
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్ర దాడికి ప్రతిగా భారత వైమానిక దళం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌కు ఉగ్రమూకలతో అంటకాగుతున్న విషయం మరోసారి బట్టబయలైందని హోం మంత్రి అమిత్ షా చెప్పారు.
మన బలగాలు పాక్‌తోపాటు పీవోకేలో 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశాక ఆ దేశం కొన్ని పౌర, సైనిక లక్ష్యాలపై మాత్రం దాడి చేయగలిగిందన్నారు. అనంతరం, మన ఆర్మీ సరిహద్దుల ఆవల 100 కిలోమీటర్ల దూరం చొచ్చుకెళ్లి పాక్ వైమానిక సామర్యా్ధన్ని తీవ్రంగా దెబ్బతీయగలిగిందని చెప్పారు. సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్) ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు.