ఫ్రాన్స్‌లోని కాన్స్ నగరంలో 79వ కాన్స్ చలన చిత్రోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం ఆరంభమైన ఈ ఫిల్మ్ ఫెస్టివల్ ఈ నెల 23 వరకు జరుగనున్నాయి. ఇప్పటికే అలియా ఫ్రాన్స్ చేరుకున్నారు. ఓ బ్యూటీ ప్రాడెక్ట్‌కి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న ఆమె అందులో భాగంగానే అక్కడకి వెళ్లారు. తొలి రోజు రెడ్ కార్పెట్‌పై నడిచే ముందు ఆలియా ఫ్రెంచ్ రివెరా దగ్గర ఫ్లోరల్ ప్రింట్ ఫ్రాక్‌లో అద్భుతంగా కనిపించి ఫ్యాషన్ ప్రియులను ఫిదా చేసింది.
అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌గా మారాయి. తాజాగా కాన్స్ రెడ్‌కార్పెట్‌లపై అలియా అందర్నీ కట్టిపడేసింది. ఈ బ్యూటీ గతేడాది తర్వాత ఇలా మళ్లీ ఇలా కాన్స్‌లో సందడి చేయడం రెండోసారి. రెడ్‌కార్పెట్‌పై అలియా గులాబీలా హోయలు ఒలికిస్తూ నడిచిన తీరు అందర్నీ అమితంగా ఆకర్షించింది. తమారా రాల్ఫ్ రూపొందించిన లేత గులాబీ బ్లష్-టోన్డ్ బస్టియర్ గౌన్‌లో అత్యద్భుతంగా కనిపించింది.
దీనికి మరిన్ని హంగులు చేర్చి భారతీయ లుక్‌ని అందించారు బాలీవుడ్ నిర్మాత రియాకపూర్. అలియా తన లుక్‌కి ఒక స్టేట్‌మెంట్ జెమ్‌స్టోన్ నెక్లెస్, మ్యాచింగ్ చెవిపోగులను జతచేసి మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేశారామె. చెప్పాలంటే కాన్స్‌లో అలియా ఫ్యాషన్ సందడే ప్రధాన ఆకర్షణగా నిలిచిందని చెప్పొచ్చు. రెడ్ కార్పెట్‌పై కనిపించడానికి ముందే అలియా ఫ్యాషన్ ప్రియులను ఇంప్రెస్ చేసింది.
Alia Bhatt at Cannes Film Festival 📸 pic.twitter.com/NitpbocSJN
— Alia's nation (@Aliasnation) May 12, 2026
రెండోసారి రెడ్‌కార్ప్‌ట్‌పై ముగ్ధమనోహరంగా కనిపించి మరింతగా ఆకట్టుకుంది. కాగా, ఈ ఏడాది కాన్స్ వేడుకల్లో వివిధ సినీ పరిశ్రమలు తోపాటు ప్రాంతీయ సినిమా రంగాల నుంచి కూడా గణనీయంగా ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ కార్యక్రమంలో అలియా తోపాటు ఐశ్వర్యరాయ్ బచ్చన్ కూడా లోరియల్ పారిస్‌కు గ్లోబల్ అంబాసిడర్‌గా మరోసారి సందడి చేయనున్నారు.
ఇక చిత్రనిర్మాత అశుతోష్ గోవారికర్, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ హోదాలో భారతదేశ అధికారిక ప్రతినిధి బృందంలో భాగంగా హాజరుకానున్నారు. అలాగే చిత్రనిర్మాత కరణ్ జోహార్‌తో పాటు, నటీమణులు తారా సుతారియా, మౌనీ రాయ్, పూజా బాత్రా తదితరులు కూడా సందడి చేయనుననారు.
(చదవండి: గోల్డ్ డిజైనర్‌వేర్‌లో రాధికా మర్చంట్ స్టన్నింగ్ లుక్!)


