తిరుపతి : శ్రీతాతయ్యగుంట గంగమ్మ జాతర తిరుపతిలో వైభవంగా జరిగింది. ఈ నెల 5వ తేదీ రాత్రి చాటింపుతో మొదలైన జాతర వారం రోజుల పాటు అత్యంత కోలాహలంగా సాగింది.
రోజువారీ విభిన్న వేషాలతో భక్తులు అమ్మవారిని దర్శించుకుని, మొక్కులు తీర్చుకున్నారు.
మంగళవారం జాతర చివరి రోజు కావడంతో ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులతో గంగమ్మ ఆలయం కిక్కిరిసింది.
భక్తి శ్రద్ధలతో పొర్లుండాలతో ఆలయ ప్రదక్షిణ చేసి మొక్కులు తీర్చుకున్నారు. మొక్కుబడిలో భాగంగా వేపాకు చీరలతో గంగమ్మను దర్శించుకుని భక్తులు మొక్కులు తీర్చుకున్నారు.


