breaking news
Ashok Sharma
-
'అక్తర్ రికార్డు బద్దలు కొడుతా'.. భారత రైజింగ్ స్టార్ శపథం
గుజరాత్ టైటాన్స్ పేసర్ అశోక్ శర్మ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ప్రపంచ రికార్డును బద్దలు కొడుతానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో 161.3 కిమీవేగంతో అక్తర్ విసిరిన బంతి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. తాజాగా అక్తర్ రికార్డును తాను బద్దలు కొడుతానంటూ అశోక్ శర్మ శపథం చేయడం గమనార్హం. ఏదోఒక రోజు అక్తర్ రికార్డును బద్దలు కొట్టే సత్తా తనకు ఉందని ధీమా వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడిన అశోక్ శర్మ ఒక మ్యాచ్‌లో 154.2 కిలోమీటర్ వేగంతో (గంటకు 95.8 మైళ్ల వేగం) బంతి విసిరి ఐపీఎల్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ డెలివరీతో రికార్డు సృష్టించాడు. అంతకముందు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025 సీజన్లో 22 వికెట్లు తీయడమే గాక ప్రతీ మ్యాచ్‌లో దాదాపు 150 కిలోమీటర్ల వేగంతో స్థిరంగా బంతులు వేయడం విశేషం. ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అశోక్ శర్మ మాట్లాడుతూ.. ‘ఏదో ఒకరోజు అక్తర్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాలనే సంకల్పంతోనే ఉన్నా. బౌలింగ్ వేగం విషయంలో మాత్రం ఎన్నటికీ రాజీపడను. నా దృష్టి ఎప్పుడు బౌలింగ్‌ను మెరుగుపరుచుకోవడంపైనే ఉంటుంది. అంతా సవ్యంగా సాగితే, బహుశా ఒకరోజు అక్తర్ నెలకొల్పిన 161 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలుగుతానేమో. ఈ క్రమంలో నన్ను నేను మెరుగుపరచుకునేందుకు మరింత కష్టపడుతాను. అయితే నా బౌలింగ్‌ను మెరుగుపరచుకునే క్రమంలో ఆరోగ్యకరమైన పోటీ ఉండడాన్ని ఇష్టపడుతాను.’ అని చెప్పుకొచ్చాడు.ఇక జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు ఎంపికైన అశోక్ శర్మకు తుది జట్టులో అవకాశం లభిస్తుందా? లేదా? అనేది పక్కనబెడితే ఐపీఎల్ ప్రదర్శనతో పాటు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ప్రదర్శనను పరిగణలోకి తీసుకొని ఎంపిక చేశారు. అయితే ఇండియా-ఏ జట్టు తరఫున అరంగేట్రం చేసినప్పటికీ పెద్దగా రాణించలేదు. ఒక వన్డే మ్యాచ్‌లో 75 పరుగులిచ్చి ఒక వికెట్ మాత్రమే తీశాడు. ఇక ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆరు మ్యాచ్‌లాడిన అశోక్ శర్మ ఆరు వికెట్లు మాత్రమే తీశాడు. అయితే ప్రతీ జట్టుకు పేస్ బౌలర్లు ఆస్తిలాంటి వారు. జమ్మూ కశ్మీర్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ ఐపీఎల్ 2022లో సంచలన ప్రదర్శనతో జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. 2023లో వన్డేలు, టీ20ల్లో ఆడినప్పటికీ ఎక్కువకాలం జట్టులో కొనసాగలేకపోయాడు. తన వేగం బలమైనప్పటికీ దానిని నిలకడగా కొనసాగించడంలో విఫలమయ్యాడు. దీనికి తోడు తరచూ గాయాల బారీన పడడం కూడా అతడిని జట్టుకు దూరం చేసింది. మరి అశోక్ శర్మ ఏ మేరకు రాణిస్తాడనేది చూడాలి. ఒకవేళ టీమిండియాలో అవకాశం ఇవ్వాలనుకుంటే అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రానా, బుమ్రా వంటి స్టార్ పేస్లరకు పని భారాన్ని తగ్గించే క్రమంలో అశోక్ శర్మ ఉపయోగపడగలడు. బుమ్రా ఒక్కడే టీమిండియా పేస్ బారాన్ని మోస్తున్న తరుణంలో అశోక్ శర్మ లాంటి యువ బౌలర్ల అవసరం టీమిండియాకు ఎంతో ఉంది.చెక్కుచెదరని అక్తర్ రికార్డు2003 వన్డే ప్రపంచకప్‌లో రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ అత్యంత ఫాస్టెస్ట్ బంతిని విసిరాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో నిక్ నైట్‌కు (గంటకు 161.3 కిలోమీటర్ వేగంతో) బంతిని విసిరాడు. గంటకు 100 మైళ్ల వేగంతో విసిరడంతో అక్తర్ పేరు క్రికెట్ పుస్తకాల్లో నిలిచిపోయింది. ఇప్పటికీ ఆ రికార్డు చెక్కుచెదరకుండా ఉంది. ఆసీస్ స్పీడస్టర్లు బ్రెట్ లీ, షాన్ టైట్లు అక్తర్ రికార్డుకు సమీప దూరంలో నిలిచిపోయారు. బ్రెట్ లీ ఒక మ్యాచ్‌లో గంటకు 161.1 కిలోమీటర్ల వేగం నమోదు చేయగా, షాన్ టైట్ రెండుసార్లు (2005, 2010) అక్తర్ రికార్డుకు దగ్గరగా వచ్చాడు. 2005లో గంటకు 160.7 కిలోమీటర్ల వేగంతో విసరగా, 2010లో గంటకు 161.1 కిలోమీటర్ వేగంతో విసిరాడు. Read: ఎనిమిది జట్ల సయ్యాట.. ఫిఫా క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదే -
గుజరాత్ టైటాన్స్ ప్లేయర్‌కు జాక్‌పాట్.. టీమిండియాకు ఎంపిక!
ట్రై సిరీస్‌లో భాగంగా శ్రీలంక-ఏతో మ్యాచ్‌లో ఓటమితో ఫైనల్ అవకాశాలను ఇండియా-ఏ క్లిష్టం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఓటమి బాధలో ఉన్న ఇండియా-ఏ జట్టుకు గుడ్‌న్యూస్ అందింది. గాయపడిన యద్వీర్ సింగ్ స్థానంలో గుజరాత్ టైటాన్స్ స్టార్ ఆటగాడు అశోక్ శర్మను ఎంపిక చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దీంతో అశోక్ శర్మ తక్షణమే శ్రీలంకకు బయల్దేరనున్నాడు. బుధవారం అప్గానిస్తాన్‌తో జరగనున్న మ్యాచ్‌లో అశోక్ శర్మ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ తరఫున ప్రాతినిధ్యం వహించిన అశోక్ శర్మ గంటకు 154 కిలోమీటర్ల వేగంతో బంతులు విసరడం విశేషం. ఆరు వికెట్లే తీసినప్పటికీ అతడి స్పీడ్ బౌలింగ్ ఇవాళ ఇండియా-ఏ జట్టులోకి పిలుపు వచ్చేలా చేసింది. ఇక యద్వీర్ సింగ్ భుజం గాయంతో ఇండియా-ఏ ఆడిన మూడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ప్రాక్టీస్ సమయంలో బౌలింగ్ వేయడంలో ఇబ్బంది పడిన యద్వీర్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. దీంతో అతడి స్థానంలో అశోక్ శర్మను తీసుకోవాలని బీసీసీఐ నిర్ణయించింది. గాయంతో బాధపడుతున్న యద్వీర్ బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)కు రావాలని బీసీసీఐ అతడిని ఆదేశించింది.బుధవారం అఫ్గానిస్తాన్ జట్టుతో చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో ఇండియా-ఏ జట్టు తప్పక గెలవాల్సి ఉంటుంది. అంతేకాదు మ్యాచ్‌లో గెలవడమే కాదు భారీ రన్‌రేట్ సమకూర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఒకవేళ ఆఫ్గన్ చేతిలో ఓడిపోతే మాత్రం ఇండియా-ఏ జట్టు ఇంటిదారి పట్టాల్సిందే. అదే సమయంలో అఫ్గానిస్తాన్ జట్టు లంకతో జరిగే తమ చివరి మ్యాచ్‌లో గెలిస్తే మాత్రం సమీకరణాలు మారిపోనున్నాయి. ఎందుకంటే ఆఫ్గన్‌పై ఇండియా గెలిచి, శ్రీలంకపై ఆఫ్గన్ గెలిస్తే.. ఇరుజట్లు నాలుగు మ్యాచ్‌ల్లో రెండేసి విజయాలతో ఉంటాయి. అప్పుడు నెట్‌రన్‌రేట్ కీలకం కానుంది. చదవండి: కోహ్లి మాట చెవికెక్కించుకోని వైభవ్! -
మొదట్లో చితక్కొట్టినా చివర్లో వణికించాడు!
భారత్‌లో ఫాస్ట్ బౌలర్ల కన్నా మీడియం ఫాస్ట్ బౌలర్లే ఎక్కువగా ఉంటారు. నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, కార్తిక్ త్యాగి వంటి ఫాస్ట్ బౌలర్లు అరుదుగా కనిపిస్తుంటారు. తాజాగా ఐపీఎల్ 2026 సీజన్ ద్వారా మరో ఫాస్ట్ బౌలర్ వెలుగులోకి వచ్చాడు. అతడే గుజరాత్ టైటాన్స్‌కు చెందిన అశోక్ శర్మ. శనివారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎవరూ ఊహించని విధంగా గంటకు 154 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి నిప్పులు చెరిగాడు. రాజస్తాన్ ఇన్నింగ్స్ 16వ ఓవర్ చివరి బంతిని అశోక్ శర్మ 154.2 కి.మీ వేగంతో విసిరాడు. మెరుగు వేగంతో వచ్చిన బంతిని ధ్రువ్ జురేల్ భారీ షాట్ ఆడడంలో విఫలమై డిఫెన్స్ చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ సీజన్లో అశోక్ శర్మ సంధించిన బంతి అత్యంత వేగవంతమైనదిగా రికార్డులకెక్కింది. అశోక్ శర్మ కంటే ముందు లక్నో సూపర్‌జెయింట్స్ బౌలర్ అన్రిచ్ నోర్ట్జే (150.9), కార్తిక్ త్యాగి (149.7), రబాడ (149.1) ఉన్నారు. అయితే తొలి స్పెల్‌లో అశోక్ శర్మను రాజస్తాన్ బ్యాటర్లు దంచికొట్టారు. 2 ఓవర్లు కలిపి 9 సగటుతో 18 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే రెండో స్పెల్‌లో మాత్రం అశోక్ శర్మ దుమ్మురేపాడు. ఒక వికెట్ తీయడంతో పాటు తన ఫాస్ట్ బౌలింగ్‌తో వణికించాడు. అంతేకాదు గుజరాత్ బౌలర్లలో అందరూ దాదాపు భారీగా పరుగులిచ్చుకోగా.. అశోక్ శర్మ మాత్రం మిగతా వాళ్లతో పోలిస్తే తక్కువ ఎకానమీ నమోదు చేయడం విశేషం. గుజరాత్ ఓడినప్పటికీ అశోక్ శర్మ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో ఎవరీ అశోక్ శర్మ? ఎక్కడి నుంచి వచ్చాడనేది ఇప్పుడు తెలుసుకుందాం.ఎవరీ అశోక్ శర్మ?రాజస్థాన్‌లోని జైపూర్ సమీపంలో ఉన్న ఒక చిన్న గ్రామానికి చెందిన అశోక్ శర్మను ఐపీఎల్ 2026 మినీ వేలంలో గుజరాత్ టైటాన్స్ రూ.90 లక్షలకు కొనుగోలు చేసింది. అశోక్ శర్మ తండ్రి హుకుమ్ చంద్ శర్మ.. రాజస్థాన్ పోలీస్ విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. కొడుకును క్రికెటర్‌గా చూడాలనేది ఆయన కోరిక.తండ్రి ప్రోత్సాహంతో క్రికెటర్‌గా ఎదిగిన అశోక్ శర్మ.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రాజస్థాన్ తరఫున సత్తా చాటి అందరి దృష్టిని ఆకర్షించాడు. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బంతులను సంధించడం అతని ప్రత్యేకత. కుడిచేతి వాటం పేసర్ అయిన అశోక్ శర్మ.. తనను తాను హార్డ్ లెంగ్త్ బౌలర్‌గా చెప్పుకుంటాడు.ముస్తాక్ అలీ ట్రోఫీతో వెలుగులోకిముస్తాక్ అలీ ట్రోఫీలో రాజస్థాన్ తరఫున 19 వికెట్లతో అల్లాడించాడు. 12.10 సగటు, 8.84 ఎకానమీతో టాప్ బౌలర్‌గా నిలిచాడు. అశోక్ శర్మ తొలినాళ్లలో రాజస్థాన్ రాయల్స్ జట్టులో నెట్ బౌలర్‌గా పనిచేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయడంలో ఇతనికి మంచి పట్టు ఉంది. 2022 వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఇతడిని రూ. 55 లక్షలకు కొనుగోలు చేయగా, 2025లో రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి వెళ్ళాడు. ఇక 2026 వేలంలో గుజరాత్ టైటాన్స్ రూ. 90 లక్షలు వెచ్చించి అశోక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటివరకు 11 టీ20 మ్యాచ్‌ల్లో 33 వికెట్లు పడగొట్టిన ఈ యువ స్పీడ్‌స్టర్, ఫస్ట్ క్లాస్ క్రికెట్లోనూ మంచి రికార్డును కలిగి ఉన్నాడు.Ashok Sharma clocks the fastest ball of the season🚄#AshokSharma #IPL2026 #GTvsRR pic.twitter.com/wfyPT9UeC7— CREX (@Crex_live) April 4, 2026చదవండి: రవి బిష్ణోయ్ అరుదైన రికార్డు! -
IPL 2026: సరికొత్త ఫాస్ట్ బౌలింగ్ సంచలనం
ఐపీఎల్ ద్వారా మరో భారత టాలెంట్ బయటపడింది. 2026 ఎడిషన్‌లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 4) రాత్రి (7:30 గంటలకు) ప్రారంభమైన మ్యాచ్‌లో ఓ అద్భుతం జరిగింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌కు చెందిన అనామక బౌలర్ అశోక్ శర్మ నిప్పులు చెరిగాడు. ఊహించని విధంగా గంటకు 154 కిమీ వేగంతో బౌలింగ్ చేశాడు. ఐపీఎల్ 2026లో ఇప్పటివరకు ఇదే అత్యంత వేగవంతమైన బంతిగా రికార్డైంది. రాజస్థాన్ ఇన్నింగ్స్ 16వ చివరి బంతికి అశోక్ మెరుపు వేగంతో బంతిని సంధించాడు. ఈ బంతిని ఎదుర్కొన్న ధృవ్ జురెల్ పరుగు సాధించలేకపోయాడు.ప్రస్తుత సీజన్లో అశోక్ శర్మ తర్వాత అత్యంత వేగవంతమైన బంతి లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ అన్రిచ్ నోర్జే (150.9) పేరిట ఉంది. ఆతర్వాతి స్థానాల్లో కార్తీక్ త్యాగి (149.7), రబాడ (149.1), ఓవర్టన్ (145.6) ఉన్నారు.ఓవరాల్‌గా ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన బంతి షాన్ టైట్ పేరిట ఉంది. 2011 ఎడిషన్‌లో ఇతను రాజస్థాన్ రాయల్స్‌కు ఆడుతూ ఢిల్లీ డేర్ డెవిల్స్‌పై ఈ ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో టాప్-5 వేగవంతమైన బంతులు ఇలా ఉన్నాయి.157.71 కిమీ/గం - షాన్ టైట్ (2011)157.4 కిమీ/గం - గెరాల్డ్ కోయెట్జీ (2024)157.3 కిమీ/గం - లాకీ ఫెర్గూసన్ (2022)157.0 కిమీ/గం - ఉమ్రాన్ మాలిక్ (2022)156.22 కిమీ/గం - అన్రిచ్ నోర్ట్జే (2020)మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ చేసింది. జురెల్ (75), జైస్వాల్ (55) అర్ద సెంచరీలతో రాణించగా.. వైభవ్ సూర్యవంశీ (31) పర్వాలేదనిపించాడు. మిగతా ఆటగాళ్లలో రియాన్ పరాగ్ 4, హెట్‌మైర్ 18, డొనొవన్ ఫెరియెరా ఒక పరుగు చేసి ఔట్ కాగా.. రవీంద్ర జడేజా (7), జోఫ్రా ఆర్చర్ (1) అజేయంగా నిలిచారు. గుజరాత్ బౌలర్లలో రబాడ 2, సిరాజ్, అశోక్ శర్మ, ప్రసిద్ద్ కృష్ణ, రషీద్ ఖాన్ తలో వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనను గుజరాత్ కూడా ధాటిగానే ప్రారంభించింది. 7.1 ఓవర్లలోనే ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 71 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (47) చెలరేగి ఆడుతున్నాడు. అతనికి కుమార్ కుషాగ్రా (18) అండగా ఉన్నాడు. -
పోయింది ఏడు కాదు 50 కేజీలు!
జహీరాబాద్ ‘ముత్తూట్’లో భారీ బంగారం చోరీ ఆలస్యంగా వెలుగులోకి.. నిందితుల నుంచి 20 కేజీలు స్వాధీనం పట్టుబడింది ముగ్గురు దొంగ లే.. అత్యంత రహస్యంగా దర్యాప్తు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర చరిత్రలో భారీ బంగారు దోపిడీ..! ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 50కేజీలు! గత నెల మెదక్ జిల్లా జహీరాబాద్‌లోని ముత్తూట్ ఫైనాన్స్ కార్పొరేషన్లో దొంగలు కొల్లగొట్టిన బంగారం పరి మాణం ఇది. ఈ దొంగతనంలో పోయింది ఏడు కేజీలని ఇప్పటి వరకు భావిస్తుండగా అసలు విషయం తాజాగా వెలుగుచూసింది. కాజేసిన బంగారంలో ఇప్పటివరకు 20కేజీలు మాత్రమే పోలీసులు స్వాధీ నం చేసుకున్నారు. అత్యంత రహస్యంగా దర్యాప్తు జరుపుతున్న రాష్ట్ర పోలీసులు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌లకు చెందిన ఆరుగురు దొంగల్లో ముగ్గురిని పట్టుకుని, రూ.10 లక్షలు రికవరీ చేశారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని, మిగతా ముగ్గురు నింది తుల కోసం పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌ల్లో ముమ్మరంగా గాలిస్తున్నాయని పోలీసు ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. దొంగతనం ఇలా : జహీరాబాద్‌లోని ముత్తూట్ ఫైనాన్స్ కార్పొరేషన్లో గత నెల 3న చోరీ జరిగింది. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌కు చెందిన దొంగల ముఠా 50కేజీల బంగారం, రూ.14 లక్షల నగదు ఎత్తుకుపోయింది. బెంగాల్‌కు చెందిన ఖమ్రుద్దీన్ జహీరాబాద్‌లో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ వద్ద వాచ్‌మెన్‌గా పనిచేసేవాడు. అక్కడి పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో 9వ నంబర్ జాతీయ రహదారిపై ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయాన్ని టార్గెట్‌గా చేసుకున్నాడు. పలుమార్లు రెక్కీ చేశాక చోరీ కోసం జార్ఖండ్‌కు చెందిన అశోక్‌శర్మ, యూసఫ్, వినోద్, కమల్సహా ఆరుగురితో కలిసి రంగంలోకి దిగాడు. దొంగలు గతనెల 2వ తేదీ రాత్రి ఖమ్రుద్దీన్ పనిచేసే అపార్ట్మెంట్ వద్ద తాత్కాలిక నివాసంలో బస చేశారు. 3వ తేదీ తెల్లవారుజామున గ్యాస్‌కట్టర్లు, గడ్డపారలు, ఇనుపరాడ్లతో విరుచుకుపడ్డారు. ముత్తూట్ కార్యాలయం వెనుక భాగంలోని తలుపును తొలగించి లోనికెళ్లారు. సీసీ కెమెరా వైర్లను కత్తిరించి, గ్యాస్కట్టర్ల సాయంతో స్ట్రాంగ్ రూమ్ ఏ-1లోని సేఫ్ లాకర్లను తెరిచి వినియోగదారులు తాకట్టు పెట్టిన బంగారం, నగదును సంచుల్లో సర్దుకున్నారు. ఎంజీబీస్‌లో దొరికిన దొంగ ఉదయం ఐదుగంటలకు ఆరుగురూ కర్ణాటక ఆర్టీసీ బస్సెక్కి నేరుగా హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి విజయవాడ వెళ్లి, అట్నుంచి జార్ఖండ్ పారి పోవాలని పథకం వేశారు. ఎంజీబీఎస్‌లో ఆరోజు ఆర్టీసీ భద్రతా సిబ్బంది చేసిన తనిఖీల్లో అశోక్‌శర్మ పట్టుబడ్డాడు. అఫ్జల్‌గంజ్ పోలీసులు అతడిని విచారించేదాకా చోరీ గురించి ఎవరికీ తెలియలేదు. అశోక్‌శర్మను ప్రిజనర్స్ ట్రాన్సిట్(పీటీ) వారెంట్‌పై తీసుకువెళ్లి విచారించగా అసలు సంగతి బయటపడింది. 50కేజీలకు పైగా బంగారం చోరుల పాలైనట్లు పోలీ సులు నిర్ధారించారు. ఈ చోరీ సూత్రధారి ఖమ్రుద్దీన్ గత ఏడాది మార్చి 29న మెదక్‌జిల్లా కవేలీలోని సిండికేట్ బ్యాంక్‌ను కొల్లగొట్టేందుకు ముఠాతో కలిసి యత్నించాడు. అలారం మోగడంతో ఘటనాస్థలికి వచ్చిన ఎస్సైపై కాల్పులు జరిపి అరెస్టయ్యాడు. అనంతరం బెయిల్‌పై బయటకు వచ్చి మరో ముఠాతో కలిసి ‘ముత్తూట్ చోరీ’కి పాల్పడ్డాడు. -
మహీంద్రా... బ్రాండెడ్ పండ్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సుమారు రెండు లక్షల కోట్ల విలువైన దేశీయ పండ్ల మార్కెట్లోకి మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ప్రవేశించింది. ఇందులో భాగంగా ‘సబొరో’ బ్రాండ్ పేరు మీద యాపిల్ పండ్లను మార్కెట్లోకి విడుదల చేసింది. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ‘సబొరో’ బ్రాండ్‌ను జాతీయ స్థాయిలో లాంఛనంగా ఆవిష్కరించింది. అంతర్జాతీయంగా దిగుమతి చేసుకునే బ్రాండెడ్ పండ్లకు హైదరాబాద్ పెద్ద మార్కెట్ కావడంతో ‘సబొరో’ బ్రాండ్‌ను ఇక్కడ ప్రారంభించినట్లు ఎం అండ్ ఎం అగ్రి, అల్లైడ్ బిజినెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అశోక్ శర్మ తెలిపారు. బ్రాండెడ్ పండ్లను పరిచయం చేసిన తొలి దేశీయ కంపెనీగా ఎంఅండ్ఎం రికార్డులకు ఎక్కిందనివచ్చే మూడేళ్లలో రూ.300 కోట్ల వ్యాపారం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. సొంతంగా ఔట్లెట్లను ఏర్పాటు చేయడం లేదని, వివిధ రిటైల్ సంస్థల ద్వారా ఈ బ్రాండ్‌ను విక్రయించనున్నట్లు అశోక్ తెలిపారు. వచ్చే మూడేళ్లలో దేశంలోని ఆరు ప్రధాన పట్టణాల్లో 200 రిటైల్ ఔట్లెట్లలో సొబొరో బ్రాండ్ అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకోసం హెరిటేజ్ ఫ్రెష్, గోద్రేజ్ నేచుర్స్ బాస్కెట్ వంటి రిటైల్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నామని, మరికొన్ని రిటైల్ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు అశోక్ వివరించారు. ప్రస్తుతం ఈ బ్రాండ్ కింద యాపిల్‌ను మాత్రమే పరిచయం చేశామని, ఇక ధరల విషయానికి వస్తే దిగుమతి చేసుకున్న యాపిల్ ధరల కంటే 20 శాతం తక్కువగాను, దేశీయంగా అందుబాటులో ఉండే యాపిల్ కంటే 10 నుంచి 15 శాతం ధర అధికంగా ఉంటాయన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఎగుమతి చేస్తున్న ద్రాక్ష పండ్లను ఈ సీజన్ మొదలు కాగానే దేశీయంగా కూడా విక్రయించనున్నట్లు తెలిపారు. గతేడాది రూ.65 కోట్ల ద్రాక్ష ఎగుమతులు చేయగా, ఈ ఏడాది రూ.90 కోట్ల వ్యాపారాన్ని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే ఆరు నెలల్లో దేశీయ అరటి పండ్లను, సిట్రస్, పీర్స్ వంటి విదేశీ పండ్లను పరిచయం చేయనున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇప్పటి వరకు రూ.20 కోట్లు వెచ్చించామని, భవిష్యత్తు విస్తరణ కోసం రూ.40 కోట్ల వరకు వ్యయం చేయనున్నట్లు తెలిపారు. హిమాచల్, జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి సేకరించిన యాపిల్ పండ్లను హైదరాబాద్ శీతల గిడ్డంగుల్లో భద్రపర్చి దేశవ్యాప్తంగా సరఫరా చేస్తున్నట్లు అశోక్ వివరించారు. పులివెందుల రైతులతో చర్చలు రైతుల నుంచి నాణ్యమైన ఉత్పత్తులను సేకరించడానికి వివిధ రాష్ట్రాల్లోన్ని రైతులతో కాంట్రాక్టింగ్ వ్యవసాయ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు ఎం అండ్ ఎం శుభ్లాభా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విక్రమ్ పురి తెలిపారు. రాష్ట్రంలో ద్రాక్షకు సంబంధించి 10 మంది రైతులతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని, అరటికి సంబంధించి చర్చలు జరుపుతున్నట్లు వివరించారు. కడప జిల్లా పులివెందుల ప్రాంతంలో పండించే కావిండిష్ రకం అరటి పండుకు మంచి డిమాండ్ ఉందని, దీనికి సంబంధించి అక్కడి రైతులతో ఒప్పందం కుదుర్చుకునే పనిలో ఉన్నట్లు తెలిపారు. దీని తర్వాత తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం ప్రాంత రైతులపై దృష్టి పెట్టనున్నట్లు విక్రమ్ తెలిపారు.


