శ్రీలంకతో తొలి టెస్టు.. భారత్‌ బ్యాటింగ్‌ | IND A Vs SL A 1st Unofficial Test Galle, India Won Toss Opt To Bat, Check Out Updates And Final Squad Details | Sakshi
Sakshi News home page

శ్రీలంకతో తొలి టెస్టు.. భారత్‌ బ్యాటింగ్‌

Jun 25 2026 9:52 AM | Updated on Jun 25 2026 11:42 AM

IND A vs SL A 1st Unofficial Test Galle: India Won Toss Opt To Bat

PC: BCCI X

శ్రీలంక పర్యటనలో ముక్కోణపు వన్డే సిరీస్‌ను భారత్‌- ‘ఎ’ జట్టు ఇటీవలే ముగించుకుంది. ఈ క్రమంలో తాజాగా లంకతో అనధికారిక టెస్టు సిరీస్‌కు సిద్ధమైంది. ఈ టూర్‌లో భాగంగా ఆతిథ్య శ్రీలంక- ‘ఎ’ జట్టుతో భారత్‌ రెండు అనధికారిక టెస్టులు ఆడనుంది.

ధ్రువ్‌ జురెల్‌ సారథ్యంలో..
ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య గురువారం తొలి టెస్టు మొదలైంది. గాలే అంతర్జాతీయ స్టేడియం వేదికగా టాస్‌ గెలిచిన భారత్‌  లుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. యువ ఆటగాడు ధ్రువ్‌ జురెల్‌ ఈ సిరీస్‌లో భారత జట్టుకు కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌గా వ్యవహరిస్తున్నాడు.

వన్డే సిరీస్‌లో విజేతగా
ఈ జట్టులో జురెల్‌తో పాటు రుతురాజ్‌ గైక్వాడ్‌, సాయి సుదర్శన్‌, దేవ్‌దత్‌ పడిక్కల్‌, గుర్నూర్‌ బ్రార్‌ తదితర టీమిండియా స్టార్లు కూడా ఉన్నారు. కాగా శ్రీలంక, అఫ్గానిస్తాన్‌ ‘ఎ’ జట్లతో జరిగిన అనధికారిక వన్డే సిరీస్‌లో భారత్‌ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. 

లీగ్‌ దశలో లంక, అఫ్గాన్‌లపై ఒక్కో మ్యాచ్‌ గెలవడంతో పాటు.. ఒక్కో మ్యాచ్‌ ఓడిపోయినప్పటికీ.. అద్భుతమైన రన్‌రేటు కారణంగా తిలక్‌ వర్మ సేన ఫైనల్లో అడుగుపెట్టింది.

టైటిల్‌ పోరులో శ్రీలంకపై ఘన విజయం సాధించి చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో యువ ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ 29 బంతుల్లోనే 94 పరుగులు సాధించి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అందుకున్నాడు. 

ఇక ఈ సిరీస్‌ తర్వాత తిలక్‌ వర్మ, వైభవ్‌ సూర్యవంశీ టీమిండియాతో కలిశారు. సీనియర్‌ జట్టుతో కలిసి టీ20 సిరీస్‌ కోసం ఐర్లాండ్‌లో అడుగుపెట్టారు.

తుదిజట్లు
భారత్‌
సాయి సుదర్శన్, ఆయుశ్‌ పాండే, దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, ధృవ్ జురెల్(కెప్టెన్‌/ వికెట్‌ కీపర్‌), షేక్ రషీద్, హర్ష్ దూబే, సారాంశ్ జైన్, అన్షుల్ కాంబోజ్, యశ్ ఠాకూర్, ఆకిబ్ నబీ దర్

శ్రీలంక
పవంత వీరసింగే, నిరోషన్‌ డిక్‌విల్లా (వికెట్‌ కీపర్‌), నునానిదు ఫెర్నాండో, ఆషేన్‌ బండారా, సహాన్‌ అరాచిగే (కెప్టెన్‌), రవిందు ఫెర్నాండో, అంజాలా బండారా, కవిందు పతిరత్నె, దులాజ్‌ సముదిత, చమిక గుణశేఖర, దిలుమ్‌ సుదీర.

చదవండి: రాణించిన నితీశ్‌ రెడ్డి.. కరీంనగర్‌పై నల్గొండ గెలుపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement