న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.. రక్తమోడిన బ్రూక్లిన్‌ సబ్‌వే

Several Shot At Brooklyn Subway Station Incident Updates - Sakshi

Brooklyn Subway Attack Details: అమెరికాలో న్యూయార్క్‌ నగరం కాల్పులతో ఉలిక్కి పడింది. బ్రూక్లిన్‌ సబ్‌ వే స్టేసన్‌ వద్ద మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పలువురి ప్రయాణికులపై ముసుగులో వచ్చిన ఆంగతకుడు విచ్చగల విడిగా కాల్పులు జరిపాడు. అంతకు ముందు స్మోకింగ్‌ గ్రెనేడ్‌తో దాడి చేసినట్లు నిర్ధారణ అయ్యింది.  ఈ దాడిలో 13 మంది గాయపడినట్లు సమాచారం. ఎవరైనా చనిపోయారా? అన్నది అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది.

బ్రూక్లిన్‌లోని సన్‌సెట్ పార్క్‌లోని 36వ స్ట్రీట్ స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. అయితే.. రైల్వే స్టేషన్‌లో భారీ పేలుడు కూడా సంభవించినట్లు కథనాలు వస్తున్నాయి. ఘటనలో ఆరుగురు మరణించారని, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ కథనాలను అధికారులు మాత్రం ఇంకా ధృవీకరించలేదు. అలాగే పేలుడు పదార్థాలను సైతం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పలేదు. కానీ, న్యూయార్క్‌లో హైఅలర్ట్‌ మాత్రం ప్రకటించారు.

ఇదిలా ఉంటే.. బ్రూక్లిన్‌ ఫోర్త్‌ ఎవెన్యూ 36వ స్ట్రీట్‌ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. సబ్‌వే నుంచి భారీగా పొగలు వస్తుండడం, సహాయక చర్యల నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది ఉగ్రదాడేనా? కాదా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఎన్‌వై 1 న్యూస్‌ మాత్రం.. అనుమానితుడు కన్‌స్ట్రక్షన్‌ వర్కర్‌ ముసుగులో గ్యాస్‌ మాస్క్‌తో దాడికి పాల్పడినట్లు కథనం ప్రచురించింది. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉంటే.. సోషల్‌ మీడియాలో రక్తపు మడుగులో ఫొటోలు, వీడియోలు వైరల్‌ అవుతున్నాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top