వేలూరు లోక్‌సభకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

Vellore Lok Sabha Election On 5th August - Sakshi

చెన్నై : వేలూరు లోక్‌సభ స్థానానికి ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయింది. అక్కడ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్‌ ప్రకటించింది. వేలూరులో ఆగస్టు 5వ తేదీన పోలింగ్‌ నిర్వహించనున్నట్టు, 9వ తేదీన ఫలితాలు వెల్లడించనున్నట్టు ఈసీ పేర్కొంది. దేశవ్యాప్తంగా ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగగా, వేలూరులో నియోజకవర్గంలో మాత్రం ఈసీ ఎన్నికను నిలిపివేసింది. ఎన్నికల సమయంలో వేలూరు లోక్‌సభ పరిధిలో భారీగా నగదు పట్టుబడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుంది. అయితే ఈ స్థానంలో డీఎంకే కూటమి తరఫున కదిర్‌ ఆనంద్‌, అన్నాడీఎంకే కూటమి అభ్యర్థిగా ఏసీ షణ్ముగంగత బరిలో నిలిచారు. కాగా, సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో డీఎంకే కూటమి ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top