
సేవా పథం
భారతీయ రైల్వే (Indian Railways) ఎలక్ట్రికల్ ఇంజినీర్‌గా పంజాబ్ అంతటా పర్యటించిన కెకె గార్గ్ (KK Garg) ఎన్నో ప్రాంతాలలో, చదువుకు దూరమైన ఎంతోమంది పిల్లలను చూశాడు. రైల్వే ట్రాక్‌ల పక్కన మురికి వాడల్లో వందలాదిమంది చిన్నారులు పేదరికంలో నిర్లక్ష్యానికి గురవుతున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని రిటైర్‌మెంట్ తరువాత మొబైల్ పాఠశాలను ప్రారంభించాడు గార్గ్.
పంజాబ్ వ్యవసాయాధారిత రాష్ట్రం కావడంతో ట్రాక్టర్లు ఎక్కువగా కనిపిస్తాయి. తన నైపుణ్యాలను ఉపయోగించి ఒక ట్రాక్టర్ ర్యాలీని మొబైల్ స్కూల్‌గా మార్చాడు గార్గ్. పైపింగ్‌తో వాటర్ ప్రూఫ్ ప్ల్యానల్స్ రూపొందించాడు. వేడిని బయటకు పంపడానికి అవసరమైన ఏర్పాటు చేశాడు.
లైట్లు, ఫ్యాన్, బ్లాక్‌బోర్డ్ లాంటివి మొబైల్ స్కూల్‌లో ఉంటాయి.బఠిండాలోని ఎన్‌జీఒ ‘గుడ్‌విల్ సొసైటీ’ సహకారంతో ‘మొబైల్ స్కూల్’ పట్టాలకెక్కింది.స్కూల్ ట్రాలీలు బఠిండాలోని వివిధ ప్రాంతాల గుండా ప్రయాణిస్తాయి.మురికివాడలు, బడులు అందుబాటులో లేని ప్రాంతాలు, స్కూల్ డ్రాపవుట్ రేటు ఎక్కువగా ఉన్నప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రతి మొబైల్ క్లాస్‌రూమ్‌లో ప్రాథమిక అభ్యాసన సామాగ్రి ఉంటుంది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నారు.
చదవండి: స్విట్జర్లాండ్ వెళ్లి ఉంటే..ప్రాణాలతో..నావీ అధికారి చివరి వీడియో వైరల్
క్లాసులో విజువల్ ఎయిడ్స్ ఉపయోగిస్తారు. స్టోరీ టెల్లింగ్, ఇంటరాక్టివ్ గేమ్స్ ఉంటాయి. ప్రతి సంవత్సరం వందలాది వలస కుటుంబాలు బఠిండాకు వచ్చి పోతుంటాయి. చాలామంది పిల్లలకు పాఠశాలల్లో చేరడానికి అవసరమైన డాక్యుమెంట్లు ఉండవు. మొబైల్ స్కూల్ ఈ సమస్యను పరిష్కరించింది. మొబైల్ స్కూల్స్ ద్వారా సుమారు వెయ్యిమంది పిల్లలకు విద్య అందిస్తున్నారు. ఏడాది చదువు తరువాత పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడంలో మొబైల్ స్కూళ్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ‘పిల్లల తల్లిదండ్రుల నుంచి స్పందన బాగుంది’ సంతోషంగా అంటున్నాడు గార్గ్.
ఇదీ చదవండి: Pahalgam : ఈ దుఃఖాన్ని ఆపడం ఎవ్వరి తరము? గుండెల్నిపిండేసే వీడియోలు