కృష్ణా జిల్లా టీడీపీలో భగ్గుమన్న వర్గవిభేదాలు

Clashes In Krishna District Mopidevi Mandal TDP - Sakshi

సాక్షి, కృష్ణా జిల్లా: కృష్ణా జిల్లా మోపిదేవి మండలం టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఎంపీపీ పదవి ఇస్తామని మోసం చేయడంతో మోపిదేవి మండల అధ్యక్షుడు నడికుడిటి జనార్ధనరావు, ఆయన భార్య టీడీపీకి రాజీనామా చేశారు. జనార్ధనరావు భార్య మెరకనపల్లి ఎంపీటీసీగా టీడీపీ తరపున పోటీ చేసి గెలిచింది. పార్టీ మోసం చేయడంతో ఆమె ఎంపీటీసీ పదవికి కూడా రాజీనామా చేసింది. 

కాగా, మోపిదేవి ఎంపీపీ పదవిని జననీకుమారికి ఇస్తున్నట్లు టీడీపీ గతంలో ప్రచారం చేసింది. ఎంపీపీ పదవి దక్కకపోవడంతో జనార్ధన కుటుంబం తీవ్ర మనస్థాపం చెందింది. ఎంపీపీ పదవి ఇస్తున్నామని నమ్మించి మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. మాజీ మంత్రి కొల్లు రవీంద్రకి జనార్ధనరావు సమీప బంధవు. ఈ సందర్భంగా జనార్ధనరావు.. పార్టీలో మత్స్యకారులకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ ఆరోపించారు. పార్టీ జడ్పీటీసీ సభ్యుడు డబ్బు రాజకీయాలు చేస్తూ నిజమైన కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. జనార్ధనరావుకు మద్దతుగా గ్రామ టీడీపీ నేతలు, కార్యకర్తలు రాజీనామా చేశారు. 

చదవండి: (వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను: ఎంపీ కేశినేని నాని)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top