ఆర్‌ఎస్‌ఎల్‌పీకి భారీ షాక్‌

Two RSLP MLAs Join JD(U) - Sakshi

పట్నా: ఆర్‌ఎస్‌ఎల్‌పీ అధినేత కుష్వాహాకు ఆ పార్టీ సభ్యులు గట్టి షాక్‌ ఇచ్చారు. ఇటీవల ఎన్నికలలో పరాభవంతో కుంగిపోతున్న సమయంలోనే ఆదివారం ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ ఆధ్వర్యంలోని జేడీ(యూ)లో చేరారు. ఎమ్మెల్యేలు లలన్‌పాశ్వాన్, సుధాంశు శేఖర్, ఎమ్మెల్సీ సంజీవ్‌సింగ్‌లు తమ చేరికను ధ్రువపరస్తూ శాసనసభ స్పీకర్‌ విజయకుమార్‌ చౌదరి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ హరూన్‌ రషీద్‌కి ఆదివారం లేఖలు పంపినట్లు తెలిసింది. తమ చేరికను అనుమతిస్తున్నట్లుగా జేడీయూ నుంచి సైతం వారు లేఖను అందజేసినట్లుగా తెలిసింది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top