న్యూఢిల్లీ: ‘పాన్ అమ్ కప్ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్’లో భారత ప్లేయర్ ధ్రువ్ సిత్వాలా రన్నరప్‌గా నిలిచాడు. కెనడాలోని విన్నిపెగ్ వేదికగా జరిగిన ఈ టోర్నమెంట్ ఫైనల్లో ధ్రువ్ 972–1500 పాయింట్ల తేడాతో సింగపూర్‌కు చెందిన పీటర్ గిల్‌క్రిస్ట్ చేతిలో ఓటమి పాలై రజత పతకం దక్కించుకున్నాడు. ఆసియా బిలియర్డ్స్ చాంపియన్ ధ్రువ్... తుదిపోరు ఆరంభంలో పూర్తి ఆధిపత్యం కనబర్చాడు.
ఒక దశలో 450 పాయింట్ల ఆధిక్యంలో నిలిచిన ధ్రువ్... చివరి వరకు అదే జోరు కొనసాగించలేకపోయాడు. గిల్‌క్రిస్ట్ వరుసగా మూడు డబుల్ సెంచరీ బ్రేక్‌లతో పుంజుకొని మ్యాచ్‌పై పట్టు బిగించాడు. ఆ తర్వాత కూడా కొన్ని అవకాశాలు వచ్చినా... భారత ప్లేయర్ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. చివర్లో గిల్‌క్రిస్ట్ అజేయంగా 214 పాయింట్ల బ్రేక్ సాధించి విజయాన్ని ఖరారు చేసుకున్నాడు. గతంలో న్యూజిలాండ్ ఓపెన్‌లో గిల్‌క్రిస్ట్‌పై విజయం సాధించిన ధ్రువ్... ఈసారి అతడిపై ఆధిపత్యం కనబర్చలేకపోయాడు.


