‘దళితులపై వివక్ష చూపడం దారుణం’ | Discrimination Against Dalits is Outrageous Jada Sravan Kumar | Sakshi
Sakshi News home page

‘దళితులపై వివక్ష చూపడం దారుణం’

Mar 22 2026 8:50 PM | Updated on Mar 26 2026 4:18 PM

Discrimination Against Dalits is Outrageous Jada Sravan Kumar

జడ శ్రవణ్‌ కుమార్‌(ఫైల్‌ఫోటో)

కుందాలపల్లి: డాక్టర్‌  బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా పి. గన్నవరం మండలం కుందాలపల్లిలో కుల వివక్షకు గురైన బాధితులను జై భీమ్ రావు భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్‌ కుమార్‌ పరామర్శించారు. ఈ మేరకు బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కుందాలపల్లిలో దళితులపై వివక్ష చూపడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు జడ శ్రవణ్‌.  

ఎస్సీ వర్గాలపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. బాధితు కుటుంబానికి తానే న్యాయవాదిగా ఉండి వాదిస్తానని శ్రవణ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement