టాప్‌ 10లో ఆ రాష్ట్రం నుంచి అత‌నొక్క‌డే! | Why Bihar Assembly Congratulates Student Shubham Kumar? | Sakshi
Sakshi News home page

JEE Main 2026: టాప్‌ 10లో ఆ రాష్ట్రం నుంచి అత‌డొక్క‌డే!

Feb 20 2026 7:55 PM | Updated on Feb 20 2026 8:06 PM

Why Bihar Assembly Congratulates Student Shubham Kumar?

బిహార్‌లోని గయకు చెందిన శుభం కుమార్‌ జేఈఈ మెయిన్‌ 2026లో 100 పర్సంటైల్‌ సాధించి ‘వావ్‌’ అనిపించుకున్నాడు. కుమార్‌ తల్లిదండ్రులు పెద్దగా చదువుకోలేదు. తండ్రి శివ్‌ కుమార్‌ హార్ట్‌వేర్‌ షాప్‌ యజమాని. తల్లి కాంచన్‌దేవి గృహిణి. శుభం కుమార్‌ ఆల్‌ ఇండియా స్థాయిలో 3వ ర్యాంకు సాధించాడు. దేశస్థాయిలో టాప్‌ 10లో ఉన్న ఏకైక బిహారి యువకుడిగా ఘనత సాధించాడు. బిహార్‌ అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం ఆమోదించిన సందర్భంగా... ‘శుభం కుమార్‌ విజయం రాష్ట్రానికి గర్వకారణం’ అని స్పీకర్‌ డాక్టర్‌ ప్రేమ్ కుమార్‌ అని ప్రశంసించారు. శాసనసభ్యులు చప్పట్లు కొట్టారు.

‘రాష్ట్రానికి ప్రేరణ ఇచ్చే విజయం ఇది’ అని శుభం కుమార్‌ను ప్రశంసించారు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి విజయ్‌ చౌదురి.

శిక్షణా కేంద్రాలకు ప్రసిద్ధి చెందిన రాజస్థాన్‌లోని కోటకు వెళ్లడానికి ముందు ఇంట్లోనే పరీక్షలకు ప్రిపేరయ్యాడు కుమార్‌. కోటకు (Kota) వచ్చిన కొత్తలో కుమార్‌ కుటుంబం ఆర్థిక సమస్యల్లో ఉంది. కుమార్‌ కోటలో ఉండలేని పరిస్థితి వచ్చింది. అయినా తల్లిదండ్రులు వెనకడుగు వేయకుండా, ఆర్థిక ప్రతికూలతలను అధిగమించి కుమార్‌ తీసుకునే కోచింగ్‌కు అంతరాయం కలగకుండా చూశారు. దాని ఫలితం ఊరకే పోలేదు. కుమార్‌ దేశస్థాయిలో గుర్తింపు తెచ్చుకునేలా చేసింది. ఒకవైపు తల్లిదండ్రులు గుర్తుకు వస్తున్నా.. తన లక్ష్యంపైనే గురి పెట్టాడు. రోజుకు పది నుంచి పన్నెండు గంటలు ప్రిపేరయ్యేవాడు. ప్రాక్టీస్‌ పరీక్ష దశలో 14 గంటల వరకు చదివాడు.

‘నా తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల మార్గదర్శకత్వం, కష్టపడి చదవడం వల్లే ఈ విజయం సాధ్యమైంది’ అంటున్నాడు శుభం కుమార్‌ (Shubham Kumar).

చ‌ద‌వండి: విభాగాల వారీగా జేఈఈ మెయిన్‌ టాప‌ర్లు వీరే

Advertisement
 
Advertisement
Advertisement