తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కె. నిరంజన్‌రెడ్డి నిర్మించిన సినిమా ‘హను మాన్’. ఈ చిత్రంలో అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటించారు. 2024 సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా రూ. 300 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టి, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
ఈ సినిమా త్రీడీ వెర్షన్‌లో ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ‘హను మాన్ 3డీ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు సాయి దుర్గాతేజ్ అతిథిగా హాజరయ్యారు.


