సాక్షి,అమరావతి: రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఫ్లాటు ఎందుకు ఇవ్వలేదని జై భీమ్ రావు భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల్ని అచ్చెన్నాయుడు నిందించడం ఏంటి?. టీడీపీకి ఓట్లు వేయకపోతే రాష్ట్ర ప్రజలు తప్పు చేసినట్లా?. ఓట్లు వేయకపోతే ప్రజలను నిందిస్తారా?. ప్రభుత్వం తప్పులు చేస్తున్నా ప్రజలు చూస్తూ ఊరుకోవాలా?. అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు ఫ్లాటు ఎందుకు ఇవ్వలేదు. చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా?. కళ్లు ఆర్పకుండా చంద్రబాబు రైతులను మోసం చేస్తున్నారు’అని దుయ్యబట్టారు.


