
సాక్షి, కృష్ణా: చంద్రబాబు, పవన్, లోకేష్.. గత 16 నెలలుగా ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి పేర్ని నాని. ఎన్నికల ముందు సరసమైన ధరలకే నాణ్యమైన మద్యమని చెప్పి అధికారంలోకి వచ్చిన ఏకైక ప్రభుత్వం కూటిమిదే అని ఎద్దేవా చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఇక నుంచి కలుగు నాయుడు అని పిలవాలని అన్నారు. ఎన్నికల సమయంలో తప్ప ఆయన.. ఆ కలుగు నుంచి బయటకు రారంటూ సెటైర్లు వేశారు.
మాజీ మంత్రి పేర్ని నాని తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు తనకు పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచాడు. అప్పట్నుంచి ప్రతీ ఒక్కరికీ వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నాడు. 85 లక్షల మంది పిల్లలకు తల్లికి వందనం వేస్తాను అన్నాడు. కేవలం 40 లక్షల మందికి ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. జగన్‌ను విమర్శించి.. ఇప్పుడు తల్లికి వందనంలో కోత పెట్టాడు. ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఏడాదికి 15 వేలు వేస్తానని చెప్పారు. ఒక సంవత్సరం అయిపోయింది. రెండో సంవత్సరం కోతలు కోసి జగన్ వేసిన వారికే వేశారు. జగన్ వాహనమిత్ర వేసినప్పుడు హేళనగా నవ్వారు. ఈ రోజు సిగ్గు ఎగ్గు లేకుండా డ్రైవర్లందరికీ వెన్నుపోటు పొడిచాడు.
పేదలకు ఇళ్లు ఇస్తానని చెప్పాడు కొత్త ఇల్లు ఒక్కటి కూడా ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు. ప్రజలకు పథకాలు అరకొరగా ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మందుబాబులకు కూడా చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు. పవన్ కల్యాణ్‌ను ఇకపై కలుగు నాయుడు అని పిలవాలి. ఆ కలుగు నాయుడు కలుగులో నుంచి బయటకు రాడు. ఎన్నికలకు ముందు బయటకు వస్తాడు.. అరుస్తాడు, రెచ్చిపోతాడు. తలకాయ బాదుకుంటాడు.. ఊగిపోతాడు, తూగిపోతాడు, జుట్టు పీక్కుంటాడు. ఆడ పిల్లకు అన్యాయం జరుగుతుంటే.. అఘాయిత్యాలు జరుగుతుంటే కలుగులో నుండి బయటకు రాడు.

వైఎస్ జగన్ ఉన్నప్పుడు మెక్డొనాల్డ్ లేదు, బ్యాక్ పైపర్, మాన్షన్ హౌస్ లేదన్నారు. మరి ఇప్పుడు దొరికే మందు పేరేంటి.. చంద్రబాబు బ్రాండేనా?. టీడీపీ ప్రభుత్వం ఆఫ్రికా నుండి కొత్త ఫార్ములా తెచ్చి కొత్త మందు అమ్ముతున్నారు. సూపర్ సిక్స్ బ్రాండ్, స్పెషల్ స్టేటస్ బ్రాండ్ మందు అంటున్నారు. రాయలసీమలో 2, ఎన్టీఆర్ జిల్లాలో 1, ఉత్తరాంధ్రలో కూడా ఉన్నాయని ఉందని ఎక్సైజ్ అధికారులే చెబుతున్నారు. టీడీపీ నాయకులను ఆఫ్రికా పంపి కల్తీ మద్యం తయారీ శిక్షణ ఇస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ప్రజలారా మద్యం సేవించడం మానేయండి. లేదా త్రాగకుండా ఉండలేకుంటే మాత్రం కొన్న బార్ వద్దే వాసన చూసి గుర్తుపట్టి తీసుకెళ్లండి. మీ కుటుంబం ముఖ్యం.. కల్తీ మందు తాగి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు’ అని సూచించారు.