ప్రకటించిన తైవాన్..ఖండించిన చైనా
తైపీ: అమెరికాతో అత్యుత్తమ వాణిజ్య ఒప్పందం కుదిరిందని తైవాన్ ప్రధాని చో టుంగ్–టై ప్రకటించారు. అమెరికాతో వాణిజ్యంలో మిగులు ఉన్నప్పటికీ ఈ ఒప్పందం కుదరడంపై హర్షం వ్యక్తం చేశారు. తాజా ఒప్పందం ప్రకారం తైవాన్ ఉత్పత్తులపై 15 శాతం వరకు టారిఫ్‌లు తగ్గుతాయి. ప్రతిగా అమెరికాలో 25 వేల కోట్ల డాలర్ల మేర తైవాన్ కంపెనీలు పెట్టుబడులుగా పెడతాయి.
ఇప్పటికే అమెరికా యూరోపియన్ యూనియన్, జపాన్‌లతో ఇలాంటి ఒప్పందాలే కుదుర్చుకుంది. ట్రంప్ ప్రభుత్వం తైవాన్‌పై వాస్తవానికి 32 శాతం టారిఫ్‌లను విధించింది. ఆ తర్వాత దానిని 20 శాతానికి తగ్గించింది. కాగా, తైవాన్‌తో అమెరికా తాజా వాణిజ్య ఒప్పందాన్ని చైనా వ్యతిరేకించింది. తమ భూభాగమైన తైవాన్‌తో దౌత్య సంబంధాలను నెలకొల్పుకోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తామంది.


