దీదీకి గట్టి షాక్‌.. బీజేపీలోకి ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు | TMC MLAs, Councillors Join BJP | Sakshi
Sakshi News home page

దీదీకి గట్టి షాక్‌.. బీజేపీలోకి ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు

May 28 2019 5:07 PM | Updated on May 28 2019 5:10 PM

TMC MLAs, Councillors Join BJP - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి గట్టి షాక్‌ తగిలింది. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి వలసలు మొదలయ్యాయి. తాజా లోక్‌సభ ఎన్నికల్లో దీదీ కంగుతిన్న నేపథ్యంలో తృణమూల్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక సీపీఎం ఎమ్మెల్యే మంగళవారం బీజేపీ గూటికి చేరారు. వీరితోపాటు 60మందికిపైగా టీఎంసీ కౌన్సిలర్లూ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ నాయకుడు ముకుల్‌ రాయ్‌ తనయుడైన టీఎంసీ ఎమ్మెల్యే సుబ్రంగ్‌షు రాయ్‌తోపాటు ఎమ్మెల్యేలు తుషార్‌కాంతి భట్టాచార్య (టీఎంసీ), దేవేంద్రనాథ్‌ రాయ్‌ (సీపీఎం) బీజేపీలో చేరారు. హోరాహోరీగా జరిగిన ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆశించిన ఫలితాలు రాబట్టని సంగతి తెలిసిందే. 42 లోక్‌సభ స్థానాలు ఉన్న పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అనూహ్యరీతిలో పుంజుకొని ఏకంగా 18 స్థానాలు సాధించింది. రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఉన్న దీదీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ కేవలం 22 స్థానాలు మాత్రమే సాధించింది.

Advertisement
 
Advertisement
Advertisement