breaking news
Smoke bombs
-
లాస్ ఏంజెలెస్ రణరంగం
లాస్ ఏంజెలెస్: అధ్యక్షుడు ట్రంప్ తన అసాధారణ అధికారాలను ఉపయోగించి నేషనల్ గార్డ్లను రంగంలోకి దింపడంతో మరింత పేట్రేగిపోయిన ఆందోళనకారులు తమ ఉద్యమాన్ని ఉదృతంచేశారు. రోడ్లపై కనిపించిన కారునల్లా దహనంచేసి ఉద్యమాగి్నజ్వాలల్ని మరింత రగిలించారు. దీంతో లాస్ ఏంజెలెస్ నగర వీధులు ఒక్కసారిగా రణరంగంగా మారిపోయాయి. అక్రమవలసదారులను ఫెడరల్ ఏజెంట్లు, ఎఫ్‌బీఐ, పోలీసులు అరెస్ట్‌చేయడాన్ని వేలాది మంది ఆందోళనకారులు నిరసించడంతో మొదలైన ఉద్యమం నెమ్మదిగా ఉగ్రరూపం దాల్చుతోంది. ఓవైపు సరైన డాక్యుమెంట్లులేని వలసదారులను అధికారులు అదుపులోకి తీసుకుంటూ, ఆ అధికారులు, ప్రభుత్వ భవనాలకు రక్షణగా నేషనల్ గార్డ్లను ట్రంప్ సర్కార్ రంగంలోకి దింపడంతో నిరసనకారులు మరింతగా రెచ్చిపోయారు. ఫ్రీవే మూసివేత పారామౌంట్ పట్టణంలోని ప్రధాన రహదారిని దిగ్బంధించారు. దక్షిణదిశలో వాహనాల రాకపోకలకు ఉపయోగించే 101 నంబర్ ఫ్రీవే రహదారిని మూసేశారు. అడ్డుకునేందుకు వచ్చిన కాలిఫోర్నియా హైవే పెట్రోల్ అధికారులపైకి నిరసనకారులు చేతికొచ్చిన వస్తువుతో విరుచుకుపడ్డారు. కాంక్రీట్ ముక్కలు, రాళ్లు, ఎలక్ట్రిక్ స్కూటర్ విడిభాగాలు, బాణసంచాను అధికారులపైకి విసిరేశారు. వేలాదిగా ఆందోళనకారులు గుమికూడడంతో వెంటనే అందరూ ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని లేదంటే అరెస్ట్‌లు తప్పవని పోలీసులు మెగాఫోన్‌లో ప్రకటించారు. అక్రమవలసల ఏరివేత కోసం నేషనల్ గార్డ్లను ఉపయోగించబోమని, కేవలం అధికారులు, డిటెన్షన్ సెంటర్ భవనాల రక్షణ నిమిత్తమే వాళ్లను రప్పించామని లాస్ఏంజెలెస్ పోలీస్ చీఫ్ జిమ్ మెక్‌డొనెల్ చెప్పారు. డజన్ల కొద్దీ ఆందోళనకారులను అరెస్ట్చేశామని తెలిపారు. పెట్రోల్ బాంబు విసిరినందుకు ఒకరిరి, అధికారులను బైక్‌తో ఢీకొట్టినందుకు మరొకరిని అరెస్ట్‌చేశారు. ఫేస్ మాస్క్ లు ధరించొద్దు ఫేస్‌మాస్క్ ధరించి ఆందోళనల్లో పాల్గొంటే ఉపేక్షించేది లేదని అధ్యక్షుడు ట్రంప్ స్పష్టంచేశారు. ఫేస్‌మాస్క్‌తో ఎవరు కనిపించినా అరెస్ట్ చేయండని అధికారులకు ట్రంప్ తన సొంత సోషల్ మీడియా మాధ్యమం ‘ట్రూత్ సోషల్’ ద్వారా సూచించారు. ఉదయాన్నే నేషనల్ గార్డ్లు రావడంతో ఆందోళనకారుల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది. రాష్ట్ర పోలీసులు ఉండగా ఫెడరల్ సాయుధవిభాగమైన మీకు ఇక్కడేం పని అంటూ అందోళనకారులు వారితో వాగ్వాదానికి దిగారు. ‘‘ సిగ్గులేదు. ఇంటికి పొండి’’ అంటూ ఎద్దేవాచేశారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు బలగాలు పొగబాంబులు, భాష్పవాయుగోళాలు, ఫ్లాష్‌బ్యాంగ్ గ్రనేడ్లను ప్రయోగించారు. దీంతో వాహనాల రాకపోకలను ఆందోళనకారులు 101 ఫ్రీవేపై నిలిపేశారు. సాయంత్రంకల్లా రాష్ట్ర పెట్రోల్ అధికారులు వారిని చెదరగొట్టి రహదారిపై రాకపోకలను పునరుద్దరించారు. దీంతో ఆగ్రహించిన నిరననకారులు అక్కడే నిలిపి ఉంచిన నాలుగు స్వయంచోదిత(సెల్ఫ్ డ్రైవింగ్) వేమో సంస్థ కార్లకు నిప్పంటించారు. మంటలు అంతటా అంటుకోవడంతో ఆ కార్ల నుంచి పేలుడు శబ్దాలు వినిపించాయి. గూగుల్‌కు చెందిన ఈ కార్లు రోబోట్యాక్సీ సేవలందిస్తున్నాయి. ఉద్యమకారులు రెచ్చిపోతుండటంతో అధికారులు వెంటనే లాస్ఏంజెలెస్ డౌన్‌టౌన్ ప్రాంతాల్లో జనసంచారంపై నిషేధాజ్ఞలు విధించారు. గుమికూడితే అరెస్ట్‌చేస్తామని అనౌన్స్మెంట్ ఇచ్చారు. సమాఖ్య విధానాన్ని కాలరాయడమే ‘‘ కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉద్యమాలు వెల్లువెత్తితే సద్దుమణిగేలా చేసే బాధ్యత ఆ రాష్ట్రానిదే. మా రాష్ట్రంలో సమస్యలుంటే మేం పరిష్కరించుకుంటాం. నేషనల్ గార్డ్లను రంగంలోకి దింపాల్సిన అవసరమేంటి?. గార్డ్లను దింపి సమాఖ్య విధానానికి ట్రంప్ సర్కార్ తూట్లుపొడుస్తోంది. ఇది రాష్ట్రాల సార్వ¿ౌమత్వానికి తీవ్ర విఘాతం కల్గించడమే. అధ్యక్షుడి నిర్ణయాన్ని నేను న్యాయస్థానంలో సవాల్ చేస్తా’’ అని డెమొక్రటిక్ పార్టీ నేత, కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ నూసమ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. గవర్నర్ అనుమతి, ఆమోదంలేకుండా కాలిఫోర్నియా రాష్ట్రంలోకి నేషనల్ గార్డ్లను కేంద్రప్రభుత్వం రప్పించడం ఇటీవలి దశాబ్దాల్లో ఇదే తొలిసారి. చివరిసారిగా 1965లో నాటి దేశాధ్యక్షుడు లిండన్ బి.జాన్సన్ అలబామాలో పౌరహక్కుల ఉద్యమాన్ని అదుపులోకి తెచ్చేందుకు అమెరికాసైన్యంలో రిజర్వ్ బలగాలైన ‘నేషనల్ గార్డ్’లను రప్పించారు. ‘‘ఆందోళనకారులు శాంతించాలి. నేషనల్ గార్డ్లను తీసుకొచ్చి ఆందోళనకారుల ఆగ్రహజ్వాలలను ట్రంప్ మరింత రాజేశారు. ప్రజలకు రక్షణగా వాళ్లను రప్పించినట్లు కనిపించట్లేదు. ట్రంప్‌కు మరేదో ఎజెండా ఉన్నట్లుంది’’ అని లాస్ ఏంజెలెస్ నగర మహిళా మేయర్ కరెన్ బాస్ వ్యాఖ్యానించారు. ఆందోళనలు తొలుత లాస్ ఏంజెలెస్ డౌన్టౌన్లో మొదలు తర్వాత పారామౌంట్ పట్టణానికి పాకి ప్రస్తుతం సమీప కాంప్టన్ పట్టణంలో విస్తరిస్తున్నాయి. గత వారంతానికి 100 మందికిపైగా అక్రమవలసదారులను ఫెడరల్ ఏజెంట్లు అరెస్ట్‌చేసి డిటెన్షన్ సెంటర్లకు తరలించారు. శాన్ ఫ్రాన్సిస్కోలో 60 మందిని అరెస్ట్‌చేశారు.విదేశీ జర్నలిస్ట్‌లకు గాయాలు డౌన్‌టౌన్ లాస్ఏంజెలెస్లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్ నుంచి వలసదారులను విడిచిపెట్టాలని ఉద్యమకారులు నినాదాలుచేశారు. అప్పుడు అక్కడ ఆ్రస్టేలియాకు చెందిన 9న్యూస్ టీవీఛానెల్ మహిళా పాత్రికేయురాలు లారెన్ థామస్ రిపోరి్టంగ్ చేస్తున్నారు. అదే సమయంలో ఉద్యమకారులను చెదరగొట్టేందుకు నగర పోలీసులు, నేషనల్ గార్డ్ బలగాలు రబ్బర్ బుల్లెట్ల గన్లను పేల్చారు. దీంతో ఒక రబ్బర్ బుల్లెట్ లారెన్‌కు తగిలింది. ప్రత్యక్ష ప్రసారం వేళ ఈ ఘటన జరిగింది. విలవిల్లాడుతున్న ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. బ్రిటిష్ ఫొటోజర్నలిస్ట్ నిక్ స్టెర్న్‌కు సైతం రబ్బర్ బుల్లెట్ తగలి ఐదు సెంటీమీటర్ల లోతు గాయమైంది. ట్రంప్ రెండోసారి అధికార పగ్గాలు స్వీకరించాక దేశవ్యాప్తంగా 1,00,000 మందిని