సూర్యాన్ష్‌ మెరుపులు.. ఇండియా-ఏ భారీ స్కోరు | Suryansh Shedge Class Batting India 265 Runs All Out Vs Sri Lanka A, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

సూర్యాన్ష్‌ మెరుపులు.. ఇండియా-ఏ భారీ స్కోరు

Jun 15 2026 1:52 PM | Updated on Jun 15 2026 5:49 PM

Suryansh Shedge Class Batting India-265 Runs-All-Out Vs Sri Lanka-A

ముక్కోనఫు వన్డే సిరీస్‌లో భాగంగా సోమ‌వారం దంబుల్లా వేదిక‌గా శ్రీలంక‌-ఏతో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ఇండియా-ఏ జ‌ట్టు గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోరు సాధించింది. సూర్యాన్ష్‌ షెడ్గే (72 పరుగులు) ఇన్నింగ్స్‌కు తోడు విప్రాజ్‌ నిగమ్ (51) సంచ‌ల‌న అర్థసెంచరీ చేయడంతో ఇండియా-ఏ 49.2 ఓవ‌ర్ల‌లో 265 ప‌రుగులకు ఆలౌటైంది. 

ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న వైభ‌వ్ సూర్య‌వంశీ (21) మ‌రోసారి నిరాశ‌ప‌రచ‌గా, రుతురాజ్ గైక్వాడ్ (37), కెప్టెన్ తిల‌క్ వ‌ర్మ (23) ప‌ర్వాలేద‌నిపించారు. ఒక ద‌శ‌లో 143 ప‌రుగుల‌కే ఏడు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డిన ఇండియా-ఏ జ‌ట్టును సూర్యాన్ష్‌, విప్ర‌జ్ ఆదుకున్నారు. 

టాపార్డ‌ర్‌, మిడిలార్డ‌ర్ విఫ‌ల‌మైన చోట లోయ‌ర్ ఆర్డ‌ర్‌లో సూర్యాన్ష్‌, విప్ర‌జ్ నిగ‌మ్‌లు బాధ్య‌తాయుతంగా ఆడి జ‌ట్టుకు గౌరవ ప్ర‌ద‌మైన స్కోరు అందించారు. ఈ ఇద్ద‌రు క‌లిసి ఎనిమిదో వికెట్‌కు 104 ప‌రుగులు జోడించ‌డం విశేషం. లంక బౌల‌ర్ల‌లో విజ‌య్‌కాంత్ వియ‌స్కాంత్ 3 వికెట్లు తీయ‌గా, మొహ‌మ్మ‌ద్ షిరాజ్ 2 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

చదవండి: పాక్ ప్లేయ‌ర్ క‌వ్వింపు చ‌ర్య‌లు.. గొంతుప‌ట్టుకున్న హ‌ర్మ‌న్‌!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement