‘ఈనెల 28వ తేదీన లక్షమందితో సభ’ | Jada Sravan Kumar Takes On Raghurama Krishnam Raju | Sakshi
Sakshi News home page

‘ఈనెల 28వ తేదీన లక్షమందితో సభ’

Jun 5 2026 4:30 PM | Updated on Jun 5 2026 5:42 PM

Jada Sravan Kumar Takes On Raghurama Krishnam Raju

భీమవరం(పశ్చిమగోదావరి జిల్లా): డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై జై భీమ్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ ధ్వజమెత్తారు.  దళిత క్రైస్తవులపై రఘురామకృష్ణరాజు కక్ష గట్టారని మండిపడ్డారు. 113 చర్చిలను తొలగించాలని ఏ అధికారంతో లేఖ రాశారని రఘురామను ప్రశ్నించారు శ్రవణ్‌. 

రఘురామ కృష్ణరాజును వెంటనే డిప్యూటీ స్పీకర్ పదవి నుండి తొలగించాలని డిమాండ్‌ చేశారు.  రాష్ట్రంలో రఘురామకృష్ణరాజు దళం పేరుతో కొంతమంది అర్ధరాత్రులు తిరుగుతున్నారని విమర్శించారు. రఘురామకృష్ణరాజు వైఖరి కారణంగా రాష్ట్రంలో ఉన్న కోటి 10  లక్షల మంది దళితులు దళిత క్రైస్తవులు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రఘురామకృష్ణరాజుకు అల్టిమేటం ఇవ్వడానికి ఈనెల 28వ తేదీన ఏలూరులో లక్షమంది దళితులు, దళిత క్రైస్తవులతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. 

జూన్ 28న మీరు పెట్టే పొలికేక ప్రభుత్వాన్ని గడ గడ లాడించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement