కూటమి ప్రభుత్వ ప‌త‌నానికి కార‌కుడు | Jada Sravan Kumar Demands Deputy Speaker RRR Removal, Alleges Attacks On Dalits And Christians In AP | Sakshi
Sakshi News home page

బ్యాంకులను కొల్లగొట్టిన దొంగ.. ఆర్ధిక ఉగ్రవాది

Jun 10 2026 3:54 PM | Updated on Jun 10 2026 5:40 PM

Jada Sravan Kumar Latest Attack on Raghu Rama Krishna Raju

రఘురామకృష్ణంరాజుపై జడ శ్రవణ్ కుమార్ ఫైర్‌

సాక్షి, విజ‌య‌వాడ‌: ఏపీలో కూటమి ప్రభుత్వం పతనమవ్వడానికి డిప్యూటీ స్పీక‌ర్‌ రఘురామకృష్ణంరాజు కారణమవుతారంటూ జై భీమ్ రావు భారత్ పార్టీ అధ్య‌క్షుడు జడ శ్రవణ్ కుమార్ ధ్వ‌జ‌మెత్తారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. దళితులు, క్రైస్తవులపై ఆర్ధిక ఉగ్రవాది దాడిచేస్తున్న రఘురామకృష్ణంరాజును తక్షణమే డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌వి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆయ‌న‌ను బర్తరఫ్ చేసే వరకూ త‌న‌ పోరాటం ఆగద‌ని ప్ర‌క‌టించారు. బ్యాంకులను కొల్లగొట్టిన ఈ దొంగను కూట‌మి ప్రభుత్వం నియంత్రించలేకపోతోందని విమ‌ర్శించారు. బాయ్‌కాట్ రఘురామకృష్ణంరాజు ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నామ‌ని చెప్పారు.

''భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ఈ దేశంలో అందరూ సమానమేనని చెప్పింది. ఎవరి మతాలు వారిని పూజించుకోవడానికి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు స్వేచ్ఛను ఇచ్చాయి. కానీ మతసాంప్రదాయాల మీద రఘురామకృష్ణంరాజు దాడి చేస్తున్నాడు. ఏపీలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అమలవుతుందని అనక తప్పడం లేదు. దళితులు, క్రైస్తవులపై రఘురామకృష్ణంరాజు అర్ధిక ఉగ్రవాదిలా దాడిచేస్తున్నాడు. దళితులు, క్రైస్తవుల ఓట్లు తనకు వద్దని చెప్పిన రఘురామకృష్ణం రాజు చెబుతున్నారు. సిగ్గు, శరం, లజ్జా , అభిమానం ఉంటే త‌న‌ పదవికి రాజీనామా చేయాలి. దళితులు, క్రైస్తవులు కట్టే పన్నుల నుంచి జీతం తీసుకోనని ప్రకటించాలి. మేకుల దేవుడు అని దైవాన్ని కించపరుస్తున్న నీకు అదే మేకులతో సమాధానం చెప్పే రోజు వస్తుంది.

తెలుగువీర లేవరా పేరుతో ఎస్సీ ఉద్యోగులపై నిఘా పెట్టారు. చర్చిలకు వెళుతున్న ఎస్సీ ఉద్యోగులను వేధింపుల‌కు గురి చేస్తున్నారు. ఎస్సీ ఉద్యోగుల తల్లిదండ్రుల సమాధులను ఫోటోలు తీసి అధికారులకు పంపిస్తున్నారు. ఆ ఫోటోలను అడ్డుపెట్టకుని క్యాస్ట్ సర్టిఫికెట్లు రద్దు చేయాలని చెప్పడం నీచమైన పని. రఘురామకృష్ణంరాజు దళం ఇస్తున్న ఫిర్యాదులను తీసుకుని అధికారులు షోకాజ్ నోటీసులిస్తున్నారు. డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉండి ఒక మతాన్ని టార్గెట్ చేయడం ఎంత వరకూ సమంజసం? అధికారులకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 కనిపించడం లేదు. రఘురామకృష్ణంరాజు పంపించిన సూట్ కేసులో డబ్బు మాత్రమే కనిపిస్తోంది.

రఘురామకృష్ణంరాజు పంపించిన 6.5 కోట్ల రూపాయలు తీసుకుని ఆకువీడులో నిర్మాణాలకు అనుమతిలిచ్చారు. బ్యాంకుల నుంచి దోచుకున్న డబ్బు ఆయ‌న వ‌ద్ద‌ వద్ద దండిగా ఉన్నాయి. ఐదేళ్లూ ఢిల్లీలో కూర్చుని పిజ్జాలు, బర్గర్లు , కేఎఫ్‌సీ చికెన్లు తిన్నప్పుడు శ్రీరాముడు గుర్తుకురాలేదా? కాక్ టెయిల్ పార్టీలకు వెళ్లినప్పుడు జై శ్రీరామ్ నినాదం మీకు గుర్తుకు రాలేదా? తల్లిదండ్రుల మాటలకు కట్టుబడి వనవాసం చేసిన ఆ శ్రీరాముడు ఎక్కడ, బ్యాంకులను లూటీ చేసిన నువ్వెక్కడ? జై శ్రీరామ్ నినాదం పేరుతో నీ మెడలో వేసుకున్న కండువా కూడా నిన్ను చూసి సిగ్గుపడుతోంది.

రఘురామకృష్ణం రాజు చెప్పాడని 50 ఏళ్ల నుంచి ఉన్న చర్చిలను కూల్చేస్తామంటున్నారు అధికారులు. 40, 50 ఏళ్ల నుంచి చర్చిలు ఉన్నప్పుడు అధికారులు నిద్రపోయారా? చర్చిలపై ఉన్న మైకులు తొలగించాలని డీజీపీకి రఘురామకృష్ణంరాజు లేఖరాయడం దుర్మార్గం. జూన్ 28న ఏలూరు బహిరంగ సభలో బాయ్‌కాట్ రఘురామ పిలుపునివ్వబోతున్నాను. ఆ రోజుతో రఘురామకృష్ణంరాజు రాజకీయ జీవితం ముగియనుంది. డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉండి కోటి 10 లక్షల మంది దళిత, క్రైస్తవులపై దాడి చేయడం సమంజసమేనా? రఘురామకృష్ణంరాజు మాటలు కొన్ని కోట్ల మంది హృదయాలను గాయపరిచాయి. నీ జీవితంలో అశాంతి మొదలైంది.. నీ రాజకీయ, ఆర్ధిక పతనం ప్రారంభమైంది. 

నీకు పర్మిషన్లు ఇచ్చిన అధికారులను కోర్టులో గుంజీలు తీయిస్తా. రఘురామకృష్ణంరాజు చెప్పగానే గొంతేనమ్మ ఆలయాన్ని కూల్చేయించారు. కలెక్టర్‌ను నేను ఇదే హెచ్చరిస్తున్నా.. మీ సర్వీసంతా వెంటాడుతూనే ఉంటా. లంచం తీసుకుని రఘురామకృష్ణంరాజుకు కలెక్టర్ సాయం చేశారు. కలెక్టర్.. మీరు మీరు ఎక్కడున్నా మిమ్మల్ని మాత్రం నేను విడిచిపెట్టను. చదువుకుంటున్న పిల్లలపై కూడా కేసులు పెట్టించి వేధించారు.

మొన్నటి వరకూ తాను క్రిస్టియన్ అని హోంమంత్రి అనిత చెప్పారు. ఎప్పుడూ తన చేతిలో బైబిల్ ఉంటుందని చెప్పారు. కానీ హోంమంత్రి అనిత ఇప్పుడు హిందువు ముసుగు వేసుకున్నారు. తన హోంమంత్రి పదవి పోతుందనే భయంతో బైబిల్ తీసి అటకపై పెట్టారు. బైబిల్ చదవడం మీకు అంత తప్పుగా కనిపిస్తుందా? మనల్ని అసహ్యించుకుంటున్నప్పుడు అనితకు, రఘురామకృష్ణంరాజుకు మనం ఓటెందుకు వేయాలి? 

చ‌ద‌వండి: మా బిడ్డ‌ల‌ కాపురాలు కూలిపోతున్నాయి

జూన్ 28వ తేదీ నుంచి ఎవరైనా మతాలను కించపరిచేలా యూట్యూబ్‌లలో ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదు. మీ ఛానల్స్ మూతవేయిస్తామని హెచ్చరిస్తున్నా. వెయ్యి మందితో ఒక ఫోర్స్ తయారు చేస్తున్నాం. మతాలను టార్గెట్ చేసుకుని ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. రఘురామకృష్ణం రాజు తన గొయ్యి తనే తవ్వుకుంటున్నాడు. మ‌రోసారి క్రిస్టియానిటీని టార్గెట్ చేస్తూ ఒక్క మాట నీ నోటి నుంచి వచ్చినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. రఘురామకృష్ణంరాజును బర్తరఫ్ చేసే వరకూ నా పోరాటం ఆగదని జ‌డ శ్ర‌వణ్ కుమార్ అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement