రన్నరప్‌ రాజా రిత్విక్‌  | Grandmaster Raja Rithvik won the second medal | Sakshi
Sakshi News home page

రన్నరప్‌ రాజా రిత్విక్‌ 

Mar 8 2024 1:18 AM | Updated on Mar 8 2024 1:18 AM

Grandmaster Raja Rithvik won the second medal - Sakshi

జాతీయ చెస్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ రాజా రిత్విక్‌ రెండో పతకాన్ని సాధించాడు. ర్యాపిడ్‌ ఫార్మాట్‌లో కాంస్య పతకం నెగ్గిన రిత్విక్‌ గురువారం నాసిక్‌లో జరిగిన బ్లిట్జ్‌ ఫార్మాట్‌లో రన్నరప్‌గా నిలిచి రజత పతకం సాధించాడు.

నిర్ణీత 11 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో రిత్విక్‌ 9 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచాడు. రిత్విక్‌ మొత్తం 11 గేముల్లో ఏడింటిలో గెలిచి, నాలుగింటిని ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచాడు. 9.5 పాయింట్లతో దీప్తాయన్‌ ఘోష్‌ (రైల్వేస్‌) చాంపియన్‌గా నిలిచాడు. 

Advertisement
 
Advertisement
Advertisement