హీరోయిన్ లయ చెస్ ఛాంపియనా?.. పోస్ట్ వైరల్ | Tollywood actress Laya Shared Childhood achievement In Chess Game | Sakshi
Sakshi News home page

Laya: హీరోయిన్ మాత్రమే కాదు.. చెస్ ఛాంపియన్‌ కూడానా..!

May 13 2026 3:57 PM | Updated on May 13 2026 4:24 PM

Tollywood actress Laya Shared Childhood achievement In Chess Game

అప్పట్లో హీరోయిన్‌గా మెప్పించిన లయ.. మళ్లీ సినిమాల వైపే వచ్చేసింది. అమెరికాలో కొన్నేళ్లు ఉద్యోగం చేసిన లయ.. గతేడాది నితిన్ హీరోగా వచ్చిన తమ్ముడు మూవీతో టాలీవుడ్ రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత శివాజీ సరసన సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రంలో మెరిసింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో తగిన క్యారెక్టర్స్ వస్తే చేయడానికి రెడీ అవుతోంది ఈ ముద్దుగుమ్మ.

ఇక సినిమాల సంగతి పక్కనపెడితే.. తాజాగా హీరోయిన్ లయ తన చిన్నప్పటి రోజులను గుర్తు చేసుకుంది. 12 ఏళ్ల వయసులో తాను చెస్ ఛాంపియన్‌గా నిలిచిన విషయాన్ని పంచుకుంది. దీనికి సంబంధించి ప్రముఖ పత్రికల్లో వచ్చిన న్యూస్ క్లిప్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. విజయవాడలో జరిగిన ఆంధ్రా సబ్ జూనియర్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో లయ విజేతగా అవతరించింది. ఇలాంటి మధుర జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుంటాయని ఇన్‌స్టాలో షేర్ చేసింది లయ. చిన్నప్పటి విజయాలు ఎప్పటికీ సంతోషంగానే అనిపిస్తాయని రాసుకొచ్చింది. ఈ ఘనత అందించిన అమ్మ, నాన్నకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేసింది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement