
తిరువంబడి: కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఒక ఆసక్తికర ఘటనను సోషల్ మీడియాలో పంచుకున్నారు. కేరళలోని తిరువంబడిలో గల ఒక డెయిరీ ఫామ్‌కు వెళ్లినప్పటి సందర్భాన్ని ఆమె షేర్ చేశారు. తన సోషల్ మీడియా పోస్ట్‌లో ఆమె.. తాను డెయిరీ ఫామ్‌లో ‘అలియా భట్’ను కలుసుకున్నానని తెలిపారు. అయితే ఇక్కడ ఆలియా భట్ అంటే బాలీవుడ్ స్టార్ కాదు.. అదే పేరు కలిగిన అందమైన ఆవు.
Met a group of dairy farmers at a dairy farm run by the loveliest family (and even encountered a cow named Alia Bhatt!!, due apologies to Ms.Bhatt @aliaa08, but she was really a cutie pie!).
Unfortunately dairy farmers are struggling with multiple difficulties and many are… pic.twitter.com/p36oeAZTbF— Priyanka Gandhi Vadra (@priyankagandhi) October 7, 2025
‘డెయిరీ ఫామ్‌లో పాడి రైతుల బృందాన్ని కలుసుకున్నాను. అక్కడే అలియా భట్ అనే ఆవును కూడా కలుసుకున్నాను. అయితే అలియా భట్‌కు క్షమాపణలు’ అని ప్రియాంక ఆ పోస్టులో రాశారు. పాడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రియాంకా గాంధీ దృష్టి సారించారు. పెరుగుతున్న పశువైద్య ఖర్చులు, తగినంత బీమా కవరేజ్ లేకపోవడం, నాణ్యమైన పశువుల దాణా అందుబాటులో లేకపోవడంతో పాడి రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలపై సంబంధిత మంత్రిత్వ శాఖకు లేఖ రాస్తానని ఆమె పేర్కొన్నారు.