పాక్‌తో చివరి టెస్ట్‌కు ఇంగ్లండ్‌ జట్టు ప్రకటన.. యువ ఫాస్ట్‌ బౌలర్‌ కొనసాగింపు | England retain Sonny Baker as Brydon Carse remains out of Edgbaston Test squad | Sakshi
Sakshi News home page

పాక్‌తో చివరి టెస్ట్‌కు ఇంగ్లండ్‌ జట్టు ప్రకటన.. యువ ఫాస్ట్‌ బౌలర్‌ కొనసాగింపు

Sep 3 2026 2:45 AM | Updated on Sep 3 2026 2:45 AM

England retain Sonny Baker as Brydon Carse remains out of Edgbaston Test squad

source: X

సెప్టెంబర్‌ 9 నుంచి ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా పాకిస్తాన్‌తో జరుగబోయే చివరిదైన, నామమాత్రపు మూడో టెస్ట్‌ కోసం ఇంగ్లండ్‌ జట్టును ప్రకటించారు. ఈ జట్టులో యువ పేసర్‌ సోనీ బేకర్‌ తన స్థానాన్ని నిలుపుకోగా.. బ్రైడన్ కార్స్ మరోసారి జట్టుకు దూరమయ్యాడు.

కార్స్‌పై గత నెలలో జరిగిన ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో వేటు కొనసాగింది. ఆగస్టు 22న డెర్బీలోని ఓ నైట్‌క్లబ్ వెలుపల జరిగిన ఘటనలో పోలీసులు కార్స్‌ను కొద్దిసేపు చేతులకు సంకెళ్లు వేసి అదుపులోకి తీసుకున్నారు. 31 ఏళ్ల కార్స్ ప్రస్తుతం ఈ వ్యవహారంపై విచారణను ఎదుర్కొంటున్నాడు.

ఈ నేపథ్యంలో లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టుకు అతడి స్థానంలో సోనీ బేకర్‌ను జట్టులోకి తీసుకున్నారు. తాజాగా మూడో టెస్టుకు కూడా బేకర్‌ను కొనసాగిస్తూ ఇంగ్లండ్ తమ నిర్ణయాన్ని స్పష్టం చేసింది. స్క్వాడ్‌లో మరో మార్పు కూడా జరిగింది. పేసర్ మాథ్యూ ఫిషర్‌ను జట్టు నుంచి తప్పించారు. ఈ రెండు మార్పులు మినహా ఇంగ్లండ్‌ జట్టు యధాతథంగా కొనసాగింది.

కాగా, పాకిస్తాన్‌తో స్వదేశంలో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ను ఇంగ్లండ్‌ ఇదివరకే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. త్వరలో జరుగబోయే మూడో టెస్ట్‌లోనూ గెలిచి పాక్‌ను క్లీన్‌ స్వీప్‌ చేయాలని ఇంగ్లండ్‌ పట్టుదలగా ఉంది.

పాక్‌తో మూడో టెస్ట్‌కు ఇంగ్లండ్ జట్టు
జో రూట్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, సోనీ బేకర్, షోయబ్ బషీర్, హ్యారీ బ్రూక్, సామ్ కుక్, జోర్డాన్ కాక్స్, బెన్ డకెట్, ఎమిలియో గే, డాన్ లారెన్స్, ఒల్లీ పోప్, ఒల్లీ రాబిన్సన్, జామీ స్మిత్, జోష్ టంగ్

చదవండి: హ్యాట్రిక్‌ సహా 7 వికెట్లు.. చరిత్ర సృష్టించిన శ్రీలంక కెప్టెన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement