breaking news
sgfi
-
తెలంగాణ స్విమ్మర్లకు నాలుగు పతకాలు
సాక్షి, హైదరాబాద్: స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్జీఎఫ్ఐ) జాతీయ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్లు నాలుగు పతకాలు సాధించారు. న్యూఢిల్లీలో జరుగుతున్న ఈ పోటీల్లో అండర్–19 బాలుర విభాగంలో సుహాస్ ప్రీతమ్ 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో స్వర్ణ పతకం గెలిచాడు. సుహాస్ 2 నిమిషాల 06.28 సెకన్లలో రేసును ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. కేరళ తరఫున బరిలోకి దిగిన ఆంధ్రప్రదేశ్ స్విమ్మర్ మొంగం తీర్థు సామ (2ని:11.24 సెకన్లు) కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. అండర్–19 బాలుర 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లేలో తెలంగాణకు చెందిన ధూళిపూడి వర్షిత్ (4ని:40.41 సెకన్లు) రజత పతకం సంపాదించాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మొంగం తీర్థు సామ (4ని:39.85 సెకన్లు) స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు. అండర్–17 బాలుర 50 మీటర్ల బటర్‌ఫ్లయ్‌లో తెలంగాణకు చెందిన ఇషాన్ దాస్ (25.93 సెకన్లు) రజతం, గౌతమ్ శశివర్ధన్ (26.25 సెకన్లు) కాంస్యం సాధించారు. -
క్రీడా సందడి
ఉత్సాహంగా ఎస్జేఎఫ్ఐ ఎంపికలు అమలాపురం : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్జేఎఫ్ఐ) ఆధ్వర్యాన రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా స్థాయి ఎంపికలు ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగాయి. అండర్–14, అండర్–17 బాలురు, బాలికలకు షటిల్ బ్యాడ్మింటన్, ఫెన్సింగ్, బాక్సింగ్ విభాగాల్లో స్థానిక బాలయోగి స్టేడియంలో శుక్రవారం ఈ ఎంపికలు నిర్వహించారు. దీనికి జిల్లా నలుమూలల నుంచీ 310 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఎంపిక పోటీలను ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు డాక్టర్ మెట్ల వెంకట సూర్యనారాయణ, కోనసీమ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు మెట్ల రమణబాబు, ఎస్జేఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పప్పుల శ్రీరామచంద్రమూర్తి (రాంబాబు) లాంఛనంగా ఆరంభించారు. ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ, అమలాపురం నియోజకవర్గంలో నాలుగుచోట్ల క్రీడా మైదానాలు నిర్మించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. జిల్లా పోటీల్లో ఎంపికైనవారు రాష్ట్రస్థాయికి, అక్కడ ఎంపికైనవారు జాతీయ స్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తారని రాంబాబు తెలిపారు. స్కూల్ గేమ్స్ ఎంపికకు వచ్చే విద్యార్థులకు తొలిసారి భోజన సదుపాయం కల్పించామని చెప్పారు. అనంతరం షటిల్ బ్యాడ్మింటన్, ఫెన్సింగ్, బాక్సింగ్ విభాగాల్లో గెలుపుకోసం క్రీడాకారులు హోరాహోరీగా తలపడ్డారు. ప్రధానోపాధ్యాయులు రంకిరెడ్డి కాశీ విశ్వనాథం, జొన్నలగడ్డ గోపాలకృష్ణ పరిశీలకులుగా వ్యవహరించారు. పీడీ, పీఈటీలు అడబాల శ్రీనివాస్, పాయసం శ్రీనివాస్, కాకిలేటి సూరిబాబు, గొలకోటి నారాయణరావు, గొలకోటి శ్రీనివాస్, కుంపట్ల ఆదిలక్ష్మి, ప్రసాద్, చంద్రశేఖర్, విత్తనాల శ్రీనివాస్, స్టేడియం కోచ్ ఐ.భీమేష్ పాల్గొన్నారు.


