Railway Passengers: రైల్వే ప్రయాణీకులకు అదిరిపోయే శుభవార్త..!

Train Passengers Can Now Apply For PAN, Aadhaar Cards at Railway Stations - Sakshi

భారతీయ రైల్వే ప్రయాణీకులకు ఒక మంచి శుభవార్త తెలిపింది. ఇప్పటికే రైల్వే స్టేషన్‌లలో ఉచిత బ్రాడ్ బ్యాండ్ సేవలు అందిస్తున్న భారతీయ రైల్వే, ఇప్పుడు మరిన్ని సేవలను అందించేందుకు సిద్దం అయ్యింది. రైల్వే ప్రయాణీకులు రైల్వే స్టేషన్‌లలో పాన్, ఆధార్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా ఒక కొత్త సేవను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. రైల్ వైర్ సాథి కియోస్క్ పేరుతో ఈ కొత్త సేవలను అందించనున్నట్లు భారతీయ రైల్వే తెలిపింది.

పైలట్ ప్రాజెక్టులో భాగంగా మొదట వారణాసి, ప్రయాగ్‌రాజ్ సిటీ రైల్వే స్టేషన్‌లలో కామన్ సర్వీస్ సెంటర్లను జనవరిలో రైల్వేశాఖ ప్రారంభించింది. ఇప్పుడు దేశం మెుత్తం ఈ సేవలను విస్తరించే ఆలోచనలో ఉంది. రైల్వే స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులు రైల్ వైర్ సాథి కియోస్క్ కేంద్రాల వద్ద ఆధార్ కార్డు, పాన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే టికెట్ బుకింగ్, ఓటరు కార్డు, మొబైల్ రీచార్జ్, రైలు, విమాన, బస్సు టిక్కెట్లను కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ సేవ కేంద్రాలలో ఆదాయపు పన్ను, బ్యాంకింగ్, బీమా సంబంధించి పనులకు ఇక్కడే పూర్తి చేసుకోవచ్చు అని తెలిపింది.

ఈ సదుపాయంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఎక్కువ లాభం చేకూరనుంది. ఇంటర్నెట్ సదుపాయ లేని మారుమూల ప్రాంత ప్రజలు ఆధార్, పాన్ కార్డు సేవలను పొందడం మరింత సులభం కానుంది. దేశవ్యాప్తంగా 200 స్టేషన్‌లలో ఈ ప్రత్యేక సేవలను త్వరలో ప్రారంభించనున్నట్లు పేర్కొంది.

(చదవండి: అదిరిపోయిన రెనాల్ట్ కొత్త హైబ్రిడ్ కారు.. మైలేజ్ కూడా చాలా ఎక్కువే..!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top