తైపీ: తైవాన్‌లోని అత్యంత ఎత్తైన భవనం తైపీ 101ను అమెరికన్ రాక్ క్లైంబర్ అలెక్స్ హోనాల్డ్ అధిరోహించారు. 508 మీటర్ల ఎత్తున్న ఈ భవనాన్ని ఆయన ఎలాంటి తాళ్లు, రక్షణ పరికరాలు లేకుండా ఎక్కేశారు. ఆదివారం నాడు ఆయన చేసిన ఈ సాహసాన్ని చూసేందుకు వేలాది మంది తరలివచ్చారు. వారి హర్షధ్వానాల మధ్య అలెక్స్ సునాయాసంగా ఎక్కేశారు.
తైపీ 101 భవనం ఒక మూలలో ఉన్న ఎల్ ఆకారపు నిర్మాణాల సాయంతో ఆయన అధిరోహించారు. టవర్‌పై ఉన్న అలంకార నిర్మాణాలను తప్పించుకుంటూ యుక్తితో ఎక్కేశారు. 1,667 అడుగులు ఎత్తున్న భవనాన్ని ఎక్కేందుకు ఆయనకు గంటన్నర సమయం పట్టింది. ఐకానిక్ భవనంపైకి అలెక్స్ ఆరోహణను నెట్‌ఫ్లిక్స్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. శనివారమే ఆరోహణ జరగాల్సి ఉన్నా.. వర్షం కారణంగా ఆదివారానికి వాయిదా పడింది.
గతంలో అలెక్స్ కాలిఫోరి్నయాలోని యోస్మైట్ నేషనల్ పార్క్‌లో ఉన్న ఎల్ కాపిటన్‌ను కూడా తాడు సాయం లేకుండా అధిరోహించి రికార్డు సాధించారు. భవనంలో 101 అంతస్తులు ఉన్నాయి. వాటిలో కష్టతరమైన భాగం 64 అంతస్తుల మధ్య భాగం. భవనానికి సిగ్నేచర్ లుక్ ఇచ్చే ఈ విభాగంలో వెదురు పెట్టెలు ఉంటాయి. ఈ ఆకాశహారమ్యన్ని ఎలాంటి తాడు సాయం లేకుండా అధిరోహించిన మొదటి వ్యక్తి అలెక్స్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఈ భవనం ప్రారంభం రోజే, 2004లో క్రిస్మస్ రోజున ఫ్రెంచ్ రాక్ క్‌లైంబర్ అలైన్ రాబరŠట్ట్ అధిరోహించారు. ఆయన తాళ్లు, జీను సాయంతో ఎక్కారు. భవనంపైకి చేరుకోవడానికి ఆయనకు నాలుగు గంటల సమయం పట్టింది.


