విజయనగరం: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి | Lorry Rams Into Bolero Near Chelluru Vizianagaram | Sakshi
Sakshi News home page

విజయనగరం: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

Jul 28 2026 6:49 AM | Updated on Jul 28 2026 11:18 AM

Lorry Rams Into Bolero Near Chelluru Vizianagaram

సాక్షి, విజయనగరం: మండలంలోని చెల్లూరు హైవేపై సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అనకాపల్లి జిల్లా పద్మనాభం మండల కేంద్రానికి చెందిన 16 మంది రాయగడ మజ్జిగౌరమ్మ దర్శనానికి బొలెరో వాహనంలో వెళ్తుండగా విశాఖ నుంచి వస్తున్న ఓ లారీ చెల్లూరు వద్ద వెనక నుంచి బలంగా బొలెరోను ఢీకొట్టింది.

ఈ దుర్ఘటనలో అక్కడక్కడే ముగ్గురు దుర్మరణం చెందగా మరో 10 మందికి తీవ్రగాయా­లయ్యా­యి. మృతుల్లో చింతపల్లి రాంబాబు (50), మజ్జి నారాయణరావు(50), బొత్స మోహన్‌నాయుడు(8) ఉన్నారు. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను విజయనగరం సర్వజన ఆస్పత్రికి పోలీసుల వాహనంలో తరలించారు. లారీ డ్రైవరు పరారీలో ఉన్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement