Lok Sabha Election 2019
-
మోదీ 2.0
పెద్ద నోట్ల రద్దు. దేశవ్యాప్తంగా బ్యాంకులు, ఏటీఎంల ముందు జనం బారులు. వస్తు సేవల పన్ను (జీఎస్టీ)తో యావద్దేశం ఒకే మార్కెట్‌గా మారిన వైనం. సామాన్యులు, వ్యాపారస్తులు, చిన్న పరిశ్రమలను తీవ్ర ఇబ్బందుల పాలు చేసిన రెండు నిర్ణయాలు. అయినా వాటి ఉద్దేశాన్ని ప్రజలకు వివరించడంలో మోదీ సఫలమయ్యారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపడమే గాక దేశ ఆర్థిక పురోగతి కోసం దూర దృష్టితో కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. డిజిటైజేషన్‌కు ఊతమిచ్చారు. దాంతో 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు మోదీ ప్రభుత్వాన్ని మరింత మెజారిటీతో ఆశీర్వదించారు. కాంగ్రెస్ వరుసగా రెండోసారి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకపోయింది... బీజేపీతో నేరుగా తలపడుతున్న రాష్ట్రాలు మినహా మిగతా చోట్ల ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. కశీ్మర్, బిహార్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, జార్ఖండ్, కేరళల్లో వాటితో సీట్ల సర్దుబాటు చేసుకుంది. యూపీలో ఎవరూ ఊహించని విధంగా బీఎస్పీ, ఎస్పీ కలసి పోటీ చేశాయి! విపక్షాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా, మళ్లీ ఎన్డీఏదే అధికారమన్న మెజారిటీ ఒపీనియన్ పోల్స్ అంచనాలే నిజమయ్యాయి. బీజేపీ బలం 282 నుంచి 303కు పెరిగింది! ఓట్ల శాతం కూడా 31 నుంచి 37.3 శాతానికి పెరిగింది. ఎన్డీఏకు 353 మంది ఎంపీలు సమకూరారు. కాంగ్రెస్ 44 సీట్ల నుంచి కనాకష్టంగా 52 దాకా ఎగబాకింది. పెద్ద నోట్ల రద్దు 2016 నవంబర్ 8 రాత్రిని దేశ ప్రజలు ఎన్నిటికీ మర్చిపోలేరు! ప్రధాని మోదీ టీవీ ముందుకొచ్చి రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్టు సంచలనాత్మక ప్రకటన చేశారు. నల్లధనం, నకిలీ నోట్ల ఏరివేత, ఉగ్రవాదులకు నిధుల సరఫరాను అరికట్టే లక్ష్యంతో తీసుకున్న ఈ నిర్ణయానికి మద్దతివ్వాలని కోరారు. వాటి స్థానే కొత్త రూ.500తో పాటు రూ.2,000 నోట్లు తేనున్నట్టు చెప్పారు. నిరీ్ణత గడువులోపు పాత నోట్లను మార్చుకునేందుకు బ్యాంకులు, ఏటీఎంల ముందు బారులు తీరి పడ్డ ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు! ఇంతా చేసి... రూ.15.41 లక్షల కోట్ల విలువైన రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేయగా దాదాపుగా ఆ మొత్తమంతా (రూ.15.3 లక్షల కోట్లు) తిరిగి బ్యాంకుల్లోకి రావడం గమనార్హం.విశేషాలు... ⇒ ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు 2019 ఫిబ్రవరి 14న జమ్మూ కశీ్మర్లోని పుల్వామాలో జరిగిన జైషే ఉగ్ర సంస్థ దాడిలో ఏకంగా 40 మంది జవాన్లు ప్రాణాలు విడిచారు. దీనికి మోదీ సర్కారు సర్జికల్ స్ట్రయిక్స్‌తో బదులిచి్చంది. పాక్‌లోని బాలాకోట్‌లోని ఉగ్ర స్థావరాలను మన వాయుసేన విమానాలు బాంబులతో నేలమట్టం చేశాయి. ఈ ఉదంతం బీజేపీకి బాగా కలిసొచి్చంది. ⇒ ప్రజాస్వామ్య వ్యవస్థలను ఎన్డీఏ సర్కారు ధ్వంసం చేస్తోందన్న విమర్శలు కాంగ్రెస్, ఇతర విపక్షాలకు పెద్దగా లాభించలేదు. ప్రతి పేద మహిళకు ఏడాదికి రూ.72,000, ఇల్లులేని వారందరికీ ఇంటి స్థలం, ఉచిత వైద్య పరీక్షలు, ఔషధాలు, ఉచిత వైద్యం వంటి కాంగ్రెస్ హామీలను జనం పట్టించుకోలేదు. ⇒ సీబీఐ, కాగ్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలన్నీ కాంగ్రెస్ హయాంలోనే నిర్వీర్యమయ్యాయని, విపక్షాలవి కుటుంబ రాజకీయాలని, కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యమే లేదని మోదీ చేసిన విమర్శలు ప్రజలను ఆకట్టుకున్నాయి.జీఎస్టీ2017 దాకా ఒకే ఉత్పత్తి, ఒకే సేవపై దేశవ్యాప్తంగా రకరకాల ధరలుండేవి. రాష్ట్రానికో రీతిలో వ్యాట్, ఎక్సైజ్ సుంకాలు దీనికి కారణం. రాష్ట్రాల స్థాయిలో పన్నుల ఎగవేతా ఎక్కువగా ఉండేది. వీటికి పరిష్కారంగా దేశవ్యాప్తంగా ఒకే మార్కెట్, ఒకే పన్ను సంకల్పంతో మోదీ సర్కారు 2017 జూలై 1 నుంచి జీఎస్టీని అమల్లోకి తెచి్చంది. తొలుత పెద్దగా ప్రభావం కనిపించకున్నా కొన్నేళ్లుగా పన్నుల ఆదాయం భారీగా పెరుగుతోంది.17వ లోక్‌సభలో పార్టీల బలాబలాలు (మొత్తం సీట్లు 543) పార్టీ స్థానాలు బీజేపీ 303 కాంగ్రెస్ 52 డీఎంకే 24 వైఎస్సార్సీపీ 22 టీఎంసీ 22 శివసేన 18 జేడీ(యూ) 16 బిజూ జనతాదళ్ 12 బీఎస్పీ 10 టీఆర్ఎస్ 9 స్వతంత్రులు 51 ఇతరులు 4 – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok sabha elections 2024: గిర్ సఫారీలో... మళ్లీ వార్ వన్‌సైడే!
ఏ ఆటగాడైనా సొంత పిచ్‌పై బరిలోకి దిగితే ప్రత్యర్థులకు చుక్కలే. మరి అలాంటిది దేశాన్ని నడిపిస్తున్న కెప్టెన్, వైస్ కెప్టెన్ తమ సొంత రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో స్కెచ్ గీస్తే పరిస్థితి ఎలా ఉంటుంది! వార్ వన్‌సైడే! గుజరాత్లో గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో అక్షరాలా అదే జరిగింది. రాష్ట్రంలో మొత్తం 26 లోక్‌సభ స్థానాలనూ 2014, 2019 ఎన్నికల్లో విపక్షాలకు ఒక్కటీ దక్కకుండా క్లీన్‌బౌల్డ్ చేశారు మోదీ, అమిత్ షా. ఒకప్పుడు కాంగ్రెస్‌కు పట్టున్న ఈ పశ్చిమ రాష్ట్రం మోదీ రాకతో పూర్తిగా కమలనాథుల గుప్పెట్లోకి వెళ్లిపోయింది. ఈసారీ క్లీన్‌స్వీప్ చేసి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్న కాషాయదళాన్ని కాంగ్రెస్ ఏ మేరకు అడ్డుకుంటుందన్నది ఆసక్తికరం... స్టేట్స్కాన్గుజరాత్లో ఎన్నికలేవైనా బీజేపీ దెబ్బకు పారీ్టలన్నీ చుక్కలు లెక్కబెడుతున్నాయి. గత రెండు లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ ఒంటరిగా పోటీ చేసి మొత్తం సీట్లు తమ ఖాతాలో వేసేసుకుంది. 2009లో 11 సీట్లు గెలిచి బీజేపీకి గట్టి పోటీ ఇచి్చన హస్తానికి ఆ తర్వాత రాష్ట్రం నుంచి లోక్‌సభలో పదేళ్లుగా ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. 2019 ఎన్నికల్లోనైతే ఇరు పారీ్టల ఓట్ల శాతంలో ఏకంగా 30 శాతానికి పైగా అంతరముండటం విశేషం. బీజేపీకి 62.21 శాతం ఓట్లు రాగా కాంగ్రెస్‌కు 32.11 దక్కాయి మిగతా పారీ్టలేవీ ఇక్కడ పెద్దగా సోదిలో లేవు. గత ఎన్నికల్లో 25 చోట్ల పోటీ చేసిన బీఎస్పీకి నోటా కంటే తక్కువ ఓట్లు పడ్డాయి!కాంగ్రెస్.. ‘ఇండియా’ పోటీనిచ్చేనా!గుజరాత్లో ఎంతో కొంత పుంజుకోవడానికి కాంగ్రెస్ ఆపసోపాలు పడుతూనే ఉంది. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 60 సీట్లు కోల్పోయి 17కు పరిమితమైంది. ఆమ్ ఆద్మీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా 5 సీట్లు గెలుచుకుని రాష్ట్రంలో భవిష్యత్తుకు పునాదులు వేసుకుంది. ఈ నేపథ్యంలో పొత్తులో భాగంగా కాంగ్రెస్ 24 చోట్ల పోటీ చేస్తుండగా భావనగర్, బారుచ్ స్థానాల్లో ఆప్ బరిలో ఉంది. రైతులు, యువత, మహిళలు, ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీలపై ఇండియా కూటమి హామీల వర్షం కురిపిస్తోంది. వాటినే ప్రచారాస్త్రాలుగా మలచుకుంటోంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలోనూ వాటికే పెద్దపీట వేయడం తెలిసిందే. మోదీ హయాంలో దేశవ్యాప్తంగా నిరుద్యోగం, ద్రవ్యోల్బణం చుక్కలనంటాయంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రచారం చేస్తున్నారు. పేదల పొట్టగొట్టి అదానీ, అంబానీ వంటి కార్పొరేట్లకు దోచిపెడుతున్నారంటూ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు ప్రభావం గుజరాత్లో ఎలా ఉంటుందన్నది ఆసక్తికరం. విపక్షాలపై బీజేపీ కక్షగట్టి నేతలను వరుసగా జైలుపాలు చేస్తోందన్న ఇండియా కూటమి ప్రచారం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి. సోనియా, రాహుల్, ప్రియాంకతో పాటు కాంగ్రెస్ నుంచి 40 మంది స్టార్ క్యాంపెయినర్లు గుజరాత్లో ప్రచారం చేస్తున్నారు. ఆప్ తరఫున కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ ప్రచార బాధ్యతలను భుజాన వేసుకున్నారు. ఆప్ కీలక నేతలు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తదితరులు కూడా రంగంలోకి దిగారు.కమలం బోణీ! గుజరాత్లో ఇంకా పోలింగైనా జరగకుండానే తొలి ‘కమలం’ విరబూసింది! కాషాయదళం బోణీ కొట్టేసింది. సూరత్ లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి నీలేశ్ కుంభనీని ప్రతిపాదించిన నేతల సంతకాల్లో తేడా ఉండటంతో నామినేషన్ తిరస్కరణకు గురవడమే ఇందుకు కారణం. కాంగ్రెస్ ప్రత్యామ్నాయ అభ్యర్థి సురేశ్ పడ్సాలా నామినేషన్ కూడా పలు కారణాలతో తిరస్కరణకు గురైంది. ఆ వెంటనే పోటీలో ఉన్న ఇతర పారీ్టల అభ్యర్థులంతా నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దాంతో ముకేశ్ ఏకగ్రీవంగా గెలుపొందినట్లు ఈసీ ప్రకటించింది. సర్వేలన్నీ కమలం వైపే దాదాపు అన్ని సర్వేలూ బీజేపీకే జై కొడుతున్నాయి. ఈసారి కూడా మొత్తం సీట్లను చేజిక్కించుకుని హ్యాట్రిక్ కొడుతుందని అంచనా వేయడం విశేషం.బీజేపీ సమరోత్సాహం...గుజరాత్లో రాజకీయం మోదీకి ముందు, తర్వాత అన్నట్టుగా మారిపోయింది. బీజేపీ దిగ్గజ నేత కేశూభాయ్ పటేల్ అనారోగ్యం, ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలతో 2001 అక్టోబర్‌లో మోదీ అనూహ్యంగా ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. ఏడాదికే 2002 నాటి గోద్రా రైలు దహనంలో 60 మంది కరసేవకుల మరణం మతకల్లోలాలకు దారి తీసి రాష్ట్రాన్ని కుదిపేసింది. సీఎంగా వాటి అదుపులో మోదీ వైఫల్యంపై తీవ్ర విమర్శలు చివరికి అసెంబ్లీ రద్దుకు దారితీశాయి. అయితే హిందుత్వ అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు మోదీ. ఆ తర్వాత కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ కూటమి కేంద్రంలో పదేళ్లు అధికారంలో కొనసాగినా గుజరాత్లో మోదీ పీఠాన్ని మాత్రం కదపలేకపోయింది. అద్వానీకి ప్రత్యామ్నాయంగా 2013లో ఎన్డీఏ ప్రధాని అభ్యరి్థగా మోదీ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో గుజరాత్‌లోని వడోదరతో పాటు వ్యూహాత్మకంగా యూపీలోని వారణాసి నుంచీ పోటీ చేసి రెండింటా ఘనవిజయం సాధించారు. బీజేపీకి ఒంటి చేత్తో మెజారిటీ దక్కించి ప్రధాని పగ్గాలు చేపట్టారు.మోదీకి సేనాపతిగా పేరొందిన అమిత్ షా కూడా గుజరాత్లో బీజేపీ పాతుకుపోవడంలో కీలకంగా నిలిచారు. 2001 నుంచి 2014 దాకా గుజరాత్ సీఎంగా చక్రం తిప్పిన మోదీ ప్రధానిగా కూడా రాష్ట్రాభివృద్ధిపై బాగా దృష్టి పెట్టారు. దాంతో గుజరాత్ ఆర్థిక వ్యవస్థ పరుగులు తీసింది. అయినా 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీగా పుంజుకుంది. కానీ 2022 ఎన్నికల్లో మళ్లీ చతికిలపడింది. 182 సీట్లకు బీజేపీ ఏకంగా 156 స్థానాలతో దుమ్మురేపింది. ఈ లోక్‌సభ ఎన్నికల్లోనూ కమలనాథులు అభివృద్ధి అజెండాతో పాటు అయోధ్య రామమందిర సాకారం తదితర అంశాలను బలంగా ప్రచారం చేస్తున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
Telangana: బీజేపీ టార్గెట్ @8!
సాక్షి, హైదరాబాద్: బీజేపీలో అప్పుడే ఎంపీ టికెట్ల ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన నేతలు మరో మారు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీ తోనూ పొత్తు లేకుండా సొంతంగా పోటీచేసిన బీజేపీ 4 సెగ్మెంట్లలో గెలిచి అందరినీ ఆశ్చర్యపరి చింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక ఎమ్మెల్యే సీటు గెలిచి 7% ఓట్లు సాధించిన పార్టీ, మరుసటి ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 18 శాతానికి ఓటింగ్‌ను పెంచుకుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాల్లో గెలుపొందడమే కాకుండా 18 శాతం ఓటింగ్‌ను నిలుపుకుంది. 19 అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ అభ్యర్థులు రెండోస్థానంలో నిలవగా, 49 స్థానాల్లో డిపాజిట్లు దక్కించుకున్నారు. త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో 25శాతానికి ఓటింగ్ పెంచుకొని ఎనిమిది సీట్లు సాధించాలనేది బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. సిట్టింగ్ స్థానాలపై స్పష్టత ! సిట్టింగ్ ఎంపీలైన కేంద్రమంతి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి (సికింద్రాబాద్), జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ (కరీంనగర్), అర్వింద్ ధర్మపురి (నిజామాబాద్) ఆయా స్థానాల నుంచే మళ్లీ పోటీకి ఇప్పటికే సిద్ధమయ్యారు. బోథ్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీచేసి ఓటమిపాలైన ఆదిలాబాద్ ఎంపీ సొయం బాపూరావుకు ఈసారి పోటీకి మళ్లీ అవకాశం కల్పిస్తారా లేదా అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీఆర్ఎస్కి రాజీనామా చేసి బీజేపీలో చేరిన రాథోడ్ బాపూరావును ఈసారి ఆదిలాబాద్ నుంచి లోక్‌సభకు పోటీ చేయించే అవకాశాలున్నాయనే చర్చ పార్టీలో సాగుతోంది. ఆయనతోపాటు ఈసారి ఖానాపూర్ నుంచి ఓడిన మాజీ ఎంపీ రమేశ్‌రాథోడ్ కూడా ఈ సీటును ఆశిస్తున్నట్టు తెలిసింది. ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆదిలాబాద్, నిర్మల్, సిర్పూర్, ముథోల్ గెలిచిన జోరు మీదున్న బీజేపీ ఎంపీ సీటును కచ్చితంగా కైవసం చేసుకుంటామనే ధీమాతో ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలోని మూడు ఎమ్మెల్యే సెగ్మెంట్లలోనూ పార్టీ విజయం సాధించడం, జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు హామీని నిలుపుకున్నందున నిజామాబాద్ ఎంపీ స్థానాన్ని మళ్లీ కైవసం చేసుకుంటామనే విశ్వాసం పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతోంది. మిగిలిన స్థానాల్లో ఇలా.... సిట్టింగ్ స్థానాలు మినహా మిగిలిన 13 ఎంపీ సీట్లలో పోటీకి కొందరు ముఖ్యనేతలు గట్టిగానే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ► మల్కాజిగిరి నుంచి పోటీకి బీజేపీ నేత, మధ్యప్రదేశ్ ఇన్చార్జ్ పి.మురళీధర్‌రావు, మహబూబ్‌నగర్ నుంచి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే.అరుణకు జాతీయ నాయకత్వం నుంచి ఇప్పటికే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. అయితే మహబూబ్‌నగర్ నుంచి పోటీకి మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, కల్వకుర్తి నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన టి.ఆచారి సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ► మెదక్ నుంచి పోటీకి తాను సిద్ధమైనట్టు మాజీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు ఇప్పటికే ప్రకటించారు. మల్కాజిగిరి, మెదక్, కరీంనగర్‌లలో ఎక్కడో ఒకచోట నుంచి పార్టీ అగ్రనాయకత్వం అవకాశం కల్పిస్తే పోటీకి సిద్ధమేనని సీనియర్‌నేత ఈటల రాజేందర్ తన సన్నిహితుల వద్ద సంకేతాలిచ్చి ఆ దిశలో ప్రయత్నాలు కూడా ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. ► చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి పోటీకి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఎప్పటి నుంచో కసరత్తు కూడా ప్రారంభించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే దానికి సంబంధించిన కార్యాచరణలో నిమగ్నమైనట్టు పార్టీవర్గాల సమాచారం. ► భువనగిరి సీటు తనకు టికెట్ వస్తుందని మాజీ ఎంపీ డా. బూరనర్సయ్యగౌడ్ ఆ లోక్‌సభ పరిధిలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెబుతున్నారు. ► గోషామహల్ ఎమ్మెల్యే టి.రాజాసింగ్ జహీరాబాద్ నుంచి ఎంపీగా పోటీకి గతం నుంచి ఉత్సాహం కనబరుస్తున్నారు. అయితే ఇక్కడి నుంచి వీరశైవ లింగాయత్ సమాజ్‌కు చెందిన జాతీయనేత అశోక్ ముస్తాపురె, అక్కడి ప్రజల్లో గుర్తింపు ఉన్న సోమయప్ప స్వామిజీ, చీకోటి ప్రవీణ్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ► పెద్దపల్లి నుంచి పార్టీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి సోగల కుమార్‌కు మళ్లీ పోటీకి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ► నాగర్‌కర్నూల్ స్థానానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బంగారు శృతిని బరిలో దింపడం లేదా కొత్త అభ్యర్థిని తెరపైకి తీసుకొచ్చే అవకాశముంది. ► వరంగల్ టికెట్ మాజీ డీజీపీ కృష్ణప్రసాద్ గట్టిగా కోరుతున్నట్టు తెలిసింది. ► నల్లగొండ స్థానానికి గతంలో పోటీ చేసిన గార్ల జితేందర్ లేదా సూర్యాపేట నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిన సంకినేని వెంకటేశ్వర్రావుకు చాన్స్ దక్కుతుందా, ఇంకా ఎవరైనా కొత్తవారికి ఇస్తారా అన్న దానిపై చర్చ సాగుతోంది. ► హైదరాబాద్ స్థానం నుంచి భగవంత్‌రావుకు అవకాశం కల్పించవచ్చుననే ప్రచారం జరుగుతుండగా, ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోటీ చేయించినా అనూహ్య ఫలితాలు సాధించవచ్చనే చర్చ పార్టీ నేతల్లో ఉంది. ► మహబూబాబాద్ నుంచి రామచంద్రునాయక్, హుస్సేన్‌నాయక్, దిలీప్‌నాయక్‌లు పోటీపడుతున్నట్టు సమాచారం. ► ఖమ్మం నుంచి పార్టీనేత, తమిళనాడు సహ ఇన్చార్జ్ పొంగులేటి సుధాకర్‌రెడ్డికి అవకాశం కల్పిస్తారా ఇంకా మరెవరికైనా టికెట్ ఇస్తారా చూడాలని పార్టీ నేతలు అంటున్నారు. -
లోక్‌సభ ఎన్నికల్లో తక్కువ ఖర్చు వైఎస్సార్సీపీదే
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ నిర్ణయించిన వ్యయం కన్నా తక్కువ ఖర్చు చేసిన ప్రధాన పార్టీల్లో వైఎస్సార్సీపీ తొలిస్థానంలో నిలిచింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన 543 మంది ఎంపీలకుగానూ 538 మంది అఫిడవిట్లలో పొందుపరిచిన వ్యయాలను ఎలక్షన్ వాచ్/ఏడీఆర్ సంస్థ ప్రకటించింది. ఎన్నికల ఖర్చు వివరాలు ప్రకటించని ఐదుగురు ఎంపీల్లో నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు ఉన్నారు. వీరి వ్యయం వివరాలు లభ్యం కాలేదని సంస్థ వెల్లడించింది. మాధవి ఖర్చు రూ.14.12 లక్షలు ఎన్నికల ఖర్చులో వైఎస్సార్ సీపీ ఎంపీలు గొడ్డేటి మాధవి 537వ స్థానం(రూ.14.12 లక్షలు), బల్లి దుర్గాప్రసాదరావు 535వ స్థానం (రూ.15.06 లక్షలు), బెల్లాన చంద్రశేఖర్ 533వ స్థానం (రూ. 15.83 లక్షలు), చింతా అనూరాధ 532వ స్థానం (రూ.16,74 లక్షలు), భీశెట్టి వెంకట సత్యవతి 531వ స్థానం(రూ.17.66 లక్షలు)లో ఉన్నారు. అనంత్‌నాగ్‌లో అత్యధికంగా.. లోక్‌సభ ఎన్నికల అభ్యర్థి ఖర్చు పెద్ద రాష్ట్రాల్లో రూ.70 లక్షలు, చిన్న రాష్ట్రాల్లో రూ.54 లక్షలుగా కమిషన్ నిర్ణయించింది. అత్యధికంగా ఖర్చు (నిబంధనల కంటే ఎక్కువగా) చేసినవారిలో హస్నైన్ మసూది (అనంతనాగ్, జమ్మూ కశ్మీర్, జేకే నేషనల్ కాన్ఫరెన్స్) రూ.79,27,920తో తొలిస్థానంలో నిలవగా రూ.77,95,916తో గోరఖ్‌పూర్ బీజేపీ సభ్యుడు రవికిషన్ రెండో స్థానంలో ఉన్నట్లు సంస్థ తెలిపింది. శివసేన తరువాత టీఆర్ఎస్... ఎన్నికల వ్యయం వివరాలను వెల్లడించిన 538 మంది ఎంపీల సరాసరి ఖర్చు రూ.50.84 లక్షలని కమిషన్ పేర్కొంది. ఎంపీ అభ్యర్థి ఖర్చు విషయంలో పార్టీల వారీగా చూస్తే శివసేన (18 మంది ఎంపీలు) రూ.59.26 లక్షల సరాసరి ఖర్చుతో తొలిస్థానంలో నిలిచింది. టీఆర్ఎస్ (9 మంది ఎంపీలు) రూ.57.85 లక్షల సరాసరి ఖర్చుతో ద్వితీయ స్థానంలో ఉంది. వైఎస్సార్ సీపీ ఎంపీ గొడ్డేటి మాధవి ఎన్నికల వ్యయంలో సొంత డబ్బులు రూ.13,500 కాగా రూ.6,65,580 పార్టీ నుంచి అందించగా రూ.7,33,100 ఇతరత్రా విరాళాల రూపంలో సమకూరాయి. బీజేపీ ఎంపీ సోయం బాపూరావు వ్యక్తిగత డబ్బులు రూ.28,500 కాగా పార్టీ విరాళం రూ.49,99,693. -
దిశ నుంచి ఢిల్లీ వరకు సంచలనాలు
పౌర ఆగ్రహం పొగలు సెగలు కక్కింది. రేపిస్టులపైనా, అక్కరకు రాని చట్టాలపైనా.. పాలకులపైనా, ప్రమాదకరంగా మారిన పర్యావరణంపైనా.. అవినీతి, అసమానతలపైనా... యువతరం పిడికిలి బిగించి కదం తొక్కింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి.. భారత్ నుంచి హాంకాంగ్ వరకు ఈ ఏడాది నిరసనలు మిన్నంటాయి. అలాగే దేశంలో సార్వత్రిక ఎన్నికలపై చర్చకు తెరలేపుతూ ప్రారంభమైన 2019వ ఏడాది అనేక సంచలన సంఘటనలకూ వేదికగా నిలిచింది. భారత ప్రజానికంతో పాటు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిన 2019 లోక్‌సభ ఎన్నికలతో పాటు దశాబ్దాల నుంచి ఎటూ తెగని వివాదంగా మిగిలిపోయిన అయోధ్య రామమందిర స్థల వివాదానికి కూడా ఈ ఏడాదిలో పూర్థిస్థాయి పరిష్కారం దొరికింది. కశ్మీర్ అంశంతో పాటు ఎన్ఆర్సీ, పౌరసత్వ సవరణ చట్టం వంటి పార్లమెంట్ చట్టాలకు 2019 చోటిచ్చింది. నిర్భయ ఉదంతాన్ని మరోసారి జ్ఞాపకం చేసేలా హైదరాబాద్‌లో అత్యంత దారుణంగా జరిగిన దిశ సంఘటన ఈ ఏడాదిలో అత్యంత సంచలనంగా మారింది. కేంద్రంలో రెండోసారి బీజేపీ ఈ ఏడాది ప్రథమార్థంలో అత్యధికంగా చర్చనీయాంశమైన అంశం సార్వత్రిక ఎన్నికలు. భారత్‌తో పాటు పలు ప్రపంచ దేశాలు సైతం భారత్ ఎన్నికలను ఆసక్తికరంగా గమనించాయి. మార్చి, ఏప్రిల్ మాసాల్లో జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మే 23న విడుదల అయ్యాయి. ఈ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ఏకంగా 303 సీట్లు తన ఖాతాలో వేసుకుంది. ఎన్డీయే కూటమి మొత్తం 352 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. దీంతో రెండోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టారు. ప్రధాన పత్రిపక్షం కాంగ్రెస్ కేవలం 52 స్థానాలకు పరిమితం కాగా.. రెండు సీట్ల తేడాతో ప్రతిపక్ష హోదాకు దూరమయ్యింది. యూపీఏ కూటమికి 91 సీట్లు దక్కగా ఇతరులు 99 స్థానాల్లో విజయం సాధించారు. పార్టీలవారీగా చూస్తే.. డీఎంకే 23, వైఎస్సార్సీపీ, టీఎంసీ 22, శివసేన 18, జేడీయూ 16 సీట్లలో విజయం సాధించాయి. ఎస్పీకి 5, బీఎస్పీకి 10 సీట్లు మాత్ర మే దక్కాయి. ఇక సీపీఎం 3, సీపీఐ 2 స్థానాల్లో గెలుపొందాయి. అయోధ్య.. రాముడిదే దేశంలో సరికొత్త రాజకీయ చర్చకకు కేంద్రబిందువైన వివాదస్పద అయోధ్య రామమందిర, బాబ్రీ మసీదు స్థలంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించింది. వివాదాస్పద కట్టడం ఉన్న స్థలం హిందువులదేనని స్పష్టం చేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తుది తీర్పు చెప్పింది. 2.77 ఎకరాల స్థలం హిందువులకే చెందుతుందని నవంబర్ 9న ఇచ్చిన తీర్పులో తేల్చిచెప్పేసింది. వివాదాస్పద స్థలానికి సంబంధించి 3 నెలల్లో కేంద్రం ట్రస్ట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. మసీదు నిర్మాణానికి అయోధ్యలో సున్నీ వక్ఫ్‌బోర్డుకు 5 ఎకరాల స్థలం కేంద్రం లేదా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పలువురు ముస్లిం సంఘాల ప్రతినిధిలు అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పును సవాలు చేస్తూ ముస్లిం పర్సనల్ లాబోర్డుతో సహా, పలువురు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారించిన సీజే ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధార్మాసనం వాటన్నింటినీ కొట్టివేసింది. సుప్రీం తీర్పే అంతిమమైనదని స్పష్టంచేసింది. పుల్వామా ఉగ్రదాడి.. జమ్మూకశ్మీర్‌లో భద్రతాబలగాలకు ఈ ఏడాది గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పుల్వామా జిల్లా అవంతిపొరా పట్టణం సమీపంలోని లెత్‌పొరా వద్ద సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఓ స్కార్పియో ఎస్‌యూవీలో దాదాపు 350 కేజీల అత్యాధునిక పేలుడు పదార్థాన్ని (ఐఈడీ) నింపుకున్న ఓ ఆత్మాహుతి దళసభ్యుడు జవాన్ల వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకున్నాడు. తన కారుతో కాన్వాయ్‌లోని ఓ బస్‌ను ఢీకొట్టి తనను తాను పేల్చేసుకున్నాడు. ఫిబ్రవరి 14 న మధ్యాహాం 3.30 గంటలకు జరిగిన ఈ దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న ఓ బస్సు తునాతునకలు కాగా, కాన్వాయ్‌లోని పలు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనతో దేశం ఒక్ససారిగా ఉలిక్కిపడింది. జవాన్ల మృతికి కారణమైన పాక్‌కు తగిన బుద్ది చెప్పాలని యావత దేశం ముక్త కంఠంతో నినదించింది. విధుల్లో చేరేందుకు 2,547 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు దాదాపు 78 వాహనాల్లో శ్రీనగర్‌కు బయలుదేరిన సమయంలో ఈదారుణ ఘటన చోటుచేసుకుంది. సర్జికల్ స్ట్రైక్ 2. ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళాలు మెరుపు దాడులు చేశాయి. భారత నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి ఉన్న ఉగ్రవాద శిబిరాలపై తెల్లవారు ఫిబ్రవరి 26 తెల్లవారుజామున 3.30 గంటలకు భీకర దాడులు జరిపాయి. బాలాకోట్, చాకోటి, ముజఫరాబాద్ ప్రాంతాల్లోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలకు చెందిన కంట్రోల్ రూంలను వెయ్యి కేజీల బాంబులతో ధ్వంసం చేశాయి. 12 మిరాజ్-200 యుద్ధ విమానాలతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్.. సర్జికల్ స్ట్రైక్ 2ను విజయవంతంగా పూర్తి చేసి పుల్వామా ఉగ్రదాడి జవాన్లకు ఘన నివాళులర్పించింది. దీనిపై దేశవ్యాప్తంగా భారత ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. అజిత్ దోవల్‌కి దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభినందనలు తెలిపారు. భారత వైమానిక దాడులను ధృవీకరించిన పాక్.. ఎలాంటి నష్టం జరగలేదని ప్రకటించింది. ఎమ్మెల్యేనే ఉన్నావ్ దోషి.. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార కేసులో ఢిల్లీ తీస్‌హజారీ కోర్టు బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు జీవితఖైదు శిక్షను విధించింది. తనను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారని కుల్దీప్ సింగ్ సెంగార్‌పై ఓ మైనర్ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. బాలిక కిడ్నాప్.. అత్యాచారం.. బాధితురాలి తండ్రి లాకప్ మరణం.. ఆమె ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం.. వంటి మలుపులతో ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఏడాది జూలై 28న బాధితురాలు, ఆమె బంధువులు, న్యాయవాది ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాధితురాలు గాయపడగా, ఆమె బంధువులిద్దరూ మరణించారు. న్యాయవాది కూడా తీవ్రంగా గాయపడ్డారు. సుప్రీంకోర్టు జోక్యంతో అన్ని కేసులను లక్నో నుంచి ఆగస్టు 1వ తేదీన ఢిల్లీకి బదిలీ చేశారు. మహారాష్ట్రలో సరికొత్త చరిత్ర.. దేశంలో సరికొత్త రాజకీయ సమీకరణాలకు మహారాష్ట్ర వేదికగా నిలిచింది. పార్టీలో చీలికలు, గవర్నర్ అర్థరాత్రి ప్రకటనలు, తెల్లవారుజామున ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంల ప్రమాణస్వీకారాలు, దేశ అత్యున్నత న్యాయస్థానం జోక్యం వంటి ఆసక్తికర పరిణామాలతో మహారాష్ట్ర రాజకీయాలు సంచలనం సృష్టించాయి. బాలీవుడ్ సినిమా స్థాయి ట్విస్ట్‌లను ఛేదించుకుంటూ హిందుత్వ పార్టీగా పేరొందిన శివసేన.. లౌకిక భావాజాలం గల కాంగ్రెస్, ఎన్సీపీతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఠాక్రే కుటుంబం నుంచి సీఎం పీఠం అధిరోహించిన తొలి వ్యక్తిగా ఉద్ధవ్ చరిత్ర సృష్టించారు. అక్టోబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లభించలేదు. ఎన్నికల ముందు కూటమి కట్టిన బీజేపీ-శివసేన మధ్య పదవుల పంపకాలతో విభేదాలు ఏర్పాడ్డాయి. దీంతో తన దారి తనదంటూ 30 ఏళ్ల మిత్రబంధానికి ముగింపు పలికిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ను మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మహారాష్ట్రలో సరికొత్త రాజకీయ అధ్యాయానికి పునాది వేసింది. కన్నడలో కూలిన కుమార సర్కార్.. దేశమంతా ఎంతో ఉత్కంఠరేపిన కర్ణాటక రాజకీయ సంక్షోభం ఈ ఏడాది రాజకీయపరంగా అత్యంత చర్చనీయాశంగా మారింది. అసెంబ్లీ బలపరీక్షలో జేడీఎస్- కాంగ్రెస్ ప్రభుత్వం ఓటమి పాలవడంతో కుమారస్వామి సర్కార్ కుప్పకూలింది. జూలై 23న జరిగిన విశ్వాస పరీక్షలో 15 మంది రెబల్స్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడంతో కుమారస్వామి ఓటమిపాలైంది. ఓటింగ్ జరిగిన సమయంలో సభలో మొత్తం 204 మంది సభ్యులున్నారు. 15 రెబల్స్ తిరుగుబాటుతో మైనార్టీలో పడిపోయిన కాంగ్రెస్-జేడీఎస్ సభ్యుల సంఖ్య 99కి పడిపోయింది. మరోవైపు బీజేపీ సభ్యులు 105 మంది సభకు హాజరయ్యారు. దీంతో 14 నెలల సంకీర్ణ ప్రభుత్వ పాలన ముగిసింది.ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చక్రంతిప్పన 15 మంది రెబల్స్‌పై స్పీకర్ రమేష్ కుమార అనర్హత వేటు వేయడం సంచలనం సృష్టించింది. అనంతరం గవర్నర్ ఆహ్వానం మేరకు బీజేపీ అధ్యక్షుడు బీఎస్ యడియూరప్ప కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. డిసెంబర్లో జరిగిన ఉప ఎన్నికల్లో సైతం బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగానే ప్రజలు తీర్పును వెలువరించారు. 15 స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా 12 స్థానాలను అధికార బీజేపీ కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని సుస్థిరపరుచుకుంది. చంద్రయాన్-2 విఫలం చంద్రుడి భూ ఉపరితలంపై పరిశోధనలు జరిపేందుకు అక్కడికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) పంపించిన ఉపగ్రహం ‘చంద్రయాన్–2’ చివరి నిమిషంలో విఫలమైంది. జులై 22న జీఎస్ఎల్వీ మార్క్ III-M1 వాహక నౌక ద్వారా చంద్రుడిపై పంపారు... తర్వాత దీని కక్ష్యను ఐదుసార్లు పెంచుకుంటూ పోయి 276 x 1,42,975 కిలోమీటర్లకు చేర్చారు. తర్వాత ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోయింది.. సెప్టెంబరు 7 అర్ధరాత్రి చంద్రుడి ఉపరితలంపై దిగుతూ 500 మీటర్ల దూరంలో ఉండగా ల్యాండర్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో పూర్తిగా సంబందాలు తెగిపోయాయి. ఈ ప్రాజెక్టు మొత్తానికి రూ.978కోట్లు ఖర్చయింది. ఆర్టికల్ 370.. రద్దు నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రం రెండోసారి అధికారం చేపట్టిన 90 రోజుల్లోనే అత్యంత సంచలన, సాహసోపేత నిర్ణయాన్ని తీసుకుంది. దశాబ్దాల సంఘ్ పరివార్ కలను, ఎన్నికల హామీని నెరవేరుస్తూ, కశ్మీర్లో 72 ఏళ్ల నుంచి నలుగుతున్న వేర్పాటువాదం, ఉగ్రవాదం సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులేస్తూ.. జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370, 35ఏ అధికరణాలను రద్దు చేసింది. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను కూడా తొలగిస్తూ, దానిని అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా మార్చింది. లదాఖ్ ప్రాంతాన్ని కూడా జమ్మూ కశ్మీర్ నుంచి పూర్తిగా వేరు చేసి, ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించింది. పౌరసత్వ ప్రకంపనలు.. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీ దేశ వ్యాప్తంగా నిరసలనకు కేంద్రబిందువుగా నిలిచింది. చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అనేక చోట్ల నిరసనలు హింసాత్మకంగా మారాయి.. పోలీసుల తూటాలు ఆందోళనకారుల గుండెల్లో దిగాయి. పౌరుల ప్రాణాలు పోయినా.. జనం రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు. ముఖ్యంగా దీని ప్రభావం ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బిహార్‌లో ఎక్కువగా కనిపించింది. ఆందోళన సందర్భంగా యూపీలో 16 మంది పౌరులు మరణించారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చిన హిందువులకు, సిక్కులకు, జైనులకు, బౌద్ధులకు, పార్శీలకు, క్రైస్తవులకు దేశంలో పౌరసత్వం కల్పించడం ఈ చట్టం ముఖ్య సారాంశం. అస్సాం ఎన్నార్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ప్రకటించిన ఎన్ఆర్సీని కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది. తొలుత ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో జాతీయ పౌర గుర్తింపు (ఎన్నార్సీ) తుది ముసాయిదాను విడుదల చేసింది. మొత్తం 3.29 కోట్ల దరఖాస్తుదారుల్లో 2,89,83,677 మందిని భారతీయులుగా గుర్తిస్తున్నట్లు వెల్లడించింది. దరఖాస్తుదారుల్లోని 40.07లక్షల మంది తమ అస్సామీ గుర్తింపును చూపించడంలో విఫలమయ్యారని పేర్కొంది. దీంతో తుది ముసాయిదాతో 40 లక్షల మందికి పైగా ప్రజల భవితవ్యం అనిశ్చితిలో పడింది. కాగా దేశ వ్యాప్తంగా కూడా ఎన్నార్సీని అమలు చేస్తామని బీజేపీ పదేపదే ప్రకటిస్తోంది. దీనిపై విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. కాఫీ డే వీజీ సిద్ధార్థ మృతి.. సౌమ్యుడు, వివాదరహితునిగా పేరుపొందిన కేఫె కాఫీ డే (సీసీడీ) అధినేత వీజీ సిద్ధార్థ మరణించారు. నేత్రావతి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. కాఫీ ఎస్టేట్ల సామ్రాజ్యాన్ని విస్తరించి ఆరంగంలో మేటిగా నిలిచారు. జూలై 29న సిద్ధార్థ అదృశ్యమయ్యారు. తాను కొద్దిదూరం నడిచి వస్తానని చెప్పి, డ్రైవర్‌ను బ్రిడ్జి సమీపంలో కారు ఆపమని చెప్పిన తర్వాత ఆయన కనిపించకుండా పోయారు. అరగంట గడిచినా సిద్ధార్థ కారు దగ్గరకు రాకపోవడం, ఫోన్ చేసినా స్పందించకపోవడంతో డ్రైవర్ బెంగళూరులోని ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం జూలై 31న నదిలో ఆయన మృతదేహాన్ని గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులు కారణంగానే ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పోలీసుల విచారణలో తేలింది. చిన్మయి శ్రీపాద (మీటూ) పెద్ద మనుషుల ముసుగులో చలామణీ అవుతున్న వివిధ రంగాలకు చెందిన ‘మగానుభావుల’ నిజ స్వరూపాన్ని.. ‘మీటూ’ ఉద్యమం ద్వారా పలువురు బాధితులు బట్టయలు చేశారు. ఇండియాలో బాలీవుడ్ నటితనుశ్రీ దత్తా ప్రారంభించిన ఈ ఉద్యమాన్ని గాయని చిన్మయి దక్షిణాదిన ముందుండి నడిపించారు. 18 ఏళ్ల వయసులో... ప్రముఖ గేయ రచయిత వైరముత్తు తనను లైంగికంగా వేధించారంటూ ఆమె పలు సంచలన విషయాలు బయటపెట్టారు. చిన్మయి స్ఫూర్తితో మరికొంత మంది కూడా వైరముత్తు వల్ల తాము ఎదుర్కొన్న ఇబ్బందులను ఒక్కొక్కటిగా వెలుగులోకి తీసుకువచ్చారు. అయినప్పటికీ సినీ ఇండస్ట్రీ అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు సరికదా... పలువురు ‘ప్రముఖులు’ చిన్మయిపై కక్ష సాధింపు చర్యలకు దిగారు. అంతేకాదు పబ్లిసిటీ కోసమే ఆమె ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలతో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. హాంగ్.. కాగుతోంది.. ఒక దేశం రెండు వ్యవస్థలు ఉంటే ఎన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయో చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ ఏడాది హాంకాంగ్‌లో ఎగిసిన నిరసనలు. తమ దేశంపై సుదీర్ఘకాలంగా సాగుతున్న చైనా పెత్తనాన్ని హాంకాంగ్‌వాసులు సహించలేకపోతున్నారు. చైనాలో హాంకాంగ్ భాగమైనప్పటికీ అక్కడ ప్రజలు తమను చైనీయులు అనడానికి ఎంత మాత్రమూ ఇష్టపడరు. అలాంటిది నేరస్తుల అప్పగింతకు సంబంధించిన ఒక బిల్లుపై వచ్చిన ప్రతిపాదనలతో హాంకాంగ్‌లో నిరసనల అగ్గి రాజుకుంది. ఈ బిల్లుతో హాంకాంగ్‌లో నిందితుల్ని చైనాలో విచారించే అవకాశం కలుగుతుంది. దీంతో రైట్ వింగ్ యాక్టివిస్టులు భగ్గుమన్నారు. హాంకాంగ్ ప్రత్యేక ప్రతిపత్తిని నిర్వీర్యం చేసేలా చైనా ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ రోడ్డెక్కారు. జూన్ నుంచి ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. అటు ప్రభుత్వం కూడా పోలీసు బలగాలతో నిరసనలు అణచివేయాలని అనుకుంది కానీ అంతకంతకూ అవి తీవ్రరూపం దాల్చాయి. మొత్తానికి బిల్లుపై చైనా ప్రభుత్వం వెనక్కి తగ్గినా ఆ ఆందోళనలిప్పుడు హాంకాంగ్ స్వాతంత్య్ర పోరాటానికి దారి తీశాయి. అమెజాన్ ఆడవుల్లో కార్చిచ్చు అమెజాన్ అడవుల మంటలపై ప్రపంచస్థాయి ఆగ్రహం..! ప్రపంచంలోని అతిపెద్ద ఉష్ణమండల వర్షారణ్యం అగ్నికి ఆహుతి అవుతుండటంపై ప్రపంచ స్థాయిలో ఆగ్రహం వ్యక్తమైంది. అమెజాన్ అడవులు కాలిపోతున్నాయనే వార్తలు ప్రపంచ మానవాళిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మొత్తం ఆక్సిజన్ ఉత్పత్తిలో అధిక భాగం అంటే 20 శాతం ఆక్సిజన్ మనకు అమెజాన్ అడవుల నుంచే లభిస్తోంది. అమెజాన్ అడవులు కాలిపోవడం ప్రపంచవ్యాప్తంగా పర్యావరణంపై కొత్త చర్చకు దారి తీసింది. పర్యావరణవేత్తలు, మేధావులు ఈ విషయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆ క్రమంలో అమెజాన్ అడవుల్లో చెలరేగిన మంటలను ఆర్పేందుకు యుద్ద విమానాలను ఫ్రాన్స్ అధికారులు రంగంలోకి దించారు. శ్రీలంక మారణహోమం క్రెస్తవులకు ప్రధానమైన ఈస్టర్ పండుగనాడు ద్వీపదేశం శ్రీలంకలో నరహంతకులు మారణహోమం సృష్టించారు. శ్రీలంక రాజధాని కొలంబోతోపాటు నెగొంబో, బట్టికలోవా పట్టణాల్లో బాంబుల మోత మోగించారు. చర్చిలు, విలాసవంతమైన హోటళ్లు లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. ఏప్రిల్ 21న జరిగిన మొత్తం 8 వరుస పేలుళ్లలో 215మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మరో 500 మందికిపైగా గాయపడ్డారు. ఈ పేలుళ్లలో మొత్తం 33 మంది విదేశీయులు మరణించగా వారిలో ముగ్గురు భారతీయులు ఉన్నారు. మిగిలిన 21 మంది విదేశీయుల మృతదేహాలను గుర్తించేపనిలో ఉన్నామని శ్రీలంక అధికారులు వెల్లడించారు. ఈస్టర్ సందర్భంగా చర్చిల్లో సామూహికంగా ప్రార్థనలు చేసుకుంటుండగా ఈ పేలుళ్లు సంభవించాయి. మొత్తం 3 చర్చిలు, మూడు హోటళ్లు, జూ వద్ద, మరో ఇంట్లో దుండగులు పేలుళ్లకు పాల్పడ్డారు. దిశా.. తూటా చెప్పిన తీర్పు రేపిస్టులకు వ్యతిరేకంగా మన తెలుగు గడ్డపై జరిగిన ఉద్యమం యావత్ దేశానికి పాకింది. డాక్టర్ దిశ అత్యాచారం, హత్య ఈ ఏడాది దేశంలో ప్రకంపనలు రేపింది. నవంబర్ 27 రాత్రి షాద్‌నగర్‌లో ఒక అమాయకురాలిపై వలపన్ని టోల్ ప్లాజాకు కూతవేటు దూరంలో నలుగురు మృగాళ్లు అత్యాచారం చేయడమే కాకుండా, బతికుండగానే పెట్రోల్ పోసి తగులబెట్టడం సామాన్యుల్ని దహించి వేసింది. జనం స్వచ్ఛందంగా రోడ్డెక్కారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు రేపిస్టులకి వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటాయి. 2012లో నిర్భయ ఉదంతం తర్వాత అత్యాచారాలకు వ్యతిరేకంగా యువతరం స్వచ్ఛందంగా కదిలిరావడం ఇదే. దిశపై అఘాయిత్యం జరిగి వారం తిరక్కుండానే డిసెంబర్ 6న నిందితులు పోలీసుల ఎన్కౌంటర్లో మరణించారు. ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా అక్కడక్కడ నిరసన స్వరాలు వినిపించినప్పటికీ సామాన్యులు శభాష్ అన్నారు. మన న్యాయవ్యవస్థలో జరిగే జాప్యం పట్ల ప్రజలు ఎంత విసిగిపోయారో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. అమ్మాయిల భద్రత గాల్లో దీపంలా మారడంతో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్రెడ్డి.. అత్యాచార కేసుల్లో సత్వర న్యాయం జరిగేలా దిశ చట్టాన్ని తీసుకువచ్చారు. ఈ చట్టం ప్రకారం అత్యాచారం కేసుల్లో 21 రోజుల్లో విచారణ పూర్తి చేసి దోషులకు శిక్ష విధిస్తారు. తహసీల్దార్ సజీవ దహనం రాష్ట్ర రాజధాని శివారులోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పూర్మెట్ తహసీల్దార్ చెరుకూరి విజయారెడ్డి ఆమె కార్యాలయంలోనే హత్యకు గురయ్యారు. పట్టాదారు పాసుపుస్తకాల్లో తమకు బదులుగా కౌలుదార్ల పేర్లను చేర్చారన్న కోపంతో కూర సురేశ్ అనే రైతు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేశాడు. తమ కుటుంబాలకు దక్కాల్సిన భూమిని తమకు దక్కకుండా చేస్తున్నారని కక్షగట్టి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తెలంగాణ వ్యాప్తంగా ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై రెవెన్యూ అధికారులు మూడు రోజులపాటు విధుల్లోకి రాకుండా నిరసనలు చేపట్టారు. మంటల్లో తీవ్రంగా గాయ పడిన కారు డ్రైవర్ గురునాథ్, అటెండర్ చంద్రయ్యలు ఆస్పత్రిలో చికిత్స పొందుతు మృతి చెందారు. రైతు కూర సురేశ్ కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు ఆర్టీసీ సమ్మె.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ.. 2011లో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సకలజనుల సమ్మె తరువాత మరోసారి అంతటి మహా ఉద్యమాన్ని తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టారు. స్వరాష్ట్రం ఏర్పడిన తరువాత వారు చేపట్టిన తొలి సమ్మె ఇది. డిమాండ్లను నెరవేర్చాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా 52 రోజుల పాటు చేపట్టిన ఆర్టీసీ సమ్మె మహా ఉద్యమంగా సాగింది. కార్మికుల డిమాండ్లకు ప్రభుత్వం ఏమాత్రం తగ్గకపోగా, విధుల్లో చేరకపోతే ఉద్యోగాల్లో నుంచి తొలగిస్తామంటూ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టించింది. అంతేకాదు ఉద్యమం సందర్భంగా దాదాపు 30 మంది కార్మికులు వివిధ రూపాల్లో ప్రాణాలు కోల్పోయారు. దీంతో గత్యంతరం లేక సమ్మెను విరమిస్తున్నట్లు కార్మికులు ప్రకటించారు. వారి విజ్ఞప్తి మేరకు కార్మికులందరినీ తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. కార్మికుల ఉద్యమం తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా సంచనంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో నూతన శకం.. ఆంధ్రప్రదేశ్‌లో నూతన శకం మొదలైంది. ‘ప్రజాసంకల్ప యాత్ర’ సుదీర్ఘ పాదయాత్ర అనంతరం జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకుగాను 151 స్థానాల్లో గెలిచి కొత్త చరిత్రను సృష్టించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మే 30 గురువారం మధ్యాహ్నం 12:23 నిమిషాలకు విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో గవర్నర్ నరసింహన్.. వైఎస్ జగన్‌తో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. సంక్షేమ పథకాలే ప్రధానం ఎజెండాగా ప్రచారం చేసిన వైఎస్ జగన్.. ఇచ్చిన మాటకు కట్టుబడి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన ఆరునెల్లలోనే హామీలను అమలు చేస్తూ విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు. చరిత్ర ఎన్నడూ లేని విధంగా ప్రధాన ప్రతిపక్ష టీడీపీ ఈ ఎన్నికల్లో కేవలం 21 సీట్లకు పరిమితమైంది. అలాగే లోక్‌సభ ఎన్నికల్లో సైతం వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 25 స్థానాల్లో 22 ఎంపీ సీట్లు కైవలం చేసుకుంది. టీడీపీ మూడు స్థానాలు దక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్‌కి మూడు రాజధానులు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందేలా అమరావతిలో శాసన రాజధాని(లెజిస్లేటివ్ క్యాపిటల్), విశాఖలో పరిపాలన రాజధాని (ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్), కర్నూలులో న్యాయ రాజధాని(జ్యుడీషియల్ క్యాపిటల్) ఏర్పాటు చేయాలని జీఎన్ రావు కమిటీ తన నివేదికలో సూచించింది. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, రాజధాని, పరిపాలన వికేంద్రీకరణపై ఏర్పాటైన ఈ నిపుణుల కమిటీ డిసెంబర్ 20న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి 125 పేజీలతో కూడిన నివేదికను సమర్పించింది. రాష్ట్రంలోని 13 జిల్లాల సమగ్రాభివృద్ధి ప్రతిబింబించేలా నివేదికలో పలు సూచనలు చేసింది. విశాఖపట్నంలో సచివాలయం, సీఎం క్యాంపు కార్యాలయం, హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని, వేసవిలో అక్కడే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని పేర్కొంది. అమరావతిలో అసెంబ్లీ, గవర్నర్ కార్యాలయం, సీఎం క్యాంపు కార్యాలయం.. కర్నూలులో హైకోర్టు ఉండాలని సూచించింది. వరద ముంపులేని ప్రాంతం రాష్ట్రానికి రాజధానిగా ఉండాలని.. రాజధాని కార్యకలాపాల్ని వికేంద్రీకరించాలని సలహానిచ్చింది. కమిటీ మొత్తం సుమారు 10,600 కిలోమీటర్లు రాష్ట్రమంతా పర్యటించి రాజధాని, అభివృద్ధి అంశాలపై అధ్యయనం చేసింది. -సురేష్ అల్లిక (వెబ్‌డెస్క్ ప్రత్యేకం) -
‘మళ్లీ సోనియాకే పార్టీ పగ్గాలు’
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం ఎదురైన క్రమంలో సోనియా గాంధీ తిరిగి పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని పలువురు సీనియర్లు కోరుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ కేవలం 52 స్ధానాలకు పరిమితం కావడం, ఏకంగా పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ అమేథిలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోవడం ఆ పార్టీ దుస్ధితికి అద్దం పడుతోంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల షాక్‌తో రాహుల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి వైదొలగడం ఆ పార్టీ నేతలకు రుచించలేదు. ఇక పార్టీ కష్టకాలంలో ఉన్న ఈ తరుణంలో తమ కుమారుడి నుంచి సోనియా గాంధీ పార్టీ సారథ్య బాధ్యతలను తిరిగి అందుకోవాలని పలువురు పార్టీ సీనియర్ నేతలు భావిస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. 2017 డిసెంబర్లో పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకునే ముందు దాదాపు రెండు దశాబ్ధాల పాటు ఆమె కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగారు. రాహుల్ పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన అనంతరం కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ప్రాభవం కోల్పోయింది. మరోవైపు సోనియా గాంధీ తిరిగి పార్టీ బాధ్యతలు తీసుకుంటే వారసత్వ రాజకీయాలంటూ బీజేపీ చెలరేగే అవకాశం ఉందని మరికొందరు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
బీజేపీలో చేరిన గాయని సప్నా చౌదరి
సాక్షి, ఢిల్లీ: హరియాణా పాపులర్ సింగర్, డాన్సర్ సప్నా చౌదరి ఎట్టకేలకు అధికారికంగా భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆదివారం ఢిల్లీలోని జవహర్ లాల్ స్టేడియంలో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఆమె పార్టీ తొలి సభ్యత్వం తీసుకున్నారు. బీజేపీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్... సప్నా చౌదరికి కండువా కప్పి, పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బీజేపీ జనరల్ సెక్రటరీ రాంలాల్, ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ తదితరులు పాల్గొన్నారు. కాగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆమె బీజేపీకి మద్దతుగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే. సింగర్, డ్యాన్సర్‌గానే కాకుండా బిగ్ బాస్ 11 సీజన్లో పాల్గొన్న సప్నా చౌదరికి ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఎన్నికల ముందు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరుతుందని ఊహాగానాలు వచ్చినా...అనూహ్యంగా బీజేపీకి చేరువ అయ్యారు. చదవండి: కాంగ్రెస్‌కు షాక్.. సప్నా చౌదరీ యూటర్న్..! ‘డ్యాన్స్ వస్తే చాలు.. కాంగ్రెస్‌లో ఛాన్స్’ -
అసలు మీకేం కావాలి : సుప్రీం ఆగ్రహం!
న్యూఢిల్లీ : ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలను రద్దు చేయాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల ఉపయోగాన్ని సవాలు చేస్తూ మనోహర్‌లాల్ శర్మ అనే న్యాయవాది పిల్ దాఖలు చేశారు. ఇందులో భాగంగా లోక్‌సభ ఎన్నికలను రద్దు చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో జస్టిస్ రోహింటన్ నారీమన్ ఈ పిటిషన్‌ను స్వీకరించేందుకు నిరాకరించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ..‘ శర్మ అసలు మీరేం కావాలని అడుగుతున్నారు. మొత్తం లోక్‌సభ ఎన్నికలనే రద్దు చేయమంటున్నారా’ అని ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఏకపక్ష విజయంతో ప్రతిపక్షాలు ఈవీఎంలపై సందేహాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలువురు బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరపాలంటూ డిమాండ్ చేశారు. ఈవీఎంల విశ్వసనీయతను ప్రశ్నిస్తూ అనుమానాలు వ్యక్తం చేశారు. "What are you asking for Mr Sharma? You want us to set aside the entire Lok Sabha elections?" Justice Rohinton Nariman observed and refused to entertain ML Sharma's petition. https://t.co/B8JhjWn8FQ — ANI (@ANI) July 5, 2019 -
వేలూరు లోక్‌సభకు ఎన్నికల షెడ్యూల్ విడుదల
చెన్నై : వేలూరు లోక్‌సభ స్థానానికి ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. అక్కడ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ ప్రకటించింది. వేలూరులో ఆగస్టు 5వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నట్టు, 9వ తేదీన ఫలితాలు వెల్లడించనున్నట్టు ఈసీ పేర్కొంది. దేశవ్యాప్తంగా ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగగా, వేలూరులో నియోజకవర్గంలో మాత్రం ఈసీ ఎన్నికను నిలిపివేసింది. ఎన్నికల సమయంలో వేలూరు లోక్‌సభ పరిధిలో భారీగా నగదు పట్టుబడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుంది. అయితే ఈ స్థానంలో డీఎంకే కూటమి తరఫున కదిర్ ఆనంద్, అన్నాడీఎంకే కూటమి అభ్యర్థిగా ఏసీ షణ్ముగంగత బరిలో నిలిచారు. కాగా, సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో డీఎంకే కూటమి ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. -
‘రాహుల్‌కు మాత్రమే అది సాధ్యం’
న్యూఢిల్లీ: ఎట్టకేలకు రాహుల్ గాంధీ తన పంతం నెగ్గించుకున్నారు. వర్కింగ్ కమిటీ వారించినా, పార్టీ శ్రేణులు వద్దని బతిమాలినా వినకుండా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి తనదే బాధ్యత అని అంగీకరించారు. ఇక రాహుల్ రాజీనామాపై చెల్లెలు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘రాహుల్ రాజీనామా నిర్ణయం సాహసోపేతమైంది. అలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి రాహుల్ లాంటి కొందరికే ధైర్యముంటుంది. అతని నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను’ అని పేర్కొన్నారు. పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న రాహుల్ నాలుగు పేజీల బహిరంగ లేఖను విడుదల చేసిన సంగతి తెలిసిందే. లేఖ ప్రతులను షేర్ చేయడంతో పాటు ప్రియాంక ఈ వ్యాఖ్యలు చేశారు. (చదవండి : ఓటమికి నాదే బాధ్యత) ట్విట్టర్లో హోదా తొలగింపు రాహుల్ గాంధీ తన ట్విట్టర్ ప్రొఫైల్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడు అన్న పదాలను తొలగించారు. ప్రస్తుతం ఆయన ట్విటర్ ఖాతాలో ‘ఇది రాహుల్ గాంధీ అధికారిక ఖాతా/ఇండియన్ కాంగ్రెస్ సభ్యుడు/ పార్లమెంటు సభ్యుడు’ అని మాత్రమే దర్శనమిస్తోంది. Few have the courage that you do @rahulgandhi. Deepest respect for your decision. https://t.co/dh5JMSB63P — Priyanka Gandhi Vadra (@priyankagandhi) July 4, 2019 -
ఓటమికి నాదే బాధ్యత
న్యూఢిల్లీ: ఎట్టకేలకు రాహుల్ గాంధీ తన పంతం నెగ్గించుకున్నారు. వర్కింగ్ కమిటీ వారించినా, పార్టీ శ్రేణులు వద్దని బతిమాలినా వినకుండా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి తనదే బాధ్యత అని అంగీకరించారు. పార్టీ అభివృద్ధికి జవాబుదారీతనం కీలకమని, అందుకోసమే తాను రాజీనామా చేస్తున్నానని 49 ఏళ్ల రాహుల్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన బహిరంగ లేఖ రాశారు. నాలుగు పేజీల ఆ లేఖను ట్విట్టర్లో పెట్టారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 52 స్థానాలు మాత్రమే గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఫలితాలు వెలువడిన రెండు రోజులకు తాను అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్టు రాహుల్ ప్రకటించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆయన రాజీనామాను తిరస్కరించింది. పార్టీ శ్రేణులు రాజీనామా చేయవద్దని కోరాయి. రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాహుల్ గాంధీని కలిసి సంఘీభావం ప్రకటించారు. ఎన్నికల ఓటమికి తాము నైతిక బాధ్యత వహిస్తామని చెప్పారు. తాను రాజీనామా చేసినందున కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయడం కోసం ఒక కమిటీని వేయాలని రాహుల్ ఆ లేఖలో పార్టీ వర్కింగ్ కమిటీని కోరారు. కాంగ్రెస్ పార్టీకి సేవచేయడం తనకు గౌరవప్రదమన్నారు. విలువలు, ఆదర్శాలే జీవనాడులుగా కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి సేవ చేసిందని భావోద్వేగపూరితంగా పేర్కొన్నారు. ఈ దేశానికి, పార్టీకి తాను ఎంతో కృతజ్ఞుడినన్నారు. ‘కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, 2019 ఎన్నికల్లో పార్టీ ఓటమికి నాదే బాధ్యత. మన పార్టీ భవిష్యత్తులో పైకి రావాలంటే జవాబుదారీతనం కీలకం. ఈ కారణంగానే నేను అధ్యక్ష పదవికి రాజీనామా చేశా’అని రాహల్ తెలిపారు. పార్టీ పునర్నిర్మాణానికి కఠిన నిర్ణయాలు అవసరమన్నారు. ఎన్నికల ఓటమికి అనేక మందిని బాధ్యుల్ని చేయాల్సి వస్తుందని, అయితే, పార్టీ అధ్యక్షుడిగా తన బాధ్యతను విస్మరించి ఇతరులను బాధ్యుల్ని చేయడం సరికాదని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో తాను ప్రధాని మోదీతోనూ, ఆరెస్సెస్‌తోనూ, వారి గుప్పిట్లో ఉన్న సంస్థలతోనూ శక్తివంచన లేకుండా పోరాడానన్నారు. ‘భారత దేశాన్ని నేను ప్రేమిస్తున్నాను. అందుకే వారితో పోరాడా. ఒక్కోసారి ఈ పోరాటంలో నేను పూర్తిగా ఒంటరివాడినయ్యా. అయినా పోరాడినందుకు గర్వపడుతున్నా’అని రాహుల్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని ప్రస్తావిస్తూ దేశాన్ని గుప్పిట్టో పెట్టుకోవాలన్న ఆరెస్సెస్ లక్ష్యం దీంతో పూర్తయిందన్నారు. బీజేపీ అధికారం కైవసం చేసుకోవడం వల్ల దేశంలో ఊహించని స్థాయిలో హింస చెలరేగుతుందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించేందుకు జాతి మొత్తం ఏకం కావాలని, దీనికి కాంగ్రెస్ ఆయుధం అవుతుందని రాహుల్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే లక్ష్యాన్ని సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ తనను తాను పూర్తిగా సంస్కరించుకోవాలి. ప్రస్తుతం బీజేపీ ఒక పద్ధతి ప్రకారం ప్రజల గొంతు నొక్కేస్తోంది. ప్రజావాణిని కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్‌దే. భారత దేశమెప్పుడూ ఒకే గొంతు కాదు..కాబోదు. అది అనేక గొంతుల సమాహారం. అదెప్పటికీ అలాగే ఉండాలి. అదే భారత మాత అసలు స్వరూపం’ అని రాహుల్ భావోద్వేగంతో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ఆశయాల కోసం తాను పోరాడుతూనే ఉంటానని, తన సేవలు అవసరమైనప్పుడు అందుబాటులో ఉంటానని రాహల్ పార్టీ శ్రేణుల నుద్దేశించి అన్నారు. ‘నేను కాంగ్రెస్‌వాదిగా పుట్టాను. కాంగ్రెస్ పార్టీ నా ప్రాణం. అదెప్పటికీ నాతోనే ఉంటుంది’ అని ఉద్ఘాటించారు. ట్విట్టర్లో హోదా తొలగింపు రాహుల్ గాంధీ తన ట్విట్టర్ ప్రొఫైల్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడు అన్న పదాలను తొలగించారు. ప్రస్తుతం ఆయన ట్విటర్ ఖాతాలో ‘ఇది రాహుల్ గాంధీ అధికారిక ఖాతా/ఇండియన్ కాంగ్రెస్ సభ్యుడు/ పార్లమెంటు సభ్యుడు’ అని మాత్రమే దర్శనమిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, 2019 ఎన్నికల్లో పార్టీ ఓటమికి నాదే బాధ్యత. మన పార్టీ భవిష్యత్తులో పైకి రావాలంటే జవాబుదారీతనం కీలకం. ఈ కారణంగానే నేను రాజీనామా చేశా ఎన్నికల్లో మోదీతో, ఆరెస్సెస్‌తో, వారి గుప్పిట్లో ఉన్న సంస్థలతో పోరాడా. ఒక్కోసారి ఈ పోరాటంలో నేను పూర్తిగా ఒంటరివాడినయ్యా. అయినా పోరాడినందుకు గర్వపడుతున్నా కొత్త అధ్యక్షుడిగా ఖర్గే లేదా షిండే! సుశీల్ కుమార్ షిండే (77) లేదా మల్లికార్జున ఖర్గే(76)ల్లో ఒకరు కొత్త అధ్యక్షుడయ్యే చాన్సుంది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయిన షిండే గతంలో ఓసారి కేంద్ర మంత్రిగా చేశారు. 2002లో కాంగ్రెస్ తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీపడ్డారు. ఈ ఏడాదే మహారాష్ట్రలో ఎన్నికలు జరగనుండటం, ఆయనకు గాంధీల కుటుంబంతో సాన్నిహిత్యం ఉండటంతో షిండేను తదుపరి అధ్యక్షుడిగా నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. అటు ఖర్గే కూడా పార్టీలో సీనియర్ నాయకుడే. ఆయనా గాంధీల కుటుంబానికి సన్నిహితుడే. గత లోక్‌సభలో కాంగ్రెస్‌పక్ష నేతగా ఆయన పనిచేశారు. ఖర్గే ప్రతిపక్షంలో ఉండి మోదీని సమర్థవంతంగా ఎదుర్కోగలడనే అభిప్రాయం ఉంది. గతంలో ఆయన ఒకటి కంటే ఎక్కువ ప్రభుత్వాల్లో కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. కొత్త అధ్యక్షుడు ఎవరనే దానిపై ఓ వారంలో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఆయనే మా నాయకుడు అధ్యక్ష పదవికి రాజీనామా చేసినా రాహులే మా నేత అని రాజస్తాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ అన్నారు. పార్టీ కోసం ఆయన ఎంత శ్రమించారో మాకు తెలుసు. అందుకే రాజీనామాను వెనక్కు తీసుకోమని కోరుతున్నాం’ అని ఆయన అన్నారు. ‘ కాంగ్రెస్ సిద్దాంతాలు నమ్మేవారికి ఆయనే నాయకుడు. రాహుల్ గాంధీ సరైన నిర్ణయం తీసుకున్నారు’ అని మరో నేత అజయ్ మాకెన్ అన్నారు. ఇదో కొత్త నాటకం రాహల్ గాంధీ రాజీనామా మరో కొత్త నాటకమని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ వ్యాఖ్యానించారు. ఆయన రాజీనామాతో తమకే సంబంధం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలా కాకుండా తమ పార్టీలో సంస్థాగత వ్యవస్థ పటిష్టంగా ఉందని, సంస్థాగత ఎన్నికలు, సభ్యత్వ నమోదు వంటివి ఉన్నాయని మరో మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. -
రాహుల్‌కు బుజ్జగింపులు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసే విషయంలో పట్టువదలని విక్రమార్కుడిలా ఉన్న రాహుల్ గాంధీని బుజ్జగించేందుకు సోమవారం కాంగ్రెస్ ముఖ్యమంత్రులంతా రంగంలోకి దిగారు. రాజస్తాన్, పంజాబ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పుదుచ్చేరిల సీఎంలు వరుసగా అశోక్ గహ్లోత్, అమరీందర్ సింగ్, కమల్‌నాథ్, భూపేశ్ బఘేల్, వి.నారాయణస్వామిలు రాహుల్‌ను ఢిల్లీలో కలిశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఘోర ఓటమిపై వారు దాదాపు రెండు గంటలపాటు చర్చించి, తమ అభిప్రాయాలను పంచుకున్నారు. పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాల్సిందిగా రాహుల్‌ను వారంతా అభ్యర్థించారు. భేటీ అనంతరం గహ్లోత్ మాట్లాడుతూ ‘మేమంతా రాహుల్‌తో మనసువిప్పి మాట్లాడుకున్నాం. పార్టీ కార్యకర్తల అభిప్రాయాల గురించి కూడా రాహుల్‌కు వివరించాం. పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలని కోరాం. ఆయన మా విన్నపాన్ని మన్నిస్తారని ఆశిస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో రాహుల్ మాత్రమే పార్టీని నడిపించగలరని గట్టిగా నమ్ముతున్నాం’ అని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానని రాహుల్ చెప్పడం, అప్పటి నుంచి కాంగ్రెస్ నేతలు ఆయనను బుజ్జగిస్తుండటం తెలిసిందే. ఇటీవలే 150 మంది కాంగ్రెస్ నాయకులు కూడా ఓటమికి తమదే బాధ్యత అంటూ రాజీనామా చేయడం తెలిసిందే. -
విపక్షాలన్నీ కకావికలం
సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో పాలకపక్ష బీజేపీ పార్టీ 303 సీట్లతో అఖండ విజయం సాధించడంతో షాక్‌కు గురైన ప్రతిపక్ష పార్టీలు ఈ పాటికి తేరుకొని పార్లమెంటులో నిర్ణయాత్మక పాత్రను పోషించాల్సిందిపోయి ఇంకా కకావికలం అవుతున్నాయి. ఇతర విపక్షాలను సమీకరించాల్సిన కాంగ్రెస్ పార్టీయే నాయకత్వ సంక్షోభంలో కూరుకుపోయింది. యూపీలో కలసికట్టుగా పోటీ చేసిన ఎస్పీ–బీఎస్పీ కూటమి నుంచి బీఎస్పీ విడిపోయింది. ఒక్క ఎస్పీతోనేగాదని, ఏ పార్టీతోని భవిష్యత్తులో ఎలాంటి పొత్తులు పెట్టుకునే ప్రసక్తే లేదని మాయావతి స్పష్టం చేశారు. పార్లమెంటులోనైనా బీజేపీని సమైక్యంగా ఎదుర్కొందాం, రారండోయ్ అంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇచ్చిన పిలుపును కాంగ్రెస్, వామపక్షాలు తిరస్కరించాయి. ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి కుస్తీ పడుతున్న కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి, అసహనంతో ఓటర్లను దూషిస్తున్నారు. ‘ఓట్లేమో బీజేపీకి వేస్తారు. పనులేమో నేను చేసిపెట్టాలా ?’ అంటూ ఇటీవల ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. ఇక బిహార్‌లో ‘మహాఘట్బంధన్’కు నాయకత్వం వహించిన తేజశ్వి యాదవ్ ఫలితాల అనంతరం పత్తాలేకుండాపోయి శనివారం నాడు ట్విటర్ ద్వారా జనంలోకి వచ్చారు. బిహార్‌లో ఎన్సెఫలైటిస్ వల్ల 150 మంది పిల్లలు మరణించడం వల్ల రాలేకపోవడం ఒక కారణమైతే కాలుకు శస్త్ర చికిత్స చేయించుకోవడం వల్ల విశ్రాంతి తీసుకోవాల్సిరావడం మరో కారణమని ఆయన పేర్కొన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కేంద్రంలోని బీజేపీకే కొమ్ముకాస్తోంది. గత కొంతకాలంగా బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతుల్లో చిత్తుగా ఓడిపోయిన నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి లంకా దినకర్ సహా నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిపోయారు. జూలై 5వ తేదీ నుంచి జరుగనున్న బడ్జెట్ పార్లమెంట్ సమావేశాల్లో నిర్ణయాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించేందుకు విపక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉంది. అలా జరక్కపోతే 12 లోక్‌సభ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికలు, 2022లో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాలు మొన్నటికంటే చేదు ఫలితాలను చవి చూడాల్సి వస్తుంది. -
రాహుల్ పాదయాత్ర.. ప్రధాని అభ్యర్థిగా ప్రియాంక
135 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ గత రెండు ఎన్నికల్లోనూ ఘోర పరాజయం పాలవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయింది. గత నెలరోజులుగా నిస్తేజంగా మారిన పార్టీ శ్రేణుల్లో పార్టీ భవితవ్యంపై తీవ్రమైన ఆందోళన నెలకొంది. రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా కొనసాగనని తేల్చి చెప్పేయడం, ఆయన స్థానంలో ఎవరు వస్తారోనన్న గందరగోళం, వివిధ రాష్ట్రాల్లో పార్టీ పదవులకు సీనియర్ నేతల మూకుమ్మడి రాజీనామాలు ఇవన్నీ ఓ రకమైన సంక్షోభానికి దారి తీస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తలు దశలవారీగా పరిస్థితిని చక్కదిద్దడానికి రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. వీరి ముందు ఇప్పుడు మూడు ఎజెండాలే ఉన్నాయి. అవే కాంగ్రెస్ జెండాని తిరిగి ఎగురవేస్తాయన్న నమ్మకంతో కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు. రాహుల్ పాదయాత్ర ఏసీ గదుల్లో పార్టీ నేతలు, కార్యకర్తలతో ఎన్నాళ్లు మేధోమథనం జరిపినా ప్రయోజనం శూన్యమని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. జనంలోకి వెళ్లిన వాడే నాయకుడిగా అవతరిస్తాడని, ప్రజా సమస్యలు కళ్లారా చూసినప్పుడే రాజకీయ వ్యూహాలు సరిగ్గా అమలు చేయగలరని చరిత్ర నిరూపిస్తున్న సత్యం. అందుకే రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తే బాగుంటుందని ప్రతిపాదనలు ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే రాహుల్ ఎంతవరకు జయప్రకాశ్ నారాయణ, వీపీ సింగ్, చంద్రశేఖర్ మాదిరిగా అనుకున్న లక్ష్యాలకు చేరుకోగలరా అన్న అనుమానాలూ ఉన్నాయి. కొత్త అధ్యక్షుడి ఎన్నిక ఇక రాహుల్ గాంధీ స్థానంలో అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నిక చేయాలన్నది అతి పెద్ద సమస్య. ఇప్పుడు అందరి కళ్లు రాజస్థాన్పైనే ఉన్నాయి. ఇన్నాళూ అశోక్ గహ్లోత్æ కాంగ్రెస్ పార్టీ కాబోయే అధ్యక్షుడని ప్రచారం సాగింది. ఇప్పుడు హఠాత్తుగా సచిన్ పైలెట్ పేరు తెరపైకి వచ్చింది. వీరిద్దరిలో ఎవరికీ అప్పగించినా పార్టీ భవిష్యత్ ఎలా ఉండబోతుంది? ఎన్ని అసమ్మతి జ్వాలలు రేగుతాయన్న ఆందోళనలు ఉన్నాయి. పార్టీ పగ్గాలను అనుభవజ్ఞుడికి అప్పగించాలా, యువతరం చేతుల్లో పెట్టాలా అనే అంశంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అధ్యక్షుడి తగాదాను రాహుల్ ఎంతవరకు సమర్థవంతగా ఎదుర్కోగలరో చెప్పలేని స్థితి. తమిళ కాంగ్రెస్ నాయకుడు కామరాజ్ ఫార్ములా తరహాలో రాహుల్ గాంధీ మూకుమ్మడి రాజీనామాలు చేయించాలని తలపోసినా అది కూడా సరిగ్గా నడిచేటట్టుగా అనిపించడం లేదు. మే 25న రాహుల్ తన పదవికి రాజీనామా చేసినా అయిదు రాష్ట్రాల కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అందుకు సిద్ధంగాలేరు. అందుకే అధ్యక్షుడి విషయంలో పార్టీ ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంది. 2024 ప్రధాని ఫేస్‌గా ప్రియాంక ఇక ఆఖరి అంకం అంటే కాంగ్రెస్‌లో ఎప్పుడూ ప్రియాంకమే. 2024 ఎన్నికల్ని రాహుల్ పెద్ద దిక్కుగా ఉండి నడిపించి, ప్రియాంకను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలనే అభిప్రాయం ఉంది. ఈ అంశంలో ఏకాభిప్రాయమే వ్యక్తమవుతోంది. అయితే పెద్ద దిక్కుగా రాహుల్, కొత్త అధ్యక్షుడి పనితీరు, ప్రియాంక ఎలా జనాన్ని మెప్పించగలరు అన్న అంశాలపైనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉంది. ఈ ప్రతిపాదనలను సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఇంకా క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఘోర వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ చీఫ్ బాధ్యతల నుంచి తప్పుకున్న రాహుల్ గాంధీపై సానుభూతి, విశ్వాసం పెరుగుతున్నాయి. ఎన్నికల్లో పరాజయం కంటే ఈ నిస్తేజ పరిస్థితులే పార్టీకి ఎక్కువ చేటు కలిగిస్తాయని సీనియర్లతోపాటు అన్ని స్థాయిల నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితికి సోనియా, రాహుల్లదే బాధ్యతని, వారి అంగీకారం లేకుండా ప్రత్యామ్నాయ నాయకత్వ ఏర్పాటు సాధ్యం కాదని అంటున్నారు. లోలోపల ఏదో కుట్ర, డ్రామా నడుస్తోందని నేతల అనుమానం. సిసలైన నాయకుడెవరూ కూడా సంక్షోభ సమయంలో బాధ్యతల నుంచి తప్పుకోరని తెలుగు రాజ్యసభ సభ్యుడొకరు వ్యాఖ్యానించారు. రాహుల్ ముందుగా సీడబ్ల్యూసీతోపాటు రాష్ట్ర శాఖలు, ఏఐసీసీ విభాగాలను రద్దు చేసి పునర్వ్యవస్థీకరణ చేపట్టాలన్నారు. భవిష్యత్తుపై చర్చించేందుకు ముందుగా ఏఐసీసీ సమావేవం ఏర్పాటు చేసి రానున్న రాష్ట్రాల శాసనసభల ఎన్నికలపై రోడ్‌మ్యాప్ రూపొందించాలని అన్నారు. ఇలా ఉండగా, రాహుల్ గాంధీయే చీఫ్‌గా కొనసాగాలని పార్టీ కోరుకుంటోందని కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా అన్నారు. రాహుల్ వైదొలుగుతున్నట్లు ప్రకటించినందుకు నిరసనగానే పార్టీ నేతలంతా రాజీనామాలు చేస్తున్నారన్నారు. రాహుల్ పార్టీ చీఫ్‌గా కొనసాగాలని ఇప్పటికే సీడబ్ల్యూసీ తీర్మానించిందని గుర్తు చేశారు. -
కాంగ్రెస్ పగ్గాలు గహ్లోత్‌కు?
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసినదగ్గర నుంచి కొత్త అధ్యక్షుడెవరన్నది చర్చనీయాంశమయింది. రాజీనామాను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తిరస్కరించినా, పదవిలో కొనసాగాల్సిందిగా పలువురు సీనియర్లు బతిమాలినా రాహుల్ గాంధీ ససేమిరా అంటున్నారు. దాంతో సోనియా గాంధీ, అహ్మద్ పటేల్, గులాం నబీ ఆజాద్, ఏకే ఆంటోనీ, కేసీ వేణుగోపాల్‌తో కూడిన కమిటీ కొత్త అధ్యక్షుడి కోసం వెదుకులాట మొదలు పెట్టింది. ఈ ప్రక్రియలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ పేరు తెరపైకి వచ్చింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం, పార్టీతో అనుబంధం ఉన్న గహ్లోత్ అధ్యక్ష పదవికి సరైన వారని నాయకత్వం భావిస్తోందని తెలిసింది. గెహ్లాట్‌కు పార్టీ పగ్గాలు అప్పగించడం ద్వారా కాంగ్రెస్‌లో కుటుంబ పాలన నడుస్తోందన్న విపక్షాల విమర్శకు తెరదించవచ్చని కాంగ్రెస్ నాయకత్వం ఆలోచిస్తోందని సమాచారం. అందుకు గహ్లోత్‌ను ఒప్పించిందని సీనియర్ నాయకుడొకరు ధ్రువీకరించారు. గహ్లోత్‌కు అధ్యక్ష పదవి ఖరారయిందని నవభారత్ టైమ్స్ పత్రిక పేర్కొంది. జూన్ 19న రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న గహ్లోత్ కొద్దిసేపు రాహుల్‌తో ఏకాంతంగా సమావేశమవడం ఇందుకు బలం చేకూరుస్తోంది. రాహుల్ అధ్యక్ష పదవిలో కొనసాగేలా చూసేందుకు నేతలు విఫలయత్నం చేశారు. రాహుల్ నిర్ణయాన్ని సోనియా వ్యతిరేకించారు. రాజీనామా చేస్తే దక్షిణాదిన పార్టీ దెబ్బతింటుందని చిదంబరం హెచ్చరించారు. అయినా రాహుల్ పట్టు వీడలేదు. పార్టీ పగ్గాలు స్వీకరించడానికి ప్రియాంక కూడా సుముఖంగా లేరు. దాంతో కొత్త నేత ఎంపిక అనివార్యమయింది. గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడిగా పేరున్న 68 ఏళ్ల గహ్లోత్‌కు పార్టీతో సుదీర్ఘ అనుబంధం ఉంది. గతంలో రెండు సార్లు సీఎంగా పని చేసిన ఆయన మూడోసారి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. గహ్లోత్‌ను పార్టీ అధ్యక్షుడిని చేసి సీఎం పదవిని సచిన్ పైలట్‌కు ఇవ్వాలని తద్వారా ఆ ఇద్దరి మధ్య విభేదాలకు తెరదించాలని అధిష్టానం ఆలోచిస్తోందని సమాచారం. గహ్లోత్ ఒప్పుకోకపోతే ముకుల్ వాస్నిక్, మనీష్ తివారీ, శశి థరూర్ పేర్లు పరిశీలనలో ఉన్నాయని ఆ పత్రిక తెలిపింది. కాగా, ఈ వార్తలను గహ్లోత్ తోసిపుచ్చారు. ఇదిలా ఉండగా, పార్టీకి నలుగురు వరకు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించే విషయం కూడా పరిశీలనలో ఉందని తెలుస్తోంది. -
లోక్‌సభ స్పీకర్: ఎవరీ ఓం బిర్లా..
ఓం బిర్లా.. ఇప్పుడు ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో ఈ పేరు చర్చనీయాంశమైంది. కేవలం రెండుసార్లు మాత్రమే ఎంపీగా ఎన్నికయిన బిర్లా బుధవారం 17వ లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. లోక్‌సభ స్పీకర్‌గా ఆయన పేరును బీజేపీ ప్రతిపాదించడం అందరినీ ఆశ్చర్య పరిచింది. సాధారణంగా సీనియర్ నేతలను స్పీకర్ పదవికి పరిగణలోకి తీసుకుంటారు. గత లోక్‌సభ స్పీకర్‌గా ఎనిమిది పర్యాయాలు ఎంపీగా గెలుపొందిన సుమిత్రా మహాజన్‌ను ఖరారు చేసిన సంగతి తెలిసింది. అయితే ఇకపై పార్టీలోనూ, చట్టసభల్లోనూ కురువృద్ధులకు స్థానం ఉండదన్న సంకేతాలను బిర్లాను ఎంపిక చేయడం ద్వారా ప్రధాని మోదీ పంపారనే తెలుస్తోంది. ఎవరీ ఓం బిర్లా.. ఓం బిర్లా 1969 నవంబర్ 23న రాజస్తాన్‌లోని కోటాలో జన్మించారు. తండ్రి శ్రీకృష్ణ బిర్లా, తల్లి శకుంతల దేవి. బిర్లా బీజేపీకి సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్న మార్వారి బనియా సామాజిక వర్గానికి చెందిన వారు. ఓం బిర్లా తన ప్రాథమిక విద్యాభ్యాసం అంతా రాజస్తాన్‌లోనే పూర్తి చేశారు. 12వ తరగతి అనంతరం బిజినెస్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. కోటాలోని కామర్స్ కాలేజీలో, అజ్మీర్‌లోని మహర్షి దయానంద సరస్వతి విశ్వవిద్యాలయంలో ఆయన చదివారు. 1991లో గైనకాలజిస్ట్‌గా పనిచేస్తున్న అమితా బిడాలీని వివాహం చేసుకున్నారు. కాలేజీలో చదివేటప్పుడే విద్యార్థి నాయకుడిగా ఎదిగిన బిర్లా భారతీయ జనతా యువ మోర్చా నాయకుడిగా పనిచేశారు. 1987 నుంచి 1991 వరుకు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన 1997 నుంచి 2003 వరకు భారతీయ జనతా యువమోర్చా రాష్ట్రీయ ఉపాధ్యక్షుడుగా ఉన్నారు. 2003లో కోటా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ నేత శాంతి ధారీవాల్‌ను 10 వేల ఓట్ల తేడాతో ఓడించి జెయింట్ కిల్లర్‌గా పేరు తెచ్చుకున్నారు. 2008లో కోటా నుంచి మరోమారు పోటీ చేసి కాంగ్రెస్ నేత రామ్ కిషన్ వర్మను 24 వేల మూడు వందల ఓట్ల తేడాతో ఓడించారు. ఆయన మొత్తం మూడు సార్లు అసెంబ్లీకి, రెండు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2014లో కోటా లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన సునాయాసంగా గెలుపొందారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ కోట నుంచి పోటీ చేసిన ఆయనను స్పీకర్ పదవి వరించింది. చురుకైన నేతగా, అప్పగించిన పనికంటే ఎక్కువ కష్టపడే వ్యక్తిగా అధిష్టానం వద్ద బిర్లాకు మంచి గుర్తింపు ఉంది. సవాళ్లను స్వీకరించడంలో ఆయనకు ఆయనే సాటి. సభ నియయనిబంధనలను క్షుణ్ణంగా ఆకళింపు చేసుకున్న బిర్లా స్పీకర్ పదవికి అర్హుడనే వ్యాఖ్యలు బీజేపీ వర్గాల్లో వినిపించడంతో ఆయనను సభాపతి పదవి వరించినట్టు తెలుస్తోంది. బిర్లాను స్పీకర్‌గా బీజేపీ ప్రతిపాదించగా ఎన్డీయే వర్గాలతోపాటు ఏఐఏడీఎంకే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. స్పీకర్‌గా బిర్లాకు మద్దతునిస్తున్నట్లు లోక్‌సభ కాంగ్రెస్ పక్ష నేత అధిర్ చౌదరి తెలిపారు. స్పీకర్‌గా ఎన్నికయిన బిర్లాను ప్రధాని మోదీ సాదరంగా తీసుకువెళ్లి చైర్లో కూర్చోబెట్టారు. మొదటిసారి లేదా రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన వారూ ఈ పదవిని చేపట్టిన సందర్భరాలు గతంలోనూ ఉన్నాయి. 2002లో స్పీకర్‌గా ఎన్నికైన మురళీ మనోహర్ జోషి అప్పుడు తొలిసారి ఎంపీగా గెలిచారు. ఆయన తరువాత ఆ పదవి చేపట్టిన జీఎంసీ బాలయోగి అప్పటికి రెండుసార్లు మాత్రమే ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే 16వ లోక్‌సభకు స్పీకర్‌గా పనిచేసిన సుమిత్రా మహాజన్ ఎనిమిదిసార్లు ఎంపీగా గెలుపొందారు. -
‘ఈవీఎంల్లో గోల్మాల్ ’
సాక్షి, న్యూఢిల్లీ : ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికలు మోసపూరితమైనవని, ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంల్లో 30 శాతం ఈవీఎంల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. పనిచేయని ఈవీఎంల స్ధానంలో మార్చిన ఈవీఎంలను ఏ ఒక్కరూ పరీక్షించలేదని అన్నారు. ఆ ఈవీఎంల్లో మాక్ పోలింగ్ కూడా నిర్వహించకపోవడంతో ఈవీఎంల్లో ఓట్లు ముందస్తుంగా నిక్షిప్తం కాలేదని చెప్పేందుకు ఆధారాలు ఏంటని ఆమె ప్రశ్నించారు. తాము ఈసీని కలిసి పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలను వాడాలని కోరతామని దీదీ స్పష్టం చేశారు. ఎన్నికల్లో తిరిగి బ్యాలెట్ పత్రాలను ప్రవేశపెట్టాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని చెప్పారు. బెంగాల్‌ను గుజరాత్‌గా మార్చాలనే ప్రయత్నాలను నిలువరిస్తామని, ఈ ఎన్నికలు మోసపూరిత ఎన్నికలని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. -
నమ్మకంగా ముంచేశారా?
న్యూఢిల్లీ: ఇటీవలి లోక్‌సభ ఎన్నికల విషయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆయన నమ్మకస్తులే మోసం చేశారన్న వార్తలు వస్తున్నాయి. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితులు, పార్టీ వ్యూహకర్తల బృందం అసలు విషయాన్ని దాచిపెట్టి, అంతా బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందంటూ రాహుల్ గాంధీని నమ్మించారని, ఫలితాలు వెలువడ్డాకా వారంతా అందుబాటులో లేకుండాపోయారని జాతీయ వార్తా పత్రిక ‘ద గార్డియన్’లో ఒక కథనం వచ్చింది. దీని ఆధారంగా ఇతర పత్రికలు,వెబ్సైట్లు ఈ విషయాన్ని ప్రచురించాయి. అయితే, ఈ కథనం నిరాధారమని కాంగ్రెస్ డేటా ఎనలిస్ట్ చీఫ్ ప్రవీణ్ చక్రవర్తి అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 164 నుంచి 184 సీట్లు కచ్చితంగా వస్తాయని, ప్రధాని పదవి రాహుల్ గాంధీదేనని వారు గట్టిగా చెప్పడంతో రాహుల్ నమ్మేశారని ఆ కథనం పేర్కొంది. వారి మాటలు పట్టుకుని ప్రభుత్వం ఏర్పాటుకు రాహుల్ సన్నాహాలు చేసుకున్నట్టు తెలిసింది. అఖిలేశ్ యాదవ్, ఎంకే స్టాలిన్, ఒమర్ అబ్దుల్లా, శరద్‌పవార్ తదితర నేతలకు రాహుల్ ఫోన్లు చేసి మంత్రివర్గంలో వారికి చోటు కల్పించే విషయమై చర్చలు జరిపారని తెలిసింది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతివ్వాల్సిందిగా రాష్ట్రపతిని కోరుతూ సీనియర్ న్యాయవాదుల తో రెండు లేఖలు రాయించుకున్నారట. అంతటితో ఆగకుండా పార్టీ కేంద్ర కార్యాలయం ముందు దాదాపు పదివేల మందితో పెద్ద ఎత్తున విజయోత్సవాలు నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేసినట్టు ఆ కథనం పేర్కొంది. తీరా ఫలితాలు వెల్లడయ్యేసరికి పరిస్థితి తారుమారైంది. కేంద్రంలో అధికారం చేపట్టే మాట అటుంచి కనీసం ప్రతిపక్షం హోదా దక్కడం కష్టమయ్యే పరిస్థితి ఏర్పడింది. దాంతో హతాశుడైన రాహుల్ అధ్యక్ష పదవికి రాజనామా చేస్తానని పట్టుబట్టారు. పార్టీ వ్యూహకర్తలు రాహుల్నేకాకుండా సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలనూ నమ్మించారని తెలిసింది. దీనికి కారకులైన, ఎన్నికల వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించిన ప్రవీణ్ చక్రవర్తి, దివ్య స్పందన ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఎవరికీ కనబడటం లేదట. దివ్య అయితే తన ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్ ఖాతాలను మూసేశారని తెలిసింది. కాంగ్రెస్ పార్టీ శక్తి యాప్‌ను నిర్వహించే చక్రవర్తి డేటా విశ్లేషకుడిగా వ్యవహరించారు. దేశవ్యాప్తంగా ప్రజల నాడి ఎలా ఉందో సర్వే చేసి చెబుతానని ఆయన 24 కోట్లు తీసుకున్నారని, అయితే, దానికి సంబంధించి కనీసం ఒక్క నివేదిక ఇవ్వలేదని తెలిసింది. చక్రవర్తి తమ దగ్గర ఉంటూ బీజేపీ ఏజెంటుగా పని చేశాడని కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇప్పుడు అనుమానిస్తున్నారు. అలాగే, కాంగ్రెస్ తరఫున సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తానని చెప్పి దివ్య రూ.8 కోట్లు తీసుకున్నారని తెలుస్తోంది. అభూత కల్పన ఎన్నికల విషయంలో తమ విభాగం రాహుల్ గాంధీని మోసగించిందంటూ వచ్చిన కథనాలను కాంగ్రెస్ పార్టీ డేటా ఎనలిస్ట్ చీఫ్ ప్రవీణ్ చక్రవర్తి ఖండించారు. అవన్నీ అభూతకల్పనలని, నిరాధారమైనవని సోమవారం న్యూఢిల్లీలో ఆయన ఒక ప్రకటనలో చెప్పారు. -
కాంగ్రెస్‌లో.. ‘కోమటిరెడ్డి’ కలకలం !
కాంగ్రెస్ పార్టీపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి శనివారం చేసిన విమర్శలు జిల్లాలో కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వీడగా.. తాజాగా రాజగోపాల్‌రెడ్డి కూడా పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడంతో.. ఆయన కూడా పార్టీ వీడుతారనే చర్చ సాగుతోంది. సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలను గెలుచుకున్న ఆనందం కాంగ్రెస్‌లో ఆవిరి అవుతున్నట్లే కనిపిస్తోంది. ఆ ఎన్నికల్లో వచ్చిన విజయం అందించిన ఉత్సాహం పట్టుమని నెల రోజులు కూడా నిలబడలేదని సగటు కాంగ్రెస్ కార్యకర్త ఉసూరుమంటున్నారు. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి, స్థానిక సంస్థల ఎన్నికల్లో అపజయాన్ని దిగమింగుకుంటున్న తరుణంలోనే ఆ పార్టీ నాయకుడు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన ప్రకటన కలకలం రేపుతోంది. ఆయన ప్రకటన దుమారం కేవలం నల్లగొండ జిల్లాకే పరిమితం కావడం లేదు. పార్టీ నాయకత్వం తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన రాజగోపాల్‌రెడ్డి అడుగులు కమలం గూటివైపు వడివడిగా పడుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికిప్పుడు బీజేపీలో చేరాలన్న నిర్ణయం తీసుకోలేదని ఆయన చెబుతున్నా.. అంతిమంగా తీసుకోబోయే నిర్ణయం మాత్రం అదే అయివుంటుందని చెబుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వం పూర్తిగా విఫలమైన తరుణంలో ఇక టీఆర్ఎస్కు ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని ఆయన కుండబద్దలు కొట్టారు. దీంతో జిల్లా కాంగ్రెస్ శ్రేణులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఉత్తమ్, కుంతియాపై.. విమర్శలు.. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకత్వమంతా ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ మాజీ నేత, సీనియర్ నాయకుడు కుందూరు జానారెడ్డి, మాజీ మంత్రి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మరో సీనియర్, మాజీ మంత్రి ఆర్.దామోదర్‌రెడ్డి వంటి నేతలున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో, ప్రధానంగా దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉన్న జిల్లాగా ఉమ్మడి నల్లగొండకు పేరుంది. దానికి తగినట్లే మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో రెండుకు రెండు ఎంపీ స్థానాలను గెలుచుకుంది. అంతకు ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు స్థానాలకే పరిమితం అయినా.. రాష్ట్రంలో వీచిన టీఆర్ఎస్ గాలిని తట్టుకుని సాధించిన విజయం కావడంతో ఆ పార్టీ వర్గాలు కొంత సంతృప్తిగానే ఉన్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో రాజగోపాల్‌రెడ్డి చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది. జిల్లాకే చెందిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌పైనా ఆయన వ్యాఖ్యలు చేశారు. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా రాజగోపాల్‌రెడ్డి ఇటు ఉత్తమ్‌పైనా, అటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ ఆర్సి.కుంతియాపైనా త్రీవస్థా యిలో ధ్వజమెత్తారు. ఇప్పుడు సరిగ్గా అదే ఇద్దరు నేతల వైఫలమ్యే రాష్ట్ర కాంగ్రెస్ దుస్థితికి కారణమని వేలెత్తి చూపారు. పీసీసీ పీఠం దక్కదని తెలిసే.. తిరుగుబాటు చేశారా? రాష్ట్ర కాంగ్రెస్ సారథ్యం కోసం ఎప్పటి నుంచే కోమటిరెడ్డి సోదరులు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఆ పీఠంపై రాజగోపాల్‌రెడ్డికి ఆశ ఉందని పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్ర నాయకత్వ మార్పు ఉంటుందని అప్పట్లో జాతీయ నాయకత్వం సంకేతాలు ఇచ్చిందని, కానీ, మార్పు మాత్రం జరగలేదన్న అసంతృప్తి వీరిలో ఉందంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా.. ఎంపీ టికెట్ దక్కించుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించారు. స్థానిక ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి జిల్లా నాయకులు ఎవరూ ముందుకు రాకపోవడంతో మళ్లీ కోమటిరెడ్డి సోదరులే ముందుకు వచ్చి, రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మిని పోటీకి నిలబెట్టి, విజయం కోసం బాగానే ఖర్చుపెట్టారు. ఈ ఎన్నికల్లో జిల్లా సీనియర్లుగానీ, టీపీసీసీ చీఫ్‌గానీ సీరియస్‌గా తీసుకుని పనిచేయలేదన్నది రాజగోపాల్‌రెడ్డి అభియోగం. జిల్లా పరిషత్ ఎన్నికల్లో సైతం కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లాలోని 31 మండలాలకు గాను 23 మండలాల్లో, రంగారెడ్డి తదితర జిల్లాల్లోనూ బాధ్యతలు మీదేసుకుని పనిచేశారు. ఇంత చేసినా.. జాతీయ నాయకత్వం గుర్తించకపోవడం, పీసీసీ పదవికి సోదరుల పేర్లను పరిశీలించకపోవడంతో రాజగోపాల్‌రెడ్డి తిరుగుబాటు జెండా ఎగరేశారని విశ్లేషిస్తున్నారు. అడుగులు.. కమలం గూటివైపేనా..? కాంగ్రెస్ నాయకత్వాన్ని తూర్పారా బట్టిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరుతారన్న అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. ఒకవైపు కాంగ్రెస్ నాయకత్వ వైఫల్యాలను ఎండగడుతూనే.. అదేస్థాయిలో బీజేపీని పొగిడిన వైనం చూస్తే.. ఆయన కమలం గూటికి చేరడం ఖాయమని అర్థమవుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా, తన తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి చేసిన ప్రకటనపై, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించ లేదు. జిల్లా కాంగ్రెస్‌కు పెద్దదిక్కుగా ఉన్న కోమటిరెడ్డి సోదరులు ఇప్పుడెలాంటి నిర్ణయం తీసుకుంటారు? రాజగోపాల్‌రెడ్డి ఒక్కరే పార్టీ మారుతారా? అయితే, వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌లోనే కొనసాగుతారా..? లేక ఆయనా మరేదైనా నిర్ణయం తీసుకుంటారా..? అన్న ప్రశ్నలు ప్రస్తుతం కాంగ్రెస్ కార్యకర్తల మదిని తొలుస్తున్నాయి. -
తెలంగాణపై అధిష్టానం ప్రత్యేక దృష్టి
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో తెలం గాణలో బీజేపీ 20 శాతం ఓట్లు సాధించి నాలుగు స్థానాల్లో గెలుపొందడంతో రాష్ట్రంపై పార్టీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించిం దని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. పశ్చిమబెంగాల్, తెలంగాణలో పార్టీ ఆశాజనకమైన ఫలితాలు సాధించడంపై అధిష్టానం హర్షం వ్యక్తం చేసిందన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అధ్యక్షతన పార్టీ పదాధికారుల సమావేశం గురువా రం ఢిల్లీలో జరిగింది. సమావేశంలో పాల్గొన్న అనంతరం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ 4 స్థానాల్లో విజయం సాధించడంపై అమిత్ షా ప్రత్యేకంగా అభినందించారని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల తరువాత మొదటిసారి జరిగిన పదాధి కారుల సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణపై అమిత్‌షా దిశానిర్దేశం చేశారని తెలిపారు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో 4 స్థానాల్లో గెలవడంతో వాటి పరిధుల్లోని 22 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఆధిక్యత ప్రదర్శించగలిగిందని వివరించారు. ఉత్తర తెలంగాణలో పుంజుకున్న పార్టీని దక్షిణ తెలంగాణకు విస్తరిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జూలై 6 నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేపడతామని, దానికి ముందుగా ఈ నెల 21న రాష్ట్రస్థాయి నేతల సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీయే అని అన్నారు. దేశవ్యాప్తంగా గల్లంతైన కాంగ్రెస్.. రాష్ట్రంలో కూడా కనుమరుగవుతుందన్నారు. కాంగ్రెస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ఆ పార్టీలో కొనసాగే స్థితి లేకుండా స్వార్థం కోసం, కాంట్రాక్టుల కోసం టీఆర్ఎస్ జెండా మోస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నారన్నారు. అందుకే ప్రజలు బీజేపీని ప్రత్యామ్నాయశక్తిగా భావించి లోక్‌సభ ఎన్నికల్లో పట్టంకట్టారన్నారు. -
ఓటర్లకు సోనియా కృతజ్ఞతలు
రాయ్‌బరేలీ: యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ రాయ్‌బరేలీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం కుమార్తె, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి ఆమె రాయ్‌బరేలీ వెళ్లారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి తనను ఎన్నుకున్న ప్రజలకు సోనియా గాంధీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. రానున్న ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవద్దని కార్యకర్తలు సోనియాను కోరినట్లు కాంగ్రెస్ నేత సంజయ్ సిన్హ్ తెలిపారు. ఇటీవలి ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత సొంత నియోజకవర్గంలో సోనియా పర్యటించడం ఇదే ప్రథమం. -
మెల్బోర్న్లో బీజేపీ విజయోత్సవం
మెల్బోర్న్ : లోక్‌సభ ఎన్నికలల్లో బీజేపీ అఖండమెజారిటీతో రెండోసారి విజయం సాధించడం సందర్భంగా ఆస్ట్రేలియాలోని ఆపార్టీ మద్దతుదారులు విజయోత్సవ సభ నిర్వహించారు. వైందమ్ కౌన్సిల్ మాజీ డిప్యూటీ మేయర్ గౌతమ్ గుప్తా ఆధ్యర్యంలో మెల్బోర్న్ నగరంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన బీజేపీ మద్దతుదారులు పెద్దఎత్తున హాజరయ్యారు. మొదటగా వందేమాతరం ఆలాపనతో ఈ కార్యక్రమం మొదలైంది. అనంతరం ఇటీవల కేరళ, కర్ణాటక, తెలంగాణలో హత్యకు గురైన బీజేపీ కార్యకర్తలకు అంజలి ఘటించారు. అనంతరం కొన్ని సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. జాతీయ గీతాలాపనతో ఈ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో అమరెందర్‌రెడ్డి కోత, మహేశ్ బద్దం, శ్రీపాల్ బొక్క, రామ్ నీత, వంశీ కొత్తల, దీపక్ గడ్డె, విశ్వంత్ కపిల ఇతర బీజేపీ మద్దతుదారులు పాల్గొన్నారు. -
కుటుంబ కథా చిత్రం!
పట్నా: ఒక కుటుంబం నుంచి ఒకరు ఎంపీ కావడమే గొప్ప. అలాంటిది ఏకంగా నలుగురు ఒకేసారి పార్లమెంట్‌కు ఎన్నిక కావడమంటే విశేషమే. బిహార్‌లోని లోక్‌జన్ శక్తి పార్టీ (ఎల్జీపీ) నేత రాంవిలాస్ పాశ్వాన్(73) ఈ ఘనత సాధించనున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో ఎన్డీయే పొత్తుల్లో భాగంగా ఎల్జేపీకి ఆరు సీట్లు దక్కాయి. వాటిలో మూడు చోట్ల.. పాశ్వాన్ కుమారుడు చిరాగ్, సోదరులు పశుపతి, రామచంద్రలు పోటీ చేసి నెగ్గారు. ఈ ఎన్నికల్లో పాశ్వాన్ పోటీ చేయలేదు. అయితే, ఆయన కేంద్ర మంత్రి అయ్యారు. ఎన్డీయేలో ముందుగా కుదిరిన అవగాహన ప్రకారం ఆయన రాజ్యసభకు ఎన్నిక కావాల్సి ఉంది. దీంతో పాశ్వాన్‌తో కలిపి ఆయన కుటుంబంలో నలుగురు ఒకేసారి ఎంపీలుగా ఉన్నట్లవుతుంది. ఇలా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఏకకాలంలో ఎంపీలు కానుండటం పార్లమెంట్ చరిత్రలో ఇదే మొదటిసారి కానుంది. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించి గిన్నిస్ కెక్కడం సహా పాశ్వాన్ రాజకీయంగా ఎన్నో రికార్డులు సృష్టించారు. ఇప్పటివరకు ఆయన లోక్‌సభ ఎన్నికల్లో తొమ్మిది సార్లు నెగ్గారు. 1977 ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించి గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. -
ఒక్కో ఓటుపై రూ.700
దేశంలో ఎన్నికలు ఏవైనా నగదు ప్రవాహం మాత్రం యథేచ్ఛగా సాగుతూ ఉంటుంది. చాలామంది అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో ఖర్చు పెట్టే మొత్తానికి, ఎన్నికల సంఘానికి సమర్పించే వివరాలకు పొంతన ఉండదు. తాజాగా సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ చేసిన అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పాటు వేర్వేరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు కలిసి రూ.55,000 కోట్ల నుంచి రూ.60,000 కోట్లు ఖర్చు పెట్టినట్లు సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ తెలిపింది. ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి ఈసీ పెట్టిన ఖర్చుతో పాటు అభ్యర్థులు చేసిన వ్యయం, తాయిలాలను ఇందులో లెక్కించినట్లు వెల్లడించింది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన మార్చి 10 నుంచి చివరి విడత ఎన్నికలు జరిగిన మే 19 వరకూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన సంక్షేమ పథకాలు, ఇతర రూపాల్లో ఖర్చుపెట్టిన మొత్తాన్ని ఇందులో కలిపినట్లు పేర్కొంది. ఈ లెక్కల ప్రకారం ఒక్కో నియోజకవర్గంలో పార్టీలన్నీ కలిసి రూ.100 కోట్లను ఖర్చు పెట్టినట్లు తేల్చింది. అంటే ఒక్కో ఓటు కోసం సగటున రూ.700 ఖర్చు పెట్టారన్నమాట. ఒకవేళ ఈసీ ఎన్నికల నిర్వహణ ఖర్చులను, ప్రభుత్వ పథకాల లబ్ధిని తొలగిస్తే ఒక్కో ఓటుపై రాజకీయ పార్టీలు రూ.583 ఖర్చుపెట్టినట్లు అవుతుంది. పెరిగిపోతున్న ఎన్నికల వ్యయం.. మనదేశంలో రాష్ట్రాలను బట్టి ఒక్కో లోక్‌సభ సభ్యుడు రూ.50 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు ఖర్చు పెట్టవచ్చు. అదే అసెంబ్లీ అభ్యర్థులైతే రూ.20 లక్షల నుంచి రూ.28 లక్షల వరకూ ఖర్చు చేయొచ్చు. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో 8,049 అభ్యర్థులు బరిలో నిలవగా, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 3,589 మంది పోటీ చేశారు. నిజానికి ఈసీ నిబంధనల ప్రకారం లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులు చేసిన వ్యయం రూ.6,639.22 కోట్లు దాటకూడదు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఈ ఖర్చు రూ.24,000 కోట్లు దాటిపోయిందని స్పష్టం చేసింది. బంగారు ఆభరణాలు, విలువైన లోహాలతో పాటు మత్తుపదార్థాలను సైతం తాయిలాలుగా అందించినట్లు వెల్లడైంది. కేవలం గుజరాత్, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లోనే రూ.1,280 కోట్ల డ్రగ్స్‌ను సీజ్ చేశారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2014 సార్వత్రిక ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి 3 రెట్లు అధికంగా నగదును ఈసీ జప్తు చేసింది. ఎన్నికల రారాజు బీజేపీ.. ఈ సార్వత్రిక ఎన్నికల ఖర్చులో సింహభాగం బీజేపీదే. ఈ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా రూ.24,750 కోట్ల నుంచి రూ.30,250 కోట్లు ఖర్చు పెట్టిందని సమాచారం. మొత్తం ఎన్నికల ప్రచార వ్యయంలో బీజేపీ వాటా 45 నుంచి 55 శాతానికి చేరుకోగా, కాంగ్రెస్ పార్టీ మాత్రం 15 నుంచి 20 శాతానికి పరిమితమైంది. ధనప్రవాహం ఎక్కడిది? సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) పరిధిలోకి రాకపోవడం రాజకీయ పార్టీల పాలిట వరంగా మారుతోంది. దీంతో తమకు విరాళాలు ఇచ్చింది ఎవరన్న విషయాన్ని పార్టీలు బయటపెట్టకపోవడంతో పారదర్శకత అన్నది కొరవడింది. దీనికితోడు ఎలక్టోరల్ బాండ్లు కూడా ఎన్నికల వ్యవస్థలో పారదర్శకతను పాతరేశాయని అధ్యయనం స్పష్టం చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి మే నెల చివరివరకూ 4,794 ఎలక్టోరల్ బాండ్లు అమ్ముడయ్యాయని చెప్పింది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, రియల్ఎస్టేట్, మైనింగ్, టెలికం, రవాణా రంగాలను ప్రభావితం చేసేలా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని అధ్యయనం తేల్చింది. వీటికితోడు పలు విద్యాసంస్థలు, కాంట్రాక్టర్లు, ఎన్జీవో సంస్థలు కూడా తమ ప్రయోజనాల రీత్యా రాజకీయ పార్టీలకు విరాళాలు ఇస్తున్నాయని చెప్పింది. ఎన్నికల వ్యయ నియంత్రణ, పారదర్శకత విషయమై 54 దేశాల్లో తాము జరిపిన అధ్యయనంలో భారత్ 31 పాయింట్లు సాధించినట్లు సెంటర్ ఫర్ స్టడీస్ తెలిపింది. అంటే భారత్ ఈ జాబితాలో దిగువ నుంచి 12వ స్థానంలో ఉందని పేర్కొంది. -
వీరి ఓటు విలువ ఇంతింత కాదయా!
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో ఎన్నికలు నిర్వహించడమంటే భారీ ఖర్చుతో కూడిన వ్యవహారంగా మారింది. ఈ ఖర్చు 1998 నాటి నుంచి అనూహ్యంగా పెరుగుతూ వస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికలు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు 55 వేల నుంచి 60 వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు అయింటుందని ‘సెంటర్ ఫర్ మీడియా సర్వీసెస్’ అనే స్వతంత్య్ర పరిశోధనా సంస్థ అంచనా వేసింది. 50 వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని ఎన్నికల కమిషన్ ముందుగానే అంచనా వేసింది. ఈ మొత్తాన్ని విభజిస్తే ఒక్కో నియోజక వర్గానికి వంద కోట్ల రూపాయలు, ఒక్క ఓటుకు 700 రూపాయలు ఖర్చు చేసినట్లు లెక్క. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ప్రతి లోక్‌సభ అభ్యర్థి తన ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రాన్నిబట్టి 50 లక్షల నుంచి 70 లక్షల వరకు, ప్రతి అసెంబ్లీ 20 నుంచి 28 లక్షల వరకు ఖర్చు పెట్టేందుకు అర్హుడు. ఈసారి లోక్‌సభకు 8, 049 అభ్యర్థులు, అసెంబ్లీలకు 3,589 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీరంతా కలిసి అధికారికంగా 6,639.22 కోట్ల రూపాయలను ఖర్చు చేయాల్సి ఉంది. ప్రతి అభ్యర్థి పరిమితికి మించే ఖర్చు చేస్తారని, పరిమితంగానే ఖర్చు చేసినట్లు దొంగ లెక్కలు చూపిస్తారని అందరికి తెల్సిందే. అందుకనే మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ఓ సందర్భంలో ‘కొందరి లోక్‌సభ జీవితం పెద్ద అబద్ధంతోనే ప్రారంభమవుతోంది’ అని చమత్కరించారు. ఈసారి అభ్యర్థులందరూ కలిసి 24వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ‘సెంటర్ ఫర్ మీడియా సర్వీసెస్’ అంచనా వేసింది. రాజకీయ పార్టీలు మరో 18 వేల కోట్లు, ఎన్నికల కమిషన్ లేదా ప్రభుత్వం 8 వేల కోట్ల రూపాయలు, మీడియా–దాతలు మూడు రెండు కోట్లు, రాజకీయేతరులు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టినట్లు అంచనా వేశారు. దీనికి అదనంగా ఈ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ వర్గాలు మద్యం, డ్రగ్స్, ఆభరణాలు, నగదు రూపేనా అక్రమంగా రవాణా అవుతున్న రూ. 3, 475 కోట్లను పట్టుకున్నారు. 2014 ఎన్నికలకన్నా ఇది నాలుగింతలు ఎక్కువ. ఈ మొత్తంలో పాలకపక్ష బీజేపీ 45 నుంచి 50 శాతం అంటే 24 వేల కోట్ల నుంచి 30 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టగా, కాంగ్రెస్ పార్టీ 15 నుంచి 20 శాతం వరకు డబ్బు ఖర్చు పెట్టింది. కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా ఖర్చు పెట్టకపోవడానికి కారణం అంతగా డబ్బులు అందుబాటులో లేకపోవడమే. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఎన్నికల బాండ్ల ద్వారా ఆ పార్టీకే అధిక నిధులు వచ్చిన విషయం తెల్సిందే. -
వయనాడ్‌లో రాహుల్ మానియా
మలప్పురం(కేరళ): లోక్‌సభ ఎన్నికల్లో భారీ మెజారిటీతో తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు చెప్పేందుకు శుక్రవారం కాంగ్రెస్ చీఫ్ రాహుల్ మలప్పురం జిల్లా కలికావుకు వచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్ షోకు భారీ వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వయనాడ్ నియోజకవర్గం వ్యాపించి ఉన్న వయనాడ్, మలప్పురం, కోజికోడ్ జిల్లాల్లో పర్యటనకు రాహుల్ శుక్రవారం కోజికోడ్‌కు చేరుకున్నారు. ముందుగా కలికావు పట్టణంలో ఓపెన్ టాప్ జీపులో చేపట్టిన రోడ్ షోకు భారీ స్పందన లభించింది. జోరువానలోనూ ప్రజలు రోడ్డుకు రెండు వైపులా నిలబడి ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. యూడీఎఫ్ కూటమికి చెందిన ఐయూఎంఎల్ కార్యకర్తలు కూడా ఈ రోడ్ షోలో పాల్గొన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో రాహుల్‌కు భారీగా భద్రత కల్పించారు. రాహుల్ వెంట రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఉన్నారు. రాహుల్ పర్యటనతో ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం కలిగిస్తుందని నేతలు అంటున్నారు. బీజేపీ విద్వేషాన్ని ప్రేమతో జయిస్తా ఈ సందర్భంగా రాహుల్ ప్రసంగిస్తూ..‘వయనాడ్ ఎంపీగా రాష్ట్ర ప్రజలందరి తరఫున పార్లమెంట్లో మాట్లాడతా. రాజకీయాలతో పని లేకుండా ఇక్కడి సమస్యలపై పార్లమెంట్ లోపలా వెలుపలా పోరాడుతా. నియోజక వర్గం కోసం మీ తరఫున పనిచేస్తా. మీ సమస్యలు వింటా. నాపై ఇంతటి అభిమానం చూపుతున్న మీ అందరికీ కృతజ్ఞతలు’ అని అన్నారు. దేశంలో బీజేపీ వ్యాపింప జేస్తున్న విద్వేషాన్ని, అసహనాన్ని ప్రేమ, ఆప్యాయతలతో ఎదుర్కొంటానని తెలిపారు. ‘మోదీకి డబ్బు, మీడియా, ధనవంతులైన స్నేహితులు ఉండి ఉండవచ్చు. కానీ, బీజేపీ సృష్టించిన అసహనాన్ని కాంగ్రెస్ ప్రేమతో ఎదిరించి పోరాడుతుంది’ అని తెలిపారు. రాహుల్ వయనాడ్ నుంచి 4.30 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. -
అన్ని మంత్రివర్గ సంఘాల్లోనూ ఆయనకు చోటు
కేంద్రంలో ప్రధాని మోదీ తర్వాత స్థానం అమిత్ షాదేనని ‘సాధికారికం’గా నిరూపణ అయింది. ప్రభుత్వంలో ఆయన అత్యంత శక్తిమంతమైన వ్యక్తి అవుతారన్న రాజకీయ పరిశీలకుల అంచనాలు నిజమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎనిమిది కీలక మంత్రివర్గ సంఘాల్లో (కేబినెట్ కమిటీ)నూ అమిత్ షా ఉండటమే దీనికి నిదర్శనం. నీతి అయోగ్‌లో ఎక్స్ అఫిషియో సభ్యుడిగా కూడా షాను నియమించారు. ఈ కమిటీల్లో కొన్నిటికి మోదీ, మరికొన్నిటికి అమిత్‌షా అధ్యక్షులుగా ఉన్నారు. దీన్నిబట్టి హోం మంత్రి అమిత్ షాకు మోదీ ఎంత ప్రాధాన్యత ఇచ్చిందీ తెలుస్తోంది. అయితే బుధవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ను కేవలం రెండు కమిటీలకు పరిమితం చేసినప్పటికీ గురువారం మరికొన్ని కమిటీల్లో స్థానం కల్పించింది. పార్లమెంటరీ వ్యవహారాల కమిటీకి అధ్యక్షుడిగా కూడా కేంద్రం నియమించింది. గత ప్రభుత్వంలో ఆరు కమిటీల్లో ఉన్న రాజ్‌నాథ్ సింగ్ ఈ సారి కూడా ఆరు కమిటీల్లో ఉన్నారు. తాజాగా గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఏడు కమిటీల్లో చోటు లభించింది. గత ప్రభుత్వంలో ఏర్పాటయిన ఆరు మంత్రివర్గ సంఘాలను ఇప్పుడు పునర్వ్యవస్థీకరించారు. వీటితో పాటు పెట్టుబడి, ఆర్థిక వృద్ధి, ఉపాధి, నైపుణ్యాభివృద్ధిలపై కొత్తగా రెండు కమిటీలను ఏర్పాటు చేశారు. సీనియర్ ప్రభుత్వాధికారుల నియామకాలు, రాజ్యాంగ సంస్థల ఏర్పాటు వ్యవహారాలు చూసే కేబినెట్ కమిటీలో మోదీ, అమిత్ షాలు మాత్రమే ఉన్నారు. రాజ్‌నాథ్ సింగ్ ఆర్థిక వ్యవహారాలు, భద్రత వ్యవహారాలు, కీలకమైన రాజకీయ వ్యవహారాలు తదితర కమిటీల్లో ఉన్నారు. ప్రధాని మోదీ అమిత్ షాను మంత్రివర్గంలోకి తీసుకోవడంతో భవిష్యత్తులో ఆయనే చక్రం తిప్పుతారన్న వార్తలు వినవచ్చాయి. దానికి అనుగుణంగానే ముడి చమురు విషయమై రెండు రోజుల క్రితం జయశంకర్, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, నిర్మలా సీతారామన్ సహా వివిధ కేంద్ర మంత్రులు నిర్వహించిన సమావేశాలకు అమిత్ షా అధ్యక్షత వహించారు. రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ జైట్లీ మాదిరిగానే సీతారామన్‌కు.. ఆరు కమిటీల పునర్వ్యవస్థీకరణలో ప్రభుత్వం గతంలో మంత్రిత్వ శాఖలకు ఇచ్చిన ప్రాధాన్యతనే ఇప్పుడూ ఇచ్చిందని రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి. గత ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న ఆరుణ్‌జైట్లీ అన్ని కమిటీల్లోనూ ఉన్నారు. ఇప్పుడా పదవి చేపట్టిన నిర్మల సీతారామన్‌కు కూడా అన్ని కమిటీల్లో స్థానం కల్పించారు. కొత్తగా ఏర్పాటు చేసిన రెండు కమిటీలకు ప్రధాని మోదీ అధ్యక్షుడిగా ఉన్నారు. నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్‌లకు కూడా పలు కమిటీల్లో స్థానం లభించింది. ప్రభుత్వ విధానాన్ని నిర్దేశించే రాజకీయ వ్యవహారాల కమిటీలో అమిత్‌షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, నరేంద్ర తోమర్, రవిశంకర్ ప్రసాద్, రామ్ విలాస్ పాశ్వాన్ తదితరులు ఉన్నారు. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీకి ప్రధాని మోదీ అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రధాన మంత్రి తర్వాత ప్రమాణ స్వీకారం చేసే వ్యక్తి ప్రభుత్వంలో నెంబర్ టూగా వ్యవహరించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సారి ప్రధాని తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన రాజ్‌నాథ్ సింగ్‌కు అమిత్ షాతో పోలిస్తే ఎక్కువ కమిటీల్లో చోటు దక్కక పోవడం విశేషం. -
గడ్కరీ ఓడిపోతాడు.. ఆడియో క్లిప్ వైరల్!
బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ లోక్‌సభ ఎన్నికల్లో నాగ్‌పూర్ నుంచి ఓడిపోతారని, సంపన్నులను మాత్రమే ఆయన పట్టించుకుంటున్నారు..కానీ నిజమైన బీజేపీ కార్యకర్తలను పట్టించుకోవడం లేదని ఇద్దరు బీజేపీ నేతలు ఫోన్లో చేసిన సంభాషణ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ ఫోన్ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండటంతో నాగ్‌పూర్ నగరానికి చెందిన ఇద్దరు బీజేపీ నేతలపై పార్టీ అధిష్టానం వేటు వేసింది. గడ్కరీని ఓడిపోతారంటూ.. ఆయన దూషించినందుకు ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించింది. నాగ్‌పూర్ సిటీ బీజేపీ శాఖ వైస్ ప్రెసిడెంట్ జైహరి సింగ్ ఠాకూర్, సిటీ శాఖ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు అభయ్ టిడ్కా లోక్‌సభ ఎన్నికల ఫలితాల ముందు సెల్ఫోన్లో మాట్లాడిన ఆడియో క్లిప్ ఇది. నిజానికి లోక్‌సభ ఎన్నికల్లో నాగ్‌పూర్ నుంచి గడ్కరీ లక్షా97వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి నానా పటోల్ చేతిలో గడ్కరీ ఓడిపోతారని, దీంతో నాగ్‌పూర్ వెస్ట్ ఎమ్మెల్యే సుధాకర్ దేశ్‌ముఖ్ 2024 ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని, ఆయన స్థానం నుంచి కాంగ్రెస్ సిటీ అధ్యక్షుడు వికాస్ ఠాక్రే బీజేపీ టికెట్ మీద పోటీ చేస్తారని ఠాకూర్, టిడ్కా ఫోన్లో సంభాషించుకున్నారు. దీంతో ఇద్దరిని పార్టీ నుంచి బహిష్కరించడమే కాకుండా.. సంజయ్‌గాంధీ నిరాధార్ యోజన్ చైర్మన్‌గా ఉన్న ఠాకూర్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించింది. అయితే, తనకు గడ్కరీ అంటే గౌరవముందని, తమ సంభాషణ ఆడియో క్లిప్‌ను ఎవరో ట్యాంపర్చేశారని ఠాకూర్ ఆరోపిస్తున్నారు. -
మోదీకి పట్టంకట్టిందీ వారే!
సాక్షి, న్యూఢిల్లీ : మోదీ అనుకూల పవనాలు స్పష్టంగా కనిపించిన 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల కంటే ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ సీట్లు రావడానికి కారణాలేమిటీ ? అన్న అంశంపై సామాజిక శాస్త్రవేత్తలు ఇప్పటికీ తర్జనభర్జనలు పడుతున్నారు. దాదాపు అన్ని ఎన్నికల ముందస్తు సర్వేలో బీజేపీకే అత్యధిక సీట్లు వచ్చినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన 272 సీట్లు రావని తేల్చాయి. బీజేపీ 300 మార్కును దాటుందని ఎగ్జిట్ పోల్స్‌లోనే తేలింది. అప్పటి వరకు నిశ్శబ్ద పవనాలు మోదీకి అనుకూలంగా వీచాయి. అవి ఏమిటీ? ‘నేషనల్ ఎలక్షన్ స్టడీ 2019’ అధ్యయనం వివరాల ప్రకారం ధనవంతులు, అగ్రవర్ణాల వారు, ఎగువ మధ్య తరగతి వాళ్లు ఎక్కువగా బీజేపీకి ఓటు వేశారు. అగ్రవర్ణాల్లో 61 శాతం మంది బీజేపీకే ఓటు వేశారట. ఈ విషయంలో మరే పార్టీ 50 శాతం మార్కును దాటలేదు. అది పార్లమెంట్ ప్రాతినిథ్యంలో కూడా కనిపించింది. అంటే పార్లమెంట్‌కు ఎన్నికైన వారిలో ఎక్కువ మంది అగ్రవర్ణాలకు చెందిన వారే ఉన్నారు. మోదీ కేబినెట్లో కూడా సగానికిపైగా అగ్రవర్ణాల వారికే చోటు లభించింది. ఆ తర్వాత 44 శాతం మంది ధనవంతులు, అంతే శాతం మంది ఎగువ మధ్యతరగతి వారు బీజేపీకే ఓటు వేశారు. దిగువ తరగతుల వారు, పేదల్లో 36 శాతం మంది మాత్రమే బీజేపీకి ఓటు వేశారు. ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం పట్లణ ప్రాంతాల్లో 41.1 శాతం సెమీ పట్టణ ప్రాంతాల్లో 32.9 శాతం మంది, గ్రామీణ ప్రాంతాల్లో 37.6 శాతం మంది బీజేపీకి ఓటు వేశారు. మొత్తం రాజకీయ పార్టీల్లో ధనిక పార్టీ బీజేపీయే అవడం, ఎన్నికల ప్రచారానికి ఆ పార్టీయే ఖర్చు పెట్టడం కూడా ఆ పార్టీకి లాభించింది. మొత్తం అన్ని పార్టీల ఎన్నికల ప్రచారానికి 60 వేల కోట్ల రూపాయలు ఖర్చు అయిందని ‘ది సెంటర్ ఫర్ మీడియా సర్వీసెస్’ అంచనా వేసింది. అందులో 27 వేల కోట్ల (45–50 శాతం) రూపాయలను బీజేపీ ఒక్కటే ఖర్చు చేయగా, కాంగ్రెస్ పార్టీ 15–20 శాతం రూపాయలను మాత్రమే ఖర్చు చేయగలిగిందట. ధనవంతులు, అగ్రవర్ణాల వారు తాము బీజేపీకే ఓటు వేస్తున్నామని మీడియా ముందు చెప్పకపోవడం, ముస్లింలు, దళితులను వ్యతిరేకించే హిందూత్వవాదులే ధనవంతులు, అగ్రవర్ణాల్లో ఎక్కువ ఉండడం వల్ల వారు ఎక్కువ మౌనాన్ని పాటించారని తెలుస్తోంది. అందుకనే మోదీ అనుకూల పవనాలు బయటకు కనిపించలేదు. -
‘కాలం చెల్లిన పార్టీలవి.. ఇవే చివరి ఎన్నికలు’
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే ఎస్పీ, బీఎస్పీలు కూటమి కట్టాయని, ఎన్నికలు ముగియడంతో కూటమి విచ్చిన్నమైందని లోక్‌జనశక్తి చీఫ్ రాంవిలాస్ పాశ్వాన్ వ్యాఖ్యానించారు. 2020లోపు ఎస్పీ, బీఎస్పీ, ఆర్జేడీ పార్టీలు తలుపులు మూసుకోక తప్పదని, ఆ పార్టీలకు కాలం చెల్లిపోయిందని అభిప్రాయపడ్డారు. కుమ్ములాట కోసమే వారు కూటమి కట్టినట్లుందని, ప్రజాసంక్షేమం వారికి పట్టదని ఆరోపించారు. యూపీ, బిహార్‌తో పాటు దేశ వ్యాప్తంగా కూడా విపక్షాలు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయని పాశ్వాన్ అన్నారు. ఆ పార్టీలకు ఇవే చివరి ఎన్నికలను జోస్యం చెప్పారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఉత్తరప్రదేశ్‌లో ఏర్పడిన ‘మహాఘఠ్ బంధన్’ చీలిపోయిన విషయం తెలిసిందే. దీంతో అధికారం బీజేపీ ఎస్పీ,బీఎస్పీపై విమర్శల వర్షం కురిపిస్తోంది. ఓట్ల కోసమే భూటకపు కూటమి కట్టారని ఆరోపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఊహించిన ఫలితాలు సాధించకపోవడంతో రానున్న ఉప ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని ఎస్పీ, బీఎస్పీ నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో బీఎస్పీ చీఫ్ మాయావతి మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. యూపీ ఉప ఎన్నికల్లో అన్ని సీట్లలోనూ ఒంటరిగా పోటీ చేయాలనుకున్నట్లు వెల్లడించారు. ఎస్పీ చీఫ్ అఖిలేష్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. -
విపక్ష శిబిరంలో లుకలుకలు
ఎన్నికల ఫలితాలు వెల్లడై పక్షం రోజులు కాకుండానే ప్రజలిచ్చిన తీర్పు ఎంత సహేతుకమైనదో విప క్షాలు నిరూపిస్తున్నాయి. మొదటగా కాంగ్రెస్ అయోమయావస్థలో చిక్కుకుంది. ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పదవి నుంచి తప్పుకుంటానని మొత్తుకుంటుంటే ‘వల్లకాదు..మీరే మా నేత’ అంటూ నాయకశ్రేణి అంతా ప్రాధేయపడుతోంది. ఇది తేలేవరకూ పార్టీ అధికార ప్రతినిధులు, నాయకులు మౌనముద్ర దాల్చాలన్న నిర్ణయం కూడా తీసుకున్నారు. వందేళ్ల పైబడి చరిత్ర గలిగి, అనేక ఎన్నికల యుద్ధాల్లో ఓడుతూ, గెలుస్తూ సుదీర్ఘకాలం పాలించిన ఒక పార్టీ నుంచి ఈ మాదిరి ప్రవర్తనను ఎవరూ ఊహించరు. ఈ అంతర్గత పోరు పర్యవసానాలు కూడా తీవ్రంగానే ఉన్న దాఖలా కనబడు తోంది. ఇప్పటికే మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లలో లుకలుకలు బయల్దేరగా... కర్ణాటకలో కాంగ్రెస్–జేడీ (ఎస్) కూటమి చిక్కుల్లో పడింది. మహారాష్ట్రలో కీలక నేతలు బీజేపీకి క్యూ కడుతున్న సూచనలు కన బడుతున్నాయి. ఇప్పుడు సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)–బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ)ల నేతృత్వం లోని మహాకూటమి వంతు వచ్చింది. అయిదు నెలలక్రితం ఆర్భాటంగా మొదలైన ఆ కూటమికి బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి స్వస్తి పలికారు. కనీసం భాగస్వామికి చెప్పాలన్న నియమం కూడా పాటించకుండా ‘ప్రస్తుతానికి’ ఆ పొత్తు నిలిచిపోతుందని ప్రకటించారు. ఈ కూటమి ఇకపై కూడా కొనసాగుతుందంటూ గంభీరంగా చెప్పుకుపోతున్న ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌ను మీడియా ప్రతినిధులు ఆపి మాయావతి నిర్ణయాన్ని చెప్పవలసి వచ్చింది. దాంతో వెంటనే ఆయన కూడా స్వరం మార్చారు. ఏతా వాతా ఇద్దరూ త్వరలో జరగబోయే 11 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేస్తారు. భవిష్యత్తులో మళ్లీ కూటమి ఉనికిలోకి రావొచ్చునని మాయావతి చెప్పినా అదంత సులభం కాదు. ‘నీకు నీ గురించి, నీ శత్రువు గురించి సంపూర్ణ అవగాహన ఉంటే వంద యుద్ధాలకు కూడా భయపడనవసరంలేద’ని ‘యుద్ధ కళ’ను రచించిన ప్రాచీన చైనా యుద్ధ నిపుణుడు సన్ జూ అంటాడు. ‘నీ గురించి తెలిసినా శత్రువును తెలుసుకోవడంలో విఫలమైతే ప్రతి విజయం వెంటా అపజయం ఎదురవుతుంటుంద’ని హెచ్చరిస్తాడు. ‘నీ గురించి, నీ శత్రువు గురించి కూడా తెలుసుకోలేని స్థితిలో పడితే నీకు శాశ్వతంగా ఓటమే రాసిపెట్టి ఉంటుంద’ని చెబుతాడు. విప క్షాలన్నీ ఈ మూడో అవస్థతో సతమతమవుతున్నాయి. వాటికి స్వస్వరూప జ్ఞానమూ శూన్యమే... తమ ప్రత్యర్థి గురించిన అవగాహనా అంతంత మాత్రమే. మొన్న జనవరిలో మహాకూటమిగా ఏర్పడినప్పుడు మాయావతి, అఖిలేష్ యాదవ్ ఎంతో ఉత్సాహంగా మాట్లాడారు. లోక్‌సభలో మాయావతికి ఎస్పీ మద్దతుగా నిలబడటానికి, అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ అఖిలేష్‌కు ఆసరా ఇవ్వడానికి ఆ రెండు పార్టీల మధ్యా అంగీకారం కుదిరింది. మరో మాటలో చెప్పాలంటే ప్రధాని పదవిని మాయావతి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని అఖిలేష్ యాదవ్ ‘పంచుకున్నారు’. కానీ ఓటర్లు మాత్రం వేరేవిధంగా ఆలోచించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆ కూటమిని ఓడించి, బీజేపీకి పట్టంగట్టారు. 80 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ 62 గెల్చు కోగా, ఆ పార్టీ మిత్రపక్షం అప్నాదళ్‌కు 2 స్థానాలొచ్చాయి. మహాకూటమి కేవలం 15 (బీఎస్పీ10, ఎస్పీ–5) స్థానాలతో సరిపెట్టుకోవాల్సివచ్చింది. కూటమి నుంచి కాంగ్రెస్‌ను దూరం పెట్టినందు వల్ల 10 స్థానాలు చేజారాయని లెక్కలు చెబుతున్నాయి. దానికి గెలిచే సత్తా లేకపోయినా కూటమి అవకాశాలను బాగా దెబ్బతీసింది. కేవలం కులాన్ని నమ్ముకుని, పరస్పరం ఓట్లు బదిలీ అవుతా యన్న విశ్వాసాన్ని పెట్టుకుని కూటమి బరిలోకి దిగింది. బీజేపీ విధానాలకు ప్రత్యామ్నాయాన్ని ప్రజల ముందుంచడంలో ఘోరంగా విఫలమైంది. ప్రజల్లో విశ్వసనీయతను పెంచుకోవడానికి ఏం చేయాలన్న విషయంలో దానికి స్పష్టత లేదు. కేవలం వేదికలపై నేతలు చేతులు కలిపినంత మాత్రాన ఏ ప్రయోజనమూ ఉండదని ఫలితాలు వచ్చాకగానీ అర్ధం కాలేదు. ఎన్నికల అనంతరం రెండు పార్టీలూ కూర్చుని వైఫల్యానికి గల కారణాలు చర్చించుకుని ఉంటే వేరుగా ఉండేది. పొత్తులో తమకు యాదవుల ఓటు బదిలీ కాలేదని మాయావతి ఆరోపిస్తున్నారు. బీఎస్పీ తరఫున తాము నిలబెట్టిన అభ్యర్థుల్లో 10మంది యాదవులకు మినహా దళితులతోసహా ఇతర కులాల అభ్య ర్థులెవరికీ యాదవుల ఓట్లు రాలేదని ఆమె అభియోగం. మొత్తంగా చూస్తే మహాకూటమికి జాతవ్ దళితులు(74 శాతం), ముస్లింలు(76 శాతం), యాదవులు(72 శాతం) గణనీయంగా ఓట్లేశారు. కానీ యాదవేతర ఓబీసీలు(72 శాతం), ఎస్టీలు(61శాతం), జాతవేతర దళితులు(57 శాతం), ఆధిపత్య కులాలు(74 శాతం), జాట్లు(55 శాతం) బీజేపీవైపు మొగ్గారు. అందువల్లే బీజేపీకి అధిక స్థానాలు లభించాయి. దళితులు, ఓబీసీల్లో బీఎస్పీ, ఎస్పీ అధినేతలకు చెందిన సామాజిక వర్గాలు తప్ప మిగిలిన వారెవరూ కూటమికి ఎందుకు ఓట్లేయలేదన్న ఆత్మ పరిశీలన చేసుకుని ఉంటే చాలా అంశాలు వెలుగులోకొచ్చేవి. సామాజిక న్యాయం పేరుతో దేశంలో నూతన రాజకీయాలకు శ్రీకారం చుట్టిన ఈ రెండు పార్టీలూ కాలక్రమంలో కుల రాజకీయాల్లో కూరుకుపోయాయి. మాయావతి తన సామా జిక వర్గానికి అందుబాటులో ఉంటారు తప్ప, దళితుల్లోని ఇతరులను పట్టించుకోరన్న అపవాదు మూటగట్టుకున్నారు. ఇటు అఖిలేష్‌పైనా ఇదే ముద్ర ఉంది. ఆయన యాదవ సామాజిక వర్గం మినహా ఓబీసీల్లో ఇతర సామాజిక వర్గాలను నిర్లక్ష్యం చేస్తారన్న విమర్శ ఉంది. దానికితోడు గెలవాలన్న ఏక సూత్ర కార్యక్రమం తప్ప మరేవిధమైన సైద్ధాంతిక ప్రాతిపదిక ఈ పార్టీలకు లేదు. ఈ లోటుపాట్లను సరిదిద్దుకోవాలన్న స్పృహ కూడా వాటికి ఉండటం లేదు. ఈ మాదిరి రాజకీయా లకు తమ మద్దతు ఉండబోదని మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు చాటిచెప్పారు. ఆ తీర్పులోని సారాంశాన్ని సక్రమంగా అవగాహన చేసుకుంటేనే విపక్షాలకు భవిష్యత్తు ఉంటుంది. లేనట్టయితే అవి క్రమేపీ కొడిగట్టడం ఖాయం. -
‘తన గొయ్యి తానే తవ్వుకుంటుంది’
కోల్‌కతా : సార్వత్రిక ఎన్నికల ఫలితాలు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని తీవ్ర నిరాశకు గురి చేశాయి. బెంగాల్లో బీజేపీ ఏకంగా 18 స్థానాల్లో విజయం సాధించి.. దీదీకి గట్టి సవాల్ విసిరింది. ఎన్నికలు ముగిసినప్పటికి ఈ రెండు పార్టీల మధ్య విబేధాలు మాత్రం చల్లారడం లేదు. గత కొన్ని రోజులుగా బీజేపీ కార్యకర్తలు మమత ఎదురుగా ‘జై శ్రీరాం’ అంటూ నినాదాలు చేయడం.. ఆమె వారి మీద ఆగ్రహం వ్యక్తం చేయడం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో.. బీజేపీ కార్యకర్తల పట్ల మమత అతిగా స్పందిస్తూ.. తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారు అన్నారు అవార్డు విన్నింగ్ నటి అపర్ణా సేన్. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై అపర్ణ స్పందిస్తూ.. బీజేపీ కార్యకర్తల పట్ల మమతా బెనర్జీ వ్యవహరిస్తున్న తీరు నాకు నచ్చడం లేదు. మనది ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ ప్రజలు జై శ్రీరాం, జై కాళీ మాతా, అల్లా అంటూ ఇలా తమకు నచ్చిన దేవుని పేరు తల్చుకోవచ్చు. ఇది ఈ దేశ ప్రజలుగా వారికున్న హక్కు. మమతా బెనర్జీ ఈ విషయాన్ని గుర్తించలేకపోవడం దురదృష్టకరం. రాజకీయాలు వేరు.. మతం వేరు. ఈ రెండింటిని కలపి చూస్తే ఇలాంటి సమస్యలే ఎదురవుతాయి. ముఖ్యమంత్రి అయ్యుండి.. బీజేపీ కార్యకర్తల పట్ల ఆమె స్పందిస్తున్న తీరు ఏ మాత్రం బాగాలేదు. దీర్ఘకాలం ఆమె బెంగాల్‌కు సీఎంగా కొనసాగలనుకుంటే.. కంట్రోల్‌గా మాట్లాడాలి’ అని తెలిపారు. ‘దీదీ తీరు ఇలానే కొనసాగితే ఓటర్లను తనకు వ్యతిరేకంగా తానే మార్చుకున్నట్లు అవుతుంది. అదే జరిగితే ఆమె గొయ్యి ఆమె తవ్వుకున్నట్లు అవుతుంది’ అన్నారు అపర్ణా సేన్. (చదవండి : దీదీకి తప్పని జై శ్రీరాం సెగ..) -
మేము కూడా ఒంటరిగానే పోటీ చేస్తాం : అఖిలేష్
లక్నో : రానున్న ఉప ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఒంటరిగా పోటీ చేస్తే.. తాము కూడా ఒంటరిగానే బరిలోకి దిగుతామని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. రాబోయే ఉప ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని వెల్లడించారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ - బీఎస్పీ కూటమి ఘోర విఫలమైన విషయం తెలిసిందే. అఖిలేష్ యాదవ్ ఆదేశాలను ఎస్పీ కేడర్ పాటించలేదని, ఆ పార్టీ నేతలు బీఎస్పీకి ఓట్లేయలేదని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆరోపించారు. క్షేత్రస్థాయిలో బీఎస్పీ-ఎస్పీ పొత్తు పనిచేయలేదని, యాదవ సామాజికవర్గం ఓట్లు బీఎస్పీ అభ్యర్థులకు బదిలీ కాలేదని తెలిపారు.మాయవతి ఆరోపణలపై అఖిలేష్ స్పందిస్తూ.. మహా గఠ్ బంధన్ విడిపోతే రాబోయే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామన్నారు. రాబోయే ఉప ఎన్నికల కోసం తాము సిద్ధమవుతున్నామని, 11 సీట్లలో ఒంటరిగా పోటీ చేస్తామని వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో కూటమి ఓటమికి గల కారణాలను లోతుగా విశ్లేషణ చేస్తామన్నారు. సామాజిక న్యాయం కోసం బీఎస్పీతో కలిసి పోరాటం సాగిస్తామని ఎస్ చీఫ్ అఖిలేశ్‌యాదవ్ తెలిపారు. -
నా కొడుకు ఓటమికి అతనే కారణం: సీఎం
జైపూర్: తన కుమారుడి ఓటమికి పీసీసీ చీఫ్ సచిన్ పైలట్‌యే బాధ్యత వహించాలని రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ అన్నారు. తన కుమారుడి ఓటమి ఎంతో కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు కంచుకోటగా పేరొందిన జోద్పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెహ్లోత్ కుమారుడు వైభవ్ పోటీ చేసిన విషయం తెలిసిందే. బీజేపీ అభ్యర్థి కేంద్రమంత్రి గజేంద్ర సింద్ షెకావత్ చేతిలో ఆయన దారుణ ఓటమిని చవిచూశారు. గతంలో ఇక్కడి నుంచి గెహ్లోత్ ఐదుసార్లు ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే దేశ వ్యాప్తంగా వీచిన మోదీ గాలి రాజస్తాన్‌లోనూ ప్రభావం చూపింది. ఆరు నెలల ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయాన్ని సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఘోర పరాభావం చవిచూసింది. మొత్తం 25 స్థానాలను కమళం కైవసం చేసుకుంది. తన కుమారుడికి మద్దతుగా.. సీఎం జోద్‌పూర్‌పై ప్రత్యేక దృష్టి సాధించినప్పటికీ విజయాన్ని మాత్రం అందించలేక పోయారు. అయితే వైభవ్ ఓటమికి సచిన్ ఫైలెట్‌యే కారణమని ఆయన వర్గీలు ఆరోపిస్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా సచిన్ పనిచేశారని, వైభవ్ తనకు పోటీగా ఎదుగుతారనే దురుద్దేశ్యంతో పావులుకదిపారని గుసగుసలాడుతున్నారు. ఈ నేపథ్యంలో వైభవ్ ఓటమికి సచిన్‌యే బాధ్యత వహించాలని సీఎం డిమాండ్ చేశారు. జోద్‌పూర్‌లో తమ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని సచిన్ తమను నమ్మించారని.. కానీ ఫలితాలు మాత్రం దానికి అనుకూలంగా రాలేదని వాపోయారు. కాగా అశోక్ కేవలం తన కుమారిడి గెలుపు కోసమే ఆతృతపడ్డారని.. పార్టీ విజయానికి ఏమాత్రం కృషి చేయాలేదని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయంతెలిసిందే. కాగా రాష్ట్రంలో ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో పార్టీని ప్రక్షాళన చేయాలని ఆపార్టీ భావిస్తోంది. కాగా అశోక్ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. -
అఖిలేశ్ భార్యను కూడా గెలిపించుకోలేకపోయాడు!
న్యూఢిల్లీ: త్వరలో యూపీలో జరగనున్న ఉపఎన్నికల్లో ఒంటరిగానే పోటీకి దిగనున్నట్లు బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. కూటమిలో ఉంటే గెలుస్తామనుకోవద్దని, ముందుగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని తెలిపారు. ఢిల్లీలో పార్టీ నేతలతో ఆమె మాట్లాడారు. ఇటీవలి ఎన్నికల్లో ఎస్పీ–బీఎస్పీ– ఆర్ఎల్డీ ‘మహా గఠ్ బంధన్’ సీట్లు సర్దుబాటు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మాయా వ్యాఖ్యలతో మహాగఠ్‌బంధన్ భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడినట్లయింది. ‘ఎమ్మెల్యేలు, పార్టీ పదవుల్లో ఉన్న వారు, కొత్తగా ఎన్నికైన ఎంపీలు త్వరలో జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండండి. కూటమితో పనిలేకుండా ఒంటరిగానే బరిలో నిలుస్తాం. రాష్ట్రంలో బీఎస్పీ సంప్రదాయ ఓటుబ్యాంకు ఉన్న 10 సీట్లను బీఎస్పీ గెలుచుకుంది. ఎస్పీ ఓట్లు మన అభ్యర్థులకు బదిలీ కాలేదు’ అని వివరించారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి చెందిన 9 మంది, బీఎస్పీ, ఎస్పీలకు చెందిన ఒక్కొక్కరు చొప్పున ఎమ్మెల్యేలు లోక్‌సభకు ఎన్నికయ్యారు. దీంతో రాష్ట్రంలో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక అవసరమైంది. ములాయం కుటుంబీకులే గెలవలేదు యూపీలో బీఎస్పీ–ఎస్పీ– ఆర్ఎల్డీతో ఏర్పాటైన మహాగఠ్‌బంధన్ వృథాయేనని మాయావతి అన్నారు. ‘యాదవుల ఓట్లు మన అభ్యర్థులకు బదిలీ కాలేదు. మన పార్టీ ఓట్లు వాళ్లకు పడ్డాయి. ముస్లింలు పెద్ద సంఖ్యలో ఓట్లు వేసిన నియోజకవర్గాల్లో ఎస్పీ గెలిచింది. యాదవుల ఓట్లు అఖిలేశ్ యాదవ్ కుటుంబీకులకు కూడా పడలేదు’ అని తెలిపారు. కూటమి లేకున్నా ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌తో సత్సంబంధాలు కొనసాగిస్తాం. ఎందుకంటే అతడు తండ్రి(ములాయం సింగ్ యాదవ్)లాంటి వాడు కాదు’ అని మాయ పేర్కొన్నారు. ‘అఖిలేశ్‌తో విభేదించిన అతడి బాబాయి శివ్‌పాల్‌యాదవ్, కాంగ్రెస్ కారణంగానే యాదవుల ఓట్లు చీలాయి. అఖిలేశ్ భార్య డింపుల్‌ను కూడా గెలిపించుకోలేకపోయాడు. అతని ఇద్దరు సోదరులూ ఓడారు. మనం ఈ ఉప ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేద్దాం’ అని తెలిపారు. సామాజిక న్యాయం కోసం కలిసి పోరాడతాం: అఖిలేశ్ సామాజిక న్యాయం కోసం బీఎస్పీతో కలిసి పోరాటం సాగిస్తామని ఎస్ చీఫ్ అఖిలేశ్‌యాదవ్ తెలిపారు. గతంతో పోలిస్తే ఈసారి ఎన్నికలు జరిగిన తీరు వేరేగా ఉందని, అది తనకు కూడా అర్థం కాలేదని తెలిపారు. ‘ఈ ఎన్నికల్లో ఫెరారీ, సైకిల్ (ఎస్పీ ఎన్నికల గుర్తు) మధ్య పోటీ. ఫెరారీయే గెలుస్తుందని అందరికీ తెలుసు. అంశాల ప్రాతిపదికన కాకుండా వేరే రకంగా ఎన్నికలు జరిగాయి. టీవీలు, సెల్ఫోన్ల ద్వారా ప్రజలతో వాళ్లు(బీజేపీ)మైండ్ గేమ్ ఆడారు. అది నాకూ అర్థం కాలేదు’ అని పేర్కొన్నారు. ఆ యుద్ధ తంత్రం అర్థమైన రోజున తాము విజేతలుగా నిలుస్తామన్నారు. -
యూపీలో కూటమికి బీటలు..?
లక్నో : బీజేపీని ఓడించడం కోసం ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ - బీఎస్పీ మహా కూటమిగా ఏర్పడినా ఫలితాలు మాత్రం నిరాశ పర్చాయి. ఈ క్రమంలో బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి.. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ వల్లే ఇంత దారుణంగా ఓడిపోయామని విమర్శించారు. ఈ క్రమంలో మాయావతి కూటిమి నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఫలితాల అనంతరం పార్టీ నాయకులతో కలిసి.. సోమవారం ఓటమిపై సమీక్ష జరిపారు మాయావతి. ఈ ఓటమిపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కూటమి అభ్యర్థులకు యాదవుల ఓట్లు ఎక్కువగా పడలేదని ఆమె అభిప్రాయపడ్డారు. యాదవుల ఓట్లను ఆకర్షించడంలో అఖిలేశ్ దారుణంగా విఫలమయ్యారని.. ఆఖరికి ఆయన భార్య డింపుల్ యాదవ్‌ను కూడా గెలిపించుకోలేకపోయారని మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి వల్ల తమకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని మాయావతి తన పార్టీ నాయకుల ముందు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. కూటమిలో చేరకపోతే.. బీఎస్పీ మరో 5 సీట్లు ఎక్కువ గెలుచుకునేదని ఆమె అభిప్రాయపడినట్లు తెలిసింది. ఈ క్రమంలో రానున్న ఎమ్మెల్యే ఉపఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో ఎస్పీ - బీఎస్పీ కూటమి 15 స్థానాల్లో విజయం సాధించగా.. వీటిలో బీఎస్పీ 10 స్థానాల్లో గెలుపొందింది. -
సంఖ్యే ముఖ్యం... శాతం కాదు
పదిహేడో లోక్‌సభలో ప్రతిపక్ష నేత పదవి చర్చనీయాంశమయింది. విపక్షాల్లో ఎక్కువ మంది సభ్యులున్న కాంగ్రెస్ పార్టీకే ప్రతిపక్ష నేత పదవి దక్కాలని కొందరు అంటోంటే, మొత్తం సీట్లలో కనీసం పది శాతం సీట్లు సాధించిన పార్టీకే ఆ పదవి దక్కుతుందని, కాంగ్రెస్‌కు పది శాతం సభ్యులు లేరు కాబట్టి ప్రతిపక్ష నేత పదవిని కోరే హక్కు లేదని మరి కొందరు వాదిస్తున్నారు. అయితే, ప్రతిపక్ష నేత పదవి అన్నది చట్టబద్ధమైన హోదా అని, పది శాతం నిబంధన చట్టంలో ఎక్కడా లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. శాతంతో సంబంధం లేకుండా లోక్‌సభలో ఎక్కువ మంది సభ్యులున్న ప్రతిపక్ష సభ్యునికి ప్రతిపక్ష నేత హోదా ఇచ్చి తీరాలని వారు చెబుతున్నారు. ప్రతిపక్ష నేత హోదా కోరే పార్టీకి లోక్‌సభలో ఎక్కువ మంది సభ్యులున్నారా లేదా అన్నదే స్పీకర్ చూడాలి కాని ఎంత మంది లేదా ఎంత శాతం అన్న లెక్క వేసే అధికారం స్పీకర్‌కు లేదని వివరిస్తున్నారు. బ్రిటన్ పార్లమెంటరీ వ్యవస్థలో అయితే విపక్ష నేతను ‘షాడో ప్రైమ్ మినిస్టర్’గా పేర్కొంటారు. ఒకవేళ అధికార పక్షం పార్లమెంటులో మెజారిటీ కోల్పోతే వెంటనే ప్రభుత్వ ఏర్పాటుకు ఈ విపక్ష నేత సిద్ధంగా ఉంటారు. అందుకే విపక్ష నేతను షాడో ప్రధానమంత్రిగా పేర్కొంటారు. స్పీకర్‌దే తుది నిర్ణయం మన పార్లమెంటరీ విధానంలో ఉభయ సభల్లోనూ విపక్ష నేత పదవి చట్టబద్ధమైనది. 1977 నాటి ‘పార్లమెంటులో విపక్ష నేతల జీత, భత్యాల చట్టం’ ఈ పదవిని నిర్వచించింది. లోక్‌సభ/రాజ్యసభలో ప్రతిపక్షాల్లో దేనికి ఎక్కువ మంది సభ్యులుంటే ఆ పార్టీ సభ్యుడు విపక్ష నేత అవుతారని, ఆ సభ్యుడిని విపక్ష నేతగా స్పీకర్/రాజ్యసభ చైర్మన్ గుర్తించాలని ఆ చట్టం నిర్దేశించింది. ఎక్కువ మంది అని చెప్పిందే కాని ఎంత శాతం అన్నది చట్టంలో ఎక్కడా ప్రస్తావించలేదు. ఒకవేళ ప్రతిపక్షాల్లో ఒకటి కంటే ఎక్కువ పార్టీలకు సమాన సంఖ్యలో సభ్యులు ఉన్నట్టయితే, వాటిలో ఏదో ఒక పార్టీ సభ్యుడిని విపక్ష నేతగా స్పీకర్ గుర్తించవచ్చని, ఈ విషయంలో స్పీకర్‌దే తుది నిర్ణయమని ఆ చట్టం స్పష్టం చేస్తోంది. సభలో ఎక్కువ మంది సభ్యులున్న ప్రతిపక్షం తమ పార్టీ సభ్యుడిని ప్రతిపక్ష నేతగా గుర్తించాలని కోరుతూ స్పీకర్‌కు విజ్ఞప్తి చేయాలి. ఆ అభ్యర్థనను పరిశీలించిన స్పీకర్ ఆ పార్టీ పేర్కొన్న వ్యక్తికి విపక్ష నేతగా గుర్తింపు ఇస్తారు. సంఖ్యాపరంగా పెద్ద పార్టీకి విపక్ష నేత హోదా కోరే హక్కుందని ఈ చట్టం స్పష్టం చేస్తోంది. ఏది పార్టీ... ఏది గ్రూప్ చట్టం ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు విపక్ష నేత హోదా గురించి ఇంత రాద్ధాంతం ఎందుకు జరుగుతోంది. 1950 దశకంలో స్పీకరు పార్లమెంటులో ప్రతిపక్షాలను సభ్యుల సంఖ్య ఆధారంగా కొన్నింటిని పార్టీలుగా, కొన్నింటిని గ్రూపులుగా గుర్తించడం మొదలైంది. సభలో సీట్లు, చర్చల్లో సమయం, పార్టీ లకు గదులు కేటాయించడం కోసం అప్పట్లో ఈ పద్ధతిని అనుసరించారు. మొత్తం సీట్లలో పది శాతం సీట్లు సాధించిన రాజకీయ పక్షాన్ని పార్టీ అని, అంతకంటే తక్కువ శాతం సీట్లు ఉన్నదాన్ని గ్రూప్ అని వర్గీకరించారు. అప్పటి నుంచి పది శాతం అన్నది నిబంధనగా మారిపోయింది. 1977లో జీత భత్యాల చట్టం ఈ విషయంలో సందేహానికి, గందరగోళానికి తెరదించింది. ఢిల్లీ అసెంబ్లీలో ముగ్గురున్నా... రాజ్యాంగంలోని పదో షెడ్యూలు పార్టీ ఫిరాయింపు నిరోధక నిబంధనలు తెచ్చింది. దాని ప్రకారం సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా సభలో ఉండే ప్రతి రాజకీయ పక్షాన్ని పార్టీగానే పరిగణిస్తున్నారు. ఒక సభ్యుడున్న పక్షాన్ని కూడా పార్టీగానే గుర్తిస్తున్నారు. ఢిల్లీ శాసనసభలో సభ్యులు 70 మంది. ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీకి ముగ్గురే సభ్యులున్నారు. పదిశాతం నిబంధన ప్రకారం ఆ పార్టీకి విపక్షనేత హోదా రాకూడదు. అయితే, స్పీకర్ రామ్ నివాస్ గోయల్ బీజేపీకి ఆ గుర్తింపు ఇచ్చారు. -
బదులు తీర్చుకున్న నితీశ్
పట్నా: కేంద్ర మంత్రివర్గంలో తమకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేసిన జేడీయూ చీఫ్, బిహార్ సీఎం నితీశ్ కుమార్ బీజేపీపై బదులు తీర్చుకున్నారు. రాష్ట్ర మంత్రి వర్గాన్ని విస్తరించిన ఆయన.. ఎన్డీఏలోని బీజేపీ, ఎల్జేపీలను పక్కనబెట్టి కేవలం తమ పార్టీకే చెందిన 8 మందికి మంత్రి పదవులు కట్టబెట్టారు. ఈ పరిణామంపై ఎల్జేపీ నేత, కేంద్రమంత్రి రాం విలాస్ పాశ్వాన్ స్పందిస్తూ.. ఎన్డీఏలో ఎటువంటి విభేదాల్లేవని, జేడీయూ తమతోనే ఉంటుందని స్పష్టం చేశారు. కేబినెట్ విస్తరణ అనంతరం ముఖ్యమంత్రి నితీశ్ మీడియాతో మాట్లాడుతూ..కేబినెట్ విస్తరణలో బీజేపీకి ఒక మంత్రి పదవి ఇవ్వజూపగా వారు అయిష్టత వ్యక్తం చేశారని తెలిపారు. గతంలో ఖాళీ అయిన మంత్రి పదవులనే తాజా విస్తరణలో భర్తీ చేశామన్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మధ్య ఎటువంటి విభేదాల్లేవని వెల్లడించారు. ఈ పరిణామంపై బీజేపీ సీనియర్ నేత, డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ ట్విట్టర్లో స్పందిస్తూ.. ‘సీఎం నితీశ్ మా పార్టీకి ఒక మంత్రి పదవి ఇస్తామన్నారు. కానీ, మేం ప్రస్తుతానికి వద్దని చెప్పాం’ అని పేర్కొన్నారు. ఆదివారం ఉదయం రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కొత్త మంత్రులతో గవర్నర్ లాల్జీ టాండన్ ప్రమాణ స్వీకారం చేయించారు. నితీశ్ కేబినెట్లోని బీజేపీకి చెందిన ఇద్దరు, ఎల్జేపీకి చెందిన ఒకరు ఇటీవలి ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నిక కావడం, ముజఫర్‌పూర్ షెల్టర్ హోం కేసులో ఆరోపణలున్న మంజు వర్మ రాజీనామాతో నాలుగు పోస్టులు ఖాళీ అయ్యాయి. రాష్ట్ర కేబినెట్లో ఉన్న బీజేపీకి చెందిన రాజీవ్ రంజన్ సింగ్ జల్‌శక్తి శాఖ మంత్రిగా, దినేశ్ చంద్ర యాదవ్ జల్‌శక్తి శాఖ మంత్రిగా, ఎల్జేపీ నేత పసుపతి కుమార్ పరాస్ మత్స్యశాఖ మంత్రిగా ఇటీవల కేంద్ర మంత్రి వర్గంలో స్థానం పొందిన విషయం తెలిసిందే. నితీశే మా నేత: పాశ్వాన్ బిహార్‌లో ఎన్డీఏ ఐక్యంగా>నే ఉందని, ముఖ్యమంత్రి నితీశ్ కుమారే తమ నేత అని ఎల్జేపీ నేత, కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ స్పష్టం చేశారు. కేంద్ర కేబినెట్లో చేరకూడదన్న జేడీయూ నిర్ణయం ఎన్డీఏపై ఎలాంటి ప్రభావం చూపబోదని తెలిపారు. ‘ఈ అంశంపై అపార్థాలు వెదకడం తగదు. ఎన్డీఏలోనే ఉన్నాం, ఉంటామంటూ నితీశ్ కుమార్ ఇప్పటికే చెప్పారు కూడా. విభేదాలు ఏవైనా ఉంటే నేను చూసుకుంటా’ అని అన్నారు. కేంద్ర కేబినెట్లో చేరేలా నితీశ్‌ను ఒప్పిస్తారా అని మీడియా ప్రశ్నించగా.. ‘సొంతంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఆయనకుంది. ఎన్డీఏలోనే ఉంటా మంటూ నితీశ్ కుమార్ స్పష్టం చేసినప్పుడు ఇంకా సమస్యెందుకు? అని పాశ్వాన్ తిరిగి ప్రశ్నించారు. -
మళ్లీ అదే జోడీ
కేంద్ర హోంశాఖ మంత్రిగా అమిత్ షా నియామకంపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నప్పటికీ భారతీయ జనతా పార్టీలో సీనియర్లకు మాత్రం కొన్ని మధుర స్మృతులు కళ్ల ముందు మెదులుతున్నాయి. మోదీ–షా ద్వయాన్ని చూస్తున్న వారందరూ ఒక్కసారిగా రెండు దశాబ్దాలు వెనక్కి వెళ్లి అటల్జీ రోజుల్లో విహరిస్తున్నారు. 1998లో ప్రధానమంత్రిగా అటల్ బిహారి వాజపేయి నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటైంది. లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో లక్నో నియోజకవర్గం నుంచి వాజపేయి ఎన్నికైతే, గుజరాత్లో గాంధీనగర్ నుంచి ఎన్నికైన ఎల్.కె. అడ్వాణీ హోం మంత్రి పదవిని అందుకున్నారు. ఆ తర్వాత ఉప ప్రధాని పదవిని చేపట్టారు. వాజపేయి–అడ్వాణీ జోడీ తమకున్న పరస్పర సహకారంతో బీజేపీకి ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టారు. దశాబ్దాల తరబడి కాంగ్రెస్ వంశపారంపర్య పాలనతో విసిగిపోయిన జనంలో వాజపేయి–అడ్వాణీ జోడీ పట్ల ఎనలేని నమ్మకం ఏర్పడింది. బీజేపీ తొలిసారిగా స్వర్ణయుగం అనుభవించిన రోజులవి. మళ్లీ ఇరవై సంవత్సరాల తర్వాత అదే రిపీట్ అయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి ప్రాతినిధ్యం వహిస్తే, హోంమంత్రి అమిత్ షా ఇన్నాళ్లుగా అడ్వాణీ ప్రాతినిధ్యం వహించిన గాంధీనగర్ నుంచే నెగ్గారు. యూపీ పీఏం, గుజరాత్ హెచ్ఎం ఫార్ములా అప్పట్లో బీజేపీని తారాపథంలోకి తీసుకువెళ్లింది. ఇప్పుడు హోం మంత్రిగా షా నియామకంతో అదే యూపీ, గుజరాత్ కాంబినేషన్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందోనన్న ఆసక్తి నెలకొంది మోదీ షా ద్వయం ఎదుర్కోనున్న సవాళ్లు అప్పట్లో వాజపేయి అడ్వాణీ జోడి ఎదుర్కొన్న సవాళ్లే ఇప్పుడూ మోదీ, షా ఎదుట ఉన్నాయి. అయితే అప్పటి పరిస్థితులకి, ఇప్పటి పరిస్థితులకి ఎంతో వ్యత్యాసం ఉంది. వికాస్ పురుష్‌గా పేరుతెచ్చుకున్న వాజపేయి, లోహ్పురుష్ అని పిలుచుకునే అడ్వాణీ కాంబినేషన్ అందరినీ ముచ్చటగొలిపింది. బీజేపీకి ఒక గుర్తింపు తేవడానికి వారు ఎంతో కృషి చేశారు. వాళ్లిద్దరు వేసిన బాటలోనే నడుస్తున్న మోదీ–షా ద్వయం దృష్టంతా ఇప్పుడు మోదీ తరహా రాజకీయాలను తిరస్కరిస్తున్న రాష్ట్రాల్లో పట్టు బిగించడంపైనే ఉంది. వివిధ రాష్ట్రాల్లో పార్టీని క్షేత్రస్థాయిలో విస్తరింపజేయడమే మోదీ–షా ద్వయం ముందున్న అసలు సిసలు సవాల్. రాష్ట్రాల్లో పట్టుబిగిస్తే తప్ప రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వానికి మెజార్టీ దక్కదు. కొత్త చట్టాలు చేసి పరిపాలనలో సంస్కరణలు తీసుకురావాలన్నా, బూజుపట్టిన పాత చట్టాలకు సవరణలు చేయాలన్నా పెద్దల సభలో బీజేపీకి మెజార్టీ అత్యవసరం. అప్పుడే ఈ జోడీ తాము అనుకున్నది సాధించగలదు. యూపీ, మహారాష్ట్ర, బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైతేనే పెద్దల సభలో పట్టు బిగించగలరు. -
ప్రజా సంక్షేమమే లక్ష్యం
న్యూఢిల్లీ: దేశ భద్రత, ప్రజా సంక్షేమమే మోదీ ప్రభుత్వ ప్రథమ లక్ష్యాలని నూతన హోం మంత్రి అమిత్ షా తెలిపారు. హోం మంత్రిగా రెండు రోజుల క్రితం బాధ్యతలు చేపట్టిన ఆయన శనివారం మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షాకు హోం మంత్రిత్వ శాఖ పనితీరు, ప్రస్తుతం శాఖకు సంబంధించిన కీలక అంశాలను అధికారులు వివరించారు. షాతో పాటు సహాయ మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన జి.కిషన్‌రెడ్డి, నిత్యానంద్ రాయ్ కూడా దాదాపు గంటసేపు జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్నారు. అంతకుముందు నార్త్‌బ్లాక్‌లోని హోం శాఖ కార్యాలయంలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా, ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ రాజీవ్ జైన్ తదితర సీనియర్ అధికారులు మంత్రి అమిత్ షాకు ఘన స్వాగతం పలికారు. సమావేశం అనంతరం అమిత్ షా ట్విట్టర్లో..‘దేశ భద్రత, ప్రజా సంక్షేమం మోదీ ప్రభుత్వం ప్రథమ లక్ష్యాలు. మోదీజీ నేతృత్వంలో ఈ లక్ష్యాల సాధనకు శాయశక్తులా కృషి చేస్తా’ అని అన్నారు. -
కొదమసింహాల్లా పోరాడుతాం: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టారు. పార్లమెంటులోని సెంట్రల్‌హాలులో శనివారం జరిగిన సమావేశంలో కాంగ్రెస్ నేతలు ఆమెను కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ(సీపీపీ) నేతగా ఎన్నుకున్నారు. తొలుత సోనియాగాంధీ పేరును మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్సింగ్ ప్రతిపాదించగా, మిగతా కాంగ్రెస్ ఎంపీలు, ముఖ్య నేతలు చేతులు పైకెత్తి తమ అంగీకారం తెలియజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ లోక్‌సభ పక్షనేతను ఎంపికచేసే బాధ్యతను పార్టీ సోనియాకు అప్పగించింది. బాధ్యతలు స్వీకరించిన అనంతరం సోనియాగాంధీ మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమితో కాంగ్రెస్ శ్రేణులు దిగులుపడొద్దని సూచించారు. పార్లమెంటులో సమర్థవంతమైన ప్రతిపక్ష పాత్ర పోషించాలనీ, రాజ్యసభలో ఒకేరకమైన భావజాలం ఉన్న రాజకీయ పార్టీలతో కలిసి ముందుకు సాగాలని కాంగ్రెస్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తాం.. ‘ఈ సంక్షోభ సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురవుతున్న పలు సవాళ్లను మనం గుర్తించాలి. ఇటీవల సమావేశమైన సీడబ్ల్యూసీ పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించింది. పార్టీని పటిష్టం చేయడానికి తీసుకోవాల్సిననిర్ణయాలపై చర్చించాం. యూపీఏ ప్రభుత్వం గతంలో తీసుకొచ్చిన చరిత్రాత్మక చట్టాలను గత ఐదేళ్ల కాలంలో ఎన్డీయే ప్రభుత్వం రద్దుచేయకుండా అడ్డుకోగలిగాం. సంస్కరణలు, కీలక అంశాల విషయంలో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించాం. ప్రభుత్వం చేసే విభజన, తిరోగమన రాజకీయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తాం’ అని సోనియా స్పష్టం చేశారు. రాహుల్‌పై ప్రశంసలు.. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌గాంధీ అద్భుతంగా పోరాడారని సోనియా కితాబిచ్చారు. ‘కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆయన కోట్లాది మంది ఓటర్లతో పాటు ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త ప్రేమను, గౌరవాన్ని చూరగొన్నారు. రైతులు, చిరువ్యాపారులు, యువత, మహిళలు, సమాజంలోని బలహీనవర్గాల పట్ల మోదీ ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరించడాన్ని ధైర్యంగా నిలదీశారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో అవిశ్రాంతంగా, ధైర్యంగా దూసుకుపోయిన రాహుల్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. లోక్‌సభలో 44 మంది, రాజ్యసభలో 55 మంది ఎంపీల బలం మాత్రమే ఉన్నప్పటికీ రాహుల్ నాయకత్వంతో కాంగ్రెస్ ప్రభుత్వ తప్పులను వెలుగులోకి తీసుకొచ్చింది. నేనిక్కడ మాట్లాడుతున్నప్పుడు కూడా రాహుల్ పార్టీ అధ్యక్ష పదవికి చేసిన రాజీనామాను వెనక్కి తీసుకోవాలని దేశవ్యాప్తంగా విజ్ఞప్తులు వస్తున్నాయి. రాహుల్ నాయకత్వంలోనే కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది’ అని తెలిపారు. రాజ్యసభలో కాంగ్రెస్ బలం తగ్గనున్న నేపథ్యంలో భావసారూప్య పార్టీలతో కలిసి ముందుకెళ్లాలని సోనియా పునరుద్ఘాటించారు. మరోవైపు సీపీపీ నేతగా సోనియా ఎంపికపై రాహుల్ స్పందిస్తూ..‘పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికైన సోనియాకు శుభాకాంక్షలు. ఆమె నాయకత్వంలో కాంగ్రెస్ భారత రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేస్తుందని ఆశిస్తున్నా’ అని ట్వీట్ చేశారు. బీజేపీని ఇష్టానుసారం వ్యవహరించనివ్వం: రాహుల్: లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన 52 మంది కాంగ్రెస్ ఎంపీలు రాజ్యాంగాన్ని, రాజ్యాంగబద్ధమైన సంస్థలను కాపాడేందుకు కొదమసింహాల గుంపులా పోరాడుతారని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వాన్ని పార్లమెంటులో తమ ఇష్టానుసారం వ్యవహరించనివ్వబోమని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ‘బ్రిటిష్ హయాంలో ఉన్నట్టు ఈ ఎన్నికల్లో ఏ రాజ్యాంగబద్ధమైన సంస్థ కూడా సహకరించకపోయినా కాంగ్రెస్ పోరాడి గెలిచింది. ఇప్పుడు మళ్లీ పోరాడుతాం. మనమంతా కులం, మతం, రంగు, జాతి, రాష్ట్రం అనే భేదభావం లేకుండా రాజ్యాంగ పరిరక్షణకు, దేశంలోని ప్రతీఒక్కరి హక్కుల కోసం పోరాడుతున్నామని గుర్తుంచుకోవాలి. ఎన్నికల సందర్భంగా బీజేపీ విద్వేషం, ఆగ్రహాన్ని కాంగ్రెస్ ప్రేమ, ఆప్యాయతతో అడ్డుకుంది. అందుకే ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ ముక్తభారత్ అని కలవరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ లేకపోతే తమకు అడ్డుకునేవారే ఉండరని భావిస్తున్నారు’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈసారి పార్లమెంటులో మరింత తక్కువ సమయం లభించే అవకాశముందనీ, కాబట్టి ప్రజావాణిని గట్టిగా వినిపించాలని సూచించారు. ఈ ఎన్నికల్లో కొందరు పాతముఖాలు (మల్లికార్జున ఖర్గే, సునీల్ కుమార్ జాఖడ్, జ్యోతిరాదిత్య సింధియా) ఇక్కడుంటే బాగుండేదని విచారం వ్యక్తం చేశారు. అధ్యక్ష పదవి రేసులో నలుగురు.. సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తాను ఉండబోనని రాహుల్ ప్రకటించిన నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు చేపడతారన్న విషయమై రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ పదవిలో గాంధీయేతర నేతను నియమించి, ఆయనకు సాయంగా సీనియర్ నేతలతో ఓ కమిటీని నియమించవచ్చని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చసాగుతోంది. కేరళ పీసీసీ మాజీ చీఫ్, 7 సార్లు లోక్‌సభ సభ్యుడిగా గెలుపొందిన కొడికుణ్ణల్ సురేశ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో తొలిస్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. బెంగాల్లో టీఎంసీ, బీజేపీ హవాను తట్టుకుని ఐదోసారి ఎంపీగా గెలిచిన అధిర్ రంజన్ చౌదరి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనోజ్ తివారీ, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ పేర్లు వినిపిస్తున్నాయి. జూన్ 17 నుంచి లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సోనియా వీలైనంత త్వరగా ఈ నియామకం చేపట్టే అవకాశముందని భావిస్తున్నారు. -
పెడధోరణికి సమాధి–ప్రగతికి పునాది
‘వెల్ బిగన్ ఈజ్ హాఫ్ డన్.’ సవ్యంగా, సలక్షణంగా ప్రారంభమైన పని సగం పూర్తయినట్టే అంటారు. గురువారంనాడు అమరావతిలో, ఢిల్లీలో పదవీ ప్రమాణ స్వీకారోత్సవాలు అద్భుతంగా జరిగాయి. ఎన్నికలలో ప్రజలు తమ నిర్ణయం నిర్ద్వంద్వంగా, ప్రస్ఫుటంగా ప్రకటించారు. ప్రజల తీర్పును అను సరించి అమరావతిలో వైఎస్ జగన్మోహన్రెడ్డి మొదటిసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఢిల్లీలో నరేంద్రమోదీ రెండోసారి ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. జగన్ ఒంటరిగా ప్రమాణం చేయగా, మోదీ మరి 53 మంది సహచరులతో కొలువుదీరారు. వారం రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ మంత్రుల నియామకం జరుగుతుందని అంటున్నారు. నవ్యాంధ్ర ప్రజలు అధికా రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ (టీడీపీ)ని తిరస్కరించి ప్రతిప„ý మైన వైఎస్ ఆర్సీపీకి పట్టం కట్టారు. దేశ ప్రజలు అధికారంలో ఉన్న మోదీ సారథ్యాన్ని ఆమోదించి మరో ఐదేళ్ళు సమధికోత్సాహంతో పొడిగించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ ప్రజలు ఒకే విధమైన తీర్పు ఇచ్చారు. తెలుగు రాష్ట్రాలలో కనీవినీ ఎరుగని రీతిలో జగన్‌కు అఖండ విజయం ప్రసా దించారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ 90 కోట్లమంది ఓటర్లూ దాదాపుగా ఒకే తరహాలో తీర్మానించారు. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ప్రభావం అంతగా లేకపోయినా కర్ణాటకలో అధికంగానూ, తెలంగాణలో గణనీ యంగానూ మోదీ హవా పని చేసింది. దేశం మొత్తం మీద బీజేపీది గొప్ప విజ యం. బీజేపీ ప్రచారం చేసిన ‘మోదీ హై తో ముమ్కిన్ హై’(మోదీ ఉంటే ఏదైనా సాధ్యమే) నినాదాన్ని ఓటర్లలో అధిక సంఖ్యాకులు విశ్వసించారు. ‘ఆయేగా తో మోదీ హీ’ (మోదీయే వస్తాడు) నినాదం ముమ్మాటికీ నిజమై కూర్చున్నది. వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర తర్వాత 2004లో జరిగిన ఎన్నికలలో ఘనవిజయం సాధించి వేలాది ప్రజల సమక్షంలో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన మీదట తొలిసంతకం వ్యవసాయదారులకు ఉచిత విద్యుత్తు సరఫరా చేయడానికి ఉద్దేశించిన ఫైల్ పైన చేశారు. ఆయన కుమారుడు తండ్రి కంటే ఎక్కువకాలం, ఎక్కువ దూరం పాదయాత్ర చేసి, ఎన్నికలలో తండ్రికంటే ఘన మైన విజయం సాధించి తండ్రిని మించిన తనయుడని నిరూపించుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే వృద్ధాప్య పింఛన్ మొత్తాన్ని రూ. 2,250లకు పెంచే ఫైలుపైన తొలిసంతకం చేసి అవ్వాతాతలకు మోదం కలి గించారు. ప్రజాసంక్షేమం విషయంలో వైఎస్ ఒక అడుగు ముందుకు వేస్తే తాను రెండడుగులు ముందుకేస్తానన్న హామీని నిలబెట్టుకుంటూ త్రికరణశుద్ధిగా ప్రస్థా నం ప్రారంభించారు. అధ్వానంగా ఆర్థిక పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ప్రమాదపుటంచుల్లో ఉన్నది. ఇప్పుడున్న సంక్షేమ పథకాలకు తోడు జగన్ ఎన్నికల ప్రచారానికి ముందే ప్రకటించిన నవరత్నాలలో భాగంగా చేపట్టవలసిన పథకాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు కొత్త ప్రభుత్వం వేతనాలు ఉదారంగా పెంచుతుందనే ఆశతో ఉన్నారు. రాజధాని నగర నిర్మాణం భారీ ఖర్చుతో కూడిన పని. కాంట్రాక్టర్లకు చెల్లించవలసిన బిల్లులు ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టడం, ఇచ్చిన హామీలను అమలు జరపడం ప్రభుత్వం ఎదుట ఉన్న పెనుసవాళ్లు. టీడీపీ ప్రభుత్వం దాదాపు రెండు ల„ý ల కోట్ల రూపాయలు అప్పు చేసి చిరు ఆస్తి కూడా నిర్మిం చకుండా ఖజానాను ఖాళీ చేసింది. కేంద్రం బకాయిలు చెల్లించడంతో సరిపుచ్చు కోకుండా అదనపు ఆర్థిక సహాయం చేయాలి. ప్రత్యేక హోదా మంజూరు చేసి ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకుంటే రాష్ట్రంలో కొత్త పరిశ్రమలూ, వ్యాపార సంస్థలూ వెలసి ఆర్థిక వనరులు పెంపొందుతాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) జగన్ ప్రమాణస్వీకార మహోత్సవానికి వచ్చి ‘కావలసింది ఖడ్గ చాలనం కాదు, కరచాలనం’ అని హితవాక్యం చెప్పారు. తెలుగు రాష్ట్రాలు రెండూ పరస్పరం సహకరించుకుంటూ ప్రగతి పథంలో ప్రయాణం చేయాలని అనడం ఆప్తవాక్యం. నదీజలాల విషయంలో కేసీఆర్ ఇచ్చిన భరోసా స్వాగతించదగినది. తమిళనాడు నుంచి డీఎంకే అధినేత స్టాలిన్ వచ్చి శుభాకాంక్షలు తెలియజేయడం ఆనందదాయకం. సంక్షేమం, అభివృద్ధి జోడు గుర్రాలుగా పరుగులెత్తిస్తూ నవ్యాంధ్ర ప్రగతి రథాన్ని జగన్ ఎంత వేగంగా, ఎంత లాఘవంగా, ఎంత సమర్థంగా నడిపిస్తారోనని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలూ, దేశంలోని ఇతర ప్రాంతాల నేతలూ, ప్రజలూ ఆసక్తిగా గమనిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ విజయం సాధించిన తీరు జగన్ ఎటువంటి సవాళ్ళనైనా జయప్రదంగా ఎదుర్కోగలరనే విశ్వాసం కలిగిస్తుంది. 2014లో ఓడిపోకుండా స్వల్ప మెజారిటీతో ఆ పార్టీ గెలుపొంది ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. అప్పుడు జగన్‌కు సుదీర్ఘమైన పాదయాత్ర చేసి చరిత్ర సృష్టించే అవకాశం ఉండేది కాదు. పాదయాత్రలో సుమారు కోటిమందిని కలుసుకొని వారి వెతలు ఆలకించి మనస్సులో నమోదు చేసుకునే సందర్భం ఉండేది కాదు. పాదయాత్ర ఫలితంగానూ, ప్రత్యేక హోదా కోసం ఉద్యమాల కారణంగానూ, ప్రతిపక్ష నాయకుడిగా సమర్థమైన పాత్ర పోషించడం వల్లనూ ప్రజల గురించీ, వారి సమస్యల గురించీ సంపూర్ణమైన అవగాహన ఏర్పడింది. క్షేత్రజ్ఞానం విశేషంగా పెరిగింది. ఒక రకంగా ప్రతిపక్షంలో ఉండటం వల్ల మేలు జరిగింది. అప్పుడే గెలిచి ఉంటే అనుభవం లేని వ్యక్తి ముఖ్యమంత్రి వచ్చారనీ, విశేష అనుభవం కలిగిన చంద్రబాబుకి అధికారం అప్పగిస్తే అద్భుతాలు చేసేవారనీ ప్రచారం చేయడానికి వీలుండేది. చంద్రబాబు పాలన చూసిన తర్వాత ఆయనను ముఖ్య మంత్రిని చేసినందుకు చింతించి, వగచిన ప్రజలు కసితో టీడీపీని చిత్తుగా ఓడిం చారు. వైఎస్ఆర్సీపీ అఖండ విజయానికి రెండు కారణాలు–ఒకటి, జగన్ మాట తప్పని, మడమ తిప్పని మనిషనీ, హామీలు తు.చ. తప్పకుండా అమలు చేస్తా రనీ, ప్రజలను మనస్ఫూర్తిగా ప్రేమిస్తాడనీ, సమర్థంగా పరిపాలిస్తారనీ బల మైన విశ్వాసం. రెండు, చంద్రబాబుపట్ల పెరిగిన అవిశ్వాసం, అసహనం, ఆగ్రహం. ఫలితంగా చంద్రబాబుకి అవకాశం ఇవ్వకుండా తప్పు చేశామని ఓటర్లు అనుకునే అవకాశం లేదు. జీవితంలో సంభవించే పరిణామాలను ప్రశ్నిం చకుండా స్వీకరించాలని తత్త్వవేత్తలు చెప్పిన హితవు జగన్‌కు అక్షరాలా వర్తి స్తుంది. ‘ఫెయిల్యూర్ ఈజ్ హైరోడ్ టు సక్సెస్’ (పరాజయం విజయానికి రహ దారి) అనే నానుడిని సత్యమని నిరూపిస్తూ అద్భుత విజయం సాధించిన జగన్ ఉత్తమ ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోవడానికి అనువైన వాతావరణం ఈ రోజు ఆంధ్రావనిలో నెలకొన్నది. పెరిగిన మోదీ ఆత్మవిశ్వాసం రెండోసారి ప్రధానిగా ప్రమాణం చేసిన నరేంద్రమోదీ తనతో పాటు పాతిక మంది కేబినెట్ మంత్రులనూ, అంతకంటే ఎక్కువ మంది సహాయ మంత్రు లనూ ఒకే విడత నియమించడం పెరిగిన ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. కొత్త మంత్రిమండలిలో విధిగా చెప్పుకోవలసిన విశేషాలు ముచ్చటగా మూడు ఉన్నాయి. ఒకటి, బీజేపీ అధ్యక్షుడుగా అనేక విజయాలు అందించిన అమిత్‌షాని మంత్రిమండలిలోకి తీసుకోవడం. అమిత్‌షా తన వారసుడని మోదీ చెప్పకనే చెప్పారు. తన కంటే 14 ఏళ్ళు చిన్నవాడైన అమిత్‌షాను తన తర్వాత స్థానంలో దేశీయాంగమంత్రిగా నిలపడం మోదీ చేసిన సరికొత్త ప్రయోగం. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ఉన్నప్పుడు సహాయమంత్రి హోదాలోనే అమిత్‌షా హోంశాఖను నిర్వహించేవారు. షా పట్ల మోదీకి ఉన్న అచంచలమైన విశ్వాసానికి తాజా నిర్ణయం నిదర్శనం. కశ్మీర్లో శాంతి స్థాపనకు ఆయన ఎటువంటి చొరవ ప్రదర్శిస్తారో చూడాలి. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టు కశ్మీర్లో 370వ అధిక రణను రద్దు చేస్తారా? మందిర నిర్మాణానికి ముందడుగు వేస్తారా? గోరక్షకుల పేరిట అన్యమతస్తులపై జరుగుతున్న దాడులను అరికడతారా? ఏం జరుగు తుందో చూడాలి. కేంద్ర దర్యాప్తు సంస్థలకూ, నిఘా సంస్థలకూ ఎటువంటి స్వేచ్ఛ ఇస్తారో గమనించాలి. మంత్రిమండలిలో అగ్రస్థానం అమిత్‌షాకు ఒక రకంగా అగ్నిపరీక్ష. రెండు, నిర్మలా సీతారామన్‌ను ఆర్థికమంత్రిగా నియమిం చడం మరో సాహసోపేతమైన ప్రయోగం. ఆమెకు రక్షణశాఖ అప్పగించినప్పుడే మోదీ చరిత్ర సృష్టించారు. అంతవరకూ ఆ శాఖను పూర్తిస్థాయిలో నిర్వహించిన మహిళా మంత్రి ఎవ్వరూ లేరు. ఇప్పుడు ఆర్థికశాఖా అంతే. దీన్ని స్వతంత్రంగా నిర్వహించే బాధ్యత ఒక మహిళకు అప్పగించడం ఇదే ప్రథమం. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉంటూ రక్షణ, ఆర్థిక శాఖలను కొంతకాలం పర్యవేక్షించారు. అంతే. పార్టీ ప్రవక్త(ప్రతినిధి)గా తన ప్రతిభాపాటవాలతో అగ్రనాయకులను మెప్పించి, మంత్రిమండలిలో సహాయ మంత్రిగా ప్రవేశించి, రాజ్యసభలో సభ్యత్వం సంపా దించిన నిర్మల అధికార సోపానంలో వేగంగా అడుగులు వేస్తూ ఎదిగారు. తమిళనాట పుట్టి, తెలుగునాట మెట్టి, కన్నడసీమ నుంచి రాజ్యసభకు ఎన్నికైన విద్యాధికురాలు ఆమె. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జెఎన్యూ) ఆర్థిక శాస్త్రంలో ఎంఏ చేసి, ఇండో–యూరోపియన్ వాణిజ్యంపైన పీహెచ్డీ చేశారు. ప్రైస్‌వాటర్ కూపర్స్ అనే బహుళజాతి సంస్థలో సీనియర్ మేనేజర్‌గా పని చేశారు. నిర్మల రక్షణమంత్రిగా రాణించినట్టే ఆర్థికమంత్రిగా సైతం మోదీ నమ్మ కాన్ని వమ్ము చేయరని చెప్పవచ్చు. విదేశాంగమంత్రిగా మాజీ దౌత్యాధికారి మూడు, విదేశాంగమంత్రిగా నియుక్తుడైన జైశంకర్. ఆయనా జెఎన్యూలో పీహెచ్డీ చేశారు. ఇండో–అమెరికన్ అణు ఒప్పందంపైన 2005 నుంచి 2007లో మన్మోహన్సింగ్, జార్జి బుష్‌ల సంతకాలు జరిగే వరకూ జరిగిన చర్చలలో క్రియాశీలక పాత్ర పోషించిన దౌత్యవేత్త. 2017లో డోక్లాం వివాదం కారణంగా చైనాతో సంబంధాలు దెబ్బతిన్నాయి. పాకిస్తాన్‌తో కయ్యం నిత్యకృత్యమై సంబంధాలు నానాటికీ తీసికట్టుగా దిగజారుతున్నాయి. వీటితో సంబంధాలు పెంపొందిం^è గలిగితే జైశంకర్ జన్మ ధన్యమైనట్టు భావించాలి. ఆయన తండ్రి కె. సుబ్రహ్మణ్యం రక్షణ వ్యవహారాలలో అగ్రశ్రేణి విశ్లేషకుడు. చాలా మంది ప్రధానులు ఆయన సలహాలు సగౌరవంగా స్వీకరించేవారు. ఆరోగ్యం సహ కరించకపోయినా మనసున్న విదేశాంగమంత్రిగా మంచిపేరు తెచ్చుకున్న సుష్మాస్వరాజ్ స్థానంలో నియుక్తుడైన జైశంకర్ కేబినెట్ మంత్రి పదవి పొందిన ప్రథమ భారత దౌత్యాధికారి. మేనకాగాంధీకీ, కల్నల్ రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్కీ, మరికొందరు ముఖ్యులకూ ఎందుకు ఉద్వాసన చెప్పారో తెలియదు. ఎప్పటిలాగానే కేంద్ర మంత్రిమండలిలో దక్షిణాదికి తగిన ప్రాతినిధ్యం లేదు. ఉత్తరభారతం, పశ్చిమభారతం ఎన్డీఏ ప్రభుత్వంలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ స్థానం ఆక్రమించాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రాబల్యం, పరిచయాలూ కలిగిన కిషన్‌రెడ్డిని హోంశాఖ సహాయమంత్రిగా తీసు కోవడం విశేషం. యువమోర్చా కార్యనిర్వాహకుడిగా, బీజేపీకి అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ శాఖ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి పనిచేశారు. ప్రధానితో సాన్నిహిత్యం ఉంది. కిషన్‌రెడ్డికి మంత్రిపదవి రావడం సముచితమేనంటూ అందరూ హర్షం ప్రక టిస్తున్నారు. అమిత్‌షా స్థానంలో బీజేపీ అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారనే అంశంపైన ఊహాగానాలు సాగుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేంద్ర పరిశీలకుడిగా పని చేసిన జగత్ ప్రసాద్ నడ్డా లోక్‌సభ ఎన్నికలలో ఉత్తరప్రదేశ్ పర్యవేక్షకుడిగా అనూహ్యమైన విజయాలు సాధించిన నేపథ్యంలో ఆయనను పార్టీ పదవి వరించవచ్చునని సంకేతాలు వెలువ డుతున్నాయి. బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ పేరు కూడా వినిపిస్తున్నది. కేంద్రంలోనూ, రెండు తెలుగు రాష్ట్రాలలోనూ సంపూర్ణ మెజారిటీలు సాధిం చిన పాలకపక్షాలు ఉండటం, ప్రధానికీ, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రు లకూ మధ్య స్పర్థలు లేకపోవడం సంతోషించదగిన పరిణామం. ఇది ప్రగతికీ, సుస్థిరతకూ దారితీసే సానుకూల వాతావరణం. అయిదేళ్ళపాటు కుటిల రాజకీ యాలకూ, స్వార్థప్రయోజనాలకూ, ఎత్తులకూ, జిత్తులకూ, అవినీతికీ తావు లేకుండా ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు ప్రభుత్వాలు అంకిత భావంతో, ఏకాగ్రదృష్టితో కృషి చేస్తే ఇటీవలి ఎన్నికలలో ప్రజలు ఇచ్చిన వివేక వంతమైన తీర్పు సార్థకం అవుతుంది. ఎన్నికల ప్రచారంలో విచ్చలవిడిగా బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, టీఎంసీ వంటి పార్టీలు సాగించిన పెడధోరణులకు తెరపడుతుంది. సకారాత్మక, నిర్మాణాత్మక రాజకీయాలకు పాలకులందరూ శ్రీకారం చుట్టవలసిన శుభసందర్భం ఇది. కె. రామచంద్రమూర్తి -
‘ఓటు వేసింది మనుషులే.. దయ్యాలు కాదు’
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసింది మనుషులే అని.. దయ్యాలు కాదంటున్నది ఎన్నికల సంఘం. ఈసీ ఇంత వ్యంగ్యంగా స్పందించడానికి ఓ కారణం ఉంది. లోఎక్సభ ఎన్నికల్లో పోల్ అయిన ఓట్లు.. లెక్కించిన ఓట్ల మధ్య పొంతన లేదని కొందరు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై ఈసీ శనివారం స్పందించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మనుషులే ఓట్లు వేశారని.. దయ్యాలు కాదని వివరించింది. తాము ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో ఉంచిన పోలింగ్ సమాచారం తాత్కాలికమైనదని ఈసీ తెలిపింది. దీనిలో మార్పులు చేయవచ్చని పేర్కొంది. ఈ గణాంకాలు పోల్ అయిన ఓట్ల సంఖ్యపై తుది గణాంకాలు కాదని పేర్కొంది. 542 నియోజకవర్గాల్లో పోల్ అయిన ఓట్ల సంఖ్యపై తుది లెక్కలను త్వరలోనే రిటర్నింగ్ అధికారులు పంపిస్తారని, వెంటనే ఆ లెక్కలను అందుబాటులో ఉంచుతామని తెలిపింది. గతంలో ఎన్నికలు జరిగినపుడు వాస్తవ ఎన్నికల సమాచారాన్ని రాబట్టడానికి కొన్ని నెలల సమయం పట్టేదని ఈసీ తెలిపింది. 2014లో జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత వాస్తవ వివరాలను ప్రకటించడానికి దాదాపు మూడు నెలలు పట్టిందని పేర్కొంది. తాజా ఎన్నికల్లో సరికొత్త ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సదుపాయాలను వినియోగించుకున్నామని ఫలితంగా లెక్కించిన ఓట్లపై తుది సమాచారాన్ని ఫలితాలను ప్రకటించిన కొద్ది రోజుల్లోనే అందుబాటులో ఉంచగలిగామని పేర్కొంది. -
మాజీ ప్రధాని ఓటమికి కాంగ్రెస్ కుట్ర..!
బెంగళూరు: మాజీ ప్రధాని దేవెగౌడ ఓటమికి కాంగ్రెస్ నేతలు బీజేపీ సహరించారంటూ వస్తున్న వార్తలు కన్నడనాట తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటకలోని తూమకూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి జేడీఎస్-కాంగ్రెస్ అభ్యర్థిగా దేవెగౌడ పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థి జీఎస్ బసవరాజు స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. అయితే దెవెగౌడ ఓటమికి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కేఎన్ రాజన్ కుట్ర పన్నారని.. ఆ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆరోపిస్తోంది. దేవెగౌడను ఓడించడానికి బసవరాజుకు అధిక మొత్తంలో డబ్బు పంపారని, పార్టీ అంతర్గత విషయాలను బీజేపీ నేతలకు చేరవేశారని తూమకూర్ జిల్లా అధ్యక్షుడు ఆర్ రామకృష్ణ సంచలన పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవహారాల బాధ్యడు కేసీ వేణుగోపాల్‌కు ఆయన లేఖ రాశారు. రాజన్ కారణంగానే దేవెగౌడ ఓటమి చెందారని, వెంటనే ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాలని లేఖలో పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ ఓటమికి అనేక కారణాలు ఉన్నప్పటికీ.. సొంత పార్టీ నేతలే పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం కాంగ్రెస్ నేతలను తీవ్ర విస్మయానికి గురిచేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్, కాంగ్రెస్ మంచి ప్రభావం చూపినప్పటికీ లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం దారుణ ఓటమిని మూటగట్టుకున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 28 స్థానాలకు గాను బీజేపీ 25 సీట్లలో సునాయసంగా విజయం సాధించింది. జేడీఎస్ కేవలం ఒక్క స్థానానికే పరిమితమైంది. -
‘రాహుల్ రాజీనామాను ఉపసంహరించుకోవాలి’
సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం చవి చూసింది. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ.. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాహుల్ రాజీనామా ఆలోచనను ఉపసంహరించుకోవాలంటూ.. కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. రెండో రోజుకు చేరిన నిరాహార దీక్షకు తెలంగాణ ఇన్చార్జ్ రామచంద్ర కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్గొండ ఎంపీ కోమటి రెడ్డి సంఘీభావం తెలిపారు. రాహుల గాంధీ రాజీనామ ఆలోచనను విరమించుకోవాలని కోరారు. -
ఆరోగ్యశాఖ మంత్రికి ఉద్వాసన..!
అగర్తలా : త్రిపుర ఆరోగ్యశాఖ మంత్రి, బీజేపీ నేత సుదీప్‌రాయ్ బర్మన్ మత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురయ్యారు. లోక్‌సభ తాజా ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో బర్మన్కు పదవీ గండం తప్పలేదు. ఆయనను మంత్రివర్గం నుంచి తప్పిస్తున్నట్టు శుక్రవారం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. బర్మన్ ఉద్వాసనతో ఆయన మంత్రిగా ఉన్న ఆరోగ్య శాఖ, ఐటీ, ప్రజాపనుల శాఖల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి బిప్లబ్ దేవ్ చేపట్టనుండగా.. కుటుంబ సంక్షేమ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉపముఖ్యమంత్రి జిష్ణుదేవ్ వర్మ చేపట్టనున్నారు. త్రిపుర మాజీ సీఎం సమీర్ రంజన్ కుమారుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన బర్మన్ కాంగ్రెస్‌లో కీలక నేతగా ఎదిగారు. రెండేళ్ల క్రితం ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సహా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్రంలో బీజేపీ-ఐపీఎఫ్టీ కూటమి బలోపేతం కావడానికి కృషి చేశారు. ఆయన 1998 నుంచి నేటి వరకు అగర్తలా శాసనసభా స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 25 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతున్న సీపీఎంను గద్దెదించి బీజేపీ అధికారాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. రెండు లోక్‌సభ స్థానాలున్న రాష్ట్రంలో ఒకటి సీపీఎం గెలుచుకోగా.. మరో స్థానంలో బీజేపీ విజయం సాధించింది. కాగా, లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో హింస రాజుకుంది. ఇప్పటి వరకు ముగ్గురు మరణించగా కొన్ని వందల మంది గాయపడ్డారు. -
తగిన ప్రాతినిధ్యం ఇవ్వకపోవడం వల్లే..
పట్నా/మీర్జాపూర్: ఏదో నామమాత్రంగా జేడీ(యూ)కి కేంద్రంలో మంత్రి పదవి ఇస్తామనడంతోనే తాము కేంద్రంలో చేరకూడదని నిర్ణయం తీసుకున్నామని ఆ పార్టీ అధ్యక్షుడు, బిహార్ సీఎం నితీశ్ కుమార్ శుక్రవారం వెల్లడించారు. మంత్రివర్గంలో జేడీ(యూ)ను కూడా చేరేలా నితీశ్‌ను ఒప్పించేందుకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పలుసార్లు ప్రయత్నించినట్లు సమాచారం. అయితే తగినన్ని మంత్రిపదవులు ఇవ్వకపోతుండడంతో నితీశ్ అందుకు విముఖత వ్యక్తం చేశారు. జేడీ(యూ)కు ఒక మంత్రి పదవి ఇస్తామని అమిత్ షా చెప్పగా, తమ పార్టీకి తగినంత ప్రాతినిధ్యం ఇవ్వాల్సిందేనని నితీశ్ పట్టుబట్టినట్లు సమాచారం. లేదంటే ఆ ఒక్క పదవి కూడా వద్దని తేల్చిచెప్పారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఢిల్లీ నుంచి నితీశ్ శుక్రవారం పట్నా తిరిగొచ్చారు. అనంతరం నితీశ్ మాట్లాడుతూ ఎన్డీయేతో లేదా బీజేపీతో తమకు విభేదాలేమీ లేవనీ, తాము మోదీ ప్రభుత్వానికి మద్దతిస్తామని స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ ‘మేం మోదీ ప్రభుత్వంతోనే ఉన్నాం. తప్పనిసరిగా ప్రభుత్వంలో కూడా ఉండాల్సిన అవసరం లేదు కదా. పార్టీలో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నాం’అని చెప్పారు. ఒక కేబినెట్ మంత్రి, ఒక సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), మరో సహాయమంత్రి పదవులను జేడీయూ డిమాండ్ చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అప్నాదళ్‌దీ అదే దారి.. మంత్రిపదవి విషయంలో అసంతృప్తి కారణంగానే ఉత్తరప్రదేశ్‌లోని అప్నాదళ్ (ఎస్) పార్టీ కూడా కేంద్ర మంత్రివర్గంలో చేరలేదని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఆ పార్టీ నాయకురాలు అనుప్రియా పటేల్ గత ప్రభుత్వంలో సహాయ మంత్రిగా పనిచేశారు. ఈసారి ఆమె కేబినెట్ హోదా పదవి ఆశించారనీ, అయితే సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) కూడా దక్కకపోతుండటంతో ఈసారి మంత్రిపదవిని అనుప్రియ వద్దనుకున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. -
జై జవాన్.. జై కిసాన్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం నాడిక్కడ సమావేశమైన కేంద్ర కేబినెట్ రైతులు, సాయుధ, పారామిలటరీ బలగాలకు పెద్ద పీట వేసింది. రైతులకు ఏటా రూ.6,000 ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ సిద్ధి(పీఎంకేఎస్ఎస్) పథకం పరిధిలోకి కొత్తగా 2 కోట్ల మంది రైతులను తీసుకురావాలని నిర్ణయించింది. 2 హెక్టార్లలోపు వ్యవసాయ భూమి ఉండే 12.5 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతుల కోసం మధ్యంతర బడ్జెట్లో కేంద్రం పీఎంకేఎస్ఎస్ పథకాన్ని ప్రకటించింది. తాజా కేబినెట్ భేటీలో ఈ 2 హెక్టార్ల పరిమితిని(మినహాయింపులకు లోబడి) కేంద్రం ఎత్తివేసింది. దీనివల్ల కేంద్ర ప్రభుత్వ ఖజానాపై భారం ఏటా రూ.75,000 కోట్ల నుంచి రూ.87,217.50 కోట్లకు చేరుకోనుంది. ఈ విషయమై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ మాట్లాడుతూ..‘పీఎంకేఎస్ఎస్ పథకంలో మార్పుల కారణంగా దేశవ్యాప్తంగా మొత్తం 14.5 కోట్ల మంది రైతులు లబ్ధిపొందుతారు. ఈ పథకంలో భాగంగా ఇప్పటికే 3.12 కోట్ల మంది రైతులకు తొలివిడత నగదును, 2.66 కోట్ల మంది రైతన్నలకు రెండో విడత నగదును అందజేశాం’ అని తెలిపారు. చిరువ్యాపారులకు సంబంధించిన పెన్షన్ పథకానికీ కేబినెట్ ఆమోదం తెలిపిందనీ, దీనివల్ల దాదాపు 3 కోట్ల మంది చిల్లర వర్తకులకు లబ్ధిచేకూరుతుందని చెప్పారు. ‘కిసాన్ పెన్షన్’కు ఆమోదం అలాగే రైతుల సంక్షేమం కోసం తీసుకొచ్చిన ప్రధానమంత్రి కిసాన్ పెన్షన్(పీఎంకేపీవై) పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపినట్లు తోమర్ చెప్పారు. ‘తొలుత 5 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతులను కేంద్రం ఈ పథకం పరిధిలోకి తీసుకురానుంది. 18–40 ఏళ్ల మధ్య వయసుండే రైతులు ఇందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. రైతన్నలు పీఎంకేపీ పథకం కింద ఎంత జమచేస్తారో, కేంద్ర ప్రభుత్వం అంతే మొత్తాన్ని డిపాజిట్ చేస్తుంది. వీరి వయసు 60 సంవత్సరాలు దాటాక ప్రతినెలా రూ.3,000 పెన్షన్ అందుకుంటారు. దీనివల్ల ఖజానాపై ఏటా రూ.10,774.5 కోట్ల భారం పడనుంది’ అని తోమర్ తెలిపారు. ఒకవేళ పెన్షన్‌దారుడు చనిపోతే, అతని జీవితభాగస్వామికి మొత్తం పెన్షన్‌లో 50 శాతం అందుతుందని వెల్లడించారు. అయితే సంబంధిత జీవితభాగస్వామి పీఎంకేపీవై పథకంలో సభ్యుడిగా/సభ్యురాలిగా ఉండరాదని పేర్కొన్నారు. ‘సాయుధ’ స్కాలర్షిప్ పెంపు.. శత్రుమూకలతో పోరాడుతూ అమరులైన, పదవీవిరమణ చేసిన సాయుధ, పారామిలటరీ బలగాలు, రైల్వే పోలీసుల కుటుంబసభ్యులకు లబ్ధిచేకూర్చేలా కేంద్ర కేబినెట్ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. అమరుల భార్యలు, పిల్లలకు అందిస్తున్న స్కాలర్షిప్ మొత్తాన్ని పెంచే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఉగ్రవాద, మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అధికారుల కుటుంబాలను కూడా ఈ జాబితాలో చేర్చింది. ప్రధానమంత్రి స్కాలర్షిప్ పథకం(పీఎంఎస్ఎస్) కింద ప్రస్తుతం అమర జవాన్ల కుమారులకు నెలకు రూ.2,000 కుమార్తెలకు రూ.2,250 అందజేస్తున్నారు. తాజాగా కుమారులకు అందజేస్తున్న మొత్తాన్ని నెలకు రూ.2,500కు, అమ్మాయిలకు అందజేస్తున్న మొత్తాన్ని నెలకు రూ.3,000కు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో అమరులైన పోలీస్ కుటుంబాలకు చెందిన దాదాపు 500 మందికి లబ్ధిచేకూరనుంది. నేషనల్ డిఫెన్స్ ఫండ్ ద్వారా ఎంబీఏ, ఎంసీఏ, మెడికల్, ఇంజనీరింగ్, ఇతర సాంకేతిక కోర్సులు చదివే అమరుల కుటుంబసభ్యులకు ఈ స్కాలర్షిప్ అందజేస్తారు. పీఎంఎస్ఎస్ కింద ఇప్పటివరకూ అ మరులైన సాయుధబలగాల పిల్లలకు 5,500, పారామిలటరీ బలగాల పిల్లలకు 2,000, రైల్వేపోలీసుల పిల్లలకు 150 స్కాలర్‌షిప్పులను అందజేస్తున్నారు. బిమ్స్టెక్ అధినేతలతో భేటీ.. తన ప్రమాణస్వీకారానికి హాజరైన బిమ్స్టెక్(బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, థాయ్‌లాండ్, నేపాల్, భూటాన్) దేశాల అధినేతలతో ప్రధాని మోదీ శుక్రవారం వేర్వేరుగా భేటీ అయ్యారు. తొలుత శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనతో సమావేశమైన మోదీ, ఉగ్రవాదం, తీవ్రవాదం ప్రపంచదేశాలకు పెనుసవాలుగా మారాయని అభిప్రాయపడ్డారు. దక్షిణాసియా భద్రత, శాంతి, సుస్థిరతల కోసం ఇరుదేశాలు కలసికట్టుగా పనిచేయాలని నిర్ణయించారు. అనంతరం మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నౌత్, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ, భూటాన్ ప్రధాని లోతెయ్ శెరింగ్, బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హామీద్‌లతో వేర్వేరుగా సమావేశమైన మోదీ, అన్నిరంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవాలని నిర్ణయించారు. 1997లో ఏర్పాటైన బిమ్స్టెక్లో భారత్ సహా ఏడు దేశాలు సభ్యులుగా ఉన్నాయి. మరోవైపు ప్రధాని మోదీ జూన్ 9న కొలంబోను సందర్శించే అవకాశముందని ఆ దేశ అధ్యక్షుడు సిరిసేన తెలిపారు. మోదీకి స్వాగతం పలికేందుకు ఉత్సుకతతో ఎదురుచూస్తున్నామని వెల్లడించారు. రెండోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశాక జూన్ 7–8 తేదీల్లో మాల్దీవుల్లో పర్యటించాలని మోదీ నిర్ణయించారు. అక్కడి నుంచి నేరుగా శ్రీలంక వెళతారని దౌత్యవర్గాలు తెలిపాయి. చాలా సంతోషంగా ఉంది: మోదీ నూతన కేంద్ర ప్రభుత్వం రైతులు, వ్యాపారుల సంక్షేమానికి సంబంధించి 4 కీలక నిర్ణయాలు తీసుకుందని ప్రధాని మోదీ తెలిపారు. ‘కేబినెట్ భేటీలో చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నందుకు సంతోషంగా ఉంది. దీనివల్ల రైతులు, వ్యాపారులు చాలా లాభపడతారు. కార్మికుల ఆత్మగౌరవం పెరుగుతుంది. వారంతా సాధికారతతో జీవించడం వీలవుతుంది. ఇప్పుడు కాదు.. ఎప్పుడైనా సరే ప్రజలే మాకు తొలి ప్రాధాన్యం’ అని మోదీ ట్వీట్ చేశారు. అంతకుముందు సౌత్‌బ్లాక్‌లోని తన కార్యాలయంలో మహాత్మాగాంధీ, పటేల్ విగ్రహాలకు నివాళులు అర్పించిన అనంతరం మోదీ బాధ్యతలు చేపట్టారు. జూలై 5న బడ్జెట్.. 17వ లోక్‌సభ తొలివిడత సమావేశాలు జూన్ 17 నుంచి జూలై 26 వరకూ జరుగుతాయని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఈ సమావేశాల్లో భాగంగా జూలై 5న బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెడతామని వెల్లడించారు. లోక్‌సభ సమావేశాల సందర్భంగా మొదటి రెండ్రోజులు ఎంపీల ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగుతుందన్నారు. జూన్ 19న లోక్‌సభ స్పీకర్‌ను ఎన్నుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి జూన్ 20న ప్రసంగిస్తారని జవదేకర్ చెప్పారు. బడ్జెట్ సమర్పణకు ఒక్కరోజు ముందుగా ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెడతామన్నారు. మొత్తం 30 రోజులపాటు లోక్‌సభ సమావేశాలు జరుగుతాయని తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 1న అప్పటి కేంద్ర ఆర్థికమంత్రి పీయూష్ గోయల్ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, జూలై 5న ప్రస్తుత కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. -
ఏళ్ల తర్వాత మళ్లీ వెలుగులోకి..
న్యూఢిల్లీ: గతంలో ఓ వెలుగు వెలిగి, ఆ తర్వాత కొన్నేళ్లు కనిపించకుండాపోయి మళ్లీ తాజాగా కేంద్ర మంత్రివర్గంలో చోటు సంపాదించడం ద్వారా తెరపైకి వచ్చారు కొందరు ప్రముఖులు. అర్జున్ ముండా, రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, ఫగ్గన్ సింగ్ కులస్తే తదితరులు అలాంటి వారిలో ఉన్నారు. వీరికి కేంద్రంలో మంత్రిపదవులు దక్కడం తెలిసిందే. అర్జున్ ముండా జార్ఖండ్‌కు, రమేశ్ పోఖ్రియాల్ ఉత్తరాఖండ్‌కు గతంలో సీఎంలుగా చేశారు. 2014లో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన, అర్జున్ ఓడిపోవడంతో ఆయనకు పార్టీలో ప్రాధాన్యం తగ్గింది. అర్జున్ గిరిజనుడు కావడం, గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న జార్ఖండ్‌లో ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికశాతం ఓటర్లను ఆకర్షించేందుకే ఆయనకు కేంద్రంలో గిరిజన సంక్షేమ శాఖను కేటాయించారని ప్రచారం జరుగుతోంది. అలాగే అనేక ఆరోపణల కారణంగా 2011లో సీఎం పదవి కోల్పోయిన పోఖ్రియాల్‌ను ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉంచింది. 2014లో ఎంపీగా పోటీ చేయించగా, ఆయన గెలిచినా మంత్రిపదవి మాత్రం ఇవ్వలేదు. 2017లో ఉత్తరాఖండ్‌లో బీజేపీ గెలిచినా సీఎం పదవి దక్కలేదు. ఇప్పుడు మాత్రం పోఖ్రియాల్‌కు కేంద్రంలో మానవ వనరుల అభివృద్ధి (హెచ్ఆర్డీ) మంత్రిత్వ శాఖను కేటాయించారు. జ్యోతిష్య శాస్త్రం, సంప్రదాయక వైద్యంలో పోఖ్రియాల్ మంచి నిపుణుడు. విద్యా వ్యవస్థలో తమ అజెండాను ముందుకు తీసుకెళ్లడంలో భాగంగానే పోఖ్రియాల్‌కు బీజేపీ ప్రభుత్వం హెచ్ఆర్డీ శాఖ కేటాయించినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రహ్లాద్ పటేల్ ఐదుసార్లు ఎంపీగా ఎన్నికై, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినప్పటికీ ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం 2014లో ప్రహ్లాద్‌ను మంత్రిగా నియమించలేదు. ప్రస్తుతం ఆయన సాంస్కృతిక, పర్యాటక శాఖల సహాయ మంత్రి (స్వతంత్ర హోదా)గా నియమితులయ్యారు. ఇక ఫగ్గన్ సింగ్ కూడా మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తే. గిరిజనుడైన ఆయన ఆరుసార్లు ఎంపీగా గెలిచారు. 2014లో తొలుత ఆయనకు మంత్రిపదవి దక్కినప్పటికీ ఆ తర్వాత పోయింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సంజీవ్ బాల్యన్‌ది కూడా ఇదే పరిస్థితి. ఫగ్గన్ సింగ్, సంజీవ్‌లకు తాజా ప్రభుత్వంలో సహాయ మంత్రి పదవులు దక్కాయి. -
కిషన్‌రెడ్డికి కీలక శాఖ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర సహాయ మంత్రి గంగాపురం కిషన్‌రెడ్డికి కీలకమైన హోం శాఖను కేటాయిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకున్నారు. సహాయ మంత్రి పదవి అయినప్పటికీ అది హోం శాఖ కావడంతో కిషన్ రెడ్డి కీలకమైన పాత్ర పోషించనున్నారు. గతంలో అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో ఎల్.కె.అద్వానీ నంబర్ –2 హోదాలో ఉన్నారు. అప్పుడు ఆయన కేంద్ర హోం శాఖ బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సమయంలో తెలంగాణలోని కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికైన సీహెచ్ విద్యాసాగర్ రావుకు హోం శాఖ సహాయ మంత్రి పదవి వరించింది. సరిగ్గా ఇప్పుడు కూడా అలాంటి సందర్భమే. నరేంద్ర మోదీ తరువాత నంబర్ –2 స్థానంలో ఉన్న అమిత్‌షా ఇప్పుడు హోం మంత్రి. తెలంగాణలోని సికింద్రాబాద్ నుంచి విజయం సాధించిన కిషన్‌రెడ్డికి హోం శాఖ సహాయ మంత్రి పదవి వరించడం విశేషం. అమిత్‌షా వంటి బలమైన నాయకుడి నేతృత్వంలో కేంద్ర హోం శాఖలో సహాయ మంత్రి పదవి బాధ్యతలు స్వీకరిస్తుండడం కిషన్‌రెడ్డికి కలిసిరానుంది. హోం శాఖలో సరిహద్దు నిర్వహణ, దేశ అంతర్గత భద్రత, కశ్మీర్ వ్యవహారాలు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, అంతర్రాష్ట్ర వ్యవహారాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పాలన తదితర విభాగాలు ఉన్నాయి. నిత్యానంద్కూ హోం శాఖ సహాయ మంత్రి పదవి లభించింది. -
తొలి మహిళా ఆర్థిక మంత్రి
రెండో సారి అధికారం చేపట్టిన మోదీ మంత్రివర్గంలో కీలకమైన ఆర్థిక శాఖను చేపట్టి నిర్మలా సీతారామన్ దేశంలో తొలి మహిళా ఆర్థిక మంత్రిగా చరిత్ర సృష్టించారు. గతంలో ఇందిరా గాంధీ తాత్కాలికంగా ఆర్థిక శాఖను నిర్వహించినా పూర్తి స్థాయి మంత్రిగా నియమితులయిన మహిళ నిర్మలా సీతారామనే. నిర్మల గతంలో ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ దగ్గర సహాయ మంత్రిగా పని చేశారు. వాణిజ్య, పరిశ్రమల శాఖలను నిర్వహించారు. గత ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా పని చేసిన నిర్మలా రామన్ సమర్ధురాలిగా నిరూపించుకున్నారు. దేశం వృద్ధిరేటు తిరోగమనంలో ఉండటం,ఉపాధి కల్పన ఆశించిన మేర జరగకపోవడం,ద్రవ్యోల్బణం శృతి మించుతున్న ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో ఆర్థిక శాఖను నిర్వహించడం నిర్మలా సీతా రామన్‌కు సవాలేనని పరిశీలకులు అంటున్నారు. వృద్ధి రేటును పరుగులు పెట్టించాలంటే ప్రధానంగా ప్రభుత్వ వ్యయాన్ని పెంచడం, ఆర్థి క సౌష్టవం, జీఎస్టీ సరళీకరణ, బ్యాంకుల పునరుజ్జీవం, ఉపాధి కల్పనలపై మంత్రి దృష్టి సారించాల్సి ఉంటుందని వారు స్పష్టం చేస్తున్నారు . కొత్త ఆర్థిక మంత్రి జీఎస్టీని మరింత సరళీకరించాల్సిన అవసరం ఉంది. ఆర్థిక రంగంలో వీలయినన్ని ఎక్కువ ఉద్యోగాలు కల్పించేలా నూతన ఆర్థిక మంత్రి చర్యలు తీసుకోవాలి. బ్యాంకులను కాపాడేందుకు కొత్త విత్త మంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. రక్షణకి రాజమార్గం రక్షణ శాఖ మంత్రిగా రాజ్‌నాథ్ సింగ్ కొత్తగా రక్షణ శాఖ బాధ్యతల్ని అప్పగించిన బీజేపీ కీలక నేత రాజ్‌నాథ్ సింగ్‌కు కేంద్ర హోంశాఖను పరుగులు పెట్టించిన సామర్థ్యముంది. సాయుధ దళాల ఆధునీకరణ, రక్షణ రంగం పాత్ర, మేకిన్ ఇండియా కార్యక్రమాలు, కశ్మీర్ అంశంలో వ్యూహాలు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం వంటి సవాళ్లు ఆయన ఎలా ఎదుర్కొంటారు. ఇప్పుడు ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మేకిన్ ఇండియా ప్రాజెక్టులోకి రక్షణ శాఖను కూడా తీసుకువచ్చి సరికొత్త సంస్కరణలకు తెరతీసిన సమయమిది. త్రివిధ దళాలకు సమప్రాధాన్యం దక్కేలా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) అనే కొత్త పదవిని సృష్టించి కార్యకలాపాలు నిర్వహించబోతున్నారు. వీటన్నింటిని ప్రధాని ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా నడిపించడం రాజ్‌నాథ్ ముందున్న సవాల్. వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంపై అడుగులు ఎటు రక్షణ శాఖలో గేమ్‌ఛేంజర్‌గా భావించే వ్యూహాత్మక భాగస్వామ్య విధానంపై కొత్త ప్రభుత్వం స్పష్టతనివ్వాలని ప్రైవేటు రంగం డిమాండ్ చేస్తోంది. ఈ విధానం ప్రకారం విదేశీ సాంకేతిక సహకారం అందించే సంస్థతో కలిసి ప్రైవేటు సంస్థలు జలాంతర్గాములు, హెలికాప్టర్లు, సాయుధ వాహనాలు, తేలికపాటి యుద్ధ విమానాలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు తయారు చేయాలి. మోదీ ప్రభుత్వం ఎన్నో తర్జనభర్జనలు, చర్చోపచర్చల తర్వాత ఈ మెగా ప్రాజెక్టుల అమలు ప్రభుత్వ రంగ సంస్థలకే అప్పగించింది. దీంతో ప్రైవేటు రంగంలో బడా బడా సంస్థలు నిరుత్సాహానికి లోనయ్యాయి. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలు పనితీరు సరిగా లేక ఒప్పందాలు ముందుకు కదలడం లేదు. ఈ పరిణామాలతో స్వదేశీ శక్తితో రక్షణ రంగాన్ని ముందుకు పరుగులు పెట్టించాలంటే ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం తప్పనిసరనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీనిపై రాజ్‌నాథ్ సింగ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న ఉత్కంఠ నెలకొంది. ఇక హోంశాఖ మంత్రిగా ఉన్న అనుభవంతో కశ్మీర్ భద్రతకు దీర్ఘ కాల ప్రణాళికలు రూపొందించడం కూడా రాజ్‌నాథ్ ముందున్న సవాలే. జై జై శంకర్ మళ్లీ సొంత గూటికి జైశంకర్ ఒక అరుదైన వ్యక్తికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అప్పగించారు. ఆయన లోక్‌సభ సభ్యుడు కాదు. రాజ్యసభలోనూ సభ్యత్వం లేదు. అయినప్పటికీ ఆయనలో ఉన్న దౌత్యనీతికి, రాయబారం చేయడంలో నేర్పరితనానికి ప్రధాని ముగ్ధుడై ఏరికోరి కేబినెట్లో చేర్చుకున్నారు. ఆయనే విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి ఎస్. జైశంకర్. ప్రపంచపటంపై భారత్ హోదాను మరింత పెంచాలంటే, విదేశాంగ విధానంలో దూకుడు ప్రదర్శించాలని దానిని సమర్థవంతంగా నిర్వహించగలిగేది జైశంకరేనన్న నమ్మకంతో మోదీ ఆయనకి ఈ పదవిని అప్పగించారు. యూపీఏ హయాంలో విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేసిన నట్వర్ సింగ్ ఒకప్పుడు దౌత్యవేత్త. కానీ విదేశాంగ శాఖ కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తికి, చట్టసభల్లో ఎలాంటి ప్రాతినిధ్యం లేకుండా ఏకంగా మంత్రి పదవిని కట్టబెట్టడం ఇదే తొలిసారి. చైనా, అమెరికాలతో దౌత్యవ్యవహారాలను నడపడంలో అందెవేసిన చెయ్యిగా పేరు తెచ్చుకున్న జైశంకర్ ఇక ముందు ముందు విదేశాంగ విధానంలో ఎలాంటి మార్పులు తెస్తారోనన్న అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వివేకవంతుడు, హాస్య చతురత గల వ్యక్తిగా జైశంకర్‌కి పేరుంది. సవాళ్లు ఇవే ప్రపంచపటంపై భారత్ హోదాని పెంచడం, జీ–20, బ్రిక్స్ వంటి భాగస్వామ్య కూటముల వ్యవహారాలను చాకచక్యంతో నడపడం, అమెరికా, రష్యా, ఫ్రాన్స్, యూరోపియన్ యూనియన్, ఇతర పొరుగుదేశాలతో వాణిజ్య, రక్షణ సంబంధాలను బలోపేతం చేయడం వంటి సవాళ్లు ఉన్నాయి. ముఖ్యంగా డోక్లాం సంక్షోభంతో చైనా, భారత్ మధ్య క్షీణించిన సంబంధాలను బలోపేతం చేయడం జయశంకర్ ముందున్న మరో సవాల్. ఐరాసభద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించడం, అణు సరఫరా గ్రూప్‌లో భారత్ పాత్ర వంటి అంశాల్లో ఆయన పనితీరును చూడాల్సిందే. రాయబారిగా ఎనలేని ప్రతిభ వివిధ దేశాల్లో రాయబారిగా , విదేశాంగ శాఖ కార్యదర్శిగా ఆయన ఎంతో ప్రతిభ కనబరిచారు. 2015లో విదేశాంగ శాఖ కార్యదర్శిగా నియమితులై మోదీ అమెరికా పర్యటనని విజయవంతం చేయించారు. అణు సరఫరా గ్రూప్‌లో భారత్‌కి స్థానం దక్కాలన్న ప్రచారానికి ఊతమిచ్చారు. ఆసియా ఫసిఫిక్ ప్రాంతానికి దగ్గర అవడం ద్వారా భారత దేశపు సముద్ర ప్రాంత దౌత్య విస్తరణకు కృషి చేశారు. స్ట్రాటజిక్ ఎఫైర్స్ కామంటేటర్ కె. సుబ్రహ్మణ్యం, సులోచన దంపతులకు జనవరి 9, 1955న జన్మించారు. సైకిల్‌పై ప్రయాణం పూరిపాకలో నివాసం, ఒడిశా మోదీకి కలిసొచ్చిన సామాజిక సేవ కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ప్రజల మనిషి ప్రతాప్ చంద్ర సారంగిది నిరాడంబర జీవితం.సామాజిక సేవ తప్ప మరోటి తెలీదు. ఆరెస్సెస్‌తో సుదీర్ఘ అనుబంధముంది. బజరంగ్దళ్ ఒడిశా రాష్ట్ర అధ్యక్షుడిగానూ చేశారు. ఇప్పటికీ పూరిపాకలోనే నివసిస్తారు. సైకిల్‌పైనే ప్రయాణం చేస్తారు. ప్రజల కోసం పెళ్లి కూడా మానుకున్న ఆయన్ను నియోజకవర్గం ప్రజలు ప్రేమతో పెద్దన్నా అని పిలుస్తారు. మరికొందరు అభిమానులు ఒడిశా మోదీ అని కీర్తిస్తారు. ఒడిశాలో బాలసోర్ నియోజకవర్గం నుంచి సిటింగ్ బీజేడీ ఎంపీ , పారిశ్రామికవేత్త రబీంద్రకుమార్ జెనాను 13 వేల ఓట్ల తేడాతో ఓడించారు. తనకు వచ్చే ఎమ్మెల్యే పెన్షన్‌లో అత్యధిక భాగం నిరుపేద విద్యార్థులు చదువుకే వినియోగిస్తారు. మొదటిసారి లోక్‌సభకు ఎన్నికై మంత్రి పదవి చేపట్టిన ఆయన ప్రమాణస్వీకారం చేసినప్పుడు చప్పట్లే చప్పట్లు. నిరాడంబర జీవితం, కష్టపడి పనిచేసే తత్వం, ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి ఆయనకు కేంద్ర మంత్రి పదవిని వరించేలా చేసింది. బీజేపీ జాతీయ కార్యనిర్వాహక సభ్యుడైన సారంగి ఒడిశా అసెంబ్లీకి నీలగిరి నియోజకవర్గం నుంచి ఇప్పటికే రెండు సార్లు ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో బాలసోర్ లోక్‌సభ స్థానం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేశారు కానీ ఓడిపోయారు. క్రియాశీల రాజకీయాల్లో చాలా కాలంగా ఉన్నా మట్టి, వెదురు ఇంట్లోనే ఆయన జీవనం సాగిస్తారు. సంస్కృతంలో దిట్టయిన సారంగి బాలసోర్‌లో ఫకీర్ మోహన్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత రామకృష్ణ మఠంలో ఒక సన్యాసిగా కొనసాగాలనుకున్నారు. కానీ మత పెద్దలు ఆయనని సామాజిక సేవ వైపు మళ్లమని సలహా ఇచ్చారు. అప్పట్నుంచి ఆయన తన చుట్టు పక్కల పల్లెల్లో దీనజనోద్ధరణకే నడుం బిగించారు. గిరిజన ప్రాంతాల్లో పాఠశాలలు నెలకొల్పి విద్యాసుమాలు విరబూయించారు. అప్పట్లోనే ఆరెస్సెస్‌లో చేరి క్రమక్రమంగా ఎదుగుతూ వచ్చారు. సారంగి చేసిన సామాజిక సేవే ఆయనకు కేంద్ర మంత్రి పదవిని కట్టబెట్టింది. సుష్మా.. వుయ్ మిస్ యూ.. రెండోసారి అధికారపగ్గాలు చేపట్టిన తరువాత ఏర్పాటుచేసిన మంత్రివర్గంలో మాజీ విదేశాంగ శాఖా మంత్రి సుష్మా స్వరాజ్‌కి చోటుదక్కకపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. 2004 నుంచి 2014 వరకు ప్రతిపక్ష నేత హోదాలోనూ, గత బీజేపీ మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిత్వశాఖను సమర్థవంతంగా నిర్వహించిన సుష్మా స్వరాజ్ అనారోగ్య కారణాల రీత్యా ఎన్నికల్లో పోటీచేయడంలేదని ముందుగానే ప్రకటించారు. ‘ఈ మంత్రివర్గంలో మీరు లేకపోవడంతో భారతీయులంతా మిమ్మల్ని మిస్ అవుతున్న భావం కలుగుతోంది. ఆరోగ్యవంతమైన విలువలనూ, భావోద్వేగాలనూ మీరు మంత్రిత్వ శాఖకు కల్పించారు’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా ఉంటూ కాంగ్రెస్‌కి రాజీనామా చేసి, శివసేన తీర్థం పుచ్చుకున్న ప్రియాంకా చతుర్వేది ట్వీట్ చేశారు. -
కేంద్ర మంత్రులు.. కేటాయించిన శాఖలు
నరేంద్ర మోదీ: ప్రధానమంత్రి సిబ్బంది, ప్రజా నివేదనలు, పెన్షన్ల శాఖ; అణు ఇంధన శాఖ; అంతరిక్ష విభాగం; అన్ని ముఖ్యమైన విధానపర నిర్ణయాలు, మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు 1. రాజ్‌నాథ్ సింగ్ : రక్షణ శాఖ 2. అమిత్ షా : హోం శాఖ 3. నితిన్ గడ్కరీ : రోడ్డు రవాణా, రహదారుల శాఖ; సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు 4. డి.వి.సదానంద గౌడ : రసాయనాలు, ఎరువుల శాఖ 5. నిర్మలా సీతారామన్ : ఆర్థిక శాఖ, కార్పొరేట్ వ్యవహారాలు 6. రాంవిలాస్ పాశ్వాన్ : వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం,ప్రజా పంపిణీ 7. నరేంద్ర సింగ్ తోమర్ : వ్యవసాయం, రైతు సంక్షేమం; గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ 8. రవిశంకర్ ప్రసాద్ : న్యాయ శాఖ; కమ్యూనికేషన్లు; ఎలక్ట్రానిక్స్,ఐటీ 9. హర్ సిమ్రత్ కౌర్ బాదల్ : ఫుడ్ ప్రాసెసింగ్ 10. థావర్ చంద్ గెహ్లాట్ : సామాజిక న్యాయం, సాధికారత శాఖ 11.సుబ్రమణ్యం జైశంకర్ : విదేశీ వ్యవహారాలశాఖ 12. రమేష్ పోక్రియాల్ : మానవ వనరుల అభివృద్ధి 13. అర్జున్ ముండా : గిరిజన వ్యవహారాల 14. స్మృతీ జుబిన్ ఇరానీ : స్త్రీ, శిశు, జౌళి శాఖ 15. డాక్టర్ హర్షవర్దన్ : ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం; సైన్స్ అండ్ టెక్నాలజీ; ఎర్త్ సైన్సెస్ విభాగం 16. ప్రకాష్ జవ్డేకర్ : పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పు; సమాచారం 17. పీయూష్ గోయెల్ : రైల్వే, వాణిజ్యం, పరిశ్రమ 18. ధర్మేంద్ర ప్రధాన్ : చమురు, సహజవాయువు; ఉక్కు 19. ముక్తార్ అబ్బాస్ నఖ్వీ : మైనారిటీ వ్యవహారాలు 20. ప్రహ్లాద్ జోషి : బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాలు 21. మహేంద్రనాథ్ పాండే : స్కిల్ డెవలప్మెంట్ 22. అర్వింద్ సావంత్ : భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు 23. గిరిరాజ్ సింగ్ : పశుసంవర్థకం, పాడి, మత్స్య శాఖ 24. గజేంద్ర సింగ్ షెకావత్ : జల శక్తి శాఖ కేంద్ర సహాయ మంత్రులు ( స్వతంత్ర హోదా) 1. సంతోష్ గంగ్వార్ : కార్మిక, ఉపాధి కల్పన 2. రావ్ ఇంద్రజిత్ సింగ్ : స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్; ప్రణాళిక 3. శ్రీపాద్ యశో నాయక్ : ఆయుష్; రక్షణ 4. డాక్టర్ జితేంద్ర సింగ్ : ఈశాన్య ప్రాంత అభివృద్ధి, ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా నివేదనలు, పెన్షన్లు, అణు ఇంధనం, అంతరిక్ష విభాగం 5. కిరణ్ రిజిజు : క్రీడలు, యువజన సర్వీసులు, మైనారిటీ వ్యవహారాలు 6. ప్రహ్లాద్ సింగ్ పటేల్ : సాంస్కృతిక,పర్యాటక 7. రాజ్ కుమార్ సింగ్ : విద్యుత్తు,పునరుత్పాదక ఇంధనం, స్కిల్ డెవలప్మెంట్, 8. హర్దీప్ సింగ్ పూరి : గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాలు; పౌర విమానయానం, వాణిజ్యం,పరిశ్రమలు 9. మన్సుఖ్ ఎల్ మాండవ్యా : నౌకాయానం, రసాయనాలు, ఎరువుల కేంద్ర సహాయ మంత్రులు 1. ఫగణ్‌సింగ్ కులస్తే : ఉక్కు శాఖ 2. అశ్వనీ కుమార్ చౌబే : ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం 3. అర్జున్ రామ్ మేఘ్వాల్ : పార్లమెంటరీ వ్యవహారాలు, భారీ పరిశ్రమలు, పబ్లిక్ రంగ సంస్థలు 4. వీకే సింగ్ : రోడ్డు రవాణా, రహదారులు 5. కృషన్ పాల్ : సామాజిక న్యాయం, సాధికారత 6. రావ్ సాహెబ్ : వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ 7. జి.కిషన్ రెడ్డి : హోం శాఖ 8. పురుషోత్తం రుపాలా : వ్యవసాయం, రైతు సంక్షేమం 9. రాందాస్ అథవాలే : సామాజిక న్యాయం, సాధికారత 10. సాధ్వి నిరంజన్ జ్యోతి : గ్రామీణాభివృద్ధి 11. బాబుల్ సుప్రియో :పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పులు 12. సంజీవ్ బాల్యాన్ : పశుసంవర్థకం, పాడి, మత్స్య శాఖ 13. ధోత్రే సంజయ్ శ్యామ్ : మానవ వనరుల అభివృద్ధి; కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్, ఐటీ 14. అనురాగ్ ఠాకూర్ : ఆర్థిక శాఖ, కార్పొరేట్ ఎఫైర్స్ 15. అంగడి సురేష్ చన్నబసప్ప : రైల్వే 16. నిత్యానంద్ రాయ్ : హోం శాఖ 17. రతన్ కటారియా : జల శక్తి; సామాజిక న్యాయం, 18. వి.మురళీధరన్ : విదేశీ వ్యవహారాలు; పార్లమెంటరీ వ్యవహారాలు 19. రేణుకా సరూతా : గిరిజన వ్యవహారాలు 20. సోమ్ ప్రకాష్ : వాణిజ్యం, పరిశ్రమలు 21. రామేశ్వర్ టేలి : ఫుడ్ ప్రాసెసింగ్ 22. ప్రతాప్ సారంగి : సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు; పశుసంవర్థకం, పాడి, మత్స్య 23. కైలాష్ చౌదరి : వ్యవసాయం, రైతు సంక్షేమం 24. దేబశ్రీ చౌదురి : మహిళా, శిశు అభివృద్ధి శాఖ -
మోదీ..ముద్ర!
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ కొత్త కేబినెట్లో శాఖల కేటాయింపుపై స్పష్టత వచ్చింది. అమిత్ షా, రాజ్‌నాథ్, నితిన్ గడ్కారీ, నిర్మలా సీతారామన్.. తదితర కీలక నేతలకు మోదీ ఏ శాఖలు అప్పగించనున్నారనే దానిపై ఉత్కంఠ వీడింది. తన సన్నిహితులకు, విధేయులకు కీలక బాధ్యతలను అప్పగించడం ద్వారా తనదైన ముద్ర వేశారు. ప్రధాని తర్వాత అత్యంత కీలకమైన హోం శాఖను ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ ఘన విజయానికి దారులు పరిచిన సన్నిహితుడు, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాకు అప్పగించారు. అదేవిధంగా, సీనియర్ నేతలు రాజ్‌నాథ్‌కు రక్షణ శాఖను, నిర్మలా సీతారామన్‌కు ఆర్థిక శాఖ, గడ్కారీకి రోడ్డు రవాణా, రహదారుల శాఖతోపాటు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖలను అప్పగించారు. ఈమేరకు రాష్ట్రపతి భవన్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా, ప్రధాని మోదీతోపాటు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయెల్, జైశంకర్ తదితరులు శుక్రవారమే బాధ్యతలు స్వీకరించారు. షా రాకతో..తగ్గనున్న ఎన్ఎస్ఏ ప్రాధాన్యం గత ప్రభుత్వంలో జాతీయ భద్రతా సలహాదారుగా ఎన్కే దోవల్ క్రియాశీలకంగా వ్యవహరించారు. రక్షణ వ్యవహారాలకు సంబంధించిన కీలక నిర్ణయాలను ఆయనే తీసుకునేవారు. కానీ, అమిత్ షా రాకతో ఈసారి ఆయన ప్రాధాన్యం తగ్గిపోనుంది. ప్రభుత్వంలో నంబర్–2గా మారనున్న అమిత్ షాయే రక్షణ సంబంధ విషయాలపై పూర్తిగా దృష్టి సారించనున్నారు. హోం మంత్రిగా అమిత్ షా కశ్మీర్‌కు సంబంధించి ఆర్టికల్ 370, 35 ఏ అంశాలతోపాటు ఉగ్రవాదం, దేశంలోని ఇతర ప్రాంతాల్లో మావోయిస్టుల ముప్పు, అస్సాం పౌరసత్వ బిల్లు, ట్రిపుల్ తలాక్ వంటి వాటిపై ప్రముఖంగా దృష్టిసారించాల్సి ఉంది. అదేవిధంగా ప్రధానితోపాటు హోం, రక్షణ, విదేశాంగ, ఆర్థిక శాఖ మంత్రులతో కూడిన ఎంతో కీలకమైన రక్షణ వ్యవహారాల కేబినెట్ కమిటీలోకి సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ స్థానంలో అమిత్ షా, జై శంకర్ చేరారు. పలువురికి అదనపు బాధ్యతలు గత మంత్రి వర్గంలో రైల్వే శాఖ బాధ్యతలు చేపట్టిన పీయూష్ గోయెల్‌కు ఈసారి వాణిజ్య, పరిశ్రమల శాఖ అదనంగా కేటాయించారు. ఆయనే నిర్వహించిన బొగ్గు మంత్రిత్వ శాఖను మాత్రం కొత్తగా కేబినెట్లోకి తీసుకున్న ప్రహ్లాద్ జోషికి ఇచ్చారు. జోషికి పార్లమెంటరీ వ్యవహారాలు, గనుల శాఖను కూడా కేటాయించారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని ఆ పార్టీకి కంచుకోటగా భావించే అమేథీలో ఓడించిన స్మృతీ ఇరానీకి జౌళి శాఖతోపాటు ఈసారి మహిళా శిశు అభివృద్ధి శాఖలను ఇచ్చారు. గత మంత్రి వర్గంలో మాదిరిగానే ధర్మేంద్ర ప్రధాన్ ఈసారి కూడా పెట్రోలియం శాఖ ఇచ్చారు. దీంతోపాటు ఉక్కు మంత్రిత్వ శాఖ బాధ్యతలు కేటాయించారు. రవి శంకర్ ప్రసాద్‌కు ఈసారి కూడా న్యాయ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బాధ్యతలు ఇచ్చారు. దీంతోపాటు టెలికం శాఖను ఇచ్చారు. ప్రకాశ్ జవడేకర్‌కు ఈసారి పర్యావరణ శాఖతోపాటు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖల బాధ్యతలను, నరేంద్ర సింగ్ తోమర్‌కు వ్యవసాయ శాఖతోపాటు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ బాధ్యతలు ఇచ్చారు. జైట్లీ బాధ్యతలు నిర్మలకు.. నిర్మలా సీతారామన్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అనారోగ్య కారణాలతో కేబినెట్‌కు దూరంగా ఉన్న సీనియర్ నేత, గత కేబినెట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బాధ్యతలను ఈసారి నిర్మలకు కేటాయించారు. ఆర్థిక శాఖ బాధ్యతలను చేపట్టనున్న రెండో మహిళా మంత్రిగా> ఆమె రికార్డు నెలకొల్పనున్నారు. గతంలో ఇందిరాగాంధీ కొంతకాలం పాటు ఆర్థిక మంత్రిగా వ్యవహరించారు. గత కేబినెట్లో ఆమెను రక్షణ మంత్రిగా నియమించడంతో అందరూ ఆశ్చర్యానికి గురైన విషయం తెలిసిందే. ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా అనురాగ్ ఠాకూర్ బాధ్యతలు నిర్వర్తిస్తారు. దౌత్యాధికారులకు అందలం ఊహించని విధంగా కేబినెట్లో చోటు దక్కించుకున్న విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి జై శంకర్‌కు విదేశీ వ్యవహారాల శాఖ బాధ్యతలను అప్పగించారు. విదేశాంగ శాఖ బాధ్యతలను చేపట్టిన మొదటి దౌత్యాధికారి ఈయనే. ఏ సభలోనూ ఆయన సభ్యుడు కాదు. దీంతో నిబంధన ప్రకారం ఆరు నెలల్లోగా ప్రభుత్వం ఆయనకు సభ్యత్వం కల్పించే అవకాశం ఉంది. దాదాపు ఏడాదిన్నర క్రితం పదవీ విరమణ చేసిన జై శంకర్..దౌత్యాధికారిగా విశేష అనుభవం గడించారు. రష్యా, చైనా, అమెరికాల్లో భారత్ తరపున వివిధ హోదాల్లో దౌత్యాధికారిగా సేవలందించారు. ఇటీవలి ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ కేబినెట్లో చోటు దక్కిన మాజీ దౌత్యాధికారి హర్దీప్ పూరికి పౌర విమానయాన, పట్టణాభివృద్ధి శాఖ(స్వతంత్ర హోదా)తోపాటు, వాణిజ్య పరిశ్రమల శాఖ బాధ్యతలు ఇచ్చారు. మాజీ ఐఏఎస్ అధికారి ఆర్కే సింగ్‌కు విద్యుత్, పునరుత్పాదక ఇంధన శాఖ అప్పగించారు. టార్గెట్ 35ఏ కశ్మీర్‌పై అమిత్ షా గురి బీజేపీలో నంబర్ టూ స్థానంలో ఉన్న అమిత్ షా దేశానికి కొత్త హోం మంత్రి అయ్యారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించడం, అక్రమ వలసలను అరికట్టడం నూతన హోం మంత్రి ప్రా«థమ్యాలు.అలాగే, ఎన్ఆర్సీ(జాతీయ పౌరసత్వ బిల్లు)ని దేశ మంతా అమలు పరచడం, జమ్ము,కశ్మీర్లో 35ఏ అధికరణను రద్దు చేయడం వంటి కఠిన చర్యలు కూడా అమిత్ షా తీసుకునే అవకాశం ఉంది. 35ఎ అధికరణం కశ్మీరీలకు(స్థానికులు) ప్రత్యేక హక్కులు, అధికారాలు కల్పిస్తోంది. కశ్మీర్లో మహిళలు, శాశ్వత నివాసులు కానివారి పట్ల వివక్ష చూపుతున్న రాజ్యాంగంలోని 35ఎ అధికరణను రద్దు చేస్తామని బీజేపీ ఎన్నికల ప్రణాళికలో స్పష్టం చేసింది. 35 ఎ అధికరణ రాష్ట్రాభివృద్ధికి ప్రతిబంధకంగా ఉందని బీజేపీ ఆరోపించింది. కశ్మీర్లో ప్రజలందరి సంక్షేమానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇచ్చింది. కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలిచ్చే 370వ అధికరణను జనసంఘ్‌లో ఉన్నప్పటి నుంచీ అమిత్ షా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అక్రమ వలసలను అరికట్టడం కోసం ఎన్ఆర్సిని దేశమంతా అమలు చేస్తామని కూడా షా ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో హోం మంత్రిగా అమిత్ షా నియామకం ప్రాధాన్యతను సంతరించుకుంది. అపర చాణుక్యుడిగా పేరొందిన అమిత్‌షా మోదీకి అత్యంత విశ్వాస పాత్రుల్లో ఒకరు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమిత్ షా ఆ రాష్ట్ర హోం మంత్రిగా పని చేశారు. దేశంలో మావోయిస్టు హింస పెరుగుతుండటం, కశ్మీర్లో తీవ్రవాదం పెచ్చరిల్లుతున్న నేపథ్యంలో ఆ సమస్యలను పరిష్కరించడం షా ముందున్న ప్రధాన సవాళ్లని పరిశీలకులు అంటున్నారు. కశ్మీర్లో తీవ్రవాదాన్ని బలప్రయోగంతో అణచివేయాలా లేక చర్చల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించాలా అన్నది నిర్ణయించడం ఆయన ఎదుర్కొనే మరో కీలకాంశం. సుప్రీం కోర్టు విధించిన గడువు జూలై 31 ఎన్ఆర్సి ప్రక్రియను పూర్తి చేయం, ఆంతరంగిక భద్రత పరిరక్షణ షా ముందున్న మరికొన్ని సవాళ్లు. -
లక్ష దీవుల్లో 85 శాతం పోలింగెందుకు?
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఉపయోగించిన కఠిన పదాలను, పరస్పర దూషణలను మరచిపోదాం. ఇప్పటి నుంచి మనం కలిసి కట్టుగా ముందుకు పోదాం. ఈ చిన్ని దీవుల్లో మనం పరస్పరం ప్రేమతో జీవించాల్సిన అవసరం ఉంది’ అని లక్షదీవుల నుంచి లోక్‌సభకు ఎన్సీపీ తరఫున ఎన్నికైన పీపీ మొహమ్మద్ ఫైజల్ తన ఫేస్బుక్ పేజీ ద్వారా ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ చిన్న నియోజకవర్గం నుంచి ఏకంగా ఆరుగురు అభ్యర్థులు హోరాహోరీ పోరాటం జరపడం ద్వారా ప్రచారంలో కఠిన పదాలు, పరస్పర దూషణలు చోటు చేసుకున్నాయి. ఇంత తీవ్రంగా ప్రచారం జరగడం వల్లనే దేశంలోనే అత్యధికంగా లక్షదీవుల్లో 85 శాతం పోలింగ్ జరిగింది. మొత్తం 55,057 ఓటర్లలో ఫైజల్‌కు 22,851 (48.6 శాతం) ఓట్లు వచ్చాయి. ఆయన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి హముదుల్లాహ్ సయీద్‌పై 823 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలే ఇప్పుడు పునరావృతం అయ్యాయి. నాడు కూడా సయీద్‌పై ఫైజల్ పోటీచేసి 1,535 ఓట్ల మెజారితో విజయం సాధించారు. సయీద్ వరుసగా 2004, 2009 ఎన్నికల్లో ఓడిపోగా, ఆయనపై ఫైజల్ విజయం సాధించారు. 1957 నుంచి 1967 వరకు ఈ నియోజకవర్గానికి కాంగ్రెస్ నాయకుడు నల్లా కోయల్ తంగాల్ ప్రాతినిథ్యం వహించారు. ఆయన్ని భారత రాష్ట్రపతి నామినేట్ చేశారు. 1967లో ఈ సీటుకు మొదటిసారి ఎన్నికలు జరగ్గా స్వతంత్ర అభ్యర్థి పీఎం సయీద్ ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి 1971లో పోటీ చేయగా మళ్లీ గెలిచారు. అప్పటి నుంచి 1999 వరకు వరుసగా ఆయనే విజయం సాధిస్తూ వచ్చారు. 2004 ఎన్నికల్లో జనతాదళ్ అభ్యర్థి పీ పూకున్హీ కోయా చేతుల్లో సయీద్ కేవలం 71 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2005లో సయీద్ మరణంతో ఆయన కుమారుడు హముదుల్లా 2009లో విజయం సాధించారు. ఆ తర్వాత వరుసగా ఆయన ఓడిపోతూ వచ్చారు. ఈసారి ఆయన గెలిచే అవకాశాలు ఉండే. అయితే ఆయన వ్యవహార శైలి నచ్చక కొంత మంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేసి ఫైజల్‌కు ఓటు వేశారు. మహారాష్ట్రలో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్, ఎన్సీపీలు ఇక్కడ విడివిడిగా పోటీ చేశాయి. భారత ఆగ్నేయ తీరానికి 400 కిలోమీటర్ల దూరంలో 78 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించిన 36 దీవుల సమూహమే లక్షదీవులు. వీటిల్లో పది దీవులే జనావాస ప్రాంతాల్లో 2011 జనాభా లెక్కల ప్రకారం 65 వేల జనాభా కలిగిన ఈ దీవుల్లో ప్రస్తుత లెక్కల ప్రకారం దాదాపు 55 వేల మంది ఉన్నారు. వీరిలో 93 శాతం మంది ముస్లింలు ఉన్నారు. వారు ఇక్కడ సామాజికంగా బాగా వెనకబడిన వారవడంతో వారికి ఈ సీటును రిజర్వ్ చేశారు. -
వారందరి లెక్క తేలుస్తాం: కిషన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు ఇవ్వడం సంతోషంగా ఉందని సికింద్రాబాద్ ఎంపీ కిషన్‌రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. శుక్రవారం జరిగిన మంత్రివర్గ కేటాయింపుల్లో హోంశాఖ సహాయమంత్రిగా కిషన్ రెడ్డికి అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన సాక్షి మీడియాతో మాట్లాడుతూ.. కీలక బాధ్యతలు అప్పగించినందుకు సంతోషంగా ఉందన్నారు. నేషనల్ సిటిజన్ రిజిస్టర్ తయారిపై ప్రధానంగా దృష్టి సారిస్తామని తెలిపారు. ఉగ్రవాద కార్యకలపాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరు పడితే వారు మన దేశంలో ఉండేందుకు ఇదేమి ధర్మ సత్రం కాదని చెప్పారు. భారతీయులెవరు? చొరబాటుదారులెవరనేది లెక్క త్వరలోనే తేలుస్తామని స్పష్టం చేశారు. ఎక్కడ ఉగ్రవాద ఘటన జరిగినా హైదరాబాద్‌ను మూలాలుంటున్నామని, ఉగ్రవాదులు హైదరాబాద్‌ను సేఫ్ జోన్‌గా చేసుకుంటున్నరని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదులకు సహకరిస్తున్న వారిని శాశ్వతంగా ఏరివేస్తాని కిషన్ రెడ్డి హెచ్చరించారు. పోలీసుశాఖను ఆధునీకరించి బలోపేతం చేస్తామన్నారు. దేశ సమగ్రత, ఐక్యత, భద్రత మా ప్రధాన లక్ష్యమని, గతంలో బీజేవైఎం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సీమా సురక్ష పేరుతో 25 రోజులు యాత్ర చేసినట్లు ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు అదే అంశానికి సంబంధించిన హోంశాఖకు మంత్రికావడం సంతోషంగా ఉందన్నారు. ‘‘సంపదకు గుర్తు లక్ష్మిదేవి...తొలిసారిగా ఆర్థికశాఖకు మహిళా మంత్రి అయ్యారు. దేశాభివృద్ధికి, తెలుగురాష్ట్రాల అభివృద్ధికి అన్ని విధాల సహాయం చేస్తారని భావిస్తున్నాం. తెలంగాణలో బీజేపీని టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా తీర్చిదిద్దుతాం. బీజేపీలో చేరేందుకు చాలా మంద్రి సంప్రదిస్తున్నారు. వారందరినీ చేర్చుకుంటాం’’ అని అన్నారు. చదవండి: కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు -
త్రిపురలో చల్లారని హింసాకాండ
సాక్షి, న్యూఢిల్లీ : త్రిపురలో ఎన్నికల ఫలితాల అనంతరం రాజుకున్న హింస ఇప్పటికీ చల్లారడం లేదు. ఈ హింసాకాండలో ఇప్పటి వరకు ముగ్గురు మరణించగా కొన్ని వందల మంది గాయపడ్డారు. కొన్ని వందల ఇళ్లు ధ్వంసమయ్యాయి. సంయమనం పాటించాల్సిందిగా, శాంతిభద్రతలను రక్షించేందుకు సహకరించాల్సిందిగా బీజేపీకి చెందిన రాష్ట్ర ముఖ్యమంత్రి బిప్లబ్ దేవ్ ఇచ్చిన పిలుపును ఎవరు పట్టించుకున్నట్లు లేవు. హింసాకాండపై పాలకపక్ష బిజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్, సీపీఎం పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. బీజేపీ కార్యకర్తలు విజయాత్రల సందర్భంగా తమ కార్యాలయాలపై దాడులు చేసి ఫర్నీచర్‌ను ధ్వంసం చేయడంతోపాటు కార్యకర్తలను చితకబాదారని సీపీఎం నాయకులు ఆరోపిస్తుండగా, బీజేపీ కార్యకర్తలతోపాటు బీజేపీలో చేరిపోయిన సీపీఎం అల్లరి మూకలు తమ పార్టీ కార్యాలయాలు, కార్యకర్తలు లక్ష్యంగా దాడులు జరుపుతున్నారని, కార్యకర్తల ఇళ్లను దగ్ధం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. తమ పార్టీ కార్యాలయాలతోపాటు కాంగ్రెస్ కార్యాలయాలను కూడా లక్ష్యంగా చేసుకొని బీజేపీ కార్యకర్తలు దాడులు జరుపుతూ హింసాకాండకు పాల్పడుతున్నారని సీపీఎం సీనియర్ నాయకుడు పబిత్ర కర్ ఆరోపించారు. బీజేపీ, అందులో చేరిపోయిన సీపీఎం అల్లరిమూకలు ఇప్పటివరకు జరిపిన దాడుల్లో దాదాపు 300 మంది కార్యకర్తలు ఆస్పత్రుల పాలయ్యారని, 250 ఇళ్ళు, 100 దుకాణాలు దగ్ధం చేశారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రద్యోత్ బిక్రమ్ మాణిక్య దెబ్బర్మన్ ఆరోపించారు. పోలీసుల బందోబస్తు మధ్య విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తూ దాడులకు తెగబడుతున్నారని ఆయన చెప్పారు. తమ కార్యకర్తల చికిత్స కోసం, ఇళ్లు కోల్పోయిన వారి ఆశ్రయం కోసం ఓ ‘సంక్షోభ నిధి’ని ఏర్పాటు చేశామని కూడా ఆయన చెప్పారు. 2018, మార్చి నెలలో జరిగిన త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం ప్రభుత్వం కూలిపోయి బీజేపీ ప్రభుత్వం వచ్చింది. అప్పటి నుంచి ఈ పార్టీల మధ్య దాడులు, హింసాకాండ కొనసాగుతోంది. మొన్న త్రిపురలోని రెండు లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కూడా ఇద్దరు బీజేపీ సభ్యులే విజయం సాధించారు. కాంగ్రెస్ రెండో స్థానంలో రాగా, సీపీఎం మూడోస్థానంలో వచ్చింది. మళ్లీ రాజకీయ కక్షలు రగులుకొని హింసాకాండ ప్రజ్వరిల్లింది. త్రిపురకు ఎన్నికల హింస కొత్త కాదు. ప్రతి ఎన్నికల సందర్భంగా హింసాకాండ చెలరేగుతోంది. మొన్న పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా కూడా అల్లర్లు జరగడంతో ఉన్న రెండు నియోజకవర్గాలకు కూడా వేర్వేరు తేదీల్లో పోలింగ్ నిర్వహించారు. గతంలో జరిగినంత హింసాకాండ ఇప్పుడు లేదని, 2013లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 13 మంది మరణించారని, ఇప్పుడు ముగ్గురే మరణించారంటూ పాలకపక్ష బీజేపీ నాయకులు సమర్థించుకుంటున్నారు. -
కిషన్ రెడ్డికి కీలక బాధ్యతలు
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోదీ కేబినెట్ సహాయ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డికి అంతా ఊహించినట్లే కీలక బాధ్యతలు దక్కాయి. బీజేపీ కార్యకర్తలంతా ‘కిషనన్నా’అని ఆప్యాయంగా పిలుచుకునే ఆయనకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా అవకాశం లభించింది. తెలంగాణ నుంచి నలుగురు బీజేపీ ఎంపీలు గెలుపొందగా.. దాదాపు నాలుగు దశాబ్దాలుగా పార్టీతో అనుబంధం ఉన్న కిషన్‌రెడ్డిని మంత్రి పదవి వరించింది. గురువారం రాత్రి రాష్ట్రపతి భవన్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రిగా కిషన్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపడ్తారని బీజేపీ శ్రేణులు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేశాయి. ఆ ప్రచారంకు తగినట్లే ప్రధాని నరేంద్రమోదీ కిషన్ రెడ్డికి కీలక బాధ్యతలను కేటాయించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్‌పేట నుంచి స్వల్ప ఓట్లతో ఓడిన ఆయన తాజా లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి ఘనవిజయం సాధించారు. అంబర్‌పేటలో ఓటమి ఆయన మంచికే జరిగిందని, కేంద్రమంత్రి కావాలని ఉండటంతోనే ఓడిపోయారని తెలంగాణ బీజేపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. అప్పుడు గెలిచి ఉంటే ఇప్పుడు కేంద్రమంత్రి అయ్యేవారు కాదని పేర్కొంటున్నాయి. ఆ ప్రత్యేక అనుబంధమే కారణమా? ప్రధాని నరేంద్ర మోదీతో కిషన్‌రెడ్డికి ఉన్న ప్రత్యేక అనుబంధమే కీలక బాధ్యతలు కేటాయించేలా చేసిందని పార్టీ వర్గాలు తెలిపాయి. బీజేవైఎం జాతీయ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి పనిచేసిన సమయంలో మోదీకి దగ్గరయ్యారని, అప్పట్లో బీజేపీ జాతీయ నేతలంతా కలసి పర్యటించిన నేపథ్యంలో మోదీ, కిషన్‌రెడ్డి ఒకే గదిలో బస చేసిన సందర్భం ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అలా వారిద్దరి మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయని, కిషన్‌రెడ్డికి కేంద్ర మంత్రి పదవి దక్కడానికి అది కూడా ఒక కారణమని చెబుతున్నారు. -
ఓటమిపై బాధ్యత నాదే : ముఖ్యమంత్రి కుమారుడు
మండ్య : రాష్ట్రంలోనే అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన మండ్య లోక్‌సభ ఎన్నికల్లో తొలి ఎన్నికలోనే ఓటమిని చవి చూసిన ముఖ్యమంత్రి కుమారుడు నిఖిల్ తొలిసారిగా తన ఓటమిపై స్పందించారు. తన ఓటమికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జేడీఎస్ నాయకులు, కార్యకర్తలు కారణం కాదని, తన ఓటమికి తానే బాధ్యత తీసుకుంటున్నాని తన ట్విట్టర్లో పేర్కొన్నాడు. మండ్యలో తన ఓటమికి తానే కారణమని ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్టు చేశారు. భవిష్యత్‌లో మండ్య జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రజల కష్టాలను తెలుసుకుని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ఈ విషయంపై త్వరలో మీడియా సమావేశం నిర్వహిస్తానని చెప్పారు. అభినందనలు : మండ్య పార్లమెంటు స్థానం నుంచి విజయం సాధించిన స్వతంత్ర అభ్యర్థి సుమలతకు ఆయన అభినందనలు తెలిపారు. అదే విధంగా అభిషేక్ గౌడ నటించిన అమర్ సినిమా విజయవంతం కావాలని తన ట్విటర్లో ఆకాంక్షించారు. దీంతో నిఖిల్ కుమార స్వామి చేసిన పోస్ట్ చూసిన వేలాది మంది అభిమానులు, ప్రజలు లైక్స్ కొడుతూ తమ స్పందనలను సైతం తెలిపారు. -
‘కమలా’ధీశుడు ఎవరో..?
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: బీజేపీ జాతీయాధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా కేంద్ర మంత్రిగా నియమితులు కావడంతో పార్టీ అధ్యక్షుడిగా తర్వాత ఎవరు నియమితులవుతారనే దానిపై ఆసక్తి నెలకొంది. కేంద్ర మంత్రిగా ఉంటూనే అమిత్ షా పార్టీ అధ్యక్షుడిగా కూడా కొనసాగే అవకాశం ఉందని బీజేపీ సీనియర్ అధికార ప్రతినిధి ఒకరు అన్నారు. అయితే ఒక వ్యక్తి ఏకకాలంలో ఒకే పదవిలో ఉండాలనేది బీజేపీ సంప్రదాయం. కాబట్టి షా పార్టీ అధ్యక్ష పదవిని వేరొకరికి ఇచ్చే అవకాశాలే ఎక్కువ. బీజేపీకి అత్యంత విజయవంతమైన అధ్యక్షుడిగా పేరు తెచ్చుకున్న అమిత్ షా స్థానాన్ని మరొకరు భర్తీ చేసి, ఆయనలా పనిచేయాలంటే చాలా కష్టమైన పనే. అయితే కొత్త చీఫ్‌గా కాస్త తక్కువ వయసు ఉన్న అలాగే పార్టీ వ్యవహారాల్లో బాగా అనుభవం ఉన్న వ్యక్తి నియమితులు కావొచ్చనే సమాచారం కూడా అందుతోంది. ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాజస్తాన్ వ్యక్తి భూపేంద్ర యాదవ్, అలాగే కేంద్ర మాజీ మంత్రి, హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన జేపీ నడ్డాల్లో ఎవరో ఒకరిని అధ్యక్ష పదవి వరించే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీలో సీనియర్ నాయకుడైన నడ్డాను మోదీ ఈసారి మంత్రివర్గంలోకి తీసుకోకపోవడం కూడా ఈ వార్తలకు మరింత బలాన్నిస్తోంది. గత ప్రభుత్వంలో నడ్డా ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేయడం తెలిసిందే. అలాగే పార్టీ అగ్రనాయకులు, ఆరెస్సెస్ ఆశీస్సులు నడ్డాకు బాగా ఉన్నాయి. బీజేపీ పార్లమెంటరీ బోర్డులో సభ్యుడైనందున, తగినంత అనుభవం కూడా నడ్డాకు ఉంది. మరోవైపు పార్టీ వ్యవహారాలు చూసుకోవడంలో అమిత్ షాకు భూపేంద్ర యాదవ్ ఎంతో సాయం చేస్తూ, అన్నీ దగ్గరుండి చూసుకునేవారు. అమిత్ షా కూడా భూపేంద్ర యాదవ్‌ను బాగా నమ్ముతారు. గతేడాది గుజరాత్ శాసనసభ ఎన్నికల సమయంలో భూపేంద్ర యాదవ్ గుజరాత్ ఇన్చార్జ్గా నియమితులయ్యారు. పార్టీ ఉపాధ్యక్షుడు ఓపీ మాథుర్ పేరు కూడా కొత్త చీఫ్ రేసులో వినిపిస్తోంది. ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు వరుసగా మహేంద్ర నాథ్ పాండే, నిత్యానంద్ రాయ్‌లు కూడా కేంద్ర మంత్రివర్గంలో చేరడంతో ఆ రాష్ట్రాలకు కూడా బీజేపీ అధ్యక్షులను నియమించాల్సి ఉంది. -
కాంగ్రెస్‌లో ఎన్సీపీ విలీనం..?
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్‌లో కీలక పరిణామాలు సంభవిస్తున్నాయి. కాంగ్రెస్ మాజీ నేత, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్య క్షుడు శరద్ పవార్‌తో గురువారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమావేశం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్‌లో ఎన్సీపీని విలీనం చేసే అంశాన్ని ఇద్దరు నేతలు చర్చించి ఉంటారని ఊహాగానాలు వెల్లువెత్తు తున్నాయి. అయితే, ఇరు పార్టీల వర్గాలు అదేం లేదని కొట్టి పారేస్తున్నాయి. శరద్‌పవార్ నివాసానికి వెళ్లిన రాహుల్ దాదాపు గంటపాటు భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితిపై వారు చర్చించారు. కాంగ్రెస్ చీఫ్‌గా కొనసాగాలని రాహుల్‌ను పవార్ కోరినట్లు కాంగ్రెస్ వర్గాల సమాచారం. అయితే, ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 52 సీట్లు మాత్రమే గెలుచుకున్న విషయం తెలిసిందే. ప్రతిపక్ష హోదా దక్కాలంటే కాంగ్రెస్‌కు మరో ఇద్దరు సభ్యుల అవసరం ఉంది. ఎన్సీపీ ఇటీవలి ఎన్నికల్లో మొత్తం ఐదు సీట్లు గెలుచుకుంది. మహారాష్ట్రలో రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇద్దరు నేతలు ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. దీనిపై మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్ చవాన్ మాట్లాడుతూ.. ‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పనిచేస్తే ఓట్లు చీలిపోకుండా ఉంటాయి. పార్టీల విలీనం వేరే అంశం. దానిని గురించి నాకు తెలియదు’అని అన్నారు. ఇలా ఉండగా, కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ గురువారం పార్టీ ప్రధాన కార్యాలయంలో మల్లికార్జున ఖర్గేతోనూ, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్‌తోనూ విడివిడిగా భేటీ అయ్యారు. జూన్ 1వ తేదీన జరిగే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కొత్త నేతను ఎన్నుకునే విషయమై వీరు చర్చించినట్లు సమాచారం. నేడు ప్రతిపక్షాల సమావేశం లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో కాంగ్రెస్ నేతృత్వంలో నేడు ప్రతిపక్ష పార్టీల నేతలు తొలిసారి సమావేశం కానున్నారు. జూన్ 6వ తేదీ నుంచి ప్రారంభమయ్యే లోక్‌సభ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని వారు చర్చించనున్నారు. టీవీ చర్చల్లో కాంగ్రెస్ పాల్గొనబోదు పార్టీ అధ్యక్షుడిగా కొనసాగేందుకు రాహుల్ విముఖత.. పార్టీలో నాయకత్వ సంక్షోభం నేపథ్యంలో ఒక నెలపాటు టీవీల్లో జరిగే రాజకీయ చర్చా కార్యక్రమాలకు పిలవద్దని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా ఓ ప్రకటనలో తెలిపారు. మణిపూర్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా ఇంఫాల్: కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ పదవులకు రాజీనామాలు చేశారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడానికే పీసీసీ అధ్యక్షుడికి రాజీనామా పత్రాలు సమర్పించినట్లు వీరు చెబుతున్నారు. అయితే, వీరంతా బీజేపీలోకి చేరనున్నారని పుకార్లు వస్తున్నాయి. బీజేపీకి చెందిన ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ నేతృత్వంలో రాష్ట్రంలో ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వం నడుస్తోంది. సంకీర్ణం కొనసాగుతుంది: కుమారస్వామి భరోసా కర్ణాటకలో కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి ఏ ఢోకా లేదని సీఎం హెచ్డీ కుమారస్వామి కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌కు భరోసా ఇచ్చారు. గురువారం ఆయన రాహుల్‌ను ఆయన నివాసంలో కలిశారు. యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీ నేత ఎస్ఎం కృష్ణను కలిశారని వార్తలు వెలువడిన నేపథ్యంలో ఈ భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులను రాహుల్‌కు వివరించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలంటూ రాహుల్‌ను కోరారు. ప్రభుత్వం కూలిపోనుందనే వార్తలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రస్తుతం బెంగళూరులోనే ఉన్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అసమ్మతి ఎమ్మెల్యేలను బుజ్జగిస్తున్నారు. -
మోదీకి మిక్కిలి సన్నిహితుడు
బీజేపీలో వ్యవస్థాగత యంత్రాంగాన్ని ఉత్తేజం చేసి నరేంద్ర మోదీ రెండోసారి ప్రధాని అయ్యేలా చేయడంలో సఫలమైన అనంతరం, ఇక ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించేందుకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా (54) సిద్ధమయ్యారు. గురువారం ఆయన కూడా మోదీ మంత్రివర్గంలో చేరారు. మోదీకి షా అత్యంత సన్నిహితుడు. ఏ చిన్న సలహా కోసమైనా మోదీ అమిత్ షాను ఆశ్రయిస్తారని పార్టీ నాయకులు నమ్ముతారు. 2014లో అమిత్ షా బీజేపీ జాతీయాధ్యక్షుడయ్యారు. అంతకుముందు జరిగిన 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ 80కి 71 లోక్‌సభ స్థానాలు గెలుచుకోవడంలో అమిత్ షా కీలకంగా వ్యవహరించారు. మోదీ తర్వాత బీజేపీలో రెండో శక్తిమంతమైన నాయకుడిగా ఎదిగారు. తాజా లోక్‌సభ ఎన్నికల్లో గుజరాత్‌లోని గాంధీ నగర్ స్థానం నుంచి భారీ ఆధిక్యంతో గెలిచి తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2001 నుంచి 2014 మధ్య 13 ఏళ్లపాటు గుజరాత్‌కు మోదీ ముఖ్యమంత్రిగా ఉండగా, అమిత్ షా హోం శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలోనే నకిలీ ఎన్కౌంటర్ కేసులో చిక్కుకున్నారు. అయితే తర్వాతి కాలంలో ఆయన ఆ కేసు నుంచి బయటపడ్డారు. గుజరాత్లో పలు సంక్షేమ పథకాలను అమలు చేయడంలో కూడా షా కీలకంగా వ్యవహరించారు. కరుడుగట్టిన హిందూత్వ, జాతీయవాది అయిన అమిత్ షా కేంద్ర ప్రభుత్వంలోకి రావడాన్ని బీజేపీ కార్యకర్తలు హర్షిస్తున్నారు. ప్రభుత్వంలోకి వచ్చినా సరే పార్టీ ఎజెండాను నిర్ణయించడంలో అమిత్ షా కీలకపాత్ర పోషిస్తారని పార్టీ నేతలు అంటున్నారు. గత లోక్‌సభ ఎన్నికల కన్నా తాజా ఎన్నికల్లో బీజేపీకి 21 సీట్లు ఎక్కువే సంపాదించిపెట్టిన అమిత్ షా, ఆ పార్టీకి అత్యంత విజయవంతమైన అధ్యక్షుడని అంటారు. తనకు 14 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి అమిత్ షా బీజేపీతో ఉంటూ 40 ఉన్నత శిఖరాలను అధిరోహించారు. -
అజ్ఞాతం నుంచి అత్యున్నత పీఠం దాకా
దామోదర్‌దాస్ మూల్‌చంద్‌దాస్ మోదీ, హీరాబెన్ మోదీ దంపతులకు 1950, సెప్టెంబర్ 17న గుజరాత్‌లోని వాద్నగర్లో నరేంద్ర మోదీ జన్మించారు. బాల్యంలో తండ్రితో కలిసి టీ అమ్మిన మోదీ, ఆ తర్వాత సోదరుడితో కలిసి సొంతంగా టీ షాపును పెట్టారు. 8 ఏళ్ల ప్రాయంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆరెస్సెస్) పట్ల మోదీ ఆకర్షితులయ్యారు. 1968లో ఇంట్లోవాళ్లు మోదీకి జశోదాబెన్‌తో వివాహం జరిపించగా, ఇది ఇష్టంలేని మోదీ ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోయారు. తిరిగి 1971లో గుజరాత్‌కు చేరుకున్న మోదీ, ఆరెస్సెస్‌లో పూర్తిస్థాయి ప్రచారక్‌గా చేరారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ 1975లో ఎమర్జెన్సీ ప్రకటించడంతో పాటు ఆరెస్సెస్‌పై నిషేధం విధించారు. దీంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన మోదీ, మారువేషంలో సంఘ్ కార్యకలాపాలను కొనసాగించారు. సీనియర్ల గుస్సా.. మోదీ క్రమశిక్షణను, వాక్చాతుర్యాన్ని గుర్తించిన ఆరెస్సెస్ నేతలు 1985లో గుజరాత్ బీజేపీ విభాగం నిర్వహణ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో గుజరాత్లో విస్తృతంగా పర్యటించిన మోదీ పార్టీని పటిష్టం చేసేందుకు కృషిచేశారు. అడ్వాణీ ప్రారంభించిన ‘రథయాత్ర’, బీజేపీ నేత మురళీమనోహర్ జోషీ ప్రారంభించిన ‘ఏక్తాయాత్ర’ బాధ్యతలను మోదీ దగ్గరుండి చూసుకున్నారు. పార్టీలో మోదీ ఎదుగుదలపై ఆందోళన చెందిన సీనియర్లు కేశూభాయ్‌పటేల్, శంకర్‌సింఘ్‌వాఘేలా, కాన్షీరామ్ రాణా, మోదీ గుజరాత్లో ఉండేందుకు వీల్లేదని తీర్మానించారు. దీంతో బీజేపీ అధిష్టానం మోదీని జాతీయ కార్యదర్శిగా నియమించగా, దేశంలోని పార్టీ శ్రేణులతో ఆయన సత్సంబంధాలు పెంచుకున్నారు. సీఎంగా బాధ్యతలు.. సవాళ్లు గుజరాత్ సీఎం కేశూభాయ్‌పటేల్ ఆరోగ్యం క్షీణించడం, అవినీతి ఆరోపణలతో కేశూభాయ్‌ను తప్పించి మోదీని బీజేపీ గుజరాత్ సీఎంను చేసింది. 2001, అక్టోబర్7న మోదీ గుజరాత్ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం రాజ్‌కోట్–2 అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అశ్విన్‌పై 14 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే 2002, ఫిబ్రవరి 27న గోద్రాలో రైలుదహనం అనంతరం చెలరేగిన మతఘర్షణలను అణచివేయడంలో మోదీ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) మోదీకి క్లీన్చిట్ ఇచ్చింది. ఘర్షణల అనంతరం మోదీ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లిన బీజేపీ, 182 సీట్లకు గానూ 127 చోట్ల విజయదుందుభి మోగించింది. అప్పటి నుంచి గుజరాత్‌ను అభివృద్ధిలో పరుగులు పెట్టించిన మోదీ వెనక్కి తిరిగిచూసుకోలేదు. 2001 నుంచి 2014 వరకూ మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. 2014లో మోదీ సారథ్యంలో సార్వత్రిక ఎన్నికలకు వెళ్లిన బీజేపీ 282 సీట్లతో అధికారంలోకి వచ్చింది. -
...అను నేను!
‘మై నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ ఈశ్వర్‌కీ శపథ్ లేతా హూ కీ మై విధిద్వారా స్థాపిత్ భారత్‌కే సంవిధాన్ ప్రతి సచ్చీ శ్రద్ధా, ఔర్ నిష్టా రఖూంగా...’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. మంత్రులూ ప్రమాణం చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణస్వీకారం సందర్భంగా.. ‘వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతాననీ...’ అని ప్రమాణం చేశారు. దేశంలోని రాజ్యాంగబద్ధమైన పదవులను అధిష్టించే నేతలు రాజ్యాంగంలోని మూడో షెడ్యూల్ ప్రకారం ఈ తరహాలో ప్రమాణంచేయాలి. ఈ ప్రమాణస్వీకార సమయంలోనే అధికారిక రహస్యాలకు సంబంధించి మరో ప్రమాణం చేయాలి. రాజ్యాంగంలోని 3వ షెడ్యూల్ ఆర్టికల్ 75(4) ప్రకారం ఈ రెండు ప్రమాణస్వీకారాలు చేశాకే ప్రధాని, సీఎం, కేంద్ర, రాష్ట్ర మంత్రులు బాధ్యతలు చేపట్టాలి. కేంద్ర మంత్రి ప్రమాణం.. ‘...అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతాననీ, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతాననీ, కేంద్రమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణశుద్ధితో నిర్వహిస్తాననీ, భయంగాని, పక్షపాతంగాని, రాగద్వేషాలుగాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా/ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’ అని కేంద్ర మంత్రులు ప్రమాణం చేస్తారు. అదే సమయంలో అధికారిక రహస్యాలకు సంబంధించి, ‘...అనే నేను కేంద్రమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపర్చనని లేదా వెల్లడించనని దైవసాక్షిగా/ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’ అని మరో ప్రమాణం చేయాల్సి ఉంటుంది. కుర్తా–పైజామాదే అధిపత్యం రాష్ట్రపతిభవన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇతర కేంద్రమంత్రుల ప్రమాణస్వీకారం సందర్భంగా హిందీ ఆధిపత్యం నడిచింది. ప్రధాని మోదీ సహా మెజారిటీ మంత్రులు హిందీలో ప్రమాణస్వీకారం చేయగా, కొందరు మాత్రం ఆంగ్లంలో ప్రమాణం చేశారు. ఇక ఈ వేడుకకు హాజరైన ఎంపీల్లో చాలామంది సంప్రదాయ కుర్తా–పైజామాను ధరించి వచ్చారు. కొంతమంది మాత్రం షర్టులు–ఫ్యాంట్లు వేసుకొచ్చారు. మోదీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయడానికి రాగానే సభికులు ఒక్కసారిగా హర్షధ్వానాలు చేశారు. -
అమిత్ షాకు ఆర్థిక శాఖ..?
న్యూఢిల్లీ: బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు కేంద్ర ఆర్థిక మంత్రి పదవి దక్కే అవకాశం ఎక్కువగా ఉందని పార్టీ వర్గాలు చెప్పినట్లు ఇండియా టుడే గురువారం వెల్లడించింది. మోదీ తొలి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న జైట్లీ ప్రస్తుతం ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మరోసారి మంత్రిపదవి చేపట్టే ఓపిక తనకు లేదని ఆయన ఇప్పటికే మోదీకి స్పష్టం చేశారు. మోదీ, రాజ్‌నాథ్ తర్వాత మూడో స్థానంలో అమిత్ షా కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు. దీంతో మోదీ తర్వాత మంత్రివర్గంలో రెండో కీలక వ్యక్తి రాజ్‌నాథేననీ, ఆయన గతంలో చేపట్టిన హోం మంత్రి పదవిలో ఇప్పుడు కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. జైట్లీ అనారోగ్యంతో విధులకు దూరంగా ఉన్నప్పుడు తాత్కాలిక ఆర్థిక మంత్రిగా పియూష్ గోయల్ పనిచేశారు. దీంతో ఆర్థిక మంత్రి పదవి గోయల్‌కు దక్కవచ్చని గతంలో ఊహాగానాలు వినిపించాయి. ఆసియాలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన ఇండియాకు ఆర్థిక మంత్రిగా పనిచేసి, వృద్ధిని పరుగులు పెట్టించాలంటే అనుభవం అవసరం. అయితే ఇప్పుడు పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న అమిత్‌షా ఇప్పుడు కేబినెట్లోకి రావడంతో కీలకమైన ఆర్థిక శాఖను ఆయన పార్టీ మాదిరే నేర్పుగా నడిపిస్తారని అంటున్నారు. గత ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా పనిచేసిన సుష్మా స్వరాజ్ కూడా ఆరోగ్య సమస్యల కారణంగానే ఈసారి పదవి చేపట్టబోవడం లేదు. దీంతో విదేశాంగ శాఖకు కూడా కొత్త మంత్రి రానున్నారు. గతంలో విదేశాంగ శాఖ కార్యదర్శిగా పనిచేసిన జైశంకర్ 2018లో ఉద్యోగం నుంచి పదవీ విరమణ పొంది ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలో చేరారు. అమెరికా, చైనాలకు భారత రాయబారిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. దీంతో సుష్మ స్థానాన్ని జైశంకర్‌కు ఇవ్వొచ్చనే వార్తలు వస్తున్నాయి. అలాగే పియూష్ గోయల్‌కు రైల్వే శాఖను అలాగే ఉంచి, గడ్కరీకి మౌలిక సదుపాయాలు, గజేంద్ర సింగ్ షెకావత్‌కు వ్యవసాయ శాఖ కేటాయించే అవకాశాలున్నట్లు ఢిల్లీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ప్రొటెం స్పీకర్‌గా మేనకా గాంధీ! 17వ లోక్‌సభ ఎన్నికల్లో తాత్కాలిక స్పీకర్‌గా మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు మేనకా గాంధీ ఉంటారని పార్టీ వర్గాలు అంటున్నాయి. మేనకాగాంధీ తాజా ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్పూర్ నుంచి గెలుపోందారు. గత ప్రభుత్వంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఆమె పనిచేశారు. ఇప్పుడు ప్రొటెం స్పీకర్‌గా ఆమె ఉండే అవకాశం ఉందని పార్టీ నేతలు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత లోక్‌సభ తొలి సమావేశానికి మాత్రమే స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తించే అధికారం ప్రొటెం స్పీకర్‌కు ఉంటుంది. అలాగే లోక్‌సభకు స్పీకర్, ఉపస్పీకర్‌ను ఎన్నుకునే సమయంలోనూ ప్రొటెం స్పీకరే సభను నడిపిస్తారు. -
మోదీ కేబినెట్ @ 58
న్యూఢిల్లీ: భారత ప్రధానిగా నరేంద్ర మోదీ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కారీ, ఎస్.జయశంకర్ సహా మొత్తం 58 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో 25 మంది కేబినెట్ మంత్రులు కాగా.. స్వతంత్ర హోదా కలిగిన మంత్రులు 9 మంది, సహాయ మంత్రులు 24 మంది ఉన్నారు. 2014లో బీజేపీ పగ్గాలు చేపట్టి పార్టీ విస్తరణకు కృషి చేయడంతో పాటు ఇటీవలి ఎన్నికల్లో పార్టీ అఖండ విజయానికి తోడ్పడిన అమిత్ షా కేబినెట్లో చేరడం తొలినుంచీ ఊహించిందే అయినా..ఆశ్చర్యకరంగా మోదీకి సన్నిహితుడిగా భావించే విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి జయశంకర్‌కు మంత్రివర్గంలో స్థానం లభించింది. రాష్ట్రపతి భవన్ ఎదుటి ఆవరణలో వేడుకలా జరిగిన ఈ కార్యక్రమంలో 68 ఏళ్ల మోదీతో రాష్ట్రపతి కోవింద్ పదవీ స్వీకార, గోప్యత పరిరక్షణ ప్రమాణం చేయించారు. ‘దేశానికి సేవ చేసే గౌరవం దక్కింది’ అని వరసగా రెండోసారి ప్రధాని పీఠాన్ని అధిరోహించిన మోదీ ట్వీట్ చేశారు. కాగా అమిత్ షా, రాజ్‌నాథ్, గడ్కారీ, సదానంద గౌడ, నిర్మలా సీతారామన్, పాశ్వాన్, నరేంద్ర తోమర్, రవిశంకర్ ప్రసాద్, స్మృతీ ఇరానీ, జవదేకర్, గోయల్, నఖ్వీ తదితరులు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మిత్రపక్షాలైన అకాలీదళ్ (హర్సిమ్రాత్ కౌర్ బాదల్), శివసేన (అర్వింద్ సావంత్), ఎల్జేపీ (పాశ్వాన్)లకు కేబినెట్ హోదా మంత్రి పదవులు లభించాయి. తెలంగాణకు ప్రాతినిధ్యం సంతోష్‌గంగ్వార్, రావ్ ఇంద్రజీత్ సింగ్, జితేంద్ర సింగ్, కిరెన్ రిజిజు తదితరులు స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రులుగా, తెలంగాణకు చెందిన జి.కిషన్‌రెడ్డితో పాటు ఫగ్గాన్ సింగ్ కులస్తే, అశ్వినీకుమార్ చౌబే, పర్షోత్తమ్ రూపాలా, రామ్‌దాస్ అథావలే, సాధ్వి నిరంజన్ జ్యోతి, బాబుల్ సుప్రియో తదితరులు సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. మోదీ గత ప్రభుత్వంలో కీలక శాఖలు నిర్వహించిన సుష్మాస్వరాజ్, రాజ్యవర్ధన్ రాథోడ్, మేనకా గాంధీలు కొత్త మంత్రివర్గంలో లేరు. సురేష్ ప్రభు, జేపీ నడ్డాలకు చోటు దక్కలేదు. అమిత్ షా స్థానంలో నడ్డా బీజేపీ అధ్యక్షుడయ్యే అవకాశం ఉంది. అనారోగ్యం కారణంగా సుష్మాస్వరాజ్ ఇటీవలి ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యానే కేబినెట్లో చేరలేనని పేర్కొంటూ మరో సీనియర్ మంత్రి జైట్లీ బుధవారం మోదీకి లేఖ రాసిన సంగతి విదితమే. అయితే ఈసారి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి కేబినెట్లో తిరిగి చోటు సంపాదించుకోగలిగారు. మాజీ దౌత్యవేత్త అయిన పూరితో పాటు జైశంకర్ ఆరు నెలల్లోగా పార్లమెంటుకు ఎన్నిక కావాలి. పాశ్వాన్ ఏ సభలోనూ సభ్యులు కాదు. గత ఏడాదే ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) నుంచి రిటైర్ అయిన జైశంకర్ ఓ ప్రధాన మైలురాయి వంటి భారత్–అమెరికా అణు ఒప్పందంపై చర్చలు జరిపిన బృందంలో కీలక సభ్యుడు. కేబినెట్లో ఆరుగురు మహిళలకు అవకాశం దక్కింది. మోదీ గత మంత్రివర్గంలో 8 మంది మహిళలు ఉండటం గమనార్హం. షా, జైశంకర్‌తో పాటు 20 మంది (1/3) కొత్త వారున్నారు. గరిష్టంగా ఉత్తరప్రదేశ్ నుంచి 9 మందికి చోటు లభించింది. బీజేపీ 18 సీట్లు గెలుచుకున్న పశ్చిమబెంగాల్లో ఇద్దరికి (బాబుల్ సుప్రియో, దేబశ్రీ చౌధురి) అవకాశం ఇచ్చారు. కర్ణాటక నుంచి మళ్లీ ముగ్గురికే మోదీ అవకాశం ఇచ్చారు. పాత మంత్రుల్లో ఒకరిని కొనసాగించి, తొలగించిన ఇద్దరి స్థానంలో కొత్తవారిని తీసుకున్నారు. మొత్తం మీద గత మంత్రివర్గంలో ఉన్న 37 మంది మళ్లీ అవకాశం చేజిక్కించుకున్నారు. గాంధీ, వాజ్‌పేయికి మోదీ నివాళులు గురువారం ఉదయం జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని వాజ్‌పేయిలకు మోదీ ఘన నివాళులర్పించారు. ఇక్కడి ఇండియా గేట్ పక్కనే ఉన్న యుద్ధ స్మారకం వద్ద పుష్పగుచ్ఛం ఉంచారు. ఉదయం ఏడు గంటల సమయంలో ప్రధాని రాజ్‌ఘాట్‌ను సందర్శించారు. అక్కడి నుంచి కమలాకృతిలో తీర్చిదిద్దిన వాజ్‌పేయి సమాధి సదైవ్ అటల్ వద్దకు వెళ్లారు. అధ్యక్షుడు అమిత్ షాతో పాటు పలువురు సీనియర్ బీజేపీ నేతలు ఆయనతో ఉన్నారు. ఈ ఏడాది గాంధీ 150వ జయంతిని జరుపుకుంటున్నామని, ఈ ప్రత్యేక సందర్భం.. బాపూజీ ఉదాత్త సిద్ధాంతాలు మరింత ప్రజాదరణ పొందేలా చేయాలని, బడుగు, బలహీనవర్గాలకు సాధికారత కల్పన దిశగా మనలో ఉత్సాహాన్ని కొనసాగింపజేయాలని మోదీ ఆకాంక్షించారు. వాజ్‌పేయి ఉండి ఉంటే ప్రజలకు సేవ చేసేందుకు బీజేపీకి లభించిన గొప్ప అవకాశాన్ని చూసి బాగా ఆనందించేవారన్నారు. అటల్జీ జీవితం, ఆయన కార్యదక్షత ఇచ్చిన స్ఫూర్తితో ప్రజల జీవితాల్లో మరింత మార్పు తెచ్చేందుకు, మరింత మంచి పరిపాలన అందించేందుకు కృషి చేస్తామని గురువారం నాటి వరుస ట్వీట్లలో మోదీ పేర్కొన్నారు. కర్తవ్య నిర్వహణలో ధైర్య సాహసాలు ప్రదర్శించి అమరులైన వారిని చూసి దేశం గర్విస్తోందని తెలిపారు. కేబినెట్లో చేరని జేడీ(యూ) బీజేపీ ప్రధాన మిత్రపక్షం జేడీ(యూ) కేంద్ర కేబినెట్లో చేరలేదు. ఆ పార్టీకి మంత్రి పదవుల విషయంలో తలెత్తిన విభేదాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. వాస్తవానికి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కేబినెట్ బెర్తుల విషయంలో చివరి నిమిషం వరకు అమిత్ షాతో చర్చలు జరిపారు. అయితే ‘మోదీ ప్రభుత్వంలో మేము చేరడం లేదు. ఇది మా నిర్ణయం..’ అని జేడీ(యూ) అధికార ప్రతినిధి పవన్ వర్మ చెప్పారు. ప్రమాణ స్వీకారానికి కొద్దిసేపటి ముందు నితీశ్ కూడా బీజేపీ ఆఫర్‌ను తిరస్కరించినట్లు ప్రకటించారు. అయితే ఎన్డీయేకి నమ్మకమైన భాగస్వామిగా కొనసాగుతామని ఆయన స్పష్టం చేశారు. ఆ పార్టీకి బీజేపీ ఒకేఒక్క మంత్రి పదవి ఆఫర్ చేసిందని, పైగా ఇవ్వజూపిన శాఖ కూడా జేడీ(యూ)ని అసంతృప్తికి గురిచేసిందని సమాచారం. ఇటీవలి ఎన్నికల్లో జేడీ(యూ) 16 సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే. నితీశ్‌కుమార్ సారథ్యంలోని జేడీ(యూ) 2017లోనే బీజేపీతో జట్టు కట్టినా మోదీ మొదటి ప్రభుత్వంలో కూడా చేరలేదు. 543 మంది సభ్యులున్న లోక్‌సభలో దాదాపు 80 మంది వరకు మంత్రులను తీసుకునే అవకాశం ఉంది. రాజ్యాంగం ప్రకారం ప్రధానితో కలిపి మొత్తం కేంద్ర మంత్రుల సంఖ్య మొత్తం లోక్‌సభ సభ్యుల్లో 15 శాతానికి మించి ఉండటానికి వీల్లేదు. మోదీ సర్కార్ 2.0 ఇదే గురువారం ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్ ప్రాంగణంలోని ప్రమాణ స్వీకార వేదికపై నూతన కేబినెట్ మంత్రులతో రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కార్యక్రమంలో ముందు వరసలో కూర్చున్న సీజేఐ గొగోయ్, మాజీ ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారాన్ని గుజరాత్‌లోని గాంధీనగర్‌లో తన ఇంట్లో కూర్చొని టీవీలో చూస్తున్న తల్లి హీరాబా -
తెలంగాణ, ఏపీ అభివృద్ధికి కృషి చేస్తా
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించేందుకు తన వంతు కృషి చేస్తానని కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం జి. కిషన్‌రెడ్డి తెలిపారు. కేంద్ర మంత్రిగా గురువారం ఢిల్లీలో ప్రమాణస్వీకారం అనంతరం ఆయన తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ‘తెలంగాణ రాష్ట్రం నుంచి మొదటిసారిగా నలుగురు బీజేపీ అభ్యర్థులను ఎంపీలుగా గెలిపించినందుకు ప్రధాని మోదీ తరఫున, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తరఫున తెలంగాణ ప్రజలకు వందనాలు తెలియజేస్తున్నా. ప్రత్యేకంగా నన్ను సికింద్రాబాద్ నుంచి గెలిపించిన ఓటర్లకు పాదాభివందనం చేస్తున్నా. కేంద్ర మంత్రిగా నాకు మోదీ ఇచ్చిన బాధ్యతలకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తానని హామీ ఇస్తున్నా. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు సంబంధించి కేంద్ర మంత్రివర్గంలో ఒక తెలుగువాడిగా రెండు రాష్ట్రాల ప్రజలకు మేలు కలిగేలా కేంద్రం తీసుకొనే అన్ని కార్యక్రమాలను సమన్వయం చేసుకొని ముందుకెళ్తా. ప్రమాణస్వీకారం కంటే ముందు మోదీ మాతో మాట్లాడుతూ.. ప్రజలు ఎంతో విశ్వాసంతో పెద్ద బాధ్యత ఇచ్చారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్నికైన∙ప్రజాప్రతినిధులు పనిచేయాలని సూచించారు. వచ్చే వారంలో ప్రారంభం కానున్న 17వ పార్లమెంటు సమావేశాలకు సిద్ధం కావాలన్నారు. కేంద్ర మంత్రివర్గంలో కొత్త వాళ్లకు, పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు స్థానం కల్పించారు. రానున్న రోజుల్లో కార్యకర్తలకు మరింత ప్రాధాన్యమిచ్చి సిద్ధాంతాల ఆధారంగా పనిచేసే వారిని ప్రోత్సహిస్తాం. పార్టీని విస్తరిస్తాం. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ స్థానాన్ని తెలంగాణలో బీజేపీ భర్తీ చేసింది. అధికార టీఆర్ఎస్కు బీజేపీయే ప్రత్యామ్నాయంగా ఉంటుంది’ అని పేర్కొన్నారు. ‘అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం’ సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో గత ఐదేళ్లలో కేంద్రం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిందని, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ నిధులను, పథకాలను దారి మళ్లించి ప్రజలను మోసం చేసిందని బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీతోనే తెలంగాణకు మరిన్ని పథకాలు, నిధులు వస్తాయని భావించి ప్రజలు తమను గెలిపించారన్నారు. ఇక నుంచి మరింత బాధ్యతాయుతంగా పనిచేస్తూ అభివృద్ధి అంటే ఏంటో ఇప్పుడు చూపిస్తామని పేర్కొన్నారు. -
కార్యకర్త నుంచి కేంద్ర మంత్రి దాకా...
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్ : బీజేపీ కార్యకర్తలంతా ‘కిషనన్నా’అని ఆప్యాయంగా పిలుచుకునే గంగాపురం కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రి అయ్యారు. సికింద్రాబాద్ ఎంపీగా గెలుపొందిన ఆయనకు అంతా ఊహించినట్లే ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్లో కేంద్ర సహాయ మంత్రిగా అవకాశం లభించింది. తెలంగాణ నుంచి నలుగురు బీజేపీ ఎంపీలు గెలుపొందగా.. దాదాపు నాలుగు దశాబ్దాలుగా పార్టీతో అనుబంధం ఉన్న కిషన్‌రెడ్డిని మంత్రి పదవి వరించింది. మంత్రివర్గంలో చోటు లభించిన విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గురువారం మధ్యాహ్నం 12 గంటలకు కిషన్‌రెడ్డికి ఫోన్లో తెలియపరిచారు. గురువారం రాత్రి రాష్ట్రపతి భవన్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రిగా కిషన్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. తలపాగా ధరించి వచ్చిన ఆయన హిందీలో ప్రమాణం చేశారు. 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్‌పేట నుంచి పోటీ చేసి ఓడిపోయిన కిషన్‌రెడ్డి... లోక్‌సభ ఎన్నికల్లో 62,144 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించి సత్తా నిరూపించుకున్నారు. ఆయన సేవలను గుర్తించిన బీజేపీ కేంద్ర కేబినెట్లో ఆయనకు స్థానం కల్పించింది. బీజేపీ ఆవిర్భావ సమయంలో సాధారణ కార్యకర్తగా పార్టీలో చేరిన ఆయన అంచలంచెలుగా ఎదిగారు. పార్టీ అప్పగించిన ప్రతి పని, బాధ్యతను శ్రద్ధతో నిర్వర్తించే కిషన్‌రెడ్డి క్రమశిక్షణగల పార్టీ నాయకుడిగా పేరుతెచ్చుకున్నారు. సాధారణ రైతు కుటుంబం నుంచి.. రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌లో 1964 మే 15న సాధారణ రైతు కుటుంబంలో కిషన్‌రెడ్డి జన్మించారు. ఆయన తండ్రి స్వామిరెడ్డి, తల్లి ఆండాళమ్మ. జయప్రకాశ్ నారాయణ స్ఫూర్తితో 1977లో జనతా పార్టీలో కార్యకర్తగా చేరారు. 1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం తర్వాత... యువ మోర్చా రంగారెడ్డి కమిటీ కన్వీనర్‌గా క్రియాశీలకంగా పనిచేశారు. అంచెలంచెలుగా ఎదిగిన ఆయన 1986లో బీజేవైఎం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షునిగా నియమితులయ్యారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడిగా వివిధ స్థాయిల్లో పనిచేసి 2002లో యువ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అంతర్జాతీయ స్థాయిలో సదస్సులు నిర్వహించారు. రాష్ట్ర, జాతీయ పార్టీలోనూ పలు బాధ్యతలు చేపట్టిన ఆయన... 2010లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. మరోవైపు 2004 శాసనసభ ఎన్నికల్లో హిమాయత్‌నగర్ నుంచి కిషన్‌రెడ్డి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. నియోజకవర్గాల పునర్విభజనలో హిమాయత్‌నగర్ అంబర్‌పేటలో విలీనమవడంతో 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్‌పేట నుంచి పోటీ చేసి గెలుపొందారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, శాసనసభాపక్ష నేతగా పార్టీ అభివృద్ధికి కృషి చేశారు. 2018లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో 1,016 ఓట్ల తేడాతో ఓడిపోయినా లోక్‌సభ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించారు. తెలంగాణకు ప్రాధాన్యం.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించిన అమిత్ షా నాయకత్వంలో నాలుగు స్థానాలను గెలుచుకుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తెలంగాణకు సముచిత స్థానం కల్పించేందుకు సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిచిన కిషన్‌రెడ్డికి కేంద్ర మంత్రివర్గంలో అవకాశం కల్పించింది. గతంలో ఇదే స్థానం నుంచి బీజేపీ ఎంపీగా గెలిచిన బండారు దత్తాత్రేయకు కేంద్ర మంత్రి పదవి దక్కింది. అయితే అనూహ్యంగా మధ్యలో ఆ పదవి నుంచి ఆయన్ను తప్పించారు. అప్పటి నుంచి తెలంగాణకు కేంద్ర మంత్రివర్గంలో ప్రాధాన్యం లేనట్లయింది. మళ్లీ ఇప్పుడు అదే స్థానం నుంచి గెలిచిన కిషన్‌రెడ్డికి మంత్రి పదవి ఇచ్చింది. మోదీతో ప్రత్యేక అనుబంధం... ప్రధాని నరేంద్ర మోదీతో కిషన్‌రెడ్డికి ప్రత్యేక అనుబంధం ఉంది. బీజేవైఎం జాతీయ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి పనిచేసిన సమయంలో మోదీకి దగ్గరయ్యారు. అప్పట్లో బీజేపీ జాతీయ నేతలంతా కలసి పర్యటించిన నేపథ్యంలో మోదీ, కిషన్‌రెడ్డి ఒకే గదిలో బస చేసిన సందర్భం ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అలా వారిద్దరి మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. కిషన్‌రెడ్డికి కేంద్ర మంత్రి పదవి దక్కడానికి అది కూడా ఒక కారణం. మొత్తానికి కేంద్ర మంత్రి పదవికి కిషన్‌రెడ్డి పేరు ఖరారు కావడంతో పార్టీ శ్రేణుల్లో, ఆయన అభిమానుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. కిషన్‌రెడ్డి కుటుంబ, రాజకీయ నేపథ్యమిదీ... జననం : మే 15, 1964 తల్లిదండ్రులు: స్వామిరెడ్డి, ఆండాళమ్మ భార్య: కావ్య, పిల్లలు: వైష్ణవి, తన్మయ్ రాజకీయ ప్రవేశం: 1977లో జయప్రకాశ్ నారాయణ స్ఫూర్తితో జనతా పార్టీలో చేరిక 1980 : భారతీయ జనతా పార్టీ పూర్తికాల కార్యకర్తగా నమోదు 1980 - 83 : యువ మోర్చా రంగారెడ్డి కమిటీ కోశాధికారి, కన్వీనర్ 1986 - 90 : యువ మోర్చా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు 1990 - 92: యువ మోర్చా జాతీయ కార్యదర్శి 1992 - 94: యువ మోర్చా జాతీయ ఉపాధ్యక్షుడు 1994 - 2001: యువ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి 2001 - 02: బీజేపీ రాష్ట్ర కార్యదర్శి 2002: యువ మోర్చా జాతీయ అధ్యక్షుడు 2003 - 05: బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రధాన కార్యదర్శి 2004: మొదటిసారిగా హిమాయత్‌నగర్ ఎమ్మెల్యేగా ఎన్నిక 2010 - 14: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు 2009, 2014: అంబర్‌పేట ఎమ్మెల్యే 2018: అంబర్‌పేట అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి 2019: సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా విజయం -
మనం పరమ భక్తులం కదా!
గాంధీని చంపిన 71 సంవత్సరాల తరువాత గాంధీని, హత్యచేసిన గాడ్సేను చిరస్మరణీయులంటున్నాం. ఓం గాంధీ దేవా యనమః అని ఒక చోట అంటుంటే నాథూరాం గాడ్సే నమోస్తుతే అని మరో చోట అంటున్నాం. గాంధీ వల్లనే దేశ విభజన జరిగిందనీ, చాలామంది సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ను కోరుకున్నా గాంధీ కావాలని నెహ్రూను ప్రథాని చేయడం వల్లనే దేశం అన్ని అనర్థాలకు గురైందని, నెహ్రూ వల్ల పాకిస్తాన్, చైనాలు కాశ్మీర్ భూభాగాన్ని ఆక్రమించుకున్నాయని నమ్మించే ప్రచారం విపరీతం. రాహుల్ గాంధీనుంచి వెనక్కి, ఇంకా వెనక్కి వెళ్లి, ఆయన తండ్రిని తాతను ముత్తాతను, గాంధీని కూడా నిందించడమే ఎజెండా. ఆ వీడియోలు, ఆడియోలు ఉపన్యాసాలు, సోషల్ మీడియాలో గుప్పించారు. ముస్లింలను బుజ్జగించే రాజకీయాలు కాంగ్రెస్ అనుసరించిందని విమర్శలు కూడా పద్ధతి ప్రకారం జనంలో ప్రవేశ పెట్టారు. దక్షిణాదిన కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన సినీ నటుడు కమల్ హాసన్ స్వతంత్ర భారతదేశంలో తొలి టెర్రరిస్టు హిందువనీ, అతని పేరు నాథూరాం గాడ్సే అనీ, ఆరకంగా టెర్రరిజం ప్రారంభమైందని మే 12న తమిళనాడులో చేసిన వ్యాఖ్య సంచలనం కలిగించింది. బీజేపీ తరఫున భోపాల్ నుంచి పోటీ చేసిన, హిందూ టెర్రరిజం నిందితురాలు సా«ధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ దీనికి నాలుగురోజుల తరువాత స్పందించారు. గాంధీని చంపిన గాడ్సే దేశ భక్తుడని, అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ దేశభక్తుడే అని తన భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. ఆమె కమలంతో గెలిచారు. కమల్ పార్టీ ఓడిపోయింది. చిత్రమేమంటే గాడ్సేను మొదటి టెర్రరిస్టు అని వర్ణించిన కమల్ హాసన్ తానే రచించి, నటించి, దర్శకత్వం వహించిన హే రాం అనే సినిమాలో గాంధీని చంపడానికి సాకేత్ రాం అయ్యంగార్ అనే యువకుడు ప్రయత్నించినట్టు చిత్రించారు. 2000 లో వచ్చిన ఈ సినిమాలో సాకేత్ కూడా గాడ్సే వలెనే ఆలోచిస్తుంటాడు. ఈ కాల్పనిక చారిత్రిక చిత్రాన్ని నిర్మించిన కమల్ హాసన్ కొంత వరకు గాడ్సే ఆలోచనలను సమర్థించినట్టే కదా. కనీసం గాడ్సే వలె ఇంకా మరికొందరు ఆలోచించారని చెప్పడానికి ప్రయత్నించినట్టే కదా? సినిమా వ్యాపారం కోసం గాడ్సే ఆలోచనలను సినిమా పొడుగునా సమర్థించి చివరకు మనసు మార్చుకున్నట్టు చూపిన కమల్ హాసన్‌కు గాడ్సే టెర్రరిస్టు అని చెప్పే నైతిక హక్కు ఉందా? సినిమా డబ్బుకోసం, ఎన్నికల ఓట్లకోసం గాడ్సేను వాడుకుంటారా? ఇక హత్యకేసులో నిందితురాలైన ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ దృష్టిలో గాడ్సే దేశభక్తుడు. ఇంకా కేసు ముగియకముందే ఆమెను బీజేపీ తన అభ్యర్థిగా ఎంపిక చేసి భోపాల్ నుంచి గెలిపించుకున్నది. గాంధీని హత్య చేసిన తరువాత కింది కోర్టులో గాడ్సేకు ఉరిశిక్ష పడింది. ఆయన హత్య చేయలేదని బుకాయించలేదు. రుజువులు చాలవని తనను విడుదల చేయా లని లాయర్లకు చెప్పి అబద్దపు వాదనలు చేయించలేదు. ఉరిశిక్షను ధృవీకరించడం కోసం కేసు హైకోర్టుకు వచ్చింది. ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం అప్పీలు విచారించింది. వారిలో ఒక న్యాయ మూర్తి జిడి ఖోస్లా 1965లో ఒక పుస్తకం రచించారు. అందులో గాడ్సే తన చర్యకు పశ్చాత్తాప పడ్డాడనీ, తనకు బతికే అవకాశం ఉంటే శాంతి కోసం కృషి చేస్తానని దేశ సేవ చేస్తానని అనుకున్నారని న్యాయమూర్తి వివరించారు. గాంధీ తన దారి మార్చుకోలేదు. గాడ్సే తన నిర్ణయం మార్చుకోలేదు. 71 ఏళ్ల తరువాత దేన్నయినా మార్చుకునే సామర్థ్యం, సాహసం చేయగల ఇప్పటి ఆధునిక నాయకులతో వారిని పోల్చడానికి వీల్లేదు. కమల్ తన ప్రకటనను మార్చారు. నేను గాడ్సేను టెర్రరిస్టు అనలేదని, తీవ్రవాది అన్నానని కమల్ మాట మార్చారు. ప్రజ్ఞ తన మాట మార్చారు. క్షమాపణలు కోరి ఆ ప్రకటనను ఉపసంహరించుకుంటున్నానని చెప్పారు. ప్రథాన మంత్రికి కోపం వచ్చింది. ప్రజ్ఞను తాను క్షమించబోనని చెప్పారు. ఈ మాట చెప్పడానికి ఎన్నడూ లేంది, డిల్లీలో అయిదేళ్లలో తొలిసారి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు ప్రథాని. క్షమించడం సంగతి పక్కన బెడితే, ప్రజ్ఞ బీజేపీ ఎంపీగా కొనసాగడం, ఆమెగారు నరేంద్ర మోదీ నాయకత్వాన్ని సమర్థించడం జరిగిపోతూనే ఉంటుంది. మనకు గాంధీతోపాటు గాడ్సే కూడా దేవుడు. గాంధీకి గాడ్సేకు కూడా గుడులు కడతారు. సోనియా గాంధీ, ఖుష్బూ, అమితాబ్, సచిన్‌లకు కూడా గుడులు కడతారు. జనం, ఓటర్లు భక్తులు, ఒకే గాటన పోతూ ఉంటారు. వీళ్లకు ఎడమచేతితో వందమందిని పిట్టల్ని చంపినట్టు చంపే హీరోలు కావాలి. చిటికెలో మాయచేసి సమస్యలు పరిష్కరించే దైవిక శక్తులున్న నాయకులు ఉంటారని వస్తారని, వచ్చా రని వారిచేతుల్లో మంత్రదండాలు ఉంటాయని, వీర బ్రహ్మంగారు వీరిగురించే చెప్పారని, నోస్ట్రాడామస్ చెప్పిందీ ఇదే అని అంటారు. భక్తితో భజనలు చేస్తారు. మనం పరమభక్తులం మరి. మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
మోదీతో సహా కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారం
-
నరేంద్ర మోదీ డ్రీమ్ టీమ్ ఇదే...
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డ్రీమ్ టీమ్ ప్రమాణ స్వీకారం చేసింది. భారత ప్రధానమంత్రిగా మోదీ రెండోసారి అంతఃకరణ శుద్ధితో దైవసాక్షిగా ప్రమాణం చేశారు. మోదీ భారతదేశానికి 16వ ప్రధాని. మోదీ ప్రమాణస్వీకారం చేసిన అనంతరం కేంద్ర మంత్రిగా రాజ్ నాథ్ సింగ్ ప్రమాణస్వీకారం చేశారు. కాగా కేబినెట్ కూర్పుపై ప్రధాని మోదీతో పాటు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సుదీర్ఘంగా చర్చలు జరిపినా చివరి వరకూ గోప్యత పాటించారు. 58మందితో నరేంద్ర మోదీ మంత్రివర్గం కొలువుతీరింది. మోదీతో సహా 25మంది కేంద్ర మంత్రులు, స్వతంత్ర హోదాలో 9మంది సహాయ మంత్రులు, 24 సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే శాఖల కేటాయింపు ఇంకా జరగలేదు. కాగా గత మంత్రివర్గంలో 25మంది కేంద్రమంత్రులుగా, 11 సహాయ (స్వతంత్ర), 40 సహాయ మంత్రులుగా ఉన్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : మోదీతో సహా కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారం కేంద్రమంత్రులు... 1. నరేంద్ర మోదీ (ప్రధానమంత్రి) 2. రాజ్‌నాథ్ సింగ్ 3. అమిత్ షా 4. నితిన్ గడ్కరీ 5. సదానంద గౌడ 6. నిర్మలా సీతారామన్ 7. రాంవిలాస్ పాశ్వాన్ 8. నరేంద్ర సింగ్ తోమర్ 9. రవిశంకర్ ప్రసాద్ 10. హర్సిమ్రత్ కౌర్ బాదల్ 11. థావర్ చంద్ గెహ్లాట్ 12. సుబ్రహ్మణ్యం జయశంకర్ 13. రమేశ్ పోఖ్రియాల్ 14. అర్జున్ ముండా 15. స్మృతి ఇరానీ 16. డాక్టర్ హర్షవర్థన్ 17. ప్రకాశ్ జవదేకర్ 18. పీయూష్ గోయల్ 19. ధర్మేంద్ర ప్రధాన్ 20. ముఖ్తార్ అబ్బాస్ నక్వీ 21. ప్రహ్లాద్ జోషీ 22. మహేంద్రనాథ్ పాండే 23. అరవింద్ సావంత్ 24. గిరిరాజ్ సింగ్ 25. గజేంద్ర సింగ్ షెకావత్ సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా) 1. సంతోష్ గాంగ్వర్ 2. రావ్ ఇందర్జీత్ సింగ్ 3. శ్రీపాద యశో నాయక్ 4. జితేంద్ర సింగ్ (సహాయ మంత్రి) 5. కిరణ్ రిజిజు (సహాయ మంత్రి) 6. ప్రహ్లాద్ సింగ్ పటేల్ (సహాయ మంత్రి) 7. రాజ్ కుమార్ సింగ్ (సహాయ మంత్రి) 8. హర్దీప్ సింగ్ పూరీ (సహాయ మంత్రి) 9. మన్సూఖ్ మాండవియా (స్వతంత్ర సహాయ మంత్రి) సహాయ మంత్రులు 1. ఫగ్గీన్ సింగ్ కులస్తే 2.. అశ్వినీ చౌబే 3. అర్జున్ రామ్ మేఘవాల్ 4. జనరల్ వీకే సింగ్ 5. కిృషన్ పాల్ గుజ్జర్ 6. దాదారావ్ పాటిల్ 7. కిషన్ రెడ్డి 8. పురుషోత్తం రూపాలా 9. రాందాస్ అథవాలే 10. సాధ్వీ నిరంజన్ జ్యోతి 11. బాబుల్ సుప్రియో 12. సంజీవ్ కుమార్ బాల్యాన్ 13. దోత్రే సంజయ్ శ్యారావ్ 14. అనురాగ్ సింగ్ ఠాకూర్ 15. సురేష్ అంగాడి 16. నిత్యానంద్ రాయ్ 17. రత్తన్ లాల్ కఠారియా 18. వి.మురళీధరన్ 19. రేణుకా సింగ్ 20. సోమ్ ప్రకాశ్ 21. రామేశ్వర్ తెలి 22. ప్రతాప్ చంద్ర సారంగి 23. కైలాస్ చౌదరి 24. దేవశ్రీ చౌదురి -
చప్పట్లు కొడుతూ మోదీ తల్లి హర్షాతిరేకం..
సాక్షి, అహ్మదాబాద్ : కుమారుడి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ తన నివాసంలోనే టీవీలో వీక్షించారు. మోదీ సోదరుడు పంకజ్ కూడా తల్లితో కలిసి ఈ వేడుకను తిలకించారు. గాంధీనగర్ సమీపంలోని రాయ్సన్ గ్రామంలో ఆమె తన నివాసంలో టీవీలో చూస్తూ... కొడుకు ప్రధానిగా ప్రమాణం చేస్తుండగా చప్పట్లు కొట్టి మురిసిపోయారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఆదివారం నరేంద్ర మోదీ గుజరాత్ వెళ్లి తల్లి వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్న విషయం తెలిసిందే.ఈ సందర్భంగా తల్లికి పాదాభివందనం చేసి, కాసేపు ఆమెతో గడిపారు. -
25 మంది నూతన కేబినెట్ మంత్రులు
సాక్షి, న్యూఢిల్లీ : దేశం యావత్తు ఉత్సాహంగా ఎదురుచూస్తున్న ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం ప్రారంభమైంది. భారత ప్రధానిగా వరుసగా రెండోసారి నరేంద్ర దామోదర్ దాస్ మోదీ దైవ సాక్షిగా ప్రమాణ చేశారు. రాష్ట్రపతి భవన్ ఎదుటి ఆవరణలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి కోవింద్ మోదీతో ప్రమాణం చేయించారు. దేశ, విదేశీ ప్రభుత్వాధినేతలు, ప్రముఖులు, కార్పొరేట్ దిగ్గజాలు వంటి సుమారు 8 వేల మంది విశిష్ట అతిథులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మోదీతో సహా 25 మంది కేబినెట్ మంత్రులుగా, 9 మంది స్వతంత్ర సహాయ మంత్రులుగా, 24 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. సహాయమంత్రులుగా.. ఫాగిన్‌సింగ్ కులస్తే, అశ్వని చౌబే, అర్జున్‌రామ్ మేఘ్వాల్, వీకే సింగ్, కిషన్‌పాల్ గుర్జార్, దాదారావ్ పాటిల్, జి.కిషన్ రెడ్డి, పరుషోత్తమ్ రూప్లా, రామ్‌దాస్ అథవాలే, సాధ్వి నిరంజన్ జ్యోతి, బాబుల్ సుప్రియో, సంజీవ్‌కుమార్ బాల్యన్, సంజయ్ శామ్రావ్ దోత్రే, అనురాగ్‌సింగ్ ఠాకూర్, సురేష్ అంగాడిచెన్నబసప్ప, నిత్యానంద్రాయ్, రతన్‌లాల్ కటారియా, వి.మురళీదరన్, శ్రీమతి రేణుకాసింగ్ సార్తా, సోమ్‌ప్రకాశ్, రామేశ్వర్ తేలి, ప్రతాప్‌చంద్ర సారంగి, కైలాష్ చౌదరీ, శ్రీమతి దేబర్సీ చౌదురీ ప్రమాణం చేశారు. స్వతంత్ర హోదా సహాయమంత్రులుగా.. సంతోష్ గంగ్వార్, రావ్ ఇంద్రజీత్‌సింగ్, శ్రీపాద నాయక్ ,జితేంద్రసింగ్, కిరన్ రిజిజు, ప్రహ్లాద్‌సింగ్ పటేల్, రాజ్‌కుమార్ సింగ్, హర్దీప్సింగ్ పూరి, మన్సూ్‌ఖ్ మాండవీయ కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. కేబినెట్ మంత్రులుగా.. రాజ్‌నాథ్‌సింగ్, అమిత్‌షా, నితిన్ గడ్కరీ, సదానంద గౌడ, శ్రీమతి నిర్మలా సీతారామన్, రామ్‌విలాస్ పాశ్వాన్, నరేంద్రసింద్ తోమర్, రవిశంకర్ ప్రసాద్, శ్రీమతి హర్‌సిమ్రత్‌కౌర్ బాదల్, థావర్‌చంద్ గెహ్లాట్, సుబ్రమణ్యం జయశంకర్, రమేష్ పోఖ్రియాల్, అర్జున్ ముండా, శ్రీమతి స్మృతి ఇరానీ, డాక్టర్ హర్షవర్థన్, ప్రకాశ్ జవదేకర్, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, ప్రహ్లాద్ జోషి, డాక్టర్ మహేంద్రనాథ్ పాండే, అరవింద్ సావంత్, గిరిరాజ్‌సింగ్, గజేంద్రసింగ్ షెకావత్ ప్రమాణం చేశారు. ప్రధాని మోదీ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఆయనతోపాటు కేంద్రమంత్రులుగా ప్రమాణం చేస్తారని భావిస్తున్న.. అరవింద్ సావంత్, అనుప్రియ పాటిల్, రతన్ లాల్ కటారియా, రమేష్ పోఖ్రియాల్ నిషాంక్, ఆర్సీపీ సింగ్, జి కిషన్ రెడ్డి, సురేష్ అంగడి , ఏ రవీంద్రన్, కైలాష్ చౌదరి , ప్రహ్లాద్ జోషి , సోమ్ ప్రకాష్ , రామేశ్వర్ తెలీ, సుబ్రత్ పాథక్, దేబశ్రీ చౌదరిరీటా, బహుగుణ జోషి సభా ప్రాంగణానికి చేరుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్, సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ తార కంగనా రనౌత్, బీజేపీ సీనియర్ ఎల్కే అద్వానీ తదితరులు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. బిమ్స్టెక్ దేశాధినేతలు.. బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్, శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి, మయన్మార్ అధ్యక్షుడు యు విన్ మియంట్, భూటాన్ ప్రధాని లోటే షెరింగ్ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. థాయ్‌లాండ్‌కు ప్రత్యేక రాయబారి గ్రిసాడ బూన్రాక్ ప్రాతినిధ్యం వహిస్తారు. అలాగే కిర్గిజ్ అధ్యక్షుడు, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ప్రస్తుత చైర్మన్ సూరోన్‌బే జీన్బెకోవ్, మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నాథ్ కార్యక్రమానికి హాజరయ్యారు. -
అలకబూనిన జేడీయూ, కేబినెట్లోకి నో..
సాక్షి, న్యూఢిల్లీ: రెండోసారి ఎన్డీయే సర్కార్ కొలువు తీరకముందే లుకలుకలు మొదలయ్యాయి. బీజేపీ మిత్రపక్షం అయిన జేడీయూ మంత్రివర్గ కూర్పుపై అలకబూనింది. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో ఏర్పడనున్న మంత్రివర్గంలో తమకు ఒకటే మంత్రి పదవి కేటాయించడంపై జేడీయూ అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్ర మంత్రివర్గంలో చేరబోమంటూ ప్రకటన చేసింది. కేవలం మిత్రపక్షంగానే కొనసాగుతామని జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ స్పష్టం చేశారు. కాగా నరేంద్ర మోదీ రెండోసారి ప్రధానమంత్రిగా ఇవాళ రాత్రి 7గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్లో జరిగే ఈ వేడుకలో దేశ, విదేశాల నుంచి వచ్చిన సుమారు 8వేల మంది అతిథులు పాల్గొంటున్నారు. మోదీ కేబినెట్లో మొత్తం 60 మంది మంత్రులు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే 46 మందికి కేబినెట్లో బెర్త్‌లు ఖరారు అయ్యాయి. -
కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవి చూసింది. కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది. మరో వైపు పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ.. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయంలో ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఓ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఓ నెల రోజుల పాటు కాంగ్రెస్ నాయకులేవరు టీవీ చర్చల్లో పాల్గొనకూడదనే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా ట్వీట్ చేశారు. .@INCIndia has decided to not send spokespersons on television debates for a month. All media channels/editors are requested to not place Congress representatives on their shows. — Randeep Singh Surjewala (@rssurjewala) May 30, 2019 ‘ఓ నెల రోజుల పాటు కాంగ్రెస్ అధికార ప్రతినిధులను టీవీ చర్చలకు పంపకూడదని పార్టీ నిర్ణయించింది. ఈ సదర్భంగా అన్ని మీడియా సంస్థలకు, ఎడిటర్స్‌కు ఒక విన్నపం. మీ చానెళ్లలో ప్రసారమయ్యే చర్చా కార్యక్రమాలకు కాంగ్రెస్ నాయకులను ఆహ్వానించకండి’ అంటూ రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా ట్వీట్ చేశారు. అయితే ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారన్న దానిపై కాంగ్రెస్ పార్టీ సరైన వివరణ ఇవ్వలేదు. తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 52 స్థానాల్లో మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. -
ఇక మూక దాడులు ఆగిపోవాల్సిందే!
సాక్షి, న్యూఢిల్లీ : పాలకపక్ష భారతీయ జనతా పార్టీ విజయం సాధించిన మే 23వ తేదీనే, ఓ మహిళతో సహా ముస్లింలను ఓ హిందువుల బృందం చితకబాదుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఆవు మాంసం కలిగి ఉన్నారన్న కారణంగా వారిని కొట్టడమే కాకుండా వారితో హిందూ నినాదాలు చేయించారు. ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే మధ్యప్రదేశ్‌లోని సియోనిలో ఈ సంఘటన జరిగిందని, ఇందులో ఐదుగురు అనుమానితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఫలితాలు వచ్చిన మూడు రోజుల అనంతరం బీహార్‌లోని బెగుసరాయ్‌లో సబ్బులు అమ్ముకునే మొహమ్మద్ ఖాసిం అనే వ్యక్తిని రాజీవ్ యాదవ్ అనే పాత నేరస్థుడు పిస్టల్‌తో కాల్చాడు. పేరేమిటని తనను అడిగాడని, పేరు చెప్పగానే పాకిస్థాన్ వెళ్లకుండా ఇక్కడెందుకున్నావంటూ కాల్చాడని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. (హరియాణా, బిహార్‌ల్లో ముస్లింలపై దాడులు) ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో బీజేపీ గతంలోకన్నా ఎక్కువ మెజారిటీ సీట్లలో అఖండ విజయం సాధించిన అనంతరం ముస్లింలపై, దళితులపై ఐదు దాడుల సంఘటనలు చోటు చేసుకున్నాయి. మే 26వ తేదీన మోదీ కొత్తగా ఎన్నికైన ఎన్డీయే పార్లమెంట్ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ ‘సబ్ కా విశ్వాస్’ నినాదంతో ముందుకు పోదాం అని సూచించారు. ‘మనకు ఓటు వేసిన వారు మన మిత్రులే, మనకు ఓటు వేయని వారు కూడా మిత్రులే’ అంటూ మైనారిటీలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దేశ ఆర్థికాభివద్ధి కోసం కషి చేయడం, దారిద్య్రాన్ని నిర్మూలించడం, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం, ఇతర సామాజిక సమస్యలను పరిష్కరించడం తమ ముందున్న ఎజెండాగా మోదీ చెప్పుకున్నారు. అందుకు ప్రతిబంధకాలైన సామాజక దాడులు తక్షణం ఆగిపోవాలి. మోదీ మొదటి విడత పాలనలా కాకుండా రెండో విడత పాలనంతా దేశాభివద్ధిపైనే కేంద్రీకతం కావాలని సామాజిక శాస్త్రవేత్తలు కోరుతున్నారు. మోదీ ప్రభుత్వం నుంచి ఆశిస్తున్నారు. -
కాంగ్రెస్‌లో సారథ్య సంక్షోభాలు
సాక్షి, న్యూఢిల్లీ : సమర్థుడైన సారథి విషయంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి సంక్షోభంలో చిక్కుకుంది. అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీ తన మనసును మార్చుకునేందుకు సిద్ధంగా లేకపోవడం, అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు గాంధీ కుటుంబం నుంచి మరొకరిని ప్రతిపాదించేందుకు కూడా రాహుల్ సుముఖంగా లేక పోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. 2017లో పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన రాహుల్ గాంధీ పార్టీకి 16వ అధ్యక్షుడు, నెహ్రూ కుటుంబం నుంచి వచ్చిన ఆరవ అధ్యక్షుడు. రాహుల్ గాంధీ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లలో బీజేపీ ప్రభుత్వాలను కూల్చేసి తాను అధికారపగ్గాలను స్వీకరించగలిగింది. అదే ఒరవడితో కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని పార్టీ ఆశించింది. అది జరగ్గపోగా నరేంద్రమోదీ నాయకత్వంలో బీజేపీ గతంలోకన్నా 21 సీట్లను అదనంగా గెలుచుకోవడంతో అందుకు నైతిన బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఇలా సారథ్య సంక్షోభం ఏర్పడడం ఇదే మొదటిసారి కాదు. నాడు సుభాస్ చంద్రబోస్ ఎన్నిక, రాజీనామా 1938లో గుజరాత్‌లోని హరిపురలో జరిగిన కాంగ్రెస్ పార్టీ వార్షిక సమావేశంలో సుభాస్ చంద్రబోస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. జాతిపిత మహాత్మాగాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్ లాంటి పార్టీ సీనియర్ నాయకులు కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని సమర్థించారు. ఏడాది తిరక్కముందే మహాత్మా గాంధీ, బోస్ మధ్య విభేదాలు తలెత్తాయి. రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా బ్రిటిష్ పాలకులకు సహకరించి తద్వారా దేశ పాలనలో సానుకూల సంస్కరణలు తీసుకరావాలని గాంధీ భావిస్తే, అదే ప్రపంచ యుద్ధ పరిస్థితులను అనుకూలంగా మార్చుకొని బ్రిటీష్ పాలకులపై తిరుగుబాటుచేసి దేశ స్వాతంత్య్రానికి మార్గం సుగుమం చేసుకోవాలన్నది బోస్ ఎత్తుగడ. 1939లో త్రిపురలో జరిగిన కాంగ్రెస్ సమేశంలో మహాత్మా గాంధీ వారించినా వినకుండా బోస్ మరోసారి అధ్యక్ష పదవిని నామినేషన్ వేశారు. ఆయనకు పోటీగా పట్టాభి సీతారామయ్య పేరును గాంధీ ప్రతిపాదించారు. 205 ఓట్ల మెజారిటీతో మళ్లీ బోసే గెలిచారు. ‘ఇందులో పట్టాభి ఓటమికన్నా నా ఓటమే ఎక్కువ’ అని తర్వాత ఆయనకు రాసిన లేఖలో గాంధీ పేర్కొన్నారు. బోస్ కాదన్న వినకుండా గాంధీ, కొత్త తరహా ప్రభుత్వ పాలనకోసం బ్రిటీష్ పాలకులకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ బహిరంగ ప్రకటన చేశారు. అందుకు విరుద్ధంగా బ్రిటీష్ పాలకులతో సహాయ నిరాకరణ ఉద్యమానికి బోస్ పిలుపునిచ్చారు. ఈ విషయంలో ఎవరి పక్షం వహిస్తారంటూ గాంధీ, పార్టీ నాయకులను నిలదీయడంతో బోస్, ఆయన సోదరుడు శరత్ చంద్ర బోస్ మినహా అందరు పార్టీకి రాజీనామా చేశారు. ఇక చేసేదేమీలేక బోస్ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో రాజేంద్ర ప్రసాద్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. 1949లో మరోసారి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సీ. రాజగోపాలచారి (అప్పటికి గవర్నర్ జనరల్ అంటే భారత తొలి రాష్ట్రపతి) పేరును పండిట్ నెహ్రూ ప్రతిపాదించగా, ఆయన డిప్యూటి సర్దార్ వల్లభాయ్ పటేల్ వ్యతిరేకించారు. పటేల్, రాజేంద్ర ప్రసాద్ పేరును ప్రతిపాదించారు. ఈనేపథ్యంలో అప్పటికీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పట్టాభి సీతారామయ్యనే పార్టీ సభ్యులు తిరిగి ఎన్నికయ్యారు. ఆ తర్వాత కొన్ని నెలలకు పురుషోత్తమ దాస్ టాండన్ పేరును పటేల్ ప్రతిపాదించారు. పాకిస్థాన్‌తో యుద్ధం కోరుకుంటున్న ఛాందస హిందువంటూ ఆయన అభ్యర్థిత్వాన్ని నెహ్రూ వ్యతిరేకించారు. అయినప్పటికీ నాసిక్‌లో జరిగిన పార్టీ సమావేశంలో టాండన్ ఎన్నికయ్యారు. దాంతో తాను ప్రధాని పదవికి రాజీనామా చేస్తానంటూ రాజగోపాలచారికి రాసిన లేఖలో నెహ్రూ హెచ్చరించారు. నెహ్రూతో విభేదాల కారణంగా తొమ్మిది నెలల అనంతరం టాండన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈలోగా గుండెపోటుతో పటేల్ మరణించారు. నెహ్రూను పార్టీ అధ్యక్షుడిగా ప్రకటిస్తూ 1951, సెప్టెంబర్ 8వ తేదీన పార్టీ ఏకగ్రీవగా తీర్మానించింది. అప్పటి నుంచి నాలుగు పర్యాయాలు (నాలుగేళ్లు) నెహ్రూయే అధ్యక్షుడిగా ఉన్నారు. 1969లో తీవ్ర సంక్షోభం కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి నీలం సంజీవరెడ్డిని పార్టీ సీనియర్ నాయకులు ప్రతిపాదించగా, స్వతంత్య్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన వీవీ గిరీకి అప్పుడు ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ మద్దతిచ్చారు. దాంతో ఇందిరాగాంధీని అప్పటి పార్టీ అధ్యక్షుడు ఎస్. నిజలింగప్ప పార్టీ నుంచి బహిష్కరించారు. దాంతో పార్టీలోనూ ప్రభుత్వంలోనూ చీలిక వచ్చింది. పర్యవసానంగా మైనారిటీలో పడిన తన ప్రభుత్వాన్ని ఇందిరాగాంధీ, సీపీఐ మద్దతుతో గట్టెక్కించారు. ఆ తర్వాత 1971లో జరిగిన ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో ఇందిర మళ్లీ అధికారంలోకి వచ్చారు. ఎమర్జెన్సీ కారణంగా ఇందిర ప్రభుత్వం పడిపోవడం, మళ్లీ అధికారంలోకి రావడం తెల్సిందే. అప్పటి నుంచి ప్రధానిగా ఉన్న వ్యక్తికే పార్టీ బాధ్యతలు అప్పగించాలనే ఆనవాయితీ మళ్లీ వచ్చింది. ఆమె తర్వాత ప్రధాని అయిన రాజీవ్ గాంధీయే పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పీవీ నరసింహారాలు అలాగే ఎన్నికయ్యారు. ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో తప్పించారు. ఆయన తర్వాత సీతారామ్ కేసరి కొద్దికాలం ఉన్నారు. సోనియా గాంధీకి పార్టీ బాధ్యతలు అప్పగించడం కోసం ఆయన్ని తప్పించి ఆమెను ఎన్నుకున్నారు. అందరికన్నా ఎక్కువగా 19 ఏళ్లపాటు సోనియానే అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. ఆమెకు వారసులుగా రాహుల్ వచ్చారు. ఒకప్పుడు సైద్ధాంతిక విభేదాల కారణంగా పార్టీలో సారథ్య సంక్షోభం ఏర్పడితే ఆ తర్వాత పదవుల కోసం సంక్షోభాలు వచ్చాయి. సంక్షోభాలను నివారించడం కోసం వారసత్వ రాజకీయాలు వచ్చాయి. ఇప్పుడు ఈ వారసత్వాన్ని రాహుల్ వద్దంటున్నారు. -
కర్ణాటకలో వేడెక్కిన రాజకీయం
బెంగళూరు: లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత కర్ణాటకలో ప్రభుత్వాన్ని కూల్చేయడానికి బీజేపీ పావులు కదుపుతూ ఉండడంతో రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, జేడీ (ఎస్) కూటమి సంక్షోభంలో పడింది. హెచ్డీ కుమారస్వామి సర్కార్‌ని ఆపరేషన్ కమల్ నుంచి కాపాడుకోవడానికి ఇరు పార్టీలకు చెందిన నాయకులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. సంక్షోభ నివారణ కోసం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ముఖ్యమంత్రి కుమారస్వామి, ఇతర పార్టీ సీనియర్ నాయకులు, మంత్రులతో మంతనాలు జరిపారు. ఎమ్మెల్యేలు తమ నుంచి జారిపోకుండా ఉండడానికి కేబినెట్‌ను విస్తరించడం లేదంటే పునర్వ్యవస్థీకరణ చేయాలా అన్న దిశగా కేసీ వేణుగోపాల్, కుమారస్వామి, సీఎల్పీ నాయకుడు సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర వంటి నాయకులు చర్చలు జరిపారు. కానీ ఈ అంశంలో ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. కుమారస్వామి మంత్రివర్గంలో మూడు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయడమా లేదంటే కొందరు మంత్రుల్ని తొలగించి కొత్తవారికి అవకాశం ఇవ్వడమా అన్నదానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో లోతుగా చర్చించి ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌తో సంప్రదింపులు జరిపాక ఒక నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలుస్తోంది. కేబినెట్లో మొత్తం 34మంది మంత్రులకు గాను కాంగ్రెస్‌కు 22, జేడీ(ఎస్)కు 12 మంత్రి పదవులు ఉన్నాయి. ఇప్పటికే మంత్రి పదవులపై కాంగ్రెస్ నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. -
మోదీ ‘టైమ్’ మారింది
న్యూయార్క్: ప్రధాని మోదీ భారత విభజన సారథి (ఇండియాస్ డివైడర్ ఇన్ చీఫ్) అంటూ ఆయనను విమర్శిస్తూ రెండు వారాల క్రితం (సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు ముందు) కథనం ప్రచురించిన ప్రముఖ టైమ్ మేగజీన్.. ఎన్నికల ఫలితాలు రాగానే మాట మార్చింది. గత 5 దశాబ్దాల్లో మోదీలా దేశాన్ని ఎవ్వరూ ఏకం చేయలేకపోయారంటూ మోదీని ప్రశంసిస్తూ తాజాగా మరో కథనాన్ని ప్రచురించింది. పాత కథనాన్ని పాకిస్తాన్ మూలాలున్న ఆతీష్ తసీర్ అనే జర్నలిస్టు రాయగా, తాజా కథనాన్ని భారత్‌కు చెందిన మనోజ్ లాద్వా రాశారు. లండన్ కేంద్రంగా పనిచేసే ఇండియా ఇన్కార్పొరేషన్ గ్రూప్ అనే మీడియా సంస్థ వ్యవస్థాపకుడు, ప్రస్తుత సీఈవోనే ఈ మనోజ్. 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో ‘ప్రధానిగా మోదీ’ అనే ప్రచార కార్యక్రమంలో పరిశోధన, విశ్లేషణ విభాగానికి మనోజ్ నేతృత్వం వహించారు. మోదీ సమాజంలో మతపరమైన విభజన తీసుకువచ్చారని ఆతీష్ తసీర్ వ్యాసం ద్వారా ఆరోపించిన టైమ్ మేగజీన్.. ఎన్నికల్లో మోదీ భారీ విజయం సాధించడంతో ఆ పత్రిక తన రూటు మార్చుకోవాల్సి వచ్చింది. మోదీ విభజన వాది కాదు, దేశాన్ని ఏకతాటిపైన నడిపించిన నాయకుడు అంటూ మనోజ్ రాసిన సంపాదకీయంలో టైమ్ ప్రశంసించింది. కుల, మత, వర్గ సమీకరణల్ని అధిగమించి మరీ మోదీ అధికారాన్ని నిలబెట్టుకోవడమే కాదు, సీట్లు, ఓట్లు పెంచుకున్నారని విశ్లేషించింది. క్షేత్రస్థాయి అధ్యయనంలో విదేశీ మీడియా విఫలం భారత్‌లో నెలకొన్న క్షేత్రస్థాయి పరిస్థితుల్ని అధ్యయనం చేయడంలో పశ్చిమ దేశాల మీడియా విఫలమైందని మనోజ్ అభిప్రాయపడ్డారు. ‘మోదీ అధికారంలోకి వచ్చాక అగ్రకులాల ఆధిపత్యం పెరిగిందని అందరూ భావించారు. వెనుకబాటు కులాలే ఒక్కటై మోదీకి జేజేలు పలికాయి. ఒక వెనుకబడిన కులానికి చెందిన వ్యక్తి అత్యున్నత పీఠాన్ని అధిరోహించడం, ఉద్యోగ వర్గాలకు ప్రతి«నిధిగా ఆయన కనిపించడం, నిరుపేదలు అత్యధికంగా ఉన్న భారత్‌లో మోదీపై ఉన్న వ్యక్తిగత కరీష్మాయే ఆయనను రెండోసారి అధికార అందలాన్ని ఎక్కించింది. పాలనలో మోదీ విధానాలపై ఎన్నో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఎన్నికల ప్రచారం సమయంలోనూ ఆయనను విపక్ష పార్టీలు విమర్శించాయి. అయినా భారత ఓటర్లు ఏకమై ఆయనకే పట్టంగట్టారు. ఈ స్థాయిలో ఓటర్లు ఒక్కటై ఒక వ్యక్తిని చూసి ఓటు వేయడం 50 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి’ అని మేగజీన్ వ్యాసంలో పేర్కొంది. -
వెనక్కు తగ్గని రాహుల్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కు తీసుకోనంటూ పట్టుబట్టడంతో ఆ పార్టీలో అనిశ్చితి బుధవారం కొనసాగింది. మరోవైపు రాహుల్ తన రాజీనామాను వెనక్కు తీసుకోవాల్సిందిగా కోరుతూ పార్టీ కార్యకర్తలు కొందరు ఆయన ఇంటి ఎదుట నిరాహార దీక్షకు దిగారు. అనంతరం పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని వేరే ప్రాంతంలో విడిచిపెట్టారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమి పాలైనందున తాను అధ్యక్ష పదవిలో ఉండనంటూ రాహుల్ రాజీనామా చేస్తాననడం, పార్టీ నేతలు దీనిని వ్యతిరేకించి ఆయనను బుజ్జగిస్తుండటం తెలిసిందే. రాహుల్ తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సిందిగా బుధవారం కూడా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షీలా దీక్షిత్ కోరారు. ఆమెతోపాటు ఢిల్లీ కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు భారీ సంఖ్యలో రాహుల్ నివాసం వద్దకు చేరుకున్నారు. ‘మేమంతా రాహుల్ కోసమే ఉన్నాం. ఆయన తన నిర్ణయంపై పునరాలోచించుకోవాలి. ఆయనే పార్టీకి సారథ్యం వహించాలని పార్టీ నేతలంతా కోరుకుంటున్నందున పార్టీని వీడొద్దని నేను చెప్పాను’ అని షీలా అన్నారు. కర్ణాటక, రాజస్తాన్ పీసీసీలు, పలు రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు రాహుల్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరారు. జూన్ 1న సీపీపీ భేటీ పార్లమెంటరీ పార్టీ కొత్త నేతను ఎన్నుకునేందుకు తాజా లోక్‌సభ ఎన్నికల అనంతరం తొలిసారిగా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) భేటీ జూన్ 1న జరగనుంది. ప్రస్తుతం సీపీపీ చైర్మన్‌గా సోనియా గాంధీ ఉన్నారు. కొత్త లోక్‌సభకు ఎన్నికైన 52 మంది ఎంపీలు, రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీలు ఈ భేటీకి హాజరుకానున్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కాంగ్రెస్ ఎంపీలు సమావేశమవుతారు. పార్లమెంటు సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన విధానంపై వారు చర్చిస్తారు. -
మోదీ ప్రమాణానికి వెళ్లను
కోల్‌కతా: న్యూఢిల్లీలో గురువారం జరిగే ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి తాను హాజరు కావడం లేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. తృణమూల్ కార్యకర్తల చేతిలో హతమైన బీజేపీ కార్యకర్తల కుటుంబీకులను ప్రమాణస్వీకారోత్సవానికి తీసుకెళుతున్నట్టు బీజేపీ నేతలు ప్రకటించిన నేపథ్యంలో తాను ప్రమాణస్వీకారానికి రావట్లేదని మమత ట్వీట్‌చేశారు. మరోవైపు గత ఏడాది కాలంలో తృణమూల్ దాడుల్లో హతులైన 50కి పైగా బీజేపీ కార్యకర్తల కుటుంబాలను అమరుల గౌరవసూచికగా ప్రమాణస్వీకారానికి ఢిల్లీ తీసుకెళుతున్నట్టు బీజేపీ నేత ముకుల్ రాయ్ చెప్పారు. కాగా, బీజేపీ ఆరోపణలను తృణమూల్ ఖండించింది. తమ రాష్ట్రంలో రాజకీయ హత్యలేమీ లేవని టీఎంసీ వ్యాఖ్యానించింది. అమరుల కుటుంబాలను గౌరవించాలని బీజేపీ భావిస్తే ఘర్షణల్లో అమరుడైన తృణమూల్ కార్యకర్తల కుటుంబాలను ఢిల్లీకి తీసుకెళ్లాలని టీఎంసీ నేత సవాల్ విసిరారు. ప్రమాణానికి వెళ్లొద్దని మరో ఇద్దరు సీఎంలతో మాట్లాడిన తర్వాత మమత ఈ ప్రకటన చేశారు. అయితే, 24 గంటల్లోనే ఆమె తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. బీజేపీ ఆరోపిస్తున్నట్టు వారి కార్యకర్తలు తమ కార్యకర్తల దాడుల్లో చనిపోలేదని, కుటుంబ కలహాలు, వ్యక్తిగత కారణాల వల్ల మరణించారని మమత తెలిపారు. ప్రజాస్వామ్య ఉత్సవాన్ని బీజేపీ సంకుచిత రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నందున ప్రమాణస్వీకారోత్సవానికి హాజరు కారాదని నిర్ణయించుకున్నానని మమత ట్వీట్ చేశారు.‘నూతన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారూ..శుభాకాంక్షలు. మీ ఆహ్వానాన్ని మన్నించి, ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలనుకున్నాను. అయితే, బెంగాల్లో తమ కార్యకర్తలు రాజకీయ హత్యకు గురయ్యారని బీజేపీ చెబుతున్నట్టు మీడియాలో చూశాను. ఇది అబద్ధం. వ్యక్తిగతకుటుంబ కలహాలు, ఇతరత్రా కారణాలు వారి మరణానికి కారణం కావచ్చు. ప్రమాణస్వీకారాన్ని తమ రాజకీయ ప్రయోజనాలకు వాడి ఏ రాజకీయ పార్టీ కూడా ఈ కార్యక్రమం విలువను తగ్గించకూడదు. ఈ పరిస్థితుల్లో నేను మీ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నాను. క్షమించండి’ అని పేర్కొన్నారు. నేడు తృణమూల్ ధర్నా తృణమూల్ కార్యకర్తలు, నేతలపై జరుగుతున్న దాడులకు నిరసనగా తృణమూల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం నైహతి మునిసిపల్ కార్యాలయం ముందు ధర్నా జరగనుంది. ఈ ధర్నాలో మమత పాల్గొననున్నారు. -
ఆ 4 శాఖలు ఎవరికి?
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ కూర్పుపై ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వరసగా రెండోరోజు బుధవారం సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కొత్త మంత్రివర్గానికి తుది రూపు ఇచ్చారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మంత్రివర్గం సైజు 60 వరకు ఉండొచ్చనే సమాచారం నేపథ్యంలో నాలుగు కీలక శాఖలు హోం, ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాలు ఎవరికి దక్కుతాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది. సీనియర్ మంత్రుల్లో చాలామందికి తిరిగి కేబినెట్లో స్థానం దక్కుతుందని, వారితో పాటు కొన్ని కొత్త ముఖాలు ఉంటాయని తెలుస్తోంది. బీజేపీకి తగిన రాజకీయ వ్యూహాన్ని రచించి భారీ విజయాన్ని చేకూర్చినట్టుగా ప్రశంసలందుకుంటున్న అమిత్ షా తొలిసారిగా కేంద్ర కేబినెట్లో చేరి కీలక శాఖను దక్కించుకుంటారనే ఊహాగానాలు సాగుతున్నా దీనిపై స్పష్టతలేదు. వచ్చే ఏడాదిలోగా పలు కీలక రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో షా బీజేపీ అధ్యక్షుడిగానే కొనసాగు చాన్సుంది. పాత కేబినెట్లోని ప్రధాన సభ్యులందరికీ తిరిగి అవకాశం వస్తుందని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. రాజ్‌నాథ్, గడ్కారీ, నిర్మలా సీతారామన్, స్మృతీ ఇరానీ, రవిశంకర్ ప్రసాద్, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, నరేంద్రసింగ్ తోమర్, ప్రకాశ్ జవదేకర్లు కొనసాగే అవకాశం ఉంది. అమేథీలో రాహుల్ గాంధీని ఓడించి జెయింట్ కిల్లర్‌గా పేరు గడించిన స్మృతీ ఇరానీకి మంచి శాఖ దక్కే అవకాశం ఉంది. తోమర్ స్పీకర్‌గా కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఒడిశా, బెంగాల్ వంటి రాష్ట్రాల్లో పెరుగుతున్న బీజేపీ బలాన్ని కొత్త కేబినెట్ ప్రతిబింబించవచ్చనే సంకేతాలు ఉన్నాయి. అనారోగ్య కారణాల వల్లే ఇటీవలి ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ సుష్మాస్వరాజ్‌కు మోదీ కొత్త కేబినెట్లో చోటు దక్కవచ్చని పార్టీవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. శివసేన, జేడీయూలకు చెరో రెండు ఇక మిత్రపక్షాల విషయానికొస్తే శివసేన, జేడీ(యూ)లకు ఒక కేబినెట్, మరొక సహాయమంత్రి చొప్పున రెండేసి బెర్తులు దక్కే వీలుంది. లోక్ జన్‌శక్తి, శిరోమణి అకాలీ దళ్ పార్టీలకు చెరొక పదవి రావచ్చు. బుధవారం అమిత్ షాతో బిహార్ సీఎం నితీశ్ భేటీ అయ్యారు. కేబినెట్లో జేడీ(యూ) ప్రాతినిధ్యంపై ఉభయులూ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. మోదీ ప్రభుత్వంలో తమ ప్రతినిధిగా పార్టీ అధ్యక్షుడు రాంవిలాస్ పాశ్వాన్ పేరును సిఫారసు చేస్తూ ఎల్జేపీ ఇప్పటికే తీర్మానం ఆమోదించింది. గత మంత్రివర్గంలో భాగస్వామి కాని ఏఐఏడీఎంకే ఒక సీటు గెలిచిన నేపథ్యంలో ఆ పార్టీ తమిళనాడులో అధికారంలో ఉండటం, కీలక ద్రవిడ మిత్రపక్షం కావడాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ పార్టీ నేత ఒకరికి స్థానం కల్పించవచ్చు. కర్ణాటక నుంచి సదానందగౌడ, ప్రహ్లాద్ జోషిల పేర్లు, మహారాష్ట్ర నుంచి గడ్కారి, జవదేకర్, సురేశ్ప్రభులతో పాటురావు సాహెబ్ దాన్వే పేరు ఖరారైనట్లు సమాచారం. బీజేపీ అధ్యక్ష రేసులో నడ్డా, భూపేందర్ అరుణ్ జైట్లీ కేబినెట్లో చేరలేనని స్పష్టం చేయడంతో.. కీలకమైన ఆర్థిక శాఖపై ఊహాగానాలు మొదలయ్యాయి. జైట్లీ స్థానంలో బాధ్యతలు చేపట్టి ఎన్నికల ముందు ప్రజా బడ్జెట్ ప్రవేశపెట్టిన రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఈ పదవికి ప్రధాన పోటీదారు కావచ్చని తెలుస్తోంది. ఇక గాంధీనగర్ నుంచి లోక్‌సభకు ఎన్నికైన అమిత్ షా కనుక కేబినెట్లో చేరితే.. జేపీ నడ్డా, భూపేందర్ యాదవ్ బీజేపీ అధ్యక్షుడి రేసులో మొదటిస్థానంలో ఉంటారని తెలుస్తోంది. మంత్రులు, మంత్రుల శాఖలపై బీజేపీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం. -
మోదీ రెండోసారి..
న్యూఢిల్లీ: దేశ, విదేశీ ప్రభుత్వాధినేతలు, ప్రముఖులు, కార్పొరేట్ దిగ్గజాలు వంటి సుమారు 8 వేల మంది విశిష్ట అతిథుల మధ్య కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. భారత ప్రధానిగా వరుసగా రెండోసారి నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గురువారం రాత్రి 7 గంటలకు ఈ వేడుక జరగనుంది. ఆయనతో పాటు 50–60 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయవచ్చని సమాచారం. రాష్ట్రపతి భవన్ ఎదుటి ఆవరణలో జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి కోవింద్ వీరితో ప్రమాణంచేయిస్తారు. బిమ్స్టెక్ దేశాధినేతలు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, పలువురు స్వపక్ష, విపక్ష నేతలు, సీఎంలు, సినీ, క్రీడారంగ ప్రముఖులు హాజరుకానున్నారు. రాత్రి 7 నుంచి 8.30 గంటల మధ్య ఈ కార్యక్రమం జరగనుందని రాష్ట్రపతి భవన్ అధికార ప్రతినిధి అశోక్ మాలిక్ చెప్పారు. తరలిరానున్న బిమ్స్టెక్ దేశాల అధినేతలు బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్, శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి, మయన్మార్ అధ్యక్షుడు యు విన్ మియంట్, భూటాన్ ప్రధాని లోటే షెరింగ్ వంటి బిమ్స్టెక్ (బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనమిక్ కోఆపరేషన్) నేతలు తమ హాజరును ఇప్పటికే ధ్రువీకరించారు. థాయ్‌లాండ్‌కు ప్రత్యేక రాయబారి గ్రిసాడ బూన్రాక్ ప్రాతినిధ్యం వహిస్తారు. అలాగే కిర్గిజ్ అధ్యక్షుడు, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ప్రస్తుత చైర్మన్ సూరోన్‌బే జీన్బెకోవ్, మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నాథ్ కూడా తాము హాజరుకానున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు మోదీ ఆహ్వానాన్ని వారు అంగీకరించినట్లు తెలిపాయి. వీరితో పాటు విపక్షాలకు చెందిన అనేకమంది నేతలు కూడా హాజరుకానున్నారు. కర్ణాటక, ఢిల్లీ ముఖ్యమంత్రులు కుమారస్వామి, అరవింద కేజ్రీవాల్‌తో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనున్నారు. సినీ, క్రీడా ప్రముఖులు రజనీకాంత్, షారుక్ ఖాన్, కంగన రనౌత్, ద్రవిడ్, సైనా నెహ్వాల్, అనిల్ కుంబ్లే, పుల్లెల గోపీచంద్, ప్రముఖ పారిశ్రామికవేత్తలు ముఖేశ్ అంబానీ, రతన్ టాటా, బిల్‌గేట్స్ తదితరులకు ఆహ్వానం అందింది. 8 వేల మంది ఇదే మొదటిసారి 2014లో కూడా మోదీ రాష్ట్రపతి భవన్ ఎదుటి ఆవరణలోనే ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. సార్క్ దేశాల అధినేతలతో పాటు 3,500 మందికి పైగా అతిథులు అప్పుడు హాజరయ్యారు. సాధారణంగా విదేశీ అతిథులు, ప్రభుత్వాధినేతలు వచ్చినప్పుడు వారి సత్కార కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. అయితే 1990లో చంద్రశేఖర్, 1999లో వాజ్‌పేయిలు ఇక్కడే ప్రమాణ స్వీకారం చేశారు. 8 వేల మంది అతిథులు హాజరుకావడం మాత్రం ఇదే మొదటిసారి. విదేశీ అతిథుల కోసం ‘దాల్ రైసీనా’ మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరైన ముఖ్య అథిథులు అందరికీ ‘పన్నీర్ టిక్కా’ వంటి ఉపాహారం అందజేస్తారు. ఆ తర్వాత 9 గంటలకు విదేశీ అతిథుల కోసం రాష్ట్రపతి విందు ఏర్పాటు చేశారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోదీ, బిమ్స్టెక్ దేశాల అధినేతలు తదితర 40 మంది అతిథులు విందులో పాల్గొంటారు. ఇతర ముఖ్య వంటకాలతో పాటు రాష్ట్రపతి భవన్ వంటశాలలో ప్రత్యేక వంటకమైన ‘దాల్ రైసీనా’ను అతిథులకు వడ్డించనున్నారు. దీని తయారీకి సుమారు 48 గంటల సమయం పడుతుందని, అందువల్ల మంగళవారమే ఇది ప్రారంభమైనట్లు రాష్ట్రపతి భవన్ ప్రతినిధి తెలిపారు. కాగా, మోదీ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఢిల్లీలో బహుళ అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ బలగాలు కలిపి దాదాపు 10 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించామని ఓ అధికారి చెప్పారు. నేను కేబినెట్లో చేరలేను ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కొత్త ప్రభుత్వంలో మంత్రిగా ఉండాలని తాను కోరుకోవడం లేదని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు. అవసరమైతే సలహాలు ఇస్తానని తెలిపారు. మోదీకి రాసిన లేఖను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘ఐదేళ్ల పాటు మోదీ సారథ్యంలో పని చేసినందుకు సంతోషంగా ఉంది. ఎంతో నేర్చుకున్నా. గత 18 నెలలుగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాను. విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఈ పరిస్థితుల్లో మంత్రి పదవి చేపట్టలేను. ఇది నాకు నేనుగా తీసుకుంటున్న నిర్ణయం. ప్రభుత్వానికి ఎలాంటి సలహాలు కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా’ అని జైట్లీ తన లేఖలో పేర్కొన్నారు. వాస్తవానికి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిగానే మోదీకి జైట్లీ తన మనసులోని మాటను మౌఖికంగా వెల్లడించారు. 66 ఏళ్ల జైట్లీ బయటకు వెల్లడించని వ్యాధికి సంబంధించిన పరీక్షలు, చికిత్స కోసం గత వారం ఎయిమ్స్‌లో చేరారు. జనవరిలో అమెరికాలో సర్జరీ చేయించుకున్న జైట్లీ, గత నెలలో అధికార పర్యటనలో భాగంగా అమెరికా వెళ్లినప్పుడు చికిత్స పొందారు. అంతకుముందు పలు సర్జరీలు జరిగాయి. వృత్తిరీత్యా న్యాయవాది అయిన జైట్లీ 47 ఏళ్ల వయస్సులో పార్లమెంటులో అడుగుపెట్టారు. జైట్లీ నివాసానికి మోదీ మంత్రివర్గంలో చేరలేనని లేఖ ద్వారా జైట్లీ తెలిపిన వెంటనే వెంటనే ప్రధాని మోదీ ఢిల్లీలోని జైట్లీ అధికార నివాసానికి వెళ్లారు. వీరి భేటీకి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. జైట్లీ కానీ, ఆయన కార్యాలయం కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. లేఖ అందినట్టుగా తెలియజేసిన మోదీ.. ఆర్థిక వ్యవస్థకు, జీఎస్టీ అమలుకు జైట్లీ చేసిన కృషిని అభినందించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే జైట్లీ విజ్ఞప్తిని మోదీ అంగీకరించారా? లేదా? అన్నది తెలియలేదు. -
‘మన ఓటమికి కారణాలివే’
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మరోసారి విజయ దుందుభి మోగించింది. కాంగ్రెస్‌తో పాటు మిగతా ప్రతిపక్షాలన్ని మోదీ దెబ్బకు మట్టి కరిచాయి. ఢిల్లీలో ఆప్ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. మొత్తం 7 లోక్ సభ స్థానాల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. అటు పంజాబ్‌లో కేవలం ఒక్క సీటుతో సరిపెట్టుకుంది కేజ్రీవాల్ పార్టీ. ఈ క్రమంలో పార్టీ వైఫల్యానికి గల కారణాలను ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించారు ఆ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. కార్యకర్తలను ఉద్దేశించి రాసిన ఈ లేఖలో పార్టీ ఓటమికి ప్రధానంగా రెండు కారణాలను పేర్కొన్నారు. ‘ఈ ఎన్నికల్లో మనం అనుకున్న ఫలితాలను సాధించలేకపోయాం. ఎన్నికల అనంతరం జరిపిన గ్రౌండ్ విశ్లేషణలో ఇందుకు గల కారణాలు తెలిసాయి. దేశ వ్యాప్తంగా బీజేపీ అనుకూలంగా ఏర్పడిన వాతావరణం ఢిల్లీలో కూడా ప్రభావం చూపించింది. మరోటి ఈ ఎన్నికలను ప్రజలు మోదీ, రాహుల గాంధీకి మధ్య జరుగుతున్న ఎన్నికలుగా భావించారు. ఫలితంగా మనం ఓడిపోయాం. అంతేకాక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో జనాలు మన పనితనం చూసి మనకు ఓటేశారు. అందువల్లే మనం ఢిల్లీ విధాన సభలో కూర్చోగలిగాము అన్నారు. రానున్న ఎన్నికల్లో కూడా మన పనితీరే మనల్ని కాపాడుతుంద’ని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. AAP National Convenor @ArvindKejriwal writes letter to all volunteers. 👇👇 pic.twitter.com/KI0twBr9YX — AAP (@AamAadmiParty) May 29, 2019 -
‘నేను వస్తువును కాను.. అమ్ముడు పోను’
గాంధీనగర్ : సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ కేవలం 52 స్థానాలకే పరిమితమయ్యి.. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేక పోయింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో బీజేపీలోకి చేరికలు కొనసాగతున్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి భారీ చేరికలు ఉంటాయనే వార్తలు వినిపిస్తున్నాయి. 15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలను కాంగ్రెస్ నాయకులు కొట్టిపారేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ఉందని.. బీజేపీలో చేరడం అసంభవం అంటున్నారు. ఈ క్రమంలో విక్రం మాదమ్ అనే కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ‘నా శరీరాన్ని 36 ముక్కలుగా నరికినా నేను బీజేపీలో చేరను. నేను బీజేపీలో చేరతానంటూ ప్రచారం చేసేవారికి మతి భ్రమించి ఉంటుంది. నేను వస్తువును కాను.. అమ్ముడు పోను. గత మూడు రోజుల నుంచి నేను నా నియోజకవర్గంలో తిరుగుతున్నాను. ఇంతవరకూ నేను ఏ బీజేపీ నాయకుడితో మాట్లాడలేదు.. ఎప్పటికి కాంగ్రెస్‌తోనే ఉంటాను’ అన్నారు. -
మంత్రివర్గంలోకి తీసుకోవద్దు జైట్లీ వినతి
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖమంత్రి అరుణ్ జైట్లీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో తనకు మంత్రి వర్గంలో చోటు కల్పించవద్దని మోదీని కోరారు. తీవ్రమైన ఆనారోగ్యం కారణంగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించలేకపోతున్నానని జైట్లీ వివరించారు. అనధికారికంగా పార్టీకి, ప్రభుత్వానికి సేవలందిస్తానని తెలిపారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు కూడా జైట్లీ దూరంగా ఉన్నారు. కాగా కాన్సర్‌తో బాధపడుతున్న జైట్లీ జనవరిలో న్యూయార్క్‌లో చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో తాత్కాలిక ఆర్థికమంత్రిగా పియూష్ గోయల్ జైట్లీ స్థానంలో బాధ్యతలను నిర్వహించారు. ఫిబ్రవరి1న పార్లమెంటులో సమర్పించాల్సిన కేంద్ర మధ్యంతర బడ్జెట్‌ను కూడా గోయల్ ప్రవేశపెట్టారు. జైట్లీ చాలా బలహీనంగా ఉన్నారని, అనారోగ్యం కారణంగానే ప్రధాని మోదీ రెండోసారి ఏర్పాటు చేయబోయే కేబినెట్లో ఉండే అవకాశాలు లేవని ఇదివరకే వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. మరింత మెరుగైన వైద్యం కోసం ఆయన బ్రిటన్ లేదా అమెరికా వెళ్లాల్సి ఉంటుందని తెలుస్తోంది. బయటకు వెల్లడించని అస్వస్థతతో గతవారం జైట్లీ ఎయిమ్స్‌లో చేరారు. ఎన్నికల అనంతరం బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఎన్నికల విజయోత్సవాల్లో ఆయన పాల్గొనలేదు. జైట్లీ తప్పుకోవడంతో నూతన మంత్రివర్గంలో కీలకమైన ఆర్థికశాఖ మంత్రిగా ఎవరు బాధ్యతలు చేపడతారన్న విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా బీజేపీలో సీనియర్ నేత అయిన జైట్లీ.. మంత్రివర్గంలో లేకపోవడం లోటేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆర్థిక నిపుణిడిగా, సుప్రీంకోర్టు న్యాయవాదిగా జైట్లీ పార్టీలో ఎంతో కీలకంగా వ్యవహరించారు. పార్టీలోనే కాదు ప్రధాని మోదీకి జైట్లీ అత్యంత సన్నిహితుడు. ఆర్థిక మంత్రిగానే కాకుండా న్యాయవాది కావడంతో పార్టీకి, ప్రభుత్వానికి ఎన్నో కేసుల్లో లీగల్ సలహాదారుడిగా జైట్లీ వ్యవహరించారు. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన ఉన్నత వర్గాలకు పదిశాతం రిజర్వేషన్లు కల్పించినప్పుడు రాజ్యాంగ సవరణ చేయకుండా.. కేవలం పార్లమెంట్ ఆమోదంతో చట్టాన్ని రూపొందించవచ్చని జైట్లీ చేసిన సూచన బీజేపీ ప్రభుత్వానికి ఎలాంటి సమస్యలు లేకుండా చేసింది. ట్రిపుల్ తలాక్ బిల్లు రూపకల్పనలో కూడా జైట్లీ పాత్ర ఎంతో ఉంది. -
‘ఆరు నెలల్లో మమత సర్కారు కూలుతుంది’
కోల్కత్తా: బెంగాల్లో మరో ఆరు నెలల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం పడిపోతుందని బీజేపీ నేత రాహుల్ సిన్హా సంచలన వ్యాఖ్యలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్‌పై పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు నమ్మకం లేదని మమత సర్కార్ కూలిపోవడం ఖాయమని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ.. ఆ తరువాత బెంగాల్లో పార్టీ ఫిరాయింపులకు తెరలేపిన విషయం తెలిసిందే. టీఎంసీ, సీపీఎంకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, 50 మంది కౌన్సిలర్లు బుధవారం బీజేపీ గూటికి చేరారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరమే చోటుచేసుకున్న ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో రాహుల్ సిన్హా వ్యాఖ్యలు ఆ రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి. కాగా బెంగాల్ అసెంబ్లీకి 2021 వరకు గడువున్న విషయం తెలిసిందే. బుధవారం ఓ సమావేశంలో రాహుల్ సిన్హా మాట్లాడుతూ.. ‘‘ఆరు నెలలు లేదా ఏడాది లోపు మమత సర్కార్ పడిపోనుంది. ఆ పార్టీలో చాలామంది ఆమెపై అసంతృప్తితో ఉన్నారు. పోలీసులు, సీఐడీ బలంతో మమత ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. కేంద్రంపై కోపంతో టీఎంసీ నేతలు రాష్ట్రంలో అల్లర్లను ప్రేరేపిస్తున్నారు’’ అని అన్నారు. కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగాల్లో పర్యటించిన మోదీ 40 మంది తృణమూల్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఫిరాయింపులను ప్రోత్సహించే విధంగా మాట్లాడారని విమర్శలు వ్యక్తమయ్యాయి. కాగా ఇటీవల వెలువడిన సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాల్లో 42 స్థానాలకు గాను బీజేపీ అనుహ్యంగా 18 స్థానాల్లో గెలుపొంది తృణమూల్‌కు పెద్ద ఎత్తున గండికొట్టిన తెలిసిందే. టీఎంసీ 22 సీట్లతో సరిపెట్టుకుంది. -
గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న కాంగ్రెస్
-
సంక్షోభంలో 3 రాష్ట్రాల కాంగ్రెస్ ప్రభుత్వాలు!
సాక్షి, న్యూఢిల్లీ: చరిత్రలోనే అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది కాంగ్రెస్ పార్టీ. లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయంతో రాహుల్‌గాంధీ రాజీనామాపై హైడ్రామా కొనసాగుతుండగా... మరోపక్క మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. మధ్యప్రదేశ్, కర్ణాటకతోపాటు రాజస్థాన్‌లోనూ అధికారాన్ని ఒడిసిపట్టేందుకు బీజేపీ బలంగా పావులు కదుపుతోంది. కమలదళం పట్టుబిగుస్తుండడంతో కాంగ్రెస్ ఊపిరాడక విలవిల్లాడుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో దారుణ పరాభవంతో కాంగ్రెస్ కుదేలైంది. మూడు రాష్ట్రాల్లో అధికారం కోల్పోయే పరిస్థితి నెలకొంది. గతేడాది డిసెంబర్లో కష్టపడి గట్టెక్కిన మధ్యప్రదేశ్, రాజస్థాన్‌తోపాటు కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వాల పరిస్థితి దినదిన గండంగా మారింది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోవడం కమల్‌నాథ్ సర్కారుని ఇబ్బందుల్లోకి నెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలో ఉందని.. అసెంబ్లీ సెషన్ ఏర్పాటుచేసి బలనిరూపణ చేసుకునేలా కమల్‌నాథ్‌కు ఆదేశాలివ్వాలంటూ ఏప్రిల్ 20న బీజేపీ గవర్నర్‌కు లేఖ రాసింది. దీంతో ఎమ్మెల్యేలను కాపాడుకోవడంపై ముఖ్యమంత్రి దృష్టి సారించారు. ఎమ్మెల్యేలు బీజేపీ వలలో పడకుండా... ఒక్కో మంత్రి ఐదుగురు శాసనసభ్యులపై ఫోకస్ పెట్టాలని ఆయన సూచించారని సమాచారం. ఆయా ఎమ్మెల్యేల నియోజకవర్గాల పరిధిలో అభివృద్ధి పనులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యతను కూడా 27 మంది మంత్రులదేనని సీఎం స్పష్టంచేసినట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 230 నియోజకవర్గాలుండగా, 2018 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 114 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 109 స్థానాల్లో విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్ 116కు రెండు స్థానాలు తక్కువ కావడంతో... ఎస్పీ నుంచి ఒకరు, బీఎస్పీ నుంచి ఇద్దరు, నలుగురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల మద్దతుతో కమల్‌నాథ్ ప్రభుత్వం కొలువుదీరింది. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 29 స్థానాల్లో బీజేపీ 28 స్థానాల్లో విజయం సాధించడంతో.. ప్రభుత్వానికి కష్టాలొచ్చిపడ్డాయి. అటు రాజస్థాన్‌లోనూ పరిస్థితి ఇంతే ఆందోళనకరంగా ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ క్లీన్‌స్వీప్ చేయడంతో.. కాంగ్రెస్ కంగుతింది. వర్కింగ్ కమిటీ సమావేశంలో సీఎం అశోక్ గెహ్లాట్‌పై పార్టీ చీఫ్ రాహుల్‌గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారన్న వార్తలతో పరిస్థితి మరింత దిగజారింది. గెహ్లాట్ అనుంగు నేత లాల్ చంద్ కటారియా మంత్రి పదవికి రాజీనామాచేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గెహ్లాట్ ప్రభుత్వంపై అసంతృప్తితో మరో 25మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో పరిస్థితిని సమీక్షించేందుకు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌గాంధీతో భేటీ అయ్యారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తాము కూల్చక్కరలేదని.. అంతర్గత కల్లోలంతో అతిత్వరలోనే అదే కూలిపోతుందని బీజేపీ నేత భవాని సింగ్ రాజ్వత్ అంటున్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇటు కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వానిది మరింత దారుణ పరిస్థితి. ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని బీజేపీ రాష్ట్ర చీఫ్ యడ్యూరప్ప బహిరంగ సవాళ్లు చేస్తుండడంతో.. అధికారం ఎలా నిలబెట్టుకోవాలో అర్థంకాక కాంగ్రెస్-జేడీఎస్ నేతలు తలపట్టుకుంటున్నారు. రెబల్స్‌ని బుజ్జగించేందుకు కెబినెట్ విస్తరణ చేపట్టాలనుకున్నా, ఎవరిని తొలగిస్తే ఏమవుతుందోనన్న భయంతో ముఖ్యమంత్రి కుమారస్వామి కంటిమీద కునుకేయడంలేదు. సంక్షోభం ముదరడంతో కాంగ్రెస్ అధికార ప్రతినిధులు కేసీ వేణుగోపాల్, అహ్మద్‌పటేల్ బెంగళూరు వెళ్లారు. తాజాగా మధ్యంతర ఎన్నికలకు వెళ్దమని కొత్త సవాల్ చేశారు యడ్యూరప్ప. గుజరాత్‌లోనూ 20మందికిపైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే అల్పేష్ ఠాకూర్ ప్రకటించారు. గత అసెంబ్లీలో గుజరాత్లో బీజేపీకి గట్టిపోటీ ఇచ్చిన కాంగ్రెస్.. లోక్‌సభ ఎన్నికల్లో అస్సలు ప్రభావం చూపలేకపోయింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటకను కోల్పోతే ఇక కాంగ్రెస్‌కి మిగిలేది ఒక్క ఛత్తీస్‌గఢ్ రాష్ట్రమే. అలకలు, ఆగ్రహాలు పక్కపెట్టి సంస్థాగత బలోపేతంపై దృష్టిపెట్టకపోతే.. కాంగ్రెస్ విముక్తభారత్ సాధనలో బీజేపీ విజయం సాధించినా ఆశ్చర్యం లేదంటున్నారు రాజకీయ పండితులు. -
బీజేపీ కొత్త సారథి ఎవరు?
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో 303 లోక్‌సభ స్థానాలతో ఘన విజయం సాధించిన బీజేపీ.. కేంద్రంలో వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు సిద్దమవుతోంది. 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. గాంధీ నగర్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. దీంతో నరేంద్ర మోదీ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్ష బాధ్యతలకు రాజీనామా చేసి.. ఆయన స్థానంలో కొత్త వారికి బాధ్యతలు అప్పగిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో కొత్త అధ్యక్షడు ఎవరని ఆ పార్టీలో తీవ్ర చర్చజరుగుతోంది. రెండు సార్లు విజయంలో కీలక పాత్ర పోషించిన అమిత్ షా స్థానాన్ని అందుకోవడం అంత సామాన్యమైన,సులువైన విషయం కాదు. పార్టీలో అంతటి శక్తీ, సామర్థ్యాలు ఉన్న సమర్థవంతమైన నేత కోసం కమళ దళం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. వారిలో ముందు వరుసలో.. ఆ పార్టీ ఎంపీ జేపీ నడ్డా, ధర్మేంద్ర ప్రథాన్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, కేంద్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన అనుభవం జేపీ నడ్డాకుంది. అలాగే ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన ఉత్తర ప్రదేశ్ ఇన్‌ఛార్జ్‌గా నడ్డా బాధ్యతలు చేపట్టి.. 62 ఎంపీ స్థానాల్లో గెలుపుకు కృషి చేశారు. అలాగే ధర్మేంద్ర ప్రథాన్‌పై కూడా బీజేపీ నాయకత్వం దృష్టి సారించింది. దక్షిణంలో అంత ప్రభావం లేకపోయినా 2014, 2019 ఎన్నికల్లో ఒడిశాలో పార్టీ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ప్రథాన్. 2014కు ముందు ఆ పార్టీకి కేవలం 21 శాతం ఓట్ బ్యాంకు ఉంటే దానిని 2019 వరకు 39శాతం వరకు తీసుకురాగలిగారు. దీంతో వీరిద్దరిలో ఒకరికి జాతీయ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ వర్గాల సమాచారం. పార్టీలోని సీనియర్ల పేర్లను కూడా పరిశీస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుడంగా.. కేంద్రంలో గురువారం కొత్త ప్రభుత్వం కొలువు దీరనున్న నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మంగళవారం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ప్రభుత్వ కూర్పు, మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలి తదితర అంశాలపై నాలుగు గంటల పాటు సుధీర్ఘంగా కీలక చర్చలు జరిపినట్లు సమాచారం. దానిలో భాగంగానే బీజేపీ అధ్యక్ష బాధ్యతలు ఎవరికి అప్పగించాలో చర్చించినట్లు తెలుస్తోంది. భేటీలో మోదీ, అమిత్ షా ఏం మాట్లాడుకున్నారనే దానిపై అధికారిక సమాచారం లేకపోయినప్పటికీ, ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించాలనే దానిపైనే వీరు చర్చించారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. -
కమల్ పార్టీకి 3.72% ఓట్లు
చెన్నై: 17వ లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసిన కొత్త పార్టీల్లో కమల్‌హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం) పట్టణ ప్రాంతాల్లో గణనీయమైన ప్రభావాన్ని చూపినట్లు ఓటింగ్ సరళిని పరిశీలిస్తే అర్థం అవుతుంది. తమిళనాడులోని 11 లోక్‌సభ స్థానాల్లో ఎంఎన్ఎం అభ్యర్థులు మూడో స్థానంలో నిలిచారు. ఈ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవడానికి కమల్ నిరాకరించినప్పటికీ ఎంఎన్ఎం పార్టీకి 3.72 శాతం ఓట్లు లభించాయి. ‘కొన్ని ప్రాంతాల్లో మా అభ్యర్థులు 12 శాతం ఓట్లు సాధించారు. ఇంత తక్కువకాలంలో అన్నిచోట్ల బరిలోకి దిగి ఈ ఫలితాలు సాధించడం మంచి ఆరంభమే’ అని కమల్‌హాసన్ హర్షం వ్యక్తం చేశారు. దేశమంతా నరేంద్ర మోదీ ప్రభావం ఉన్నప్పటికీ తమిళ ఓటర్లు మాత్రం తమ రాష్ట్ర పార్టీలకే పట్టంకట్టడం గర్వంగా ఉందన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల నుంచి పాఠాలు నేర్చుకున్నామని, తాము చాలా దూరం ప్రయాణించాల్సివుందని చెప్పారు. అతి తక్కువ సమయం ఉండటంతో ఈ ఎన్నికల్లో అనుకున్నవిధంగా రాణించలేకపోయామని అంగీకరించారు. తమ అంకితభావం చూసి ఏమీ ఆశించకుండా ప్రజలు తమకు ఓటు వేశారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు అత్యధిక ఓట్లు సాధించిన తమ అభ్యర్థులు వచ్చే ఎన్నికల్లో విజేతలుగా నిలుస్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. బీజేపీకి పట్టం కట్టిన రాష్ట్రాలతో సమానంగా తమిళనాడును చూడాలని ప్రధాని నరేంద్ర మోదీకి కమల్‌హాసన్ విజ్ఞప్తి చేశారు. -
‘మోదీ విజయ రహస్యం అదే’
తిరువనంతపురం : పాలనలో గాంధీ సిద్ధాంతాలను అవలంబించినందు వల్లే నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని అయ్యారంటూ కేరళ కాంగ్రెస్ నేత ఏపీ అబ్దుల్లాకుట్టి ప్రశంసలు కురిపించారు. మోదీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు ఘన విజయానికి దోహదం చేశాయని పేర్కొన్నారు. ముఖ్యంగా స్వచ్ఛ భారత్ అభియాన్ వంటి పథకాలు బీజేపీకి అనుకూల పవనాలు వీచేలా చేశాయని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు.. ‘ నరేంద్ర మోదీ విజయం’ పేరిట ఫేస్బుక్ పోస్టులో తన అభిప్రాయాలు పంచుకున్నారు. బీజేపీ ఏకపక్ష విజయం కేవలం విపక్షాలనే కాదు.. ఆ పార్టీ వాళ్లను కూడా విస్మయానికి గురిచేసిందని పేర్కొన్నారు. భేషజాలకు పోకుండా పార్టీలకు అతీతంగా నాయకులంతా సార్వత్రిక ఫలితాలను స్వాగతించాలని హితవు పలికారు. గాంధీ సిద్ధాంతాలను అనుసరించడమే నరేంద్ర మోదీ విజయ రహస్యమని పేర్కొన్నారు. కాగా ఏపీ అబ్దుల్లాకుట్టి 1999-2004 మధ్య కన్నూరు నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహించారు. నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలోనూ అబ్దుల్లా.. ఆయనపై ప్రశంసలు కురిపించారు. దీంతో క్రమశిక్షణా ఉల్లంఘన చర్యల కింద 2009లో సీపీఐ(ఎం) పార్టీ ఆయనను సస్పెండ్ చేసింది. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా మరోసారి మోదీని ప్రశంసించి చిక్కుల్లో పడ్డారు. ఇక అబ్దుల్లా వ్యాఖ్యలపై స్పందించిన కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడు రామచంద్రన్.. ఆయనపై కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. -
పేదరికం నుంచి పార్లమెంట్‌కు
తిరువనంతపురం: కృషి, పట్టుదల, సంకల్పం ఉంటే ఏదైనా సాధించగలం అని నిరూపించారు కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ రమ్య హరిదాస్. పేదరికంలో పుట్టి దేశ అత్యున్నత శాసనవ్యవస్థ పార్లమెంట్ వరకు ఎదగగలిగారంటే మామూలు విషయం కాదు. ఇటీవల వెలువడిన సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాల్లో కేరళలోని పాలక్కాడ్ జిల్లా అలత్తూర్ లోక్‌సభ స్థానం నుంచి రమ్య విజయం సాధించి సంచలనం సృష్టించారు. ఇప్పుడు రమ్య పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగుతోంది. దీనికి కారణం లేకపోలేదు. ఒక సాధారణ దినసరి కార్మికుడి కూతురు కమ్యూనిస్ట్ కంచుకోటలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అంతేకాదు రాష్ట్ర నుంచి ఎన్నికైన ఏకైక మహిళా ఎంపీ రమ్యనే కావడం విశేషం. 32 ఏళ్ల దళిత ఎంపీ అయిన రమ్య.. తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ పేదలకు సేవ చేస్తానంటోన్నారు. పేదరికం, నిరుద్యోగం, మహిళల సమస్యలపై పార్లమెంట్లో పోరాడుతానని అంటున్నారు. 2010లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ యువ నాయకత్వం కోసం సాగించిన వెతుకులాటలో స్థానిక దళిత సామాజిక వర్గానికి చెందిన 32 ఏళ్ల రమ్య హరిదాస్ రాహుల్‌గాంధీ దృష్టిని ఆకర్షించారు. మంచి వాగ్ధాటి, విషయాలపై అవగాహన, సృజనాత్మకత దళితుల అభివృద్ధి అంశాలపై మంచి పట్టు కలిగిన రమ్యని రాహుల్ తెరపైకి తెచ్చారు. ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికలు సమీపించడంతో పార్టీ ఆమెకు అవకాశం కల్పించింది. రోజుకూలీ కుటుంబంలో పుట్టి.. రమ్య రోజు కూలీ చేసుకుని బతికే దళిత కుటుంబంలో పుట్టారు. ఆమె తండ్రి హరిదాస్ కోజికోడ్ జిల్లాలోని కున్నామంగళమ్‌లో దినసరి కూలీగా పనిచేస్తున్నారు. మహిళా కాంగ్రెస్ నాయకురాలైన తల్లి రాధ స్ఫూర్తితో ఆమె అడుగుజాడల్లో రమ్య అతి చిన్న వయసులోనే సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనటం ప్రారంభించారు. మొట్టమొదట కేరళ కాంగ్రెస్ విద్యార్థి సంఘంలోనూ, ఆపై యువజన కాంగ్రెస్‌లోనూ గత పదేళ్లుగా చురుకైన కార్యకర్తగా పనిచేసిన రమ్య 2010లో కోజికోడ్ యూత్ కాంగ్రెస్ పార్లమెంటరీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. యువ నాయకత్వాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో కొంతమంది యువతని ఎంపిక చేసి వారికి విదేశాల్లో శిక్షణనిచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది గత కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో భాగంగా మన దేశం నుంచి జపాన్, మలేసియా, సింగపూర్, శ్రీలంక దేశాల్లో జరిగిన వరల్డ్ యూత్ కార్యక్రమాలకి వెళ్లిన పది మంది ప్రతినిధుల్లో రమ్య ఒకరు. కున్నమంగళం పంచాయతీకి ఆమె అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. అంతకన్నా ముఖ్యంగా స్థానికంగా ఆదివాసీలు, దళితుల సమస్యలపై అవగాహనను పెంచుకుని, ప్రస్తుతం వివిధ అంశాలపై శిక్షణనిచ్చే స్థాయికి ఎదిగారు. కొండను ఢీకొట్టారు. స్థానికంగా ఎన్నో ఏళ్లుగా పార్టీలో పనిచేస్తోన్న అనేక మంది సీనియర్ నాయకులున్నా పాలక్కాడ్ జిల్లాలోని అలత్తూర్ లోక్‌సభ స్థానానికి రమ్య పేరు తెరపైకి వచ్చింది. మహిళలకు తప్పనిసరిగా అవకాశం కల్పించాల్సిన పరిస్థితులూ, అలత్తూర్‌లో ప్రత్యామ్నాయం లేకపోవడం, ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం కావడానికి తోడు రమ్య సామాజిక చైతన్యం వెరసి ఆమెకు ఈ అవకాశం వచ్చిందని పార్టీ నేతలు భావిస్తున్నారు. 2009 నుంచి పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతోన్న సీసీఐఎం నేత పీకేబిజూను ఓడించి పార్టీ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. -
7 విడతల్లో ఎన్నికలు.. 7 విడతల్లో చేరికలు
కోల్‌కతా : ఈ సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల మధ్య గట్టి పోటీ నడిచిన సంగతి తెలిసిందే. హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఆశించిన ఫలితాలు రాబట్టలేదు. 42 లోక్‌సభ స్థానాలు ఉన్న పశ్చిమ బెంగాల్లో బీజేపీ అనూహ్యరీతిలో పుంజుకొని ఏకంగా 18 స్థానాలు సాధించింది. రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఉన్న దీదీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ కేవలం 22 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యింది. ఈ క్రమంలో ఫలితాలు వెలువడి వారం రోజులు కూడా గడవకముందే.. మమతా బెనర్జీకి గట్టి షాక్ తగిలింది. తృణమూల్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక సీపీఎం ఎమ్మెల్యే మంగళవారం బీజేపీ గూటికి చేరారు. వీరితోపాటు 60మందికి పైగా టీఎంసీ కౌన్సిలర్లూ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రధాన కార్యదర్శి, పశ్చిమ బెంగాల్ పార్టీ ఇన్చార్జి కైలాష్ విజయ్‌వర్గీయ మాట్లాడుతూ.. ‘ఇది ఆరంభం మాత్రమే.. త్వరలోనే మరింత మంది టీఎంసీ నాయకులు బీజేపీలో చేరతారు. బెంగాల్లో ఏడు విడతల్లో ఎన్నికలు జరిగాయి.. అలానే 7 విడతల్లో టీఎంసీ నుంచి బీజేపీలోకి చేరికలు కొనసాగుతాయ’ని ఆయన స్పష్టం చేశారు. ఈ రోజు మొదటి విడత చేరికలు జరిగాయన్నారు విజయ్‌వర్గీయ. ఏడు విడతల్లో దీదీ ప్రభుత్వం కూలిపోతుందని ఆయన పేర్కొన్నారు. టీఎంసీలో ఉన్న చాలా మంది నాయకులు అసహనంతో ఉన్నారని త్వరలోనే వారంతా బీజేపీలో చేరతారని ఆయన చెప్పుకోచ్చారు. ఇదంతా దీదీ స్వయంగా చేసుకుందని విజయ్‌వర్గీయ ఆరోపించారు. తాజాగా ఈ రోజు అనగా మంగళవారం బీజేపీ నాయకుడు ముకుల్ రాయ్ తనయుడైన టీఎంసీ ఎమ్మెల్యే సుబ్రంగ్షు రాయ్‌తోపాటు ఎమ్మెల్యేలు తుషార్‌కాంతి భట్టాచార్య (టీఎంసీ), దేవేంద్రనాథ్ రాయ్ (సీపీఎం) బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. -
మోదీ వేవ్‌కు అసలు కారణాలివే!
సాక్షి, న్యూఢిల్లీ : 2019 లోక్‌సభ ఎన్నికల్లో పాలకపక్ష బీజేపీ అఖండ విజయం సాధించడానికి దారితీసిన కారణాలేమిటీ అనే విషయంలో రాజకీయ శాస్త్రవేత్తలకే ఇంకా స్పష్టత రావడం లేదు. కేవలం నరేంద్ర మోదీ వ్యక్తిగత ప్రతిష్ట వల్ల అఖండ విజయం సిద్ధించిందా? దానికి బీజేపీ పట్ల ఉన్న అభిమానం తోడయిందా ? బ్రాహ్మణ్, బనియన్ పార్టీగా ఉన్న ముద్ర కూడా ఆ వర్గాలను ఆకర్షించడం వల్ల విజయం సాధ్యమైందా? పోటీ చేసిన అభ్యర్థుల బలం వల్ల లేదా చేపట్టిన అభివద్ధి కార్యక్రమాల వల్ల విజయం సాధించిందా? హిందూత్వవాదం గెలిపించిందా ? ఈ అన్ని అంశాలు కలియడం వల్లన విజయం అంత సులువైందా? అన్న అంశాలపై రాజకీయ పండితులు తర్జనభర్జన పడుతున్నారు. నరేంద్ర మోదీకి వ్యక్తిగత ప్రతిష్ట ఉందన్న విషయంలో ఎలాంటి సందేహం లేదుగానీ, అది 2014లో జరిగిన ఎన్నికల సందర్భంగా ఇంతకన్నా ఎక్కువ కనిపించిందని, అలాంటప్పుడు అప్పటికన్నా ఇప్పుడు 21 సీట్లు ఎక్కువ రావడం ఏమిటని అమెరికాలోని వండర్బిల్ట్ యూనివర్శిటీలో పొలిటికల్ సైన్సెస్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న తారిక్ థాచిల్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 2014లో నరేంద్ర మోదీ అనుకూల పవనాలు బలంగా కనిపించినప్పటికీ నాటి విజయం వెనక రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లో పార్టీ బలోపేతానికి బీజేపీ చేసిన పదేళ్ల కషి కూడా ఉందని ఆయన చెప్పారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ భారం, పెరిగిన నిరుద్యోగం ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెంచింది. కానీ అది ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపకపోవడం కూడా ఆశ్చర్యంగా ఉందని అమెరికా టెంపుల్ యూనివర్శిటీలో పొలిటికల్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తోన్న ఆడమ్ జైగ్‌ఫెల్డ్ వ్యాఖ్యానించారు. పీఎం ఆవాస్ యోజన కింద పెదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వడం, స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్ల నిర్మాణం లాంటి కొన్ని పథకాలు మాత్రమే విజయవంతమయ్యాయని, మోదీ ప్రభుత్వం ప్రకటించిన పలు పథకాలు విజయవంతం కాలేదని, అలాంటప్పుడు అభివద్ధిని చూసి ఓటేశారని భావించలేమని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో నిరుద్యోగం, పెరిగిన ఆర్థిక ద్రవ్యోల్బణం ప్రధాన సమస్యలు అవుతాయని ‘లోక్‌నీతి’ సంస్థ సర్వేతోపాటు పలు సర్వేలు చెప్పినప్పటికీ వాటి ప్రభావం కూడా కనిపించక పోవడం ఆశ్చర్యమేనని ఇరువురు ప్రొఫెసర్లు వ్యాఖ్యానించారు. నరేంద్ర మోదీ వ్యక్తిగత ప్రతిష్టకు ‘హిందూత్వ’ వాదం తోడవడం వల్లనే బీజేపీకి అఖండ విజయం సిద్ధించి ఉంటుందని చివరకు ఇరువురు ప్రొఫెసర్లు అభిప్రాయపడ్డారు. హిందూత్వవాదం బయటకు కనిపించలేదన్న విషయాన్ని వారి దృష్టికి మీడియా తీసుకెళ్లగా భారత్‌లోని అన్ని హిందూ వర్గాల్లో అది అంతర్లీనంగా ఉందని, మోదీకి ఎందుకు ఓటేశారని అడిగితే ఆయన హిందూత్వ వాదానికే వేశామని ఎవరు చెప్పరని వారన్నారు. అమెరికా ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్‌కు ఎందుకు ఓటేశారని శ్వేతజాతీయులను ప్రశ్నిస్తే ఆసియన్లు, ఆఫ్రికన్లు అంటే భయం కనుక ట్రంప్ బెటరనుకున్నామని వారు చెప్పలేదని, జాతి పరమైన చర్చల్లో వారి ఆ విషయాన్ని అంగీకరించారని అన్నారు. భారత్ ఎన్నికల్లో నరేంద్ర మోదీ భారత సైనిక సేవల గురించి ప్రస్తావించడం, కొత్త ఓటర్లు తమ తొలి ఓటును సైన్యానికి అంకితమివ్వడంటూ మోదీ పిలుపునివ్వడం కూడా పనిచేసి ఉంటుందని వారన్నారు. ఇలాంటి వాటికి స్పందన మౌనంగానే ఉంటుందని వారు చెప్పారు. -
మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి దీదీ
కోల్‌కతా : సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఈ నెల 30న నరేంద్ర మోదీ రెండో సారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా హాజరవుతున్నారు. ఈ విషయం గురించి మమతా మాట్లాడుతూ.. ‘ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లానే నాకు కూడా మోదీ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం అందింది. ఈ విషయం గురించి ఇతర సీఎంలతో చర్చించాను. దేశ ప్రధాని ప్రమాణ స్వీకార కార్యక్రమం కాబట్టి హాజరవ్వాలని నిర్ణయించుకున్నాను’ అని తెలిపారు. West Bengal CM Mamata Banerjee on PM Modi's oath taking ceremony: I have spoken to other Chief Ministers also. Since it is a ceremonial program we thought of attending it.Yes I will go pic.twitter.com/qbgIomrvCL — ANI (@ANI) May 28, 2019 -
పార్లమెంటు వద్ద ఫొటోలు.. బుక్కైన ఎంపీలు..!
న్యూఢిల్లీ : లోక్‌సభ తాజా ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ తరపున పోటీచేసి గెలిచిన బెంగాల్ నటీమణులు మిమి చక్రవర్తి, నుస్రత్ జహాన్ అత్యుత్సాహం ప్రదర్శించి విమర్శలపాలయ్యారు. ఎంపీలుగా ఎన్నికైన ఈ ఇద్దరు సోమవారం పార్లమెంట్‌ను సందర్శించారు. అనంతరం మోడ్రన్ డ్రెస్సుల్లో అక్కడ ఫొటోలకు పోజిచ్చారు. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో నెటిజన్ల ట్రోలింగ్‌కు గురయ్యారు. ఫొటోలు దిగేందుకే పార్లమెంటుకు వెళ్లారా..? అని నెటిజన్లు వారిని ప్రశ్నిస్తున్నారు. టీఎంసీ మీకు ఏ ప్రాతిపదికన టికెట్లు ఇచ్చిందని, కుర్ర చేష్టలతో బెంగాల్ పరువు తీస్తున్నారని మండిపడుతున్నారు. ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. వారి హక్కుల్ని కాపాడేందుకు ఎన్నుకుంటే.. అక్కడ ఫొటోల పేరుతో డ్రామాలాడుతున్నారని ఓ నెటిజన్ చురకలంటించారు. ఓ ప్రజాప్రతినిధిగా హుందాగా ఉండాల్సింది పోయి.. సినిమా షూటింగ్లో మాదిరిగా ఈ ట్రెండీ లుక్ అవసరమా అని మరో నెటిజన్ విమర్శించారు. ఇక మిమి.. జాదవ్‌పూర్ నుంచి నుస్రత్.. బసిర్హాత్ నుంచి ఎంపీలుగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. -
‘పార్టీని నడపడానికి ఆయనే సమర్థుడు’
న్యూఢిల్లీ : ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితుల్లోంచి రాహుల్ గాంధీ మాత్రమే బయట పడేయగలరని ఆ పార్టీ సీనియర్ నేత శశి థరూర్ అభిప్రాయపడ్డారు. ఓ ఆంగ్ల మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇక కాంగ్రెస్ పని అయిపోయింది’ అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే వారివి చాలా తొందరపాటు వ్యాఖ్యలు. వందల ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీని ఈ ఫలితాలు కూల్చలేవు. ఈ ఓటమిని తల్చుకుని బాధపడటం కన్నా.. రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం సిద్ధమవడం చాలా మంచిది. అలాగే పార్టీ కోరితే.. లోక్‌సభలో కాంగ్రెస్ తరఫున ప్రతి పక్ష నేతగా బాధ్యతలు స్వీకరించడానికి నేను సిద్ధమే’ అన్నారు శశి థరూర్. అంతేకాక ప్రస్తుతం దేశంలో బీజేపీకి కాంగ్రెస్ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదన్నారు థరూర్. పార్టీ స్థాపించిన నాటి నుంచి గాంధీ-నెహ్రూ కుటుంబం కాంగ్రెస్‌కి ఎంతో సేవ చేసింది. అలాంటి వారికి పార్టీలో ఎప్పుడూ సముచిత గౌరవం ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇక పార్టీ ఓటమికి ఒక వ్యక్తినే బాధ్యున్ని చేయడం మంచి పద్దతి కాదని థరూర్ అభిప్రాయపడ్డారు. అయినా కుడా రాహుల్ గాంధీ ఒక్కరే అందుకు బాధ్యత వహించడం గొప్ప విషయమన్నారు. కానీ, పార్టీ పరాజయానికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించి.. పూర్వ వైభవాన్ని తెచ్చేలా కృషి చేయాల్సిన అవసరముందన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులకు రాహుల్ పట్ల ఎంతో అభిమానముందని ఈ సందర్భంగా థరూర్ పేర్కొన్నారు. ఒకవేళ అధ్యక్ష పదవికి మరెవరైనా పోటీ పడితే వారిని రాహుల్ భారీ మెజారిటీతో ఓడించడం ఖాయమన్నారు థరూర్. అందరినీ కలుపుకొనిపోయి, పార్టీని ముందుకు నడపడంలో ప్రస్తుతానికి రాహుల్‌కు మించిన నేత కాంగ్రెస్‌లో మరొకరు లేరని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ఏం చేసినా దేశ భవిష్యత్తు కోసమేనన్నారు. దేశంలో రైతాంగ సంక్షోభం, నిరుద్యోగం లాంటి తీవ్ర సమస్యలున్నప్పటికీ ప్రజలు మోదీకే ఓటేశారన్నారు. దీనికి ప్రజల మధ్య బీజేపీ రేపిన మతవిద్వేషాలు ఒక కారణమైతే.. దేశాన్ని నడిపించడానికి మోదీ తప్ప మరో నాయకుడు లేడని చేసిన తప్పుడు ప్రచారం మరో కారణమని థరూర్ ఆరోపించారు. (చదవండి : మోదీని రాహుల్ జయించాలంటే..?) -
దీదీకి గట్టి షాక్.. బీజేపీలోకి ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు
సాక్షి, న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి గట్టి షాక్ తగిలింది. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వలసలు మొదలయ్యాయి. తాజా లోక్‌సభ ఎన్నికల్లో దీదీ కంగుతిన్న నేపథ్యంలో తృణమూల్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక సీపీఎం ఎమ్మెల్యే మంగళవారం బీజేపీ గూటికి చేరారు. వీరితోపాటు 60మందికిపైగా టీఎంసీ కౌన్సిలర్లూ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ నాయకుడు ముకుల్ రాయ్ తనయుడైన టీఎంసీ ఎమ్మెల్యే సుబ్రంగ్షు రాయ్‌తోపాటు ఎమ్మెల్యేలు తుషార్‌కాంతి భట్టాచార్య (టీఎంసీ), దేవేంద్రనాథ్ రాయ్ (సీపీఎం) బీజేపీలో చేరారు. హోరాహోరీగా జరిగిన ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఆశించిన ఫలితాలు రాబట్టని సంగతి తెలిసిందే. 42 లోక్‌సభ స్థానాలు ఉన్న పశ్చిమ బెంగాల్లో బీజేపీ అనూహ్యరీతిలో పుంజుకొని ఏకంగా 18 స్థానాలు సాధించింది. రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఉన్న దీదీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ కేవలం 22 స్థానాలు మాత్రమే సాధించింది. -
మోదీని రాహుల్ జయించాలంటే..?
సాక్షి, న్యూఢిల్లీ : 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి ఎదురైన పరాజయానికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన పదవికి రాజీనామా చేశారని, ఆయన రాజీనామాను శనివారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ద్వంద్వంగా తిరస్కరించిందని, అయినప్పటికినీ ఆయన రాజీనామా ఉపసంహరణకు తిరస్కరించారని, చివరకు ఆయన రాజీనామాకు సోనియా గాంధీ ఆమోదం తెలిపారని శనివారం నుంచి నేటి వరకు వరుసగా వస్తున్న వార్తలు. ప్రస్తుతానికి ఇదంతా ఓ రాచ కుటుంబంలో జరుగుతున్న ఓ డ్రామాగా, ఓ ప్రవహసనంలా కనిపిస్తోంది. ప్రజాస్వామిక పార్టీలో గెలుపోటములకు నాయకులు నైతిక బాధ్యత వహించడం, ఓటమి సమయాల్లో పదవులకు రాజీనామా చేయడం పరిపాటిగా మారిన పరిణామమే. కానీ ఇక్కడ రాజీనామా చేసిన వ్యక్తి పట్టాభిషేకం కోసం ఎదురుచూస్తోన్న యువరాజు. ఓ మాజీ ప్రధానికి ముని మనవడు, మరో మాజీ ప్రధానికి మనవడు, మరో మాజీ ప్రధానికి పుత్రరత్నం. అంతటి వాడు రాజీనామా చేశారంటే అలకపాన్పు ఎక్కిన యువరాజే కళ్లముందు కదులుతారు. శనివారం జరగిన సీడబ్ల్యూ సమాశం కూడా ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న పార్టీ కీలక సమావేశంలా కనిపించలేదు. రాజదర్బారుగానే కనిపించింది. రత్నకచిత స్వర్ణ సింహాసనం లేకపోయినా, సోనియా గాంధీ ఆసీనులైన మహారాణిలాగే కనిపించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పార్టీ విజయావకాశాల గురించి పట్టించుకోకుండా తమ కుమారులకు టిక్కెట్లు ఇప్పించుకునేందుకే ఎక్కువ ప్రయత్నించారని ఆ దర్బారులో రాహుల్ గాంధీ ఆరోపించడం యువరాజు తీరులాగే కనిపించింది. మధ్యప్రదేశ్‌లో సింధియాల నుంచి అస్సాంలో గొగోయ్‌లు, పశ్చిమ బెంగాల్లో ఖాన్ చౌదరీల వరకు వారసత్వ రాజకీయాలు నెరపుతున్న భూస్వాములే. కొడుకులకు టిక్కెట్లు ఇప్పించుకునేందుకు తాపత్రయ పడే తండ్రులే. రాహుల్ ఆరోపణల్లో నిజం లేదని కాదు. ఆయన పార్టీలోకి ప్రవేశించిన వైనాన్ని కూడా ఓ సారి గుర్తు చేసుకోవాలి. వారసత్వ రాచ కుటుంబంలో జరిగినట్లుగానే 2013లో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా రాహుల్ గాంధీ నియమితులయ్యారు. ఆయన పదవి కోసం ఎవరు పోటీ పడలేదు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం రాలేదు. ఆ తర్వాత అధ్యక్షుడిగా కూడా అలాగే ఎంపికయ్యారు. ఆ మాటకొస్తే వారసత్వ రాజకీయాలకు మన దేశంలో ఏ పార్టీ అతీతం కాదు. పాలకపక్ష బీజేపీలో వారసత్వ వారసులు ఇతర పార్టీలకన్నా ఎక్కువ ఉన్నారు. అయినా అది ఎప్పుడు చర్చనీయాంశం కాదు. ఎందుకంటే వారు పార్టీని నడిపించే జాతీయ నాయకత్వంలో లేరు. రాహుల్ గాంధీ పార్టీ నాయకత్వంలో ఉన్నారు కనుకనే నేడు కాంగ్రెస్ పార్టీ చక్రవర్తి, సామంత రాజుల వ్యవస్థలాగే కనిపిస్తోంది. అలాంటప్పుడు పార్టీలోని నాయకులు పదవుల కోసం ప్రాకులాగుతారు తప్పా, పార్టీ విజయం కోసం ప్రయాస పడరు. రాహుల్ గాంధీ రాజీనామా నాటకం కాకుండా నిజమే అయితే, ఆయన రాజీనామాను ఆమోదించి మరో సమర్థుడైన అధ్యక్షుడిని ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నుకునే ప్రక్రియను ప్రారంభించాలి. అంటే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు, అక్కడి నుంచి జాతీయ స్థాయి వరకు పార్టీ కమిటీలను పునరుద్ధరిస్తూ వాటి అధ్యక్ష కార్యదర్శులను ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నుకుంటూ రావాలి. చిట్ట చివరికి పార్టి అధ్యక్షుడిని కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే ఎన్నుకోవాలి. అప్పుడుగానీ పార్టీకి కొత్త జవసత్వాలు రావు. ఈ ప్రక్రియను పూర్తి చేసే వరకు పార్టీకి అపద్ధర్మ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ కొనసాగినా ఫర్వాలేదు. ప్రజాస్వామ్య ప్రిక్రియలో కూడా పార్టీ రాహుల్ గాంధీనే కోరుకుంటే ఆయనకు అంతకన్నా అదృష్టం మరోటి ఉండదు. అప్పటికీ నరేంద్ర మోదీ లాంటి నాయకుడిని ఎదుర్కొనే పరిణతి కచ్చితంగా వచ్చి తీరుతుంది. అంతటి ఓపిక, శక్తి తనకు లేదనుకుంటే రాజకీయాలకు సెలవు చెప్పి రాహుల్ గాంధీ మాల్దీవులకు వెళ్లిపోవచ్చు! -
పార్టీని వీడేందుకు 15 మంది ఎమ్మెల్యేలు సిద్ధం..
అహ్మదాబాద్ : లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం కాంగ్రెస్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి. పలు రాష్ట్రాల పార్టీ చీఫ్‌లు ఓటమికి బాధ్యత వహిస్తూ రాజీనామాల బాటపడుతున్నారు. ఇక కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో ఆ పార్టీ ప్రభుత్వాలను అస్ధిరపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందనే వార్తలు కలవరపెడుతున్నాయి. మరోవైపు గుజరాత్లో 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సిద్ధఃగా ఉన్నారని ఆ పార్టీ మాజీ నేత, ఓబీసీ నాయకుడు అల్పేష్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వ సమస్యను ఎదుర్కొంటోందని, పార్టీ ఇదే పనితీరును కనబరిస్తే మరో పదేళ్లు పైగా అధికారానికి దూరంగా ఉండాల్సిన పరిస్ధితి అనివార్యమని హెచ్చరించారు. సరైన నాయకుడు లేకపోవడంతో గుజరాత్లో పార్టీ ఎమ్మెల్యేల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, సగానికి పైగా ఎమ్మెల్యేలు పార్టీ పట్ల ఆగ్రహంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇక నాయకత్వ లక్షణాల్లో ప్రధాని మోదీతో రాహుల్ గాంధీని పోల్చలేమని, మోదీతో రాహుల్ సరితూగలేరని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ టికెట్‌పై పటాన్ జిల్లా రతన్‌పూర్ నుంచి ఎన్నికైన అల్పేష్ ఠాకూర్ లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలిగారు. -
మోదీ ప్రమాణ స్వీకారానికి సూపర్‌స్టార్
సాక్షి, తమిళనాడు: దేశ ప్రధానిగా రెండోసారి ఎన్నికైన నర్రేంద మోదీపై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రశంసల జల్లు కురిపించారు. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ తరువాత అంతటి చరిష్మా గల నాయకుడు మోదీ అని వర్ణించారు. మోదీ గెలుపును ప్రతి ఒక్కరూ అంగీకరించాలని ఆయన కోరారు. ఈనెల 30న రెండోసారి దేశ ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి తాను కూడా హాజరవుతున్నానని రజనీ తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. దేశ వ్యాప్తంగా మోదీ ప్రభంజనం సృష్టించినప్పటికీ.. తమిళనాడులో మాత్రం ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారని అన్నారు. కాంగ్రెస్ పరాజయం పాలైనంత మాత్రానా రాహుల్ రాజీనామా చేస్తాననటం సరైనది కాదని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో గెలుపోటములు సాధారణమన్నారు. అధికార పక్షం ఎంత ముఖ్యమో.. ప్రతిపక్షం కూడా అంతే ముఖ్యమని అన్నారు. కాగా తమిళనాడులో అన్నాడీఎంకేతో కూటమి కట్టిన బీజేపీ బొక్క బోర్లా పడ్డ విషయం తెలిసిందే. కనీసం ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోయింది. రజనీతో మరో తమిళ నటుడు, మక్కల్ నిధి మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ కూడా మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైయ్యే అవకాశం ఉంది. వీరిద్దరిని మోదీ స్వయంగా ఆహ్వానించారు. దీనిపై కమల్ ఇప్పటివరకూ స్పందిచలేదు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన కమల్ పార్టీ.. ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. -
రాహుల్ నివాసానికి పార్టీ ప్రముఖుల క్యూ
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ చీఫ్‌గా కొనసాగేందుకు రాహుల్ గాంధీ అంగీకరించారని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. రాహుల్‌తో సమావేశమైన పార్టీ ప్రముఖులు అశోక్ గెహ్లాత్, సచిన్ పైలట్, ప్రియాంక గాంధీ తదితరులు పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలని ఒత్తిడి తేవడంతో ఈ పదవిలో కొనసాగేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. తొలుత పార్టీ చీఫ్‌గా కొనసాగడంపై రాహుల్ విముఖత చూపడం, ప్రత్యామ్నాయ నేతను ఎంపిక చేసుకోవాలని స్పష్టం చేయడంతో ఆ పార్టీలో సంక్షోభం తీవ్ర స్ధాయికి చేరింది. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమితో పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అధ్యక్ష పదవిలో కొనసాగాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చేసిన సూచనను రాహుల్ తోసిపుచ్చడంతో పార్టీలో హైడ్రామా కొనసాగుతోంది. మంగళవారం ఉదయం రాహుల్ నివాసం కేంద్రంగా హైడ్రామా సాగింది. ఆయన నివాసానికి పార్టీ ప్రముఖులు వరుసగా క్యూ కట్టారు. రాహుల్‌ను కలిసేందుకు మంగళవారం రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లాత్, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, పార్టీ ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సుర్జీవాలా, సచిన్ పైలట్ తదితరులు ఆయన నివాసానికి వచ్చారు. తదుపరి కార్యాచరణపై వారు రాహల్‌తో సంప్రదింపులు జరిపారు. లోక్‌సభ ఎన్నికల్లో ఘోరపరాజయం నేపథ్యంలో రాహుల్ రాజీనామా పార్టీని మరింత ఇరకాటంలో పడేసింది. మరోవైపు సార్వత్రిక సమరంలో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ పంజాబ్, జార్ఖండ్, అసోం, యూపీ పార్టీ చీఫ్‌లు తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు రాహుల్ మెత్తబడటంతో కాంగ్రెస్ వర్గాలు ఊపిరిపీల్చుకున్నాయి. రాహుల్ బెట్టు వీడటంతో మంగళవారం జరగాల్సిన వర్కింగ్ కమిటీ భేటీ కూడా రద్దయినట్టు సమాచారం. -
గోరంట్ల మాధవ్‌కు అక్కడ కూడా ఫ్యాన్స్!
దొడ్డబళ్లాపురం : సీఐ ఉద్యోగానికి రాజీనామా చేసి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి మొదటిసారి ఎన్నికల్లో పోటీచేసి ఎంపీగా అఖండ విజయం సాధించిన గోరంట్ల మాధవ్‌కు కర్ణాటకలోనూ ఫ్యాన్స్ నీరాజనాలు పడుతున్నారు. గెలిచినా ఎటువంటి భేషజాలకు పోకుండా ఆచితూచి ఆయన చెబుతున్న మాటలు కూడా చాలామందికి నచ్చుతున్నాయి. ఇప్పటికే గోరంట్ల మాధవ్ గురించి కన్నడ పత్రికలు, మీడియా కూడా ప్రత్యేక కథనాలు ప్రచురించింది. ఆయన గెలుపు ఒక ఎత్తయితే.. గెలిచిన తరువాత పై అధికారులకు సెల్యూట్ చేసిన ఫోటోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘గెలుపంటే ఇదీ...గొప్ప వ్యక్తి...గొప్పవాళ్లు ఇలాగే ప్రవర్తిస్తారు’ అంటూ ప్రశంసిస్తున్నారు. -
కాంగ్రెస్‌కు మరో పీసీసీ రాజీనామా
చండీగఢ్: సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌లో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ.. ఇప్పటికే పలు రాష్ట్రాల పీసీసీలు పదవి నుంచి వైదొలగగా.. తాజాగా పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ సునిల్ జక్కర్ పదవికి రాజీనామా చేశారు. గురుదాస్ పూర్ లోక్‌సభ స్థానం నుంచి ఆయన పోటీ చేసిన విషయం తెలిసిందే. బీజేపీ అభ్యర్థి, నటుడు సన్నీ డియోల్ చేతిలో ఆయన ఓటమిచెందారు. అయితే 2017లో బీజేపీ ఎంపీ వినోద్ ఖన్నా మరణంతో ఖాళీ అయిన ఈ స్థానంలో ఉప ఎన్నిక జరగగా.. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన సునిల్ జక్కర్ గెలుపొందారు. ఈ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా వీచిన మోదీ గాలి.. గురుదాస్పూలోర్నూ ప్రభావం చూపించింది. దీంతో సన్నీ డియోల్ చేతిలో ఆయన ఓటమి చెందారు. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ..తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు జక్కర్ ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేఖ పంపారు. కాగా జక్కర్ రాజీనామాపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ అసహనం వ్యక్తం చేశారు. ఓటమి చెందినంత మాత్రనా పదవికి రాజీనామ చేయాల్సిన అవసరంలేదని అన్నారు. కాగా పంజాబ్‌లోని 13 లోక్‌సభ స్థానాల్లో అధికార కాంగ్రెస్ ఎనిమిది స్థానాలను సొంతం చేసుకున్న విజయం తెలిసిందే. -
రాహుల్ రాజీనామాకు సోనియా అంగీకారం!
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సంక్షోభం ముదురుతోంది. కాంగ్రెస్ అధ్యక్ష పదవికీ రాజీనామా చేసిన రాహుల్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేందుకు ససేమిరా అంటున్నారు. తాజాగా సోమవారం కాంగ్రెస్ అధిష్టానం ఇద్దరు దూతలు అహ్మద్‌పటేల్, కేసీ వేణుగోపాల్లను రాహుల్ వద్దకు పంపగా, ఆయన తన నిర్ణయాన్ని మరోసారి స్పష్టంగా చెప్పినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. తాను మళ్లీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించబోననీ, ఇందుకోసం మరొకరిని ఎంపిక చేసుకోవాలని రాహుల్ సూచించినట్లు సమాచారం. కొత్త అధ్యక్షుడు ఎన్నికయ్యే వరకూ తాను తాత్కాలిక బాధ్యతలు నిర్వహిస్తానని రాహుల్ చెప్పారు. తొలుత రాహుల్ రాజీనామాకు ఒప్పుకోని యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, సోదరి ప్రియాంక ఆయన్ను సముదాయించే ప్రయత్నం చేశారు. అయితే రాహుల్ వెనక్కి తగ్గకపోవడంతో వీరిద్దరూ చివరకు ఆయన రాజీనామాకు అంగీకరించిట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ తరఫున లోక్‌సభకు ఎన్నికైన కొత్త ఎంపీలను కలుసుకునేందుకు రాహుల్ నిరాకరించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి నూతన సారథిగా ఎవరు వ్యవహరిస్తారన్న విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పార్టీ కోసం పనిచేస్తా.. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ తాను పార్టీ కోసం పనిచేస్తానని కాంగ్రెస్ దూతలకు రాహుల్ చెప్పినట్లు సమాచారం. రాహుల్ కాంగ్రెస్ చీఫ్‌గా తప్పుకుంటే తాను తీవ్రమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సీనియర్ నేత చిదంబరం వ్యాఖ్యానించినట్లు సమాచారం. సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్, ప్రియాంకలు సీనియర్ నేతలపై మండిపడినట్లు వస్తున్న వార్తలపై ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా స్పందించారు. ‘ఈ విషయంలో తప్పుడు కథనాలు, వదంతులకు దూరంగా ఉండాలని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాం’ అని ఆయన వివరణ ఇచ్చారు. నెహ్రూకు నివాళులు.. భారత తొలిప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ 55వ వర్ధంతి సందర్భంగా యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్, మాజీ రాష్ట్రపతి ప్రణబ్, మాజీ ప్రధాని మన్మోహన్లు యమునా నదీతీరన ఉన్న శాంతివన్లో సోమవారం ఆయనకు నివాళులు అర్పించారు. కర్ణాటక, రాజస్తాన్‌లో నీలినీడలు పార్టీలో సంక్షోభం కొనసాగుతున్న వేళ కర్ణాటక, రాజస్తాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాలు కొనసాగడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ తిరుగుబాటు నేతలు రమేశ్ జర్కిహోళీ, డా.సుధాకర్‌లు బీజేపీ సీనియర్ నేత ఎస్ఎం కృష్ణతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం బొటాబోటీ మెజారిటీతో కొనసాగుతున్న నేపథ్యంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి గల అవకాశాలపై చర్చించారు. మంత్రి పదవులు దక్కక గుర్రుగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేతలపై బీజేపీ దృష్టి సారించినట్లు సమాచారం. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం జూన్ 10 వరకే కొనసాగుతుందని కాంగ్రెస్ నేత కేఎన్ రాజన్న బాంబు పేల్చారు. రాజస్తాన్‌లో కాంగ్రెస్‌లో కుమ్ములాటలు మొదలయ్యాయి. ఈ ఘోర ఓటమికి రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లోత్ నైతిక బాధ్యత వహించి పదవి నుంచి తప్పుకోవాలని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్ చీఫ్‌గా రాహుల్ తప్పుకున్న నేపథ్యంలో పార్టీలో కూడా రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ సునీల్ జాఖర్, జార్ఖండ్ చీఫ్ అజయ్ కుమార్, అస్సాంలో పార్టీ అధ్యక్షుడు రిపున్ బోరా సహా పలువురు నేతలు తమ అధ్యక్ష పదవులకు రాజీనామాలు సమర్పించారు. -
మోదీ ప్రమాణానికి ‘బిమ్స్టెక్’ నేతలు
న్యూఢిల్లీ/చెన్నై: ప్రధాని మోదీ ప్రమాణస్వీకార వేడుకకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రపతిభవన్‌లో మే 30న జరిగే ఈ కార్యక్రమానికి బిమ్స్టెక్ దేశాల అధినేతలు హాజరుకానున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బిమ్స్టెక్లో భారత్‌తో పాటు బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయ్‌లాండ్‌లు సభ్యదేశాలుగా ఉన్నాయి. ఈ వేడుకకు పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ హాజరవుతారా? లేదా? అనే దానిపై స్పష్టత రాలేదు. షాంఘై సహకార సంస్థ(ఎస్సీవో) చైర్మన్, కిర్గిజిస్తాన్ అధ్యక్షుడు సూరొన్‌బే జిన్బెకోవ్, మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నాథ్ కూడా మోదీ ప్రమాణస్వీకారానికి ఆహ్వానించినట్లు సమాచారం. వీరితో పాటు ప్రముఖ నటులు రజనీకాంత్, మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం) అధినేత కమల్‌హాసన్‌లకు ఈ కార్యక్రమానికి రావాలంటూ ఆహ్వానం పంపినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు మోదీ, ఆయన మంత్రివర్గ సహచరుల ప్రమాణస్వీకారం అనంతరం రాష్ట్రపతి కోవింద్ జూన్ 6న పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారని వెల్లడించాయి. అదేరోజు రాష్ట్రపతి ప్రొటెం స్పీకర్‌ను ఎంపిక చేస్తారనీ, ఆయన ఇతర ఎంపీలతో ప్రమాణస్వీకారం చేయిస్తారని పేర్కొన్నాయి. జూన్ 10న కొత్త స్పీకర్‌ను ఎన్నుకునేంతవరకూ ప్రొటెం స్పీకర్ ఈ బాధ్యతలు నిర్వర్తిస్తారు. ప్రొటెం స్పీకర్ కోసం బీజేపీ నేతలు సంతోష్‌కుమార్ గంగ్వార్, మేనకాగాంధీల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. 17వ లోక్‌సభ సమావేశాలు జూన్ 6 నుంచి 15 వరకూ సాగనున్నాయి. -
తొలి పది పదిలం
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసేందుకు రెండ్రోజులే ఉండటంతో కేబినెట్ కూర్పు కసరత్తు ముమ్మరమైనట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలు పార్టీ సీనియర్ నేతలు, ఎన్డీయే పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపాయి. ప్రధాని కార్యాలయంలో (పీఎంఓ) మార్పులపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ప్రధాని ముఖ్య కార్యదర్శి నృపేంద్ర మిశ్రా స్థానంలో మరొకరు రావచ్చని తెలుస్తోంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పీఎంఓలోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. గుజరాత్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జేఎన్ సింగ్, ఢిల్లీ లెఫ్టినెంట్ జనరల్ అనిల్ బైజాల్‌తో పాటు మరికొన్ని కొత్తపేర్లు తెరపైకి వస్తున్నాయి. వీరి స్థానాలు పదిలం పార్టీ తరఫున పెద్ద సంఖ్యలో ఎంపీలు ఎన్నికైనందున కేబినెట్ కూర్పు కొంత కష్టమేనని, ఒకవేళ సీనియర్లు కొందరికి చోటు దక్కకపోయినా వారు చేయగలిగిందేమీ ఉండకపోవచ్చని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఏది ఏమైనా రాజ్‌నాథ్, నిర్మలా సీతారామన్, గడ్కారీ, తావర్ చంద్ గెహ్లోత్, ప్రకాశ్ జవదేకర్, జేపీ నడ్డా, మేనకా గాంధీ వంటి పది మంది అగ్రనేతలకు కేబినెట్లో తిరిగి చోటు దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒకవేళ ఆరోగ్యం మెరుగుపడి, వారు అంగీకరిస్తే జైట్లీ, సుష్మా స్వరాజ్లను తీసుకోవచ్చని తెలుస్తోంది. రాజ్యసభ సభ్యులు, ఇటీవలి ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికైన ముగ్గురు నేతలు రవిశంకర్ ప్రసాద్, స్మృతీ ఇరానీ (ఇప్పటికే మంత్రులు), పార్టీ అధ్యక్షుడు అమిత్ షా (తొలిసారి మంత్రి అవుతారు)లకు కీలక శాఖలు దక్కే అవకాశం ఉందని అంటున్నారు. బెంగాల్‌కు ప్రాధాన్యత పశ్చిమబెంగాల్లో పార్టీ 18 సీట్లతో ఘన విజయం సాధించిన నేపథ్యంలో 2021 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆ రాష్ట్రానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. బాబుల్ సుప్రియో (ప్రస్తుత మంత్రి), లాకెట్ ఛటర్జీ, సుభాష్ సర్కార్, జయంత్ సర్కార్లకు బెంగాల్ నుంచి కేబినెట్లోకి రావొచ్చు. ఎక్కువగా యువతరానికి, కొత్త ముఖాలకు కేబినెట్లో అవకాశం ఉంటుందని పార్టీవర్గాలు వివరించాయి. ఇదే సమయంలో మిత్రపక్షాలకు తగిన ప్రాధాన్యత లభిస్తుందని శనివారం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో మోదీ ప్రసంగాన్ని గుర్తుచేస్తూ ఆ వర్గాలు వెల్లడించాయి. జేడీయూ, శివసేనలతో పాటు ఇతర పార్టీలకు చోటు దొరకొచ్చని చెప్పాయి. కేబినెట్ కార్యదర్శిగా రాజీవ్ గౌబా! గౌబా 1982 బ్యాచ్ జార్ఖండ్ కేడర్ అధికారి న్యూఢిల్లీ: కొత్త కేబినెట్ కార్యదర్శిగా హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా నియమితులయ్యే చాన్సుంది. ప్రస్తుత కార్యదర్శి పి.కె.సిన్హా నాలుగేళ్ల పదవీ కాలం జూన్ 12తో ముగుస్తున్నట్లు అధికారులు సోమవారం తెలిపారు. కాగా హోం శాఖ కార్యదర్శి పోస్టు కోసం ఇతరులతో పాటు కశ్మీర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం పోటీ పడుతున్నారు. అత్యంత సీనియర్ అధికారి అయిన గౌబా కేంద్రంలో, జార్ఖండ్, బిహార్ ప్రభుత్వాల్లో పనిచేశారు. ఆగస్టు 31తో హోం శాఖ కార్యదర్శిగా ఆయన రెండేళ్ల పదవీకాలం పూర్తవుతుంది. అయితే దేశంలోనే అత్యున్నతమైన కేబినెట్ కార్యదర్శి పోస్టుకు గౌబా ఎంపికయ్యే అవకాశం ఉందని ఈ పరిణామాలపై అవగాహన కలిగిన అధికారి ఒకరు వెల్లడించారు. ఈయన జార్ఖండ్ కేడర్‌కు చెందిన 1982 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఈయన కేబినెట్ కార్యదర్శి అయ్యే పక్షంలో తొలుత రెండేళ్ల పదవీ కాలానికి నియమితులయ్యే అవకాశం ఉంది. తర్వాత మరో రెండేళ్ల పాటు దీనిని పొడిగించే అవకాశం ఉంటుంది. సిన్హా కూడా 2015లో తొలుత రెండేళ్ల పదవీకాలానికి నియమితులై, తర్వాత 2016, 2018లో పొడిగింపు పొందారు. -
ఎన్నికల లెక్కలపై కెమిస్ట్రీ గెలుపు
వారణాసి/ న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఏకపక్ష విజయం కట్టబెట్టేలా ఎన్నికల గణితం (అర్థమెటిక్)పై కెమిస్ట్రీ గెలుపు సాధించిందని ప్రధాని మోదీ అన్నారు. ‘ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే గణాంకాలన్నిటినీ మించిన కెమిస్ట్రీ (రసాయన శాస్త్రం) ఒకటి ఉందనే విషయం అర్ధమవుతుంది. ఈసారి ఎన్నికల్లో ఆ కెమిస్ట్రీయే గణాంకాలపై విజయం సాధించింది’ అని మోదీ వివరించారు. ‘నేను దేశానికి ప్రధానమంత్రిని. కానీ మీకు ఎంపీని. మీ సేవకుడిని’ అని ప్రధాని అన్నారు. పార్టీ కార్యకర్తలు ఎన్నికల పరీక్షను డిస్టింక్షన్‌తో ఉత్తీర్ణులయ్యారన్నారు. వరసగా రెండో సారి తనను గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలియ జేసేందుకు సోమవారం ఆయన వారణాసి సందర్శించారు. కాశీ విశ్వనాథుని ఆలయంలో పూజలుచేశారు. బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. అంతకుముందు రోడ్ షోను తలపిస్తూ నగరంలోని పలు వీధుల గుండా భారీ బందోబస్తు మధ్య ఆయన వాహనశ్రేణి ముందుకుసాగింది. ఈ సందర్భంగా ప్రజలు రోడ్లపై బారులు తీరి నిలబడ్డారు. దాబాలపై నుంచి గులాబీ రేకులు విసిరారు. అదో దురభిప్రాయం కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. బీజేపీ హిందీ రాష్ట్రాలకు పరిమితమైన పార్టీ అనేది ఒక దురభిప్రాయంగా మోదీ కొట్టిపారేశారు. లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పార్టీ సాధించిన విజయాలే అందుకు నిదర్శనమన్నారు. రాజకీయ పండితులు బీజేపీని ఇప్పటికీ హిందీ రాష్ట్రాలకు పరిమితమైన పార్టీగా పరిగణించడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వారి ఆలోచనా విధానం, తార్కికత 20వ శతాబ్దానిదనే విషయం వారికి తెలియదన్నారు. బీజేపీ ఓట్ల శాతం పెరగని ప్రాంతమే దేశంలో లేదన్నారు. ‘అసోంలో మన ప్రభుత్వం ఉంది. లడఖ్‌లో గెలుస్తున్నాం. అయినా రాజకీయ పండితులు మనవి హిందీ ప్రాంత రాజకీయాలంటారు. ఈ విధంగా ఒక తప్పుడు అభిప్రాయాన్ని సృష్టించారు’ అని మోదీ చెప్పారు. అబద్ధాలు, తప్పుడు తార్కికతతో ఈ తప్పుడు అభిప్రాయాన్ని సృష్టించారన్నారు. ‘ఇలాంటి తప్పుడు అవగాహన కారణంగానే ప్రజలు మనతో ఉండేందుకు ఇష్టపడరు. కానీ పారదర్శకత, కఠోర శ్రమతో అలాంటి తప్పుడు, చెడు అవగాహన కల్పించేవారిని ఓడించవచ్చు’ అని అన్నారు. రాజకీయ అస్పృశ్యత పెరుగుతోంది.. బీజేపీ రాజకీయ అస్పృశ్యత, రాజకీయ హింస వంటి ముప్పులను ఎలా ఎదుర్కొందో మోదీ చెప్పారు. ‘కేరళ, కశ్మీర్, బెంగాల్ లేదా త్రిపురలకు సంబంధించిన కేసులు చూడండి. త్రిపురలో కార్యకర్తలను ఉరి తీశారు. బెంగాల్లో హత్యలు కొనసాగుతున్నాయి. కేరళలో కూడా. నాకు తెలిసి దేశంలో ఒకేఒక్క రాజకీయ పార్టీ హత్యలకు గురయ్యింది. హింసను చట్టబద్ధం చేశారు. ఇది మన ముందున్న ఒక ప్రమాదం’ అని చెప్పారు. ‘ అంబేడ్కర్, గాంధీజీ అస్పృశ్యతను రూపుమాపారు. కానీ దురదృష్టవశాత్తూ రాజకీయ అస్పృశ్యత పెరుగుతోంది. బీజేపీ కార్యకర్తలు హత్యకు గురవుతున్నారు’ అని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో బీజేపీ నేత హత్య, బెంగాల్లో కార్యకర్త కాల్చివేతలను ప్రస్తావిస్తూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి విద్వేషపూరిత వాతావరణంలో కూడా బీజేపీ.. ‘అందిరితో, అందరి వికాసం కోసం..’ అనే నినాదానికే కట్టుబడి ఉందని చెప్పారు. మిగతా పార్టీల్లాగా బీజేపీ ప్రజాస్వామ్యాన్ని భ్రష్టుపట్టించిన ఓటు బ్యాంకు రాజకీయాలకు తలొగ్గదని చెప్పారు. తనకు వ్యతిరేకంగా పోరాడిన తన ప్రత్యర్థులకు కూడా తాను రుణపడి ఉంటానన్నారు. ప్రజాస్వామ్యంలో విపక్షం ప్రాధాన్యతను ప్రధాని నొక్కిచెప్పారు. ఇతరులు అధికారంలోకి వస్తే ప్రతిపక్ష ఛాయలే ఉండవన్నారు. ‘కానీ త్రిపురలో చూడండి. ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం. అదే సమయంలో మంచి విపక్షం ఉంది. ఇదీ ప్రజాస్వామ్య స్ఫూర్తి’ అని అన్నారు. ప్రభుత్వానికి, పార్టీకీ మధ్య ఉండాల్సిన సమన్వయాన్ని కూడా ఆయన వివరించారు. ప్రభుత్వం విధానాలు రూపొందిస్తే, పార్టీ వ్యూహాలకు రూపకల్పన చేస్తుందన్నారు. ప్రభుత్వం, పార్టీ వ్యవస్థల మధ్య ఉండే సమన్వయం ఒక గొప్ప శక్తిలాంటిదని, బీజేపీ ఈ విషయం తెలుసుకుందని మోదీ అన్నారు. శ్రమ, శ్రామికులు అద్భుతాలు సృష్టిస్తాయన్నారు. తన గెలుపునకు ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించిన కిందిస్థాయి కార్యకర్తలే కారణమన్నారు. కార్యకర్తల కఠోరశ్రమకు, అంకిత భావానికి మోదీ కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు అమిత్ షా మాట్లాడుతూ.. మోదీ అభివృద్ధి అంటే ఏమిటో కొద్దిగానే చూపించారని, వచ్చే ఐదేళ్లలో కాశీ అత్యద్భుతమైన నగరంగా మారుతుందని చెప్పారు. నెహ్రూకి నివాళి భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ దేశానికి చేసిన సేవలను మోదీ కొనియాడారు. నెహ్రూ 55వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ ప్రధాని ట్వీట్ చేశారు. ‘పండిట్ జవహర్లాల్ నెహ్రూజీకి నివాళులు. జాతి నిర్మాణానికి, దేశానికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాం..’ అని పేర్కొన్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, పలువురు బీజేపీ నేతలు నెహ్రూకి నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు. -
ప్రమాణ స్వీకారానికి బిమ్స్టెక్ నాయకులు
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఈ నెల 30న ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మోదీ ప్రమాణ స్వీకారానికి బిమ్స్టెక్(భారత్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, థాయ్‌లాండ్, భూటాన్, నేపాల్) సభ్య దేశాల నాయకులకు ఆహ్వానం పంపింది. 2014లో సార్క్ దేశాల నాయకులు మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయిన సంగతి తెలిసిందే. ఈసారి బిమ్స్టెక్ నాయకులను ఆహ్వానించనున్నారు. దాయాది దేశం పాక్‌కు మాత్రం ఆహ్వానం పంపలేదు. మే 30న రాత్రి 7 గంటలకు మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని రాష్ట్రపతి కార్యాలయం తెలిపింది. మోదీతో పాటు కొందరు మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేస్తారని వెల్లడించింది. రాష్ట్రపతి భవన్లో జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మోదీ చేత ప్రమాణం చేయిస్తారని పేర్కొంది. 17వ లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 542 స్థానాలకు ఎన్డీయే 353 చోట్ల విజయదుందుభి మోగించింది. బీజేపీకి 303 సీట్లు దక్కాయి. -
‘అదే జరిగితే.. జూన్ 1న రాజీనామా’
బెంగళూరు : యడ్యూరప్ప చెప్పినట్లు జూన్ 1న తమ ప్రభుత్వం పడిపోతే.. అదే రోజున తన పదవికి రాజీనామా చేస్తానంటూ కర్ణాటక సీఎల్పీ నాయకుడు సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో జేడీఎస్–కాంగ్రెస్ కూటమి అధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి.. దాన్ని కూల్చడానికి బీజేపీ ప్రయత్నిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప.. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని.. త్వరలోనే వారు బీజేపీలో చేరతారని.. జూన్ 1 నాటికి జేడీఎస్–కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోతుందని వ్యాఖ్యనించారు. తాజాగా సిద్ధరామయ్య ఈ వ్యాఖ్యలపై స్పందించారు. యడ్యూరప్ప సంవత్సరం నుంచి ఇదే మాట చెప్తున్నారని.. మరో నాలుగేళ్లు కూడా ఇలానే చెప్తారని తెలిపారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినంతా మాత్రాన రాష్ట్రంలో కూడా అలానే జరగాలనుకోవడం అత్యాశ అన్నారు. తమ ప్రభుత్వం చాలా బలంగా ఉందని.. ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీని వీడటానికి సిద్ధంగా లేరని తెలిపారు. ఒక వేళ యడ్యూరప్ప చెప్పినట్లుగానే.. జూన్ 1న తమ ప్రభుత్వం కూలిపోతే.. అదే రోజున తాను తన పదవికి రాజీనామా చేస్తానని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. -
‘మహా కూటమి’ ఏర్పడితే ఏమయ్యేది ?!
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీకి ప్రత్యామ్నాయంగా పటిష్టమైన మహా కూటమిని కూడగట్టడంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విఫలమవడం వల్లనే మరోమారు నరేంద్ర మోదీ ప్రధాన మంత్రయ్యారంటూ రాహుల్‌పై విమర్శలు వెత్తుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ–బీఎస్పీ కూటమితో జతకట్టి ఉన్నట్లయితే, మహారాష్ట్రలో వంచిత్ బహుజన్ అఘాదితో విభేదాలు పరిష్కరించుకున్నట్లయితే, ఢిల్లీలో ఆప్‌తో జతకట్టి ఉన్నట్లయితే ఫలితాలు వేరుగా ఉండేవని కొన్ని రాజకీయ పక్షాలు వాదిస్తున్నాయి. వారి వాదనలో నిజమెంత? వారన్నట్లుగా ఇవన్నీ పక్షాలు కలిసి మహా కూటమిగా పోటీ చేసి ఉన్నట్లయితే ఎన్నికల ఫలితాలు ఎలా ఉండేవి ? ఏడాది క్రితం కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్) పార్టీలు ఏకమైనప్పుడు దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్ని ఏకమవుతాయన్న ఆశలు చిగురించాయి. కొన్ని రాష్ట్రాల్లో ఇది కుదిరి, కొన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్షాల మధ్య ఐక్యత కుదరకపోవడం వల్ల మిశ్రమ ఫలితాలు వచ్చాయి. తమిళనాడులో డీఎంకేతో కాంగ్రెస్ పార్టీ జత కట్టడం వల్ల 38 సీట్లకుగాను 37 సీట్లను ప్రతిపక్షాలు గెలుచుకోగలిగాయి. బీహార్‌లో ఒక్క రాష్ట్రీయ జనతాదళ్‌తోనే కాకుండా అన్ని ప్రతిపక్షాలతో కలిసి మహా కూటమిగా పోటీ చేసినా 40 సీట్లకుగాను ఒక్క సీటు మాత్రమే దక్కింది. బీజేపీ ప్రభంజనాన్ని పరిగణలోకి తీసుకున్నట్లయితే అన్ని ప్రతిపక్ష పార్టీలు ఏకమైనా దాన్ని అడ్డుకునేవి కావు. ఎందుకంటే 13 రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో బీజేపీకి 50 శాతానికిపైగా ఓట్లు వచ్చాయి. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, అస్సాం రాష్ట్రాల్లో 159 సీట్లు ఉండగా, కాంగ్రెస్–మిత్రపక్షాలకు పది సీట్లు రాగా, కూటమిలో చేరే అవకాశం ఉండిన పార్టీలకు 17 సీట్లు వచ్చాయి. బీజేపీ కూటమికి 132 సీట్లు వచ్చేవి. ఈ ఐదు రాష్ట్రాల్లో బీజేపీ వ్యతిరేకపక్షాలన్నింటితో కలిసి కాంగ్రెస్ పోటీచేసి ఉన్నట్లయితే ఈ కూటమికి అదనంగా 18 సీట్లు వచ్చేవి. అంటే బీజేపీకి కూటమికి 104, వ్యతిరేక కూటమికి 45 వచ్చి ఉండేవి. ఆయా పార్టీలకు వచ్చిన పోలింగ్ శాతాన్ని పరిగణలోకి తీసుకుంటేనే ఈ లెక్క తేలింది. పార్టీలు పొత్తు కుదుర్చుకున్నప్పుడు ఒక్క పార్టీకి వచ్చే ఓట్ల శాతం పూర్తిగా ఇతర పార్టీలకు రావు. ఆ లెక్కన ఈ 18 సీట్ల సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉంది. అస్సాంలో కాంగ్రెస్ పార్టీ అస్సాంలో అఖిల భారత ఐక్య ప్రజాస్వామిక ఫ్రంట్ (ఏఐయుడిఎఫ్)తో పొత్తు పెట్టుకున్నట్లయితే కరీంగంజ్ నియోజకవర్గంలో గెలవడం ద్వారా కాంగ్రెస్ కూటమికి ఒక్క సీటు వచ్చేది. అక్కడ బీజేపీ అభ్యర్థి కృఫాల్నాథ్ మల్లా 44.62 శాతం ఓట్లతో విజయం సాధించారు. అక్కడ ఫ్రంట్ అభ్యర్థి రాధేశ్వామ్ బిశ్వాస్కన్నా బీజేపీ అభ్యర్థికి కేవలం 3.62 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి స్వరూప్ దాస్‌కు 11.36 శాతం ఓట్లు వచ్చాయి. ఈ ఓటింగ్ శాతాన్ని కూడితే ఫ్రంట్ అభ్యర్థి గెలిచే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ ముస్లిం అంతా మైనారిటీ వర్గాలకు ప్రతినిధిగా భావిస్తోన్న ఫ్రంట్ అభ్యర్థికి ఓటు వేశారు. ఫ్రంట్, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకన్నట్లయితే కొత్త మంది ముస్లింలు ఓటింగ్‌కే వచ్చేవారు కాదు. ఢిల్లీలో ఢిల్లీలో చివరకు ఆప్, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదురుతుందని ఇరువర్గాలు భావించాయి. ఆ రెండు కలిస్తే బీజేపీకి గట్టిపోటీ అవుతుందని రాజకీయ పరిశీలకులు భావించారు. కానీ అది జరిగి ఉండేది కాదు. ఢిల్లీలోని ఏడు నియోజకవర్గాల్లో 50 శాతానికిపైగా ఓట్ల తేడాతోనే బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. పైగా ఢిల్లీ ఓటర్లు కేంద్రంలో విజయం సాధించే అవకాశం ఉన్న పార్టీకే సహజంగా ఓటు వేస్తారు. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ హర్యానాలోని జన్నాయక్ జనతా పార్టీ లేదా బహుజన సమాజ్ పార్టీతోని పొత్తు పెట్టుకున్నట్లయితే ఒక్క రోహతక్ నియోజకవర్గం సీటు మాత్రమే కాంగ్రెస్ కూటమికి వచ్చేది. అక్కడ బీజేపీ అభ్యర్థి కేవలం 7,503 ఓట్ల మెజారిటీతో విజయం సాధించగా, జన్నాయక్ జనతా పార్టీ అభ్యర్థికి 21,211, బీఎస్పీకి 38,364 ఓట్లు వచ్చాయి. ఇందులో ఏ ఒక్క పార్టీతోని పొత్తుపెట్టుకున్నా కాంగ్రెస్ కూటమికి ఈ సీటు వచ్చేది. మహారాష్ట్రలో మహారాష్ట్రలో అన్ని బీజేపీ వ్యతిరేక పార్టీలు ఒక్కటై ఉన్నట్లయితే కాస్త మంచి ఫలితాలే వచ్చేవి. అంటే ప్రకాష్ అంబేద్కర్ నాయకత్వంలోని వంచిత్ బహుజన్ అఘాదితో కాంగ్రెస్–ఎన్సీపీ కూటమి పొత్తు పెట్టుకున్నట్లయితే బుల్దానా, హాత్కనంగల్, పర్భణి, సోలాపూర్, నాందేడ్, సాంగ్లీ, గడ్చీరోలి చిమూర్...ఏడు సీట్లను గెలుచుకునేది. అంటే కాంగ్రెస్ కూటమికి ఐదు బదులు 12 సీట్లు వచ్చేవి. బీజేపీ–శివసేన కూటమికి 41కి బదులు 34 వచ్చేవి. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్, తన మిత్రపక్షమైన జన అధికార్ పార్టీతో కలిసి ఎస్పీ–బీఎస్పీ–ఆర్ఎల్డీ కూటమితో కలిసి పోటీ చేసినట్లయితే దౌరాష్ట్ర, మీరట్, బదౌన్, బారబంకి, బాండా, సుల్తాన్పూర్, బస్తీ, సంత్ కబీర్ నగర్, ఛందౌలి...తొమ్మిది సీట్లు ఎక్కువ వచ్చేవి. అంటే రాష్ట్రంలోని 80 సీట్లకుగాను మహా కూటమికి 24 సీట్లు వచ్చేవి. బీజేపీ కూటమికి 64కు బదులు 56 సీట్లు వచ్చేవి. మొత్తంగా కాంగ్రెస్ కూటమికి 18 సీట్లు పెరిగేవి, బీజేపీ కూటమికి 18 సీట్లు తగ్గేవి. దీనివల్ల ఫలితం ఏమీ ఉండేది కాదు. -
‘అవమానాలు సహజం.. 2020 మన లక్ష్యం’
న్యూఢిల్లీ : రాజకీయాల్లో అవమానాలు సహజం.. జరిగిపోయిన దానిని వదిలేయండి.. రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం కష్టపడి పని చేద్దామంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆప్ ఘోర పరాజయాన్ని మూట కట్టుకున్న సంగతి తెలిసిందే. ఏడు లోక్‌సభ స్థానాల్లో కనీసం ఒక్క చోట కూడా గెలవలేకపోయింది. బీజేపీ ఏడు స్థానాల్లో భారీ మెజరిటీతో విజయం సాధించి ఢిల్లీలో క్లీన్ స్వీప్ చేసింది. ఈ నేపథ్యంలో ఫలితాల అనంతరం తొలిసారి కార్యకర్తలతో సమావేశమయ్యారు కేజ్రీవాల్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాజకీయాల్లోకి రావాలనుకునే వారికి లేదా జనాలతో కలిసి సాగుదామనుకునే వారికి అవమానాల్ని ఎదుర్కొనే ధైర్యం ఉడటం చాలా అవసరం అని అన్నా హజారే చెప్తుంటారు. మనం చాలా అవమానాల్ని చవి చూశాం. వాటన్నింటిని చాలా గౌరవంగా స్వీకరించిన నా కార్యకర్తలను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. ఫలితాల గురించి నిరాశ చెందవద్దు. భారీ ఎన్నికలు ముగిసాయి.. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఢిలీ ప్రజల దగ్గరకు వెళ్లి ఒకే మాట చెప్పండి. పేరును కాకుండా పని చూసి ఓటు వేయండి అని ప్రచారం చేయండి’ అంటూ కార్యకర్తలకు కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. అంతేకాక ‘పార్టీ పెట్టిన నాటి నుంచి మీరంతా నాతోనే ఉన్నారు. ప్రలోభాలకు లొంగలేదు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా బెదరలేదు. పార్టీ కోసం చాలా కష్టపడ్డారు. మిమ్మల్ని చూస్తే చాలా గర్వంగా ఉంది. గత ఎన్నికల్లో మన పార్టీ 54 శాతం ఓట్లు సాధించింది. ఈ సారి అంతకాన్న ఎక్కువ ఓట్లు సాధిస్తామనే నమ్మకం నాకుంద’న్నారు. ఈ సందర్భంగా రెండో సారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోదీకి, కేజ్రీవాల్ శుభాకంక్షలు తెలిపారు. -
మోదీ ‘సబ్ కా విశ్వాస్’ మాటకు అర్థం ఏమిటీ?
సాక్షి, న్యూఢిల్లీ : ‘సబ్ కా సాథ్ సబ్ కా వికాస్’ 2014 ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన నినాదం. ‘సబ్ కా విశ్వాస్’ ఆయన తాజాగా ఇచ్చిన నినాదం. భారతీయ మైనారిటీ వర్గాలను దష్టిలో ఉంచుకొని ఆయన ఈ నినాదం ఇచ్చినట్లు స్పష్టం అవుతోంది. ఆయన మే 25వ తేదీన పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కొత్తగా ఎన్నికైన ఎన్డీయే పార్లమెంట్ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ ‘ఓటు వేసిన వారంతా మనవారే, ఓటు వేయని వారు కూడా మనవారే. వారి విశ్వాసాన్ని కూడా మనం చూరగొనాల్సిన అవసరం ఉంది’ అంటూ దేశంలోని మైనారిటీలనుద్దేశించి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. మైనారిటీలకు తాము వ్యతిరేకమని, వారిలో భయాందోళనలను సష్టించామని ప్రతిపక్షాలు చేస్తోన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదంటూ నరేంద్ర మోదీ మొదటి సారి దేశంలో మైనారిటీల దుస్థితి గురించి మాట్లాడారు. గత బీజేపీ ఐదేళ్ల పాలనలో మైనారిటీలు భయం, భయంగానే బతికారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అందుకు గోరక్షకుల పేరిట జరిగిన దాడులను గుర్తు చేస్తున్నాయి. ఆ దాడుల్లో ఇంతవరకు ఏ ఒక్కరికైనా శిక్ష పడిందా? అని ప్రశ్నిస్తున్నాయి. మైనారిటీలైన ముస్లింలను మినహాయిస్తూ మిగతా హిందూ శరణార్థులందరికి భారతీయ పౌరసత్వం ఇస్తామంటూ 2016లో ముసాయిదా బిల్లు తీసుకరావడం నిజం కాదా? అంటూ నిలదీస్తున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ నేతలు చేసిన ప్రచారం ఏమిటని ప్రశ్నిస్తున్నాయి. మెజారిటీలు, మైనారిటీలు అంటూ మాట్లాడిందీ బీజేపీ నేతలు కాదా? అని అడుగుతున్నాయి. ఏదిఏమైనా ఎన్నికలు ముగిశాయి. 303 సీట్లతో బీజేపీ అఖండ విజయం సాధించింది. మొదటి సారి మైనారిటీల బాగోగుల గురించి మాట్లాడిన నరేంద్ర మోదీ తన మాట నిలబెట్టుకోవాలి. గతంలో మైనారిటీలపై జరిగిన దాడులకు సంబంధించిన కేసుల్లో దోషులకు శిక్ష పడేలా చేయాలి. మైనారిటీల సంక్షేమం కోసం పలు అభివద్ధి కార్యక్రమాలు చేపట్టి ‘సబ్ కా విశ్వాస్’ చూరగొనాలి! -
రెండు రోజుల తర్వాత భోంచేసిన లాలూ
రాంచీ : లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో ఆర్జేడీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఓటమి పట్ల ఆ పార్టీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర మనస్థాపానికి లోనై.. భోజనం కూడా మానేశారు. రెండు రోజుల పాటు లాలూ ఆహారం తీసుకోలేదు. దాంతో ఆయన ఆరోగ్యం బాగా దెబ్బ తిన్నది. ఇది ఇలానే కొనసాగితే.. ప్రాణానికే ప్రమాదం అని వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. భోజనం చేయాల్పిందిగా లాలూను కోరారు. చివరకు రెండు రోజుల తర్వాత.. ఆదివారం మధ్యాహ్నం లాలూ భోజనం చేశారు. ఈ విషయం గురించి వైద్యులు మాట్లాడుతూ.. ‘లాలూకు బీపీ, షూగర్‌తో పాటు కిడ్నీ సంబంధిత వ్యాధులు కూడా ఉన్నాయి. అలాంటిది రోజుల తరబడి భోజనం చేయడం మానేస్తే.. ఆయన ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది. దాంతో ఆయనను కన్వీన్స్ చేసి భోం చేయాల్సిందిగా ఒప్పించాం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంద’ని తెలిపారు. పశుగ్రాస కుంభకోణం కేసులో భాగంగా లాలూ ప్రస్తుతం జైలు జీవితం అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సార్వత్రిక ఎన్నికల్లో బిహార్‌లో కాంగ్రెస్ - ఆర్జేడీ కూటమిగా ఏర్పడి.. ఎన్డీఏను ఎదుర్కొని ఘోర పరాజయాన్ని చవి చూశాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బిహార్‌లో కాంగ్రెస్ ఒక్క స్థానానికే పరిమితం కాగా.. ఆర్జేడీ అసలు ఖాతా కూడా తెరవలేదు. రాష్ట్రంలోని 40 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ.. 39 చోట్ల విజయం సాధించి క్లీన్‌స్వీప్ చేసింది. -
రాహుల్ రాజీనామా: కాంగ్రెస్ స్పందన
న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవం నేపథ్యంలో ఇందుకు బాధ్యతగా తాను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటానని రాహుల్‌గాంధీ పట్టుబడుతున్నట్టు వస్తున్న కథనాలపై కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా స్పందించింది. అధ్యక్ష పదవి నుంచి రాహుల్ తప్పుకొనే అవకాశమే లేదని దాదాపుగా ధ్రువీకరించింది. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సుర్జేవాల్ సోమవారం.. ఈ నెల 25న జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంపై వదంతులు వ్యాప్తి చేయవద్దని ప్రజలను, మీడియాను కోరారు. సీడబ్ల్యూసీ సమావేశంలో రాహుల్ రాజీనామాకు సిద్ధపడ్డారని, అందుకు సీడబ్ల్యూసీ నిరాకరించిందని, అయినా రాహుల్ వెనుకకు తగ్గడం లేదని కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. సీడబ్ల్యూసీ సమావేశం ఆంతరంగిక భేటీ అని, ఆ సమావేశంపై పుకార్లు, వదంతులు సృష్టించడం తీవ్ర అవాంఛనీయమని ఆయన స్పష్టం చేశారు. ‘దిద్దుబాటు చర్యలు తీసుకోవడానికి, అభిప్రాయాలను పంచుకోవడానికి సీడబ్ల్యూసీ ఒక ప్రజాస్వామిక వేదిక. ఆంతరంగికంగా జరిగే ఈ భేటీ పవిత్రతను కాపాడాలి. ఈ విషయమై ఒక వర్గం మీడియాలో వస్తున్న వదంతులు, పుకార్లు, కథనాలు అవాంఛనీయం’ అని సుర్జేవాల ట్వీట్ చేశారు. తద్వారా రాహుల్ రాజీనామా ఉండబోదని ఆయన పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. -
షాకిచ్చిన ఫలితాలు; త్వరలోనే మంత్రివర్గ విస్తరణ?!
బెంగళూరు : సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కుమారస్వామి సంకీర్ణ ప్రభుత్వం మరోసారి ఇబ్బందుల్లో పడింది. లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 28 స్థానాలకు గానూ 25 సీట్లు గెలుచుకున్న బీజేపీ తన ఆధిపత్యాన్ని చాటుకున్న సంగతి తెలిసిందే. దీంతో కాంగ్రెస్- జేడీఎస్ కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా సీఎం కుమారస్వామికి ఈ ఎన్నికలు చేదు ఫలితాన్ని మిగిల్చాయి. ఆయన తండ్రి, జేడీఎస్ అధినేత దేవెగౌడతో పాటు.. కుమారుడు నిఖిల్ కుమారస్వామి కూడా ఓటమి పాలయ్యారు. తొలిసారిగా ఎన్నికల బరిలో దిగిన నిఖిల్.. బీజేపీ మద్దతుతో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి సుమలత చేతిలో ఘోర పరాభవం చవిచూశారు. అదే విధంగా పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలకు కూడా ఈ ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. ఈ నేపథ్యంలో కుమారస్వామి ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ మరోసారి ఆపరేషన్ కమలానికి తెరలేపిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో సీఎం కుమారస్వామి, మాజీ సీఎం, కాంగ్రెస్ దిగ్గజ నేత సిద్ధరామయ్య అత్యవసరంగా సమావేశమైనట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలను కాపాడుకునే అంశంపై తీవ్రంగా చర్చిస్తున్నట్లు సమాచారం. అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసే క్రమంలో త్వరలోనే మరోసారి మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో గతేడాది ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఈ ఫలితాల్లో 105 సీట్లు గెలిచి బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో వెంటనే అప్రమత్తమైన కాంగ్రెస్ తమ కన్నా తక్కువ స్థానాలే గెలిచినప్పటికీ జేడీఎస్‌తో కూటమి ఏర్పాటు చేసి.. కుమారస్వామిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు కేవలం ఇంకా 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే అవసరం ఉన్న నేపథ్యంలో.. అసంతృప్త ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేస్తున్నట్లు గత కొంతకాలంగా వార్తలు ప్రచారమవుతున్నాయి. దీంతో తమ ఎమ్మెల్యేలు ఎవరినీ బీజేపీ కొనలేదంటూ కాంగ్రెస్-జేడీఎస్ నేతలు చెబుతున్నప్పటికీ వారిలో ఆందోళన మాత్రం కొట్టొచ్చినట్లుగా కన్పిస్తుంది. ఈ నేపథ్యంలోనే మరోసారి మంత్రివర్గ విస్తరణ చేపట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. -
ఈసారి కెమిస్ర్టీ వర్కవుట్ అయింది : మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం తన నియోజకవర్గ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపేందుకు వారణాసిలో పర్యటించారు. కాశీ విశ్వనాధుని దర్శించుకుని పూజలు చేసిన అనంతరం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఈసారి అంకెల కంటే కెమిస్ర్టీ (భావోద్వేగాలు)యే పనిచేసిందని ప్రధాని పేర్కొన్నారు. బీజేపీని హిందీ రాష్ట్రాల్లో ప్రాబల్యం కలిగిన పార్టీగా రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారని మోదీ వ్యాఖ్యానించారు. కర్ణాటకలో తాము అత్యధిక స్ధానాలను గెలుచుకున్నామని, గోవా సహా ఈశాన్య రాష్ట్రాల్లో ప్రభుత్వాలు నడుపుతున్నామని అయినా తమ పార్టీ హిందీ బెల్ట్‌కే పరిమితమా అని ఆయన ప్రశ్నించారు. అసోం వంటి ఈశాన్య రాష్ట్రాలన్నింటిలో బీజేపీ ప్రభుత్వాలు లేదా తమ సారథ్యంలోని కూటమి ప్రభుత్వాలు నడుస్తున్న క్రమంలో బీజేపీని కేవలం హిందీ రాష్ట్రాల పార్టీగా పరిగణించడం పట్ల మోదీ ఆక్షేపించారు. -
జార్ఖండ్ కాంగ్రెస్ చీఫ్ రాజీనామా
రాంచీ : లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఘోర వైఫల్యంతో జార్ఖండ్ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అజయ్ కుమార్ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రంలో పార్టీ పరాజయానికి పూర్తి బాధ్యత తనదేనని ఆయన స్పష్టం చేశారు. కాగా అజయ్ కుమార్ రాజీనామాపై కాంగ్రెస్ హైకమాండ్ ఇంకా ఆమోదించలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. జార్ఖండ్‌లోని 14 లోక్‌సభ స్ధానాల్లో బీజేపీ, ఏజేఎస్‌యూ కూటమి 12 స్ధానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్-జేఎంఎం కూటమి చెరో స్ధానానికి పరిమితమయ్యాయి. ఎన్నికల్లో పార్టీ ఓటమి నేపథ్యంలో పలు రాష్ట్రాల చీఫ్‌లు రాజీనామాలతో ముందుకు రాగా దీనిపై హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఓటమి షాక్ నుంచి తేరుకున్న తర్వాత పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ పార్టీ ప్రక్షాళనపై దృష్టి సారిస్తారని ఏఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి. -
233 మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన 539 మంది అభ్యర్ధుల్లో 43 శాతం అంటే 233 మంది ఎంపీలపై నేరాభియోగాలు ఉన్నాయని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) తెలిపింది. గత లోక్‌సభతో పోలిస్తే నేరారోపణలు ఉన్నవారి సంఖ్య 26 శాతం అధికం కావడం గమనార్హం. లోక్‌సభ ఎన్నికల్లో విజేతలైన 539 మంది అభ్యర్ధుల అఫిడవిట్లను విశ్లేషించిన ఏడీఆర్ బీజేపీ నుంచి ఎన్నికైన వారిలో 116 మంది ఎంపీలపై (39 శాతం) క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిపింది. కాంగ్రెస్ నుంచి ఎన్నికైన వారిలో 29 మంది ఎంపీలపై (57 శాతం) క్రిమినల్ కేసులున్నాయి. ఇక 13 మంది జేడీ(యూ) ఎంపీలపై, 10 మంది డీఎంకే ఎంపీలపై. తొమ్మిది మంది తృణమూల్ ఎంపీలపై క్రిమనల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంది. నూతన లోక్‌సభలో 29 శాతం కేసులు లైంగిక దాడి, హత్య, హత్యాయత్నం, మహిళలపై నేరాల వంటి కేసులు ఉన్నాయని వెల్లడించింది. 2009 నుంచి తీవ్ర నేరాలు నమోదయ్యాయని వెల్లడించిన ఎంపీల సంఖ్య రెట్టింపైందని ఏడీఆర్ తెలిపింది. -
బెంగాల్లో బీజేపీ కార్యకర్త కాల్చివేత
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్లో ఎన్నికల అనంతరం హింసాకాండ కొనసాగుతూనే ఉంది. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బట్పారాలో ఆదివారం రాత్రి బీజేపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. చందన్ సాహు అనే 36 సంవత్సరాల బీజేపీ కార్యకర్త రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగి వెళుతుండగా దుండగులు ఆయనను కాల్చి చంపారు. జగ్ధాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కలితల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుడిని చౌసొట్టిపల్లి వాసిగా గుర్తించారు. చందన్ తన ఇంటికి వెళుతుండగా బైక్‌పై వచ్చిన నలుగురు వ్యక్తులు ఆయనను అడ్డగించి కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. చందన్‌ను బట్పారా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించాడని వైద్యులు నిర్ధారించారు. అమేథిలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అనుచరుడు, బీజేపీ కార్యకర్త సురేంద్ర సింగ్‌ను దుండగులు కాల్చిచంపిన కొద్ది గంటల్లోనే బెంగాల్లో ఇదే తరహా ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. -
భారీ మెజారిటీ; కేంద్రమంత్రి పదవిపై కన్ను!
లక్నో : సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించి అధికారంలోకి రావడంతో మంత్రివర్గ కూర్పుపై అన్నివర్గాల్లో ఆసక్తి నెలకొంది. మోదీ కేబినెట్లో చోటు కోసం బీజేపీ సహా మిత్రపక్షాల నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ సిక్రీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన రాజ్ కుమార్ చహర్ కేంద్రమంత్రి పదవి దక్కించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. యూపీ కాంగ్రెస్ చీఫ్ రాజ్ బబ్బర్‌పై భారీ మెజారిటితో గెలుపొందిన రాజ్ కుమార్ మోదీ కేబినెట్లో కచ్చితంగా చోటు దక్కించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఈ స్థానం నుంచి పోటీ చేసిన బీజేపీ నేత బాబూలాల్ చౌదరి కూడా రాజ్ బబ్బర్‌పై పైచేయి సాధించారు. అయితే అప్పడు ఆయన కేవలం లక్షన్నర ఓట్ల మెజారిటీ మాత్రమే పొందారు. 2019 ఎన్నికల్లో ఫతేపూర్ సిక్రీ అభ్యర్థిగా రాజ్ కుమార్ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. సిట్టింగ్ ఎంపీని కాదని బీజేపీ అధిష్టానం ఆయనకు అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో గెలుపు కోసం తీవ్రంగా శ్రమించిన రాజ్ కుమార్ మొత్తంగా 6.67,147 ఓట్లు సాధించారు. 4, 95, 065 ఓట్ల మెజారిటీతో ప్రత్యర్థిని మట్టికరిపించారు. వారణాసిలో నరేంద్ర మోదీకి వచ్చిన మెజారిటీ కంటే కూడా ఇదే ఎక్కువ. అదే విధంగా రాజ్ కుమార్ చహర్‌కు 64.32 శాతం ఓట్లు దక్కడంతో కాంగ్రెస్ అభ్యర్థి రాజ్ బబ్బర్ దారుణ ఓటమి చవిచూశారు. ఈ క్రమంలో ఓటమికి బాధ్యత వహిస్తూ.. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు కూడా. ఈ నేపథ్యంలో అత్యధిక మెజారిటీ సొంతం చేసుకున్న రాజ్ కుమార్ చహర్‌కు మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. కాగా అత్యధిక లోక్‌సభ స్థానాలున్న యూపీలో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం మోదీ హవాలో కొట్టుకుపోయారు. బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక 80 లోక్‌సభ స్థానాలున్న యూపీలో బీజేపీ 62, బీఎస్పీ 10, ఎస్పీ 5 స్థానాల్లో విజయం సాధించగా.. కాంగ్రెస్ కేవలం ఒకే ఒక స్థానం(సోనియా గాంధీ- రాయ్‌బరేలీ)లో గెలుపొందిన సంగతి తెలిసిందే. -
కాంగ్రెస్‌కు కటీఫ్ చెపుదాం.. ఓటమికి కారణమదే!
పట్నా: దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) దానికి కారణాలను అన్వేషిస్తోంది. మొత్తం 17 స్థానాల్లో అభ్యర్థులను బరిలో నిలిపిన ఆర్జేడీ కనీసం ఒక్కస్థానంలో కూడా విజయం సాధించలేకపోయింది. పార్టీ చరిత్రలో గడిచిన ఇరవై ఏళ్లలో ఇలాంటి పరిస్థితి రావడం ఇదే తొలిసారి. దీంతో ఆర్జేడీ శ్రేణులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇదిలావుండగా ఇంత ఘోరమైన ఫలితాలు రావడానికి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడమే అని ఆపార్టీలో ఓవర్గం నేతలు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక పవనాలు వీచగా.. అది బిహార్‌లోనూ ప్రభావం చూపిందని విశ్లేషిస్తున్నారు. మరో రెండేళ్లలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో కీలక నిర్ణయాలు తీసుకోకపోతే రాణించలేమని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో బంధాన్ని తెంచుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. గడిచిన రెండేళ్లలో రాష్ట్రంలో జరిగిన పలు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి విజయం సాధించినప్పటికీ.. సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. తాజాగా ఫలితాలపై మాజీ మంత్రి జగ్ధానంద్ మాట్లాడుతూ.. గత ఏడాది జరిగిన ఆరారియా ఉప ఎన్నికల్లో ఆర్జేడీ అద్బుత విజయాన్ని సొంతం చేసుకుందని.. కాంగ్రెస్‌తో సరైన అవగనహన లేకపోవడం కారణంగానే ఈసారి ఓటమి చెందాని అసహనం వ్యక్తం చేశారు. సొంతంగానే 11-12 సీట్లు సాధించే సత్తా కలిగి ఉన్న తమ పార్టీకి ఇంత ఘోరమైన ఫలితాలు ఎన్నడూ రాలేదని, ఈవీఎంల్లో అక్రమాలను కొట్టి పారేయలేమని చెప్పారు. కాగా లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై విశ్లేషించేందుకు ఈనెల 28న తేజస్వీ నేతృత్వంలోని ఆపార్టీ భేటీ కానుంది. ఈనేపథ్యంలో కాంగ్రెస్‌తో కటీఫ్ చేప్పాలని ఆపార్టీ నేతలు చేస్తున్న డిమాండ్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి. -
‘రాహుల్ సందేశం విన్నా’
అమేథి : లోక్‌సభ ఎన్నికల్లో అమేథిలో ఓటమి అనంతరం కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ చేసిన సూచనపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. నియోజకవర్గ అభివృద్ధికి చొరవ చూపాలని, అమేథిని జాగ్రత్తగా చూసుకోవాలని అక్కడి నుంచి గెలుపొందిన స్మృతి ఇరానీకి సూచించిన సంగతి తెలిసిందే. రాహుల్ సందేశాన్ని తాను గట్టిగా విన్నానని ఆమె దీటుగా బదులిచ్చారు. అమేథిలో తన సన్నిహితుడు సురేంద్ర సింగ్‌ను దుండగులు కాల్చిచంపిన క్రమంలో నియోజకవర్గాన్ని సందర్శించిన స్మృతి ఇరానీ రాహుల్ వ్యాఖ్యలపై స్పందించారు. సురేంద్ర సింగ్ మరణంతో అమేథిలో ఎంతటి భయానక వాతావరణం నెలకొందో వెల్లడైందని, అతడిని హత్య చేసిన వారికి కఠిన శిక్ష పడేలా తాను అవసరమైతే సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయిస్తానని ఆమె పేర్కొన్నారు. -
నేడు వారణాసికి ప్రధాని మోదీ
వారణాసి: లోక్‌సభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన అనంతరం మొదటిసారి ప్రధాని నరేంద్ర మోదీ ఆయన పార్లమెంటు నియోజకవర్గం అయిన వారణాసిలో సోమవారం (నేడు) పర్యటించనున్నారు. ఈ సందర్భంగా తనపై నమ్మకం ఉంచి భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలుపనున్నారు. అలాగే ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీ విశ్వనాథున్ని దర్శించుకుని పూజలు చేయనున్నారు. వారణాసికి చేరుకున్న అనంతరం మోదీ.. పోలీస్ లైన్స్ నుంచి బన్స్‌ఫటక్ వరకు రోడ్డు మార్గం ద్వారా వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు నగరంలోని వివిధ మార్గాల ద్వారా మోటార్ సైకిళ్ల ర్యాలీలు నిర్వహిస్తారు. సోమవారం ఉదయం కాశీ విశ్వనాథుని సన్నిధిలో పూజలు నిర్వహించిన అనంతరం ఆయన బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ‘మా అమ్మ ఆశీర్వాదం తీసుకోడానికి ఆదివారం నేను గుజరాత్‌కు వెళ్తున్నాను. మరుసటి రోజు కాశీ విశ్వనాథున్ని దర్శించుకుంటాను. అలాగే నాపై నమ్మకం ఉంచి నన్ను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు చెబుతాను’ అని మోదీ ట్వీట్ చేశారు. కాగా, ప్రధాని రాక నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశామని జిల్లా మెజిస్ట్రేట్ సురేంద్ర సింగ్ చెప్పారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో మోదీ వారణాసి నుంచి 4.79 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందిన సంగతి తెలిసిందే. -
ఓటమితో కాంగ్రెస్ శిబిరంలో కాక..
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మధ్యప్రదేశ్‌లో కమల్ నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్‌లో కాక రేపుతున్నాయి. ఈ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లోని 29 స్ధానాలకు గాను 28 స్ధానాల్లో బీజేపీ ఘనవిజయం సాధించడంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్ధిరపరిచేందుకు బీజేపీ పావులు కదుపుతోందన్న వార్తలు కాంగ్రెస్‌లో గుబులు రేపుతుండగా, పార్టీలో అంతర్గత పోరు పతాకస్ధాయికి చేరడం ఆందోళన కలిగిస్తోంది. యువ నేత, మాజీ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు కీలక బాధ్యతలు అప్పగించాలని 72 ఏళ్ల కమల్ నాథ్ నేతృత్వంలో పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలిందని సింధియా వర్గం డిమాండ్ చేస్తుండటం ఆ పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపొందిన అనంతరం యువనేత జ్యోతిరాదిత్య సింధియా, కమల్ నాథ్‌ల మధ్య స్వయంగా పార్టీ చీఫ్ రాహుల్ సయోధ్య కుదిర్చినా ఇరు వర్గాలకు పొసగకపోవడం ఎంపీ కాంగ్రెస్‌లో గుబులు రేపుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఘోరపరాజయం నేపథ్యంలో జ్యోతిరాదిత్యకు మధ్యప్రదేశ్ పార్టీ పగ్గాలు అప్పగించాలనే డిమాండ్ ఊపందుకోవడం కమల్ నాథ్ వర్గీయులకు మింగుడుపడటం లేదు. మరోవైపు పార్టీ ఓటమిపై అభ్యర్ధులతో కమల్ నాథ్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో జ్యోతిరాదిత్యకు సన్నిహితులైన మంత్రులు యువనేత జ్యోతిరాదిత్యకు రాష్ట్ర పార్టీ చీఫ్‌గా నియమించాలనే డిమాండ్‌ను ముందుకుతేవడం కమల్ నాథ్‌కు ఇబ్బందికరంగా పరిణమించింది. మధ్యప్రదేశ్ పార్టీ చీఫ్‌గానూ కమల్ నాథ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
మోదీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు
-
ఆర్ఎస్ఎల్పీకి భారీ షాక్
పట్నా: ఆర్ఎస్ఎల్పీ అధినేత కుష్వాహాకు ఆ పార్టీ సభ్యులు గట్టి షాక్ ఇచ్చారు. ఇటీవల ఎన్నికలలో పరాభవంతో కుంగిపోతున్న సమయంలోనే ఆదివారం ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ ఆధ్వర్యంలోని జేడీ(యూ)లో చేరారు. ఎమ్మెల్యేలు లలన్‌పాశ్వాన్, సుధాంశు శేఖర్, ఎమ్మెల్సీ సంజీవ్‌సింగ్‌లు తమ చేరికను ధ్రువపరస్తూ శాసనసభ స్పీకర్ విజయకుమార్ చౌదరి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ హరూన్ రషీద్‌కి ఆదివారం లేఖలు పంపినట్లు తెలిసింది. తమ చేరికను అనుమతిస్తున్నట్లుగా జేడీయూ నుంచి సైతం వారు లేఖను అందజేసినట్లుగా తెలిసింది. -
ఎన్నికల కోడ్‌ను ఎత్తివేసిన ఈసీ
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మార్చి 10న విధించిన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎత్తివేస్తున్నట్లు ఎన్నికల కమిషన్ (ఈసీ) ఆదివారం ప్రకటించింది. ఈమేరకు కేబినెట్ కార్యదర్శి, అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు ఎన్నికల కోడ్ ఎత్తివేత వెంటనే అమల్లోకి వస్తుందని ఈసీ సమాచారం అందించింది. అధికారంలో ఉన్న పార్టీ తన రాజకీయ ప్రయోజనాల కోసం అధికారిక యంత్రాంగాన్ని ఉపయోగించుకోకుండా ఉండేందుకు ఎన్నికల కోడ్‌ను విధిస్తారు. అలాగే ఓటర్లను భయపెట్టి లేదా మతం, లంచం ఆశ చూపి ఓట్లు అడిగే రాజకీయ నాయకులను గుర్తించడానికి ఈసీ ఈ కోడ్‌ను ఉపయోగిస్తుంది. -
కలిసి పనిచేయాలని ఉంది
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: భారత్ ప్రధానిగా రెండోసారి ఎన్నికైన నరేంద్ర మోదీకి పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఆదివారం ఫోన్ చేశారు. రెండు దేశాల ప్రజల అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని ఉందని ఆకాంక్ష వ్యక్తం చేశారు. అయితే, ఈ ప్రాంతంలో శాంతి, అభివృద్ధి సాధన కోసం హింస, ఉగ్రవాద రహిత వాతావరణాన్ని, విశ్వాసాన్ని పాదుకొల్పాల్సి ఉందని ప్రధాని మోదీ బదులిచ్చారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందనలు తెలపడంతోపాటు దక్షిణాసియాలో శాంతి, అభివృద్ధి సాధనకు మోదీతో కలిసి పనిచేయాలని ఉందంటూ ప్రధాని ఇమ్రాన్ తన ఆకాంక్షను వ్యక్తం చేశారని పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి మొహమ్మద్ ఫైసల్ తెలిపారు. ఇరు దేశాల్లో పేదరికాన్ని నిర్మూలించేందుకు కలిసి కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారన్నారు. అయితే, ప్రధాని ఇమ్రాన్‌కు కృతజ్ఞతలు తెలిపిన మోదీ...ఈ ప్రాంతంలో అభివృద్ధి, శాంతి నెలకొనాలంటే ముందుగా ఉగ్రవాద, హింసా రహిత వాతావరణం నెలకొనాలని, పరస్పరం విశ్వాసం పెంపొందాలని పేర్కొన్నారు. మళ్లీ అధికార పగ్గాలు చేపట్టనున్న ప్రధాని మోదీకి ప్రపంచ దేశాల నేతల అభినందనలు వెల్లువెత్తుతున్నాయని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. -
ప్రపంచ శక్తిగా భారత్
అహ్మదాబాద్: భారత్ ప్రపంచశక్తుల్లో ఒకటిగా నిలిచేందుకు రాబోయే ఐదేళ్లు అత్యంత కీలకమైనవని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం అనంతరం ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్‌లోని జేపీ చౌక్ దగ్గర నిర్వహించిన ఓ సన్మాన కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. ‘భారత చరిత్రలో 1942–47 మధ్యకాలానికి ఎంత ప్రాముఖ్యత ఉందో భారత్‌ను ప్రపంచశక్తిగా నిలబెట్టేందుకు రాబోయే ఐదేళ్లు అంతే ముఖ్యమైనవి.’ అని తెలిపారు. అదృష్టవశాత్తు ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించారు. అయినా, వినమ్రంగా ఉండాలని హితబోధ చేశారు. నన్ను వేళాకోళం చేశారు.. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రాజకీయ పండితులనే ఆశ్చర్యంలో ముంచెత్తాయని మోదీ అన్నారు. ‘ఆరో విడత ఎన్నికల చ్రారంలో భాగంగా ఎన్డీయేకు 300కుపైగా లోక్‌సభ సీట్లు వస్తాయని నేను చెప్పగానే చాలామంది వేళాకోళం చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు పోటీచేయడం లేదు.. ప్రజలే పోటీ చేస్తున్నారు అని నేను చెప్పాను. బీజేపీని మరోసారి అఖండ మెజారిటీతో ఆశీర్వదించిన గుజరాత్ ప్రజలకు కృతజ్ఞతలు’ అని మోదీ వెల్లడించారు. గుజరాత్ పర్యటనలో భాగంగా తన తల్లి హీరాబెన్‌ను కలుసుకుని ఆశీస్సులు తీసుకున్నట్లు పేర్కొన్నారు. సూరత్ అగ్నిప్రమాదంలో 22 మంది విద్యార్థులు చనిపోవడంపై మోదీ విచారం వ్యక్తం చేశారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి రథయాత్రలకూ ఇబ్బంది పడ్డారు: అమిత్ షా గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన మోదీ, రాష్ట్రంలో గూండాయిజాన్ని, అవినీతిని అంతమొందించారని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. ‘ప్రజలు నరేంద్ర భాయ్‌ను అమితంగా అభిమానించడానికి ఓ కారణం ఉంది. ఆయన చాలాగ్రామాల్లో పర్యటించారు. చాలామంది పార్టీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. గుజరాత్‌ను బీజేపీకి కంచుకోటగా తీర్చిదిద్దారు’ అని షా ప్రశంసించారు. -
మోదీ కేబినెట్‌పై మిత్రపక్షాల కన్ను
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ మెజారిటీతో అధికారంలోకి రావడంతో మంత్రివర్గ కూర్పుపై అన్నివర్గాల్లో ఆసక్తి నెలకొంది. మోదీ కేబినెట్లో చోటు కోసం బిహార్ సీఎం నితీశ్‌కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్(జేడీయూ), అన్నాడీఎంకే పార్టీలు గంపెడాశలు పెట్టుకున్నాయి. బిహార్‌లో బీజేపీతో పొత్తుకు ప్రతిఫలంగా మోదీ మంత్రివర్గంలో జేడీయూకు 1–2 మంత్రి పదవులు దక్కే అవకాశముందని తెలుస్తోంది. మే 30న ప్రధాని మోదీతో కలిసి వీరు ప్రమాణస్వీకారం చేస్తారని సమాచారం. దీంతో పాటు పశ్చిమబెంగాల్లో ఈసారి 18 లోక్‌సభ సీట్లు దక్కించుకున్న నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలను కేబినెట్లోకి తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. తమిళనాడులో పట్టుకోసం బీజేపీ కొన్నేళ్లుగా ప్రయత్నిస్తోంది. తాజా ఎన్నికల్లో ఒకే సీటు దక్కించుకున్న అన్నాడీఎంకేకు కూడా కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కవచ్చని తెలుస్తోంది. దీనివల్ల తమిళనాడులో బీజేపీ క్షేత్రస్థాయిలో బలపడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఈ ఎన్నికల్లో 6 స్థానాలు దక్కించుకున్న ఎల్జేపీ అధినేత రామ్‌విలాస్ పాశ్వాన్‌తో పాటు బీజేపీ నేతలు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కారీ, నిర్మలా సీతారామన్, రవిశంకర్ ప్రసాద్, పీయూష్ గోయల్, నరేంద్రసింగ్ తోమర్, ప్రకాశ్ జవదేకర్లు మరోసారి మంత్రి పదవులు దక్కించుకోనున్నట్లు సమాచారం. గాంధీనగర్ నుంచి భారీ మెజారిటీతో గెలుపొందిన బీజేపీ చీఫ్ అమిత్ షాకు కీలక మంత్రి బాధ్యతలు అప్పగిస్తారని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై స్పందించేందుకు షా నిరాకరించారు. 2014 ఎన్నికల్లో తెలంగాణలో ఒక సీటుతో సరిపుచ్చుకున్న బీజేపీ, ఈసారి ఏకంగా నాలుగు సీట్లు దక్కించుకోవడంతో రాష్ట్రంలో పార్టీ విస్తరణకు బీజేపీ ప్రాధాన్యత ఇస్తోందనీ, కాబట్టి తెలంగాణ నుంచి కేబినెట్లో ఒకరికి చోటు దక్కే అవకాశముందంటున్నారు. -
మే 30, రాత్రి 7 గంటలు
న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ రెండోసారి ప్రమాణస్వీకారం చేసేందుకు ముహూర్తం ఖరారైంది. మే 30న రాత్రి 7 గంటలకు మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని రాష్ట్రపతి కార్యాలయం తెలిపింది. మోదీతో పాటు కొందరు మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేస్తారని వెల్లడించింది. రాష్ట్రపతి భవన్లో జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మోదీ చేత ప్రమాణం చేయిస్తారని పేర్కొంది. ఎన్డీయే కూటమి మోదీని తమ నాయకుడిగా శనివారం ఎన్నుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన లేఖను బీజేపీ చీఫ్ అమిత్ షాతో పాటు ప్రకాశ్‌సింగ్ బాదల్, ఉద్ధవ్ ఠాక్రే, సుష్మా స్వరాజ్, నితిన్ గడ్కారీ, నితీశ్‌కుమార్ తదితరులు రాష్ట్రపతికి అందచేశారు. దీంతో ఎన్డీయేకు లోక్‌సభలో స్పష్టమైన మెజారిటీ ఉన్న నేపథ్యంలో రాష్ట్రపతి కోవింద్ తన రాజ్యాంగాధికారాలను ఉపయోగించి మోదీని ప్రధానిగా నియమించారు. మంత్రివర్గంలో చేరే సభ్యుల పేర్లు, ప్రమాణస్వీకార కార్యక్రమం తేదీ, సమయం పై మోదీ అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. తొలి ఐదేళ్ల పదవీకాలం పూర్తిచేసుకుని మరోసారి ప్రధానిగా ఎన్నికైన తొలి బీజేపీ నేతగా మోదీ చరిత్ర సృష్టించారు. మోదీకి ముందు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీలు మాత్రమే ఈ ఘనత సాధించారు. ఈ కార్యక్రమానికి విదేశీ నేతలు హాజరుకావడంపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. మరోవైపు సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన మోదీకి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదివారం ఫోన్ చేశారు. ఇరుదేశాల్లోని ప్రజల అభివృద్ధి కోసం కలసికట్టుగా పనిచేద్దామని కోరారు. దక్షిణాసియాలో శాంతి, సుస్థిరత, శ్రేయస్సు కోసం తాము కట్టుబడి ఉన్నట్లు పునరుద్ఘాటించారు. ఇందుకోసం మోదీతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. 17వ లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 542 స్థానాలకు ఎన్డీయే 353 చోట్ల విజయదుందుభి మోగించింది. బీజేపీకి 303 సీట్లు దక్కాయి. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి మాల్దీవుల్లో తొలి పర్యటన.. ప్రమాణస్వీకారం చేసిన అనంతరం మోదీ తన తొలి పర్యటనను మాల్దీవుల్లో చేపట్టే అవకాశముందని దౌత్య వర్గాలు తెలిపాయి. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక మోదీ తొలిసారి భూటాన్‌ను సందర్శించారు. జూన్ నెలలో మొదటి లేదా రెండో వారంలో మోదీ మాల్దీవుల్లో పర్యటిస్తారని దౌత్యవర్గాలు చెప్పాయి. మోదీ పర్యటన జూన్ 7–8 తేదీల మధ్య ఉంటుందని సమాచారం. వెంకయ్య ఇంటికి మోదీ కేంద్రంలో మరోసారి అధికారం చేపట్టబోతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడితో భేటీ అయ్యారు. ఆదివారం ఉదయాన్నే మోదీ వెంకయ్య ఇంటికి వెళ్లగా, ఆయన ప్రధానిని సాదరంగా ఆహ్వానించారు. మోదీ మర్యాదపూర్వకంగానే వెంకయ్యను కలిసినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో ముఖ్యంగా దేశాభివృద్ధిని వేగవంతం చేయడం, పార్లమెంటరీ వ్యవస్థలను పటిష్టం చేయడంపై ప్రధానితో చర్చించినట్లు వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు. -
టార్గెట్ @ 125
లోక్‌సభ ఎన్నికల్లో కనీవినీ ఎరుగని విజయాన్ని సొంతం చేసుకున్న బీజేపీ తన తదుపరి గురి రాజ్యసభపై పెట్టింది. పెద్దల సభలో మెజార్టీ సాధించడమే ఇప్పుడు బీజేపీ, దాని మిత్రపక్షాల ముందున్న లక్ష్యం. గత కొద్ది కాలంలో ఎన్డీయే ప్రతిపాదించిన కీలక బిల్లులు పెద్దల సభలో ఆమోదం పొందకుండా ఆగిపోయాయి. ట్రిపుల్ తలాక్, మోటార్ వాహన చట్టం, పౌర చట్టాలకు సవరణ బిల్లులు ఎన్డీయేకి తగినంత బలం లేని కారణంగా పెద్దల సభలో ఆమోదం పొందలేకపోయాయి. ఇటీవల కాలంలో అదే ఎన్డీయేకి అడ్డంకిగా మారింది. దానిని అధిగమించడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ప్రస్తుతం 101 ఎంపీల బలం గత ఏడాది పార్లమెంటు చరిత్రలోనే తొలిసారిగా కాంగ్రెస్ పార్టీని మించి రాజ్యసభలో బీజేపీ బలం పెంచుకుంది. 245 సీట్లు ఉన్న సభలో ఎన్డీయే ఎంపీల సంఖ్య 101కి చేరుకుంది. ముగ్గురు నామినేటెడ్ సభ్యులు స్వప్న దాస్‌గుప్తా, మేరీకోమ్, నరేంద్ర యాదవ్‌ల మద్దతు కూడా బీజేపీకే ఉంది. మరో ముగ్గురు స్వతంత్ర ఎంపీల మద్దతుతో కలిపి ఎన్డీయే బలం 107కి చేరుకుంది. ఆరేళ్ల పదవీకాలం కలిగిన రాజ్యసభ సభ్యులందరి ఎన్నికలు ఒకేసారి జరగవు. విడతల వారీగా సభ్యులు పదవీ విరమణ చేసినప్పుడల్లా కొత్త సభ్యుల ఎన్నిక జరుగుతుంది. రాష్ట్రాల ఎమ్మెల్యేలు వీరిని ఎన్నుకుంటారు. అందుకే రాజ్యసభలో బలం పెరగాలంటే ముందుగా వివిధ రాష్ట్రాల్లో బీజేపీ పట్టు బిగించాలి. దేశవ్యాప్తంగా ఎన్డీయేకి ఎక్కువ ఎమ్మెల్యేలు ఉంటేనే రాజ్యసభకు ఎక్కువ మంది ఎంపీలను పంపగలదు. విపక్షాల ప్రమేయం లేకుండా పెద్దల సభలో బిల్లులు పాస్ కావాలంటే ఎన్డీయేకి 123 మంది ఎంపీలు కావాలి. 2020 నవంబర్ నాటికి ఎన్డీయే ప్రభుత్వానికి మరో 19 సీట్లు అదనంగా వచ్చి 125కి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, బిహార్, తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల సహకారంతో బీజేపీ మేజిక్ ఫిగర్ దాటుతుంది. పదిహేనేళ్ల తర్వాత కేంద్రంలో అధికార పార్టీ రాజ్యసభలో కూడా మెజార్టీ సాధించిన పార్టీగా బీజేపీ రికార్డు సృష్టించనుంది. వాటిలో అత్యధిక సీట్లు యూపీ నుంచే వస్తాయి. తమిళనాడులో ఏఐఏడీఎంకే మిత్రపక్షం కావడంతో మరో ఆరు సీట్లు వస్తాయి. అసోం నుంచి మూడు, రాజస్తాన్ నుంచి రెండు, ఒడిశా నుంచి ఒకటి సభ్యులతో ఎన్డీయే బలం వచ్చే ఏడాదికి పెరగనుంది. రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపు ముఖ్యం ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్రాల్లో బీజేపీ భారీ విజయాలు నమోదు చేయగలిగితే రాజ్యసభలో బలం కూడా పెరుగుతుంది. ఇప్పట్నుంచి నవంబర్ 20 మధ్య కాలంలో కొత్తగా పెద్దల సభకు 75 మంది సభ్యులు వెళతారు. ఎన్డీయే తన మార్కు పరిపాలన చూపించాలన్నా, కొత్త సంస్కరణలకు తెరతీయాలన్నా రాజ్యసభలో మెజార్టీ కూడా అత్యంత అవసరం. -
ఇక అసెంబ్లీ వంతు!
17వ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సొంతం చేసుకోవడంతో ఇప్పుడు ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలపై రాజకీయపక్షాలు దృష్టి సారిస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో హరియాణా, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీలకు, వచ్చే ఏడాదిలో ఢిల్లీ, బిహార్ అసెంబ్లీలకు ఎన్నికలు జరగను న్నాయి. ఎన్డీఏ పక్షాలు అధికారంలో ఉన్న హరియాణా, మహారాష్ట్ర, జార్ఖండ్, బిహార్ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాలు నమోదు చేసుకుంది. ఈ రాష్ట్రాల్లోని మొత్తం 119 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ, మిత్రపక్షాలు 108 సీట్లు గెలుచుకున్నాయి హరియాణా, ఢిల్లీలలోని మొత్తం సీట్లను(17) బీజేపీ కైవసం చేసుకుంది. మహారాష్ట్రలో కాషాయపక్షం భాగస్వామి శివసేనకు 19 లోక్‌సభ సీట్లు దక్కాయి. బిహార్‌లోని 40 సీట్లలో ఎన్డీఏలోని బీజేపీ, జేడీయూ చెరో 16 స్థానాలు, లోక్‌జన్ శక్తి పార్టీ ఆరు సీట్లు గెలుచుకున్నాయి. ఢిల్లీలో త్రిముఖ పోటీ? వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి పాలకపక్షమైన ఆప్, కాంగ్రెస్‌లతో బీజేపీకి త్రిముఖ పోటీ తప్పదు. 2015 ఫిబ్రవరి అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ మొత్తం 70 సీట్లలో 67 కైవసం చేసుకోగా బీజేపీ మూడు స్థానాలకే పరిమితమైంది. లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ ఒక్క సీటూ గెలుచుకోలేక మూడో స్థానానికి దిగజా రింది. గత నవంబర్‌లో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ రద్దయినా ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో ఇంకా ప్రకటించలేదు. అయిదు నెలల క్రితం రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది. అయితే, రాజస్తాన్‌లో కాంగ్రెస్ ఒక్క సీటూ గెలవలేకపోయిం ది. ఛత్తీస్‌లో మొత్తం 11లో రెండు స్థానాలే సాధించగలిగింది. మధ్యప్రదేశ్‌లో సైతం కాంగ్రెస్‌కు ఒక్క సీటే దక్కింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్ల తీరు గమనించి కొన్ని రాష్ట్రాలకు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజేతలెవరో అంచనా వేసి చెప్పడం కుదిరేపని కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. శాసనసభ ఎన్నికల్లో ప్రధానాంశాలు మారడమే కారణం. పార్లమెంట్ ఎన్నికల్లో పరిగణించే అంశాలకూ, అసెంబ్లీ ఎన్నికల్లో వారిని కదిలించే విషయాలకూ ఉండే తేడాల వల్ల గెలిచే పార్టీలపై జోస్యం చెప్పడం కష్టమని చండీగఢ్ విశ్లేషకుడు ఘనశ్యామ్ దేవ్ అభిప్రాయపడ్డారు. -
మమతకు అసెంబ్లీ గండం
పశ్చిమ బెంగాల్ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు దీదీ కోటలో బీజేపీ బలం పుంజుకోవడమే కాక క్షేత్ర స్థాయిలో వేళ్లూనుకుంటోందని, ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకుంటోందని వెల్లడిస్తున్నాయి. తాజా ఫలితాలను విశ్లేషిస్తే 18 ఎంపీ సీట్లు గెలుచుకున్న బీజేపీ రాష్ట్రంలో 121 అసెంబ్లీ సెగ్మెంట్లలో మెజారిటీ సాధించిందని తేలింది. 22 సీట్లు దక్కించుకున్న తృణమూల్ 164 అసెంబ్లీ సెగ్మెంట్లలో ముందంజలో ఉంది. రాష్ట్రంలో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలున్నాయి. దీన్ని బట్టి 2021లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అగ్ని పరీక్షేనని, రాజకీయ పండితులు స్పష్టం చేస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర భవిష్యత్ రాజకీయ చిత్రాన్ని పూర్తిగా మార్చివేస్తాయని వారు అంచనా వేస్తున్నారు. 2014 ఎన్నికల్లో 39.7 శాతం ఓట్లు సాధించిన తృణమూల్ 34 సీట్లు గెలిచింది. ఈ సారి ఓట్ల శాతం 43.3కు పెరిగినా సీట్లు తగ్గడం గమనార్హం. అలాగే, గత ఎన్నికల్లో17 శాతం ఓట్లతో 2 స్థానాలు దక్కించుకున్న బీజేపీ ఈ సారి 40.2శాతం ఓట్లతో 18 సీట్లు గెలుచుకుంది. తృణమూల్ ఎమ్మెల్యేలు ఉన్న చాలా అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ మెజారిటీ సాధించడంతో ఓట్లతో పాటు సీట్లు కూడా పెరిగాయి. రాజధాని ,చుట్టుపక్కల ఉన్న ఐదు లోక్‌సభ నియోజకవర్గాల్లో( కోల్‌కతా సౌత్, నార్త్, జాదవ్‌పూర్, బరసాత్, డమ్‌డమ్) తృణమూల్ ఎంపీలే ఉన్నారు. వీటి పరిధిలో 35 శాసన సభ స్థానాలున్నాయి. తాజా ఎన్నికల్లో వీటిలో ఐదు చోట్ల బీజేపీ అభ్యర్ధులు పై చేయి సాధించారు. రాష్ట్ర మంత్రులు సోవన్‌దేవ్ ఛటోపాధ్యాయ,సుజిత్‌బోస్, జ్యోతిప్రియలు తమ సొంత నియోజకవర్గాల్లోనే తృణమూల్‌కు మెజారిటీ తీసుకురాలేక పోయారు. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు మమత 2020లో స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉంది. చాలా చోట్ల ఇప్పటికే బీజేపీ ముందంజలో ఉందని పలువురు తృణమూల్ నాయకులు లోపాయికారీగా అంగీకరిస్తున్నారు.దాంతో బూత్ స్థాయి నుంచి ప్రక్షాళనకు పార్టీ నాయకత్వం శ్రీకారం చుడుతోంది.నియోజకవర్గాల పరిస్థితి ఇలా ఉంటే జిల్లాల పరిస్థితి మరింత దారుణంగా ఉంది.డజనుకు పైగా సీనియర్ మంత్రులు ప్రాతినిధ్యం వహించే స్థానాల్లో తృణమూల్ బాగా వెనకబడి ఉందని తాజా ఫలితాలను బట్టి తెలుస్తోంది. ఇక్కడ తృణమూల్ ఓటు బ్యాంకు ముక్కలయ్యే పరిస్థితి ఏర్పడింది. ప్రత్యర్థి పార్టీ ఒకవైపు బలపడుతోంటే, అంతర్గత కలహాలు, నేతల విభేదాలు తృణమూల్‌కు భారీగా నష్టం కలిగిస్తున్నాయి. కొందరు బహిరంగంగానే మమతపై ధ్వజమెత్తుతోంటే, మరికొందరు లోపాయికారీగా ప్రత్యర్థులకు సహకరించడం ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనబడిందని పార్టీ నేతలు చెబుతున్నారు. -
ఒక్కసారిగా మా తండ్రిని తల్చుకున్నాను: వైఎస్ జగన్
‘‘ఆంధ్రప్రదేశ్‌ను అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే నా లక్ష్యం. ప్రతి కాంట్రాక్టునూ పారదర్శకంగా పరిశీలిస్తాం. అవినీతి ఉందని తెలిస్తే తిరిగి టెండర్లు పిలుస్తాం. కాంట్రాక్టర్లతో ఎలాంటి లాలూచీ ఉండదు. వాళ్లు తప్పు చేస్తే టెండర్లు రద్దు చేసి, మళ్ళీ టెండర్లు పిలుస్తాం. ఎక్కువ మంది టెండర్లలో పాల్గొనేలా ప్రక్రియను మారుస్తాం. అతి తక్కువ కోట్ చేసేవాళ్లకే టెండర్లు ఇస్తాం. చంద్రబాబు హయాంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతి కాంట్రాక్టునూ రద్దు చేస్తాం. తిరిగి టెండర్లు పిలుస్తాం’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మరో మూడు రోజుల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ‘ఇండియా టుడే’ ప్రతినిధి రాజ్‌దీప్ సర్దేశాయ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక అంశాలపై స్పందించారు. పగ తీర్చుకోవాలన్నది తన అభిమతం కాదని చెప్పారు. తనను కేసులతో వేధించిన వారిని దేవుడే శిక్షిస్తాడని పేర్కొన్నారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు... రాజ్‌దీప్ సర్దేశాయ్: లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఇంత భారీ విజయం సాధ్యమవుతుందని మీరు ఊహించారా? జగన్మోహన్రెడ్డి: ఇది ప్రజలు ఇచ్చిన గొప్ప విజయం. ఇదంతా దేవుడి దయ, ప్రజల ఆశీస్సుల వల్లే సాధ్యమైంది. నేను 14 నెలల పాటు 3,648 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసినప్పుడే కిందిస్థాయి నుంచి ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉందని గ్రహించాను. మా పార్టీ అఖండ విజయం సాధించబోతోందని అవగతమైంది. ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే నేను చేసిన తొలి ప్రకటన మీకు గుర్తుండే ఉంటుంది. వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించబోతోందని చెప్పాను. సర్దేశాయ్: మీ పార్టీని చీల్చుతూ 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు తమ పార్టీలోకి తీసుకున్నారు. మీ పార్టీని లేకుండా చేయాలనుకున్నారు. అసలు మీ విజయంలో మలుపు తిప్పిన అంశం ఏమిటి? జగన్: నా పాదయాత్రనే ఈ విజయంలో ప్రధాన పాత్ర వహించింది. మా పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను చంద్రబాబు తీసుకున్నారు. ఎదుటి పార్టీ ఎమ్మెల్యేలను రూ 20–30 కోట్లిచ్చి, ప్రలోభాలకు గురిచేసి తీసుకోవడమే కాకుండా వారిలో కొందరికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. అది చట్ట విరుద్ధం కానట్లుగా వ్యవహరించారు. పార్టీ ఫిరాయించిన వారిని అనర్హులుగా కూడా చేయలేదు. వారి చేత రాజీనామాలు కూడా చేయించలేదు. స్పీకర్ వ్యవస్థను దుర్వినియోగం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఎంత అన్యాయంగా వ్యవహరిస్తోందో ప్రజలు తెలుసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో అవినీతి తారస్థాయికి చేరుకుంది. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ అబద్ధాలేనని రుజువయ్యాయి. సర్దేశాయ్: మీరేమో చంద్రబాబు అవినీతి, దుశ్చర్యల వల్ల ఆగ్రహంతో ఓట్లేశారని అంటున్నారు. మరి ఇందులో జగన్‌కు సానుకూల ఓటు లేదా? ఇంతకీ ఈ ఓటు చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక ఓటా? లేక జగన్ అనుకూల ఓటా? జగన్: ఇందులో రెండూ కలిసి ఉన్నాయి. ఎన్నికలప్పుడు ప్రజలు రెండు అంశాలు చూస్తారు. ప్రభుత్వంలో ఉన్న వారిపై వ్యతిరేకతతో పాటు తమ ఆశలను నెరవేర్చే నాయకుడు ఎవరని కూడా చూస్తారు. ఈ రెండు అంశాలు కలిసినప్పుడే సహజంగా అది అఖండ విజయం అవుతుంది. ఉన్న నాయకుడిని వద్దనుకున్నప్పుడు, మరో నాయకుడిని కావాలనుకున్నప్పుడే ప్రజలు అఖండ విజయాన్ని అందిస్తారు. సర్దేశాయ్: ఏపీలో ఎన్నికలు మీకు, చంద్రబాబుకు మధ్య హోరాహోరీగా జరిగాయి కదా. ఎన్నికల ప్రచారంలో ఆయన మిమ్మల్ని టార్గెట్ చేశారు. మీరు ఆయన్ను తీవ్రస్థాయిలో విమర్శించారు కదా. చివరకు వచ్చేటప్పటికి మీ ఇద్దరిలో ఒకరిని ఎన్నుకునే పరిస్థితిని కల్పించారు కదా! జగన్ : మౌలికంగా ఇది ప్రాంతీయ పార్టీల సమరం. జాతీయ పార్టీలకు ఇక్కడ ఆ అవకాశం లేకుండా పోయింది. అలాంటప్పుడు నాకు, చంద్రబాబుకూ మధ్యనే పోరాటం జరుగుతుంది కదా! సర్దేశాయ్: రాష్ట్రాన్ని 12 నెలల్లో మారుస్తానని చెప్పారు? మీరు అనేక హామీలు ఇచ్చారు. అసలు మీ ఎజెండా ఏంటి? మోడల్ స్టేట్ అంటే ఏంటి? జగన్: ఏపీని అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే నా లక్ష్యం. ప్రజలు మెచ్చుకునే పారదర్శక పాలన అందిస్తా. ఏం చేస్తామో, ఎలా చేస్తామో చెబుతాం. ఒక్క ఏడాదిలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ మారుస్తా. పూర్తిగా ప్రక్షాళన చేస్తా. అప్పుడు మీరే వెల్డన్ అంటారు. ప్రతీ కాంట్రాక్టును పారదర్శకంగా పరిశీలిస్తాం. అవినీతి ఉందని తెలిస్తే తిరిగి టెండర్లు పిలుస్తాం. కాంట్రాక్టర్లతో ఎలాంటి లాలూచీ ఉండదు. వాళ్లు తప్పు చేస్తే టెండర్లు రద్దు చేసి, మళ్ళీ టెండర్లు పిలుస్తాం. ఎక్కువ మంది టెండర్లలో పాల్గొనేలా ప్రక్రియను మారుస్తాం. అతి తక్కువ కోట్ చేసేవాళ్లకే టెండర్లు ఇస్తాం. రివర్స్ టెండరింగ్ విధానానికి ప్రాధాన్యం ఇస్తాం. చంద్రబాబు హయాంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతి కాంట్రాక్టునూ రద్దు చేస్తాం. సర్దేశాయ్: వచ్చే ఏడాదిలో కాంట్రాక్టర్ల వ్యవస్థలో మార్పు తెస్తారా? జగన్: అవును. పెద్ద మార్పు ఉంటుంది. ఉదాహరణకు పవర్ టారిఫ్‌నే తీసుకోండి. సంప్రదాయేతర ఇంధన వనరులను పరిశీలిద్దాం. సౌర విద్యుత్ గ్లోబల్ టెండర్ల ద్వారా అయితే యూనిట్ రూ.2.65కే లభిస్తోంది. పవన విద్యుత్ విషయంలో నరేంద్ర మోదీ అనుసరించిన పారదర్శక విధానం అభినందనీయం. దీనివల్ల యూనిట్ రూ.3కే లభిస్తోంది. కానీ, మన రాష్ట్రంలో విద్యుత్ ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పవన విద్యుత్ యూనిట్ రూ.4.84 ఉంది. పీక్ అవర్స్‌లో ఏకంగా రూ.6 పెట్టి కొనడానికి ఒప్పందాలు చేసుకున్నారు. రాష్ట్రంలో సిస్టమ్ ఏమిటంటే, నువ్వో రూపాయి తీసుకో. నాకో రూపాయి అనే విధానం కొనసాగుతోంది. చంద్రబాబు ఆయనకు కావాల్సింది తీసుకుని ఇలాంటివి ప్రోత్సహించాడు. మేము ఈ వ్యవస్థను మారుస్తాం. గ్లోబల్ స్థాయిలోకి వెళ్లి ఇప్పుడున్న ధరలు తగ్గిస్తాం. ఇదొక్కటే కాకుండా జ్యుడీషియల్ కమిటీ వేస్తాం. న్యాయబద్ధంగా వ్యవహరిస్తాం. రాష్ట్రంలో ఒక వర్గం మీడియా చంద్రబాబుకు అనుకూలంగా మారింది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి వాటికి చంద్రబాబు ఎంత చెబితే అంత. వాళ్లు వేరే పక్షాన్ని మట్టిలో కలపాలని కంకణం కట్టుకున్నారు. రాష్ట్రంలో సిస్టమ్‌ను పూర్తిగా మార్చాలని చూస్తున్నాం. జ్యుడీషియల్ కమిటీని వేసి, సిట్టింగ్ జడ్జిని పెడతాం. జరిగే ప్రతి టెండర్‌ను ఆయన ముందుంచుతాం. ఆయన ఏ విధమైన మార్పులు సూచిస్తే దాన్ని అనుసరిస్తాం. వాళ్ల నిర్ణయానికి అడ్డురాము. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటి ఏ మీడియా అడిగినా ఫైళ్లు చూపిస్తాం. అసత్య ప్రచారం చేసే మీడియాపై పరువు నష్టం కేసులు వేసేందుకు కూడా వెనుకాడం. సర్దేశాయ్: మీకు కూడా సొంత మీడియా ఉంది కదా? ఇది మీడియా పోరాటం కాదా? జగన్: ఉద్దేశపూర్వకంగా ప్రతిష్ట దిగజారిస్తే వాస్తవాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది కదా! ఇది అమలు జరిగితే దేశానికే మంచి సంకేతాలు వెళ్తాయి. గుడ్ గవర్నెన్స్ అంటే ఇదీ అని అందరికీ తెలుస్తుంది. ముఖ్యమంత్రిగా ఉండి అవినీతిపరుడని పేరు తెచ్చుకోకూడదు. కానీ, రాష్ట్రంలో ఒక వర్గం మీడియా వాస్తవాలు కాకుండా అవాస్తవాలను ప్రచారం చేస్తోంది. సర్దేశాయ్: రాష్ట్రం ఇమేజ్, మీ ఇమేజ్ మీ టార్గెట్. మోడల్ స్టేట్‌గా మార్చడం మీ ప్రధాన ఆశయం.. అంతేనా? ఏడాది తర్వాత మళ్లీ మీ రాష్ట్రం గురించి మాట్లాడుకుందాం. మీకు బలమైన ఎజెండా ఉంది. మోదీ ప్రభుత్వంతో కలిసి పని చేస్తారా? ఆయన సహకారం కోరుకుంటున్నారా? కేంద్రంతో మంచిగా ఉండాలనుకుంటున్నారా? జగన్: మోదీని కలిసిన ప్రతీసారి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కోరుతాను. ఆయన ప్రధానమంత్రి. ఆయన ఆశీస్సులు అవసరం. మోదీ నుంచి మనకు నిధులు రావాల్సి ఉంది. ముఖ్యమంత్రిగా నేను చెయ్యాల్సింది నేను చేస్తా. సర్దేశాయ్: గతం వదిలేద్దాం. ఇప్పుడు మీరు సాధించిన ఘన విజయం తరువాత వెంటనే మీకేమనిపించింది? జగన్: అఖండ విజయం సాధించిన క్షణంలో ఒక్కసారిగా మా తండ్రిని తల్చుకున్నాను. అవి నిజంగా భావోద్వేగమైన క్షణాలు. సర్దేశాయ్: ప్రజల్లో మీ బలం ఏమిటో అంచనా వేసుకోవడానికి ఓదార్పు యాత్ర తలపెట్టారనేది కాంగ్రెస్ పార్టీ భావన. పదేళ్ల తరువాత ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు మీరు సొంతంగా గెలిచి ఏపీకి ముఖ్యమంత్రి కాబోతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు తమ తప్పు తెలుసుకుని మిమ్మల్ని మళ్లీ ఆ పార్టీలోకి ఆహ్వానిస్తే మీరు వెళ్లే విషయం పరిశీలిస్తారా? లేక ఇక ఎప్పటికీ ఆ అధ్యాయం ముగిసినట్లేనా? జగన్: (ఆవేదనగా) కాంగ్రెస్ పార్టీ నా విషయంలో ఏం చేసిందో నాకు తెలుసు. పగ తీర్చుకోవాలన్నది నా అభిమతం కాదు. వారిని దేవుడే చూసుకోవాలి. నేను రోజూ బైబిల్ చదువుతాను. నేను దేవుడిని ప్రార్థిస్తాను. దేవుడే వారికి శిక్ష వేస్తాడు. సర్దేశాయ్: అంటే ఆ అధ్యాయం ముగిసినట్లేనా? జగన్: నాకు సంబంధించినంత వరకూ నాపై చేసిన దానికి ఎప్పుడో క్షమించేశాను. ఎందుకంటే క్షమిస్తే శాంతి వస్తుంది. ప్రస్తుతం నా దృష్టి అంతా నా రాష్ట్రంపైనా, నా ప్రజలపైనా మాత్రమే ఉంది. నా వ్యక్తిగత అంశాలు దేనికీ అడ్డు కారాదు. ఇవాళ నా ఆలోచన అంతా నా ప్రజల గురించే. నేను ఆలోచించాల్సిందల్లా నా రాష్ట్రానికి ఎలా మంచి జరుగుతుందనే. నేనిప్పుడు ఏపీ ప్రజల తరపున ప్రాతినిథ్యం వహిస్తున్నాను. వారికి నేను బాధ్యుడిగా ఉన్నాను. నాపై వారు పెట్టుకున్న నమ్మకం గురించి ఆలోచించకుండా వ్యక్తిగత విషయాలను తీసుకురావడం మంచిది కాదు. సర్దేశాయ్: ఒకవేళ ఇవాళ సోనియాగాంధీ కనుక మీ వద్దకు వచ్చి... ‘జగన్ కమాన్.. మళ్లీ మన ఇంటికి వచ్చేయ్. మీ తండ్రి మా కాంగ్రెస్ వారే’ అని ఆహ్వానిస్తే స్పందిస్తారా? లేక ఆ అధ్యాయం ముగిసినట్లేనా? జగన్: మీరే చెప్పారు కాంగ్రెస్‌కు అత్యల్పంగా ఓట్లు వచ్చాయని. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది? వారితో నాకు అవసరం ఏమిటి? సర్దేశాయ్: మీకు వాళ్ల అవసరం లేదు. కానీ, వాళ్లకు మీ అవసరం ఉంది. జగన్: వాళ్లకు నా అవసరం ఉందంటే అది వారి సమస్య. -
వన్నె తగ్గని ఎన్నిక
క్లాసికల్ డాన్సర్, నటి, రచయిత, డైరెక్టర్, ప్రొడ్యూసర్, పొలిటీషియన్..ఒక ఎంపవర్డ్ ఉమన్‌లోని ఆరు కోణాలివి. ఆ ఆరూ కీలకమైనవే.సమర్థతతో పోటీ పడి రాణించాల్సిన రంగాలే. ఇన్నింటి మధ్య తననుతాను నిరూపించుకుంటూ... కొన్ని వివాదాలు, మరికొన్ని విమర్శలు,అంతకు మించిన వ్యంగాస్త్రాల మధ్య మూడో దఫా పార్లమెంట్లోఅడుగు పెడుతున్నారు ప్రముఖ నటి హేమమాలిని. అరవైల నుంచి ఎనభైల వరకు యువత గుండెల్లో కలలు పూయించిన డ్రీమ్‌గర్ల్ హేమమాలిని... ఉత్తర ప్రదేశ్‌లోని మధుర లోక్‌సభ స్థానం నుంచి మరోసారి ఎన్నికయ్యారు. నలభై ఏళ్ల సుదీర్ఘ సినీ కెరీర్లో 150 సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈ స్వప్న సుందరి సినిమాలకు దూరమయ్యారు కానీ ప్రేక్షకులకు దగ్గర కాకుండా లేరు. టీవీ సీరియల్స్, వాణిజ్య ప్రకటనల్లో కనిపిస్తూనే ఉన్నారు. పుట్టింటి రాష్ట్రం తమిళనాడుకు చెందిన ఓ టెక్స్టైల్ బ్రాండ్‌ను ప్రమోట్ చేయడానికి గులాబీ రంగు పట్టుచీరలో అప్పుడే విరిసిన గులాబీలా కనిపించే హేమ, మరో యాడ్‌లో శుద్ధజలం అంటూ అప్పుడే ఇంటిపనులు చక్కబెట్టుకొచ్చిన గృహిణిలా కనిపిస్తారు. వీటితోపాటు భారతీయ కళల పరిరక్షణ కోసం తన వంతుగా నాట్య ప్రదర్శనలిస్తూనే ఉన్నారు. నాట్యం చేయని రోజు తనకేమీ తోచదని చెబుతుంటారు హేమమాలిని. క్లాసికల్ డాన్స్‌తోపాటు రెగ్యులర్‌గా యోగసాధన చేస్తారామె. డెబ్బై ఏళ్ల వయసులో కూడా హేమ ఇంత అందంగా ఉండటానికి బహుశా అవే ఆమె బ్యూటీ సీక్రెట్స్ కావచ్చు. అయ్యంగారమ్మాయి తమిళనాడులోని తిరుచిరాపల్లిలో అయ్యంగార్ల కుటుంబంలో పుట్టిన హేమమాలినీ చక్రవర్తి ఉత్తర ప్రదేశ్‌లోని మధురను రాజకీయ క్షేత్రంగా మలుచుకున్నారు. సినిమా నిర్మాత కూతురు కావడం, భరత నాట్య కళాకారిణి కావడంతో ఆమె టీనేజ్లోనే సినిమాల్లోకి వచ్చేశారు. చెన్నైలో ప్లస్‌టూ చదువుతుండగానే ‘ఇతు సాహిత్యం’ తమిళ సినిమాలో సహనటిగా సినీరంగ ప్రవేశం చేశారు. సినిమాల్లోకి రావడం వల్ల తనకు ఇష్టమైన హిస్టరీ సబ్జెక్ట్ దూరం కావలసి వచ్చిందనే ఆవేదన ఆమె మాటల్లో వ్యక్తమవుతుండేది. ఆ కొరతను భర్తీ చేసుకోవడానికే ఆమె ‘పరంపర’ చారిటబుల్ ఈవెంట్స్‌లో పాల్గొని మైసూరు, ఖజురహో వంటి చారిత్రక ప్రదేశాల్లో ఇప్పటికీ నాట్య ప్రదర్శనలిస్తున్నారు. సామాజిక కార్యకర్త హేమమాలిని యానిమల్ రైట్స్ యాక్టివిస్టుగా సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా ఉంటారు. ముంబయిలో గుర్రాల మీద బరువులు రవాణా చేయడాన్ని ఆమె తీవ్రంగా గర్హించేవారు. ఈ పరిస్థితిని నియంత్రించవలసిందిగా ఆమె మున్సిపల్ కమిషనర్‌కు రిపోర్టు చేశారు కూడా. అలాగే జల్లికట్టు విషయంలోనూ ఆమె స్పందించారు. అప్పటి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి జైరామ్ రమేశ్‌కు వివరంగా ఉత్తరం రాశారు. ‘జల్లికట్టులో భాగంగా పశువులను నియంత్రించడానికి ముక్కుతాళ్లను పట్టుకుని గట్టిగా లాగుతుంటారు. అలా లాగడం పశువులకు ఎంతో హింసాత్మకం’ అంటూ, జల్లికట్టు సందర్భంగా అవి ఎన్ని రకాలుగా గాయపడుతుంటాయనే విషయాలను కూడా ఆ ఉత్తరంలో వివరంగా రాశారామె. పెటా (పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్) ఇయర్ ఆఫ్ ది అవార్డుకు ఎంపికైన సందర్భంగా.. ‘తన సంతోషం కోసం మరో ప్రాణికి హాని కలిగించడాన్ని ఇష్టపడని కారణంగానే తాను శాకాహారిగా ఉన్నట్లు’ చెప్పారు హేమమాలిని. అభ్యుదయవాది సమాజంలో మహిళకు ఎదురవుతున్న సమస్యల మీద స్పందిస్తూ మహిళాభ్యుదయం కోసం వ్యాసాలు రాస్తుంటారు హేమమాలిని. ‘న్యూ ఉమన్’, ‘మేరీ సహేలీ’ పత్రికలకు కొంతకాలం ఎడిటర్‌గా ఉన్నారామె. సంప్రదాయ పితృస్వామ్య భావజాలంతో నిర్మితమైన సమాజంలో మహిళ స్థానం ఎలా ఉందో చూపిస్తూ, ఆ పరిస్థితులను అధిగమించి పురోగమించాల్సిందిగా తన వ్యాసాల్లో సూచించేవారామె. స్త్రీ తనను తాను ఆధునిక మహిళగా మలుచుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలనేది హేమమాలిని అభిప్రాయం. ఈ అభ్యుదయవాదమే ఆమెను నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌ని చేసింది. ఆ హోదాకు ఎంపికైన తొలి మహిళ హేమమాలిని. ఆమె ఇస్కాన్ లైఫ్ మెంబర్ కూడా. కోలీవుడ్ నుంచి బాలీవుడ్‌కి తమిళంలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఐదారేళ్లకే బాలీవుడ్ వచ్చి హేమమాలిని ఇంటి తలుపు తట్టింది. 1968లో ‘సప్నోం కా సౌదాగర్’ సినిమాతో హిందీ తెరను అలరించేనాటికి అదే తన పర్మినెంట్ అడ్రస్ అవుతుందని ఆమె ఊహించలేదు. ఆ తర్వాత రెండేళ్లకే పరిచయమయ్యారు ధర్మేంద్ర. ఆ పరిచయం ప్రేమగా మారి, పెళ్లి బంధంతో బలపడడానికి పదేళ్లు పట్టింది. అప్పటికే పెళ్లయి పిల్లలున్న ధర్మేంద్ర.. డ్రీమ్‌గర్ల్ మీద ప్రేమను పెంచుకున్నాడు. ఇద్దరూ కలిసి 35 సినిమాల్లో నటించారు. అప్పట్లో బాలీవుడ్లో ధర్మేంద్ర మీద ఒక గాసిప్ నడుస్తుండేది. హేమమాలినితో సీన్ చేసేటప్పుడు సీన్‌ను త్వరగా పూర్తి కానిచ్చేవాడు కాదట. హేమమాలినితో ఎక్కువ సమయం సన్నిహితంగా మెలగడం కోసం షూటింగ్ టైమ్ నిడివి పెరగడానికి రకరకాల వ్యూహాలు పన్నేవాడట. లైట్ బాయ్‌లకు డబ్బిచ్చి షూటింగ్ టైమ్‌లో లైట్లు ఆగిపోయేట్టు చూడమనేవాడట. ఒకే సన్నివేశాన్ని మళ్లీ మళ్లీ నటించవచ్చనేది ధర్మేంద్ర ప్లాన్. వీళ్లిద్దరి పెళ్లితో... నిర్మాతలకు తీసిన సీన్లనే మళ్లీ మళ్లీ తీసే ఖర్చు తప్పింది. కంప్లీట్ ఉమన్ డాన్సర్‌గా, నటిగా కెరీర్ ప్రారంభించిన హేమమాలిని పెళ్లి తర్వాత తెరమరుగైపోలేదు. ఇద్దరు అమ్మాయిలకు తల్లయ్యారు, వాళ్లను డాన్సర్లుగా తీర్చిదిద్దారు. పెద్దమ్మాయి ఈషాను నటనలోకి, రెండో అమ్మాయి అహానాను డైరెక్షన్లోకి తీసుకువచ్చారు. కూతుళ్లతోపాటు నాట్య ప్రదర్శనలిస్తుంటారు, అక్కడ వాళ్లకు సూచనలిచ్చే పెద్దక్కలా కనిపిస్తారు. ఉత్తమ నటిగా 1972లో ఫిలింఫేర్ అవార్డుకు ఎంపికైన హేమ, దశాబ్దాల పాటు కెరీర్లో నిలదొక్కుకుని అదే ఫిలింఫేర్ నుంచి 2000 సంవత్సరంలో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారాన్ని అందుకున్నారు. అదే ఏడాది పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్న డ్రీమ్‌గర్ల్‌ను.. ‘పర్పథమ్ పథ్ సింఘానియా’ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. ప్రచారం నుంచి పార్లమెంట్‌కి సహనటుడు వినోద్ ఖన్నాకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేయడానికి 1999లో మైక్ పట్టుకున్నారు (వినోద్ ఖన్నా పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు) హేమమాలిని. ఆ తర్వాత నాలుగేళ్లకే హేమమాలినిని పెద్దల సభలోకి స్వాగతించింది బీజేపీ. 2003 నుంచి 2009 వరకు ఆరేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగిన హేమమాలిని 2010లో బీజేపీ జనరల్ సెక్రటరీ బాధ్యతలు చేపట్టారు. 2014లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. ఆమె పార్లమెంట్ అభ్యర్థిగా ప్రజల్లోకి రావడం అదే మొదటిసారి. మధుర నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఆర్ఎల్డి అభ్యర్థి జయంత్ చౌదరి మీద మూడు లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారామె. జయంత్ చౌదరి అప్పుడు సిట్టింగ్ ఎంపీ, ఆర్ఎల్డి (రాష్ట్రీయ లోక్‌దళ్) పార్టీ వైస్ ప్రెసిడెంట్ కూడా. ఇప్పుడు మళ్లీ మధుర నుంచి గెలిచి తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు హేమమాలిని. ఈ సారి ఆమె ప్రత్యర్థి ఆర్ఎల్డి అభ్యర్థి కున్వర్ నరేంద్ర సింగ్. అతడిపై హేమ దాదాపుగా మూడు లక్షల మెజారిటీ సాధించారు. నియోజకవర్గంలో అరవై శాతం మంది తమకు ప్రతినిధిగా డ్రీమ్‌గర్లే ఉండాలని ఆకాంక్షించారు. ఈ విజయంతో ఆమె సంసద్ భవన్‌లోకి మూడవసారి అడుగుపెట్టనున్నారు. ఓట్ల పంట హేమమాలిని మార్చి 31వ తేదీన... ‘గోవర్థన క్షేత్రం నుంచి తన ఎన్నికల ప్రచారం మొదలైంద’ని ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఆమె పోస్ట్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయింది. గొప్ప నటి అని ఒకరు, ఆమెకు ఉత్తమ నటి అవార్డు ఇవ్వవచ్చని ఒకరు, ఎప్పుడూ ఇలానే చేస్తే బావుణ్ను అని ఒకరు, ఓట్ల కోసం రాజకీయ నాయకులు ఎలాంటి నాటకాలైనా వేస్తారు, అసలే నటి కదా, ఇక నటనకు ఏం తక్కువ అని ఒకరు... కామెంట్ చేశారు. మీడియా కూడా ఒక ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని ప్రస్తావించింది. అప్పుడామె ‘‘దారిన ప్రయాణిస్తున్నప్పుడు బంగారు రంగులో మెరిసిపోతున్న పంటపొలాలు నన్ను ఆకర్షించాయి. కోతకు సిద్ధంగా ఉంది పంట. పొలంలోకి దిగగానే పంట కోస్తున్న మహిళలు ఎదురొచ్చి ఆదరంగా స్వాగతించారు. వారి దగ్గరున్న కొడవలి అందుకుని నేనూ పంట కోసి కట్టలు కట్టాను’’ అంటూ... దీనికి పెద్దగా చర్చ అవసరం లేదని తేలిగ్గా తీసిపారేశారామె. అయితే ఎవరెన్ని రకాలుగా వ్యంగ్యాస్త్రాలు సంధించినా, మధుర మహిళలు మాత్రం బంగారు రంగు మేనిఛాయతో మెరిసిపోతూ... తమతోపాటు పొలంలో దిగి గోధుమ పంటను కోసిన డ్రీమ్‌గర్ల్‌ను ఇట్టే తమతో కలుపుకున్నారు. ఆమె గడచిన ఐదేళ్లలో లోక్‌సభలో తమ కోసం ప్రశ్నించిన సందర్భాలు చాలా తక్కువనే వాస్తవాన్ని కూడా పక్కన పెట్టి మరీ ఆమె కోసం ఓట్ల పంట పండించారు. అందరిలో ఒకరిలా..! హేమమాలినిలో ఆడంబరత్వం కనిపిస్తుంది కానీ.. పనిగట్టుకుని ఎప్పుడూ ఆమె ఆడంబరాలను ప్రదర్శించలేదు. కారు, ఎస్కార్టు లేకుండా ఆటోలో వెళ్లడానికి ఏ మాత్రం సంశయించరు. గత ఏడాది ఆగస్టులో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి అంత్యక్రియలకు హాజరయ్యారామె. ఆమెకు డ్రైవింగ్ హాబీ కావడంతో సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లారప్పుడు. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత జనంతో కిక్కిరిసి పోయి ఉన్న ఆ ప్రాంగణంలో తన కారు బయటకు వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో, అత్యంత సాధారణమైన మహిళలాగ రోడ్డు మీదకు వచ్చి ఆటో ఆపి ఎక్కేశారు. హేమమాలిని, ఆమెతోపాటు వచ్చిన మరో మహిళ ఇద్దరూ కలిసి ఆటోలో వెళ్లడాన్ని చూసిన వాళ్లు ఆశ్చర్యపోయారు. కానీ ఆమెను బాగా తెలిసిన వాళ్లు మాత్రం... గతంలో కూడా ఓ సారి ఇస్కాన్ టెంపుల్‌కి వెళ్లాల్సిన టైమ్‌కి డ్రైవర్ అందుబాటులో లేకపోవడంతో, డ్రైవర్ కోసం ఎదురు చూడకుండా ఆమె ఆటో పిలిపించుకుని వెళ్లిపోయిన సంగతిని గుర్తు చేసుకున్నారు. బంధువులు, స్నేహితుల ఇళ్లకు వెళ్లేటప్పుడు కూడా మామూలు మహిళలా వెళ్లడానికే ఇష్టపడతారామె.హేమమాలినిని ‘మరీ సన్నగా ఉంద’నే కారణంతో తమిళ ఇండస్ట్రీ పక్కన పెట్టింది. ఆ సన్నదనాన్నే బాలీవుడ్ కోరుకుంది. హేమ 1977లో ‘డ్రీమ్ గర్ల్’ సినిమాలో నటించినప్పటి నుంచి ఆమెకా పేరు స్థిరపడిపోయింది. ఇప్పటికీ హేమ డ్రీమ్ గర్లే. – వాకా మంజులారెడ్డి వివాదాలు.. విపరీతార్థాలు నాలుగేళ్ల కిందట 2015లో హేమమాలిని ఆగ్రా నుంచి జైపూర్‌కి వెళ్తున్నప్పుడు ఆమె మెర్సిడెస్ కారు ఒక ఆల్టో కారు మీదకు దూసుకుపోయింది. ఆ ప్రమాదంలో హేమమాలిని, ఆల్టోలో ఉన్న ఇద్దరు మహిళలు గాయపడ్డారు, ఆల్టోలో ఉన్న నాలుగేళ్ల పాపాయి ప్రాణాలు పోయాయి. ఆ ప్రమాదం తీవ్రమైన వివాదానికి దారి తీసింది. ఆల్టో కారును నడుపుతున్నది ఆ పాపాయి తండ్రే. అతడు ఇండికేటర్ వేయకుండా టర్నింగ్ తీసుకోవడం వల్లనే ప్రమాదం జరిగిందని హేమమాలిని అనడంతో వివాదం రాజుకుంది. ఆమెకు ప్రమాదంలో తగిలిన గాయాల కంటే ఈ వివాదగాయమే పెద్ద తలనొప్పిగా మారిందప్పట్లో.మరో వివాదం బృందావన్ విషయంలో ఎదురైంది. ఏ దారీ లేని వితంతువులకు బృందావన్ ఆశ్రయం కల్పిస్తుంది. అయితే వెస్ట్‌బెంగాల్, బీహార్ నుంచి వచ్చే వితంతువులకు అనుమతి నిరాకరించాలని హేమమాలిని అనడం పెద్ద దుమారాన్నే లేపింది. దీంతోపాటు మరో వివాదం ఆమె డాన్స్ స్కూల్ తెచ్చి పెట్టింది. హేమమాలిని డాన్స్ స్కూల్ ‘నాట్య విహార కళాకేంద్ర’ ముంబయి శివార్లలోని అంధేరీ ప్రాంతంలో ఉంది. రెండువేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న కోట్లాదిరూపాయల విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని కేవలం డెబ్బై వేల రూపాయలకే ఆమెకు కేటాయించడాన్ని తప్పు పట్టాయి ప్రతిపక్షాలు. వీటితోపాటు పార్లమెంట్ సమావేశాల్లో ఆమె హాజరు తక్కువగా ఉండడం కూడా ఆమె వివరణ ఇచ్చుకోలేని గట్టి విమర్శ. -
ఓటమి షాక్‌తో ఆహారం ముట్టని దిగ్గజ నేత..
రాంచీ : లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో ఒక్క సీటు కూడా ఆర్జేడీ దక్కించుకోకపోవడంతో ఆ పార్టీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర మనస్ధాపానికి లోనయ్యారు. ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆయన ఆహారం తీసుకోవడం లేదని రాంచీలోని రిమ్స్‌లో లాలూకు చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన దినచర్య గాడితప్పిందని వారు తెలిపారు. పశుగ్రాస కుంభకోణంలో లాలూ ప్రస్తుతం జైలు జీవితం అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచిలాలూ ఆహారం సరిగ్గా తీసుకోవడం లేదని ఆయనను పర్యవేక్షించే వైద్యుడు ఉమేష్ ప్రసాద్ చెప్పారు. మందులు, ఇన్సులిన్ ఇచ్చేందుకు సహకరిస్తూ ఆయనను ఆహారం సవ్యంగా తీసుకోవాలని తాము కోరుతున్నామని అన్నారు.బిహార్‌లో కాంగ్రెస్-ఆర్జేడి కూటమిగా ఎన్డీయేను ఎదుర్కోగా కాంగ్రెస్‌కు కేవలం ఒక స్ధానం దక్కగా, ఆర్జేడీ ఒక్క స్ధానంలోనూ గెలుపొందలేదు. రాష్ట్రంలోని 40 స్ధానాలకు గాను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 39 స్ధానాలను గెలుచుకుని క్లీన్‌స్వీప్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రణాళికలు రూపొందించుకోవచ్చని లాలూకు ఆర్జేడీ నేతలు సర్ధిచెబుతున్నా ఆర్జేడీ చీఫ్ మాత్రం ఫలితాల షాక్ నుంచి ఇంకా తేరుకోలేదని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. -
ప్రభుత్వానికి పతన భయం?
కనీవినీఎరుగని ఘోర పరాజయం కాంగ్రెస్, జేడీఎస్‌ల మధ్య సంబంధాలను చరమాంకంలోకి నెట్టింది. విజయంతో అన్నింటినీ సర్దుబాటు చేయవచ్చని ఆశించినా అలా జరగకపోవడంతో సంకీర్ణ పెద్దలకు దిక్కుతోచడం లేదు. అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఒక సీటును కోల్పోవడం మరో ముప్పుగా మారింది. మ్యాజిక్ నంబర్‌కు దగ్గరవుతున్న బీజేపీ త్వరలోనే భారీ ఆపరేషన్ నిర్వహిస్తున్నందని అంచనా. సాక్షి, బెంగళూరు: కాంగ్రెస్ – జేడీఎస్ నేతృత్వంలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వంలో ఆరంభం నుంచి అయోమయం నెలకొంది. ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను పసిగట్టిన బీజేపీ ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూ ప్రభుత్వ ఏర్పాటు ప్రచారం సాగించింది. బీజేపీ తెరవెనుక ఉంటూ ‘ఆపరేషన్ కమల్’ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఏడాది కాలంగా బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుపై ఊరించి.. ఊరించి వెనక్కి తగ్గింది. సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలిస్తే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి చెడ్డపేరు వస్తుందనే ఉద్దేశంలో సార్వత్రికం ముగిసే వరకు మౌనం వహించారు. అయితే ప్రస్తుతం సార్వత్రికం ఫలితాలు కూడా బీజేపీకే అనుకూలంగా వచ్చాయి. దీంతో సంకీర్ణ ప్రభుత్వం మరింత సంకటంలోకి వెళ్లింది. వెంటనే కాంగ్రెస్ – జేడీఎస్ అవలోకన పేరుతో పోస్టుమార్టం సమావేశాలు నిర్వహించారు. సీఎం పదవికి రాజీనామా చేస్తానని కుమారస్వామి వాపోయినట్లు కూడా తెలుస్తోంది. అయితే బీజేపీ చేతుల్లోకి అధికారం వెళ్తే తమ మనుగడ కష్టసాధ్యమని కాంగ్రెస్ భయపడుతోంది. దీంతో సీఎం పదవి మీదేనని జేడీఎస్‌ను బుజ్జగిస్తోంది. బీజేపీ అప్రమత్తం సంకీర్ణ ప్రభుత్వంలో విభేదాలు నెలకొన్నాయనే ప్రచారం సాగడంతో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ సర్వం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయి అందరు ఒకేతాటిపై ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రభు త్వంపై అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ – జేడీఎస్ ఎమ్మెల్యేలను టచ్ చేయొద్దని వారి మధ్య విభేదాలే ప్రభుత్వానికి కారణం అవుతాయని సూచించారు. వరుస భేటీల్లో జేడీఎస్ లోక్‌సభ ఫలితాల అనంతరం సంకీర్ణ ప్రభుత్వం కూలిపోతుందనే ప్రచారం సాగడంతో దళపతులు అప్రమత్తం అయ్యారు. ఎప్పటికప్పుడు సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. దేవెగౌడతో సీఎం కుమారస్వామి రెండుసార్లు భేటీ అయ్యారు. అదేవిధంగా సీఎం కుమారస్వామితో జేడీఎస్ మంత్రులు సమావేశమయ్యారు. జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్.విశ్వనాథ్ భేటీ అయ్యారు. మాజీ సీఎం, సీఎల్పీ నేత సిద్ధరామయ్య సమావేశమై రాజకీయ పరిస్థితుల గురించి చర్చించారు. ఇక బీజేపీకి అధికారం ఇస్తే పార్టీ మనుగడ కష్టమని భావించిన కాంగ్రెస్ ప్రభుత్వ మనుగడకు గట్టి పోరాటం చేస్తోంది. అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా బీజేపీలో వెళ్లకుండా అడ్డుకట్ట వేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ లోకి వెళ్తారని ప్రచారం సాగినా.. కేవలం చించోళి ఎమ్మెల్యే ఉమేశ్ జాదవ్ మాత్రమే వెళ్లారు. ఉప ఎన్నికతో మరో దెబ్బ సార్వత్రిక ఎన్నికల్లో ఓటమితో పాటు కుందగోళ, చించోళి ఉప ఎన్నికలో కూడా కాంగ్రెస్‌కు దెబ్బ పడింది. చించోళి స్థానంలో బీజేపీ అభ్యర్థి అవినాశ్ జాదవ్ గెలవడంతో సంకీర్ణ ప్రభుత్వానికి సంఖ్య తగ్గింది. గతంలో చించోళి, కుందగోళ స్థానాలు కాంగ్రెస్‌వే. అయితే ప్రస్తుతం ఒక్క సీటు జారిపోయింది. -
‘రాహుల్ రాజీనామా డ్రామా’
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ సారధ్య బాధ్యతల నుంచి తప్పుకుంటానని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ రాజీనామా ప్రతిపాదనను బీజేపీ ఎద్దేవా చేసింది. రాహుల్ రాజీనామాకు సిద్ధపడటాన్ని ఆ పార్టీ సీనియర్ నేత, పార్టీ పశ్చిమ బెంగాల్ ఇన్చార్జ్ కైలాష్ విజయ్‌వర్గియ డ్రామాగా అభివర్ణించారు. మనకు ఇచ్చేది, తీసుకునేంది అంతా భగవంతుడేనని, రాజీనామా చేస్తానని రాహుల్ అనడం డ్రామానేనని ఆయన ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఘోరపరాజయం నేఫథ్యంలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి చేసిన రాజీనామాను సీడబ్ల్యూసీ తిరస్కరించిన సంగతి తెలిసిందే. శనివారం జరిగిన సీడబ్ల్యూసీ భేటీలో పార్టీ ఓటమిని నేతలు సమక్షించారు. కీలక సమయంలో పార్టీ నాయకత్వ స్ధానంలో కొనసాగాలని రాహుల్‌ను కోరారు. పార్టీ చీఫ్‌గా కొనసాగాలని, కిందిస్ధాయి నుంచి ప్రక్షాళన చేసి బలోపేతం చేయాలని సీడబ్య్లూసీ సభ్యులు ఓ తీర్మానాన్ని ఆమోదించారు. -
ఫ్యూజ్‌పోయిన పవర్‌స్టార్
పెరంబూరు: నటుడు సూపర్‌స్టార్ శ్రీనివాసన్‌కు ఓటర్లు షాక్ ఇచ్చారు. ఫ్యూజ్‌పోయిన పవర్‌స్టార్‌గా మార్చేశారు. సినిమా క్రేజ్ ఉంది కదా అని అందరూ రాజకీయ నాయకులైపోయి ఏలేద్దాం అనుకుంటే కుదరదు. అలా ఆశపడిన హాస్యనటుడు పవర్‌స్టార్ శ్రీనివాసన్ ఓటర్ల చేతిలో ఘోరంగా భంగపడ్డారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున దక్షిణ చెన్నై స్థానానికి పోటీ చేశారు. తన విజయం ఖాయమని, లక్షకు పైగా మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. అయితే ఆ స్థానంలో స్వతంత్ర అభ్యర్థి కంటే తక్కువ ఓట్లు పొందారు. కేవలం 670 ఓట్లు మాత్రమే పడ్డాయి. దీంతో ఫ్యూజ్‌పోయిన పవర్‌స్టార్ అని అభిమానులు ఎగతాలి చేస్తున్నారు. -
మమతా బెనర్జీ రాజీనామా..!
కోల్‌కతా: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పశ్చిమబెంగాల్లో బీజేపీ అనూహ్య ఫలితాలు సాధించడంతో ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ ఇరుకునపడ్డారు. ఈ నేపథ్యంలో కోల్‌కతాలో శనివారం పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన మమతా పార్టీ వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించారు. అయితే టీఎంసీ మమతా బెనర్జీ రాజీనామాను తిరస్కరించింది. ఈ సమావేశం అనంతరం మమత మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఈవీఎంలను తారుమారు చేసిందనీ, ఈ ఫలితాల వెనుక విదేశీ శక్తుల హస్తముందని ఆరోపించారు. అందుకే రాజీనామా చేశా.. ‘లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో పాలనను ఈసీ 5 నెలల పాటు ఆధీనంలోకి తీసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో నేను సీఎంగా ఎలా ఉండగలను? అందుకే ముఖ్యమంత్రిగా తప్పుకుంటానని చెప్పాను. కానీ పార్టీ నా రాజీనామాను తిరస్కరించింది. ఈ సీఎం కుర్చీ నాకవసరం లేదు. ఆ కుర్చీకే నా అవసరం ఉంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీనీ నెరవేర్చాం. ఇప్పటివరకూ ప్రజల కోసం పనిచేశా. ఇప్పుడు పార్టీని పటిష్టం చేయడంపై కూడా దృష్టి సారిస్తా. లోక్‌సభ సీట్లలో బీజేపీ అభ్యర్థులకు లక్ష మెజారిటీ దాటేలా వాటిని రీప్రోగ్రామింగ్ చేశారు. దీనివెనుక విదేశీ శక్తులు కూడా ఉండొచ్చు. బీఎస్ఎఫ్ బలగాలు ప్రజలపై ఒత్తిడి తెచ్చి బీజేపీకి ఓట్లేసేలా చేశాయి’ అని మమత ఆరోపించారు. -
కాంగ్రెస్ చీఫ్‌గా ఉండలేను
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో కాంగ్రెస్‌లో కీలక పరిణామాలు సంభవించాయి. శనివారం జరిగిన కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి(సీడబ్ల్యూసీ) భేటీలో పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలనుకుంటున్నట్లు రాహుల్ గాంధీ ప్రకటించారు. అయితే, ఆయన నిర్ణయాన్ని ముక్తకంఠంతో సమావేశం తిరస్కరించింది. అయితే, రాహుల్ తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే సూచనలు కనిపించడం లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో గాంధీ కుటుంబం నుంచి కాకుండా వేరొకరికి పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి. ఇందుకు సరైన నేతల్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఒకరని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. నాలుగు గంటలపాటు భేటీ దాదాపు నాలుగు గంటలపాటు జరిగిన సీడబ్ల్యూసీ భేటీలో యూపీఏ చైర్ పర్సన్ సోనియా, మాజీ ప్రధాని మన్మోహన్, పార్టీ ప్రధాన కార్యదర్శులు ప్రియాంక గాంధీ, జ్యోతిరాదిత్య సింథియా, పంజాబ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సీఎంలు అమరీందర్ సింగ్, అశోక్ గహ్లోత్, భూపేశ్ బఘేల్‌తోపాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి, పార్టీ సీనియర్ నేతలు చిదంబరం, ఆంటోనీ, అహ్మద్ పటేల్, ఆజాద్, షీలా దీక్షిత్, ఖర్గే తదితర 50 మంది నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో పార్టీ వైఫల్యానికి కారణాలు, ప్రజలను మెప్పించడంలో వైఫల్యానికి దారి తీసిన పరిస్థితులను చర్చించారు. ఆయనే కొనసాగాలన్న సీడబ్ల్యూసీ ‘రాహుల్ నిర్ణయాన్ని సమావేశం ముక్తకంఠంతో తిరస్కరించింది. ఇలాంటి క్లిష్ట సమయంలో పార్టీకి నాయకత్వం, మార్గదర్శకత్వం వహించాలని ఆయన్ను కోరింది’అని సమావేశం అనంతరం మీడియాతో కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా తెలిపారు. ‘పార్టీని అన్ని స్థాయిల్లోనూ పార్టీ బలోపేతం, పునర్నిర్మాణం చేపట్టాలని, దేశంలోని యువత, రైతులు, బడుగు, బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పక్షాన పనిచేసేందుకు పార్టీకి నేతృత్వం వహించాలని సీడబ్ల్యూసీ కోరింది. పార్టీకి ఓట్లేసిన 12.13 కోట్ల మంది ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది’అని ఆయన తెలిపారు. రాహుల్‌ను అధ్యక్షుడిగా కొనసాగాలన్న సీనియర్ నేత చిదంబరం సమావేశంలో కొంత ఉద్విగ్నానికి లోనయ్యారు. బాధ్యతల నుంచి వైదొలగాలన్న రాహుల్ నిర్ణయం నేపథ్యంలో పార్టీ మద్దతుదారులు, ముఖ్యంగా దక్షిణాదికి చెందిన వారు తీవ్రమైన చర్యలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. పార్టీ వైఫల్యానికి కారణాలను వివరిస్తూ సమావేశంలో ప్రియాంక, మన్మోహన్ మాట్లాడారు. తన ప్రభుత్వం మనుగడ ప్రమాదంలో పడిన నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ ఈ సమావేశానికి హాజరుకాలేదని సమాచారం. 2014 ఎన్నికలతో పోల్చుకుంటే గెలుచుకున్న ఎంపీ సీట్ల సంఖ్య 44 నుంచి 52కు పెరిగినప్పటికీ 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కాంగ్రెస్ ఖాతా తెరవలేకపోయింది. పార్టీ పరాజయానికి తమదే బాధ్యతంటూ యూపీ, ఒడిశా కాంగ్రెస్ అధ్యక్షులు రాజ్ బబ్బర్, నిరంజన్ పట్నాయక్ ఇప్పటికే రాజీనామాలు సమర్పించగా మరికొందరూ అదే బాటలో ఉన్నట్లు చెబుతున్నారు. పార్టీ చీఫ్‌గా ప్రియాంక వద్దు ఈ సమావేశంలో ప్రసంగించిన రాహుల్.. ‘ప్రభుత్వానికి వ్యతిరేకంగా మన పోరాటం కొనసాగుతుంది. క్రమశిక్షణ గల కాంగ్రెస్ పార్టీ సైనికుడిగా నా పోరాటాన్ని కొనసాగిస్తా. కానీ, పార్టీ అధ్యక్షుడిగా నేను కొనసాగాలనుకోవడం లేదు’ అని పేర్కొన్నారు. తన స్థానంలో మరొకరిని ఎన్నుకోవాలని కోరారు. ప్రియాంకకు ఆ బాధ్యతలు అప్పగించాలని కొందరు ప్రతిపాదించగా ‘నా సోదరిని ఈ విషయంలోకి లాగకండి’ అంటూ రాహుల్ వ్యతిరేకించారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా గాంధీ కుటుంబానికి చెందిన వారే ఉండాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. కంచుకోట వంటి అమేథీ నుంచి ఓటమి చవిచూడటంతో రాహుల్ రాజీనామా చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు భావిస్తున్నారు. దీంతో తల్లి సోనియా, చెల్లి ప్రియాంక ఎంతగా నచ్చజెప్పినా వెనక్కి తగ్గేందుకు ఆయన అంగీకరించలేదు. సీడబ్ల్యూసీ భేటీ అనంతరం మీడియా భేటీలో పాల్గొనకుండానే రాహుల్ వెళ్లిపోయారు. దీంతో వైదొలిగే యోచనలోనే రాహుల్ ఉన్నట్లు భావిస్తున్నామని నేతలు అంటున్నారు. -
జాతీయ ఆశయాలు.. ప్రాంతీయ ఆశలు
న్యూఢిల్లీ: నవ భారత నిర్మాణానికి నూతన శక్తితో తమ ప్రభుత్వం నూతన ప్రయాణాన్ని ప్రారంభిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. కుల, విశ్వాసపరమైన మరే ఇతర వివక్షకు తావులేకుండా పనిచేయాల్సిందిగా కొత్తగా ఎన్నికైన ఎంపీలను ఆయన కోరారు. ‘జాతీయ ఆశయాలు .. ప్రాంతీయ ఆశలు (నేషనల్ యాంబిషన్స్, రీజనల్ ఆస్పిరేషన్స్– నారా)’ ఎన్డీయే కూటమికి తానిచ్చే నినాదంగా మోదీ చెప్పారు. ఎన్డీయే ఈ రెండు మార్గాల్లో ముందుకు వెళుతోందని, అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ఈ రెండిటి కలయిక అవసరమని పేర్కొన్నారు. ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ నేతగా మోదీ శనివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో సమావేశమైన ఆయా పార్టీలకు చెందిన ఎంపీలు మోదీని తమ నేతగా ఎన్నుకున్నారు. ప్రకాశ్‌సింగ్ బాదల్ (అకాలీదళ్) మోదీ పేరును ప్రతిపాదిస్తూ తీర్మానం ప్రవేశపెట్టగా..నితీశ్ కుమార్ (జేడీయూ), ఉద్ధవ్ థాకరే (శివసేన) తదితర నేతలు బలపరిచారు. మోదీ 353 మంది ఎంపీల పార్లమెంటరీ పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎంపికైనట్లు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఎంపీల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. అంతకుముందు బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా మోదీని ఆ పార్టీ ఎంపీలు ఎన్నుకున్నారు. మోదీ పేరును షా ప్రతిపాదించగా పార్టీ మాజీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కారీలు మద్దతు పలికారు. బీజేపీ సీనియర్ నేతలు ఎల్కే అద్వాణి, మురళీ మనోహర్ జోషి తదితరులు వేదికపై ఆసీనులయ్యారు. ఎన్డీయే నేతగా ఎన్నికైన తర్వాత శనివారం రాత్రి మోదీ రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దీంతో మోదీని ప్రధానిగా కోవింద్ నియమించారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు. అంతకుముందు ఎన్డీయే నేతలు రాష్ట్రపతిని కలిసి తమ ఎంపీల జాబితాను అందజేశారు. కేబినెట్ కూర్పుపై మీడియా కథనాలు నమ్మొద్దు ఎన్డీయే పక్ష నేతగా ఎన్నికైన సందర్భంగా మోదీ 75 నిమిషాలకు పైగా ప్రసంగించారు. ఎన్నికల్లో మైనారిటీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారంటూ పరోక్షంగా ప్రతిపక్ష పార్టీలను విమర్శించారు. వారు ఎప్పుడూ భయంతో బతికేలా చేశారన్నారు. వారి విశ్వాసాన్ని కూడా పొందాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. 1857 నాటి స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని ఆయన గుర్తుచేశారు. ఆనాడు స్వాతంత్య్రం కోసం అన్ని మతాలూ చేతులు కలిపాయన్నారు. సుపరిపాలన కోసం ఇప్పుడు మళ్లీ అలాంటి ఉద్యమం ప్రారంభించాల్సి ఉందని మోదీ చెప్పారు. తమపై విశ్వాసం ఉంచిన వారితో పాటు, ఎవరి విశ్వాసం చూరగొనాల్సి ఉందో వారితో కూడా తాము ఉంటామన్నారు. ఈ సందర్భంగా మోదీ కొత్త ఎంపీలకు పలు సూచనలు కూడా చేశారు. వీఐపీ సంస్కృతిని విడనాడటంతో పాటు ప్రచారం కోసం మీడియాకు ప్రకటనలివ్వద్దని చెప్పారు. కొత్త మంత్రివర్గ కూర్పుపై మీడియాలో వచ్చే కథనాలను నమ్మవద్దన్నారు. అవన్నీ గందరగోళం సృష్టించడమే లక్ష్యంగా,, కొన్ని సందర్భాల్లో దురుద్దేశపూరితంగా ఉంటాయని అన్నారు. ఎన్డీయే ఎంపీలందరి వివరాలను తానింకా పరిశీలించాల్సి ఉందని చెప్పారు. నియమ, నిబంధనలను అనుసరించి బాధ్యతలు అప్పగించడం జరుగుతుందని అన్నారు. ప్రజలను ఏకం చేసిన ఎన్నికలు ఎన్నికలు ఎప్పుడూ విభజించడంతో పాటు అంతరాన్ని సృష్టిస్తాయని, కానీ 2019 ఎన్నికలు ప్రజలను, సమాజాన్ని ఏకం చేశాయని చెప్పారు. ఈసారి ప్రభుత్వ అనుకూల వాతావరణం ఉండటం గమనార్హమని, దాని ఫలితంగానే సానుకూల తీర్పు వెలువడిందని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సేవ చేయడానికి మించిన మంచి మార్గం మరొకటి లేదన్నారు. 2014–19 మధ్య పేదల కోసం ప్రభుత్వాన్ని నడిపామని, ఆ పేదలే ఇప్పుడు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని తాను చెప్పగలనని మోదీ అన్నారు. ఇప్పుడు లభించిన భారీ విజయం అంతే పెద్ద బాధ్యతను మనపై ఉంచిందని చెప్పారు. దేశాభివృద్ధికి ఎన్డీయే ఎంపీలందరూ కలసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పాల్గొన్న తెలంగాణ బీజేపీ ఎంపీలు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన నలుగురు తెలంగాణ బీజేపీ ఎంపీలు శనివారం ఢిల్లీలో జరిగిన ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ, ఎన్డీయే పక్ష సమావేశంలో పాల్గొన్నారు. సికింద్రాబాద్ ఎంపీ కిషన్‌రెడ్డి, అదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌లు హాజరయ్యారు. ఎన్డీయే భారీ మెజారిటీతో తిరిగి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తన తల్లి హీరాబా మోదీ ఆశీస్సులు తీసుకునేందుకు ప్రధాని ఆదివారం గుజరాత్ వెళ్లనున్నారు. వీఐపీ సంస్కృతిని దేశం అసహ్యించుకుంటుంది. విమానాశ్రయంలో సెక్యూరిటీ చెక్ కోసం మీరెందుకు క్యూలో నిలబడలేరు? అందులో తప్పేం లేదు. ‘రెడ్ లైట్’ (ఎర్ర బుగ్గ) సంస్కృతికి మోదీ స్వస్తి చెప్పారని ప్రజలు చెప్పుకుంటారు. మనోహర్ పరీకర్ ఏం చేసేవారో మీరు చూశారు. ఆయన్ను అనుసరించండి. ఎలాంటి వలలోనూ పడకండి. ప్రభుత్వ వ్యతిరేకత హానిచేస్తుంది. కానీ మనం చేసిన పని ప్రభుత్వ అనుకూల గాలి సృష్టించింది. ఫలితంగా సానుకూల ఓటును మనం చూడగలిగాం. 16వ లోక్‌సభ రద్దు కేంద్ర మంత్రివర్గం సిఫారసు నేపథ్యంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 16వ లోక్ససభను రద్దు చేసినట్లు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రుల రాజీనామాలను రాష్ట్రపతి శుక్రవారం ఆమోదించిన విషయం విదితమే. మోదీ మే 30న నూతన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. కాగా ప్రమాణ స్వీకార తేదీ, సమయాన్ని, కొత్త మంత్రులుగా నియమించే వారి పేర్లను అందజేయాల్సిందిగా ప్రధానిని రాష్ట్రపతి కోవింద్ కోరినట్లు రాష్ట్రపతి భవన్ తెలిపింది. మోదీ 30న ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశముందని బీజేపీ శ్రేణులు తెలిపాయి. రాష్ట్రపతిభవన్‌లో మోదీకి ప్రధానిగా నియామక పత్రం ఇస్తున్న రాష్ట్రపతి కోవింద్ శనివారం ఢిల్లీలో పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఎన్డీఏ పార్లమెంటరీ బోర్డు సమావేశానికి హాజరైన ఎన్డీఏ ఎంపీలు, కూటమి నేతలు పార్లమెంటు ప్రాంగణంలో తెలంగాణ బీజేపీ ఎంపీలు బండి సంజయ్ కుమార్, కిషన్ రెడ్డి, సోయం బాపూరావు పార్లమెంటు లోపలికి వస్తూ ఎంపీ సన్నీడియోల్ విజయసంకేతం, పార్లమెంటు ద్వారం వద్ద మోకరిల్లాక నమస్కరిస్తున్న ఎంపీ హన్స్‌రాజ్ హన్స్ -
‘ముఖాముఖి’లో గల్లంతైన కాంగ్రెస్
కాంగ్రెస్‌తో ముఖాముఖి పోరులో బీజేపీదే పైచేయి అని ఇటీవలి సార్వత్రిక ఎన్నికలు మరోసారి నిరూపించాయి. యూపీలోని అమేథీలో స్వయంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీయే బీజేపీ చేతిలో ఓడిపోవడం ఇందుకు నిదర్శనం. ఈ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా 186 నియోజకవర్గాల్లో బీజేపీతో ముఖాముఖి తలపడిన వందేళ్ల చరిత్ర గల కాంగ్రెస్ కేవలం పదిహేను చోట్ల మాత్రమే గెలుపు సాధించింది. 2014 ఎన్నికల్లో ముఖాముఖి పోరులో 24 సీట్లు దక్కించుకున్న కాంగ్రెస్ స్కోరు ఈసారి పదిహేనుకు పడిపోయింది. అలాగే, 20 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉనికిలో లేకుండా పోయింది. బీజేపీ 50శాతానికి పైగా ఓట్లు పొందిన రాష్ట్రాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ.. మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లలో ఐదు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గద్దెదించి కాంగ్రెస్అధికార పగ్గాలు చేపట్టింది. అయితే, అదే ఊపును లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ కొనసాగించలేకపోయింది. ఈ మూడు రాష్ట్రాల్లో కలిపి కాంగ్రెస్ కేవలం రెండు స్థానాలనే గెలుచుకుంది. ముఖాముఖి పోరు జరిగిన రాజస్తాన్‌లో మొత్తం 25 సీట్లనూ కమలదళం గెలుచుకుంది. మధ్యప్రదేశ్‌లో మొత్తం 29 స్థానాల్లోనూ ముఖాముఖి పోరు జరగ్గా కాంగ్రెస్ కేవలం ఒక్క సీటు(చింద్వారా)ను మాత్రమే కైవసం చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల్లో ఇలా చతికిల పడుతుందని ఎవరూ ఊహించలేదు. గుజరాత్‌లోని మొత్తం 26 నియోజకవర్గాల్లో, మహారాష్ట్రలో 16 చోట్ల హోరాహోరీ పోరులో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా దక్కలేదు. కర్ణాటకలోని 28 స్థానాల్లో 21 చోట్ల బీజేపీతో పోటీపడగా కాంగ్రెస్‌కు ఒక్క సీటు దక్కింది. కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో రాయ్‌బరేలీ, అమేథీల్లో కాంగ్రెస్, కమలదళంతో ముఖాముఖి తలపడింది. రాయ్‌బరేలీలో సోనియా గాంధీ గెలిస్తే, అమేథీని కమలం తన ఖాతాలో వేసుకుంది. రాజధాని ఢిల్లీలో 5 చోట్ల ఈ రెండు పార్టీలు ఢీకొనగా అన్ని సీట్లూ బీజేపీకే వచ్చాయి. పశ్చిమ బెంగాల్లో మాత్రం ముఖాముఖిలో కాంగ్రెస్‌దే పైచేయి అయింది. ఇక్కడ రెండు సీట్లు గెలుచుకుంది. ముఖాముఖి పోరులో కాంగ్రెస్ విజయం సాధించింది. అలాగే, కేరళ, తమిళనాడుల్లో కూడా ముఖాముఖి పోరులో బీజేపీ నెగ్గుకు రాలేకపోయింది. -
80% మోదీ మ్యాజిక్
ఎన్నికల్లో రాజకీయ పార్టీ ల అధినేతల ర్యాలీలు, సభల నిర్వహణకు నియోజకవర్గాలను ఎంపిక చేయడం అంత ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. ఒక ప్రాంతంలో సభని నిర్వహిస్తే, దానికి జన సమీకరణే కాదు, ఆ తర్వాత ఓట్లు రాబట్టుకోగలగాలి. ఎన్నికల ర్యాలీల ఎంపికలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యూహాలకు తిరుగేలేదు. ఉన్న కాస్త సమయంలోనే ఆయన పక్కాగా, ప్రణాళికా బద్ధంగా దేశవ్యాప్తంగా 142 నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. వాటిలో ఏకంగా 114 స్థానాల్లో కాషాయ జెండా రెపరెపలాడింది. అంటే సక్సెస్ రేటు 80శాతంగా ఉంది. మోదీ తన ప్రచార సభల్లో మూడోవంతు ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్‌ల్లో నిర్వహించి అనూహ్య విజయాలు సొంతం చేసుకున్నారు. గతేడాది జరిగిన మూడు హిందీ రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ 27 నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహిస్తే బీజేపీ 13 స్థానాల్లో మాత్రమే నెగ్గింది. అంటే గెలుపు రేటు 48శాతంగా ఉంది. ఏడాది తిరిగే సరికల్లా లోక్‌సభ ఎన్నికల్లో మోదీ సక్సెస్ రేటు రెట్టింపైంది. హిందీ రాష్ట్రాలైన, మధ్యప్రదేశ్, రాజస్తాన్, బిహా ర్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌ల్లో మోదీ 60 ర్యాలీలు నిర్వహిస్తే మొత్తంగా క్లీన్‌స్వీప్ చేసింది. యూపీలో 30 లోక్‌సభ నియోజకవర్గాల్లో మోదీ ర్యాలీల్లో పాల్గొంటే 23 సీట్లలో బీజేపీ నెగ్గింది. ఇక కేరళ, తమిళనాడుల్లో మోదీ అయిదు ర్యాలీల్లో పాల్గొంటే ఎన్డీయే కూటమి కి ఒక్క సీటు మాత్రమే వచ్చింది. రాహుల్‌పై మళ్లీ అదే ముద్ర! కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై కొన్నాళ్ల కిందటి వరకు ఐరన్ లెగ్ ముద్ర ఉండేది. ఆయన ఎవరికి ప్రచారం చేస్తే వారు ఓడిపోతారన్న భావన అందరిలోనూ నెలకొంది. గతేడాది హిందీ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల విజయంతో రాహుల్ తనపై ఉన్న పప్పూ ముద్రను తొలగించుకున్నారని ఆయన అభిమానులు ఆనందించారు. కానీ ఇంతలోనే అది కాస్తా తారుమారైంది. రాహుల్ 115 నియోజకవర్గాల్లో పర్యటిస్తే యూపీఏ 96 సీట్లలో ఓడిపోయింది. ఆయన గెలుపు 17శాతం దగ్గరే నిలిచిపోయింది. తుస్సుమన్న బ్రహ్మాస్త్రం ఇక కాంగ్రెస్ పార్టీ తన అమ్ముల పొదిలోంచి ఎన్నికలకు మూడు నెలల ముందు తీసిన బ్రహ్మాస్త్రం తుస్సుమంది. సమయం తక్కువగా ఉన్నప్పటికీ 38 నియోజక వర్గాల్లో ప్రియాంక గాంధీ పర్యటించారు. 44 ర్యాలీల్లో పాల్గొన్నారు. 26 ర్యాలీలు యూపీలో నిర్వహిస్తే, మిగిలినవి మధ్యప్రదేశ్, ఢిల్లీ, జార్ఖండ్, హరియాణాల్లో పార్టీ అభ్యర్థులు నిర్వహించిన సభల్లో పాల్గొన్నారు. కానీ అన్న రాహుల్ పాటి సక్సెస్‌ను కూడా ఆమె సాధించలేకపోయారు. ప్రియాంక ప్రచారం చేసిన స్థానాల్లో రెండంటే రెండు అదీ అమ్మ, అన్న మాత్రమే గెలిచారు. రాయ్‌బరేలి, వయనాడ్‌ల్లో సోనియా, రాహుల్ మినహా మరెవరూ గెలవలేకపోయారు. వాస్తవానికి ప్రియాంక ప్రచారం పార్టీకి కొత్తగా ఒనగూర్చే ప్రయోజనం ఏమీ లేదని తలపండిన రాజకీయ విశ్లేషకులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. -
మూడు గెలిచినా జోష్ లేదు!
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఫలితాలు కొంత సానుకూలంగా వచ్చాయనే భావన తప్ప, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో పెద్దగా జోష్ కనిపించడం లేదు. బీజేపీకన్నా తక్కువ సంఖ్యలో స్థానాలు వచ్చాయనే ఆందోళన ఆ పార్టీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికల్లో వరుస ఓటములు ఎదురవుతున్నప్పటికీ ఇప్పటివరకు రాష్ట్రంలో టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం అన్న భావనతో ఉన్న కాంగ్రెస్‌లో, బీజేపీకి తమకన్నా ఎక్కువ స్థానాలు రావడం అసంతృప్తికి కారణమవుతోంది. మూడు స్థానాల్లో గెలిచినంతవరకు బాగానే ఉంది కానీ, మరింత సానుకూల ఫలితాలు వచ్చి ఉంటే పార్టీ శ్రేణులకు మరింత స్థైర్యం వచ్చేదని, బీజేపీకన్నా ఒక్క స్థానంలో ఎక్కువ గెలిచినా సేఫ్జోన్లో ఉండేవారమనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. నిస్తేజం నుంచి కోలుకునిఉంటే.. వాస్తవానికి, అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయానికి తోడు పార్టీ నేతలంతా వలసల బాట పడుతున్న పరిస్థితుల్లో వచ్చిన లోక్‌సభ ఎన్నికల్లో కొంత కోలుకుని పనిచేసి ఉంటే బావుండేదని కాంగ్రెస్ నేతలంటున్నారు. అప్పటికే కార్యకర్తలు ఆత్మన్యూనత భావనతో ఉండడం, కీలక నేతలంతా బరిలోకి దిగి ఎవరి నియోజకవర్గాలకు వారే పరిమితం కావడంతో క్షేత్రస్థాయిలో పార్టీపరంగా ఫోకస్ చేయలేకపోయామని వారు అంగీకరిస్తున్నారు. జహీరాబాద్, చేవెళ్ల లోక్‌సభ స్థానాల్లో స్వల్ప తేడాతో ఓటమికి ఇదే కారణమని, ఇంకొంచెం కష్టపడి ఉంటే ఖచ్చితంగా మరో రెండు స్థానాలు దక్కేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌తోపాటు రేవంత్, కోమటిరెడ్డి లాంటి నేతలు వారు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ప్రచారంలో ఉన్నా మిగిలిన కాంగ్రెస్ నేతలంతా కలసికట్టుగా ప్రచారం నిర్వహించి ఉంటే బాగుండేదని అంటున్నారు. ప్రణాళికతో ప్రచారం చేసి ఉంటే రెండు, మూడు స్థానాల్లో సానుకూల ఫలితం వచ్చేదని, అప్పుడు బీజేపీ తమకు ప్రత్యామ్నాయమనే చర్చ కూడా వచ్చేది కాదని వారంటున్నారు. సమావేశమన్నారు.. వాయిదా వేశారు.. లోక్‌సభ ఎన్నికల ఫలితాలను సమీక్షించేందుకుగాను ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించిన కాంగ్రెస్ నేతలు దాన్ని ఆకస్మికంగా వాయిదా వేసుకున్నారు. సమావేశానికి హాజరయ్యేందుకు శనివారం కొందరు నేతలు గాంధీభవన్‌కు చేరుకున్న తర్వాత వాయిదా వేస్తున్నట్టు ప్రకటించడం గమనార్హం. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌లోనే ఉన్నప్పటికీ రేవంత్, కోమటిరెడ్డిలు అభినందనల కార్యక్రమంలో బిజీగా ఉండడంతో సమీక్ష సమావేశానికి రాలేకపోతున్నామని తెలియజేశారు. దీంతో సమావేశంలో భాగంగా గెలిచిన ముగ్గురు ఎంపీలకు సన్మానం ఏర్పాట్లు చేసినా వారు రాకపోవడంతో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్ నేతృత్వంలో కేక్‌కట్ చేసి సంతృప్తి చెందారు. కాగా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సతీసమేతంగా శనివారం సాయంత్రం శ్రీవారి దర్శనానికి తిరుమల వెళ్లారు. ఆయన ఆదివారం మళ్లీ హైదరాబాద్ చేరుకోనున్నారు. -
కలిసుంటే మరో 10 సీట్లు
సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ దారుణంగా దెబ్బతింటుందన్న ఊహాగానాలన్నీ తలకిందులయ్యాయి. మహా కూటమి(మహాగఠ్ బంధన్)ను ఎదుర్కోవడం కమలనాథులకు కష్టమన్న రాజకీయ పండితుల జోస్యాలు కూడా వమ్మయ్యాయి. రాష్ట్రంలోని 80 సీట్లలో బీజేపీ కూటమి 64 సీట్లు గెలిస్తే, బీఎస్పీ–ఎస్పీ–ఆర్ఎల్డీల మహా కూటమి 15 స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. కాంగ్రెస్‌కు ఒక్క సీటే వచ్చింది. అయితే, మహా కూటమిలో కాంగ్రెస్ కూడా ఉండి ఉంటే కూటమి పరిస్థితి మరీ ఇంత దయనీయంగా ఉండేది కాదని, కనీసం మరో పది సీట్లయినా వచ్చేవని రాజకీయ విశ్లేషకులు లెక్కలేస్తున్నారు. ఈ ఎన్నికల్లో మహాకూటమి, కాంగ్రెస్‌కు కలిపి 45.20 శాతం ఓట్లు వస్తే, బీజేపీకి 49.56 శాతం ఓట్లు వచ్చాయి. కొన్ని నియోజకవర్గాల్లో విజేతకు వచ్చిన మెజారిటీ కంటే కాంగ్రెస్ లేదా కూటమి అభ్యర్థికి వచ్చిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. కూటమిలో కాంగ్రెస్ ఉంటే ఫలితం మరోలా.. మహా కూటమిలో కాంగ్రెస్ చేరి ఉంటే అలాంటి చోట్ల కచ్చితంగా కూటమి అభ్యర్థే గెలిచేవారని విశ్లేషకులు వివరిస్తున్నారు. ఈ పది చోట్ల కాంగ్రెస్ అభ్యర్థి గెలుచుకున్న బీజేపీ యేతర ఓట్లు పొత్తులో ఉంటే కూటమికి పడేవని వారంటున్నారు. ఉదాహరణకు బదౌన్‌లో బీజేపీ అభ్యర్థి సంఘమిత్ర మౌర్య 18,454 ఓట్ల ఆధిక్యతతో ఎస్పీ అభ్యర్థి ధర్మేంద్ర యాదవ్‌పై గెలిచారు. ఇక్కడ కాంగ్రెస్‌కు 51,947 ఓట్లు వచ్చాయి. ఒకవేళ కాంగ్రెస్ కూటమిలో ఉండి ఉంటే ఈ ఓట్లు ధర్మేంద్రకు పడేవి. దాంతో ఆయన గెలుపు సాధ్యమయ్యేది. అలాగే, బందాలో ఎస్పీ అభ్యర్థి శ్యామ్ చరణ్ 58,553 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి 75,438 ఓట్లు వచ్చాయి. ఇవి కలిస్తే శ్యామ్ సునాయాసంగా గెలిచేవారు. బారాబంకిలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి రామ్ సాగర్ బీజేపీ చేతిలో 1,10,140 ఓట్ల తేడాతో ఓడిపోయారు ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి తనూజ్ పునియాకు 1,59,611 ఓట్లు వచ్చాయి. కూటమిలో కాంగ్రెస్ చేరితే ఈ ఓట్లన్నీ కూటమికి పడి ఆ అభ్యర్థి గెలిచేవారు. ఇక ధరౌహ్రాలో బీఎస్పీ అభ్యర్థి ఇలియాస్ సిద్ధిఖి 1,60,601 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అక్కడ కాంగ్రెస్‌కు 1,62,856 ఓట్లు వచ్చాయి. ఇక్కడ కాంగ్రెస్, కూటమిల్లో ఏవరో ఒకరే నిలబడి ఉంటే కచ్చితంగా వాళ్లే గెలిచేవారు. మచిలీషహర్‌లో బీఎస్పీ అభ్యర్థి రామ్ కేవలం 181 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక్కడ కాంగ్రెస్ మద్దతిచ్చిన జన్ అధికార్‌పార్టీ అభ్యర్థికి 7వేల ఓట్లు వచ్చాయి. ఆ ఓట్లు కూటమికి వస్తే బీఎస్పీ అభ్యర్థే కచ్చితంగా గెలిచేవారు. మీరట్‌లో కూడా బీజేపీ మెజారిటీ(2,379) కంటే కాంగ్రెస్‌కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. బస్తి, సంత్ కబీర్ నగర్, సుల్తాన్పూర్ వంటి పది నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. మహాకూటమితో కాంగ్రెస్ కలిస్తే ఈ సీట్లతో పాటు మరి కొన్ని సీట్లు కచ్చితంగా కూటమి ఖాతాలో పడేవని పరిశీలకులు చెబుతున్నారు. కాగా, కాంగ్రెస్ కూటమిలో చేరకపోవడం వల్ల బీఎస్పీ లాభపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. షహరన్‌పూర్‌లో బీఎస్పీ అభ్యర్థి గెలిచారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఇమ్రాన్ మసూద్‌కు రెండు లక్షల ఓట్లు వచ్చాయి. ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ ఓట్లను చీల్చిందని, దాంతో బీఎస్పీ లాభపడిందనేది పరిశీలకుల మాట. -
రాష్ట్రపతికి నూతన ఎంపీల జాబితా సమర్పించిన ఈసీ
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ంపీల జాబితాను ఎన్నికల కమిషన్ (ఈసీ) రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు అందజేసింది. 17వ లోక్‌సభ ఏర్పాటు ప్రక్రియలో భాగంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ సునిల్ ఆరోరా, ఇద్దరు కమిషనర్లు అశోక్ లావాసా, సుశీల్ చంద్రలు.. శనివారం కోవింద్‌ను రాష్ట్రపతి భవన్లో కలిశారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం కొత్త లోక్‌సభ ఏర్పాటుకు ఫలితాల్లో వెల్లడైన ఎంపీల పేర్లను రాష్ట్రపతికి అందజేశారు. ఇది లోక్‌సభ ఏర్పాటుకు సంబంధించి ప్రక్రియను ప్రారంభించడానికి రాష్ట్రపతికి ఉపయోగపడనుంది. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించినందుకు ఎన్నికల ప్రధానాధికారి, ఇతర కమిషనర్లను రాష్ట్రపతి కోవింద్ అభినందించారు. -
ఆస్తి రూ.1,107 కోట్లు.. దక్కింది1,558 ఓట్లు
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో అత్యంత ధనవంతుడైన రమేశ్‌కుమార్ శర్మ డిపాజిట్ గల్లంతైంది. ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తిని రూ.1,107 కోట్లుగా పేర్కొన్న రమేశ్‌కుమార్, బిహార్‌లోని పాటలీపుత్ర లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేశారు. ఆయనకు కేవలం 1,558 ఓట్లు మాత్రమే రావడంతో డి´జిట్‌ను కోల్పోయారు. మొత్తం పోలైన ఓట్లలో ఆయనకు వచ్చినవి 0.14 శాతం ఓట్లు మాత్రమే. ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రామ్‌క్రిపాల్ యాదవ్ గెలుపొందారు. రామ్క్రిపాల్కు 5 లక్షల ఓట్లు(47.28 శాతం) రాగా, లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతి 4.7 లక్షల ఓట్లతో (43.63 శాతం) రెండో స్థానంలో నిలిచారు. లోక్‌సభలో పోటీపడిన టాప్ 5 ధనవంతుల్లో రమేశ్‌కుమార్ మినహా మిగతా నలుగురు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే. వారిలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రూ.895 కోట్ల ఆస్తితో రెండో స్థానంలో, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ కుమారుడు నకుల్‌నాథ్ రూ.660 కోట్ల ఆస్తితో మూడో స్థానంలో, వసంతకుమార్ రూ.417 కోట్ల ఆస్తితో నాలుగో స్థానంలో, జ్యోతిరాదిత్య సింధియా రూ.374 కోట్ల ఆస్తితో ఐదో స్థానంలో ఉన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో బరిలో నిలిచిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్‌రెడ్డి చేతిలో 14,317 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. మధ్యప్రదేశ్ లోని చిన్‌ద్వారా నియోజకవర్గంలో పోటీచేసి న నకుల్ నాథ్ 35 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. తమిళనాడులోని కన్యాకుమా రి నియోజకవర్గంలో వసంతకుమార్ 3 లక్షల ఓట్ల మెజారిటీలో విజయం సాధించారు. మధ్యప్రదేశ్‌లోని గుణ నియోజకవర్గంలో పోటీచేసిన జ్యోతిరాదిత్య సింధియా బీజేపీ అభ్యర్థి క్రిష్ణపాల్ సింగ్ చేతిలో లక్ష ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.