అదిరిపోయిన రెనాల్ట్ కొత్త హైబ్రిడ్ కారు.. మైలేజ్ కూడా చాలా ఎక్కువే..! | Renault Austral Debuts With Multiple Engine Options, 5 Ltr per 100 km mileage | Sakshi
Sakshi News home page

అదిరిపోయిన రెనాల్ట్ కొత్త హైబ్రిడ్ కారు.. మైలేజ్ కూడా చాలా ఎక్కువే..!

Mar 11 2022 3:11 PM | Updated on Mar 11 2022 6:23 PM

Renault Austral Debuts With Multiple Engine Options, 5 Ltr per 100 km mileage - Sakshi

ప్రముఖ ఫ్రెంచ్ ఆటోమొబైల్ తయారీసంస్థ రెనాల్ట్ సీ-సెగ్మెంట్ వినియోగదారులను ఆకట్టుకోవడం కోసం ఆస్ట్రల్ పేరుతో కొత్త ఎస్‌యువీ మోడల్ కారునీ ప్రపంచ మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న కడ్జార్ ఎస్‌యువీ స్థానంలో కొత్తగా ఆస్ట్రల్ ఎస్‌యువీ కారును తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ కారు వోల్వో ఎక్స్ సీ40, వోక్స్ వ్యాగన్ టి-రోక్, ఫోర్డ్ కుగా, టయోటా ఆర్ఎవీ4 వంటి వాటితో పడనుంది. రెనాల్ట్ సీఈఓ లూకా డీ మియో మాట్లాడుతూ.. "సరికొత్త రెనాల్ట్ ఆస్ట్రల్ అనేది సీ-సెగ్మెంట్ ఎస్‌యువీ. రెనాల్ట్ తన పూర్తి సామర్థ్యం మేరకు తీసుకొచ్చిన ఒక ప్రతిరూపం" అని అన్నారు. 

జపాన్ దేశానికి చెందిన మిత్సుబిషి, నిస్సాన్ కంపెనీలతో కలిసి ఆస్ట్రల్ కారుని అభివృద్ధి చేసినట్లు తెలిపింది. థర్డ్ జనరేషన్ సీఎంఎఫ్-సీడీ ప్లాట్ ఫారమ్ వినియోగించిన సంస్థ మొదటి కారు ఇది. ఇది ఒక హైబ్రిడ్ కారుగా సంస్థ పేర్కొంది. ఐసీఈ వాహనంలో రెండు పెట్రోల్ ఇంజిన్లు ఉన్నాయి. 130 హెచ్పీ 48 మైల్డ్ హైబ్రిడ్ అడ్వాన్స్డ్ ఇంజిన్, 140 హెచ్పి/160 హెచ్పి సామర్ధ్యం గల 12వీ మిల్డ్ హైబ్రిడ్ ఇంజిన్ ఇందులో ఉంది. కొత్త రెనాల్ట్ ఆస్ట్రల్ టర్బోఛార్జ్డ్ 1.2-లీటర్ త్రీ-సిలిండర్ ఇంజిన్'ను ఒక మైల్డ్-హైబ్రిడ్ ఇంజిన్'తో జత చేశారు. ఇది "డీజిల్ వాహనాలకు నిజమైన ప్రత్యామ్నాయం" అని కంపెనీ పేర్కొంది.
 

రెనాల్ట్ ఆస్ట్రల్ ఎస్‌యువీ 48వి మైల్డ్ హైబ్రిడ్ అడ్వాన్స్ డ్ వేరియెంట్ 48వీ లిథియం-అయాన్ బ్యాటరీ, స్టార్టర్ మోటార్ సహాయంతో 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంది. ఈ మైల్డ్ హైబ్రిడ్ అడ్వాన్స్డ్ సిస్టమ్ ఆస్ట్రల్ ఎస్‌యువీ కారు ఇంధన వినియోగం 100 కిలోమీటర్లకు 5.3 లీటర్ల వరకు తక్కువగా ఉండవచ్చని రెనాల్ట్ పేర్కొంది. ఈ మోడల్ కార్లలో ఈ మైలేజ్ చాలా ఎక్కువ అని చాలా ఎక్కువ అని చెప్పుకోవాలి.

రెనాల్ట్ ఆస్ట్రల్ మైల్డ్ హైబ్రిడ్ ఇంజిన్, 1.3 లీటర్ 4-సిలిండర్ టర్బోఛార్జ్డ్ డైరెక్ట్-ఇంజెక్షన్ పెట్రోల్ ఇంజిన్ సహాయంతో పనిచేస్తుంది. దీనిని మెర్సిడెస్ బెంజ్ సహ-అభివృద్ధి చేసింది. దీనిలో 9.3 అంగుళాల హెడ్స్-అప్ డిస్ ప్లే, యాక్టివ్ డ్రైవర్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ సెంటరింగ్, 360 డిగ్రీ కెమెరా, ఆటోమేటెడ్ పార్క్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ వార్నింగ్, లేన్ డిపార్చర్ ప్రివెన్షన్, రియర్ ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, మ్యాట్రిక్స్ ఎల్ఈడీ విజన్ స్మార్ట్ లైటింగ్ వంటి అనేక ఫీచర్స్ ఉన్నాయి. 

(చదవండి: ఫ్యూచర్‌కు షాక్‌! లీగల్‌ నోటీసులు పంపిన రిలయన్స్‌!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement