
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఇబ్రహీంపట్నంలో భారీగా కల్తీ మద్యం బయటపడింది. నకిలీ మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. టీడీపీ నేత అద్దేపల్లి జనార్ధనరావు గోడౌన్‌గా గుర్తించారు. జనార్ధన్ సోదరుడు జగన్మోహన్‌రావు, అనుచరుడు కట్టా రాజులను ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జగన్మోహన్‌రావు, కట్టా రాజు ఇచ్చిన సమాచారంతో జనార్ధనరావు గోడౌన్‌లో తనిఖీలు చేపట్టారు. గోడౌన్‌లో భారీగా నకిలీ మద్యం స్వాధీనం చేసుకున్నారు.
నకిలీ మద్యం బాటిళ్లకు లేబుల్స్ సీలింగ్ చేసే మిషన్లు, 35 లీటర్ల కెపాసిటీ కలిగిన 95 క్యాన్లు సీజ్ చేశారు. హోలోగ్రామ్ స్టిక్కర్లు , వందల కొద్దీ ఖాళీ బాటిళ్లు, కేరళ మార్ట్, ఓఎస్‌డీ బ్రాండ్లకు చెందిన స్టిక్కర్లు స్వాధీనం చేసుకున్నారు. స్పిరిట్, కారిమిల్‌ను మిక్స్ చేసి నకిలీ మద్యాన్ని నిందితులు సిద్ధం చేసినట్లు పోలీసులు గుర్తించారు. కల్తీ మద్యం కేసులో టీడీపీ నేత, ఏ1 జనార్థన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. జనార్ధన్ ఆఫ్రికా పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. జనార్ధన్ విదేశాల్లో ఉన్నట్లు తెలిసిందని ఎక్సైజ్ సీఐ తెలిపారు.
మరోవైపు, అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో ఎక్సైజ్ దాడులు కొనసాగుతున్నాయి. నకిలీ మద్యం తయారీ డంప్‌వద్ద బయటపడ్డ డైరీ ఆధారంగా ఎక్సైజ్ పోలీసులు సోదాలు చేపట్టారు. పీటీఎం మండలం సోంపల్లి గ్రామంలో బెల్ట్‌షాపుపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. పక్క జిల్లాలకు కల్తీ మద్యం సరఫరా చేసినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి.