఏడాదిగా టీడీపీ కూటమి పెద్దలు అక్రమంగా నెలకొల్పిన నకిలీ మద్యం యూనిట్లు ప్రమాణాలు ఏమీ పాటించలేదు. వీటిలోని చిన్నచిన్న యంత్రాలకు స్పిరిట్‌ను ప్రాసెస్ చేసే సామర్థ్యం లేదు. స్పిరిట్లోని ప్రమాదకర కారమిల్ ద్రావణం, రంగు నీళ్లు కలిపి నకిలీ మద్యం ఉత్పత్తి చేస్తున్నారు. అంతేకాదు బ్రాండెడ్ కంపెనీల మద్యం సీసాలు, మూతలు కూడా తయారు చేస్తున్నారు. నకిలీ మద్యంలో ఆల్కహాల్ 75 శాతం వరకు ఉంటోందని ఎక్సైజ్ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. అది ఎంత ప్రమాదకరమో ఊహకే అందడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సీసాల్లో నకిలీ మద్యం నింపి మూతలు బిగించి టీడీపీ సిండికేట్ గుప్పిట్లో ఉన్న 3,736 ప్రైవేట్ దుకాణాలు, 3,736 పర్మిట్ రూమ్‌లు, 75 వేల బెల్ట్ దుకాణాలు, ఇప్పటికి 540 బార్లలో (త్వరలో మరో 300 కూడా) యథేచ్ఛగా అమ్ముతున్నారు. -
అంతా స్కెచ్ ప్రకారమే..!
సాక్షి, అమరావతి: నకిలీ మద్యం కేసును నీరుగార్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం తాము పన్నిన పన్నాగాన్ని పక్కాగా అమలు చేస్తోంది. ఈ మేరకు ‘‘కేసును పక్కదారి పట్టించి నీరుగారుస్తాం. కంగారుపడొద్దు’’ అని పెదబాబు, చినబాబు హామీ ఇవ్వడంతో ఎ1గా ఉన్న జనార్దన్‌రావు గన్నవరం విమానాశ్రయంలో శుక్రవారం దర్జాగా అడుగుపెట్టారు. ఆధారాలతో సహా అడ్డంగా దొరికినా సరే ఆయన ఏమాత్రం జంకు లేకుండా రావడం పోలీసులనే విస్మయపరిచింది. కాగా, కేసును నీరుగార్చేందుకు ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన హామీ కథ కమామిషు ఇలా సాగింది. అన్నమయ్య జిల్లా ములకలచెరువులో పట్టుబడ్డ నకిలీ రాకెట్లో అడ్డంగా దొరికిన ఆఫ్రికా మోడల్ కల్తీ మద్యం మాఫియా సూత్రధారులు టీడీపీ తంబళ్లపల్లె నియోజకవర్గ ఇన్చార్జి జయచంద్రారెడ్డి, ఆయన భాగస్వామి జనార్దన్‌రావుతో పాటు సురేంద్రనాయుడు ప్రభుత్వ పెద్దలకు ఎదురుతిరిగారు. తమను బయటపడేయకుంటే ఎన్నికలకు ముందు కుదిరిన డీల్ ప్రకారం... పెదబాబు, చినబాబు ఆదేశాలతోనే రాష్ట్రస్థాయిలో నకిలీ మద్యం దందాను వ్యవస్థీకృతం చేశామనే వాస్తవాన్ని బయటపెడతామని తేల్చి చెప్పారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఓ టీడీపీ సీనియర్ ప్రజాప్రతినిధితో పాటు కేసును పర్యవేక్షిస్తున్న ఐపీఎస్ అధికారి ద్వారా కూడా సమాచారం పంపించారు. ‘మమ్మల్ని బయటపడేసే బాధ్యత ప్రభుత్వ పెద్దలదే... లేకపోతే మొత్తం నకిలీ మద్యం గుట్టు విప్పుతామని కుండబద్దలు కొట్టారు. జయచంద్రారెడ్డి, జనార్దన్‌రావు నోరువిప్పితే బండారం బయటపడుతుందని నకిలీ మద్యం దందా కుట్రదారులు, లబ్దిదారులైన పెదబాబు, చినబాబు బెంబేలెత్తారు. ‘‘తప్పని పరిస్థితుల్లో కేసు నమోదు చేశాం తప్ప అంతకుమించి దర్యాప్తు ముందుకుసాగకుండా నీరుగారుస్తాం’’ అని హామీ ఇచ్చినట్టు సమాచారం. ప్రజలను తప్పుదారి పట్టించేందుకే జయచంద్రారెడ్డిని సస్పెండ్ చేసినట్టు ప్రకటించి కనికట్టు చేశామని.. టీడీపీలో ఆయన స్థానానికి ఢోకా లేదని కూడా భరోసా ఇచ్చారు. ‘‘విచారణకు హాజరైనట్టు, పోలీసులకు సహకరిస్తున్నట్టు నటించండి. కొన్ని రోజుల్లోనే మిమ్మల్ని బయటకు తెచ్చి కేసును పూర్తిగా పక్కదారి పట్టిస్తామని’’ చెప్పారు. ఈ డ్రామా కొనసాగింపులోనే నకలీ మద్యం వ్యవహారంలో టీడీపీ నేతల ప్రమేయం లేదని వీడియో ద్వారా ప్రకటించాలని జనర్దాన్రావును చినబాబు ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇలా అందరినీ నమ్మించేందుకు ఓ ఆధారాన్ని సృష్టించినట్టు కూడా అవుతుందన్నదన్నది అసలు ఉద్దేశం. కేసు నుంచి బయటపడేస్తామన్న భరోసా వచ్చాకే... జనార్దన్‌రావు 4 రోజుల క్రితం వీడియో విడుదల చేశారు. అయితే, నకిలీ మద్యం వ్యవహారంతో టీడీపీ నేతలకు సంబంధం ఉందో లేదో చెప్పాల్సింది దర్యాప్తు చేసే పోలీసు అధికారులు. కానీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జనార్దరావు టీడీపీ నేతలకు క్లీన్చిట్ ఇవ్వడం గమనార్హం.ఇదంతా చూస్తుంటే కేసును పక్కదారి పట్టించేందుకు ఎంత పక్కాగా కథ నడుపుతున్నారో స్పష్టమవుతోంది. ఆ స్కెచ్‌లో భాగంగానే జనార్దన్‌రావు పోలీసులకు సమాచారం ఇచ్చి మరీ గన్నవరం విమానాశ్రయంలో దిగారు. వెంటనే పోలీసులు అరెస్టు చేయడంతో డ్రామాలో మొదటి అంకం పూర్తయింది. ఇక కొద్ది రోజుల్లోనే జనార్దన్‌రావును బెయిల్‌పై తీసుకొచ్చి కేసును పూర్తిగా నీరుగార్చాలన్నదే ప్రభుత్వ పెద్దల ఎత్తుగడ అని పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. నకిలీ మద్యం కేసులో జనార్దన్‌రావు అరెస్ట్గాందీనగర్ (విజయవాడ సెంట్రల్): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో ప్రధాన సూత్రధారి అద్దేపల్లి జనార్దన్‌రావును ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం గన్నవరం ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. అద్దేపల్లి జనార్దన్‌రావు ములకలపల్లి, ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో ఏ1 నిందితుడిగా ఉన్నారు. నకిలీ మద్యం గుట్టు రట్టయిన వెంటనే ఆయన ఆఫ్రికా పారిపోయినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో 12 మందిపై ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మొదట ముగ్గురు నిందితులు అద్దేపల్లి జగన్మోహన్రావు, బాదల్ దాస్, ప్రతాప్ దాస్, కట్టారాజు, శ్రీనివాసరెడ్డి, కళ్యాణ్‌ను అరెస్ట్ చేశారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌కు చెందిన రవిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడ తరలించారు. ఏ–1 అద్దేపల్లి జనార్దన్‌రావు కూడా అరెస్ట్ కావడంతో ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 8 మంది నిందితులను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసినట్టయింది. అద్దేపల్లి జనార్దన్‌రావు అరెస్ట్‌పై శుక్రవారం ఉదయం నుంచి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆయన విదేశాలకు పారిపోయాడని అధికారులు చెబుతున్నప్పటికీ... విజయవాడలోనే తలదాచుకున్నాడని ప్రచారం జరిగింది. కానీ జనార్దన్‌రావు ఎయిర్ ఇండియా విమానంలో ముంబై నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు శుక్రవారం సాయంత్రం 5.45 గంటలకు చేరుకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న ఎక్సైజ్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జనార్దన్‌రావు మీడియాతో మాట్లాడుతూ తనను రాజకీయంగా ఈ కేసులో ఇరికించారన్నారు. ఆయన తరఫు న్యాయవాది రవీంద్ర రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జనార్థనరావును తీసుకొచ్చి సరెండర్ చేస్తామని చెప్పినా ఎక్సైజ్ పోలీసులు స్పందించలేదన్నారు. ఆయనను బలవంతం చేసి వారికి కావాల్సిన విధంగా వాంగ్మూలం తీసుకొనేందుకు అదుపులోకి తీసుకున్నారన్నారు. ఆయనకు ఏదైనా జరిగితే ఎక్సైజ్ పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని చెప్పారు. టీడీపీ నేత జయచంద్రారెడ్డి, ఆయన బావమరిదిపై కేసు ములకలచెరువు: టీడీపీ నేత జయచంద్రారెడ్డి, ఆయన బావమరిది మంత్రి గిరిధర్‌రెడ్డిని నకిలీమద్యం తయారీ కేసులో నిందితులుగా ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం చేర్చారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఈనెల 3న 14 మందిపై ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేయగా తాజాగా మరో ఏడుగురిని నిందితులుగా చేర్చారు. ఈ మేరకు తంబళ్లపల్లె కోర్టులో మెమో దాఖలు చేశారు. జయచంద్రారెడ్డిని ఏ17గా, గిరిధర్‌రెడ్డిని ఏ18గా చేర్చారు. మిగిలిన వారిలో అణ్బురాసు, అష్రఫ్, బాలాజీ, సుదర్శన్, రవి ఉన్నారు. కేసులో ఏ–2 కట్టా రాజు, ఏ–12 కొడాలి శ్రీనివాసరావుల వాంగ్మూలాల ఆధారంగా వీరిని నిందితులుగా చేర్చినట్టు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. వీరి అరెస్టు కోసం ఎక్సైజ్ పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. -
నకిలీ మద్యం తయారీ, సరఫరా నిజమే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెద్ద ఎత్తున నకిలీ లిక్కర్ తయారీ, సరఫరా, అమ్మకాలు నిజమేనని ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్, పోలీస్ శాఖల ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదించారు. అన్నమయ్య జిల్లా ములకలచెరువు, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో భారీగా బయటపడ్డ నకిలీ రాకెట్ ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో తయారైన నకిలీ మద్యం పెద్ద సంఖ్యలో బెల్ట్ షాపులకు సరఫరా జరిగిందని వివరించారు. ఆయా శాఖల ఉన్నతాధికారులు, మంత్రులతో బుధవారం సీఎం నిర్వహించిన సమావేశంలో నకిలీ మద్యంకు సంబంధించిన అంశాలను వారు ఆయన దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లాలో కల్తీ లిక్కర్ వ్యవహారంలో తీసుకున్న చర్యలను, దర్యాప్తు వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు. ములకలచెరువు ఘటనలో 21 మందిని నిందితులుగా గుర్తించామని, ఇందులో ఇప్పటివరకు 12 మందిని అరెస్టు చేశామని చెప్పారు. మిగతా నిందితులను త్వరలో అరెస్టు చేస్తామన్నారు. ఎ1గా ఉన్న అద్దేపల్లి జనార్దన్‌రావు లావాదేవీలు, వ్యాపారాలపై విచారణ జరపుతున్నామని తెలిపారు. ములకలచెరువు కేసు ఆధారంగా ఎనీ్టఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో జనార్దన్‌రావుకు చెందిన బార్, వ్యాపారాలపై తనిఖీలు జరిపామని, కల్తీ మద్యం నిల్వలను గుర్తించామని చెప్పారు. ఆయన సోదరుడు జగన్మోహన్రావుతో కలిసి నకిలీ మద్యం తయారు చేసి సరఫరా చేస్తున్నారని తెలిపారు. ఇందుకు సంబంధించి 12 మందిని నిందితులుగా గుర్తించామని వివరించారు. ఫేక్ ప్రచారంపై చర్యలు తీసుకోండి అన్నమయ్య జిల్లాలో నకిలీ లిక్కర్ వ్యవహారంపై రాష్ట్రంలో రాజకీయ పక్షాలు తప్పుడు ప్రచారంతో రాజకీయ ప్రయోజనం కోసం ప్రయత్నం చేస్తున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రం అంతటా కల్తీ లిక్కర్ అని తప్పుడు ప్రచారంతో ప్రజలను భయపెడుతున్నారని, ప్రతి నాలుగు బాటిల్స్‌లో ఒకటి నకిలీ ఉందని ఫేక్ ప్రచారం చేస్తున్నారని చెప్పారు. నకిలీ లిక్కర్‌తో ప్రాణాలు పోతున్నాయని ఫేక్ ప్రచారాలు మొదలు పెట్టిన విషయాన్ని మంత్రులు అర్థం చేసుకోవాలని.. వైఎస్సార్సీపీ నేతల రాజకీయ కుట్రలను ఎప్పటికప్పుడు భగ్నం చేయాలని సూచించారు. ఈ మరణాలపై విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించారు. మీడియా అయినా, సోషల్ మీడియా అయినా తప్పుడు ప్రచారం చేస్తే ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. ఈ సమావేశానికి మంత్రులు కొల్లు రవీంద్ర, లోకేశ్ నేరుగా హాజరవ్వగా.. హోం మంత్రి సహా పలువురు మంత్రులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. -
కృష్ణా జిల్లా టీడీపీలో భగ్గుమన్న వర్గవిభేదాలు
సాక్షి, కృష్ణా జిల్లా: కృష్ణా జిల్లా మోపిదేవి మండలం టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఎంపీపీ పదవి ఇస్తామని మోసం చేయడంతో మోపిదేవి మండల అధ్యక్షుడు నడికుడిటి జనార్ధనరావు, ఆయన భార్య టీడీపీకి రాజీనామా చేశారు. జనార్ధనరావు భార్య మెరకనపల్లి ఎంపీటీసీగా టీడీపీ తరపున పోటీ చేసి గెలిచింది. పార్టీ మోసం చేయడంతో ఆమె ఎంపీటీసీ పదవికి కూడా రాజీనామా చేసింది. కాగా, మోపిదేవి ఎంపీపీ పదవిని జననీకుమారికి ఇస్తున్నట్లు టీడీపీ గతంలో ప్రచారం చేసింది. ఎంపీపీ పదవి దక్కకపోవడంతో జనార్ధన కుటుంబం తీవ్ర మనస్థాపం చెందింది. ఎంపీపీ పదవి ఇస్తున్నామని నమ్మించి మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. మాజీ మంత్రి కొల్లు రవీంద్రకి జనార్ధనరావు సమీప బంధవు. ఈ సందర్భంగా జనార్ధనరావు.. పార్టీలో మత్స్యకారులకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ ఆరోపించారు. పార్టీ జడ్పీటీసీ సభ్యుడు డబ్బు రాజకీయాలు చేస్తూ నిజమైన కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. జనార్ధనరావుకు మద్దతుగా గ్రామ టీడీపీ నేతలు, కార్యకర్తలు రాజీనామా చేశారు. చదవండి: (వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను: ఎంపీ కేశినేని నాని) -
నటుడు జనార్ధన్ రావు మృతి
సీనియర్ నటుడు ముప్పుళ్ల జనార్ధన్ రావు(74) శుక్రవారం ఉదయం గుండెపోటుతో చెన్నై సాలిగ్రామంలో కన్నుమూశారు. గుంటూరు జిల్లా పొనిగళ్ల గ్రామంలో 1946లో జన్మించిన జనార్ధన్ రావు చెన్నైలో స్థిరపడ్డారు. తెలుగు, తమిళ సహా వివిధ భాషల్లో వెయ్యికి పైగా చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా తెలుగులో ‘జానకిరాముడు, మజ్ను, కొండవీటి సింహం, పెదరాయుడు, అభిలాష, అమ్మోరు, గోరింటాకు, గోకులంలో సీత, తలంబ్రాలు’.. వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన చివరిగా నటించిన చిత్రం ‘జనతా గ్యారేజ్’. పలు టీవీ సీరియళ్లలోనూ నటించారాయన. చెన్నైలో ఒక రికార్డింగ్ స్టూడియోను లీజుకు తీసుకుని నిర్వహించారు. భాగస్వామ్యంలో కొన్ని అనువాద చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఆయన మృతిపట్ల తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు సంతాపం తెలిపారు. జనార్ధన్ రావు అంత్యక్రియల్ని కుటుంబ సభ్యులు శుక్రవారమే నిర్వహించారు. మంచి నటుడిని కోల్పోయాం: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తెలుగు సినిమా రంగం మంచి సీనియర్ నటుడిని కోల్పోయిందని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ యాక్టింగ్ ప్రెసిడెంట్ బెనర్జీ, ప్రధాన కార్యదర్శి జీవితా రాజశేఖర్, కార్యవర్గ సభ్యులు తమ సంతాపాన్ని తెలిపారు. సీనియర్ నటుడు జనార్ధన్ రావు మృతి వార్త తెలిసిన వెంటనే వారు స్పందించారు. జనార్ధన్ రావుతో తమకు మంచి అనుబంధం ఉందన్నారు బెనర్జీ. ఆయన మృతికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యవర్గం సంతాపం తెలియజేసింది. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటించింది. -
సుప్రీం మొట్టికాయలు: ఏపీకి ఆర్టీఐ కమిషనర్లు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్టకేలకు ఆర్టీఐ కమిషనర్ల నియామకం చేపట్టింది. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడంతో ప్రభుత్వం మొద్దునిద్ర వీడింది. రాష్ట్రంలో నాలుగేళ్ల తర్వాత సమాచార కమిషనర్లను నియమించింది. మాజీ ఐపీఎస్ అఫీసర్ బీవీ రమణకుమార్(కృష్ణా జిల్లా), మాజీ ఐఎఫ్ఎస్ రవికుమార్ (రాజమండ్రి), టీడీపీ లీగల్ సెల్ సభ్యుడు జనార్థన్‌రావు(కడప)లను ఆర్టీఐ కమిషనర్లుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
‘వాట్ హెపెన్ 6 టు 6’ మూవీ ప్రస్ మీట్