breaking news
fastest fifty in odi
-
11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. బుడ్డోడి దెబ్బకు యువీ, ఏబీ డివిలియర్స్ రికార్డులు బద్దలు
-
వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు
ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా శ్రీలంక-ఏతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ 11 బంతుల్లోనే అర్ధసెంచరీ మార్క్ సాధించి ప్రపంచ రికార్డు సాధించాడు. లీగ్ దశలో లంక- ఏ ఆటగాళ్లతో గొడవను పర్సనల్‌గా తీసుకున్న వైభవ్ మ్యాచ్ ఆరంభం నుంచే లంక బౌలర్లను చీల్చి చెండాడుతూ ఫోర్లు, సిక్సర్లతో చెలరేగాడు. గతంలో లిస్ట్-ఏ క్రికెట్లో 2005లో శ్రీలంక క్రికెటర్ కౌషల్య వీరరత్నే 12 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ సాధించాడు. తాజాగా ఆ రికార్డును బద్దలు కొట్టిన వైభవ్ లిస్ట్-ఏ క్రికెట్లో అతి తక్కువ బంతుల్లో ఫిఫ్టీ సాధించిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు.అంతేకాదు వన్డే ఫార్మాట్లోనూ సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ రికార్డును వైభవ్ సూర్యవంశీ బద్దలు కొట్టాడు. ఏబీ డివిలియర్స్ 2015లో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో 16 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించాడు. వెస్టిండీస్ బ్యాటర్ మాథ్యూ ఫోర్డ్ కూడా 2025లో ఐర్లాండ్‌తో వన్డేలో 16 బంతుల్లోనే ఫిఫ్టీ మార్క్ సాధించాడు. అయితే వైభవ్ సూర్యవంశీ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ మార్క్ అందుకున్నది అనధికారిక వన్డే మ్యాచ్ కావడంతో అంతర్జాతీయంగా ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు మాత్రం ఏబీ డివిలియర్స్, మాథ్యూ ఫోర్డ్ పేరిటే ఉంది. ఇక టీ20 క్రికెట్లో యువరాజ్ సింగ్ 12 బంతుల్లో సాధించిన ఫిఫ్టీ రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉంది. అయితే క్రికెట్ చరిత్రలో ఏ ఫార్మాట్లోనైనా వైభవ్ సూర్యవంశీ (11 బంతుల్లో 50 పరుగులు)దే అత్యుత్తమం కావడం విశేషం. 10 FOURS & 8 SIXES IN JUST 29 BALLS FOR VAIBHAV SOORYAVANSHI IN TRI SERIES FINAL 🥶🔥pic.twitter.com/3x16I9ONwb— Johns. (@CricCrazyJohns) June 21, 2026India A's Vaibhav Sooryavanshi smashed the fastest-ever List A fifty, reaching the milestone in just 11 balls against Sri Lanka A in the Tri-Series final. pic.twitter.com/vnzipNcZ6U— Sri Lanka Tweet 🇱🇰 (@SriLankaTweet) June 21, 2026 HEARTBREAK FOR VAIBHAV SOORYAVANSHI. 💔- 94 (29) with 10 fours and 8 sixes in the Tri-Series Final against Sri Lanka. Vaibhav absolutely ruled the Final and answered everyone who were doubting him. 🫡15 YEAR OLD IS SHOWING THE WORLD HIS SLAYING POWERS. 🇮🇳 pic.twitter.com/vk4RX8hFb6— Mufaddal Vohra (@mufaddal_vohra) June 21, 2026Read: టీ20 ప్రపంచకప్ నుంచి పాకిస్తాన్ నిష్క్రమణ -
Asia Cup 2023: మొహమ్మద్ నబీ విధ్వంసం.. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు
ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ నబీ రికార్డు హాఫ్ సెంచరీ సాధించాడు. ఆసియా కప్-2023లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న కీలకమైన మ్యాచ్‌లో నబీ విధ్వంసకర అర్ధశతకంతో విరుచుకుపడ్డాడు. కేవలం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, ఆఫ్ఘనిస్తాన్ తరఫున వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని నమోదు చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ ఇన్నింగ్స్‌కు ముందు ఈ రికార్డు ముజీబ్ పేరిట ఉండేది. ముజీబ్ ఇదే ఏడాది పాక్‌పై 26 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదాడు. అంతకుముందు రషీద్ ఖాన్ (27 బంతుల్లో), మొహ్మమద్ నబీ (28), షఫీకుల్లా షిన్వారి (28) ఆఫ్ఘనిస్తాన్ తరఫున వన్డేల్లో వేగవంతమైన హాఫ్ సెంచరీలు చేశారు. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో నబీ మొత్తంగా 32 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 65 పరుగులు చేసి ఔటయ్యాడు. ఫలితంగా 292 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తున్న ఆఫ్ఘనిస్తాన్ ఒక్కసారిగా ట్రాక్ మార్చుకుని గెలుపుబాట పట్టింది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక.. కుశాల్ మెండిస్ (84 బంతుల్లో 92; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. పథుమ్ నిస్సంక (41), అసలంక (36), దునిత్ వెల్లెలెగె (33 నాటౌట్), కరుణరత్నే (32), తీక్షణ (28) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో గుల్బదిన్ 4 వికెట్లు పడగొట్టగా.. రషీద్‌ఖాన్ 2, ముజీబ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. 292 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ నబీ సునామీ ఇన్నింగ్స్‌తో విరుచుకపడటంతో 31 ఓవర్లలో 5 వికెట్లు నష్టానికి 234 పరుగులు చేసి, విజయానికి 58 పరుగుల దూరంలో ఉంది. -
పసికూనపై ప్రతాపం.. క్లీన్ స్వీప్ చేసిన విండీస్, ఫాస్టెస్ట్ ఫిఫ్టి రికార్డు కూడా..!
