‘దళితులపై దాడులు జరిగితే చంద్రబాబు పట్టించుకోవడం లేదు’ | Jada Sravan Slams AP Govt | Sakshi
Sakshi News home page

‘దళితులపై దాడులు జరిగితే చంద్రబాబు పట్టించుకోవడం లేదు’

Mar 26 2026 4:27 PM | Updated on Mar 26 2026 6:10 PM

Jada Sravan Slams AP Govt

విజయవాడ:   ముఖ్యమంత్రి చంద్రబాబుకు దళితుల ఓట్లు మాత్రమే కావాలి తప్ప, వారిపై దాడులు జరిగితే మాత్రం పట్టించుకోవడం లేదని  జై భీమ్ రావు భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్‌ కుమార్‌ మరోసారి ధ్వజమెత్తారు. అంబేద్కర్‌ పేరు పెట్టిన జిల్లాలో దుర్మార్గం జరిగితే చర్యలేవి చంద్రబాబు? అని ప్రశ్నించారు.

‘పవన్‌ సొంత నియోజకవర్గంలో దళితులపై వివక్ష కొనసాగుతుంది. దళితుడి చనిపోతే అగ్రకులాలు శవాన్ని తీసుకెళ్లనివ్వని పరిస్థితి. ఇంత జరుగుతుంటే పవన్‌ ఎందుకు స్పందించడం లేదు.  పిఠాపురం నియోజకవర్గంలో కులవివక్ష కనిపించడం లేదా పవన్‌? అని నిలదీశారు. 

టీటీడీ చైర్మన్‌, జనసేన ఎమ్మెల్యే, డ్రగ్స్‌ తీసుకున్న ఎంపీపై చర్యలేవని ప్రశ్నించారు. బర్త్‌ డే పార్టీలు, ఆట పాటల్లో హోంమంత్రి బిజీగా ఉన్నారని, ఇక డిప్యూటీ సీఎం పవన్‌ షూటింగ్స్‌లో బిజీగా ఉన్నారంటూ విమర్శించారు. 

శవాన్ని తీసుకెళ్తుంటే 100 మంది దాడి చేశారు.. డిప్యూటీ సీఎంకి ఒకటే ప్రశ్న.

 

 

Advertisement
 
Advertisement
Advertisement