సాక్షి, బాపట్ల: జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. చెరువులోకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. నగరం మండలం చిలకావారిపాలెంలో వద్ద ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నెల 7న కొవ్వూరు గ్రామన్ బ్రిడ్జి వద్ద ట్రావెల్స్ బస్సు దగ్ధమైన సంగతి తెలిసిందే. ఖమ్మం నుంచి వైజాగ్ వెళ్తున్న ఆర్‌ఆర్‌ఆర్ ట్రావెల్ బస్సుగా గుర్తించారు. డ్రైవర్ అప్రమత్తం కావడంతో బస్సులో ఉన్న 10 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
మంటలు చెలరేగడానికి షార్ట్ సర్క్యూటే కారణమని డ్రైవర్ తెలిపాడు. సుమారు అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో ఘటన జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.


