ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ.. చరిత్ర సృష్టించిన ఆసీస్‌ బ్యాటర్‌ | Jake Fraser McGurk Record 14 Ball Half Century, Check Out Fastest List A Half Centuries And Australia One Day Cup Records | Sakshi
Sakshi News home page

ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ.. చరిత్ర సృష్టించిన ఆసీస్‌ బ్యాటర్‌

Oct 17 2026 12:10 PM | Updated on Oct 17 2026 1:40 PM

Jake Fraser McGurk Slams Fastest Fifty For Australia In List A Cricket

PC: CA/X

ఆస్ట్రేలియా క్రికెటర్‌ జేక్‌ ఫ్రేజర్‌ మెగర్క్‌ చరిత్ర సృష్టించాడు. ఆసీస్‌ తరఫున లిస్ట్‌-‘ఎ’ క్రికెట్‌లో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ బాదిన బ్యాటర్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా ఈ జాబితాలో టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ అగ్రస్థానంలో ఉండగా.. మెగర్క్‌ నాలుగో స్థానంలో నిలిచాడు.

14 బంతుల్లోనే అర్ధ శతకం
జేక్‌ ఫ్రేజర్‌ మెగర్క్‌ ప్రస్తుతం దేశీ వన్డే కప్‌తో బిజీగా ఉన్నాడు. సౌత్‌ ఆస్ట్రేలియా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు.. క్వీన్స్‌లాండ్‌తో మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లపై ఆది నుంచే విరుచుకుపడ్డ ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. కేవలం 14 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.

49 బంతుల్లోనే సెంచరీ
తద్వారా ఆస్ట్రేలియా వన్డే కప్‌ చరిత్రలో ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ బాదిన క్రికెటర్‌ మెగర్క్‌ చరిత్రకెక్కాడు. ఇక హాఫ్‌ సెంచరీ తర్వాత కూడా అదే జోరు కొనసాగిస్తూ.. 49 బంతుల్లోనే శతకం బాదాడు. మొత్తంగా కేవలం 63 బంతుల్లోనే పది ఫోర్లు, తొమ్మిది సిక్స్‌ల సాయంతో 122 పరుగులు సాధించాడు.  

ఆస్ట్రేలియా వన్డే కప్‌ చరిత్రలో ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ బాదిన క్రికెటర్లు
జేక్‌ ఫ్రేజర్‌-మెగర్క్‌- సౌత్‌ ఆస్ట్రేలియా తరఫున క్వీన్స్‌లాండ్‌పై 14 బంతుల్లో ఫిఫ్టీ (2026)
జేక్‌ ఫ్రేజర్‌-మెగర్క్‌- సౌత్‌ ఆస్ట్రేలియా తరఫున టాస్మేనియాపై 18 బంతుల్లో ఫిఫ్టీ (2023)
గ్లెన్‌ మాక్స్‌వెల్‌- విక్టోరియా తరఫున టాస్మేనియాపై 19 బంతుల్లో ఫిఫ్టీ (2010-11)
మిచెల్‌ ఓవెన్‌- టాస్మేనియా తరఫున విక్టోరియాపై 20 బంతుల్లో ఫిఫ్టీ (2025)

లిస్ట్‌- ‘ఎ’ క్రికెట్‌లో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ చేసిన క్రికెటర్లు
వైభవ్‌ సూర్యవంశీ- ఇండియా- ‘ఎ’ తరఫున శ్రీలంక- ‘ఎ’పై 2026లో 11 బంతుల్లో ఫిఫ్టీ
కౌశల్య వీరరత్నె- రాగమ తరఫున కరునెగలపై 2005-06లో 12 బంతుల్లో ఫిఫ్టీ
తిశారా పెరీరా- శ్రీలంక ఆర్మీ తరఫున బ్లూమ్‌ఫీల్డ్‌పై 2020-21లో 13 బంతుల్లో
రోరీ క్లెవిన్‌వెల్ట్‌- వెస్టర్న్‌ ప్రావిన్స్‌ తరఫున క్వాజులూ నాటల్‌పై 2010-11లో 14 బంతుల్లో
జేక్‌ ఫ్రేజర్‌ మెగర్క్‌- సౌత్‌ ఆస్ట్రేలియా తరఫున క్వీన్స్‌లాండ్‌పై 2026లో 14 బంతుల్లో ఫిఫ్టీ. 

ఇదీ చదవండి: భారత జట్టు కెప్టెన్‌గా కృనాల్‌ పాండ్యా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement