
తాడేపల్లి: డబ్బుకోసం ఏదైనా చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధపడతారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. అందుకు మెడికల్ కాలేజీలను అమ్మకానికి పెట్టడమే ఉదాహరణ అని పేర్ని నాని మండిపడ్డారు. ఈ రోజు(మంగళవారం, అక్టోబర్ 7వ తేదీ) తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన పేర్ని నాని.. చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపై ధ్వజమెత్తారు.
‘ ఈ నెల 9న నర్సీపట్నం మెడికల్‌కాలేజ్ సందర్శనకు వైఎస్ జగన్ వెళ్తారు. మేము ప్రజల నుంచి సంతకాల సేకరణ చేపడతాం. ప్రభుత్వంపై ప్రజాగ్రహం ఏ విధంగా ఉందో గవర్నర్‌కు చూపిస్తాం. మా హయాంలో మద్యం అమ్మకాలపై కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా అదేడిస్టరీలను కొనసాగించారు.
కూటమి ప్రభుత్వంలో నకిలీ మద్యం తయారవుతోంది. ఈ ప్రభుత్వానికి అంతిమ గడియలు వచ్చాయి. ఆఫ్రికా వెళ్లి నకిలీ మద్యం తయారీకి టీడీపీ నేతలు ట్రైనింగ్ తీసుకున్నారు. నకిలీ మద్యం తయారీ వ్యవహారంలో ఎక్సైజ్ శాఖ మంత్రికి ముడుపులు అందుతున్నాయి’ అని మండిపడ్డారు.
ఇదీ చదవండి:
ప్రైవేటీకరణపై వైఎస్సార్‌సీపీ పోరు.. ఇక రచ్చబండ, ధర్నాలు..