కార్తిక పౌర్ణమి పురస్కరించుకుని బుధవారం రాత్రి విజయవాడ ఇంద్రలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థాన ప్రొంగణంలోని శివాలయం వద్ద జ్వాలాతోరణం కార్యక్రమం వైభవంగా నిర్వహించారు.
అంతకు ముందు కోటి దీపోత్సవంలో భాగంగా రాజగోపురం వద్ద లక్ష వత్తుల దీపాన్ని వెలిగించారు. ఆలయ ప్రాంగణాన్ని రంగవల్లులతో తీర్చిదిద్దారు.