అరెస్ట్‌చేసినట్లు ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్(ఐసీఈ) విభాగం ప్రకటించింది. ట్రంప్ అధ్యక్షుడైన తొలి 100 రోజుల్లో రోజుకు 660 మంది చొప్పున అరెస్ట్‌చేశారు. గురువారంనాటికి డిటెన్షన్ సెంటర్లలో ఏకంగా 54,000 మంది వలసదారులున్నారు. నేషనల్ గార్డ్లను రప్పించడానికి శ్వేతసౌధం సమరి్థంచుకుంది. కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ అసమర్థ పాలన కారణంగా ఇమిగ్రేషన్ అధికారులకు రక్షణ కరువైంది. అందుకే గార్డ్లను అనుమతించాం’’ అని శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరోలిన్ లెవిట్ చెప్పారు. లాస్ ఏంజెలెస్‌లో కొన్ని చోట్ల ఆందోళనకారులు దుకాణాలను లూటీచేశారని పోలీసులు చెప్పారు. పరిస్థితి చేయిదాటితే 500 మంది నేవీ మెరైన్లను రప్పిస్తామని యూఎస్ నార్తర్న్ కమాండ్ హెచ్చరించింది. -
సెర్బియా పార్లమెంట్లో గందరగోళం పొగబాంబులతో దాడి..
బెల్గ్రేడ్: బాల్కన్ దేశం సెర్బియా పార్లమెంట్ సమావేశం మంగళవారం వీధి పోరాటాన్ని తలపించింది. ప్రతిపక్ష సభ్యులు స్మోక్ బాంబులు విసరడంతో అవి తాకి ముగ్గురు ఎంపీలు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. విశ్వవిద్యాలయాలకు మరిన్ని నిధులు కేటాయించే విషయమై జరగాల్సిన ఓటింగ్‌ను ప్రతిపక్షాలు గట్టిగా వ్యతిరేకించాయి. ఈ సమావేశం అక్రమమని, ప్రధానమంత్రి మిలోస్ వుసెవిక్, ఆయన ప్రభుత్వం రాజీనామాను వెంటనే ధ్రువీకరించాలని డిమాండ్ చేశాయి. సమావేశం మొదలైన అరగంటలోనే ప్రతిపక్ష సభ్యుల ఈలలు, కేకలతో పార్లమెంట్ దద్దరిల్లింది. ఎంపీలు ముష్టిఘాతాలు కురిపించుకుంటున్నారు. ఆ తర్వాత పొగబాంబులు, కోడిగుడ్లు, వాటర్ బాటిళ్లను విసిరేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. ప్రతిపక్షం ఉగ్రవాద ముఠాగా మారిపోయిందని స్పీకర్ అనా బిర్నాబిక్ అభివర్ణించారు. అదే సమయంలో పార్లమెంట్ వెలుపల ప్రతిపక్షాల మద్దతుదారులు ర్యాలీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో చోటుచేసుకున్న ఘటన దేశంలో రాజకీయ సంక్షోభం తీవ్రతను చెప్పకనే చెబుతున్నాయి. వుసెవిక్ ప్రభుత్వం గద్దెదిగి, ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే విద్యార్థుల డిమాండ్‌కు అనుగుణంగా యూనివర్సిటీలకు నిధుల పెంపుపై చర్చ సాధ్యమని వామపక్ష నేత రదోమిర్ లజోవిక్ తేల్చి చెప్పారు. గతేడాది నవంబర్‌లో కాంక్రీట్ నిర్మాణం కూలి 15 మంది చనిపోయారు. దీంతోపాటు మరికొన్ని ఘటనలను ఉదహరిస్తూ అవినీతి పెరిగిపోయిందంటూ విద్యార్థులు భారీ నిరసనలు చేపడుతున్నారు. విద్యారంగానికి ఎక్కువ నిధులు తదితర డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిణామాలతో ప్రధాని వుసెవిక్ జనవరిలో తన పదవికి రాజీనామా చేశారు. అయితే, పార్లమెంట్ ఆమోదిస్తేనే ప్రధాని రాజీనామా అమలవుతుంది. అధ్యక్షుడు అలెక్జాండర్ వుసిక్కు చెందిన అధికార సెర్బియన్ ప్రోగ్రెసివ్ పార్టీకి పార్లమెంట్లో మెజారిటీ ఉండటంతో వుసెవిక్ ప్రభుత్వం కొనసాగుతోంది. -
న్యూయార్క్‌లో కాల్పుల కలకలం!
