రాఖీ సావంత్‌ అందం కోసం అంత ఖర్చు పెడుతుందా..? జస్ట్‌ జుట్టు కోసమే రూ. 12 లక్షలు.. | Rakhi Sawant Reveals Cost Of Her Russian Hair | Sakshi
Sakshi News home page

Rakhi Sawant: అందం కోసం అంత ఖర్చు పెడుతుందా..? జస్ట్‌ జుట్టు కోసమే రూ. 12 లక్షలు..

Jun 22 2026 6:09 PM | Updated on Jun 22 2026 6:43 PM

Rakhi Sawant Reveals Cost Of Her Russian Hair

బాలీవుడ్‌ బ్యూటీ రాఖీ సావంత్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె తన స్పెషల్ పాటలతో ఫేమస్ అయ్యింది. అంతేగాదు ముక్కుసూటిగా మాట్లాడుతూ వివాదాస్పదురాలిగా ముద్రవేయించుకుంది. ఎవరేమన్నా..తన ఆలోచన, తనదైన నిర్ణయం ఫైనల్‌ అని కరాఖండీగా చెప్పేస్తుందామె. కెరీర్‌లో ఎన్నో విమర్శలు, ఒడిదుడుకులు ఎదురైనా..అధిగమించి నిలబడిన వ్యక్తి రాఖీ సావంత్‌. అయితే ఆమె ఇటీవల క్వీనీ సింగ్ పోడ్‌కాస్ట్‌లో తాను అందం కోసం ఎంతలా ఖర్చు చేసిందో బయటపెట్టింది. అన్నింట్లకంటే డబ్బే ముఖ్యమని, అది లేకుండా జీవితంలో ఏ ఒక్క పని జరగదని నర్మగర్భంగా చెప్పి అందర్ని విస్తుపోయాలా చేసింది. ఆమె అందం కోసం డబ్బుని ఎలా ఖర్చు పెడుతుందో వింటే నోటమాటరాదు.

బ్యూటీ బ్రాండ్‌ BiE వ్యవస్థాపకురాలు, సీఈవో అయిన రాఖీ పేదరికాన్ని ద్వేషిస్తానని అంటోంది. ప్రతీదానికి డబ్బే పరిష్కారమని అంటోంది. ఆమె డబ్బు ఎంత కావాలని కోరుకుంటుందంటే..తన బెడ్‌పై పరచినంత డబ్బు సంపాదించాలని ఉందట ఆమెకు. పైగా ఆ డబ్బుని స్టైలింగ్ కోసం ఖర్చు చేస్తానని తేల్చి చెప్పింది. తన యాక్సెసరీలను చూపిస్తూ..తన జుట్టుని పట్టుకుని ఇది రష్యన్‌ హెయిర్‌ అని ఒక్కసారికే రూ. 12 లక్షలు ఖర్చు అవుతాయని అంటోంది. 

దీన్నిదుబాయ్, లండన్, కెనడా, అమెరికాలో మాత్రమే చేస్తారని అంటోంది. గోళ్లు, కనురెప్పల అందం కోసం ఆఫ్రికా వెళ్తానని, ఆఖరికి దవడ, బుగ్గలు, పెదవులు వీటన్నింటికీ ఎంతో డబ్బు ఖర్చు పెట్టానంటోంది. తాను ఎన్నటికీ పేదరికంలోకి రానంతగా డబ్బు సంపాదిస్తానని..అదంతా కూడా తన ఫ్యాషన్‌ కోసమే ఖర్చు చేస్తానని పేర్కొంది.  

ఆఖరికి మానసిక ఆరోగ్య సమస్యలకు కూడా డబ్బే పరిష్కారం అని చెబుతుండటం విశేషం. తనకు నిరాశ కలిగినప్పుడూ కూడా మనీ టన్‌, మనీ సెటమాల్‌, మనీ సింగ్‌ అనే మందులు తన దగ్గర ఉంటాయని నవ్వుతూ చెబుతోంది. తాను డబ్బు సంపాదించడానికి చేయగలిగిందంతా చేస్తానని, కేవలం జీవనోపాధి కోసం కెమెరా ముందు ధైర్యంగా మారిన ఒక అమాయక బాలికనని ఆవేదనగా చెప్పుకొచ్చింది. 

కాగా, గతంలో రాఖీ తన తల్లి అనారోగ్యానికి వైద్యం చేయించడానికి, అలాగే తన గర్భాశయంలో కణితిని తొలగించుకోవడానికి పడ్డ ఆర్థిక కష్టాలే ఆమె ఆలోచన తీరుకి కారణమని తెలుస్తోంది. అయితే ఒక మనిషి తాను ఎదుర్కొనే పరిస్థితి అతడిని ఎంతలా మార్చేస్తుందనడానికి రాఖీనే నిదర్శనం కదూ..!.

 

(చదవండి: Weight Loss: 144 కిలోలు నుంచి 65 కిలోలు..! నో జిమ్‌, నో ట్రైనర్‌ జస్ట్..)

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement