
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: నకిలీ మద్యం కేసులో తాజాగా కీలక పరిణామాలు చోటు చేసుసుకున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు, టీడీపీ నేత జనార్ధన్‌రావుకి చెందిన వైన్ షాపుల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో.. ఓ వైన్ షాపును సీజ్ చేశారు. అదే సమయంలో వైఎస్సార్‌సీపీపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను కొనసాగిస్తోంది.
ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శ్రీనివాస వైన్స్.. పూర్ణచంద్రరావు అనే వ్యక్తి పేరు మీద ఉంది. ఈ వైన్స్‌కు నకిలీ మద్యాన్ని జనార్దన్‌రావే సరఫరా చేశారు. ఈ వ్యవహారాన్ని జనార్దన్ పిన్ని కొడుకు కల్యాణ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వచ్చాడు. అలా వచ్చిన సొమ్ముతోనే గొల్లపూడిలో విలువైన భూములను కొనుగోలు చేసినట్లు ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. ఈ కేసులో కల్యాణ్ కూడా అరెస్ట్ అయ్యారు.
కక్ష సాధింపులో భాగంగా..
మరో వైపు నకిలీ మద్యం కేసుకు సంబంధించిన ప్రశ్నలు గుప్పిస్తున్న, సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసింది. మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలోని నేతల ఇళ్లపై పోలీసులు ఈ తెల్లవారుజామున దాడులు చేశారు. ఇందులో మేడపాటి నాగిరెడ్డితో పాటు బీసీ సెల్ అధ్యక్షుడు కుంచం జయరాజు కూడా ఉన్నారు. వాళ్ల సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నట్లు సమాచారం. అయితే..

మంత్రి లోకేష్,మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెట్టారని, టీడీపీ నేతలు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్‌లో ఫిర్యాదు చేశారని, అందుకే విచారణ జరుపుతున్నామని పోలీసులు అంటున్నారు.
ఇదీ చదవండి: అమౌంట్ తగ్గితే వసంత బావ ఊరుకోడు!