Brooklyn Subway Attack Details: అమెరికాలో న్యూయార్క్ నగరం కాల్పులతో ఉలిక్కి పడింది. బ్రూక్లిన్ సబ్ వే స్టేసన్ వద్ద మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పలువురి ప్రయాణికులపై ముసుగులో వచ్చిన ఆంగతకుడు విచ్చగల విడిగా కాల్పులు జరిపాడు. అంతకు ముందు స్మోకింగ్ గ్రెనేడ్‌తో దాడి చేసినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ దాడిలో 13 మంది గాయపడినట్లు సమాచారం. ఎవరైనా చనిపోయారా? అన్నది అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది. బ్రూక్లిన్‌లోని సన్‌సెట్ పార్క్‌లోని 36వ స్ట్రీట్ స్టేషన్లో ఈ ఘటన జరిగింది. అయితే.. రైల్వే స్టేషన్లో భారీ పేలుడు కూడా సంభవించినట్లు కథనాలు వస్తున్నాయి. ఘటనలో ఆరుగురు మరణించారని, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ కథనాలను అధికారులు మాత్రం ఇంకా ధృవీకరించలేదు. అలాగే పేలుడు పదార్థాలను సైతం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పలేదు. కానీ, న్యూయార్క్‌లో హైఅలర్ట్ మాత్రం ప్రకటించారు. ఇదిలా ఉంటే.. బ్రూక్లిన్ ఫోర్త్ ఎవెన్యూ 36వ స్ట్రీట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. సబ్వే నుంచి భారీగా పొగలు వస్తుండడం, సహాయక చర్యల నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది ఉగ్రదాడేనా? కాదా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఎన్వై 1 న్యూస్ మాత్రం.. అనుమానితుడు కన్స్ట్రక్షన్ వర్కర్ ముసుగులో గ్యాస్ మాస్క్‌తో దాడికి పాల్పడినట్లు కథనం ప్రచురించింది. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో రక్తపు మడుగులో ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. In regard to the multiple people shot at the 36th Street subway station in Brooklyn, there are NO active explosive devices at this time. Any witnesses are asked to call @NYPDTips at #800577TIPS. Please stay clear of the area. More provided information when available. pic.twitter.com/8UoiCAXemB — NYPD NEWS (@NYPDnews) April 12, 2022 Very dramatic video from the incident as the subway arrived at 36th St Sunset Park in Brooklyn. #brooklyn #shooting #nyc pic.twitter.com/5cOdeYPIb1 — Kristoffer Kumm (@Kristofferkumm) April 12, 2022 🚨 Breaking 🚨 #Brooklyn subway shooting pic.twitter.com/0J2kcy0rXP — Malcom Boyce (@MeetMalcom) April 12, 2022 -
విమానాశ్రయాన్ని దిగ్బంధిస్తున్న తాలిబన్లు
కాబూల్: అఫ్గాన్ నుంచి పశ్చిమ దళాల తరలింపు గడువు దగ్గరపడుతుండడంతో పలువురు అఫ్గాన్ పౌరులు దేశం విడిచిపోయేందుకు కాబూల్ విమానాశ్రయానికి చేరుకుంటున్నారు. దీంతో తాలిబన్లు ప్రజలు రాకుండా అడ్డుకొనేందుకు అదనపు సిబ్బందిని మోహరించడంతో పాటు విమానాశ్రయానికి వెళ్లే దారుల్లో అదనంగా మరిన్ని చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. అఫ్గాన్ సైన్యం నుంచి స్వాధీనం చేసుకున్న