షార్జా వేదికగా యూఏఈతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను వెస్టిండీస్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. నిన్న జరిగిన మూడో వన్డేలో విండీస్ ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చి పసికూనపై ప్రతాపం చూపింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ.. విండీస్ స్పిన్నర్లు కెవిన్ సింక్లెయిర్ (4/24), కారియ (2/34) మాయాజాలం ధాటికి 36.1 ఓవర్లలో 184 పరుగులకు చాపచుట్టేసింది. యూఏఈ ఇన్నింగ్స్‌లో భారత సంతతి ఆటగాడు అరవింద్ (70) టాప్ స్కోరర్‌గా నిలువగా.. కెప్టెన్ ముహమ్మద్ వసీం (42), రమీజ్ షెహజాద్ (27), అలీ నసీర్ (13) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విండీస్.. అలిక్ అతనాజే (45 బంతుల్లో 65; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), షామారా బ్రూక్స్ (39), రోస్టన్ ఛేజ్ (27 నాటౌట్) రాణించడంతో మరో 89 బంతులు మిగిలుండగానే 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. యూఏఈ బౌలర్లలో అయాన్ అఫ్జల్, ముహమ్మద్ జవాదుల్లా, కార్తీక్ మెయ్యప్పన్ తలో 2 వికెట్లు పడగొట్టారు. కాగా, ఈ సిరీస్‌లో తొలి రెండు వన్డేల్లో విండీస్ ఘన విజయాలు సాధించిన విషయం తెలిసిందే. అరంగేట్రంలో ఫాస్టెస్ట్ ఫిఫ్టి.. విండీస్ ఓపెనర్ అలిక్ అతనాజే వన్డే అరంగేట్రంలో ఫాస్టెస్ట్ ఫిఫ్టి సాధించాడు. అతనాజే 26 బంతుల్లో ఈ ఫీట్ సాధించాడు. తద్వారా టీమిండియా ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా (26 బంతుల్లో) పేరిట ఉండిన రికార్డును సమం చేశాడు. టీమిండియాకే చెందిన మరో బ్యాటర్ ఇషాన్ కిషన్.. తన వన్డే అరంగేట్రంలో 33 బంతుల్లో ఫిఫ్టి చేశాడు. చదవండి: మిగతా వారు ఏదో ఒక రకంగా పనికొచ్చారు.. నువ్వేందుకు, దండగ.. ఉమేశ్‌పై ఫ్యాన్స్ ఫైర్ -
18 బంతుల్లో హాఫ్ సెంచరీ
డంబుల్లా: శ్రీలంకతో నాలుగో వన్డేలో ఆస్ట్రేలియా ఓపెనర్ ఆరోన్ ఫించ్ బ్యాట్‌తో మెరుపులు మెరిపించాడు. 18 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో రికార్డు హాఫ్ సెంచరీ చేశాడు. ఆస్ట్రేలియా తరఫున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన బ్యాట్స్‌మన్‌గా రికార్డును సమం చేశాడు. గతంలో ఆస్ట్రేలియా జట్టు తరఫున మ్యాక్స్‌వెల్, సిమోన్ ఓడానెల్ పేరిట ఈ రికార్డు ఉంది. కాగా ఓవరాల్‌గా అంతర్జాతీయ వన్డే క్రికెట్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన రికార్డు దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిల్లీర్స్ ఖాతాలో ఉంది. గతేడాది వెస్టిండీస్‌తో జొహాన్నెస్‌బర్గ్‌లో జరిగిన వన్డేలో డివిల్లీర్స్ 16 బంతుల్లో అర్ధశతకం బాదాడు. డంబుల్లా వన్డేలో తొలుత బ్యాటింగ్‌కు దిగిన లంక పూర్తి ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. ధనంజయ డిసిల్వా (76) హాఫ్ సెంచరీ, మాథ్యూస్ 40 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్ హేస్టింగ్స్ 6 వికెట్లు పడగొట్టాడు. లక్ష్యఛేధనలో ఫించ్ రికార్డు హాఫ్ సెంచరీ చేశాడు. కాగా హాఫ్ సెంచరీ చేసిన తర్వాత మరుసటి బంతికే ఫించ్ అవుటయ్యాడు.


