breaking news
Sahan Arachchige
-
శ్రీలంకతో తొలి టెస్టు.. భారత్ బ్యాటింగ్
శ్రీలంక పర్యటనలో ముక్కోణపు వన్డే సిరీస్‌ను భారత్- ‘ఎ’ జట్టు ఇటీవలే ముగించుకుంది. ఈ క్రమంలో తాజాగా లంకతో అనధికారిక టెస్టు సిరీస్‌కు సిద్ధమైంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య శ్రీలంక- ‘ఎ’ జట్టుతో భారత్ రెండు అనధికారిక టెస్టులు ఆడనుంది.ధ్రువ్ జురెల్ సారథ్యంలో..ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య గురువారం తొలి టెస్టు మొదలైంది. గాలే అంతర్జాతీయ స్టేడియం వేదికగా టాస్ గెలిచిన భారత్ లుత బ్యాటింగ్ ఎంచుకుంది. యువ ఆటగాడు ధ్రువ్ జురెల్ ఈ సిరీస్‌లో భారత జట్టుకు కెప్టెన్, వికెట్ కీపర్‌గా వ్యవహరిస్తున్నాడు.వన్డే సిరీస్‌లో విజేతగాఈ జట్టులో జురెల్‌తో పాటు రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్, గుర్నూర్ బ్రార్ తదితర టీమిండియా స్టార్లు కూడా ఉన్నారు. కాగా శ్రీలంక, అఫ్గానిస్తాన్ ‘ఎ’ జట్లతో జరిగిన అనధికారిక వన్డే సిరీస్‌లో భారత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. లీగ్ దశలో లంక, అఫ్గాన్లపై ఒక్కో మ్యాచ్ గెలవడంతో పాటు.. ఒక్కో మ్యాచ్ ఓడిపోయినప్పటికీ.. అద్భుతమైన రన్‌రేటు కారణంగా తిలక్ వర్మ సేన ఫైనల్లో అడుగుపెట్టింది.టైటిల్ పోరులో శ్రీలంకపై ఘన విజయం సాధించి చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 29 బంతుల్లోనే 94 పరుగులు సాధించి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. ఇక ఈ సిరీస్ తర్వాత తిలక్ వర్మ, వైభవ్ సూర్యవంశీ టీమిండియాతో కలిశారు. సీనియర్ జట్టుతో కలిసి టీ20 సిరీస్ కోసం ఐర్లాండ్‌లో అడుగుపెట్టారు.తుదిజట్లుభారత్సాయి సుదర్శన్, ఆయుశ్ పాండే, దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, ధృవ్ జురెల్(కెప్టెన్/ వికెట్ కీపర్), షేక్ రషీద్, హర్ష్ దూబే, సారాంశ్ జైన్, అన్షుల్ కాంబోజ్, యశ్ ఠాకూర్, ఆకిబ్ నబీ దర్శ్రీలంకపవంత వీరసింగే, నిరోషన్ డిక్విల్లా (వికెట్ కీపర్), నునానిదు ఫెర్నాండో, ఆషేన్ బండారా, సహాన్ అరాచిగే (కెప్టెన్), రవిందు ఫెర్నాండో, అంజాలా బండారా, కవిందు పతిరత్నె, దులాజ్ సముదిత, చమిక గుణశేఖర, దిలుమ్ సుదీర.చదవండి: రాణించిన నితీశ్ రెడ్డి.. కరీంనగర్‌పై నల్గొండ గెలుపు -
లంకతో ఫైనల్ మ్యాచ్.. 11 బంతుల్లోనే ఫిఫ్టీ బాదిన వైభవ్
శ్రీలంక పర్యటనలో ట్రై సిరీస్ ఆఖరి ఘట్టానికి చేరుకుంది. ముక్కోణపు వన్డే టోర్నీ ఫైనల్లో శ్రీలంక-ఏ, ఇండియా-ఏ జట్టు తలప డుతున్నాయి. టాస్ గెలిచిన శ్రీలంక-ఏ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇండియా-ఏ దూకుడుగా ఆడుతోంది. వైభవ్ ధాటికి 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ 11 బంతుల్లోనే అర్ధసెంచరీ మార్క్ సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. అతడికి ప్రియాన్ష్ ఆర్య (22 బ్యాటింగ్) సహకరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు సాధించాడు. ఇప్పటివరకు సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ పేరిట ఉన్న రికార్డును వైభవ్ బద్దలుకొట్టాడు.తుది జట్లు:ఇండియా-ఏ: ప్రియాంష్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ(సి), కుమార్ కుషాగ్రా(w), సూర్యాంశ్ షెడ్గే, నిశాంత్ సింధు, అనుకుల్ రాయ్, విప్రజ్ నిగమ్, అశోక్ శర్మ, యశ్ ఠాకూర్శ్రీలంక-ఏ: నిరోషన్ డిక్వెల్లా(w), అవిష్క ఫెర్నాండో, నువానీదు ఫెర్నాండో, సదీర సమరవిక్రమ, సహన్ అరాచ్చిగే(సి), రవిందు ఫెర్నాండో, వనుజా సహన్, మహ్మద్ షిరాజ్, విజయకాంత్ వియాస్కాంత్, దులజ్ సముదిత, కుగతస్ మతులన్ -
వైభవ్‌ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఏమన్నాడంటే..
శ్రీలంక, భారత్, అఫ్గానిస్తాన్ ‘ఎ’ జట్ల మధ్య ముక్కోణపు సిరీస్ తుది అంకానికి చేరుకుంది. భారత్- శ్రీలంక టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. దంబుల్లా వేదికగా ఆదివారం ఇరుజట్ల మధ్య సిరీస్‌లో ఆఖరి అనధికారిక వన్డే సిరిస్ జరుగనుంది.ఈ నేపథ్యంలో శ్రీలంక- ‘ఎ’ జట్టు కెప్టెన్ సహాన్ అరాచిగే భారత స్టార్ వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. తాము ఫైనల్లో అతడిని టార్గెట్ చేయబోమని స్పష్టం చేశాడు. కాగా శ్రీలంక- భారత్ జట్ల మధ్య సోమవారం జరిగిన మ్యాచ్ ‘టై’ కాగా.. సూపర్ ఓవర్ నిర్వహించారు.ఇందులో శ్రీలంక విజయం సాధించగా.. ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. ఈ క్రమంలోనే లంక ప్లేయర్ కవ్వింపు చర్యలకు దిగగా.. వైభవ్ సూర్యవంశీ అతడి మీదకు దూసుకువెళ్లాడు. ఆ తర్వాత ఇద్దరూ పరస్పరం నెట్టేసుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా.. అంపైర్ వచ్చి ఆటగాళ్లను విడదీశాడు.ఈ ఘటన నేపథ్యంలో లంక ప్లేయర్‌తో పాటు వైభవ్కూ మొట్టికాయలు పడ్డాయి. ఇక ఫైనల్లో ఇరుజట్లు మరోసారి తలపడనున్న తరుణంలో వైభవ్ సూర్యవంశీ ఆట తీరు, అతడి ప్రవర్తనపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది.ఈ విషయం గురించి శ్రీలంక కెప్టెన్ సహాన్ అరాచిగే వద్ద స్పోర్ట్స్‌స్టార్ ప్రస్తావించగా.. ‘‘మా వాళ్లు ఎవరినీ, ఏ విషయాన్ని ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకోరు. మా ఆటను మేము ఆస్వాదిస్తున్నాము. సూపర్ ఓవర్ లాంటి సందర్భాల్లో ఆటగాళ్లు భావోద్వేగాలకు లోనుకావడం సహజం. ఆటలో ఇలాంటివి సాధారణం’’ అని స్పష్టం చేశాడు.ఇక భారత్‌తో ఫైనల్‌కు తాము పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామన్న అరాచిగే.. ‘‘బ్యాటింగ్ విషయంలో మాకు ఎలాంటి సమస్యా లేదు. మా బౌలింగ్ విభాగంలో ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లు మెరుగ్గా రాణిస్తున్నారు. మా జట్టు బాగుంది’’ అని పేర్కొన్నాడు. భారత్‌తో పోటీ కోసం తాము ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు.కాగా లీగ్ దశలో తొలుత శ్రీలంకపై భారత్ ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో గట్టెక్కగా.. రెండో మ్యాచ్‌లో లంక సూపర్ ఓవర్లో విజయం సాధించింది. ఇక ఇరుజట్లు అఫ్గానిస్తాన్‌పై గెలుపుతో ఫైనల్లో అడుగుపెట్టాయి. చదవండి: శ్రీలంక ఫైనల్ చేరిందిలా! -
భారత్‌తో ఫైనల్‌కు లంక స్పిన్నర్ దూరం.. జట్టులోకి ఆల్‌రౌండర్
Asia Cup 2023- India vs Sri Lanka In Final: ఊహించినట్లుగానే టీమిండియాతో ఫైనల్‌కు ముందు శ్రీలంకకు ఎదురుదెబ్బ తగిలింది. లంక స్టార్ స్పిన్నర్ మహీశ్ తీక్షణ జట్టుకు దూరమయ్యాడు. ఆసియా కప్-2023 సూపర్-4లో పాకిస్తాన్‌తో తాడో పేడో తేల్చుకోవాల్సిన మ్యాచ్ సందర్భంగా తీక్షణ గాయపడ్డాడు. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో తొడ కండరాలు పట్టేసినా బౌలింగ్ కొనసాగించి తన స్పెల్ పూర్తి చేశాడు. మెరుగైన ఎకానమీతో ఒక వికెట్ కూడా తీశాడు. అయితే, స్కానింగ్ అనంతరం గాయం తీవ్రమైనదిగా తేలినట్లు తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఆసియా కప్-2023 ఫైనల్‌కు అతడు దూరమైనట్లు తెలిపింది. మహీశ్ తీక్షణ స్థానంలో సహన్ అరాచిగేను జట్టులోకి తీసుకున్నట్లు ప్రకటించింది. తీక్షణను హై పర్ఫామెన్స్ సెంటర్‌కు పంపిస్తున్నట్లు లంక క్రికెట్ బోర్డు తెలిపింది. ఎవరీ సహన్ అరాచిగే? 27 ఏళ్ల సహన్ అరాచిగే.. బ్యాటింగ్ ఆల్‌రౌండర్. లెఫ్టాండ్ బ్యాటర్ అయిన అతడు.. రైట్ ఆర్మ్ ఆఫ్‌బ్రేక్ బౌలర్. జింబాబ్వేలో వన్డే వరల్డ్‌కప్-2023 క్వాలిఫయర్స్ సందర్భంగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో లంక తరఫున అరంగేట్రం చేశాడు. ఫైనల్లో టాప్ స్కోరర్ తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లో 5 ఓవర్లు బౌలింగ్ చేసి 18 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. అయితే, అతడికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఇక క్వాలిఫయర్స్ ఫైనల్లో నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో మాత్రం అదరగొట్టాడు సహన్. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 57 పరుగులతో రాణించి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అప్పటికే వరల్డ్‌కప్‌నకు అర్హత సాధించిన శ్రీలంక టాప్-1లో నిలపడంలో తన వంతు పాత్ర పోషించాడు. చదవండి: టీమిండియాకు షాక్.. ఫైనల్‌కు ఆల్‌రౌండర్ దూరం! లంకకు యువ క్రికెటర్..


