బాబూ.. రైతుల ఆత్మహత్యలు కనిపించడం లేదా?: వైఎస్‌ జగన్‌ | YS Jagan Devarapalli Visit: YSRCP Chief Inspects Tobacco Auction Centre and Interacts with Farmers | Sakshi
Sakshi News home page

బాబూ.. రైతుల ఆత్మహత్యలు కనిపించడం లేదా?: వైఎస్‌ జగన్‌

Aug 5 2026 8:53 AM | Updated on Aug 5 2026 5:07 PM

YS Jagan Devarapalli tobacco auction center Visit Live Updates

సాక్షి, దేవరపల్లి: ఏపీలో చంద్రబాబు పాలనలో విద్య, వైద్య, పారిశ్రామిక రంగాల్లో విధ్వంసం కనిపిస్తోందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు నమోదు చేసి, అరెస్టులకు పాల్పడుతున్నారని విమర్శించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వానికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. గిట్టుబాటు ధర లేక పొగాకు రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు.

వైఎస్ జగన్ బుధ‌వారం తూర్పు గోదావరి జిల్లాలోని దేవరపల్లిలో పర్యటించారు. ఈ సందర్బంగా పొగాకు యార్డులో రైతులను పరామర్శించి.. కొనుగోలు కేంద్రం వారితో ముఖాముఖి అయ్యారు. అనంతరం వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడుతూ.. ’చంద్రబాబు పాలనలో అన్ని వర్గాలు నష్టపోతున్నాయి. విద్య, వైద్య, పారిశ్రామిక రంగాల్లో విధ్వంసం కనిపిస్తోంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు, అరెస్టులు. చంద్రబాబుది వెన్నుపోటు పార్టీ. చంద్రబాబు వల్ల ప్రజలకు బాధే మిగిలింది. 27 నెలల బాబు పాలనలో రైతులకు గిట్టుబాటు ధర లేదు. రాష్ట్రంలో రైతులు రోడ్డునపడ్డారు. రైతుల ఆత్మహత్యలు ప్రభుత్వానికి కనబడటం లేదా?. బాధిత రైతు కుటుంబాలను కనీసం పరామర్శించలేదు.

చంద్రబాబు పాలనలో రైతులు నష్టపోయారు. పొగాకుతో పాటు ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. పొగాకు రైతులు ఆందోళనలో ఉన్నారు. గిట్టుబాటు ధర రాక వెంకటేశ్వరరావు అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కుటుంబాన్ని ప్రభుత్వ పెద్దలు పరామర్శించలేదు. వైఎస్సార్‌సీపీ హయాంలో పొగాకు ధర రూ.289గా ఉంది. కానీ, ఇప్పుడు కేజీ పొగాకు ధర రూ.236 మాత్రమే పలుకుతోంది. కూటమి ఉత్తరాది ప్రాంతంలో టొబాకో బోర్డు 49.70 మిలియన్ కేజీల పొగాకును కొనుగోలు చేస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చినప్పటికీ 10 మిలియన్ కేజీలు (20% కంటే తక్కువ) మాత్రమే కొనుగోలు చేశారు. ​రాష్ట్రంలో ఈ సంవత్సరం 232 మిలియన్ కేజీల పొగాకు ఉత్పత్తి కాగా. ఇప్పటివరకు కేవలం 47.3 మిలియన్ కేజీలు (సుమారు 21%) మాత్రమే కొనుగోలు జరిగింది. ​

వేలం కేంద్రాలలో 30% నుండి 40% వరకు పొగాకును రిజెక్ట్ చేస్తున్నారు.  వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి ప్రతి గ్రేడ్‌కు ప్రారంభ ధరను నిర్ణయించడం వల్ల కంపెనీల మధ్య పోటీ పెరిగి రైతులకు మంచి ధర లభించింది. రూ. 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ఐదేళ్లలో రూ. 7,800 కోట్ల మేర కొనుగోళ్లు చేపట్టాం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సకాలంలో రుణాలు చెల్లించిన రైతులకు రూ. 1 లక్ష వరకు సున్నా వడ్డీ రుణాలు ఇచ్చాం. 84.66 లక్షల మంది రైతులకు రూ. 2,050 కోట్లు అందించాం.  చంద్రబాబు వచ్చాక సున్నా వడ్డీ పథకం రద్దు చేశారు. రైతు భరోసా సాయంలో కూడా కోతలు పెట్టారు. చంద్రబాబు పాలన రైతులకు హానికరం. కూటమి ప్రభుత్వం దళారీతో రాజీ పడింది. దళారులు సిండికేటుగా మారి రైతుల పొట్టగొడుతున్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను ఆదుకుంటాం’ అని హామీ ఇచ్చారు. 

వైఎస్‌ జగన్‌తో ఆవేదన చెప్పుకున్న రైతులు..
అ‍ంతకుముందు.. వైఎస్‌ జగన్‌తో దేవరపల్లి పొగాకు రైతులు తమ ఆవేదనను చెప్పుకున్నారు. గిట్టుబాటు ధర లేదని వాపోయిన పొగాకు రైతులు. కూటమి ప్రభుత్వం వచ్చాక నష్టపోయామని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క ఎమ్మెల్యే, ఎంపీగానీ ఇక్కడికి రాలేదన్న రైతులు. 98 శాతం పొగాకును రూ.170కే కొంటున్నారు. మీరు వస్తున్నారని రూ.10 పెంచారు.

వైఎస్సార్‌సీపీ హయాంలో లక్ష వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో రుణానికి వడ్డీ వసూలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉందన్నారు.  కేజీ పొగాకుకు రూ.70 నష్టపోతున్నాం. పొగాకు కొనే దాని కంటే రిజక్ట్‌ చేసేదే ఎక్కువ. ఎకరానికి రూ.3 లక్షల పెట్టుబడి.. గిట్టుబాటు రావడం లేదు. వైఎస్సార్‌సీపీ హయాంలో లోగ్రేడ్‌ పొగాకు కూడా కొనేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వంతో మేము నష్టపోతున్నాం అని అన్నారు. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement