పాక్‌ నుంచి విమానం.. అడ్డుకున్న ఐఏఎఫ్

IAF Forces Stop Cargo Plane At Jaipur - Sakshi

జైపూర్‌: పాకిస్తాన్ వైపు నుంచి అనుమతి లేని వాయుమార్గంలో భారత భూభాగంలోకి ప్రవేశించిన జార్జియన్ ఆంటొనోవ్-12 కార్గో విమానాన్ని భారత వాయిసేన గగణతలంలో అడ్డుకుంది. ఐఏఎఫ్ సుఖోయ్‌లు కార్గో విమానాన్ని అడ్డుకుని జైపూర్ ఎయిర్‌ బేస్‌లో విమానాన్ని దింపింది. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం జైపూర్‌లో చోటుచేసుకుంది. అనంతరం విమాన సిబ్బందిని ప్రశ్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కచ్ ప్రాంతంలోని రణ్‌లో కీలకమైన ఎయిర్ బేస్‌కు 70 కిలోమీటర్ల ఉత్తరంగా ఎఎన్-12 కార్గో భారత గగనతలంలోకి ప్రవేశించడాన్ని అధికారులు గుర్తించారు. వెంటనే స్పందిన ఎయిర్‌ఫోర్స్‌ సిబ్బంది.. విమానాన్ని అడ్డుకుని జైపూర్‌ బేస్‌లో దింపింది. విమానంలో ఉన్న సామగ్రిని తనిఖీ చేసేందుకు, వారి నుంచి మరిన్ని వివారలను రాబట్టేందుకు ఐఏఎఫ్ తమ బృందాన్ని జైపూర్‌కు పంపింది. కార్గో విమానాన్ని ఎయిర్ ఫోర్స్ బేసెస్ తమ రాడార్లలో గుర్తించడంతో వివానాన్ని అడ్డుకోగలిగామని ఎయిర్‌పోర్స్‌ సిబ్బంది తెలిపింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top