వాహనాలతో తాలిబన్ దళాలు కాబుల్ రహదారులపై పహారా కాస్తున్నారు. అమెరికా దళాలు వైదొలిగిన వెంటనే మొత్తం విమానాశ్రయాన్ని స్వాధీనం చేసుకుంటామని తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా చెప్పారు. తాలిబన్ల దిగ్బంధంతో విమానాశ్రయం వెలుపల ఇప్పటివరకు ఉన్న రద్దీ దృశ్యాలు కనుమరుగయ్యాయి. శనివారం విమానాశ్రయానికి వచ్చే రోడ్డుపై తాలిబన్లు కొన్ని వార్నింగ్షాట్లు పేల్చడంతో పాటు, హెచ్చరికగా స్మోక్ బాంబులను ప్రయోగించారు. చుట్టుముట్టిన ఆర్థిక సంక్షోభం విదేశాల నుంచి సహాయం ఆగిపోవడంతో అఫ్గాన్‌లో ఆర్థిక సంక్షోభం అలముకుంది. పలువురు ఉద్యోగులు, సామాన్య ప్రజలు బ్యాంకుల ముందు, ఏటీఎంల ముందు నగదు కోసం క్యూ కట్టారు. దీంతో ఏటీఎంల్లో విత్‌డ్రాను 24గంటలకు 200 డాలర్లకు పరిమితం చేశారు. అలాగే ప్రతి కస్టమర్ వారానికి 200 డాలర్లు బ్యాంకు నుంచి విత్‌డ్రా చేసుకునే వీలు కల్పించాలని అఫ్గాన్ కేంద్ర బ్యాంకు అన్ని బ్యాంకులను ఆదేశించింది. కానీ ఇవన్నీ తాత్కాలిక ఉపశమన ఏర్పాట్లేనని నిపుణులు అంటున్నారు. తాలిబన్లు అందరినీ కలుపుకుపోతూ ప్రజాస్వామ్యయుతం గా వ్యవహరిస్తే తప్ప విదేశీ సాయం అందడం కష్టంగా కనిపిస్తోందన్నారు. అఫ్గాన్ బడ్జెట్లో 75 శాతం విదేశీ సాయం ఆధారంగా నడుస్తుంది. -
పేలిన స్మోక్ బాంబులు,ఒకరికి గాయాలు
-
కృష్ణానగర్‌లో పేలిన స్మోక్ బాంబులు
సాక్షి, హైదరాబాద్ : కృష్ణానగర్‌లోని శుక్రవారం ఉదయం ఓ ఇంట్లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం...యూసఫ్‌గూడ శ్రీకృష్ణనగర్ బి బ్లాక్...లోని మొదటి అంతస్తులో సినిమా షూటింగ్స్‌లో సెట్స్‌లో వాడే స్మోక్ బాంబ్స్ పేలినట్లు తెలుస్తోంది. సిలిండర్ల సాయంతో స్మోక్ బాంబులు తయారు చేస్తుండగా అవి హఠాత్తుగా పేలాయి. ఈ ప్రమాదంలో అశోక్ అనే యువకుడి చేతులు, కాళ్లకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. కాగా నిబంధనలు ఉల్లంఘించి స్మోక్ బాంబులు తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆర్మీ రైలులో బాంబుల బాక్సు చోరీ
ఝాన్సీ: ఆర్మీ అధికారులతో వెళ్తున్న ప్రత్యేక రైల్లో స్మోక్ బాంబ్స్‌తో కూడిన ఓ బాక్సును దుండగులు ఎత్తుకెళ్లారు. బోగీకి వేసిన సీలు తొలగించి ఉండటం, బాంబుల తో కూడిన బాక్సు కనిపించకపోవడంతో.. మహా రాష్ట్రలోని పుల్గావ్ నుంచి పంజా బ్లోని పఠాన్‌కోట్ వెళ్తున్న ప్రత్యేక రైలును ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ రైల్వే స్టేషన్ వద్ద నిలిపివేసినట్లు సర్కిల్ ఆఫీసర్ శరద్ ప్రతాప్ సింగ్ తెలిపారు. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారని, దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని బినా–ఝాన్సీల మధ్య రైలు పలు చోట్ల ఆగిందని, చోరీ ఆ రెండు ప్రాంతాల మధ్యే జరిగి ఉండవచ్చని పేర్కొన్నారు. ఝాన్సీ కలెక్టరేట్లో పని చేస్తూ పాక్ గూఢచార సంస్థలకు ఆర్మీ సమాచారం చేరవేస్తున్నాడన్న ఆరోప ణలతో అరెస్టయిన వ్యక్తికీ.. తాజా ఘటనకు సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమా నిస్తున్నారు.