కల్తీ పాలకు మరో ప‍్రాణం బలి.. ఐదుకు చేరిన మృతులు | Death toll in adulterated milk incident rises to five | Sakshi
Sakshi News home page

కల్తీ పాలకు మరో ప‍్రాణం బలి.. ఐదుకు చేరిన మృతులు

Feb 24 2026 7:41 PM | Updated on Mar 4 2026 6:03 PM

Death toll in adulterated milk incident rises to five

సాక్షి రాజమండ్రి: కల్తీ పాల ఘటనలో దురదృష్టవశాత్తు మరోకరు ప్రాణాలు వదిలారు. విశాఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు ఈ రోజు ప్రాణాలు వదిలారు. దీంతో మృతిచెందిన వారి సంఖ్య ఐదుకు చేరుకుంది. అయితే కల్తీపాలు తాగి ఇదివరకూ నలుగురు మృతి చెందగా పలువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

కల్తీ పాలు తాగి ఇదివరకే దివాన్ చెరువుకు చెందిన మంచి రాధాకృష్ణమూర్తి, లాలా చెరువు ప్రాంతానికి చెందిన  యాళ్ళ శేషగిరిరావు మృతి చెందగా.. అంతకుముందు, చౌడేశ్వరి నగర్‌కు చెందిన తాడి కృష్ణవేణి, లాలా చెరువు చెందిన కనక రత్నం సహా మరొకరు చనిపోయారు. ఇద్దరు చిన్నారుల ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వారికి వెంటిలేషన్‌పై చికిత్స అందిస్తున్నారు. తాజాగా వీరిలో ఒక బాలుడు మృతి చెందారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement