ట్రాక్టర్‌ నడిపిన రాహుల్‌ : పంజాబ్‌ సీఎం ఇంట్రెస్టింగ్‌ ట్వీట్‌

Time to  Hand over the Wheels to Rahul Says Punjab cm - Sakshi

 జాతి పగ్గాలు  రాహుల్‌కు అందించే సమయం - పంజాబ్‌ ముఖ్యమంత్రి

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. పంజాబ్‌లోని లూథియానాలో బుధవారం పర్యటించిన ఆయన శ్రేణులను ఆకట్టుకున్నారు. ప్రచారంలో భాగంగా ఆయన ట్రాక్టర్‌ను నడిపి కొద్దిసేపు హల్‌ చల్‌ చేశారు.  పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్‌ దీనికి సంబంధించిన వీడియోను తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. జాతీయ కాంగ్రెస్‌ స్టీరింగ్‌ చేతబట్టిన రాహుల్‌ గాంధీకి నాయకుడిగా తిరుగేలేదని నిరూపించుకున్నారని కమెంట్‌ చేశారు. అంతేకాదు 2014లో నరేంద్రమోదీ తమనుంచి లాక్కున్న జాతి అధికార పగ్గాలను రాహుల్‌కు అందించే సమయమిది అని పేర్కొన్నారు.  ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

రైతులకు భరోసాగా ఉంటాననే హామీ ఇచ్చేందుకే రాహుల్ ట్రాక్టర్ నడిపారని పార్టీ వర్గాలు వ్యాఖ్యానించాయి. ట్రాక్టర్‌పై రాహుల్‌తోపాటు పంజాబ్ సీఎం లూథియానా ఎంపీ అభ్యర్థి రవ్‌నీత్ బిట్టు, కాంగ్రెస్ నేత ఆశా కుమార్ లూథియానా బహిరంగ సమావేశం  అనంతరం  వీధుల్లో ప్రచారం చేశారు. కాగా లోక్‌సభ ఎన్నికల చివరి దశలో భాగంగా  పంజాబ్‌లోని మొత్తం 13 స్థానాలకు  మే 19 న  పోలింగ్‌ జరగనుంది. 

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

 పంజాబ్‌లో సరదాగా ట్రాక్టర్ నడిపిన రాహుల్ గాంధీ
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top