లంకతో ఫైనల్‌ మ్యాచ్‌.. 11 బంతుల్లోనే ఫిఫ్టీ బాదిన వైభవ్‌ | India-A Vs Sri Lanka-A Final Match In Tri-series Dambulla | Sakshi
Sakshi News home page

లంకతో ఫైనల్‌ మ్యాచ్‌.. 11 బంతుల్లోనే ఫిఫ్టీ బాదిన వైభవ్‌

Jun 21 2026 9:38 AM | Updated on Jun 21 2026 11:22 AM

India-A Vs Sri Lanka-A Final Match In Tri-series Dambulla

శ్రీలంక ప‌ర్య‌ట‌న‌లో ట్రై సిరీస్ ఆఖ‌రి ఘ‌ట్టానికి చేరుకుంది. ముక్కోణ‌పు వ‌న్డే టోర్నీ ఫైన‌ల్‌లో శ్రీలంక‌-ఏ, ఇండియా-ఏ జ‌ట్టు త‌ల‌ప‌ డుతున్నాయి. టాస్‌ గెలిచిన శ్రీలంక-ఏ జట్టు బౌలింగ్‌ ఎంచుకుంది.  టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇండియా-ఏ దూకుడుగా ఆడుతోంది. వైభవ్‌ ధాటికి 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ 11 బంతుల్లోనే అర్ధసెంచరీ  మార్క్‌ సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. అతడికి ప్రియాన్ష్ ఆర్య (22 బ్యాటింగ్‌) సహకరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో వైభవ్‌ సూర్యవంశీ ప్రపంచ రికార్డు సాధించాడు. ఇప్పటివరకు సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌ పేరిట ఉన్న రికార్డును వైభవ్‌ బద్దలుకొట్టాడు.

తుది జట్లు:
ఇండియా-ఏ: ప్రియాంష్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ(సి), కుమార్ కుషాగ్రా(w), సూర్యాంశ్ షెడ్గే, నిశాంత్ సింధు, అనుకుల్ రాయ్, విప్రజ్ నిగమ్, అశోక్ శర్మ, యశ్ ఠాకూర్

శ్రీలంక-ఏ: నిరోషన్ డిక్వెల్లా(w), అవిష్క ఫెర్నాండో, నువానీదు ఫెర్నాండో, సదీర సమరవిక్రమ, సహన్ అరాచ్చిగే(సి), రవిందు ఫెర్నాండో, వనుజా సహన్, మహ్మద్ షిరాజ్, విజయకాంత్ వియాస్కాంత్, దులజ్ సముదిత, కుగతస్ మతులన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement