తైపీ: తైవాన్ రాజధాని తైపీలో శుక్రవారం సాయంత్రం ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి జనంపై కత్తి, పొగ గ్రనేడ్‌తో దాడికి దిగాడు. ఈ ఘటనలో కనీసం ముగ్గురు మరణించారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. తర్వాత నిందితుడు ఓ భవనం ఆరో అంతస్తు నుంచి కిందికి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతడిని 27 ఏళ్ల చాంగ్ వెన్‌గా గుర్తించారు.
ఈ సందర్భంగా తైవాన్ ప్రీమియర్ చో జంగ్-తాయ్ మాట్లాడుతూ.. రాజధాని తైపీలోని మెట్రో స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది. నిందితుడు చాంగ్ వెన్‌కు నేర చరిత్ర ఉంది. అతడిపై వారెంట్లు కూడా ఉన్నాయి. అతను ఉద్దేశపూర్వకంగా స్మోక్ బాంబులను విసిరి.. ప్రజలపై విచక్షణారహితంగా దాడులు చేశాడు. ఇందుకోసం పొడవైన కత్తిని ప్రయోగించినట్లు కనిపిస్తోంది అని చెప్పుకొచ్చారు. మరోవైపు.. ఈ దాడి ఘటనకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.
BREAKING: 3 killed, 5 injured as knife attacker goes on rampage in central Taipei, Taiwan after setting off smoke bombs at main train station — Reuters pic.twitter.com/04zgmAZs8T
— Rapid Report (@RapidReport2025) December 19, 2025


